Translate

Saturday, April 13, 2024

ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి.( Eppudu Voppukovaddura )

సీతారాం సార్ ..We miss you ..


ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి


It was a pleasure reading your article/words, thank you. I have a new perspective on the world and I have a greater respect for people, life, love & language 




ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి..ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి ...

విశ్రమించవద్దు ఏ క్షణం - విస్మరించవద్దు నిర్ణయం..అప్పుడే నీ జయం నిశ్చయంరా.

 

నింగి ఎంత గొప్పదైన రివ్వుమన్న గువ్వపిల్ల రెక్క ముందు తక్కువేనురా

సంద్రమెంత పెద్దదైన ఈదుతున్న చేపపిల్ల మొప్ప ముందు చిన్నదేనురా

పశ్చిమాన పొంచి ఉండి రవిని మింగు అసుర సంధ్య ఒక్కనాడు నెగ్గలేదురా

గుటకపడని అగ్గి ఉండ సాగరాన నిదుకుంటు తూరుపింట తేలుతుందిరా

నిశావిలాసమెంతసేపురా ఉషోదయాన్ని ఎవ్వడాపురా

రగులుతున్న గుండె కూడ సూర్యగోళమంటిదేనురా

 

నొప్పిలేని నిముషమేది జనమైన మరణమైన జీవితాన అడుగు అడుగునా

నొప్పి లేని నిముషమేది జననమైనా మరణమైనా జీవితాన అడుగడుగునా...

నీరసించి నిలిచిపోతే నిముషమైనా నీది కాదు..బ్రతుకు అంటే నిత్య ఘర్షణ

దేహముంది ప్రాణముంది...నెత్తురుంది సత్తువుంది

అంతకన్న సైన్యముండునా..ఆశ నీకు అస్త్రమౌను

శ్వాస నీకు శస్త్రమౌను...ఆశయమ్ము సారధౌనురా

నిరంతర ప్రయత్నమున్నదా..నిరాశకే నిరాశ పుట్టదా

ఆయువంటు ఉన్నవరకు..చావు కూడ నెగ్గలేక, శరము పైనె గెలుపు చాటురా..