Translate

Monday, November 29, 2021

Aura Sheath- ఆరా - దాని 7 పొరలు - విశ్లేషణ- (Aura Sheath and it's 7 layers)

 

ఆరా షీత్ - దాని 7 పొరలు - విశ్లేషణ

(Aura Sheath and it's 7 layers)



 మానవ శరీరం చుట్టూ ఉండే జీవ-విద్యుదయస్కాంత క్షేత్రమే "ఆరా"(aura). ఈ ఆరా లేదా కాంతి వలయం తల వద్ద హెచ్చుగా ఉండి, పాదాల వద్దకు వచ్చేసరికి పలుచగా ఉంటుంది. ఈ ఆరా , మనతో నిత్యమూ ఉంటుంది. ఈ ఆరా లేదా కాంతి వలయం నిరంతరం సంకోచ-వ్యాకోచాలకు లోనవుతూ ఉంటుంది. ఈ ఆరా లేదా కాంతి వలయం 7 పొరలుగా ఉంటుందని....ఈ పొరలు ఒక దానికొకటి ఓత-ప్రోతాలులా అల్లుకొని ఉంటాయని , అధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు. ప్రతీ ఆరా పొర, మన సూక్ష్మ శరీరంలోగల ఏడు చక్రాలకు సంబంధం కలిగియుంటుంది.


మొదటి పొరను "ఎథిరిక్" లేదా లింగ శరీరం అంటారు. ఈ ఎథిరిక్ , మూలాధార చక్రంతో సంబంధం కలిగియుంటుంది. ఈ ఎథిరిక్, మన భౌతిక శరీరానికి అతి సమీపములో ఉన్న పొర. ఈ పొర స్థలంలో ఒక రకమైన భౌతిక ఆకృతిని కలిగి యుంటుంది. ఈ పొర దాదాపు 5 సెంటీమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది. ఈ ఎథిరిక్ పొరలో "నాడులనే" ప్రాణ శక్తి వాహకాలుంటాయి. ఈ ఎథిరిక్ శరీరము, బహిరంగ(భౌతిక వాతావరణ,జీవన విధాన పరిస్థితులు) మరియూ అంతర్గత (భావాలు,ఆలోచనలు) పరిస్థితులను కలిగి ఉంటుంది.


ఈ ఆరిక్ షీత్ లో రెండవ పొర "emotional body" (భావాత్మక శరీరము). ఇది స్వాధిష్ఠాన చక్రముతో సంబంధం కలిగియుంటుంది. మనలో నిత్యం కలిగే భావాత్మక సంచలనాలకు ....ఈ ఆరిక్ షీత్ యొక్క రెండవ పొర ప్రతిబింబంగా ఉంటుంది. ఇది , మన శరీరం నుండి 7 సెంటీమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది.


 ఈ పొర , ఎథిరిక్ మరియూ భౌతిక శరీరాలలోకి చొచ్చుకొనిపోయి ఉంటుంది. ఈ పొర మన మనస్సుకు, భౌతిక శరీరానికి మధ్య వారధిగా పని చేస్తుంది కూడా. మనలను అఖండ చైతన్యం వైపు నడిపించే, చోదకునిలా కూడా ఉంటుంది.


మూడవది. మానసిక శరీరం. అంటే మనస్సే. మనస్సు మరల అనేక సూక్ష్మావస్థలలో కలదు. అది తరువాత. ఈ మనోమయ శరీరం గూచ్చి చెప్పుకుందాం. ఈ మానసిక శరీరం, మన సూక్ష్మ శరీరంలో గల "మణిపూరక చక్రంతో" సంబంధం కలిగి ఉంటుంది. ఈ mental body,  7 నుండి 20 సెంటీ మీటర్ల వరకు....విస్తరించి ఉంటుంది. అయితే ఈ శరీరం, మన మానసిక ఆలోచనా క్షేత్ర తీవ్రతలను బట్టి, సంకోచ-వ్యాకోచాలకు లోనవుతూ ఉంటుంది. ఈ మానసిక శరీరంలో, ఆలోచనా రూపాలు....మనకు కనిపిస్తాయి. మరియూ ఆ రూపాలు , భిన్న రంగులతో ఒక స్పందనను కలుగ జేస్తాయి.


ఇక 4వ శరీరము. యాష్ట్రల్ శరీరము (ashtral body).

 ఈ "ఆష్ట్రల్ శరీరము , 4వ చక్రమైన "అనాహత చక్రంతో" సంబంధం కలిగి యుంటుంది. భౌతిక - అభౌతిక శరీరాల మధ్య వారధిలా పని చేస్తుంది. భావాత్మక శరీరం లాగానే, ఈ శరీరం కూడా భిన్న వర్ణాలతో కూడి యుంటుంది. ఈ నాల్గవ శరీరము...15 సెంటీ మీటర్ల నుండి 30 సెంటీ మీటర్ల వరకు విస్తరించి ఉంటుంది. ఒక వ్యక్తి యొక్క భౌతిక శరీర ఆరోగ్య స్థితిని బట్టి, ఆధ్యాత్మ ఆరోగ్య స్థితి బట్టి కూడా ఆధార పడియుంటుంది.


ఇక 5వ పొర. "Etheric template body". ఇది 5 వ చక్రమైన "విశుద్ధ చక్రానికి" అనుసంధానించి ఉంటుంది.


6 వ పొర " Celestial body" . ఇది నేరుగా "ఆజ్ఞాచక్రంతో " సంబంధం కలిగియుంటుంది. మూడవ నేత్రం ద్వారా లోపల బయట గల "భగవత్ కాంతి" ని ఈ శరీరం చూసే ప్రయత్నం చేస్తుంది. పరిధులు లేని,అవధులు లేని ప్రేమను...ఈ పొర ప్రతిబింబిస్తుంది. అది ఈ భౌతిక శరీరంపై పడుతుంది.


ఇక 7వది అయిన "Casual Body" .  ఈ 7వ పొర , ఈ జన్మలో...ఒక వ్యక్తి యొక్క జీవిత ప్రయాణంతో సంబంధం కలిగియుంటుంది. ఆరాలో గల ఈ ఏడవ పొరలో, గత జన్మల వివరాలుంటాయి. ఈ పొర మన అధ్యాత్మిక అభివృద్ధిని కూడా సూచిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే, ఈ ఏడు పొరల ఆరా ఎలా వ్యక్తీకరించబడి ఉన్నదో....వాటన్నిటినీ ఈ ఒక్క పొర ప్రతిబింబిస్తుంది. ఒక వ్యక్తి "ఆరా" చూసి మనం అతడు ఆధ్యాత్మికంగా పురోగతి సాధిస్తున్నాడా లేక పశువులా ప్రవర్తిస్తున్నాడా? అన్న విషయం చెప్పవచ్చు. ఒక వ్యక్తి సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాడా లేక జబ్బులతో బాధ పడుతున్నాడా....అన్న విషయం కూడా చెప్పవచ్చు. కాకపోతే , ఆరా చూసే వ్యక్తి "సిద్ధుడు" అయితేనే ఇది సాధ్యం. ఆ సిద్ధత్వం మరీ అంత కష్టం ఏమీ కాదు. కాకపోతే...సతత అభ్యాసం...కనీసం 12 సంవత్సరాలు (పుష్కర కాలం) కావాలి. 


మన ప్రతి సంకల్పము, మన ఆరాలోని రంగుల్లో స్పష్టంగా, రూపు దిద్దుకొని ఉంటుంది. ఒక మనిషి చావు-బ్రతుకుల్లో ఉంటే, అతని ఆరా దాదాపు లుప్తంగా ఉంటుంది, మినుకు మినుకుగా.......


సందర్భాన్ని బట్టి ఇంకో విషయం కూడా చెప్పుకుందాం. శరీరానికి వెంటనే ప్రాణం పోదు. అతని ఆరా, ఆ మృత శరీరం దగ్గరే మెల్లగా తచ్చాడుతూ ఉంటుంది. ఆ ఆరాని చూడగలిగే యోగి, అతని మరణ కారణాన్ని తెలుసుకోగలడు.


     కొన్ని సార్లు ఈ "ఆరా" ఏడడుగుల ఎత్తు, నాలుగడుగుల వెడల్పు కలిగి (ఉన్నత వ్యక్తులకైతే), శిరస్సు వద్ద లావు గానూ, కాళ్ళ వద్దకు వచ్చేసరికి సన్నంగానూ ఉంటుంది.


    మానవ శరీరం యొక్క "ఆరా క్షేత్రం", మనిషి యొక్క భౌతిక శరీరము చుట్టూ, అండాకారంగా, ఒక గుడ్డు ఆకారంలో....శక్తి రూపంలో చుట్టుకొని ఉంటుంది. దివ్య దృష్టితో ఈ ఆరాను చూస్తే, వివిధ ప్రదేశాలలో...వివిధ గుణాలతో భాసిల్లుతూ ఉంటుంది. ఈ ఆరా ఎంతవరకైతే...వ్యాపించి ఉంటుందో, ఆ వ్యాపనం యొక్క హద్దుల వరకు చూడవచ్చు.


సాధన ద్వారా, కంటికి కనిపించే కాంతి తరంగాల విస్తీర్ణాన్ని....మనం పెంచుకోగలిగితే,  మనకి మానవ శరీరం చుట్టూ ఉన్న "ఆరా" స్పష్టంగా కనిపిస్తుంది.

- Bhattacharya's notes 

   మనం ఈ ఆరాను చూస్తే, ఆరా రంగులు, ఆరా యొక్క కాంతి క్షేత్రం, ఆరా యొక్క చీకటి క్షేత్రం, ఆరా ఆకారం, ఆరా సాంద్రత....ఇవన్నీ అవగాహనకు వస్తాయి. ఈ ఆరాను మనం వినవచ్చు కూడా. శబ్ద, సంగీత, తరచుదనం, స్పందన....వినవచ్చు. కాకపోతే నిధి ధ్యాసనము, సతత ధ్యానము, సతత మంత్రానుష్ఠానము ఉండాలి. ఇవి లేకుండా ఆరాను చూడాలంటే....కుదరదు. కొంతమందికి చాలా చిన్న వయస్సు నుండే, ప్రత్యేక సాధనలేవీ లేకుండా ఆరాను చూస్తూంటారు. వారు కారణ జన్ములు. వారి జన్మలు ధన్యం. ఆరా శక్తిని కూడా, మనం బయో-టెలిమెట్రీ ద్వారా గ్రహించవచ్చు.


   ఎప్పుడైతే మీరు ఆరోగ్యంగానూ, ఆత్మ విశ్వాస పూరితులు గానూ, శాంత చిత్తులు గానూ ఉంటారో....మీ ఆరా (శరీర కాంతి వలయం), పరిశుభ్రంగానూ,ఆరోగ్యంగానూ ఉంటుంది. ఒక ఆరోగ్య వంతమైన ఆరా "Cocoon of Energy" గా విస్తరించుకొని ఉంటుంది.


     ఈ  ధనాత్మక - రక్షణాత్మక శక్తి క్షేత్రం....అనేక రంగులతో, శక్తి వంతమైన స్పందనలతో.....పూర్తిగా అండాకారపు హద్దుతో ఉంటుంది. ఏ వ్యక్తి తీవ్ర తపములో ఉంటాడో, ఏ వ్యక్తి ధ్యానము నుండి సమాధి స్థాయికి వెళతాడో, ఏ వ్యక్తి మంత్రోచ్ఛారణ నుండి మహా భావ సమాధికి వెళతాడో, ఏ వ్యక్తి యొక్క కుండలినీ శక్తి పరిపూర్ణంగా వికాసమై ఉంటుందో, అట్టి యోగి "ఆరా" (aura)...అనగా శరీరాన్నావరించిన కాంతి వలయం పూర్తిగా వికసితమై ఉంటుంది. అలాంటి పూర్ణ యోగుల ఆరా "బంగారు వర్ణం" లో ఉంటుంది.



[Rare] Maha Kalbhairav - Yam Yam Yam Yaksha Roopam (lyrics)

ఓంకారం సకలకళా శ్రీకారం- Omkaaram Sakala saakram telugu song lyrics(Sankaracharya, Telugu )

 





ఓంకారం సకలకళా శ్రీకారం

చతుర్వేద సాకారం

చైతన్య సుధాపూరం

జ్ఞాన కమల కాసారం

 

ధ్యాన పరిమళాసారం

మధుర భక్తి సింధూరం

మహా భక్త మందారం

భవ భేరీ భాండారం

 

హృదయ శంఖ హుంకారం

ధర్మ ధనుష్టంకారం

జగత్ విజయ ఝంకారం

అద్వైత ప్రాకారం భజేహం

 

అండాకారాండ పిండ భాస్వత్

బ్రహ్మాండ భాండ నాదలయత్

బ్రహ్మ్యాత్మక నవ్య జీవనాధారం

వర్ణ రహిత వర్గమధిత

 

లలిత లలిత భావ లులిత భాగ్య

రజిత భోగ్య మహిత వసుధైక కుటిరం

కామితార్ధ బందురం

కళ్యాణ కందరం

సద్గుణైక మందిరం

సకలలోక సుందరం

పుణ్య వర్ణ పుష్కరం

దురిత కర్మ దుష్కరం


శుభకరం సుధాకరం

సురుచిరం సుదీపరం

భవకరం భవాకరం

త్రిఅక్షరం అక్షరం భజేహం

 

మాధవ మాయా మయ బహు

కఠిన వికట కంటక పద సంసార

కానన సుఖ యాన శకట విహారం

 

అష్టాక్షరీ ప్రహృష్ట పంచాక్షరీ విశిష్ట

మహా మంత్ర యంత్ర తంత్ర

మహిమాలయ గోపురం

ఘనగంభీరాంబరం

జంబూ భూభంబరం

నిర్మల యుగ నిర్గరం

నిరుపమాన నిర్జరం

మధుర భోగి కుంజరం

పరమ యోగి భంజరం

ఉత్తరం నిరుత్తరం మనుత్తరం

మహత్తరం మహాకరం మహాంకురం

తత్త్వమసీ తత్పరం

తధితరాత్త మోహరం

మృత్యోర్మమృతత్వకరం

అజరం అమరం

 

'' కారం '' కారం '' కారం

ఓం కారం అద్వైత ప్రాకారం

Tuesday, November 23, 2021

నా గురుడు నన్నింక యోగి గమ్మనెనే....- Naa gurudu nannika - Telugu Lyrics

 యోగి తత్వం



నా గురుడు నన్నింక యోగి గమ్మనెనే....

నా గురుడు నన్నింక యోగి గమ్మనెనే...
నా గురుడు నన్నింక యోగి గమ్మనె రాజా.....యోగి గమ్మనె....భోగి గమ్మనెనే...
నా గురుడు నన్నింక త్యాగి గమ్మనెనే....త్యాగి గమ్మనెనే.... జ్ఞాని గమ్మనెనే..

మొట్టమొదటా నీవు పుట్టాలదనెనే...
మొట్టమొదటా నీవు పుట్టాలదనెనే...పుట్టుగిట్టులులేని బట్టాబయలయెనే...
నా గురుడు నన్నింక యోగి గమ్మనె రాజా.....యోగి గమ్మనె....భోగి గమ్మనెనే...

మూలామించుక లేని కీలెరుగు మనెనే...
మూలామించుక లేని కీలెరుగు మనెనే...కాలకాలములెల్ల కల్లా జగమనెనే...
నా గురుడు నన్నింక యోగి గమ్మనె రాజా.....యోగి గమ్మనె....త్యాగి గమ్మనెనే...

మాయా లేని చొటు మరుగెరుగుమనెనే....
మాయా లేని చొటు మరుగెరుగుమనెనే....మరుగునెరుగితే నీవు తిరిగిరావనెనే..
నా గురుడు నన్నింక యోగి గమ్మనె రాజా.....యోగి గమ్మనె....భోగి గమ్మనెనే...

ఉన్న విన్నదిగన్నది సున్నా జేయుమనెనే..
ఉన్న విన్నదిగన్నది సున్నా జేయుమనెనే..సున్నా జేసియు దాని యెన్నాగవలెననే...
నా గురుడు నన్నింక యోగి గమ్మనె రాజా.....యోగి గమ్మనె....భోగి గమ్మనెనే...

మాట లయమయ్యేటి చోటెరుగుమనెనే...
మాట లయమయ్యేటి చోటెరుగుమనెనే...
మాట మహదేవుపేట మలికిదాసనెనే...
నా గురుడు నన్నింక యోగి గమ్మనె రాజా.....యోగి గమ్మనె....భోగి గమ్మనెనే...
నా గురుడు నన్నింక యోగి గమ్మనె రాజా.... త్యాగి గమ్మనె.... జ్ఞాని గమ్మనెనే...

Satkarmabhisha Song - సత్కర్మభీశ్చ సత్ఫలితం


సత్కర్మభీశ్చ సత్ఫలితం
దుష్కర్మ ఏవ దుష్ఫలం
అత్యుత్కట పుణ్య పాపానాం సత్యంబలానుభవమిహం
ఈ చోటి కర్మ ఈ చోటే
ఈ నాటి కర్మ మరునాడే అనుభవించి తీరాలంతే
ఈ సృష్టి నియమం ఇదే
ఎన్ని కన్నీళ్ళ ఉసురిది వెంటాడుతున్నది నీడల్లే కర్మ
ధర్మమే నీ పాలిదండమై దండించ తప్పించుకోలేదు జన్మ
సత్కర్మభీశ్చ సత్ఫలితం
దుష్కర్మ ఏవ దుష్ఫలం
అత్యుత్కట పుణ్య పాపానాం సత్యంబలానుభవమిహం
పాపం, పుణ్యం రెండింటికీ నీదే పూచి
కన్ను తెరిచి అడుగువెయ్ ఆచి తూచి
ఈ చోటి కర్మ ఈ చోటే
ఈ నాటి కర్మ మరునాడే అనుభవించి తీరాలంతే
ఈ సృష్టి నియమం ఇదే
ఏ కన్నూ చూడదనా
నీ విచ్చలవిడి మిడిసిపాటు
ఏ చెయ్యి ఆపదనా
తప్పటడుగే నీ అలవాటు
అదృశ్య దృష్టిగా సకల సృష్టి నిను గమనిస్తున్నది లెక్కగట్టి
ఎంత బతుకు నీదెంత బతుకు
ఓ గుప్పెడు మెతుకుల కడుపు కొరకు
ఇన్ని ఆటలు వేటలు అవసరమా మనుజా... మనుజా
ఏమారిక నిన్ను కబళిస్తుందిరా మాయదారి పంజా
కోరి కొని తెచ్చుకోమాకు కర్మ
దాన్ని విడిపించుకోలేదు జన్మ
సత్కర్మభీశ్చ సత్ఫలితం
దుష్కర్మ ఏవ దుష్ఫలం
అత్యుత్కట పుణ్య పాపానాం సత్యంబలానుభవమిహం
ఈ చోటి కర్మ ఈ చోటే
ఈ నాటి కర్మ మరునాడే అనుభవించి తీరాలంతే
ఈ సృష్టి నియమం ఇదే

Sunday, November 7, 2021

మంత్రం అంటే ఏమిటి? What is Mantra ? Telugu

మంత్రం అంటే ఏమిటి?




మంత్రానికి ఉన్న అర్థమేమిటి?

మననాత్ త్రాయతే ఇతి మంత్ర: అని అంటారు. అంటే మననం చేయడం వల్ల మనల్ని రక్షించేది అని అర్ధం. అలాంటి మహా శక్తివంతమైన మంత్రాలను మన రుషులు అమోఘ తపశ్శక్తితో, భగవదావేశంలో పలికిన వాక్యాలే మంత్రాలుగా రూపాంతరం చెందాయ్‌. మనుషుల్ని మంచి మార్గం వైపు నడిపిస్తున్నాయ్.
ఓం, ఐం, శ్రీం, హ్రీం, క్లీం. ఇవే బీజాక్షరాలా? ఈ బీజాక్షరాలను ఎలా పలకాలి? బీజాక్షరాలు చాలానే ఉన్నా... ఉపాసాన పద్ధతిలో చేయాల్సినవి మాత్రం వేళ్ల మీదే లెక్కపెట్టవచ్చు. ఆయా దేవతల పేర్లతో కలిపి బీజాక్షరాలను జపించడం వల్ల కలిగే ఫలితం అనంతం. మాన్యుల నుంచి సామాన్యుల దాకా ప్రతీ ఒక్కరి జీవితంలో ఒక్కటంటే ఒక్కసారైనా అనుభూతిని ఇచ్చేది ఈ మంత్రసాధనే. అలా శక్తిమంతమైన పరమోద్భుత మంత్రాలుగా మారే క్రమం మహాద్భుతంగా కనిపిస్తుంది. మంత్రాల అసలు లక్ష్యం. మన ఇష్టదేవతలను ప్రసన్నం చేసుకోవడం. అలా మూడు విధాలుగా విభజించి... ఉచ్ఛరించిన మంత్రాలకు మహాశక్తి ఉంటుంది. క్షుద్రంతో ఉచ్చాటన చేసే తామస మంత్రాలు... యుద్ధంలో గెలుపు కోసం చేసే రాజ మంత్రాలు... ఆధ్యాత్మిక సాధన కోసం జపించే సాత్విక మంత్రాలుగా కాలక్రమంలో ఆవిర్భవించాయ్.
అన్ని మంత్రాలకు ముందు ఓం కారాన్ని చేర్చి జపిస్తాం. అదెవ్వరికైనా అనితర సాధ్యం కాని పనికాదు. ఇలా ఎందుకు పలికాలి? ఎందుకంటే ఓంకారం లేని మంత్రం ఫలవంతం కాదు. అలాంటి మంత్రం ప్రాణ వాయువు లేని జీవం లాంటిది. ఈ ఓంకారం సర్వేశ్వరుని నుంచి జ్యోతిగా ప్రారంభమై అందులో నుంచి ఒక నాదం ధ్వనించింది. ఆ ధ్వనే ఓంకారంగా రూపాంతరం చెందింది. ఓం నుంచి వేదరాశులే ఉద్భవించాయ్. రుగ్వేదం నుంచి ఆకారం, యజుర్వేదం నుంచి ఊకారం, సామవేదం నుంచి మాకారం.... ఈ మూడు కలసి ఓంకారంగా ఏర్పడిందన్నది రుషివాక్కు. అందుకే ఓంకారాన్ని బీజాక్షరంతో ముడిపెట్టారు మన పెద్దలు.
అసలు బీజాక్షరాలు అంటే ఏమిటి?.. భాషలోని అక్షరాలే బీజాలా?..ప్రతీ బీజానికి ప్రత్యేక మహత్తు ఉంటుందా?..ఈ బీజాక్షరాల ఏకీకరణమే మంత్ర నిర్మాణమా?.. మంత్రాల స్పష్టమైన ఉచ్చారణతో అద్భుత ఫలితం సాధ్యమేనా?.. కళ్లకు కనిపించనివి.. కొలతకూ, తూకానికీ దొరకనివే బీజాక్షారాలా?

ఈ జగత్తు స్థూలమనీ, సూక్ష్మమనీ రెండు విధాలుగా విభజించారు. శరీరం స్థూలమైతే.... మనస్సు సూక్ష్మం. స్థూలమైన దానికంటే సూక్ష్మమైన దానికే శక్తి ఎక్కువ. మన శారీరక శక్తికంటే, మానసికశక్తి చాలా గొప్పది. బలవత్తరమైనది కూడా. సూక్ష్మశక్తుల జాగృతి వల్లే మానవుడు మహాత్ముడై అసాధారణ కార్యాలు చేయగలుగుతాడు. ఈ సూక్ష్మశక్తుల జాగృతికి మంత్ర శబ్ధతరంగాలు తోడ్పడితే అద్భుతం సాధించడం అదేమంత కష్టమేమీ కాదు. జీవులలోని అంతశక్తులనే కాదు, ప్రకృతిలో ఆవరించి ఉన్న అనేక అదృశ్య శక్తుల్ని కూడా బీజాక్షరాలు మంత్రాల రూపంలో ప్రేరేపిస్తాయంటారు. వర్షాలు కురిపించడం, దీపాలు వెలిగించడంలాంటి పనులు శబ్ధ తరంగాల ప్రక్రియతో మన పూర్వీకులు సాధించి చూపించారు.
అణువులను కదిలించే శబ్ధ తరంగాలకు ఉండడం వల్లే ఇవన్నీ సాధ్యమవుతాయ్. ఇది నిజం. కానీ ఇక్కడొక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. మంత్రాలను పలికినప్పుడు చాలా స్పష్టంగా పలకాలి. పర్‌ఫెక్ట్‌ ప్రీక్వెన్సీతో నిర్ణీత స్వరాన్ని అనుసరించి పలకాలి. అలా అయితేనే దాని ఫలితం ఉంటుంది. మనకు కనిపిస్తుంది. జీవులలోని సూక్ష్మశక్తుల్నీ, ప్రకృతిలోని వివిధ శక్తుల్నీ ప్రేరేపించడానికీ, దైవశక్తిని మనకు అనుసంధాన పరచడానికీ మంత్రశబ్ధలు ఉపకరిస్తాయనడంలో అణుమాత్రం కూడా సందేహం లేదు.
ప్రకృతిలోనే కాకుండా, సృష్టిలో కూడా అనంతంగా వ్యాపించి ఉన్న శక్తిని మంత్రాలు...సరైన ఉచ్ఛరణతో మనకు అందిస్తాయ్. దైవాంశను మనకు అనుసంధానపరచే శబ్ధమే ఓంకారం. మంత్రానికి త్రికరణ శుద్ధి చాలా అవసరం. మనసా, వాచా, కర్మణా శుద్ధి కలిగిన జీవికే మంత్రోచ్చారణ సంపూర్ణ ఫలితాన్ని ఇస్తుంది. కంప్యూటర్‌ కాలంలో త్రికరణ శుద్ధి పూర్తిగా తగ్గిపోతుంది. క్రమంగా తరిగిపోతుంది. అందుకే మంత్రాల ప్రభావం కూడా సన్నగిల్లుతుంది. పురాణ కాల మేధావులు మంత్రాలకు చింతకాయలనే కాదు, అవసరమైతే నక్షత్రాలను కూడా రాలగొట్టగలిగే శక్తి కలిగి ఉండేవారని మనం విన్నాం. మనకు ఫలించనంత మాత్రాన మంత్రశక్తిని విమర్శించడం అవివేకం. చేతకాక పోయినా కూడా కనీసం శాస్త్రీయ సత్యాన్ని తెలుసుకోవడం వివేకం.
అందుకే ప్రతి అక్షరం బీజాక్షరం. ప్రతి బీజాక్షరం దేవతాశక్తి స్వరూపం. విశ్వచైతన్యం దేవతగా అవతరించినపుడు అతి సూక్ష్మంగా కనిపించే అతీంద్రియ శక్తే మంత్రం. అందుకే మంత్ర నిర్మాణం ఆశ్చర్యకరమే కాక ఆసక్తికరమైన శాస్త్రం కూడా. ఎంతో అపురూపమైన మంత్రాలను ఎవరైనా భక్తితో సాధన చేయవచ్చు. సిద్ధిని, లబ్ధిని, దివ్యానుభూతిని పొందవచ్చు. దీనికి శాస్త్రీయత ఉంది. అసశాస్త్రీయంగా రుజువు అయింది కూడా.!!
మరి మంత్రాలకు, వేదాలకు సంబంధం ఏమిట?. పురాణాల్లో, వేదాల్లోనూ మంత్ర ప్రస్తావన ఉందా?..మంత్రశాస్త్రంలోనూ సైన్స్‌ కనిపిస్తుందా?.. శబ్ధ తరంగాలకు ఉన్న శక్తిని ఎలా అర్థం చేసుకోవాలి? పురాణకాలాన్ని మంత్రయుగమంటే... .ఆధునిక కాలాన్ని యంత్రయుగమని పిలవాలా?.. నిజంగా మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? కొందరు అనుకుంటున్నట్టు మంత్రం సైన్స్‌కి విరుద్ధమా?.. జీవ నాడీ వ్యవస్థపై బీజాక్షరాల ప్రభావం ఎంత?
ఇలా మంత్రాల గురించి, బీజాక్షరాల మర్మం గురించి చాలా మందిలో చాలా రకాలైన అపోహలు ఉన్నాయ్. అంతెందుకు తప్పుగా ఆలోచించే వాళ్లూ లేకపోలేదు. మంత్రాలను వాడాల్సిన విధంగా వాడితే... అవి అద్భుతమైన ఫలితాలు ఇస్తాయని చెబుతున్నారు పండితులు. పురాణాల్లోని సైన్సు విషయాల్ని తెలుసుకునేటప్పుడు మంత్రం అనే అంశంపై కచ్చితమైన అవగాహన ఉండి తీరాలి. ఎందుకంటే పురాణాల్లో అనేక మంత్ర తంత్రాలు కనిపిస్తాయి మనకు. అందుకే మంత్రాలకూ, సైన్సుకూ ఉన్న సంబంధాన్ని తెలుసుకొని తీరాలి. పురాణకాలంగా మంత్రయుగంగా... ఆధునికకాలం యంత్రయుగంగా మారుతుంది. ఇది నిజమే కావచ్చు కానీ మంత్రం సైన్సుకు ఏమాత్రం విరుద్ధం కాదు. ఇది నిజం కానే కాదు. మంత్రం అనేది నూటికి నూరుపాళ్లు ఒక సైన్సు ప్రక్రియే.
దేవతానామాన్ని లేదా బీజాక్షరాన్ని స్మరించడాన్ని మంత్ర జపం అంటారు. కొన్ని అక్షరాలను క్రమబద్ధంగా కలిపి వాడటమే. ఇలా వాడటం వల్ల ఉత్పన్నమయ్యే వైబ్రేషన్‌ను ఒక లక్ష్యం కోసం వాడటం వల్ల ఆ ఉద్భవించిన శక్తి మనకు అనుకూలంగా గాని వ్యతిరేకంగా గాని మారుతుంది. అది మంత్రానికి ఉన్న పవర్‌. తరుచూగా ఉచ్చరించే శబ్ధ తరంగాలే మంత్రాలు. ఆ మంత్ర శబ్ధ తరంగాలు చాలా శక్తివంతమైనవి కూడా. శబ్ధ తరంగాలు జీవుల మీదా, ప్రకృతి మీదా, సృష్టి మీదా ప్రభావాన్ని చూపిస్తాయ్. ఇది సైన్సు కూడా ఒప్పుకుంటున్న సత్యం.
జీవుల శారీరక, మానసిక స్థితులపై శబ్ధ తరంగాల ప్రభావం ఉంటుంది. కొన్ని రకాల శబ్ధ తరంగాల వల్ల ఆరోగ్యం క్షీణించడం, భయం కలగడం, నిరాశ ఆవరించడం చూస్తుంటాం. మరి కొన్ని శబ్ధ తరంగాల వల్ల ఆరోగ్యం బాగుపడటం, ఉత్సాహం రావడాన్ని కూడా గమనిస్తుంటాం. అందుకే మంత్రాలంటే శక్తిమంతమైనవి శబ్దతరంగాలే. అందుకే మంత్ర ప్రభావం మన సూక్ష్మగ్రంథులపైనా, షట్‌ చక్రాలపైనా శక్తి కేంద్రాలపైనా సూటిగా పడుతుంది. అప్పుడు మనలోని సూక్ష్మ జగత్ శక్తి కేంద్రం మేల్కొంటుంది. మంత్ర శబ్దాలు గ్రంథులకు చలనం కలిగించి జాగృతం చేస్తుంది. పోగొట్టుకున్న శక్తిని అవి మేల్కొలుపుతాయ్. మంత్రోచ్చారణ ద్వారా ఉద్భవించిన శబ్ధ తరంగాలు ముందుగా చెవిని చేరి, తర్వాత మెదడుకు వెళ్తాయి. మెదడు నుంచి మంత్ర శబ్ధ తరంగాల ప్రభావం ప్రతీ అవయవాన్ని ద్విగుణీకృతం చేస్తుంది. ఎక్కడ కనిపించని అత్యంత శక్తిమంతమైన ముక్తిప్రదం మన పెద్దలు మనకిచ్చిన మంత్రసాధన. మంత్రాలు కేవలం పదాల నిర్మితాలే కాదు. శక్తికి ప్రతిరూపాలు. పరమేశ్వరా అనుగ్రహంతో, పంచభూతాత్మకమైన దేహంతో, అద్భుతమైన మేథా సంపత్తిని పొందిన మానవుడి ఆలోచనాశక్తి అనిర్వచనీయమైన అనుభూతిని ఇచ్చేది మంత్రమే

జ్ఞానం అంటే ఏమిటి?What is Knowledge? Telugu

 

జ్ఞానం అంటే ఏమిటి?



జ్ఞానం అంటే చాల మందికి గుర్తు వచ్చే అంశం బుద్దుడికి రావి చెట్టు కింద జ్ఞానోదయం అయింది. అయితే జ్ఞానం అంటే ఏమిటి? అసలు ఆ బుద్దునికి రావి చెట్టు కింద వచ్చిన జ్ఞానం ఏంటి? మనం గ్రహించని ఆ జ్ఞానం ఏది? సాధారణంగా మనకు అందరికి తెలిసిన విషయం ఏమిటంటే జ్ఞానం అనగానే చాల మంది వారి తెలివితేటలూ అని అనుకుంటారు. కాని తెలివితేటలూ జ్ఞానం కాదు. మరి జ్ఞానం అంటే ఏమిటి? భగవద్గీతలో మరియు ఉపనిషత్తులలో ఈ జ్ఞానం అనే పదం వచ్చింది. కనుక ఇప్పుడు మనం అక్కడ జ్ఞానం అంటే ఏమి చెప్పారో తెలుసుకుందాం?
మన సనాతన హిందూ ధర్మ వేదాలలో ఉపనిషత్తులలో, భగవద్గీతలో మరియు ఎందఱో సద్గురువులు, జగద్గురువులు చెప్పబడిన జ్ఞానం అయితే బ్రహ్మ జ్ఞానం. జ్ఞానం అంటే తెలుసుకోవడం. జ్ఞానాన్ని దేని ద్వార తెలుసుకోవాలి అంటే ఒకటి గురువు బోధించడం వలన లేక వేద వేదాంగాలను క్షుణ్ణంగా గ్రహించి తెలుసుకోవడం వలన పొందేదే బ్రహ్మ జ్ఞానం. అంటే ఎవరైతే గురువు, బ్రహ్మ విద్యను తెలుపుతారో లేక వేద వేదాంగాల బ్రహ్మ విద్యను చదివి తెలుసుకుంటారో వారు తెలుసుకునేదే బ్రహ్మ జ్ఞానం. అంతే కాని మనం ఇప్పుడు చదివిన B.Tech,MBA,MCA,MBBS మరియు PG చదువులు చదివి తెలుసుకున్నది కాదు. ఇది అంతయు విద్యే కావచ్చు కాని బ్రహ్మ విద్య కాదు.
సరే బ్రహ్మ విద్యను తెలుసుకోవడం అంటే జ్ఞానం అన్నారు. ఆ జ్ఞానం అంటే ఏమిటి ? నిజమైన జ్ఞానం అంటే ఆత్మానాత్మ వివేకం. వివేకం అంటే తెలివితేటలు మరియు క్షుణ్ణంగా తెలుసుకోవడం. అంటే ఇక్కడ ఏది ఆత్మ? ఏది అనాత్మ? అనాత్మ అయినది దేని నుండి పుడుతుంది? వీటితో పాటు మరీ ముఖ్యంగా “నేను” ఎవరు? “దేవుడు” ఎవరు? ఈ శరీరము, మనస్సు,బుద్ధి మరియు ఈ కనిపించే ప్రకృతి ఎట్లా వచ్చింది, ఎవరు సృష్టించారు, నేను ఎందుకు పుట్టాను. ఇలా ఈ విధంగా క్షుణ్ణంగా తెలుసుకోవడాన్నే జ్ఞానం అంటారు.

జ్ఞానం అంటే భగవంతుని గురించి సంపూర్ణంగా పరిపూర్ణంగా అయన స్వస్వరుపాన్ని మరియు నీవు అంటే ఎవరు అన్న విషయాలను కూలంకషంగా గ్రహించడమే జ్ఞానం. దీనికి అన్యమైనది ఏదైనా అజ్ఞానమే. భగవంతుని స్వస్వరూపం అంటే ఏముంది దేవుడు అంటే అయన ఎదో ఒక రూపంలో వుంటాడు, దేవునికి రూపం అనడమే అజ్ఞానం. దేవుడైన పరమాత్ముడు నిరాకారుడు, నిర్గుణుడు, సత్యుడు, శాస్వితుడు, అమరుడు, పుట్టుకలు లేనివాడు, నిత్యుడు, పురాతనుడు అయిన ఎల్లప్పుడూ నూతనుడు, ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటాడు ఆయన ఈ సమస్తం వ్యాపించి ఉంటాడు. మరియు ఈ ప్రక్రుతి అంతయు కూడ ఆయనే అయి ఉన్నాడు.అది ఆ దేవదేవుడైన పరమాత్మా యొక్క స్వస్వరూపం.మరి నీవు ఎవరు ? అనగానే నేను అంటే ఈ శరీరం అనే భావన మనకు వస్తుంది. కాని ఈ శరీరం ఇప్పటికి కాకపోయిన ఎదో ఒక రోజు నశిస్తుంది కదా! అప్పుడు నీ పరిస్తితి ఏంటి. దానిని తెలుసుకోవడమే జ్ఞానం. నీవు అంటే ఈ మాంసపు ముద్దలతో ఉన్న ఈ శరీరము కాదు. మరి ఎవరు పోనీ నేను అంటే ఈ మనస్సా, బుద్ధా లేక ప్రాణమా! ఇవి ఏవియు నీవు కాదు వీటికి అన్నిటికి అతీతంగా వుంటూ వీటికి అన్నిటికి శక్తినిచ్చే ఒక సాక్షిభూతమైన ఆత్మ స్వరూపుడివి మాత్రమే నీవు అన్నది తెలుసుకోవడమే జ్ఞానం. ఈ విధంగా ఆత్మానాత్మ వివేకాన్ని సంపూర్ణంగా గ్రహించి దానిని నీ నిత్య జీవితంలో అమలుపరచుకొని ఆ పరమాత్మునిని స్మరిస్తూ ఇలా మనలోని అజ్ఞానాన్ని రూపుమాపుకొని, మన స్వరూపాన్ని మనం గ్రహించినప్పుడు, అప్పడు సర్వభయాలనుండి, బంధాలనుండి, సంచితకర్మల నుండి విముక్తి పొందడమే ముక్తి. అదే మోక్షం. ఇలా స్వస్వరుపాన్ని తెలుసుకోవటమే జ్ఞానం . ఆ జ్ఞానంవల్ల జ్ఞానాగ్ని పుడుతుంది. ఆ జ్ఞానగ్నిలో సర్వకర్మలు దహించుకు పోతాయి.

శ్రీ కృష్ణుడు భగవద్గీతలో చెప్పిన విషయాలు చుడండి.

1. ఆత్మజ్ఞానమందు మనస్సు లగ్నము చేయుట, మోక్షప్రాప్తి యందు ద్రుష్టి కలిగియుండుట జ్ఞానమార్గములనియు ఇవికాక ఇతరములైనవి అజ్ఞానము లనియు చెప్పబడును.
2. జ్ఞానసంపన్నుడైన మానవుడు అనేక జన్మములేత్తిన పిమ్మట విజ్ఞానియై నన్ను (నిరాకర రూపమైన పరమాత్మను) శరణమునొందుచున్నాడు.
3. అర్జునా! ఎవని అజ్ఞానము జ్ఞానము చేత నశింపబడునో అతనికి జ్ఞానము సూర్యునివలె ప్రకాశించి పరమార్ధతత్వము జూపును.
4. ఎవని కర్మాచరణములు కామ సంకల్పములు కావో యెవని కర్మలు జ్ఞానమను నిప్పుచే కాల్పబడినవో, అట్టి వానిని పండితులని విద్వాంసులని పల్కుదురు.
5. అనురాగము, భయము, క్రోధము వదిలి నాయందు (పరమాత్మా) మనస్సు లగ్నము చేసి, ఆశ్రయించిన సత్పురుషులు జ్ఞానయోగము చేత పరిశుద్ధులై నా సాన్నిధ్యము పొందిరి.
6. పొగచేత అగ్ని, మురికిచేత అద్దము, మావిచేత శిశువు యెట్లు కప్పబడునో, అట్లు కామము (కోరికల) చేత జ్ఞానము కప్పబడి యున్నది.
7. శ్రద్ధ, ఇంద్రియ నిగ్రహము గలవాడు జ్ఞానమును పొందుటకు సమర్ధుడగును. అట్టి జ్ఞాని ఉత్కృష్టమైన మోక్షమును పొందును.
Source : వేద శాస్త్రం