Translate

Monday, June 28, 2021

చేతనావస్థ-consciousness

 

చేతనావస్థ-Consciousness






అద్వైత చేతనావస్థ మూడు స్థితులను సూచిస్తుంది, అవి మేల్కొలుపు (జాగృత ), కలలు కనే (స్వప్న), లోతైన నిద్ర (సుషుప్తి), ఇవి మానవులు అనుభవపూర్వకంగా అనుభవించినవి,  మరియు మూడు శరీరాల సిద్ధాంతానికి అనుగుణంగా ఉంటాయి


  • మొదటి రాష్ట్రం మేల్కొనే స్థితి, దీనిలో మన రోజువారీ ప్రపంచం గురించి మనకు తెలుసు. ఇది స్థూల శరీరం.
  • రెండవ స్థితి కలలు కనే మనస్సు. ఇది సూక్ష్మ శరీరం. 
  • మూడవ రాష్ట్రం గా deep నిద్ర యొక్క స్థితి. ఇది కారణ శరీరం. 

అద్వైతం నాల్గవ తురియా స్థితిని కూడా సూచిస్తుంది, దీనిని కొందరు స్వచ్ఛమైన చేతనావస్థగా అభివర్ణిస్తారు, ఈ మూడు సాధారణ చైతన్య స్థితులను అంతర్లీనంగా మరియు అధిగమించే నేపథ్యం.  తురియా విముక్తి స్థితి, ఇక్కడ అద్వైత పాఠశాల ప్రకారం , ఒకరు అనంతమైన (అనంత) మరియు భిన్నమైన (అద్వైత / అభేదా) ను అనుభవిస్తారు, ఇది ద్వంద్వ అనుభవం నుండి ఉచితం, అజాటివాడ, ఉద్భవించని స్థితి పట్టుకోబడిన స్థితి.  చంద్రధర శర్మ గారిప్రకారం, తురియా రాష్ట్రం పునాది నేనే గ్రహించబడినది, అది కొలతలేనిది, కారణం లేదా ప్రభావం లేదు, అన్ని వ్యాప్తి చెందుతుంది, బాధ లేకుండా, ఆనందంగా, మార్పులేని, స్వీయ-ప్రకాశించే, నిజమైన, అన్ని విషయాలలో అప్రధానమైన మరియు అతీతమైనది. స్వీయ-చైతన్యం యొక్క తురియా దశను అనుభవించిన వారు ప్రతి ఒక్కరితో మరియు ప్రతిదానితో ఒకటిగా వారి స్వంత ద్వంద్వ రహిత స్వయం గురించి స్వచ్ఛమైన అవగాహనకు చేరుకున్నారు, వారికి జ్ఞానం, తెలిసినవారు, తెలిసినవారు ఒకరు అవుతారు, వారు జీవన్ముక్త. [12 ] [13] [14]


. [17]

Sunday, June 27, 2021

ఓంకారం బిందు సంయుక్తం (షడక్షర శ్త్రొత్రం)/ Shadakshari Strotram in telugu

 



ఓంకారం బిందు సంయుక్తం, నిత్యం ధ్యాయంతి యోగినః,

కామదం మోక్షదం తస్మా, ఓంకారరాయ నమోనమః.



||ఓం ||నం||

నమంతి మునయః సర్వే, నమత్యప్సరసాంగలాహ,

నరాణాం ఆది దేవాయ, నకారాయ నమోనమః,

నకారాయ నమోనమః.||2||


||ఓం ||మం||

మహాతత్వం మహాదేవ ప్రియం,జ్ఞాన ప్రదం పరం,

మహా పాప హరం తస్మా,మకారాయ నమోనమః,

మకారాయ నమోనమః.||3||


||ఓం ||శిం||

శివం శాంతం శివాకారం,శివానుగ్రహ కారణం,

మహాపాప హరం తస్మా,శికారాయ నమోనమః,

శికారాయ నమోనమః.||4||


||ఓం||వాం||

వాహనం వృషభోయస్యా,వాసుఖీ ఖంట భూషణం,

వామ శక్తి ధరం దేవం,వకారాయ నమో నమః,

వకారాయ నమో నమః.||5||


||ఓం||యం||

యకారే సంస్థితో దేవో,యకారం పరమం శుభం,

యం నిత్యం పరమానందం,యకారాయ నమో నమః,

యకారాయ నమో నమః.||6||


||ఓం||యః||

క్షీరాంబుది మంత్రనుద్భవ,మహా హాలాహలం భీకరం,

దుష్ట్వాతత్వ పరాయితా,సురగాణా నారాయణాం ధీంతద,

నారాయణాం ధీంతద.||7||


సంకీర్త్వా పరిపాలయ జగదితం,విశ్వాదికం శంకరం,

శివ్యోన సకలా పదం, పరిహరం కైలాసవాసి విభుః.||8||


క్షర క్షర మిదం స్తోత్రం,యః పఠేచివ సన్నిధౌ,

తస్య మృత్యు భయం నాస్తి, హ్యప మృత్యు భయం కృతః,

హ్యప మృత్యు భయం కృతః. ||9||


Friday, June 25, 2021

మా గురువులు =Our Gurus

Dkashinamurthi - శ్రీ దక్షిణాముర్తి  
Lalitha - శ్రీ లలిత
Ganapati - శ్రీ గణపతి
Kumarswamy - కుమరస్వామి
Agastya - అగస్త్య 
Vishwamitra - విశ్వామిత్ర
Mahavtar babaji - మాహవ్తర్ బాబాజి
Sankaracharya - శంకరాచార్య 
ShirdiSai             - షిర్దిసాయి బాబా
Jyotirbaba - జ్యొతిర్బాబా
Tulasidas - తులసిదాస్
Jeeveswarayogi - జీవేశ్వరయోగి

Wednesday, June 16, 2021

🌸సద్గురువు🌸

 🌸సద్గురువు🌸 


ఒక నది ఒడ్డున చెట్టు కింద ధ్యాన సమాధిలో ఉన్న సాధువు దగ్గరికి వెళ్లాడొక యువకుడు. ఆయన కళ్లు తెరిచాక 'స్వామీ! మీరు అనుమతిస్తే మీ శిష్యుణ్ని కావాలనుకుంటున్నాను' అన్నాడు. ఎందుకని అడిగాడు సాధువు. కొన్ని క్షణాలు ఆలోచించి 'మీలాగే దేవుడెక్కడున్నాడో కనుక్కోవాలనుకుంటున్నాను' అన్నాడు.

ఒక్క గెంతులో ఆ యువకుణ్ని సమీపించి అతని మెడ పట్టుకుని గబగబ నదిలోకి లాక్కుని వెళ్ళి నీళ్ళలో ముంచేశాడు సాధువు. ఒక్క నిమిషం పాటు అలాగే అతని తలను నీళ్ళలో ముంచి ఉంచాడు. ఆ యువకుడు గిలగిల కొట్టుకుంటుంటే అప్పుడతణ్ని వదిలిపెట్టాడు. నీళ్ళలోంచి తల ఎత్తి దగ్గి దగ్గి, మింగిన నీళ్ళను కక్కి, వూపిరి పీల్చుకుని కాసేపటికి స్థిమితపడ్డాడతను.


'ఇప్పుడు చెప్పు. నీళ్ళల్లో మునిగినంతసేపు ఏం చేయాలనుకున్నావు?' అని సాధువు అడిగాడు. వూపిరాడక గాలి కోసం కొట్టుకులాడాను' అన్నాడా యువకుడు.


'మంచిది. ఇంటికి వెళ్లు. నువ్వు వూపిరికోసం ఎంతగా గిలగిల్లాడావో అంతగా ఆ దేవుణ్ని దర్శించాలని పరితపించినప్పుడే నా దగ్గరకు రా! దైవసాక్షాత్కారానికి మార్గం చూపిస్తాను' అన్నాడు సాధువు.


'ఒక మనిషి అత్యుత్తమమైన ఆత్మజ్ఞానం పొందాలంటే ఏం చేయాలి గురుదేవా?' అని శిష్యుడడిగాడు. 'సర్వస్వం మరచి ధ్యాన సమాధిలోకి వెళ్లగలిగే స్థితి అది' అని జవాబిచ్చాడు గురువు. ఆయనెప్పుడూ ఆశ్రమానికి వచ్చేవారికి ఏర్పాట్లు చేయటం, భక్తులతో ప్రవచనాల్లో పాల్గొనటం, మొక్కలకు పాదులు తవ్వి నీళ్ళు పోయటం, గ్రంథ రచనలో మునిగిఉండటం... ఇలా ఎన్నో పనులు చేసేవాడే కానీ- తనతో చెప్పినట్లు ఆయనెప్పుడూ ధ్యాన సమాధిలో ఉండకపోవటం ఆ శిష్యుణ్ని ఆశ్చర్యపరచింది!

ఉండబట్టలేక 'అత్యుత్తమ స్థితికి చేరాలంటే అందరికీ ధ్యాన సమాధి అవసరమే కదా! మరి ఎప్పుడూ ఆశ్రమ కార్యక్రమాల్లో మునిగిపోయే మీకు ఆ ధ్యానానికి సమయమేది?' అని సరాసరి గురువుగారినే అడిగేశాడు. గురువు మందహాసం చేశాడు. 'నువ్వన్నది నిజం! అత్యుత్తమ స్థితికి చేరాలంటే ఆ ధ్యాన సమాధి అందరికీ అవసరమే! నేను అనుక్షణం చేస్తున్న పనే నా ధ్యాన సమాధి!'


ఆత్మజ్ఞానం మిక్కిలి సూక్ష్మమైనది. గూఢమైనది. ఎవ్వరైనా తమ స్వశక్తితో దాన్ని పొందలేరు. కనుక ఆత్మ సాక్షాత్కారం పొందిన గురువు సహాయం మిక్కిలి అవసరం. గొప్ప కృషి చేసి శ్రమించి ఇతరులివ్వలేనిదాన్ని అతి సులభంగా గురువు ప్రసాదిస్తాడు. వారా మార్గంలో నడచినవారు కనుక శిష్యుని సులభంగా ఆధ్యాత్మిక ప్రగతిలో ఉచిత క్రమంలో ఒక్కొక్క మెట్టే పైకెక్కించి ఉన్నత స్థితికి చేర్చగలుగుతారు. వారే సద్గురువులు!

Monday, June 14, 2021

గుడి (Temple) + చక్ర (Chakras) Good Notes

 సహస్రార చక్రము: (గర్భ గుడి)


జీవుడికి ఆధారమైన చక్రమిది. మస్తిష్కం (తలలోని మెదడు) పనిచేస్తేనే జీవుడు ఉన్నట్లు.. మెదడు పనిచేయకుంటే.. జీవుడు గాలిలో కలిసి పోయినట్లే. మస్తిష్కం.. జీవుడికే అంతటి కీలకమైనదైతే.. సమస్త జీవకోటిని సృష్టించి, పోషించే ఆ పరంధాముడి మస్తిష్కం మరెంతటి విశిష్టమైనదై ఉండాలి..? మస్తిష్కం.. బ్రహ్మ రంధ్రానికి దిగువన వేయి రేకులతో వికసించే పద్మం అన్నది ప్రాజ్ఞుల నమ్మిక. ఈ కమలం మాయతో ఆవరించి ఉంటుందని.. ఆత్మజ్ఞానాన్ని సాధించిన పరమహంసలు మాత్రమే దీన్ని పొందగలుగుతారన్నది హిందువుల విశ్వాసం. దీన్ని శివులు శైవస్థానమని, వైష్ణవులు పరమ పురుష స్థానమని, ఇతరులు హరిహర స్థానమనీ, దేవీ భక్తులు.. దేవీ స్థానమని పిలుచుకుంటారు. ఈ స్థానం పరిపూర్ణంగా తెలుసుకున్న మనుషులకు పునర్జన్మ ఉండదని కర్మ సిద్ధాంతం చెబుతుంది.


గర్భాలయం : శరీరంలో సహస్రారం ఎంతటి విశిష్టమైనదో.. ఆలయ నిర్మాణంలో గర్భగుడి కూడా అంతే విశిష్టమైనది. దీన్ని గర్భాలయం లేదా ముఖమంటపమని అంటారు. ఇది అత్యంత పవిత్రమైనది. పరమ యోగులు.. స్వామివారి కరుణ భాగ్యాన్ని పొందిన వారికి మాత్రమే ఇందులో ప్రవేశించే అర్హత వస్తుంది.


ఆజ్ఞా చక్రము: రెండోది ఆజ్ఞా చక్రం ఇది భ్రూ (కనుబొమల) మధ్య లో ఉంటుంది. ఈ చక్రము, రెండు రంగులతో కూడిన రెండు రేకులు (దళాలు) ఉండే కమలంలా ఉంటుందట. (ఇది కూడా గర్భాలయానికి సంబంధించిన అంశమే.)


విశుద్ధి చక్రము: (అంతరాలం)

మూడోది విశుద్ధి చక్రము. ఇది కంఠ స్థానంలో ఉంటుంది. ఈ చక్రం, తెల్లగా మెరిసిపోయే పదహారు రేకులతో కూడిన కమలంలా ఉంటుందట. ఇది ఆకాశతత్వానికి ప్రతీక అన్నది విశ్వాసం.

అంతరాలం : ఆలయ నిర్మాణంలో విశుద్ధి స్థానాన్ని అంతరాలంగా పిలుస్తారు. ముఖ మంటపాన్నీ మహా మంటపాన్నీ కలిపే స్థానమే అంతరాలం.


అనాహత చక్రము: (అర్ధమంటపం)

ఇది హృదయ (రొమ్ము) స్థానంలో ఉంటుంది. బంగారు రంగులోని పన్నెండు రేకులు గల కమలంలా ఉంటుందిట. ఇది వాయుతత్వానికి ప్రతీక.

అర్ధమంటపం : గర్భాలయానికి ముందు ఉండే మంటపాన్ని ముఖమంటపం లేదా అర్ధమంటపం అంటారు. భగవంతుడి శరీరంలో రొమ్మును ఇది ప్రతిబింబిస్తుంది.


మణిపూరక చక్రము: (మహామంటపం)

నాభి (బొడ్డు) మూలంలో ఈ చక్రం ఉంటుంది. నీల వర్ణంలోని పది దళాలు (రేకులు) కలిగిన పద్మంలా ఉంటుంది. ఇది అగ్ని తత్వాన్ని ప్రతిఫలిస్తుంది.

ఆలయ నిర్మాణంలో... గొంతు నుంచి నాభి దిగువ దాకా మహా మంటపమే ఉంటుంది.


స్వాధిష్ఠాన చక్రము: (ధ్వజస్తంభం)

ఈ చక్రము లింగ (పురుషాంగం) మూలంలో ఉంటుంది. ఈ చక్రం సింధూర వర్ణం గల ఆరు దళాల కమలమట. ఇది జలతత్వాన్ని ప్రతిబింబిస్తుంది.


ధ్వజస్తంభం : ఆలయ నిర్మాణ రీతిని అనుసరించి, మహా మంటపానికి ముందు ఈ స్తంభం ఉంటుంది. దేవుడి అంగమే ఈ ధ్వజస్తంభం. అంగ మొల వేలుపు అని శివుడికి పేరు. అంగ మొల అంటే, వస్త్రాలేమీ లేని కటి ప్రదేశం అని అర్థం. ధ్వజము అన్నా కూడా జెండా అని, మగ గురి అనీ అర్థాలున్నాయి. మగ గురి లో మగ అంటే.. మగటిమి అని, గురి అంటే లక్ష్యము అని అర్థం. నిజానికి ధ్వజము అంటేనే మగ (పుంసత్వపు) గురి అన్న అర్థముంది. ఏది ఏమైనా భగవంతుడి మర్మాంగ రూపమే ధ్వజస్తంభం అనడంలో సందేహం లేదు. ఆంజనేయుడి ధ్వజస్తంభానికి మండల కాలం పూజలు చేసి ప్రదక్షిణలు చేస్తే.. వివాహాది ఇష్ట కార్యసిద్ధి కలుగుతుందన్న విశ్వాసం కూడా ధ్వజస్తంభం విశిష్టతను చాటుతుంది.


మూలాధార చక్రము:

అన్ని నాడులకూ ఆధారమైన ఈ చక్రం గుద స్థానంలో ఉంటుంది. గుద స్థానానికి పైన, లింగ స్థానానికి కింద (గుద, లింగం రెంటి మధ్యలో) ఉంటుంది. ఎర్రటి రంగులోని నాలుగు దళాల కమలమిది. ఇందులోనే కుండలినీ శక్తి నిక్షిప్తమై ఉంటుందట.


మోకాలి స్థానం : స్వామి వారి రెండు మోకాళ్లు కలిసే స్థానం. ఇక్కడ ఓ గోపుర ద్వారం ఉంటుంది. దీన్ని దుర్గపుర ద్వారం అంటారు. (దుర్గ అంటే కోట, పురం అంటే పట్టణం అని అర్థం) అంటే ప్రజలు స్వామి దర్శనానికి చేరుకునేందుకు ఇది ప్రవేశ ద్వారం.


పాదాలు : ఇది మహాప్రాకార గోపుర స్థానం. (ప్రాకారం అంటే గుడి మొదలైన వాటి చుట్టూ ఉన్న గోడ అని అర్థం. మహా అంటే చాలా గొప్పగా (పటిష్టంగా) అని అర్థం. అంటే శత్రువులు కోటలోకి రాకుండా రాజులు ఎలా దుర్భేద్యమైన ప్రాకారాన్నినిర్మించే వాళ్లో.. గుడికీ, దుష్టశక్తులు ప్రవేశించకుండా ఈ మహాప్రాకార గోపురాన్ని నిర్మిస్తారు. మనం మహాప్రాకారం దాటి లోపలికి వెళుతుండగానే.. మన మనసుల్లోని అన్ని బాధలు, చెడు తలంపులకు కారణమైన... కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరం అనే అరిషడ్వర్గాలన్నీ ప్రాకారం బయటే నిలిచిపోతాయి. అందుకే గుళ్లోకి వెళ్లగానే మన మనసు ప్రశాంతమై పోతుంది.


ఇదీ గుడి నిర్మాణం.. ఆ గుళ్లో భగవంతుడి శరీర స్థానాల విశిష్టతల గురించిన సమాచారం. కాబట్టి, ఇకమీదట గుడికి వెళ్లేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకుని, స్వామిని మనస్పూర్తిగా ధ్యానించండి. భగవంతుడి ఆశీస్సులు పొందండి. సర్వే జనాస్సుఖినో భవంతు🙏🙏🙏

Thursday, June 10, 2021

Pancha Tatvaalu -పంచ తత్వాలు స్పెషల్ నోట్స్

 


👁‍🗨 ఆకాశానికి ఉన్న ఒకే ఒక గుణం ●శబ్దం.


👁‍🗨– వాయువుకు ఉన్నగుణాలు రెండు

●శబ్దము, 

●స్పర్శ.


👁‍🗨– అగ్నికి ఉన్న గుణాలు మూడు…

●శబ్ద, 

●స్పర్శ, 

●రూపములు.


👁‍🗨– జలముకు ఉన్న గుణాలు నాలుగు

●శబ్ద, 

●స్పర్శ, 

●రూప, 

●రసము(రుచి)లు.


👁‍🗨– భూమికి ఉన్న గుణాలు ఐదు

●శబ్ద, 

●స్పర్శ,

●రూప, 

●రస,

●గంథాలు.

ఈ ఐదు గుణాలూ… 

"°పాంచభౌతిక తత్త్వాలు°" గల మన శరీరానికి ఉన్నాయి.

కనుకనే మనం భూమిని ఆశ్రయించి జీవిస్తున్నాం.


■– జలము…‘గంథము’ అనే గుణాన్ని త్యాగం చేయడం వల్ల, మనం నీటిని చేతితో పట్టుకోలేము. నీటికి మన చేతిని ఆధారంగా మాత్రమే ఉంచగలం. కొంతసేపటికి ఆ నీరు ఆవిరైపోతుందేగానీ.., మనం బంధించలేము.


■– అగ్ని…‘రస, గంథము’లనే గుణాలను త్యాగం చేయడంవల్ల, అగ్నిని కళ్ళతో చూడగలమే గానీ, కనీసం తాకనైనా తాకలేము. తాకితే శిక్షిస్తుంది.


■– వాయువు…‘రస,గంథ, రూపము’లనే గుణాలను త్యాగం చేయడంవల్ల, మనం వాయువును ఈ కళ్ళతో చూడనైనా చూడలేము. వాయువే తనంతట తాను మనలను స్పృశించి, తన ఉనికిని మనకు తెలియజేస్తుంది.


■– ఆకాశం…‘రస, గంథ, రూప, స్పర్శ’లనే గుణాలను త్యాగం చేయడంవల్ల, అది మన కళ్ళకు కనిపించకుండా, తను ఉన్నానని మనలను భ్రమింప చేస్తుంది.


★° ఒక గుణమున్న (శబ్దం) ఆకాశాన్నే మనం చూడలేనప్పుడు…, ఏ గుణము లేని ఆ ‘నిర్గుణ పరబ్రహ్మ’ ఎలా ఈ భౌతిక నేత్రానికి కనిపిస్తాడు? అలా చూడాలంటే మన మనోనేత్రాన్ని తెరవాలి. 

దాన్ని తెరవాలంటే…, 

పాంచభౌతిక తత్త్వాలైన గుణాలను, అనగా…!

ప్రాపంచిక విషయ వాసనలను త్యజించాలి. 

అప్పుడు నీవు ‘నిర్గుణుడ’వు అవుతావు. అప్పుడు నీవే ‘పరమాత్మ’వు అవుతావు. నిన్ను నీలోనే దర్శించుకుంటావు. 

అదే ‘అహం బ్రహ్మాస్మి’ అంటే.

 ‘నిన్ను నీవు తెలుసుకోవడమే’ దైవాన్ని దర్శించడమంటే. అదే దైవ సాక్షాత్కారం అంటే...!°