Translate

Saturday, February 22, 2025

శ్రీ అఘోరాష్టకం - Sree AghoraAshtakam in Telugu


 || శ్రీ అఘోరాష్టకం ||



కాలాభ్రోత్పలకాలగాత్రమనలజ్వాలోర్ధ్వకేశోజ్జ్వలం
దంష్ట్రాద్యస్ఫుటదోష్ఠబింబమనలజ్వాలోగ్రనేత్రత్రయం .
రక్తాకోరకరక్తమాల్యరచితం(రుచిరం)రక్తానులేపప్రియం
వందేఽభీష్టఫలాప్తయేఽఙ్ఘ్రికమలేఽఘోరాస్త్రమంత్రేశ్వరం .1

 

జంఘాలంబితకింకిణీమణిగణప్రాలంబిమాలాంచితం
(దక్షాంత్రం)డమరుం పిశాచమనిశం శూలం చ మూలం కరైః .
ఘంటాఖేటకపాలశూలకయుతం వామస్థితే బిభ్రతం
వందేఽభీష్టఫలాప్తయేఽఙ్ఘ్రికమలేఽఘోరాస్త్రమంత్రేశ్వరం .2

 

నాగేంద్రావృతమూర్ధ్నిజ(ర్ధజ) స్థిత(శ్రుతి)గలశ్రీహస్తపాదాంబుజం
శ్రీమద్దోఃకటికుక్షిపార్శ్వమభితో నాగోపవీతావృతం .
లూతావృశ్చికరాజరాజితమహాహారాంకితోరస్స్థలం
వందేఽభీష్టఫలాప్తయేఽఙ్ఘ్రికమలేఽఘోరాస్త్రమంత్రేశ్వరం .3

 

ధృత్వా పాశుపతాస్త్రనామ కృపయా యత్కుండలి(యత్కృంతతి)ప్రాణినాం
పాశాన్యే క్షురికాస్త్రపాశదలితగ్రంథిం శివాస్త్రాహ్వయం (?) .
విఘ్నాకాంక్షిపదం ప్రసాదనిరతం సర్వాపదాం తారకం
వందేఽభీష్టఫలాప్తయేఽఙ్ఘ్రికమలేఽఘోరాస్త్రమంత్రేశ్వరం .4

 

ఘోరాఘోరతరాననం స్ఫుటదృశం సంప్రస్ఫురచ్ఛూలకం
ప్రాజ్యాం(జ్యం)నృత్తసురూపకం చటచటజ్వాలాగ్నితేజఃకచం .
(జానుభ్యాం)ప్రచటత్కృతా(రినికరం)స్త్రగ్రుండమాలాన్వితం
వందేఽభీష్టఫలాప్తయేఽఙ్ఘ్రికమలేఽఘోరాస్త్రమంత్రేశ్వరం .5

 

భక్తానిష్టకదుష్టసర్పదురితప్రధ్వంసనోద్యోగయుక్
హస్తాగ్రం ఫణిబద్ధహస్తచరణం ప్రారబ్ధయాత్రాపరం .
స్వావృత్త్యాస్థితభీషణాంకనికరప్రారబ్ధసౌభాగ్యకం ?
వందేఽభీష్టఫలాప్తయేఽఙ్ఘ్రికమలేఽఘోరాస్త్రమంత్రేశ్వరం .6

 

యన్మంత్రాక్షరలాంఛితాపఘనవన్మర్త్యాశ్చ(చ్చ) వజ్రార్చిషో
భూతప్రేతపిశాచరాక్షసకలానిర్ఘాతపాతా ఇవ(దివ) .
ఉత్సన్నాశ్చ భవంతి సర్వదురితప్రోచ్చాటనోత్పాదకం
వందేఽభీష్టఫలాప్తయేఽఙ్ఘ్రికమలేఽఘోరాస్త్రమంత్రేశ్వరం .7

 

యద్ధ్యానో ధ్రువపూరుషో(ధ్యానోద్యతపూరుషో)షితగృహగ్రామస్థిరాస్థాయినో
భూతప్రేతపిశాచరాక్షసప్రతిహతా నిర్ఘాతపాతా ఇవ .
యద్రూపం విధినా స్మరన్ హి విజయీ శత్రుక్షయం ప్రాప్నుతే
వందేఽభీష్టఫలాప్తయేఽఙ్ఘ్రికమలేఽఘోరాస్త్రమంత్రేశ్వరం .8

 

.. ఇతి శ్రీఅఘోరాష్టకం సంపూర్ణం ..

 

Tuesday, February 18, 2025

గురు పాదుకా స్తోత్రం (Guru Paduka Stotram in telugu)

 


 

గురు పాదుకా స్తోత్రం

 

అనంతసంసారసముద్రతార-
నౌకాయితాభ్యాం గురుభక్తిదాభ్యామ్ ।
వైరాగ్యసామ్రాజ్యదపూజనాభ్యాం
నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ ॥ 1

 

కవిత్వవారాశినిశాకరాభ్యాం
దౌర్భాగ్యదావాంబుదమాలికాభ్యామ్ ।
దూరీకృతానమ్రవిపత్తితాభ్యాం
నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ ॥ 2

 

నతా యయోః శ్రీపతితాం సమీయుః
కదాచిదప్యాశు దరిద్రవర్యాః ।
మూకాశ్చ వాచస్పతితాం హి తాభ్యాం
నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ ॥ 3

 

నాలీకనీకాశపదాహృతాభ్యాం
నానావిమోహాదినివారికాభ్యామ్ ।
నమజ్జనాభీష్టతతిప్రదాభ్యాం
నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ ॥ 4

 

నృపాలిమౌలివ్రజరత్నకాంతి-
సరిద్విరాజజ్ఝషకన్యకాభ్యామ్ ।
నృపత్వదాభ్యాం నతలోకపంక్తేః
నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ ॥ 5

 

పాపాంధకారార్కపరంపరాభ్యాం
తాపత్రయాహీంద్రఖగేశ్వరాభ్యామ్ ।
జాడ్యాబ్ధిసంశోషణవాడవాభ్యాం
నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ ॥ 6

 

శమాదిషట్కప్రదవైభవాభ్యాం
సమాధిదానవ్రతదీక్షితాభ్యామ్ ।
రమాధవాంఘ్రిస్థిరభక్తిదాభ్యాం
నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ ॥ 7

 

స్వార్చాపరాణామఖిలేష్టదాభ్యాం
స్వాహాసహాయాక్షధురంధరాభ్యామ్ ।
స్వాంతాచ్ఛభావప్రదపూజనాభ్యాం
నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ ॥ 8

 

కామాదిసర్పవ్రజగారుడాభ్యాం
వివేకవైరాగ్యనిధిప్రదాభ్యామ్ ।
బోధప్రదాభ్యాం ద్రుతమోక్షదాభ్యాం
నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ ॥ 9




చంద్రశేఖరాష్టకం (ChandraSekhara Ashtakam in Telugu)




 చంద్రశేఖరాష్టకం

చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమామ్ ।
చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమామ్ ॥ 

 

రత్నసాను శరాసనం రజతాద్రి శృంగ నికేతనం
శింజినీకృత పన్నగేశ్వర మచ్యుతానల సాయకమ్ ।
క్షిప్రదగ్ద పురత్రయం త్రిదశాలయై-రభివందితం
చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః ॥ 1

 

పంచపాదప పుష్పగంధ పదాంబుజ ద్వయశోభితం
ఫాలలోచన జాతపావక దగ్ధ మన్మధ విగ్రహమ్ ।
భస్మదిగ్ధ కళేబరం భవనాశనం భవ మవ్యయం
చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమామ్ ॥ 2

 

మత్తవారణ ముఖ్యచర్మ కృతోత్తరీయ మనోహరం
పంకజాసన పద్మలోచన పూజితాంఘ్రి సరోరుహమ్ ।
దేవ సింధు తరంగ శ్రీకర సిక్త శుభ్ర జటాధరం
చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమామ్ ॥ 3

 

యక్ష రాజసఖం భగాక్ష హరం భుజంగ విభూషణం
శైలరాజ సుతా పరిష్కృత చారువామ కళేబరమ్ ।
క్షేళ నీలగళం పరశ్వధ ధారిణం మృగధారిణం
చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమామ్ ॥ 4

 

కుండలీకృత కుండలీశ్వర కుండలం వృషవాహనం
నారదాది మునీశ్వర స్తుతవైభవం భువనేశ్వరమ్ ।
అంధకాంతక మాశ్రితామర పాదపం శమనాంతకం
చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమామ్ ॥ 5

 

భేషజం భవరోగిణా మఖిలాపదా మపహారిణం
దక్షయజ్ఞ వినాశనం త్రిగుణాత్మకం త్రివిలోచనమ్ ।
భక్తి ముక్తి ఫలప్రదం సకలాఘ సంఘ నిబర్హణం
చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమామ్ ॥ 6

 

భక్తవత్సల-మర్చితం నిధిమక్షయం హరిదంబరం
సర్వభూత పతిం పరాత్పర-మప్రమేయ మనుత్తమమ్ ।
సోమవారిన భూహుతాశన సోమ పాద్యఖిలాకృతిం
చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమామ్ ॥ 7

 

విశ్వసృష్టి విధాయకం పునరేవపాలన తత్పరం
సంహరం తమపి ప్రపంచ మశేషలోక నివాసినమ్ ।
క్రీడయంత మహర్నిశం గణనాథ యూథ సమన్వితం
చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమామ్ ॥ 8

 

మృత్యుభీత మృకండుసూనుకృతస్తవం శివసన్నిధౌ
యత్ర కుత్ర చ యః పఠేన్న హి తస్య మృత్యుభయం భవేత్ ।
పూర్ణమాయురరోగతామఖిలార్థసంపదమాదరం
చంద్రశేఖర ఏవ తస్య దదాతి ముక్తిమయత్నతః ॥ 9

Sunday, February 16, 2025

హయగ్రీవుడు - Who is Hayigreeva in telugu

                                                                హయగ్రీవుడు


విద్యకు అధిపతి హయగ్రీవుడు

సాధారణంగా కష్టాలతో సతమతమైపోతున్న వారిని పలకరించినప్పుడు, ఇక ఆ భగవంతుడే చల్లగా చూడాలి అని అంటూ వుంటారు. అలా తన భక్తులను చల్లగా చూడటం కోసమే శ్రీ మహావిష్ణువు అనేక అవతారాలను ధరించాడు. అలాంటి అవతా రాల్లో 'హయగ్రీవావతారం' ఒకటి. పూర్వం హయగ్రీవుడు అనే రాక్షసుడు ఉండేవాడు. గుర్రం తలను కలిగిన హయగ్రీవుడు ... బ్రహ్మదేవుడి గురిం చి కఠోర తపస్సు చేశాడు. తన ఆకారాన్ని పోలి నవారి చేతిలో మాత్రమే తన కి మరణం సంభవించేలా వరాన్ని పొందాడు.వర గర్వంతో హయగ్రీవుడు సాధు సత్పురుషులను నానార కాలుగా హింసించ సాగాడు. దాంతో దేవత లంతా ఆది దంపతులను శరణువేడారు. యోగ నిద్రలో వున్న విష్ణువును మేల్కొలిపితే ఆయనే హయగ్రీవుడిని సంహరిస్తాడని పార్వతీ దేవి వారితో చెప్పింది. శ్రీ మహావిష్ణువు తన విల్లు చివరి భాగాన్ని గెడ్డంకింద పెట్టుకుని నిద్రిస్తున్నాడు. ఆయనను మేల్కొల్పడం కోసం శివుడు చెద పురుగుగా మారి వింటి తాడును తెంపాడు.వింటి తాడు తెగిన కారణంగా విల్లు పైకి ఎగదన్నడంతో శ్రీ మహావిష్ణువు తల శరీరం నుంచి వేరై పోయింది. ఇక అపుడు ఏమి చేయాలో తోచక పరాశక్తిని వేడుకొంటే ఆ తల్లి అశ్వముఖాన్ని మహావిష్ణువుకు అతికించమని చెప్పిందట. ఆ అమ్మచెప్పినట్టుగా దేవతలు చేయగా హయగ్రీవవతారుడయనాడు మహావిష్ణువు. ఆ పైన ఆ వేదాలను అపహరించిన హయగ్రీవుడను రాక్షసునితో పోరాడి మహావిష్ణువు విజయం సాధించాడు. రాక్షసులు దొంగిలించిన వేదాలను ఈ హయగ్రీవుడే తిరిగి తెచ్చినట్టు విష్ణు ధర్మోత్తరం చెబుతోంది. అమ్మవారితో సహా దేవాధి దేవతలు తమ జ్ఞానాన్ని, శక్తి సామర్ధా్యలను గుర్రం తల గల శ్రీ మహావిష్ణువుకి ధారపోశారు.

ఈ కారణంగానే హయగ్రీవ స్వామి విద్యలకు అధిపతిగా, జ్ఞానప్రదాతగా పూజలు అందు కుంటున్నాడు. తన అవతార కార్యాన్ని నెరవేర్చిన స్వామి లక్ష్మీ సమేతుడై దేవతలకు దర్శనమిచ్చాడు. స్వామివారు ఈ అవతారాన్ని ధరించిన రోజు శ్రావణ పౌర్ణమి. ఈ రోజున లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామిని పూజించడం వలన విద్య - విజ్ఞానం లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి.

విద్యార్థులకు జ్ఞానప్రదాత

గుర్రం శిరస్సును పొందిన నారాయణుడుకి సమస్త దేవతలు తమ జ్ఞాన శక్తిని ధారపోస్తారు. దాంతో హయగ్రీవుడనే అసురుడిని సంహరించిన స్వామి వేదాలను కాపాడతాడు. అసుర సంహారం అనంతరం స్వామివారిని లక్ష్మీదేవి శాంతింపజేస్తుంది. నారాయణుడు, హయగ్రీవుడిగా అవతరించిన ఈ రోజున ఎవరైతే లక్ష్మీ సమేతుడైన హయగ్రీవుడిని ఆరాధిస్తారో, వాళ్లకి జ్ఞానసిద్ధి కలిగి విద్యయందు రాణిస్తారనీ, విజయంతో పాటుగా సంపదలను పొందుతారని సాక్షాత్తు జగజ్జనని అయిన పార్వతీదేవి పలుకుతుంది. ఆ రోజు నుంచి హయగ్రీవుడు జ్ఞానాన్ని ప్రసాదించే దైవంగా పూజాభిషేకాలను అందుకుంటున్నాడు. అందువలన విద్యార్థులు తప్పనిసరిగా హయగ్రీవస్వామిని ఆరాధిస్తూ వుండాలి. ఆయన అనుగ్రహంతో అభివృద్ధిని సాధిస్తూవుండాలి.

" జ్ఞానానంద మయం దేవం, నిర్మలాస్ఫటికాకృతమ్‌

ఆధారం సర్వ విద్యానాం, హయగ్రీవ ముపాస్మహే "


జ్ఞానం, ఆనందం, మూర్తీభవించిన దైవస్వరూపం హయగ్రీవుడు. నిర్మలమైన స్ఫటికాకృతి కలిగి సర్వవిద్యలకు ఆధారభూతమైన విద్యాధిదేవత హయగ్రీవునకు నమస్కారము.

అశ్వ ముఖంతో, మానవ శరీరంతో వామాంకమున శ్రీ లక్ష్మీదేవితో తెల్లని శరీర ఛాయతో, చతుర్భు జాలతో, శంఖ, చక్ర చిన్ముద్ర పుస్త్తకాలను దాల్చిన శ్రీమన్నారాయణుడి హయగ్రీవావతారాన్ని చూచిన దేవతలందరూ చేతులెత్తి మొక్కారు. ఈ అవతారాన్ని కొలిచినవారికి జ్ఞానం అపారంగా కలుగుతుందని పురాణ వచనం. ఈ తండ్రిని కొలవడం వల్ల విద్యార్థులకు విద్యనే కాదు అన్యాయం జరిగినవారికి న్యాయం జరుగుతుంది. భూవివాదాలు ఏమైనా ఉంటే అవి త్వరలో పరిష్కరించబడుతాయి. శత్రు వినాశనం కూడా జరుగుతుంది. ఇలా ప్రతి సమస్యను పరిష్కరించి హయగ్రీవుడు మానవులందరినీ చల్లగా చూస్తాడు.

హయగ్రీవ ప్రస్థావన

దేవీ పురాణం, స్కాంధ పురాణం, శ్రీమద్భాగవతంతోపాటు ఆగమ శాసా్తల్ల్రో హయగ్రీవుని ప్రస్తావన ఉంది. వేద విద్యాభ్యాసాన్ని కూడా హయగ్రీవ జయంతినాడే ప్రారంభిస్తారు. విద్యార్థులందరూ ఈ రోజున హయగ్రీవుని అర్చించాలి. లౌకిక, పారలౌకిక విద్యలు సిద్ధించేందుకు హయగ్రీవార్చన శీఘ్ఫ్రలకరం. హయగ్రీవ జయంతి రోజున స్వామిని షోడశోపచారాలతో, అష్టోత్తరాలతో పూజించాలి.

హయగ్రీవునికి యాలకులు ప్రీతికరమైనవి. యాలకుల మాలను ధరింపజేసి శనగలు, గుగ్గుళ్ళను తయారుచేసి నివేదించాలి. మరియు తెల్లపూవులతో పూజించాలి. మరీ ఎక్కువ వాసన కలిగించే పుష్పాలతో పూజించకూడదు. ఇలా శ్రావణ పౌర్ణమినాడు హయగ్రీవ పూజ చేయడం సర్వశ్రేష్ఠం. పిల్లలున్న ఇంట హయగ్రీవ పూజ పిల్లలకు విద్యాటంకాలు తొలగించి, ఉన్నత విద్యను అందిస్తుంది. సకలైశ్వర్యాలను కలిగించే హయగ్రీవ పూజ చేయడానికి స్త్రీపురుష తారతమ్యం లేదు.కానీ ఈ రోజు ఉప్పులేని ఆహారాన్ని మాత్రం స్వీకరించాలి.

సరస్వతీదేవి కి గురువు

సరస్వతీదేవి, వేదవ్యాసుడు హయగ్రీవుని నుండి విద్యాశక్తిని సముపార్జించారని హయగ్రీవ స్తోత్రంలో దేశికాచార్యులు పేర్కొన్నారు. హయగ్రీవోపాసన వాక్‌శక్తిని, విద్యాశక్తిని, జ్ఞానశక్తిని సిద్ధింపచేస్తుంది. అందుకే శుద్ధ పూర్ణిమనాడు హయగ్రీవారాధన విశేష ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. హయగ్రీవోపాసన చేసిన వారికి సకలవిద్యలూ కరతలామలకం అవుతాయ. విశ్వశ్రేయోదాకమైన వేదాలను రాక్షసుల చేతిలో పడనీయక హరియే హయగ్రీవునిగా అవతరించిన ఈ రోజు మనం కూడా హయగ్రీవుని పూజించి ధర్మ సంస్థాపనకు మనవంతు చేయూతనిద్దాం.తన అవతార కార్యాన్ని నెరవేర్చిన స్వామి లక్ష్మీ సమేతుడై దేవతలకు దర్శనమిచ్చాడు. స్వామివారు ఈ అవతారాన్ని ధరించిన రోజు శ్రావణ పౌర్ణమి. ఈ రోజున లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామిని పూజించడం వలన విద్య - విజ్ఞానం లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి.

ఓం నమో హయగ్రీవ దేవాయ నమః

అపరాధ క్షమాపణ (aparadha kshamapana-Telugu) :శివ/మహాదేవ


అపరాధ క్షమాపణ (aparadha kshamapana) :శివ/మహాదేవ


అపరాధ క్షమాపణ (aparadha kshamapana-Telugu) :శివ/మహాదేవ


గతం పాపం గతం దుఃఖం- గతం దారిద్ర్యమేవచ | ఆగతా సుఖ సంపత్తిః -పుణ్యాశ్చ తవ దర్శనాత్ ||
 
మంత్ర హీనం క్రియా హీనం భక్తి హీనం సురేశ్వర |
యత్ పూజితం మయాదేవ పరిపూర్ణ తదస్తుమే ||
హర హర మహాదేవ యదక్షర పద భ్రష్టం | 
 మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వ క్షమ్యతాం దేవ ప్రసీద శివశంకర ||
 
మృత్యుంజయ మహా రుద్ర త్రాహిమాం శరణాగతం |
జన్మ మృత్యు జరా వ్యాధి పీఢితం కర్మ బంధనైః ||
 
మంత్రేణక్షర హీనేయ పుష్ఠేణ విఫలేనచ - పూజతోసి మహాదేవ తత్సర్వం క్షమ్యతం మమ||
 
కర చరణ కృతం  వా  క్కాయజం  కర్మజం వా- 
శ్రవణ నయనజం వా మానసం వాపరాధమ్ । 
విహితమవిహితం వా సర్వమేతత్-క్షమస్వ -
 జయ జయ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో||
 
ఆవాహనం న జానామి న జానామి తవార్చనం ।  పూజాం చైవ న జానామి క్షమస్వ పరమేశ్వరః ||
అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ | తస్మాత్ కారుణ్య భావేన రక్షరక్షో మహేశ్వరా/పార్వతీనాథః  ||

 

 

Saturday, February 15, 2025

శ్రీ మహాదేవ స్తుతిః (బ్రహ్మాదిదేవ కృతమ్) -(Sree mahaadeva Stuti/Strotram)

 

 శ్రీ మహాదేవ స్తుతిః



దేవా ఊచుః –
నమో భవాయ శర్వాయ రుద్రాయ వరదాయ చ | పశూనాం పతయే నిత్యముగ్రాయ చ కపర్దినే || 1 ||

మహాదేవాయ భీమాయ త్ర్యంబకాయ విశాంపతే | ఈశ్వరాయ భగఘ్నాయ నమస్త్వంధకఘాతినే || 2 ||

నీలగ్రీవాయ భీమాయ వేధసాం పతయే నమః | కుమారశత్రువిఘ్నాయ కుమారజననాయ చ || ||

విలోహితాయ ధూమ్రాయ ధరాయ క్రథనాయ చ | నిత్యం నీలశిఖండాయ శూలినే దివ్యశాలినే || 4 ||

ఉరగాయ సునేత్రాయ హిరణ్యవసురేతసే | అచింత్యాయాంబికాభర్త్రే సర్వదేవస్తుతాయ చ || 5 ||

వృషధ్వజాయ చండాయ జటినే బ్రహ్మచారిణే | తప్యమానాయ సలిలే బ్రహ్మణ్యాయాజితాయ చ || 6 ||

విశ్వాత్మనే విశ్వసృజే విశ్వమావృత్య తిష్ఠతే | నమోఽస్తు దివ్యసేవ్యాయ ప్రభవే సర్వసంపదామ్ || 7 ||

అభిగమ్యాయ కామ్యాయ సవ్యాపారాయ సర్వదా | భక్తానుకంపినే తుభ్యం దిశ మే జన్మనో గతిమ్ || 8 ||

ఇతి శ్రీమత్స్యపురాణే బ్రహ్మాదిదేవకృత మహాదేవస్తుతిః |