Translate

Friday, August 14, 2015

గాయత్రీ మంత్రO- Telugu meaning



గాయతాం త్రాయతే ఇతి గాయత్రి - గానము చేయువాని రక్షించేది గాయత్రి. అనగా గొంతెత్తి బిగ్గరగా రాగ భావ శృతి లయ యుక్తంగా పాడవలెను కానీ నసుగుతూ సణుగుతూ వినబడీ వినబడనట్లు ఉచ్చరించుట సరైన పద్ధతి కాదు. కాబట్టి గాయత్రీ మంత్రం గొంతెత్తి బిగ్గరగా గానం చేయవచ్చునని గాయత్రీ పద నిర్వచనం.

గాయత్రీ మంత్రం స్వరయుక్త మంత్రము. వైఖరీ వాక్కుతో పైకి ఉచ్చరించినపుడే స్వరభేదము స్పష్టముగా తెలియును కాబట్టి గాయత్రిని సుస్పష్టముగా, స్వరయుక్తముగా ఉచ్చరించవచ్చును. గాయత్రీ మంత్రములో నిర్దిష్టమైన అర్థవంతమైన వాక్య నిర్మాణము కలదు.


ఓం భూర్భువస్సువః| ఓం తత్సవితుర్వరేణ్యమ్|

భర్గో దేవస్య ధీమహి | ధియోయోనః ప్రచోదయాత్|

ఓం  : పరమాత్మ నామము

భూ : అన్నిటి ప్రాణాధారము

భువ : అందరి దుఃఖాలను దూరం చేసేది.

స్వవః :  సుఖాన్ని, ఆనందాన్నిచ్చేది

తత్ :ఆ (పరమాత్మ)

సవితు : జగత్తుకు తల్లిదండ్రులు (సర్వదేవుని యొక్క)

దేవస్య :దేవుని యొక్క

పరేణ్యం : వరించే యోగ్యమైన శ్రేష్ఠమైన

భర్గః : శుద్ధస్వరూపము (సూర్యుని ఎరుపు)

ధీమహి :  ధ్యానము చేస్తారు, ధారణ చేస్తారు

యః : సవితాదేవ, పరమాత్మ

నః : మనయొక్క

ధియః :బుద్ధుల

ప్రచోదయాత్: మంచిపనులలో వుంచుగాక

No comments:

Post a Comment