Translate

Thursday, April 20, 2023

శివకవచం- Siva kavacham in telugu

🌹🍀శుక్రాచార్యుడి ద్వారా స్తుతించబడిన అతి మహిమాన్వితమైనటువంటి శివకవచం.. 🍀🌹

 

ఒకప్పుడు రాక్షసుడైన అందకాసురుడు మరియు లోక రక్షకుడైన శివుడికి జరుగుతున్న యుద్ధంలో చనిపోతున్న రాక్షసులను మృత సంజీవని విద్య ద్వారా శుకుడు సజీవులను చేస్తూ ఉంటారు. దేవతల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న శివుడు రాక్షసుల గురువైన  శుకుడు ని మింగి వేస్తారు. తర్వాత శివుడు అంధకాసురుని చంపేశాడు. చనిపోయే ముందు అందకాసురుడు శివుని కీర్తి మహిమలను కీర్తిస్తాడు. భోళా శంకరుడైన శివుడు అతని ప్రార్థనకు మెచ్చి శివసేవకులలో నియమిస్తాడు.ఇకపోతే శుకుడు  శివుడు పొట్టలోని  ఉన్నటువంటి 14 లోకాలు, బ్రహ్మాండాలు అన్నిటినీ చూస్తూ ఒక సంవత్సర కాలం  పొట్ట లోపల తిరుగుతూ ఉండిపోతాడు. బయటికి రావాలన్నా అతడు రాలేకపోతే ఉంటాడు, వాయువుగా మరి బయటికి రావాలని ప్రయత్నిస్తాడు కానీ అతని ప్రయత్నం నెరవేరదు. అప్పుడు శివుడిని కింద తెలిపిన స్తోత్రం ద్వారా ప్రార్థన చేస్తాడు. ఈ ప్రార్థన ద్వారా శుకుడు శుక్ర కణం రూపంలో బయటకు వస్తాడు ఈ విధంగా బయటకు రావడం ద్వారా శుక్రాచార్యుడుగా పేరు పొందుతాడు.

 

ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవలసినటువంటి విషయం ఏంటంటే ఈ స్తోత్రం ఎంతో మహిమాన్వితమైనది. ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నటువంటి విషయాలు, మరియు ఎన్నో సంకటాలు, అంతేకాకుండా మనలోని నెగిటివిటీని, ఇతరుల ద్వారా ఎదురవుతున్న ఆటంకాలు కానీ చెడు దృష్టి కానీ, ఇవన్నీ కూడా ఈ స్తోత్రాన్ని స్తుతించడం ద్వారా దూరమవుతాయి. ఈ స్తోత్రాన్ని స్తుతించే వాళ్ళు శివప్రియులు అవుతారని శివపురాణంలో చెప్పబడింది..

 

🔥శివకవచం🔥

 

ఓం నమస్తే దేవేశాయ || సురాసురనమస్కృతాయ || భూతభవ్యమహాదేవాయ ||

హరితపింగళలోచనాయ ||

 బలాయ || బుద్ధిరూపిణే || వైయాఘ్రవసనాచ్ఛాదాయ || అరుణాయ ||

త్రైలోక్యప్రభవే  || ఈశ్వరాయ || హరాయ || హరితనేత్రాయ || యుగాంతకరణాయానలాయ || గణేశాయ || లోకపాలాయ || మహాభుజాయ || మహాహస్తాయ || శూలినే || మహాదంష్ట్రిణే || కాలాయ || మహేశ్వరాయ || అవ్యయాయ || కాలరూపిణే || నీలగ్రీవాయ ||  మహోదరాయ || గణాధ్యక్షాయ ||  సర్వాత్మనే || సర్వభావనాయ || సర్వగాయ ||  మృత్యుహంత్రే || పారియాత్రసువ్రతాయ || బ్రహ్మచారిణే || వేదాంతగాయ || తపొంతగాయ || పసుపతయే || వ్యంగాయ || శూలపాణయే || వృషకేతనాయ || హరయే ||

జటినే || శిఖండినే || లకుటినే || మహాయశసే || భూతేశ్వరాయ || గుహావాసినే || వీణాపణవతాలవతే || అమరాయ || దర్శనీయాయ || బాలసూర్యనిభాయ || స్మశానవాసినే || భగవతే || ఉమాపతయే || ఆరిందమాయ || భగస్యాక్షిపాతినే || పూష్ణదశననాశనాయ || క్రూరనికృంతనాయ || పాశహస్తాయ || ప్రళయకాలాయ || ఉల్కాముఖాయ || అగ్నికేతవే || మునయే || దీప్తాయ || నిశాంపతయే || ఉన్నత్తాయ || జనకాయ || చతుర్గకాయ || లోకసత్తమాయ || వామదేవాయ || వాగ్దాక్షిణ్యాయ || వామతోబిక్షవే || బిక్షురూపిణే || జటినే || స్వయంజటిలాయ || శక్రహస్తప్రతిస్తంభకాయ || క్రతవే || క్రతుకరాయ || కాలాయ || మేధావినే || మధుకరాయ || చలాయ || వాక్సత్యాయ || వాజసనేతిసమాశ్రమపూజితాయ || జగద్దాత్రే || జగత్కర్తే || పురుషాయ || శాశ్వతాయ || ధృవాయ ||ధర్మాధ్యక్షాయ || త్రివర్త్మనే || భూతభావనాయ || త్రినేత్రాయ || బహురూపాయ || సూర్యాయుతసమప్రభాయ || దేవాయ || సర్వతూర్యనినాదినే ||సర్వబాధావిమోచనాయ || బంధనాయ || సర్వధారిణే || ధర్మోత్తమాయ ||పుష్పదంతాయ || అవిభాగాయ || ముఖ్యాయ || సర్వహరాయ || హిరణ్యశ్రవసే || ద్వారిణే ||  భీమాయ || భీమపరాక్రమాయ || ఓం నమో నమః...

.

No comments:

Post a Comment