Translate

Monday, May 1, 2023

నవనాథ శాబర మంత్రం (navanaatha sabari mantra)

నవనాథ శాబర మంత్రం .

ఓం నమో ఆదేశ | గురుజీ కో ఆదేశ |పహిల గణ గణపతి |

చౌదా విద్యాంచా సారథీ | జాతి సతీ కైలాసపతి |

బలభీమ్ మారుతి | ఆలే విఘ్న నివారి | సాయి గోరఖనాథ్ కీ ద్వాహీ |

గురు కి శక్తి మేరీ భక్తి చలే మంత్ర ఈశ్వరీ వాచా | పిండ కచ్చా గురు

గోరఖనాథ కా శబ్ద సచ్చా ||

Monday, April 24, 2023

తీర్థం:అర్ధం దాని పరమార్ధం (Teertham meaning in telugu)

🙏🪷🙏🪷🙏
తీర్థం యొక్క అర్ధం దాని పరమార్ధం ఏంటో తెలుసుకోండి:
🪷🪷🪷🪷🪷
ఉదకం చందనం చక్రమ్‌ శంఖంచ తులసీదళమ్‌॥
ఘంటాం పురుష సూక్తంచ తామ్రపాత్ర మథాష్టమమ్‌॥
సాలగ్రామ శిలాచైవ నవభిస్తీర్థముచ్చతే

అంటే 
ఉదకం, చందనం, చక్రం, శంఖం, తులసీదళం, ఘంట, పురుషసూక్తం, తామ్రపాత్ర, సాలగ్రామం - ఈ తొమ్మిదింటి కలయిక వల్ల ఏర్పడే ఉదకాన్నే ‘తీర్థం’ అంటారు.

అలాగే 
భగవత్పాద తీర్థంతు నిత్యం యః పిబేత్‌నరః
ఆరోగ్యవాన్ సదా భూత్వాసాయుజ్యం లభతేమమ॥
సాలగ్రామ శిలావారి తులసీదళ సంయుతం
సర్వరోగాది శమనం సర్వపాప హరంభవేత్‌॥

అంటే 
భగవంతుడిని అభిషేకించిన లేదా నైవేద్యం పెట్టిన తీర్థాన్ని గ్రహించే మానవుడు ఆరోగ్యంగా ఉంటాడని, పరమేశ్వర సాయుజ్యాన్ని పొందుతాడని, తులసితో కూడిన సాలగ్రామ తీర్థం అన్ని రకాల రోగాలను పోగొడుతుందని మన ఆధ్యాత్మిక గ్రంధాలు చెప్తున్నాయి. సాధారణంగా గుళ్ళలోని దేవతా విగ్రహాలని కడిగిన లేదా అభిషేకించిన జలాన్ని , పాలను దేవాలయాలకి వచ్చిన భక్తులకి తీర్థంగా ఇస్తారు. కొన్ని గుళ్ళల్లో మామూలుగా తులసి, పచ్చకర్పూరం లాంటి సుగంధ ద్రవ్యాలతో తయారుచేసిన తీర్థాన్ని దేవుడికి నివేదన చేసి వచ్చిన భక్తులకు ఇస్తారు. 

భగవంతునికి నివేదించిన ఆ తీర్థాన్ని ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవిక తాపత్రయాన్ని ఉపశమించే విధంగా మూడుసార్లు ‘అకాలమృత్యుహరణం సర్వవ్యాధి నివారణం శ్రీ విష్ణుపాదోదకం లేదా శివపాదోదకం పావనం శుభం అంటూ భక్తుల చేతిలో మూడు సార్లు పోస్తారు. అలాంటి పవిత్రమైన తీర్థాన్ని కింద పడకుండా పవిత్రమైన భావనతో సేవించాలి. 

పరమాణుసమం తీర్థం
మహాపాతకనాశనం
తదైవాష్టగుణం పాపం
తద్భూమౌ పతితాయాది॥

అన్నారు .. అంటే పరమాణు సమానమైన తీర్థం మహాపాతకాలని సైతం నాశనం చెయ్యగలది. అటువంటి తీర్ధం నేల మీద ఒక్క చుక్క పడినా అది ఎనిమిది రకాల పాపాలని ఇస్తుందిట. 

వస్త్ర చతుర్గణీకృత్య పాణౌ పాణిం నిధామయ
పవిత్రం విష్ణు పాదామ్ము త్రిః పిభేద్బిన్దు వర్జితమ్‌॥

ఎడమ అరచేతి కింద అంగవస్త్రాన్ని నాలుగు మడతలుగా పెట్టుకొని దానిపై కుడిచేతిని పైన చెప్పిన విధంగా శంఖువు ఆకారంలో పెట్టుకుని నేల మీద ఒక చుక్క కూడా క్రింద పడకుండా తీర్థాన్ని స్వీకరించాలి. ముఖ్యంగా పూజారులు కూడా తీర్థాన్ని నిర్లక్ష్యంగా భక్తులకి అందించడం లాంటిది చెయ్యకూడదు. అది భక్తితో సేవించే పవిత్రమైన ఉదకం తీర్థం అని భక్తులతో పాటు అర్చకులు కూడా తెలుసుకోవాలి.

తీర్థం సేవించే సమయంలో అరచేయి మధ్య గుంట వచ్చేలా బొటన వేలు పైన చూపుడు వేలుని ఉంచుతాం. అంటే బొటన వేలుని చూపుడు వేలుతో కొంచం నొక్కిపట్టి ఉంచుతాం. అది ఒక విధంగా శంఖం ఆకారంలో కూడా కన్పిస్తుంది. శంఖంలో పోస్తే గానీ తీర్ధం కాదన్నట్టు అప్పుడు అది శంఖంలో తీర్ధం పోసినట్టే అవుతుంది కదా ! 

అసలు తీర్ధం తీసుకునేటప్పుడు చూపుడు వేలుని, బొటన వేలుని అలా అమర్చి పెట్టడంలో ఇక్కడ ఇంకో విశేషం ఉంది. అదేంటంటే. హస్తసాముద్రికం ప్రకారం బొటన వేలు ఐహికమైన సుఖ భోగాలకి, మమకారవికారాలకి కారణం అయిన శుక్రుడిది , అలాగే చూపుడు వేలు భగవత్సమానుడు జ్ఞానప్రదాత అయిన గురువుది. అందువలన పవిత్రమైన, పాపహారణమైన ఆ తీర్ధాన్ని తాకి లేదా అందులో మునిగి ఐహికమైన వాంఛలని పోగొట్టుకోమ్మంటూ అవన్నీ దైవసమాన మైన గురువు అనుగ్రహం, దీవెన ఉంటేనే పోతాయనే భావంతోనే గురువైన చూపుడు వేలుతో శుక్రుడైన బోటనవేలుని మడిచి నొక్కి పెడతారు. తీర్ధం ఇవ్వడం పుచ్చుకోవడం వెనక ఇంత విషయం ఉంది.

సర్వేజనా సుఖినోభవంతు.
గో బ్రాహ్మణేభ్యః శుభం భవంతు.
🙏🪷🙏🪷🙏

Thursday, April 20, 2023

శివకవచం- Siva kavacham in telugu

🌹🍀శుక్రాచార్యుడి ద్వారా స్తుతించబడిన అతి మహిమాన్వితమైనటువంటి శివకవచం.. 🍀🌹

 

ఒకప్పుడు రాక్షసుడైన అందకాసురుడు మరియు లోక రక్షకుడైన శివుడికి జరుగుతున్న యుద్ధంలో చనిపోతున్న రాక్షసులను మృత సంజీవని విద్య ద్వారా శుకుడు సజీవులను చేస్తూ ఉంటారు. దేవతల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న శివుడు రాక్షసుల గురువైన  శుకుడు ని మింగి వేస్తారు. తర్వాత శివుడు అంధకాసురుని చంపేశాడు. చనిపోయే ముందు అందకాసురుడు శివుని కీర్తి మహిమలను కీర్తిస్తాడు. భోళా శంకరుడైన శివుడు అతని ప్రార్థనకు మెచ్చి శివసేవకులలో నియమిస్తాడు.ఇకపోతే శుకుడు  శివుడు పొట్టలోని  ఉన్నటువంటి 14 లోకాలు, బ్రహ్మాండాలు అన్నిటినీ చూస్తూ ఒక సంవత్సర కాలం  పొట్ట లోపల తిరుగుతూ ఉండిపోతాడు. బయటికి రావాలన్నా అతడు రాలేకపోతే ఉంటాడు, వాయువుగా మరి బయటికి రావాలని ప్రయత్నిస్తాడు కానీ అతని ప్రయత్నం నెరవేరదు. అప్పుడు శివుడిని కింద తెలిపిన స్తోత్రం ద్వారా ప్రార్థన చేస్తాడు. ఈ ప్రార్థన ద్వారా శుకుడు శుక్ర కణం రూపంలో బయటకు వస్తాడు ఈ విధంగా బయటకు రావడం ద్వారా శుక్రాచార్యుడుగా పేరు పొందుతాడు.

 

ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవలసినటువంటి విషయం ఏంటంటే ఈ స్తోత్రం ఎంతో మహిమాన్వితమైనది. ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నటువంటి విషయాలు, మరియు ఎన్నో సంకటాలు, అంతేకాకుండా మనలోని నెగిటివిటీని, ఇతరుల ద్వారా ఎదురవుతున్న ఆటంకాలు కానీ చెడు దృష్టి కానీ, ఇవన్నీ కూడా ఈ స్తోత్రాన్ని స్తుతించడం ద్వారా దూరమవుతాయి. ఈ స్తోత్రాన్ని స్తుతించే వాళ్ళు శివప్రియులు అవుతారని శివపురాణంలో చెప్పబడింది..

 

🔥శివకవచం🔥

 

ఓం నమస్తే దేవేశాయ || సురాసురనమస్కృతాయ || భూతభవ్యమహాదేవాయ ||

హరితపింగళలోచనాయ ||

 బలాయ || బుద్ధిరూపిణే || వైయాఘ్రవసనాచ్ఛాదాయ || అరుణాయ ||

త్రైలోక్యప్రభవే  || ఈశ్వరాయ || హరాయ || హరితనేత్రాయ || యుగాంతకరణాయానలాయ || గణేశాయ || లోకపాలాయ || మహాభుజాయ || మహాహస్తాయ || శూలినే || మహాదంష్ట్రిణే || కాలాయ || మహేశ్వరాయ || అవ్యయాయ || కాలరూపిణే || నీలగ్రీవాయ ||  మహోదరాయ || గణాధ్యక్షాయ ||  సర్వాత్మనే || సర్వభావనాయ || సర్వగాయ ||  మృత్యుహంత్రే || పారియాత్రసువ్రతాయ || బ్రహ్మచారిణే || వేదాంతగాయ || తపొంతగాయ || పసుపతయే || వ్యంగాయ || శూలపాణయే || వృషకేతనాయ || హరయే ||

జటినే || శిఖండినే || లకుటినే || మహాయశసే || భూతేశ్వరాయ || గుహావాసినే || వీణాపణవతాలవతే || అమరాయ || దర్శనీయాయ || బాలసూర్యనిభాయ || స్మశానవాసినే || భగవతే || ఉమాపతయే || ఆరిందమాయ || భగస్యాక్షిపాతినే || పూష్ణదశననాశనాయ || క్రూరనికృంతనాయ || పాశహస్తాయ || ప్రళయకాలాయ || ఉల్కాముఖాయ || అగ్నికేతవే || మునయే || దీప్తాయ || నిశాంపతయే || ఉన్నత్తాయ || జనకాయ || చతుర్గకాయ || లోకసత్తమాయ || వామదేవాయ || వాగ్దాక్షిణ్యాయ || వామతోబిక్షవే || బిక్షురూపిణే || జటినే || స్వయంజటిలాయ || శక్రహస్తప్రతిస్తంభకాయ || క్రతవే || క్రతుకరాయ || కాలాయ || మేధావినే || మధుకరాయ || చలాయ || వాక్సత్యాయ || వాజసనేతిసమాశ్రమపూజితాయ || జగద్దాత్రే || జగత్కర్తే || పురుషాయ || శాశ్వతాయ || ధృవాయ ||ధర్మాధ్యక్షాయ || త్రివర్త్మనే || భూతభావనాయ || త్రినేత్రాయ || బహురూపాయ || సూర్యాయుతసమప్రభాయ || దేవాయ || సర్వతూర్యనినాదినే ||సర్వబాధావిమోచనాయ || బంధనాయ || సర్వధారిణే || ధర్మోత్తమాయ ||పుష్పదంతాయ || అవిభాగాయ || ముఖ్యాయ || సర్వహరాయ || హిరణ్యశ్రవసే || ద్వారిణే ||  భీమాయ || భీమపరాక్రమాయ || ఓం నమో నమః...

.

అక్షయతృతీయ ప్రాముఖ్యత (Akshaya Tritiya -Telugu)

అక్షయతృతీయ

 

 అక్షయతృతీయ రోజు బంగారం కోన మని ఏ శాస్త్రం లో లేదు . వీలైతే బ్రాహ్మణుల కు స్వయం పాకం ఇవ్వండి , బీద వాళ్లకు భోజనం పెట్టండి. ఇంట్లో కులదేవతను పూజ చేసుకోండి. అక్షయ్తృతీయ విశేషం ఏంటి తెలుసుకుందాము.

1.పరశురాముని జన్మదినం

2. పవిత్ర గంగా నది భూమిని తాకిన పర్వదినం

3. త్రేతాయుగం మొదలైన దినం

4. శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుని కలుసుకొన్న దినం

5. వ్యాస మహర్షి “మహా భారతము”ను, వినాయకుని సహాయముతో, వ్రాయడం మొదలుపెట్టిన దినం

6. సూర్య భగవానుడు అజ్ఞాతవాసములో వున్న పాండవులకు “అక్షయ పాత్ర” ఇచ్చిన దినం

 7. శివుని ప్రార్థించి కుబేరుడు శ్రీమహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమింపబడిన దినం

8. ఆదిశంకరులు “కనకధారాస్తవం” ను చెప్పిన దినం 9. అన్నపూర్ణా దేవి తన అవతారాన్ని స్వీకరించిన దినం

10. ద్రౌపదిని శ్రీకృష్ణుడు దుశ్శాసనుని బారినుండి కాపాడిన దినం. 11.సింహాద్రి అప్పన్న చందనోత్సవం కూడా ఆ రోజే జరుగుతుంది 

 

Sunday, April 9, 2023

లలిత అమ్మ సాధన (lalitha amma- telugu

 లలిత అమ్మ సాధన

1.    ఓం ఐం హ్రీం శ్రీం సాకిణ్యాంబ స్వరూపిణ్యేనమః

2.    ఓం ఐం హ్రీం శ్రీం కాకిని రూపధారిణ్యేనమః

3.    ఓం ఐం హ్రీం శ్రీం లాకిన్యాంబా స్వరూపిణ్యేనమః

4.     ఓం ఐం హ్రీం శ్రీం రాకిన్యంబా స్వరూపిణ్యేనమః

5.    ఓం ఐం హ్రీం శ్రీం ఢాకినీశ్వర్యెనమః

6.    ఓం ఐం హ్రీం శ్రీం హాకిని రూపధారిణ్యేనమః

7.    ఓం ఐం హ్రీం శ్రీం యాకిన్యాంబా స్వరూపిణ్యేనమ।

మహా మృత్యుంజయ మంత్రం (Mahaa Mrutyunjaya Mantram Telugu)

 మహా మృత్యుంజయ మంత్రం :

ఓం ! త్రయంబకం యజామహే !  సుగంధిమ్ పుష్టి వర్ధనం !

ఊర్వరుకమివా బంధనన్ ! మృత్యోర్ ముక్షి యమామృతాత్ !

 

మృత్యుంజయ రుద్రాయ :

మృత్యుంజయ రుద్రాయ నీలకంఠాయ శంభవే  !అమృతేశాయ సర్వాయ  మహాదేవయదే నమః

 

బీజ మంత్రం :

*** ఓం జుం సః ****

 

 

Friday, April 7, 2023

కామాఖ్య కాళి కవచం: Kamakhya Kaali Kavacham In Telugu

 

కామాఖ్య కాళి కవచం



నారద ఉవాచ: కవచం కిదృశం దేవ్యా మహాభయ నివర్తకం

శ్రీమహాదేవ ఉవాచ:

కామాఖ్యాయాస్తు తద్రూహి సాంప్రతాం మే మహేశ్వరః

శృణుష్వ, పరమం గుహ్యం మహాభయ నివర్తకం కామాఖ్యాయా మునిశ్రేష్ఠ కవచం సర్వమంగళం యస్యస్మరణమాత్రేణ యోగినీ డాకినీ గణాః రాక్షసా విఘ్నకారిణ్యో యాశ్చాన్యాశ్చాపరికారిణః క్షుత్పిపాసా తధానిద్రా తధాన్యేయేచ విఘ్నదాః దూరాదపి పలాయంతే కవచస్య ప్రసాదతః నిర్బయో జాయతే మర్త్య స్తేజస్వీ భైరవోపమః

 

 

సమాసక్త మనశ్చాపి జపహోమాదికర్మసు భవేచ్ఛమంత్రతంత్రాణాం నిర్విఘ్నేన చ సిద్ధిదౌ

మూలం: ప్రాచ్యాం రక్షతుమే తారా కామరూప నివాసినీ ఆగ్నేయాం షోడసీపాతు యామ్యాం ధూమావతీ స్వయం నైరుత్యాం భైరవీపాతు వారుణ్యాం భువనేశ్వరీ వాయవ్యాం సతతం పాతు ఛిన్నమస్తా మహేశ్వరీ కౌబేర్యాం పాతు మే దేవీ విద్యా శ్రీబగళాముఖీ

 

ఐశాన్యాం పాతు మే నిత్యం మహాత్రిపురసుందరీ ఊర్ధ్వం రక్షతు మే విద్యా మాతంగీ పీఠవాసినీ సర్వతః పాతు మాం నిత్యం కామాఖ్యా కాళికాస్వయం బ్రహ్మరూపా మహావిద్యా, సర్వవిద్యామయీ స్వయం శీర్షం రక్షతు మే దుర్గా, ఫాలం శ్రీ భవగేహినీ త్రిపురా భ్రూయుగే పాతు శర్వాణీ పాతు నాసికాం చక్షుర్ చండికాపాతు శ్రోత్రే లీలా సరస్వతీ ముఖం సౌమ్యముఖీ పాతు గ్రీవాం రక్షతు పార్వతీ

 

జిహ్వాం రక్షతు మే దేవీ జిహ్వా లలన భీషణా వాగ్దేవీ వచనం పాతు వక్షః పాతు మహేశ్వరీ బాహూ మహాభుజాపాతు కరాంగుళ్యస్సురేశ్వరీ పృష్ఠతః పాతు భీమాస్యా కటిందేవీ దిగంబరీ ఉదరం పాతు మే నిత్యం మహావిద్యామహోదరీ ఉగ్రతారా మహాదేవీ జంఘేరూ పరిరక్షతు గుదే లింగేచ మేడ్రే చ నాభ్చ సురసుందరీ పాదాంగుళ్యాం సదాపాతు భవానీ త్రిదశేశ్వరీ రక్తమాంసాస్తి మజ్జాదీన్ పాతు దేవీ శవాసనా మహాభయేషు ఘోరేషు మహాభయ నివారిణీ

 

పాతు దేవీ మహామాయా కామాఖ్యా పీఠవాసిని భస్మాచలగతా దివ్య సింహాసనాకృతాశ్రయా పాతు శ్రీకాళికాదేవీ సర్వోత్పాతేషు సర్వదా రక్షాహీనంతుయత్ స్థానం కవచే నాభివర్జితం తత్సర్వం సర్వదాపాతు సర్వరక్షణ కారిణీ ఇదంతు పరమం గుహ్యం కవచం మునిసత్తమ కామాఖ్యా యామయోక్తం తే సర్వరక్షాకరంపరం అనేన కృత్వారక్షంతు నిర్భయస్సాధకోభవేత్ నతం స్పృశేత్ భయం ఘోరం మంత్రసిద్ధివిబోధకం nn జాయతేచ మనోసిద్ధి ర్నిర్విఘ్నేన మహామతే

 

ఇదం యోధారయేత్కంఠే బాహౌవా కవచం మహత్ అవ్యాహతస్సభవేత్ సర్వవిద్యావిశారదః సర్వత్రలభతే సౌఖ్యం మంగళం చ దినేదినే యఃపఠేత్ ప్రియతోభూత్వా కవచంచే దమద్భుతం సదేవ్యాః పదవీంయాతి సత్యం సత్యం న సంశయః