Translate

Tuesday, December 31, 2024

విశ్వామిత్ర ( Viswamitra telugu NOtes )


విశ్వామిత్ర మహర్షి

ఓం హ్రీం పూర్ణ సాఫల్య సిద్దిం హ్రీం నమః


విశ్వామిత్ర మహర్షి పేరు ప్రఖ్యాతలు ప్రపంచ విఖ్యాతమే. ‘జగమెరిగిన బ్రాహ్మణుడుకి జంధ్యమేలా అనే సామెత తెలుగు నాట రోజూ వనబడేదే. అలాంటిదే విశ్వామిత్రునిగురించి చెప్పుకోవటం. కానీ మహర్షుల, మహా తపస్సంపన్నుల, మంత్రవేత్తల చరిత్రలను మననం చేసుకుంటేనే మనోల్లాసం, మన: సంతౄప్తి కదా. ఆ మంత్ర వేత్తని స్మరించాలని ఆకాంక్ష!


మహర్షి విశ్వామిత్రుని జన్మవౄత్తాంతం మహాభారతంలోనూ, పురాణాలలోను కూడా చెప్పబడింది. ఈయన మహా తపస్సంపన్నుడైన భౄగుమహర్షి సుపుత్రుడు రుచీకుని యొక్క కుమారుడు. ఈయన జన్మమే విలక్షణంగా అయింది. ఈయన మాతామహుడు గాధి అనే మహారాజు. ఆయనకి సత్యవతి అనే సద్గుణ సంపన్నురాలు ఏకైక కుమార్తె. ఆ కుమార్తెకు రుచీకునికిచ్చి వివాహం చేశాడు. ఆవిడ మహాపతివ్రత. సౌందర్యరాశి. భర్తకి ఏలోటూ రాకుండా ఆయన మనసెరిగి మసలుకొంటూవుండేది. ఆవిడ పతిభక్తికి మెచ్చి రుచీకుడొకనాడు యజ్ణ్జము చేసినటువంటి చెరుకుని తీసుకొచ్చి మంత్రించి భార్యయైన సత్యవతికి యిచ్చి ‘దేవి! నీ తండ్రికి పుత్రసంతానం లేదుకదా! ఈ చెరుకు రెండుభాగాలుగా అభిమంత్రించి పట్తుకొచ్చాను. యిందు ఒకటి నువ్వు భుజించు.


నీకు మహా తపోసంపన్నుడైన పుత్రుడు పుడతాడు. రెండవది నీ తల్లికియ్యి. ఆ మహారాణికి క్షత్రియ శక్తిసంపన్నుడైన పరాక్రమవంతుడైన కొడుకు పుడతాడూ అని చెప్పాడు. సత్యవతి ఆ రెండు చెరుకూ భాగాలనీ చూచి చాలా ఆనందించింది. తల్లిదండ్రులు వస్తే ఆమె తల్లికి ఆ రెండు భాగాలుయిచ్చి చూపించి వాటి ప్రభావం చెప్పింది.దైవయోగంచేత సత్యవతి తీసుకోవలసిన భాగం ఆమె తల్లి తీసుకోవలసిన సగం సత్యవతి భక్షించింది. కాలగర్భంలో యిద్దరూ గర్భవతులయ్యారు. తపోధనుడైన రుచీకుడు తన తపశ్శక్తిచే జరిగిన పొరపాటు గ్రహించగలిగాడు. దైవవిధిగా భావించాడు. సత్యవతికి జమదగ్ని పుట్టాడు. అతనికి పరశురామ భగవానుడు పుట్టాడు. గాధిపత్నికి యజ్ణ్జ చెరుకు ప్రభావంతో మహర్షి విశ్వామిత్రుడు పుట్టాడు. ఆ విశ్వామిత్రునికి చాలామంది పుత్రులు పుట్టారు. అదే కుశక వంశంగా వర్ధిల్లింది.


విశ్వామిత్రుని విజయాలువిశ్వామిత్రుడు పట్టుదల, దీక్ష, తపోనిష్టా గరిష్టుడు. దీక్షతో సాధించలేనిది లేదని లోకానికి చెప్పేందుకే ఈయన చరిత్ర సాక్ష్యం. మనస్సు లగ్నం చేసి అనేక మార్లు తపస్సు చేసి బ్రహ్మని మెప్పించి రాజర్షి పదవిలోంచి బ్రహ్మర్షి స్థానం పొంది లోకపూజ్యుడయ్యాడు. సప్తర్షులలో అగ్రగణ్యుడయ్యాడు. ౠషిశ్రేష్ఠులందరి చేత వందనీయుడయ్యాడు. ఆయన తపశ్శక్తి చేత సమాధి నిష్ఠాగరిష్ఠత చేత అనేక మంత్రార్థాలు కొత్త కొత్త మంత్రాల దర్శనం కూడా పొందాడు. యిన్ని మంత్రాల ద్రష్ట విశ్వామిత్రుడు ఒక్కడే. అందుకే ఆయనవి మంత్రద్రష్టా ౠషి అంటారు. ౠగ్వేదంలో పది మండలాలలో మూడవమండలమును వైశ్వామిత్ర మండలం అంటారు. యిందులో 62 సూక్తులు వున్నాయి.


ఈ మంత్రాలన్నీ విశ్వామిత్రుడు చేసినవే. ఈ తౄతీయ మండలంలో ఇంద్ర, అదితి, అగ్నిపూజ, ఉష, అశ్వనీ, రుభు, మొదలుగువారి స్తోత్రాలున్నాయి. మళ్ళీ అనేక జ్ణ్జాన విజ్ణ్జాన ఆధ్యాత్మిక విషయాలు కూడా ఉన్నాయి. గోమాత వర్ణన ప్రాశస్త్యాలు వున్నాయి.ఈ వైశామిత్ర మండలములో బ్రహ్మ గాయత్రీ మహామంత్రానీ చూచి ప్రజలకి, లోకానికి చూపించాడు. ఆయన వల్లనే గాయత్రీ మహామంత్రం పైకి తౄతీయ మండలంలో 62వ సూక్తిలో 10వ మంత్రం గాయత్రీ మహామంత్రంగా విఖ్యాతిగాంచింది.‘ఓం భూర్ భువ స్వ:తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్ ‘విశ్వామిత్రుడు లేకపోతే ఈ గాయత్రీ మహామంత్రం మనకి లభ్యమయ్యేది కాదు. ఈ మహామంత్రం వేదమంత్రాలకి మూలం . అన్ని మంత్రాలకీ బీజం. ఈ మంత్రానికున్న శక్తి అపారమైంది. ఉపనయనములో ఈ మహామంత్రాన్ని తండ్రి వటువు చెవిలో ఉపదేశించి ‘ద్విజత్వాన్నీ ప్రసాదిస్తాడు.


విశ్వామిత్ర మహర్షి యొక్క దయవల్లనే ప్రతిరోజు సంధ్యావందనములో ఉభయ సంధ్యలందు ఈ మహామంత్రాన్ని జపించి బుద్ధిబలం, యశం అన్నీ పొంది తరిస్తున్నారు ప్రజలు.విశ్వామిత్రుడు సమ్హిత, విశ్వామిత్ర స్మౄతి అనే గ్రంథములలో గాయత్రీదేవి యొక్క ఆరాధన, వర్ణన కూడా సొగసుగా చేశాడు. గాయత్రీ మహామంత్ర జపంతో అన్ని మంత్రాల యొక్క జపసిద్ధి కలుగుతుంది.విశ్వామిత్ర మహర్షి తపస్సంపన్నుడు. ఆయనకి గాయత్రీ మాత అనుగ్రహం వల్లనే ప్రతిసౄష్టి చేయగలిగిన అపరబ్రహ్మ కాగలిగాడు.భగవత్రీ గాయత్రీ మాత రూపు ఏమిటి? స్వరూపమేమిటి? ఆరాధన ఎలా చేయాలి? ఈ విషయాలన్నీ మనకి తెలియచేసిన ప్రథమ గురువు విశ్వామిత్ర మహర్షే. ఆవిడ ఈ చరాచర జగత్తు నడిపే తల్లి. స్థూల, సూక్ష్మ భేధాలన్నీ ఆ తల్లి విగ్రహమే. ఉపాసన ధ్యానములు యొక్క దౄష్టిచేత ఆవిడ మూల స్వరూపమేమిటి? అనే విషయాన్ని ఆయన వ్రాసిన ఈ శ్లోకమే చెబుతుంది


.శ్లో!! ముక్తా విద్రుమహేమనీల ధవళ ఛాయైర్ముఖై:
స్త్రీ క్షణై:యుక్తా మిందు నిబద్దరత్నమకుటాం తత్వార్ధ
వర్ణాత్మికాంగాయత్రీం వరదాభయాంకుశ కశాంశుభ్రం
కపాలం గుణాంశంఖం చక్ర మధారవిందయుగళం హస్తెర్వహంతీం భజే!!


ఆతల్లి ముత్యాలు, మణిమాణిక్యాలు, ముంగాలు, బంగారం, నీలమణి, ఉజ్వల కాంతితో సమానమైనన ఐదు ముఖాలతో మెరుస్తూంటుంది. ఆవిడ మూడునేత్రాలతో విరాజిల్లుతోంది. ఆవిడ ముఖకాంతి అనుపమానం. ఆవిడ రత్న మయకిరీటంలో చంద్రుడు ప్రకాశిస్తుంటాడు. ఆవిడ 24 కాంతులతో ప్రకాశిస్తుంటుంది. ఆవిడ వరప్రదాయిని. గాయత్రీ చేతులలో అంకుశము, వరముద్ర కుశ, పాశ, శుభ్రం కపాలము, గద, శంఖం, చక్రం, రెండు కమలాలనీ ధరిస్తుంది. ఆవిడని ధ్యానించగల మహా సంపదని శ్రీ విశ్వామిత్ర మహర్షి ప్రజలకి చల్పించాడు.ఆయన భక్తేకాదు, శ్రీరామచంద్రుడం తటివానికి ‘బల, అతిబలా అనే మహా ఆస్త్రాలని ఉపదేశించగల విలుకాడు. అన్ని శాస్త్రార్థాలనీ విశదీకరించి చెప్పాడు. జగద్గురుదేవులకే గురువయ్యాడు.


శాంత స్వరూపుడైన వశిష్ఠునితో నందినీ ధేనువు కోసంవివాదం పెట్టుకోవటం అయింది. అది కూడా లోకానికి పాఠం చెప్పటంలో భాగమే. ఆ కథవల్ల గోమహిమ లోకవిదితమైంది. తపస్సుకెంత శక్తివుందో మానవకోటికి అర్ధమైంది. దౄఢ నిశ్చయంతో పురుషుడెలా విజయం సాధించాలో విదతమైంది. వ్యక్తి మోహపాశాలు పనికిరావనే హెచ్చరిక కనబడుతోంది. రాక్షస ప్రవౄత్తి విడిచి దైవ సంపద చేకొనాలని నేర్చుకొంటారు ప్రజలు. కామక్రోధాలవల్ల వచ్చే అరిష్టం తెలుస్తోంది. మోహపాశాల వల్ల వచ్చే అనర్థాలు బోధపడుతున్నాయి. ఎప్పటి వరకు మానవులు అరిషడ్వార్గాలని విడవడో అప్పటి వరకు దు:ఖం తప్పదు. అనే సత్యం తెలుస్తోంది.దైవి సంపదవల్ల వచ్చే లాభాలు కూడా ఆయనచరిత్ర చెప్పింది. బ్రహ్మదేవుని గురించి దీక్షగా తపస్సు చేస్తే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై బ్రహ్మర్షి అనే బిరుదు ప్రదానం చేశాడు. అప్పుడు వశిష్ఠమహర్షి ఆయన్ని కౌగలించుకున్నాడు.


దేవతలు వారిద్దరి కలయికకి అనందించి పుష్పవర్షం కురిపించారు.హరిశ్చంద్ర మహారాజుని పరీక్షించినప్పుడు ఆయన క్రూరమైన పాత్ర వహించినట్లు కనబడుతుంది. కాని ఆయన హరిశ్చంద్రుని సత్యవ్రత దీక్ష విశ్వవ్యాప్తం చేయాలని, దానివల్ల హరిశ్చంద్రుని కీర్తి ఆచంద్రార్కం భూలోకలో నిలవాలనే సత్సంకల్పమే. ఆయనకి కక్షేవుంటే లోహితాస్యుణ్ణి మళ్ళీ బతింకిచేవాడు కాదు.ఐతరేయ బ్రాహ్మణములో విశ్వామిత్రుడు, శునశ్చేపుల వౄత్తాంతం చెప్పబడింది. అక్కడా కూడా విశ్వామిత్రమహర్షి యొక్క ప్రస్తావన వచ్చింది. ఆయన గోత్రీకులు చాలా మేధావంతులు, మహాత్ములు. ప్రపంచ రహస్యాలన్నీ యెరిగిన జ్ణ్జానులు. కౌశికస, వైశ్వామిత్ర గోత్రాలకి అధిపది ఆయనే. విశ్వామిత్రుడు సమర్ధుడు. అతీంద్రయ ద్రష్ట. అధ్వర్యం చేయటంలో నిష్ణాతుడు. సుదాసు మహారాజు యజ్ణ్జానికి అధ్వర్యం వహించిన మహా విద్వాంసుడు. యజ్ణ్జకర్త. ఆ మహామునీశ్వరుని గురించి మనకెంత తెలిసినా అల్పమే అవుతుంది

 

అగస్త్య ధ్యాన మంత్రం (Agastya mantra in Telugu)

      అగస్త్యధ్యాన మంత్రం 



ఓం హ్రీం ఆవరణ పదాత్మజాయ అగస్త్య స్వాహా..! 




Milarepa

 





PadmaSambava

 PadmaSambava


బ్రహ్మ ధ్యాన మంత్రం Brahma Mantra in Telugu)

                                           బ్రహ్మ ధ్యాన మంత్రం



 

ఓం ఓం ఓం ఆం ఆం

బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మ పాలయమాం సత్వ గుణో

రక్ష రక్ష హ్రీం స్వాహ...!

{రుద్రయామళ 573}

దశ మహా విద్యలు (Dusmahaadivyas telugu- intro)

 దశ మహా విద్యలు (Dusmahaadivyas  telugu- intro)

సహస్రార చక్రం (Sahasrara Chakra Telugu)

 సహస్రార చక్రం (Sahasrara Chakra Telugu) 


శ్రీ భువనేశ్వరీ కవచం-( Bhuvanewari Rahska Kavcham telugu)

శ్రీ భువనేశ్వరీ కవచం-( Bhuvanewari Rahska Kavcham telugu)



Chittam

 Chittam

సదాశివ ధ్యానం (SadaSiva Dhyana Mantram)

సదాశివ ధ్యానం



(Page 412 & 422)




Siddi-

 Siddi-

Thursday, December 26, 2024

నిత్య పూజ ( nitya pooja process Telugu)


శరీర శుద్ధి (1)

శ్లో॥ అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం గతోఽపివా ।
యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతరశ్శుచిః ॥

భూతోచ్చాటన (2)
ఉత్తిష్ఠంతు । భూత పిశాచాః । యే తే భూమిభారకాః ।
యే తేషామవిరోధేన । బ్రహ్మకర్మ సమారభే । ఓం భూర్భువస్సువః ।

ఆచమనం (3)

ఓం ఆచమ్య । ఓం కేశవాయ స్వాహా । ఓం నారాయణాయ స్వాహా । ఓం మాధవాయ స్వాహా । ఓం గోవిందాయ నమః । 

ప్రాణాయామం (4)
ఓం భూః । ఓం భువః । ఓగ్ం సువః । ఓం మహః । ఓం జనః । ఓం తపః । ఓగ్ం స॒త్యమ్ ।
ఓం తథ్స॑వి॒తుర్వరే
ణ్యం॒ భర్గో॑ దే॒వస్య॑ ధీమహి । ధియో॒ యో నః॑ ప్రచోదయాత్ ॥
ఓమాపో॒ జ్యోతీ॒ రసో॒ఽమృతం॒ బ్రహ్మ॒ భూ-ర్భువ॒-స్సువ॒రోమ్ ॥ (తై. అర. 10-27)

సంకల్పం (5)
మమోపాత్త, దురితక్షయద్వారా, శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, శుభే, శోభనేముహూర్తే, మహావిష్ణోరాజ్ఞయా, ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయపరార్థే, శ్వేతవరాహకల్పే, వైవశ్వతమన్వంతరే, కలియుగే, ప్రథమపాదే, జంభూద్వీపే, భరతవర్
షే, భరతఖండే, అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ------- సంత్సరే ------ అయనే ------- ఋతౌ ------- మాసే ------- పక్షే ------- తిధౌ ------ వాసరే -------- శుభనక్షత్రే (భారత దేశః - జంబూ ద్వీపే, భరత వర్షే, భరత ఖండే, మేరోః దక్షిణ/ఉత్తర దిగ్భాగే; అమేరికా - క్రౌంచ ద్వీపే, రమణక వర్షే, ఐంద్రిక ఖండే, సప్త సముద్రాంతరే, కపిలారణ్యే) శుభయోగే శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభతిథౌ శ్రీమాన్ -------- గోత్రస్య ------- నామధేయస్య (వివాహితానాం - ధర్మపత్నీ సమేతస్య) శ్రీమతః గోత్రస్య మమోపాత్తదురితక్షయద్వారా శ్రీపరమేస్వర ప్రీత్యర్ధం మమ సకల శ్రౌతస్మార్త నిత్యకర్మానుష్ఠాన యోగ్యతాఫలసిధ్యర్ధం నూతన యజ్ఞోపవీతధారణం కరిష్యే ।

 

దుర్గా సూక్తం (Durga Suktam Telugu)






దుర్గా సూక్తం (Durga Suktam Telugu) 



ఓమ్ ॥ జా॒తవే॑దసే సునవామ॒ సోమ॑ మరాతీయ॒తో నిద॑హాతి॒ వేదః॑ ।
స నః॑ పర్-ష॒దతి॑ దు॒ర్గాణి॒ విశ్వా॑ నా॒వేవ॒ సింధుం॑ దురి॒తాఽత్య॒గ్నిః ॥

తామ॒గ్నివ॑ర్ణాం॒ తప॑సా జ్వలం॒తీం-వై ॑రోచ॒నీం క॑ర్మఫ॒లేషు॒ జుష్టామ్ ।
దు॒ర్గాం దే॒వీగ్ం శర॑ణమ॒హం ప్రప॑ద్యే సు॒తర॑సి తరసే॒ నమః॑ ॥

అగ్నే॒ త్వం పా॑రయా॒ నవ్యో॑ అ॒స్మాంథ్స్వ॒స్తిభి॒రతి॑ దు॒ర్గాణి॒ విశ్వా
పూశ్చ॑ పృ॒థ్వీ బ॑హు॒లా న॑ ఉ॒ర్వీ భవా॑ తో॒కాయ॒ తన॑యాయ॒ శం
యోః ॥

విశ్వా॑ని నో దు॒ర్గహా॑ జాతవేదః॒ సింధు॒న్న నా॒వా దు॑రి॒తాఽతి॑పర్-షి ।
అగ్నే॑ అత్రి॒వన్మన॑సా గృణా॒నో
ఽస్మాకం॑ బోధ్యవి॒తా త॒నూనామ్ ॥

పృ॒త॒నా॒ జిత॒గ్ం॒ సహ॑మానము॒గ్రమ॒గ్నిగ్ం హు॑వేమ పర॒మాథ్స॒ధస్థాత్ ।
స నః॑ పర్-ష॒దతి॑ దు॒ర్గాణి॒ విశ్వా॒ క్షామ॑ద్దే॒వో అతి॑ దురి॒తాఽత్య॒గ్నిః ॥

ప్ర॒త్నోషి॑ క॒మీడ్యో॑ అధ్వ॒రేషు॑ స॒నాచ్చ॒ హోతా॒ నవ్య॑శ్చ॒ సత్సి॑ ।
స్వాంచా
ఽగ్నే త॒నువం॑ పి॒ప్రయ॑స్వా॒స్మభ్యం॑ చ॒ సౌభ॑గ॒మాయ॑జస్వ ॥

గోభి॒ర్జుష్ట॑మయుజో॒ నిషి॑క్తం॒ తవేంద్ర విష్ణో॒రను॒సంచ॑రేమ ।
నాక॑స్య పృ॒ష్ఠమ॒భి సం॒
సా॑నో॒ వైష్ణ॑వీం-లో॒క ఇ॒హ మా॑దయంతామ్ ॥

ఓం కా॒త్యా॒య॒నాయ॑ వి॒ద్మహే॑ కన్యకు॒మారి॑ ధీమహి । తన్నో॑ దుర్గిః ప్రచో॒దయాత్ ॥

ఓం శాంతిః॒ శాంతిః॒ శాంతిః॑ ॥

 



క్రిమి సంహారక సూక్తం (Krimi Samhara Suktam)

 




               క్రిమి సంహార సూక్తం

                                                            (యజుర్వేద- కృ.య.తై.ఆ.4.36.1)


అత్రి॑ణా త్వా క్రిమే హన్మి । కణ్వే॑న జ॒మద॑గ్నినా ।
వి॒శ్వావ॑సో॒ర్బ్రహ్మ॑ణా హ॒తః । క్రిమీ॑ణా॒గ్ం॒ రాజా

అప్యే॑షాగ్ స్థ॒పతి॑ర్
హ॒తః । అథో॑ మా॒తాఽథో॑ పి॒తా ।
అథో
స్థూ॒రా అథో క్షు॒ద్రాః । అథో॑ కృ॒ష్ణా అథో శ్వే॒తాః ।
అథో॑ ఆ॒శాతి॑కా హ॒తాః । శ్వే॒తాభి॑స్స॒హ సర్వే॑ హ॒తాః ॥ 36

ఆహ॒రావ॑ద్య ।
శృ॒తస్య॑ హ॒విషో॒ యథా
। తత్స॒త్యమ్ ।
యద॒ముం-య
॒మస్య॒ జంభ॑యోః ।
ఆద॑ధామి॒ తథా॒ హి తత్ । ఖణ్ఫణ్మ్రసి॑ ॥ 37

ఓం శాంతిః శాంతిః శాంతిః ।

అగ్ని సూక్తం (Agni Suktam in Telugu)




 అగ్ని సూక్తం (ఋగ్వేద)

(ఋ.వే.1.1.1)

అ॒గ్నిమీ॑ళే పు॒రోహి॑తం-య॒జ్ఞస్య॑ దే॒వమృ॒త్విజ॑మ్ । హోతా॑రం రత్న॒ధాత॑మమ్ ॥ 1

అ॒గ్నిః పూర్వే॑భి॒ర్ఋషి॑భి॒రీడ్యో॒ నూత॑నైరు॒త । స దే॒వా।ణ్ ఏహ వ॑క్షతి ॥ 2

అ॒గ్నినా॑ ర॒యిమ॑శ్నవ॒త్పోష॑మే॒వ ది॒వేది॑వే । య॒శసం॑-వీ॒రవ॑త్తమమ్ ॥ 3

అగ్నే॒ యం-య॒జ్ఞమ॑ధ్వ॒రం-వి॒శ్వతః॑ పరి॒భూరసి॑ । స ఇద్దే॒వేషు॑ గచ్ఛతి ॥ 4

అ॒గ్నిర్హోతా॑ క॒విక్ర॑తుః స॒త్యశ్చి॒త్రశ్ర॑వస్తమః । దే॒వో దే॒వేభి॒రా గ॑మత్ ॥ 5

యద॒ఙ్గ దా॒శుషే॒ త్వమగ్నే॑ భ॒ద్రం క॑రి॒ష్యసి॑ । తవేత్తత్స॒త్యమం॑గిరః ॥ 6

ఉప॑ త్వాగ్నే ది॒వేది॑వే॒ దోషా॑వస్తర్ధి॒యా వ॒యమ్ । నమో॒ భరం॑త॒ ఏమ॑సి ॥ 7

రాజం॑తమధ్వ॒రాణాం॑ గో॒పామృ॒తస్య॒ దీది॑విమ్ । వర్ధ॑మానం॒ స్వే దమే॑ ॥ 8

స నః॑ పి॒తేవ॑ సూ॒నవేఽగ్నే॑ సూపాయ॒నో భ॑వ । సచ॑స్వా నః స్వ॒స్తయే॑ ॥ 9

Sunday, December 22, 2024

మన్యు సూక్తం -తెలుగు (Manyu Suktam Telugu)



మన్యు సూక్తం

అథ మన్యుసూక్తం
ఋగ్వేద సంహితా; మండలం 10; సూక్తం 83,84

యస్తే మ॒న్యోఽవి॑ధద్ వజ్ర సాయక॒ సహ॒ ఓజః॑ పుష్యతి॒ విశ్వ॑మాను॒షక్ ।
సా॒హ్యామ॒ దాస॒మార్యం॒ త్వయా యు॒జా సహ॑స్కృతేన॒ సహ॑సా॒ సహ॑స్వతా ॥ 1

మ॒న్యురింద్రో మ॒న్యురే॒వాస॑ దే॒వో మ॒న్యుర్ హోతా॒ వరు॑ణో జా॒తవేదాః ।
మ॒న్యుం-విశ॑ ఈళతే॒ మాను॑షీ॒ర్యాః పా॒హి నో మన్యో॒ తప॑సా స॒జోషాః2 a

అ॒భీహి మన్యో త॒వస॒స్తవీయా॒న్ తప॑సా యు॒జా వి జ॑హి శత్రూన్ ।
అ॒మి॒త్ర॒హా వృ॑త్ర॒హా ద॑స్యు॒హా చ॒ విశ్వా॒ వసూ॒న్యా భ॑రా॒ త్వం నః॑ ॥ 3

త్వం హి మన్యో అ॒భిభూత్యోజాః స్వయం॒భూర్భామో అభిమాతిషా॒హః ।
వి॒శ్వచ॑ర్-షణిః॒ సహు॑రిః॒ సహావాన॒స్మాస్వోజః॒ పృత॑నాసు ధేహి ॥ 4

అ॒భా॒గః సన్నప॒ పరేతో అస్మి॒ తవ॒ క్రత్వా తవి॒షస్య॑ ప్రచేతః ।
తం త్వా మన్యో అక్ర॒తుర్జి॑హీళా॒హం స్వాత॒నూర్బ॑ల॒దేయాయ॒ మేహి॑ ॥ 5

అ॒యం తే అ॒స్మ్యుప॒ మేహ్య॒ర్వాఙ్ ప్ర॑తీచీ॒నః స॑హురే విశ్వధాయః ।
మన్యో వజ్రిన్న॒భి మామా వ॑వృత్స్వహనావ॒ దస్యూన్ ఋ॒త బోధ్యా॒పేః ॥ 6

అ॒భి ప్రేహి॑ దక్షిణ॒తో భ॑వా॒ మేఽధా వృ॒త్రాణి॑ జంఘనావ॒ భూరి॑ ।
జు॒హోమి॑ తే ధ॒రుణం॒ మధ్వో॒ అగ్ర॑ముభా ఉ॑పాం॒శు ప్ర॑థ॒మా పి॑బావ ॥ 7

త్వయా మన్యో స॒రథ॑మారు॒జంతో॒ హర్ష॑మాణాసో ధృషి॒తా మ॑రుత్వః ।
తి॒గ్మేష॑వ॒ ఆయు॑ధా సం॒శిశానా అ॒భి ప్రయంతు॒ నరో అ॒గ్నిరూపాః ॥ 8

అ॒గ్నిరి॑వ మన్యో త్విషి॒తః స॑హస్వ సేనా॒నీర్నః॑ సహురే హూ॒త ఏధి ।
హ॒త్వాయ॒ శత్రూ॒న్ వి భ॑జస్వ॒ వేద॒ ఓజో॒ మిమానో॒ విమృధో నుదస్వ ॥ 9

సహ॑స్వ మన్యో అ॒భిమాతిమ॒స్మే రు॒జన్ మృ॒ణన్ ప్ర॑మృ॒ణన్ ప్రేహి॒ శత్రూన్ ।
ఉ॒గ్రం తే॒ పాజో న॒న్వా రు॑రుధ్రే వ॒శీ వశం నయస ఏకజ॒ త్వమ్ ॥ 10

ఏకో బహూ॒నామ॑సి మన్యవీళి॒తో విశం᳚​విశం-యు॒ధయే॒ సం శి॑శాధి ।
అకృ॑త్తరు॒క్ త్వయా యు॒జా వ॒యం ద్యు॒మంతం॒ ఘోషం-విజ॒యాయ॑ కృణ్మహే ॥ 11

వి॒జే॒ష॒కృదింద్ర॑ ఇవానవబ్ర॒వో॒(ఓ)3॑ఽస్మాకం మన్యో అధి॒పా భ॑వే॒హ 3
ప్రి॒యం తే॒ నామ॑ సహురే గృణీమసి వి॒ద్మాతముత్సం॒-యత॑ ఆబ॒భూథ॑ ॥ 12

ఆభూత్యా సహ॒జా వ॑జ్ర సాయక॒ సహో బిభర్ష్యభిభూత॒ ఉత్త॑రమ్ ।
క్రత్వా నో మన్యో స॒హమే॒ద్యేధి మహాధ॒నస్య॑ పురుహూత సం॒సృజి॑ ॥ 13

సంసృ॑ష్టం॒ ధన॑ము॒భయం స॒మాకృ॑తమ॒స్మభ్యం దత్తాం॒-వరు॑ణశ్చ మ॒న్యుః ।
భియం॒ దధానా॒ హృద॑యేషు॒ శత్ర॑వః॒ పరాజితాసో॒ అప॒ నిల॑యంతామ్ ॥ 14

ధన్వ॑నా॒గాధన్వ॑ నా॒జింజ॑యేమ॒ ధన్వ॑నా తీ॒వ్రాః స॒మదో జయేమ ।
ధనుః శత్రోరపకా॒మం కృ॑ణోతి॒ ధన్వ॑ నా॒సర్వాః ప్ర॒దిశో జయేమ ॥

ఓం శాంతా॑ పృథివీ శి॑వమం॒తరిక్షం॒ ద్యౌర్నో దే॒వ్యఽభ॑యన్నో అస్తు ।
శి॒వా॒ దిశః॑ ప్ర॒దిశ॑ ఉ॒ద్దిశో న॒ఽఆపో వి॒శ్వతః॒ పరి॑పాంతు స॒ర్వతః॒ శాంతిః॒ శాంతిః॒ శాంతిః॑ ॥

 

Friday, December 20, 2024

రఘు నందన... రఘు రఘు నందన (Raghu Nandana telugu)

 https://www.youtube.com/shorts/BsZoeGj0fW8

Hanuman -


రఘు నందన... రఘు రఘు నందన.. రఘువర సేవన.. రఘు పతి ఛాయన....

శత యోజన... శత శత యోజన.. శరధి నియోజన.. శరపరి లంఘనమే..

అరి భాజన... అరి అరి భాజన.. అరిమద భాజన.. దశముఖ కంపణమే...

భడభాగృత... భడ భడభాగృత.. భడ భాణలకృత బహు భశ్మార్చన...

జయ కేతన... జయ జయ కేతన.. జయ హయ ప్రాకున.. జయ మిడ దాపుగనే.