విశ్వామిత్ర మహర్షి
ఓం హ్రీం పూర్ణ సాఫల్య సిద్దిం హ్రీం నమః
విశ్వామిత్ర మహర్షి పేరు ప్రఖ్యాతలు ప్రపంచ విఖ్యాతమే. ‘జగమెరిగిన
బ్రాహ్మణుడుకి జంధ్యమేలా అనే సామెత తెలుగు నాట రోజూ వనబడేదే. అలాంటిదే
విశ్వామిత్రునిగురించి చెప్పుకోవటం. కానీ మహర్షుల, మహా తపస్సంపన్నుల, మంత్రవేత్తల చరిత్రలను మననం చేసుకుంటేనే మనోల్లాసం, మన: సంతౄప్తి కదా. ఆ మంత్ర వేత్తని స్మరించాలని ఆకాంక్ష!
మహర్షి విశ్వామిత్రుని
జన్మవౄత్తాంతం మహాభారతంలోనూ, పురాణాలలోను కూడా చెప్పబడింది. ఈయన మహా తపస్సంపన్నుడైన
భౄగుమహర్షి సుపుత్రుడు రుచీకుని యొక్క కుమారుడు. ఈయన జన్మమే విలక్షణంగా అయింది.
ఈయన మాతామహుడు గాధి అనే మహారాజు. ఆయనకి సత్యవతి అనే సద్గుణ సంపన్నురాలు ఏకైక
కుమార్తె. ఆ కుమార్తెకు రుచీకునికిచ్చి వివాహం చేశాడు. ఆవిడ మహాపతివ్రత.
సౌందర్యరాశి. భర్తకి ఏలోటూ రాకుండా ఆయన మనసెరిగి మసలుకొంటూవుండేది. ఆవిడ
పతిభక్తికి మెచ్చి రుచీకుడొకనాడు యజ్ణ్జము చేసినటువంటి చెరుకుని తీసుకొచ్చి
మంత్రించి భార్యయైన సత్యవతికి యిచ్చి ‘దేవి! నీ తండ్రికి పుత్రసంతానం లేదుకదా! ఈ
చెరుకు రెండుభాగాలుగా అభిమంత్రించి పట్తుకొచ్చాను. యిందు ఒకటి నువ్వు భుజించు.
నీకు మహా తపోసంపన్నుడైన
పుత్రుడు పుడతాడు. రెండవది నీ తల్లికియ్యి. ఆ మహారాణికి క్షత్రియ శక్తిసంపన్నుడైన
పరాక్రమవంతుడైన కొడుకు పుడతాడూ అని చెప్పాడు. సత్యవతి ఆ రెండు చెరుకూ భాగాలనీ చూచి
చాలా ఆనందించింది. తల్లిదండ్రులు వస్తే ఆమె తల్లికి ఆ రెండు భాగాలుయిచ్చి చూపించి
వాటి ప్రభావం చెప్పింది.దైవయోగంచేత సత్యవతి తీసుకోవలసిన భాగం ఆమె తల్లి
తీసుకోవలసిన సగం సత్యవతి భక్షించింది. కాలగర్భంలో యిద్దరూ గర్భవతులయ్యారు.
తపోధనుడైన రుచీకుడు తన తపశ్శక్తిచే జరిగిన పొరపాటు గ్రహించగలిగాడు. దైవవిధిగా
భావించాడు. సత్యవతికి జమదగ్ని పుట్టాడు. అతనికి పరశురామ భగవానుడు పుట్టాడు.
గాధిపత్నికి యజ్ణ్జ చెరుకు ప్రభావంతో మహర్షి విశ్వామిత్రుడు పుట్టాడు. ఆ
విశ్వామిత్రునికి చాలామంది పుత్రులు పుట్టారు. అదే కుశక వంశంగా వర్ధిల్లింది.
విశ్వామిత్రుని
విజయాలువిశ్వామిత్రుడు పట్టుదల, దీక్ష, తపోనిష్టా గరిష్టుడు. దీక్షతో సాధించలేనిది లేదని లోకానికి
చెప్పేందుకే ఈయన చరిత్ర సాక్ష్యం. మనస్సు లగ్నం చేసి అనేక మార్లు తపస్సు చేసి
బ్రహ్మని మెప్పించి రాజర్షి పదవిలోంచి బ్రహ్మర్షి స్థానం పొంది లోకపూజ్యుడయ్యాడు.
సప్తర్షులలో అగ్రగణ్యుడయ్యాడు. ౠషిశ్రేష్ఠులందరి చేత వందనీయుడయ్యాడు. ఆయన
తపశ్శక్తి చేత సమాధి నిష్ఠాగరిష్ఠత చేత అనేక మంత్రార్థాలు కొత్త కొత్త మంత్రాల
దర్శనం కూడా పొందాడు. యిన్ని మంత్రాల ద్రష్ట విశ్వామిత్రుడు ఒక్కడే. అందుకే ఆయనవి
మంత్రద్రష్టా ౠషి అంటారు. ౠగ్వేదంలో పది మండలాలలో మూడవమండలమును వైశ్వామిత్ర మండలం
అంటారు. యిందులో 62 సూక్తులు వున్నాయి.
ఈ మంత్రాలన్నీ
విశ్వామిత్రుడు చేసినవే. ఈ తౄతీయ మండలంలో ఇంద్ర, అదితి, అగ్నిపూజ, ఉష, అశ్వనీ, రుభు, మొదలుగువారి
స్తోత్రాలున్నాయి. మళ్ళీ అనేక జ్ణ్జాన విజ్ణ్జాన ఆధ్యాత్మిక విషయాలు కూడా ఉన్నాయి.
గోమాత వర్ణన ప్రాశస్త్యాలు వున్నాయి.ఈ వైశామిత్ర మండలములో బ్రహ్మ గాయత్రీ
మహామంత్రానీ చూచి ప్రజలకి, లోకానికి చూపించాడు. ఆయన వల్లనే గాయత్రీ మహామంత్రం పైకి తౄతీయ
మండలంలో 62వ సూక్తిలో 10వ మంత్రం గాయత్రీ మహామంత్రంగా విఖ్యాతిగాంచింది.‘ఓం భూర్ భువ
స్వ:తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్ ‘విశ్వామిత్రుడు
లేకపోతే ఈ గాయత్రీ మహామంత్రం మనకి లభ్యమయ్యేది కాదు. ఈ మహామంత్రం వేదమంత్రాలకి
మూలం . అన్ని మంత్రాలకీ బీజం. ఈ మంత్రానికున్న శక్తి అపారమైంది. ఉపనయనములో ఈ
మహామంత్రాన్ని తండ్రి వటువు చెవిలో ఉపదేశించి ‘ద్విజత్వాన్నీ ప్రసాదిస్తాడు.
విశ్వామిత్ర మహర్షి
యొక్క దయవల్లనే ప్రతిరోజు సంధ్యావందనములో ఉభయ సంధ్యలందు ఈ మహామంత్రాన్ని జపించి
బుద్ధిబలం, యశం అన్నీ పొంది తరిస్తున్నారు ప్రజలు.విశ్వామిత్రుడు సమ్హిత, విశ్వామిత్ర స్మౄతి అనే
గ్రంథములలో గాయత్రీదేవి యొక్క ఆరాధన, వర్ణన కూడా సొగసుగా చేశాడు. గాయత్రీ
మహామంత్ర జపంతో అన్ని మంత్రాల యొక్క జపసిద్ధి కలుగుతుంది.విశ్వామిత్ర మహర్షి
తపస్సంపన్నుడు. ఆయనకి గాయత్రీ మాత అనుగ్రహం వల్లనే ప్రతిసౄష్టి చేయగలిగిన
అపరబ్రహ్మ కాగలిగాడు.భగవత్రీ గాయత్రీ మాత రూపు ఏమిటి? స్వరూపమేమిటి? ఆరాధన ఎలా చేయాలి? ఈ విషయాలన్నీ మనకి
తెలియచేసిన ప్రథమ గురువు విశ్వామిత్ర మహర్షే. ఆవిడ ఈ చరాచర జగత్తు నడిపే తల్లి.
స్థూల, సూక్ష్మ భేధాలన్నీ ఆ
తల్లి విగ్రహమే. ఉపాసన ధ్యానములు యొక్క దౄష్టిచేత ఆవిడ మూల స్వరూపమేమిటి? అనే విషయాన్ని ఆయన
వ్రాసిన ఈ శ్లోకమే చెబుతుంది
.శ్లో!! ముక్తా
విద్రుమహేమనీల ధవళ ఛాయైర్ముఖై:
స్త్రీ క్షణై:యుక్తా
మిందు నిబద్దరత్నమకుటాం తత్వార్ధ
వర్ణాత్మికాంగాయత్రీం
వరదాభయాంకుశ కశాంశుభ్రం
కపాలం గుణాంశంఖం చక్ర
మధారవిందయుగళం హస్తెర్వహంతీం భజే!!
ఆతల్లి ముత్యాలు, మణిమాణిక్యాలు, ముంగాలు, బంగారం, నీలమణి, ఉజ్వల కాంతితో సమానమైనన
ఐదు ముఖాలతో మెరుస్తూంటుంది. ఆవిడ మూడునేత్రాలతో విరాజిల్లుతోంది. ఆవిడ ముఖకాంతి
అనుపమానం. ఆవిడ రత్న మయకిరీటంలో చంద్రుడు ప్రకాశిస్తుంటాడు. ఆవిడ 24 కాంతులతో
ప్రకాశిస్తుంటుంది. ఆవిడ వరప్రదాయిని. గాయత్రీ చేతులలో అంకుశము, వరముద్ర కుశ, పాశ, శుభ్రం కపాలము, గద, శంఖం, చక్రం, రెండు కమలాలనీ
ధరిస్తుంది. ఆవిడని ధ్యానించగల మహా సంపదని శ్రీ విశ్వామిత్ర మహర్షి ప్రజలకి
చల్పించాడు.ఆయన భక్తేకాదు, శ్రీరామచంద్రుడం తటివానికి ‘బల, అతిబలా అనే మహా ఆస్త్రాలని ఉపదేశించగల
విలుకాడు. అన్ని శాస్త్రార్థాలనీ విశదీకరించి చెప్పాడు. జగద్గురుదేవులకే
గురువయ్యాడు.
శాంత స్వరూపుడైన
వశిష్ఠునితో నందినీ ధేనువు కోసంవివాదం పెట్టుకోవటం అయింది. అది కూడా లోకానికి పాఠం
చెప్పటంలో భాగమే. ఆ కథవల్ల గోమహిమ లోకవిదితమైంది. తపస్సుకెంత శక్తివుందో
మానవకోటికి అర్ధమైంది. దౄఢ నిశ్చయంతో పురుషుడెలా విజయం సాధించాలో విదతమైంది.
వ్యక్తి మోహపాశాలు పనికిరావనే హెచ్చరిక కనబడుతోంది. రాక్షస ప్రవౄత్తి విడిచి దైవ
సంపద చేకొనాలని నేర్చుకొంటారు ప్రజలు. కామక్రోధాలవల్ల వచ్చే అరిష్టం తెలుస్తోంది.
మోహపాశాల వల్ల వచ్చే అనర్థాలు బోధపడుతున్నాయి. ఎప్పటి వరకు మానవులు
అరిషడ్వార్గాలని విడవడో అప్పటి వరకు దు:ఖం తప్పదు. అనే సత్యం తెలుస్తోంది.దైవి
సంపదవల్ల వచ్చే లాభాలు కూడా ఆయనచరిత్ర చెప్పింది. బ్రహ్మదేవుని గురించి దీక్షగా
తపస్సు చేస్తే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై బ్రహ్మర్షి అనే బిరుదు ప్రదానం చేశాడు.
అప్పుడు వశిష్ఠమహర్షి ఆయన్ని కౌగలించుకున్నాడు.
దేవతలు వారిద్దరి
కలయికకి అనందించి పుష్పవర్షం కురిపించారు.హరిశ్చంద్ర మహారాజుని పరీక్షించినప్పుడు
ఆయన క్రూరమైన పాత్ర వహించినట్లు కనబడుతుంది. కాని ఆయన హరిశ్చంద్రుని సత్యవ్రత
దీక్ష విశ్వవ్యాప్తం చేయాలని, దానివల్ల హరిశ్చంద్రుని కీర్తి ఆచంద్రార్కం భూలోకలో నిలవాలనే
సత్సంకల్పమే. ఆయనకి కక్షేవుంటే లోహితాస్యుణ్ణి మళ్ళీ బతింకిచేవాడు కాదు.ఐతరేయ
బ్రాహ్మణములో విశ్వామిత్రుడు, శునశ్చేపుల వౄత్తాంతం చెప్పబడింది. అక్కడా కూడా
విశ్వామిత్రమహర్షి యొక్క ప్రస్తావన వచ్చింది. ఆయన గోత్రీకులు చాలా మేధావంతులు, మహాత్ములు. ప్రపంచ
రహస్యాలన్నీ యెరిగిన జ్ణ్జానులు. కౌశికస, వైశ్వామిత్ర గోత్రాలకి అధిపది ఆయనే.
విశ్వామిత్రుడు సమర్ధుడు. అతీంద్రయ ద్రష్ట. అధ్వర్యం చేయటంలో నిష్ణాతుడు. సుదాసు
మహారాజు యజ్ణ్జానికి అధ్వర్యం వహించిన మహా విద్వాంసుడు. యజ్ణ్జకర్త. ఆ
మహామునీశ్వరుని గురించి మనకెంత తెలిసినా అల్పమే అవుతుంది
No comments:
Post a Comment