హనుమన్ మంత్రం : " ఓం ఐం భ్రీం హనుమతే శ్రీ రామదూతయే నమః "
హనుమన్ ఏకాక్షర జాగృత మంత్రం:
ఫ్రౌం (FROUM)
హనుమన్ ఇష్ట మంత్రం: రాం (RAAM)
My Spiritual Research Sounds-Vibrations-Reactions-Connectivity- నేను చదివిన,తెలుసుకొన్న కొన్ని విషయల గమనికలు.. కేవలం నా పునఃపరిశీలన కోసం వ్రాసుకున్నది- దయచేసి తప్పులు ఎమైన వున్నా, అభ్యంతరాలు ఎమైన వున్న తెలుపగలరు - సురేష్ కలిమహంతి
హనుమన్ మంత్రం : " ఓం ఐం భ్రీం హనుమతే శ్రీ రామదూతయే నమః "
హనుమన్ ఏకాక్షర జాగృత మంత్రం:
ఫ్రౌం (FROUM)
హనుమన్ ఇష్ట మంత్రం: రాం (RAAM)
అర్గలా స్తోత్రం
ధ్యానం
ఓం బంధూక కుసుమాభాసాం పంచముండాధివాసినీం। స్ఫురచ్చంద్రకలారత్న
ముకుటాం ముండమాలినీం॥
త్రినేత్రాం రక్త వసనాం పీనోన్నత ఘటస్తనీం। పుస్తకం చాక్షమాలాం చ
వరం చాభయకం క్రమాత్॥
దధతీం సంస్మరేన్నిత్యముత్తరామ్నాయమానితాం।
అథవా
శ్రీ మహాలక్ష్మీ స్తోత్రం (Sree Malakashmi Strotram)
జయ పద్మ విశాలాక్షి జయత్వం శ్రీపతిప్రియే / జయ మాత ర్మహలక్ష్మి సంసారార్ణవ తారిణీ //
మహాలక్ష్మీ నమస్తుభ్యం నమస్తుభ్యం మహేశ్వరీ / హరిప్రియే నమస్తుభ్యం
దయానిధే //
పద్మాలయే నమస్తుభ్యం నమస్తుభ్యం చ సర్వదే / సర్వభూత హితార్థాయ
వసువృష్టిం సదాకురు //
జగన్నాత ర్నమస్తుభ్యం నమస్తుభ్యం దయానిధే / దయావతి నమస్తుభ్యం
విశ్వేశ్వరి నమోస్తుతే //
నమః క్షీరార్ణవసుతే నమ స్తైలోక్యధారిణీ / వసువృష్టే నమస్తుభ్యం
రక్ష మాం శరణాగతమ్ //
రక్ష త్వం దేవదేవేశి దేవదేవస్య వల్లభే / దరిద్రం త్రామిహం లక్ష్మీ
కృపాం కురు మయోపరి //
సమస్త్రైలోక్య జననీ నమ స్తుభ్యం జగద్దితే / అర్తిహంత్రి నమ
స్తుభ్యం సమృద్దిం కురు మే సదా //
అబ్జవాసే నమ స్తుభ్యం చపలాయై నమో నమః / చంచలాయై నమ స్తుభ్యం
లలితాయై నమో నమః //
నమః ప్రద్యుమ్న జననీ మాతస్తుభ్యం నమో నమః / పరిపాలయ మాం మాతః మాం
తుభ్యం శరణాగతమ్ //
శరణ్యే త్వాం ప్రసన్నో 2 స్మి కమలే
కమలాలయే / త్రాహి త్రాహి మహాలక్ష్మి పరిత్రాణ పరాయణే //
పాండిత్యం శోభతే నైవ నశోభంతి గుణా కరే / శీలత్వం నైవ శోభతే
మహాలక్ష్మీ త్వయా వినా //
తావ ద్విరాజతే రూపం తావ చ్చీలం విరాజతే / తావద్గుణా నరణాం చ యావ
ల్లక్ష్మీః ప్రసీదతి //
లక్ష్మిత్వయాలంకృత మానవా యే / పాపై ర్విముక్తా నృపలోక మాన్యాః //
గుణై ర్విహీనా గుణినో భవంతి / దుశ్శీలనః శీలవతాం పఠిష్టః //
లక్ష్మీ ర్భూషయతే రూపం లక్ష్మీ ర్భూషయతే కులమ్ / లక్ష్మీ ర్భూషయతే
విద్యాం సర్వా లక్ష్మీ ర్విశిష్యతే //
దీనార్తి భీతం భ్వతాప పీడితాం ధనై ర్విహీనం తవ పార్శ్వ మాగతమ్ / కృపానిధిత్వా
న్మను లక్Sమి నత్వరం ధనప్రదానాద్దననాయకం కురు //
మాం విలోక్య జననీ హరిప్రియే నిర్దనం తవ సమీప మాగతమ్ / దేహి మే
ఝుడతి లక్ష్మీ కరాంబుజం వస్త్ర కాంచన వరాన్న మద్బుతమ్ //
త్వమేవ జననీ లక్ష్మీ పితా లక్ష్మీ త్వమేవ చ / భ్రాతా త్వం చ సభా
లక్ష్మీ విద్యా లక్ష్మీ త్వమేవచ //
త్రాహి త్రాహి మహాలక్ష్మి త్రాహి త్రాహి సురేశ్వరి / త్రాహి త్రాహి
జగన్మాతః దారిద్ర్యా త్యాపి వేగతః //
నమస్తుభ్యం జగద్దాత్రి నమ స్తుభ్యం నమో నమః / ధర్మాధారే నమ
స్తుభ్యం నమ సాంపత్తి దాయినీ //
దారిద్ర్యార్ణవ మగ్నో - హం నిమగ్నో -హం రసాతలే / మజ్జంతం మాం కరే
ధృత్వా తూద్దర త్వం రమే ద్రుతమ్ //
కిం లక్ష్మి బహునోక్తేన జల్పితేన పునః పునః / అనన్యే శరణం నాస్తి
సత్యం సత్యం హరిప్రియే //
ఏత చ్చ్రుత్వాగస్థ్యైవాక్యం హృష్యమాణా హరిప్రియా / ఉవా చ మధురాం
వాణీం తుష్టాహం తవ సర్వదా //
య త్త్వ యోక్త మిదం స్తోత్రం యః పఠిష్యతి మానవః / శృణోతి చ మహాభాగః
తస్యాహం పశవర్తినీ //
నిత్యం పఠతి యో భక్త్యా త్వలక్ష్మీ స్తస్య నశ్యతి / ఋణం చ నశ్యతే
తీవ్రం వియోగం నైవ పశ్యతి //
యః పఠే త్ప్రాత రుత్థాయ శ్రద్దా భక్తి సమన్వితః / గృహే త్స్య సదా
తుష్టా నిత్యం శ్రీః పతినా సహ //
పుత్త్రవాన్ గుణవాన్ శ్రేష్ఠో భోగభక్తా చ మానవః / ఇదం స్తోత్రం మహా
పుణ్యం లక్ష్మ్యాగస్థ్య ప్రకీర్తితమ్ //
విష్ణు
ప్రసాద జననం చతుర్వర్గ ఫలప్రదమ్ //
రాజద్వారే జయశ్చైవ శత్రో పరాజయః / భూత ప్రేత పిశాచినాం వ్యాఘ్రాణాం
న భయం తథా //
న శస్త్రానల తోయౌఘా ద్బయం తస్య ప్రజాయతే / దుర్వృత్తానాం చ పాపానం
బహు హానికరం పరమ్ //
మందురా కరిశలాసు గవాం గోష్ఠే సమాహితః / పఠే త్తద్దోష శాంత్యర్థం
మహా పాతక నాశనమ్ //
సర్వ సౌఖ్యకరం నౄణా మాయు రారోగ్యదం తథా / అగస్త్య మునిన ప్రోక్తం
ప్రజానాం హిత కామ్యయా //
శ్రీ మహాలక్ష్మి అష్టకము
ఇంద్ర
ఉవాచ –
నమస్తేఽస్తు
మహామాయే శ్రీపీఠే సురపూజితే । శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 1 ॥
నమస్తే
గరుడారూఢే కోలాసుర భయంకరి । సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 2 ॥
సర్వజ్ఞే
సర్వవరదే సర్వ దుష్ట భయంకరి । సర్వదుఃఖ హరే దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 3 ॥
సిద్ధి
బుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయిని । మంత్ర మూర్తే సదా దేవి మహాలక్ష్మి
నమోఽస్తు తే ॥ 4 ॥
ఆద్యంత
రహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి । యోగజ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 5 ॥
స్థూల
సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే । మహా పాప హరే దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 6 ॥
పద్మాసన
స్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి । పరమేశి జగన్మాతః మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 7 ॥
శ్వేతాంబరధరే
దేవి నానాలంకార భూషితే । `జగస్థితే జగన్మాతః మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 8
॥
మహాలక్ష్మష్టకం
స్తోత్రం యః పఠేద్ భక్తిమాన్ నరః । సర్వ సిద్ధి మవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి
సర్వదా ॥
ఏకకాలే
పఠేన్నిత్యం మహాపాప వినాశనమ్ । ద్వికాలం యః పఠేన్నిత్యం ధన ధాన్య సమన్వితః ॥
త్రికాలం
యః పఠేన్నిత్యం మహాశత్రు వినాశనమ్ । మహాలక్ష్మీ ర్భవేన్-నిత్యం ప్రసన్నా వరదా శుభా
॥
[ఇంత్యకృత శ్రీ మహాలక్ష్మ్యష్టక స్తోత్రం సంపూర్ణం]
శ్రీ
నీల సరస్వతీ స్తోత్రం (Sri Neela Saraswathi Stotram)
ఘోరరూపే మహారావే సర్వశత్రుక్షయంకరీ | భక్తేభ్యో వరదే దేవి త్రాహి మాం శరణాగతమ్ ||
1 ||
సురాఽసురార్చితే దేవి సిద్ధగంధర్వసేవితే | జాడ్యపాపహరే దేవి త్రాహి మాం శరణాగతమ్ || 2
||
జటాజూటసమాయుక్తే లోలజిహ్వానుకారిణీ | ద్రుతబుద్ధికరే దేవి త్రాహి మాం శరణాగతమ్ ||
3 ||
సౌమ్యరూపే క్రోధరూపే చండరూపే నమోఽస్తు తే | సృష్టిరూపే నమస్తుభ్యం త్రాహి మాం శరణాగతమ్ ||
4 ||
జడానాం జడతాం హంసి భక్తానాం భక్తవత్సలా | మూఢతాం హర మే దేవి త్రాహి మాం శరణాగతమ్ ||
5 ||
హ్రూం హ్రూంకారమయే దేవి బలిహోమప్రియే నమః | ఉగ్రతారే నమస్తుభ్యం త్రాహి మాం శరణాగతమ్ ||
6 ||
బుద్ధిం దేహి యశో దేహి కవిత్వం దేహి దేవి మే | మూఢత్వం చ హరేర్దేవి త్రాహి మాం శరణాగతమ్ ||
7 ||
ఇంద్రాదిదేవ సద్వృందవందితే కరుణామయీ | తారే తారధినాథాస్థే త్రాహి మాం శరణాగతమ్ ||
8 ||
అష్టమ్యాం చ చతుర్దశ్యాం నవమ్యాం చ పఠేన్నరః | షణ్మాసైః సిద్ధిమాప్నోతి నాఽత్ర కార్యా విచారణా ||
9 ||
మోక్షార్థీ లభతే మోక్షం ధనార్థీ లభతే ధనమ్ | విద్యార్థీ లభతే విద్యాం తర్కవ్యాకరణాదికమ్ ||
10 ||
ఇదం స్తోత్రం పఠేద్యస్తు సతతం శ్రద్ధయాన్వితః | తస్య శత్రుః క్షయం యాతి మహాప్రజ్ఞా ప్రజాయతే ||
11 ||
పీడాయాం వాపి సంగ్రామే జప్యే దానే తథా భయే | య ఇదం పఠతి స్తోత్రం శుభం తస్య న సంశయః ||
12 ||
ఇతి శ్రీ నీల సరస్వతీ స్తోత్రం సంపూర్ణం
🙏జీవజ్ఞానామృత బిందు శక్తి 🙏(దివ్య గ్రంథము నుండి )
ఎల్లప్పుడూ నిత్యము ఉండేది సనాతనమైనది ఉనికి
లేని స్థితిలో ఉండేటటువంటి ఏదైతే ఉన్నదో అది బిందువుగా చెప్పబడి ఉన్నది
స్వయంకృతమున ఆ బిందువు కదలి శబ్దము ఏర్పడి రూపకల్పన జరిగి ఉనికిగా అంతర్గతముగా
ఉండి వ్యక్తం చేయుటకు వే రే లేనిదై విభజించుటకు వీలు లేనిదై చలించుటకు వీలులేనిదై
ఉన్నది. అదే స్వాత్మ స్వరూపముగా,
"నేను" గా సనాతనుడనై సత్య స్థితిలో తరువాత సూక్ష్మ జగత్తుగా ఏర్పడి అగోచరము
అవ్యక్తము అగు ప్రకృతి (అపరా ప్రకృతి)
బిందు రూపంలో ఓంకార నాదమై తేజస్వర
తరంగాలుగా చైతన్యము, జ్ఞానము, శక్తి,
అను మూడు శక్తులు వీటి యొక్క క్రమ సంయోగ వియోగ సంయోగాత్మకంగా లోపల
సంయోగములతో ఏర్పడినదే జీవజ్ఞానామృత బిందు శక్తి. కంటికి కనిపించని ఈ శక్తి మహా
మనస్సు ఇదే మహా తేజస్సు ఇదే మహా ప్రాణము. సమతుల్యతతో కూడిన క్రమ సంయోగ వియోగ
సంయోగత్మకమైనటువంటి పరిణామములు చెందుతూ ప్రకృతిగా ఏర్పడినది.మనం అర్థమయ్యే రీతిలో
చెప్పుకుందాం అంటే ఒక అణువు తో ఒక అణువు కలిసి అనేకణువులుగా అనేకణువులు కొత్త
అణువులతో కలిసి కొత్త అణువులుగా కొత్త పదార్థాలుగా ఒక పదార్థంతో ఒక పదార్థం కలిసి
కొత్త పదార్థం ఏర్పడినట్లు మనం రసాయన శాస్త్రంలో చెప్పినట్టుగా ఒకదానితో ఒకటి
కలిసి రకరకాలుగా ఫార్మేషన్స్, రియాక్షన్స్, జీవ శాస్త్రంలో కొత్త జీవాలను కొనుగోనుట (బయో టెక్నాలజీ) ఇవన్నీ క్రమసంయోగ
వియోగాత్మకమైన నిర్మాణమే. శాస్త్ర సాంకేతిక విజ్ఞానం అంతా కూడా ఈ క్రమ సంయోగ
వియోగాత్మకమైనటువంటి పరిణామ రూపమే. మనలో కూడా ఈ క్రమ సంయోగ వియోగాత్మకమైనటువంటి
పరిణామములు జరుగుతూనే ఉండును. మన ఇంద్రియములు వినడం ద్వారా చూడడం ద్వారా చెప్పడం
ద్వారా అనుభవించడం ద్వారా స్ప్రుశించడం చడం ద్వారా ఈ మనసు వాటితో సంయోగం చెంది
తలపులుగా అనుభూతులుగా అనుభవాలుగా నిత్యం ఆగకుండా మార్పు చెందుతూ కర్మలు చేస్తూనే
ఉంటుంది. ఈ ప్రకృతి అంతా అణువు మొదలు బ్రహ్మాండము వరకు ఈ జీవ జ్ఞానామృత బిందు
శక్తి అన్నింటా ప్రాణముగా, మనసుగా నిండి ఉన్నది. బ్రహ్మాండ
జ్ఞానమంతా ఈ జీవ జ్ఞానామృత బిందు శక్తి లో అదృశ్యముగా దాగి ఉన్నది. ప్రతి జీవిలో
ఇది అజ్ఞాతముగా అవిభాజ్యమై( విభజించుటకు వీలు లేనిది ) తేజస్వరతరంగమైన నాదముగా అదే
శబ్దముగా ఉన్నది కనుక మనము మనలోనున్న నాదముచే సంవిధానము కావించుకొనిన ఎడల ఆ జీవజ్ఞానామృత స్థితిని చేరి జ్యోతి స్వరూపము
పొందెదము.ఆది అంతము లేని శుద్ధ నిశ్శబ్దముగా ఉండెదము. దీన్నే బాబాజీ సృష్టి స్థితి
లయ కారకుడు నీవే అని నీవే సృష్టికర్తవని స్వాత్మ వై నీలో నీవు ఉండి స్వయంగా
తెలుసుకోవాలని చెప్పారు.
ఇక జీవజ్ఞానామృత బిందు శక్తి అంటే చాలా తక్కువగా
అర్థమయ్యే విధంగా చెప్పుకుందాం
కనిపించకుండా బీజరూపములో ఉండునది ఏదో దానినే
బిందువు అంటారు ఈ బిందువులో జీవము సత్యమై నిత్యమై మృతము లేనిదై అనగా చావులేనిదై
జ్ఞానము రూపంలో ఉంటుంది కనుక ఇది అమృతము. బాబాజీ విత్తనమును వృక్షమును ఉదాహరణగా తీసుకొని చెబుతారు
విత్తనములో అన్నీ ఉన్న ఏమీ కనబడదు కానీ మహా వృక్షముగా మారుటకు అవసరమైన జ్ఞానము
దానిలో దాగి ఉంది అది గుప్తమగు జ్ఞానము మన భాషలో చెప్పాలి అంటే ఒక విధమైన బ్లూ
ప్రింట్ గా చెప్పుకోవచ్చు. ఇది సర్వ జీవరాశులలో జన్మకు రాకముందు జీవశక్తిలో దాగి
ఉన్న జ్ఞానము. ఈ సృష్టిలో అణువు మొదలు బ్రహ్మాండము వరకు విశ్వమంతా ఈ జీవశక్తి
నిండి అమృతమయమై దాగి ఉన్నది ఈ జీవజ్ఞానామృత బిందువు నందు చైతన్యము జ్ఞానము శక్తి
అదృశ్యమైన రూపములో( త్రిశక్తి రూపంలో) క్రమ సంయోగ వియోగ సంయోగాత్మక స్వరూపములో
మొత్తం విశ్వసృష్టి నిర్మాణం ఐనది . బిందు రూపం ఉన్న ఈ జీవశక్తిలో జ్ఞానము తనకు
తాను స్వయంకృతమున సృష్టి సూక్ష్మము నుండి బాహ్య జగత్తుగా లేదా దృశ్యమాన జగత్తుగా
వచ్చిపోతూ ఉంటుంది సృష్టి స్థితిలయలు జరిగినా ఈ జ్ఞానము ఎప్పుడు మృతము కానిదై
అనాది సనాతనమై ఉంటుంది. ఇది ప్రతి ఒక్క
జీవిలో జరుగుతూ ఉంటుంది కానీ మిగిలిన జీవరాశుల కన్నామానవులు విచక్షణ ఉండటంతో మన లోపలికి మనం మౌనం ధ్యానం
ద్వారా ప్రయాణం చేస్తూ చూస్తూ ఉంటే అదంతా తానే అని తెలుస్తుంది తానే సృష్టికర్తనని
సనాతనమగు ఆ జీవజ్ఞానామృత బిందు శక్తి నేనని
కనుగొనుట జరుగును.
వృక్షం యొక్క స్వరూపమంతయు కనిపించకుండా
విత్తనములో మరుగై మర్మమై ఉన్నట్లే మహావృక్షముగా మారినట్లే అమృతమైన అమృతమయమైన
జీవత్వమునొందిన జ్ఞానము బిందు రూపంగా
విత్తనము వలే ఉండి ఈ విశ్వముగా దృశ్యమాన జగత్తుగా విస్తరించినది ఇలా నువ్వు
మొదలు బ్రహ్మాండము వరకు జీవజ్ఞానామృత బిందువు ప్రతి ఒక్కరిలో నిండి పరిపూర్ణమై
ఉన్నది విశ్వముగా పరిఢవిల్లి నది దీనినే బాబాజీ మహా మనస్సు మహా ప్రాణము మహా
తేజస్సు అని చెబుతారు ఆ మహా తేజస్సు నుండి చైతన్యముగా మనసుగా సర్వ జీవరాసులు మహా
ప్రాణమును ఆధారంగా చేసుకుని ప్రాణులుగా దిగివచ్చినవి. ఆ ప్రాణుల కర్మల ఆధారముగా
అవే సంస్కారములుగా మారి జన్మకు వచ్చుట జరుగుచున్నది కనుక ఈ విశ్వం అంతటను
అన్నింటిని ఆ జీవ జ్ఞానామృత బిందు శక్తి తేజస్వర తరంగ నాదములుగా అన్నిటిని నిండి ఉన్నది. ఇదే పూర్ణత్వము ఈ జీవ
జ్ఞానామృత బిందువునకు భిన్నముగా ఏమీ లేదు దీన్నే అన్ని నేనే అంతా నేనే అన్న
సత్యమునకు మూలము అంటారు అదే జ్యోతిర్మయి మని అంటారు ఈ బిందు శక్తిలో శూన్యతత్వము
దివ్య జగత్తు,సూక్ష్మజగత్తు, ప్రకృతి విశ్వమంతయు దాగి ఉన్నది దీన్ని తెలుసుకొనుటకే
మౌనము ధ్యానము తపస్సు సత్కర్మాచరణ శాంతము అహింస తపస్సు మొదలగుసత్వ గుణాలతో సాధన
చేస్తూ తన శరీరంలో తన పయనం చేస్తూ తెలుసుకోవాలి గాని మరి దేని వలన తెలియదు అప్పుడే
జీవ జ్ఞానామృత బిందుస్థితి మూలమునకు చేరుకొనుట జరుగును ఇదే శివోహం ఇదే అహం
బ్రహ్మాస్మి,సహస్వాహం ఇదే అహం జ్యోతి.
( ఇది చాలా తక్కువగా సంగ్రహంగా చెప్పబడినది ఒకటికి పది సార్లు చదివి అవగతం
చేసుకోవాలి.
జై బాబా
ఇందు ఏమైనా దోషములు ఉన్నా సవరించ ప్రార్థన.
మీ
జ్యోతి కిరణం విజయ
(Vijaya Teacher, Vizianagaram, Andhra Pradesh