Translate

Sunday, April 6, 2025

🙏జీవజ్ఞానామృత బిందు శక్తి 🙏(దివ్య గ్రంథము నుండి )- Jyothirbaba

 🙏జీవజ్ఞానామృత బిందు శక్తి 🙏(దివ్య గ్రంథము నుండి )



 ఎల్లప్పుడూ నిత్యము ఉండేది సనాతనమైనది ఉనికి లేని స్థితిలో ఉండేటటువంటి ఏదైతే ఉన్నదో అది బిందువుగా చెప్పబడి ఉన్నది స్వయంకృతమున ఆ బిందువు కదలి శబ్దము ఏర్పడి రూపకల్పన జరిగి ఉనికిగా అంతర్గతముగా ఉండి వ్యక్తం చేయుటకు వే రే లేనిదై విభజించుటకు వీలు లేనిదై చలించుటకు వీలులేనిదై ఉన్నది. అదే స్వాత్మ స్వరూపముగా, "నేను" గా సనాతనుడనై సత్య స్థితిలో  తరువాత సూక్ష్మ జగత్తుగా ఏర్పడి అగోచరము అవ్యక్తము అగు ప్రకృతి (అపరా ప్రకృతి)  బిందు  రూపంలో ఓంకార నాదమై తేజస్వర తరంగాలుగా చైతన్యము, జ్ఞానము, శక్తి, అను మూడు శక్తులు వీటి యొక్క క్రమ సంయోగ వియోగ సంయోగాత్మకంగా లోపల సంయోగములతో ఏర్పడినదే జీవజ్ఞానామృత బిందు శక్తి. కంటికి కనిపించని ఈ శక్తి మహా మనస్సు ఇదే మహా తేజస్సు ఇదే మహా ప్రాణము. సమతుల్యతతో కూడిన క్రమ సంయోగ వియోగ సంయోగత్మకమైనటువంటి పరిణామములు చెందుతూ ప్రకృతిగా ఏర్పడినది.మనం అర్థమయ్యే రీతిలో చెప్పుకుందాం అంటే ఒక అణువు తో ఒక అణువు కలిసి అనేకణువులుగా అనేకణువులు కొత్త అణువులతో కలిసి కొత్త అణువులుగా కొత్త పదార్థాలుగా ఒక పదార్థంతో ఒక పదార్థం కలిసి కొత్త పదార్థం ఏర్పడినట్లు మనం రసాయన శాస్త్రంలో చెప్పినట్టుగా ఒకదానితో ఒకటి కలిసి రకరకాలుగా ఫార్మేషన్స్, రియాక్షన్స్, జీవ శాస్త్రంలో కొత్త జీవాలను కొనుగోనుట (బయో టెక్నాలజీ) ఇవన్నీ క్రమసంయోగ వియోగాత్మకమైన నిర్మాణమే. శాస్త్ర సాంకేతిక విజ్ఞానం అంతా కూడా ఈ క్రమ సంయోగ వియోగాత్మకమైనటువంటి పరిణామ రూపమే. మనలో కూడా ఈ క్రమ సంయోగ వియోగాత్మకమైనటువంటి పరిణామములు జరుగుతూనే ఉండును. మన ఇంద్రియములు వినడం ద్వారా చూడడం ద్వారా చెప్పడం ద్వారా అనుభవించడం ద్వారా స్ప్రుశించడం చడం ద్వారా ఈ మనసు వాటితో సంయోగం చెంది తలపులుగా అనుభూతులుగా అనుభవాలుగా నిత్యం ఆగకుండా మార్పు చెందుతూ కర్మలు చేస్తూనే ఉంటుంది. ఈ ప్రకృతి అంతా అణువు మొదలు బ్రహ్మాండము వరకు ఈ జీవ జ్ఞానామృత బిందు శక్తి అన్నింటా ప్రాణముగా, మనసుగా నిండి ఉన్నది. బ్రహ్మాండ జ్ఞానమంతా ఈ జీవ జ్ఞానామృత బిందు శక్తి లో అదృశ్యముగా దాగి ఉన్నది. ప్రతి జీవిలో ఇది అజ్ఞాతముగా అవిభాజ్యమై( విభజించుటకు వీలు లేనిది ) తేజస్వరతరంగమైన నాదముగా అదే శబ్దముగా ఉన్నది కనుక మనము మనలోనున్న నాదముచే సంవిధానము కావించుకొనిన ఎడల  ఆ జీవజ్ఞానామృత స్థితిని చేరి జ్యోతి స్వరూపము పొందెదము.ఆది అంతము లేని శుద్ధ నిశ్శబ్దముగా ఉండెదము. దీన్నే బాబాజీ సృష్టి స్థితి లయ కారకుడు నీవే అని నీవే సృష్టికర్తవని స్వాత్మ వై నీలో నీవు ఉండి స్వయంగా తెలుసుకోవాలని చెప్పారు.

 ఇక జీవజ్ఞానామృత బిందు శక్తి అంటే చాలా తక్కువగా అర్థమయ్యే విధంగా చెప్పుకుందాం

 కనిపించకుండా బీజరూపములో ఉండునది ఏదో దానినే బిందువు అంటారు ఈ బిందువులో జీవము సత్యమై నిత్యమై మృతము లేనిదై అనగా చావులేనిదై జ్ఞానము రూపంలో ఉంటుంది కనుక ఇది అమృతము. బాబాజీ విత్తనమును  వృక్షమును ఉదాహరణగా తీసుకొని చెబుతారు విత్తనములో అన్నీ ఉన్న ఏమీ కనబడదు కానీ మహా వృక్షముగా మారుటకు అవసరమైన జ్ఞానము దానిలో దాగి ఉంది అది గుప్తమగు జ్ఞానము మన భాషలో చెప్పాలి అంటే ఒక విధమైన బ్లూ ప్రింట్ గా చెప్పుకోవచ్చు. ఇది సర్వ జీవరాశులలో జన్మకు రాకముందు జీవశక్తిలో దాగి ఉన్న జ్ఞానము. ఈ సృష్టిలో అణువు మొదలు బ్రహ్మాండము వరకు విశ్వమంతా ఈ జీవశక్తి నిండి అమృతమయమై దాగి ఉన్నది ఈ జీవజ్ఞానామృత బిందువు నందు చైతన్యము జ్ఞానము శక్తి అదృశ్యమైన రూపములో( త్రిశక్తి రూపంలో) క్రమ సంయోగ వియోగ సంయోగాత్మక స్వరూపములో మొత్తం విశ్వసృష్టి నిర్మాణం ఐనది . బిందు రూపం ఉన్న ఈ జీవశక్తిలో జ్ఞానము తనకు తాను స్వయంకృతమున సృష్టి సూక్ష్మము నుండి బాహ్య జగత్తుగా లేదా దృశ్యమాన జగత్తుగా వచ్చిపోతూ ఉంటుంది సృష్టి స్థితిలయలు జరిగినా ఈ జ్ఞానము ఎప్పుడు మృతము కానిదై అనాది సనాతనమై  ఉంటుంది. ఇది ప్రతి ఒక్క జీవిలో జరుగుతూ ఉంటుంది కానీ మిగిలిన జీవరాశుల కన్నామానవులు   విచక్షణ ఉండటంతో మన లోపలికి మనం మౌనం ధ్యానం ద్వారా ప్రయాణం చేస్తూ చూస్తూ ఉంటే అదంతా తానే అని తెలుస్తుంది తానే సృష్టికర్తనని సనాతనమగు ఆ జీవజ్ఞానామృత బిందు శక్తి నేనని  కనుగొనుట జరుగును. 

 వృక్షం యొక్క స్వరూపమంతయు కనిపించకుండా విత్తనములో మరుగై మర్మమై ఉన్నట్లే మహావృక్షముగా మారినట్లే అమృతమైన అమృతమయమైన జీవత్వమునొందిన జ్ఞానము బిందు రూపంగా  విత్తనము వలే ఉండి ఈ విశ్వముగా దృశ్యమాన జగత్తుగా విస్తరించినది ఇలా నువ్వు మొదలు బ్రహ్మాండము వరకు జీవజ్ఞానామృత బిందువు ప్రతి ఒక్కరిలో నిండి పరిపూర్ణమై ఉన్నది విశ్వముగా పరిఢవిల్లి నది దీనినే బాబాజీ మహా మనస్సు మహా ప్రాణము మహా తేజస్సు అని చెబుతారు ఆ మహా తేజస్సు నుండి చైతన్యముగా మనసుగా సర్వ జీవరాసులు మహా ప్రాణమును ఆధారంగా చేసుకుని ప్రాణులుగా దిగివచ్చినవి. ఆ ప్రాణుల కర్మల ఆధారముగా అవే సంస్కారములుగా మారి జన్మకు వచ్చుట జరుగుచున్నది కనుక ఈ విశ్వం అంతటను అన్నింటిని ఆ జీవ జ్ఞానామృత బిందు శక్తి తేజస్వర తరంగ నాదములుగా  అన్నిటిని నిండి ఉన్నది. ఇదే పూర్ణత్వము ఈ జీవ జ్ఞానామృత బిందువునకు భిన్నముగా ఏమీ లేదు దీన్నే అన్ని నేనే అంతా నేనే అన్న సత్యమునకు మూలము అంటారు అదే జ్యోతిర్మయి మని అంటారు ఈ బిందు శక్తిలో శూన్యతత్వము దివ్య జగత్తు,సూక్ష్మజగత్తు, ప్రకృతి  విశ్వమంతయు దాగి ఉన్నది దీన్ని తెలుసుకొనుటకే మౌనము ధ్యానము తపస్సు సత్కర్మాచరణ శాంతము అహింస తపస్సు మొదలగుసత్వ గుణాలతో సాధన చేస్తూ తన శరీరంలో తన పయనం చేస్తూ తెలుసుకోవాలి గాని మరి దేని వలన తెలియదు అప్పుడే జీవ జ్ఞానామృత బిందుస్థితి మూలమునకు చేరుకొనుట జరుగును ఇదే శివోహం ఇదే అహం బ్రహ్మాస్మి,సహస్వాహం ఇదే అహం జ్యోతి.

( ఇది చాలా తక్కువగా సంగ్రహంగా చెప్పబడినది ఒకటికి పది సార్లు చదివి అవగతం చేసుకోవాలి.

 జై బాబా

 ఇందు ఏమైనా దోషములు ఉన్నా సవరించ ప్రార్థన. 

మీ జ్యోతి కిరణం విజయ (Vijaya Teacher, Vizianagaram, Andhra Pradesh

No comments:

Post a Comment