🧘♂️సప్త ఋషుల🧘♀️ Sapta Rishis- Telugu🧘♀️
భాద్రపద శుద్ధ పంచమిని ఋషి పంచమిగా వ్యవహరిస్తారు..... ఆరోజున అత్రి, కశ్యప, భరద్వాజ, గౌతమ, వశిష్ట, విశ్వామిత్ర జమదగ్ని మహర్షుల గురించి ఒక్కసారైనా తలచుకోవాలని చెబుతారు పెద్దలు.*
అరణ్యవాసంలో సీతారాములకు అభయమిచ్చినవాడు అత్రి మహర్షి.
సాక్షాత్తూ శ్రీహరినే పుత్రునిగా పొందిన మహానుభావుడు..... సీతారాములకు చిత్రకూటానికి దారి చూపినవాడు. భరద్వాజ మహర్షి.
తన భార్య అహల్య ద్వారా రామునికి తన తప:ఫలాన్ని అందింపజేసిన మహారుషి గౌతముడు.
రాముని గురువు విశ్వామిత్రుడు...... కులగురువు వశిష్టుడు.
విష్ణువు అంశావతారమైన పరశురాముని కన్న తండ్రి జమదగ్ని మహర్షి.
దశావతారాల్లో ఒకటైన వామనుడి జనకుడు.
కశ్యపమహర్షి.
ఋషిపంచమినాడు రామాయణం చదివితే ఈ మహర్షులందరినీ తలుచుకున్నట్టే.....
యోగులలో పరబ్రహ్మమే ప్రథమ యోగి. ఇతడు సర్వజ్ఞుడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు యోగ నిద్రలో ఉండి యోగమాయతో ఈ సృష్టిని నిర్వహించు చున్నారు. వేద విజ్ఞానము ముందుగా అగ్ని, వాయువు, ఆదిత్యుడు, అంగీరసులను వారిలో ప్రకాశించెను.
సృష్టి ప్రారంభమున ఋషివర్గమంతయు స్వయంగా ఉద్భవించి జ్ఞానము, శ్రవణము, తపస్సు అను నిశ్చిత రూపములో ఉండియున్నారు. వీరినే బ్రహ్మవేత్తలు అనియు, ఇంద్రియములను జయించి బ్రహ్మనిష్ఠను పొందినవారనియు పిలిచిరి.
మునులు అనగా మనన శీలులై ఎల్లపుడు పరమాత్మయందు లీనమై, పరమాత్మనే స్వస్వరూపముగా ధ్యానించువారు. వీరు ఆత్మ సర్వవ్యాప్తము, సర్వ శ్రేష్ఠమని ఆరూఢమై యుందురు.
దేవలోకమున నివసించువారిని దేవర్షులనిరి. వీరు త్రికాలజ్ఞులు, మంత్ర ప్రవక్తలు, సత్యవాదులు, గొప్ప తపశ్శక్తితో సర్వలోకములలో నిరంతరము సంచరించుచూ, దేవతలను కూడా తమ అధీనములో ఉంచుకొనువారు. ఇట్టి లక్షణములు కల దేవతలు, బ్రహ్మణులు, రాజర్షులు, శూద్రులు కూడా దేవర్షులన బడుదురు.
ఉదాహరణ:- నరనారాయణులు, నారదుడు, వ్యాసుడు మొదలగువారు.
సనకసనందనాదులు కూడా బ్రహ్మ మానస పుత్రులే. వీరు బ్రహ్మ మనస్సు నుండి పుట్టినవారు. వీరు అందరకు జ్ఞానము ప్రసాదించిన ఆచార్యులు.
మనువులు పదునాల్గురు. ప్రతి మన్వంతరమునకు మనువులు మారుచుందురు. వారితోపాటు సప్త ఋషులు, దేవతలు, ఇంద్రుడు, మనుపుత్రులు కూడా మారిపోదురు.
సప్త ఋషులు, బ్రహ్మ మానస పుత్రులు భగవత్ కార్యములను ఆచరించుచుందురు. వీరు మరీచి, ఆత్రి, పులహుడు, వసిష్టుడు, అంగీరసుడు, పులస్త్యుడు, క్రతువు. వీరు ధర్మరక్షకులు, లోకరక్షకులు.
విశ్వామిత్రుడు జమదగ్ని, భరద్వాజుడు, గౌతముడు, కశ్యపుడు మొదలగువారు బ్రహ్మ మానస పుత్రులు కాదు. పిదప బ్రహ్మర్షి అయినవారు.
వసిష్టుడు సప్త ఋషులలో శ్రేష్ఠుడు. శ్రీరామచంద్రుని గురువు. వీరి ధర్మ పత్ని అరుంధతి. అష్ట సిద్ధులు కలవారు. వీరి నూర్గురు కుమారులను విశ్వామిత్రుడు వధించినను ప్రతీకారము తీర్చుకొనలేదు. తపస్సు కంటెను సత్‌సాంగత్యము గొప్పదని విశ్వామిత్రునితో వాదించి రుజువుచేసెను. శ్రీయోగ వాసిష్టి గ్రంథము, శ్రీవసిష్టునికి, శ్రీరామచంద్రునికి జరిగిన సంవాదమే. ఇది వసిష్ట గీత అని పిలువబడినది.
సప్త ఋషులలో ఒకడైన మరీచికి అనేక మంది భార్యలు కుమారులు కలరు. కశ్యప మహర్షి ఈయన కుమారుడే. బ్రహ్మ పురాణమును మొదట బ్రహ్మదేవుడు మరీచికి వినిపించెను.
అత్రి మహర్షి గొప్పతపస్సంపన్నుడు. మహా పతివ్రత అయిన అనసూయ ఈయన ధర్మపత్నియే. అనసూయ కపిల మహర్షి యొక్క చెల్లెలు. వీరికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ప్రత్యక్షమై, వీరి అంశతో దత్తాత్రేయులు విష్ణు అంశతో జన్మించెను. అలాగే చంద్రుడు బ్రహ్మ అంశతోనూ, దుర్వాసుడు శివుని అంశతోనూ జన్మించిరి.
పులస్త్యుడు సమస్త యోగ శాస్త్ర పారంగుతుడు. మహా తపస్వి. ధర్మ పరాయణుడు. వీరికి ముగ్గురు భార్యలు కలరు. పెక్కు మంది కుమారులు కలరు. విశ్వవసువు వీరికుమారులు. కుబేరుడు, రావణుడు, కుంభకర్ణుడు, విభీషణులు విశ్వవసువు కుమారులే.
పులహుడు మహజ్ఞాని. వీరు సనందన మహర్షి నుండి జ్ఞానమును పొందిరి. వీరికి ఇద్దరు భార్యలు ఒకరు దక్షప్రజాపతి కుమారై అయిన 'క్షమ', రెండవ వారు కర్దమ పుత్రిక అయిన 'గతి' అనువారు. వీరికి అనేక మంది పుత్రులు, పుత్రికలు కలరు.
క్రతువు మహాతేజస్సంపన్నుడు. ఇతనికి ఇద్దరు భార్యలు. ఒకరు కర్దమ మహార్షి పుత్రిక 'క్రియ' ఇంకొకరు దక్ష కుమార్తె 'సన్నతి' వీరి వలన వాలఖిల్యులు అను పేరు గల్గిన అరవై వేల మంది ఋషులు జన్మించారు.
అంగీరసుడు అసాధారణ ఋషి. అధ్యాత్మిక తేజోసంపన్నుడు.
సప్త ఋషులు బ్రహ్మ ద్వారా సృష్టించబడి సంతాన ఉత్పత్తికి తద్వారా భూలోక ప్రజా జీవనమునకు, ప్రధాన కారకులైరి.
సప్త ఋషుల లక్షణములు:- బ్రహ్మ మానస పుత్రులు, తేజోమూర్తులు, ధర్మాచరణ ప్రవక్తలు, ప్రజాపతులు, దీర్ఘాయువులు, వేదమంత్రప్రవక్తలు, దివ్యశక్తి, సంకల్ప శక్తి గల్గి దివ్య దృష్టి కలవారు, సర్వ ధర్మమర్మజ్ఞులు యజ్ఞములు చేయుట, చేయించుటలో ప్రవీణులు, గురుకులముల ద్వారా విద్యాభివృద్ధికి తోడ్పడతారు. సంతాన ప్రాప్తికి గృహస్తాశ్రమములు స్వీకరించిరి. సంతానము, గోధన సంపన్నులు. ప్రాపంచిక భోగములందు ఆసక్తి లేని వారు. మనస్సును జయించినవారు. వాక్ శుద్ధి కలిగిన వారు.
ఇతర మహా ఋషులలో ముఖ్యులు:
కాక భుషుండి మహర్షి:- ఇతని చే రచింపబడిన 'కాక భుజందర్ నాడీ'. అను గ్రంథము చాలా ప్రసిద్ధి చెందినది. ఈ గ్రంథములో అనేక ఆశ్చర్యకర విశేషములతో పాటు ఎన్నో రహస్యాలు వర్ణింపబడినవి. కేవలము కారణజన్ములు. అవతారముర్తులను గూర్చి వారి రహస్యములను ఇందు తెలుపబడినవి.
పరాశరమహర్షి:- వీరు రచించిన ''హోరానాడి'' అను గ్రంథము అద్భుతము, ఆశ్చర్యకరమైనది. అందు యోగజ్ఞానము, సత్యజ్ఞానము, లోకజ్ఞానము, సృష్టి రహస్యములు తెలుపబడినవి. భూతభవిష్యత్ విషయములు వర్ణింపబడినవి.
కపిల మహర్షి:- అణువులో బ్రహ్మశక్తిని ధర్శించిన వారిలో కణ్వ, గౌతమ మహర్షుల తర్వాత కపిల మహర్షిని పేర్కొనబడిరి. అణువు నందు గల శక్తియే బ్రహ్మము అను అణు సిద్ధాంతాన్నీ మొదట కపిల మహర్షి రూపొందించారు.
విశ్వా మిత్రుడు:- ఇతడు పదివేల సంవత్సరములు తపస్సు చేసిన క్షత్రియుడు బ్రహ్మర్షి అయ్యెను. దశరధుని కుమారుడైన రామచంద్రుని తన యాగ రక్షణుకు తీసుకొని వెళ్ళి అతనికి అనేక అస్త్ర శస్త్రములను బోధించినవాడు. వీరు కాక వాల్మికి, కర్దముడు, భృగువు, చ్యవనుడు, ఉద్దాలకుడు, ఉశీలుడు, వామదేవుడు, దుర్వాసుడు, భరద్వాజుడు, బుచీకుడు మొదలైన అనేక మంది వేద వేదాంగ పారంగతులైరి.
ఈ ప్రపంచమున నివశించు ప్రజలందరు ఎవరికి సంతతి అయినారో అట్టి పూర్వీకులైన సప్తఋషులకు కూడా సనక సనందనాదులు, వసువులు, దేవర్షులు మొదలగువారు చాలా పూర్వీకులు. వీరందరినుండియె ఈ ప్రపంచములోని జనులందరు పుట్టిరి. అందుకే వారి గోత్రనామాలను మనము ఇప్పటికి వంశానుసారముగా కలిగి యున్నాము.
🕉️🌞🌏🌙🌟🚩
సప్తఋషి ధ్యాన శ్లోకములు :-
కశ్యప ఋషి :-
కశ్యపస్సర్వ లోకాఢ్యః సర్వ శాస్త్రార్థ కోవిదః| ఆత్మయోగ బలేనైవ సృష్టి స్థిత్యంత కారకః||
ఓం అదితి సహిత కశ్యపాయ నమః||
అత్రి ఋషి :- అగ్నిహోత్రరతం శాంతం సదావ్రత పరాయణమ్| సత్కర్మనిరతం శాంత మర్చయే దత్రిమవ్యయమ్|| ఓం అనసూయా సహిత అత్రయేనమః||
భరద్వాజ ఋషి :- జటిలం తపసాసిద్ధం యఙ్ఞ సూత్రాక్ష ధారిణమ్| కమండలు ధరం నిత్యం భరద్వాజం నతోస్మ్యహమ్|| ఓం సుశీలా సహిత భరద్వాజాయ నమః||
విశ్వామిత్ర ఋషి :- కృష్ణాజిన ధరం దేవం సదండ పరిధానకమ్| దర్భపాణిం జటాజూటం విశ్వామిత్రం సనాతనమ్|| ఓం కుముద్వతీ సహిత విశ్వామిత్రాయనమః||
గౌతమ ఋషి :- యోగాఢ్యః సర్వభూతానాం అన్నదానరతస్సదా| అహల్యాయాః పతిశ్శ్రీమాన్ గౌతమస్సర్వ పావనః|| ఓం అహల్యా సహిత గౌతమాయనమః||
జమదగ్ని ఋషి :- అక్షసూత్ర ధరం దేవం ఋషీనామధిపం ప్రభుమ్| దర్భపాణిం జటాజూటం మహాతేజస్వినం భజే|| ఓం రేణుకా సహిత జమదగ్నయే నమః
వసిష్ఠ ఋషి :- శివధ్యాన రతం శాంతం త్రిదశైరభి పూజితమ్| బ్రహ్మసూనుం మాహాత్మానం వసిష్ఠం పూజయేత్సదా||
ఓం అరుంధతీ సహిత వసిష్ఠాయ నమః||
కశ్యపత్రి ర్భరద్వాజో విశ్వా మిత్రోథ గౌతమః|
వసిష్ఠో జమదగ్నిశ్చ సప్తయతే ఋషయస్తథా||
సప్తఋషిభ్యో నమః
------------------------------------------------------------------------------------------
Indian ఋషులు జాబితా
అక్షర క్రమంలో హిందూ ఋషుల పేర్లు
అ - ఆ - ఇ - ఈ - ఉ - ఊ - ఋ - ఎ - ఏ - ఐ - ఒ - ఓ - ఔ - అం - క - ఖ - గ - ఘ - చ - ఛ - జ - ఝ - ట - ఠ - డ - ఢ - త - థ - ద - ధ - న - ప - ఫ - బ - భ - మ -య - ర - ల - వ - శ - ష - స - హ - ళ - క్ష
- దేవర్షి దేవలోకంలో ప్రతిష్ఠి కలవారు దేవర్షులు.
- బ్రహ్మర్షి ఉత్తమ శ్రేణికి చెందిన మహర్షులను బ్రహ్మర్షులు అంటారు.
- మహర్షి సామాన్య ఋషి స్థాయిని దాటిని గొప్ప ఋషులను మహర్షి అంటారు.
- రాజర్షి రాజుగా ఉంటూనే ఋషిత్వం పొందినవాడు రాజర్షి.
అ
- అగ్ని మహర్షి
- అగస్త్య మహర్షి
- అంగీరస మహర్షి
- అంగిరో మహర్షి
- అత్రి మహర్షి
- అర్వరీవత మహర్షి
- అభినామన మహర్షి
- అగ్నివేశ మహర్షి
- అరుణి మహర్షి
- అష్టావక్ర మహర్షి
- అష్టిక మహర్షి
- అథర్వణ మహర్షి
- ఆత్రేయ మహర్షి
- అథర్వాకృతి
- అమహీయుడు
- అజామిళ్హుడు
- అప్రతిరథుడు
- అయాస్యుడు
- అవస్యుడు
- అంబరీషుడు
ఇ
ఇరింబిఠి
ఉ
ఉపమన్యు మహర్షి
ఉత్తమ మహర్షి
ఉన్మోచన
ఉపరిబభ్రవుడు
ఉద్దాలకుడు
ఉశనసుడు
ఉత్కీలుడు
ఊ
ఊర్ఝ మహర్షి
ఊర్ద్వబాహు మహర్షి
ఋ
ఋచీక మహర్షి
ఋషభ మహర్షి
ఋష్యశృంగ మహర్షి
ఋషి
ఔ
ఔపమన్యవ మహర్షి
ఔరవ మహర్షి
క
కపిల మహర్షి
కశ్యప మహర్షి
క్రతు మహర్షి
కౌకుండి మహర్షి
కురుండి మహర్షి
కావ్య మహర్షి
కాంభోజ మహర్షి
కంబ స్వాయంభువ మహర్షి
కాండ్వ మహర్షి
కణ్వ మహర్షి
కాణ్వ మహర్షి
కిందమ మహర్షి
కుత్స మహర్షి
కౌరుపథి
కౌశికుడు
కురువు
కాణుడు
కలి
కాంకాయనుడు
కపింజలుడు
కుసీదుడు
గ
గౌతమ మహర్షి
గర్గ మహర్షి
గృత్సమద మహర్షి
గృత్సదుడు
గోపథుడు
గోతముడు
గౌరీవీతి
గోపవనుడు
గయుడు
చ
చ్యవన మహర్షి
చైత్ర మహర్షి
చాతనుడు
జ
జమదగ్ని మహర్షి
జైమిని మహర్షి
జ్యోతిర్ధామ మహర్షి
జాహ్న మహర్షి
జగద్బీజ
జాటికాయనుడు
త
తండి మహర్షి
తిత్తిరి మహర్షి
త్రితుడు
తృణపాణి
ద
దధీచి మహర్షి
దుర్వాస మహర్షి
దేవల మహర్షి
దత్తోలి మహర్షి
దాలయ మహర్షి
దీర్ఘతమ మహర్షి
ద్రవిణోదస్సు
న
నచికేత మహర్షి
నారద మహర్షి
నిశ్ఛర మహర్షి
సుమేధా మహర్షి
నోధా
నృమేధుడు
ప
పరశురాముడు
పరాశర మహర్షి
పరిజన్య మహర్షి
పులస్త్య మహర్షి
ప్రాచేతస మహర్షి
పులహ మహర్షి
ప్రాణ మహర్షి
ప్రవహిత మహర్షి
పృథు మహర్షి
పివర మహర్షి
పిప్పలాద మహర్షి
ప్రత్య్సంగిరసుడు
పతివేదనుడు
ప్రమోచన
ప్రశోచనుడు
ప్రియమేథుడు
పార్వతుడు
పురుహన్మ
ప్రస్కణ్వుడు
ప్రాగాథుడు
ప్రాచీనబర్హి
ప్రయోగుడు
పూరుడు
పాయు
బ
భరద్వాజ మహర్షి
భృగు మహర్షి
భృంగి మహర్షి
బ్రహ్మర్షి మహర్షి
బభ్రుపింగళుడు
భార్గవవైదర్భి
భాగలి
భృగ్వంగిరాబ్రహ్మ
బ్రహ్మస్కందుడు
భగుడు
బ్రహ్మర్షి
బృహత్కీర్తి
బృహజ్జ్యోతి
భర్గుడు
మ
మరీచి మహర్షి
మార్కండేయ మహర్షి
మిత మహర్షి
మృకండు మహర్షి
మహాముని మహర్షి
మధు మహర్షి
మాండవ్య మహర్షి
మాయు
మృగారుడు
మాతృనామ
మయోభువు
మేధాతిథి
మధుచ్ఛందుడు
మనువు
మారీచుడు
మైత్రేయ
య
యాజ్ఞవల్క మహర్షి
యయాతి
ర
రురు మహర్షి
రాజర్షి మహర్షి
రేభుడు
వ
వశిష్ట మహర్షి
వాలఖిల్యులు
వాల్మీకి మహర్షి
విశ్వామిత్ర మహర్షి
వ్యాస మహర్షి
విభాండక ఋషి
వాదుల మహర్షి
వాణక మహర్షి
వేదశ్రీ మహర్షి
వేదబాహు మహర్షి
విరాజా మహర్షి
వైశేషిక మహర్షి
వైశంపాయన మహర్షి
వర్తంతు మహర్షి
వృషాకపి
విరూపుడు
వత్సుడు
వేనుడు
వామదేవుడు
వత్సప్రి
విందుడు
శ
శంఖ మహర్షి
శంకృతి మహర్షి
శతానంద మహర్షి
శుక మహర్షి
శుక్ర మహర్షి
శృంగి ఋషి
శశికర్ణుడు
శంభు
శౌనకుడు
శంయువు
శ్రుతకక్షుడు
స
సమ్మిత మహర్షి
సనత్కుమారులు
సప్తర్షులు
స్థంభ మహర్షి
సుధామ మహర్షి
సహిష్ణు మహర్షి
సాంఖ్య మహర్షి
సాందీపణి మహర్షి
సావిత్రీసూర్య
సుశబ్దుడు
సుతకక్షుడు
సుకక్షుడు
సౌభరి
సుకీర్తి
సవితామహర్షి సామావేదానికి మూలము.
సింధుద్వీపుడు
శునఃశేపుడు
సుదీతి
హ
హవిష్మంత మహర్షి
హిరణ్యరోమ మహర్షి.
No comments:
Post a Comment