Translate

Saturday, November 5, 2022

శ్రీభైరవతాండవస్తోత్రం ( Bairava Strotram in Telugu)

శ్రీభైరవతాండవస్తోత్రం

 https://www.youtube.com/watch?v=PyqNLu9cHa8&ab_channel=SatyaNarayanTewari%2CPareekBhajans


శ్రీగణేశాయ నమః . శ్రీఉమామహేశ్వరాభ్యాం నమః .....శ్రీగురవే నమః ...శ్రీభైరవాయ నమః ..

 

అథ శ్రీభైరవతాండవస్తోత్రం .

ఓం చండం ప్రతిచండం కరధృతదండం కృతరిపుఖండం సౌఖ్యకరం

లోకం సుఖయంతం విలసితవంతం ప్రకటితదంతం నృత్యకరం .

డమరుధ్వనిశంఖం తరలవతంసం మధురహసంతం లోకభరం

భజ భజ భూతేశం ప్రకటమహేశం భైరవవేషం కష్టహరం .. 1..

 

చర్చితసిందూరం రణభూవిదూరం దుష్టవిదూరం శ్రీనికరం

కింకిణిగణరావం త్రిభువనపావం ఖర్ప్పరసావం పుణ్యభరం .

కరుణామయవేశం సకలసురేశం ముక్తసుకేశం పాపహరం

భజ భజ భూతేశం ప్రకటమహేశం శ్రీభైరవవేషం కష్టహరం .. 2..

 

కలిమలసంహారం మదనవిహారం ఫణిపతిహారం శీఘ్రకరం

కలుషం శమయంతం పరిభృతసంతం మత్తదృగంతం శుద్ధతరం .

గతినిందితకేశం నర్తనదేశం స్వచ్ఛకశం సన్ముండకరం

భజ భజ భూతేశం ప్రకటమహేశం శ్రీభైరవవేశం కష్టహరం .. 3..

 

కఠినస్తనకుంభం సుకృతం సులభం కాలీడింభం ఖడ్గధరం

వృతభూతపిశాచం స్ఫుటమృదువాచం స్నిగ్ధసుకాచం భక్తభరం .

తనుభాజితశేషం విలమసుదేశం కష్టసురేశం ప్రీతినరం

భజ భజ భూతేశం ప్రకటమహేశం శ్రీభైరవవేశం కష్టహరం .. 4..

 

లలితాననచంద్రం సుమనవితంద్రం బోధితమంద్రం శ్రేష్ఠవరం

సుఖితాఖిలలోకం పరిగతశోకం శుద్ధవిలోకం పుష్టికరం .

వరదాభయహారం తరలితతారం క్షుద్రవిదారం తుష్టికరం

భజ భజ భూతేశం ప్రకటమహేశం శ్రీభైరవవేషం కష్టహరం .. 5..

 

సకలాయుధభారం విజనవిహారం సుశ్రవిశారం భ్రష్టమలం

శరణాగతపాలం మృగమదభాలం సంజితకాలం స్వేష్టబలం .

పదనూపూరసింజం త్రినయనకంజం గుణిజనరంజన కుష్టహరం

భజ భజ భూతేశం ప్రకటమహేశం శ్రీభైరవవేషం కష్టహరం .. 6..

 

మర్దయితుసరావం ప్రకటితభావం విశ్వసుభావం జ్ఞానపదం

రక్తాంశుకజోషం పరికృతతోషం నాశితదోషం సన్మతిదం .

కుటిలభ్రుకుటీకం జ్వరధననీకం విసరంధీకం ప్రేమభరం

భజ భజ భూతేశం ప్రకటమహేశం శ్రీభైరవవేషం కష్టహరం .. 7..

 

పరినిర్జితకామం విలసితవామం యోగిజనాభం యోగేశం

బహుమద్యపనాథం గీతసుగాథం కష్టసునాథం వీరేశం .

కలయంతమశేషం భృతజనదేశం నృత్యసురేశం వీరేశం

భజ భజ భూతేశం ప్రకటమహేశం శ్రీభైరవవేషం కష్టహరం .. 8..

 

ఇతి శ్రీభైరవతాండవస్తోత్రం సంపూర్ణం ..


Friday, October 14, 2022

కపాల మోక్షం-Kapala Moksham Notes Telugu


కపాల మోక్షం




ఎప్పుడైతే మన స్థూల శరీరము నిద్రలోకి జారుకుని మన సూక్ష్మ శరీర మెలుకువ స్థితి అనగా యోగనిద్ర స్థితికి వచ్చినప్పుడు మన కుండలినీ శక్తి ప్రవాహము మన స్థూల శరీరము నందు సుష్మ నాడి యందు ప్రవేశించినప్పుడు మనకి భ్రమరీ నాదము వినపడితే మనము మూలాధార చక్రము లోని కల ప్రపంచంలోనికి మన సూక్ష్మ శరీర యానం ప్రవేశించినట్లు అన్నమాట. ఇది మన స్థూల శరీర చక్ర ప్రవాహము బట్టి మన సాధన కల ప్రపంచంలోనికి మన సూక్ష్మ శరీర యానం చేస్తుందని గ్రహించండి. అప్పుడు మనము ఆదిలో ప్రారంభ మూలాధార చక్రం ప్రపంచంలోనికి ప్రస్తుత జన్మ సూక్ష్మశరీరం ప్రవేశిస్తుంది. అక్కడ రమారమిగా మనలాంటి వాళ్లే ఉంటారు. వాళ్ళ పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు. సాధన చేసే వాళ్ళు భాగంలో ఉండే వాళ్లు మాయలో పడే వాళ్లు ఇలా భూలోకంలో ఎలా ఉంటుందో అలాగే అక్కడ ఉంటుంది. కానీ మన సూక్ష్మశరీరము ఆ లోకములోనికి ప్రవేశించినట్లు అందరికీ కనపడుతుంది. దానిని తెలిసినవాడు పలకరిస్తారు కూడా అన్నమాట. అప్పుడు మూలాధార చక్ర సాధన చేసిన నా జన్మ తాలూకూ విషయాలు అక్కడ ఉన్న వారిని కనుక్కొని అక్కడ సాధన చేస్తున్న మూలాధార జన్మ వ్యక్తి దగ్గరికి ఈ సూక్ష్మ శరీరధారి వెళ్ళటం అక్కడ ఉన్న దైవిక వస్తువులు అలాగే పొందిన అనుభవాలు వివరాలు తెలుసుకుని వెనకకు తిరిగి ప్రస్తుతం ఉన్న భూలోకంలో ఉన్న స్థూల శరీరములోనికి ప్రవేశించి అక్కడ తెలుసుకున్న అన్ని విషయాలు మన మెదడుకు సంకేతాల రూపంలో అందిస్తే అది కాస్త వివేక జ్ఞాన బుద్ధి వలన జ్ఞాన స్పందన కలిగి మర్చిపోయిన సాధన విషయాలు గుర్తుకు వస్తుంది. దానితో ఆ కల ప్రపంచంలోని సంబంధించిన దైవిక వస్తువులు ఈ లోకములో ఈ కల ప్రపంచంలో ఎక్కడ ఏ రూపంలో ఏ ప్రాంతంలో ఎవరి దగ్గర ఉన్నాయో తెలిసిపోయేది.వాటిని తిరిగి మేమిద్దరము స్థూల శరీరంతో ఆ చోటికి వెళ్లి తెచ్చుకుని లేదా వాళ్లంతట వాళ్లు చిత్రముగా వస్తువులను తిరిగి ఇచ్చేవాళ్ళు. ఆ తర్వాత యోగనిద్రను సాధన ముందుకి కొనసాగించే వాళ్ళం. ఇలా ఒక్కొక్కచక్రానికి ఒక్కొక్కనాదముతో ఆయా చక్ర కల ప్రపంచములోనికి మా యోగనిద్రసాధనతో చేరుకొని చివరికి ఈ గ్రంథం రాకముందు వరకు శంఖనాదం ద్వారా సహస్ర చక్రం వరకు స్వానుభవాలు పొందే వాళ్ళం. ఎప్పుడైతే సాధన అనేది సహస్రార చక్రము వద్ద ఆగిపోదని హృదయ చక్రం దాకా ఉంటుందని మాకు భగవద్గీత ద్వారా అలాగే అరుణాచల రమణ మహర్షి అనుభవాలు చదివేదాకా తెలిసేది కాదు. దానితో మా సాధనను కొనసాగించాలని విశ్వసృష్టి అంతమేదో చూడాలని ఫైండ్ ఫైనల్(Find Final) దాని మీద మా సాధన కొనసాగించాము. ఎందుకంటే సహస్రార చక్రము దాకానే మన ప్రపంచం అటుపై అదంతా విశ్వ కల అన్నమాట. ఇది విశ్వ మూల రహస్యాలు దాచుకున్న బ్రహ్మముడి అన్నమాట. నేను ఎవరు అనేది మనకు సహస్రంలోనే తెలిసిపోతుంది. అప్పటికి యోగనిద్ర కాలము 48 నిమిషాలు అవుతుంది.అంటే పది లక్షల సంవత్సరాలు సమానము అన్నమాట.

 

 

 

Example: మా సూక్ష్మ శరీర యానము అదే యోగనిద్రలో ఎలా ఉంటుందో నీకు బాగా అర్థం అవ్వాలి అంటే కళ్యాణ్ రామ్ నటించిన 118 సినిమా చూడండి. అందులో హీరోకి 118 లో ఉన్నప్పుడు 1గంటా 18 నిమిషాలకి(1:18) ఒక అమ్మాయి అతని కలలోకి వచ్చి జరిగిన ప్రమాదాలు చూపిస్తుంది. దీని మీద హీరో పరిశోధన చేస్తే ఆమె కాస్తా ఆ రూంలో వచ్చిన అందరికీ చూపించిన కల ఆధారంగా అందులో ఆమె చూపించిన క్లూస్ ఆధారంగా పరిశోధన చేస్తూ ఆమె చేసుకున్న బ్రాస్లేట్ లోని అసలు రహస్యం ఉందని తెలుసుకుని అది ఎక్కడ ఉందో తెలుసుకోవాలని యోగనిద్ర లోనికి వెళ్లి ఆ బ్రాస్లెట్లు ఉన్నప్పుడు జరిగిన సంఘటనలను ఆమె ఒక కల ప్రపంచంలోనికి మన హీరో చూసి వెనక్కి వచ్చి ఆమె స్థూల శరీరమును పాతిపెట్టిన స్థలమని గుర్తించి త్రవ్వించి అస్థిపంజరంగా మారిన ఆమె దేహానికి ఉన్న బ్రాస్లెట్ ని గుర్తించి దానిని బయటకు తీసి అందులో ఉన్న మెమరీ కార్డు బయటకు తీసి అందులో ఉంచిన రహస్య వీడియోలు డాక్యుమెంట్లను బయటకు తీసి చంపిన వారి వివరాలు ఎందుకు చంపిన వివరాలు అన్నీ లోకానికి తెలుస్తాయి. హీరో సూక్ష్మ శరీర యానము లాగానే నా సాధన ప్రపంచంలో అనగా మూలాధార చక్రము నుండి బ్రహ్మరంధ్రము దాక కొనసాగి అక్కడ మా పంచ శరీరాలు తెలుసుకున్న విషయాల సమాహారమే ఈ కపాలమోక్షం గ్రంథం అని తెలుసుకోండి. స్థూల శరీరంయానం విశుద్ధ చక్రం వరకు అయితే సూక్ష్మ శరీర యానం ఆజ్ఞాచక్రం నుండి సహస్రార చక్రము వరకు అయితే కారణ శరీరము సహస్రార చక్రము నుండి హృదయ చక్రము దాకా హృదయ చక్రం నుండి బ్రహ్మరంధ్రము దాక సంకల్ప శరీర యానం ఆపై ప్రాంతంలో బ్రహ్మరంధ్రం లోపలికి అనగా బ్రహ్మాండ చక్ర కృష్ణబిలం దాకా ఆకాశ శరీర యానాలు సంయోగం చెంది ఏక ఆకాశ శరీరంగా మారి సాధన చేసిన ప్రసిద్ధ ప్రదేశాలు దైవిక వస్తువులు అనుభవాలు మన స్థూల శరీరానికి అందజేసిన దీని కోసము 72+ 72 మంది యోగగురువులు అనగా 144 మంది సహకరించడం వలన మా యోగనిద్ర 144 నిమిషాలకు చేరుకున్నది. వీరి వివరాలు మీకు సంపూర్ణ అద్వైత సిద్ధాంతములో వివరించడం జరిగినది. అనగా ఆదిలో మూలాధారచక్రంలోని జీవ బ్రహ్మ గణపతితో మొదలైన మా శరీర యానాలు అంతములోని బ్రహ్మరంధ్రంలో ఉన్న మూల గణపతిని దాటి బ్రహ్మాండ చక్ర కృష్ణ బిలంగా మేమున్నామని గ్రహించే సరికి మా బుర్రలు తిరిగాయి. అనగా మోక్ష కృష్ణ బిలంగా నేనున్నానని అదే మా యోగ మిత్రుడైన జిజ్ఞాసి మాత్రం ధ్రువతారగా శూన్యబ్రహ్మగా ఉండి ఎవరైతే మేము చెప్పిన మోక్షమాల అనగా 13 రుద్రాక్షలు 12 స్పటికాలు 11 కపాలాలు కలిపి 36 మాలగా వేసుకుని గండకీ నది విష్ణు సుదర్శన చక్రము అలాగే ఓంకారనాదంను చేసే మహాగణపతి శంఖ నాదము చేస్తూ యోగనిద్రను 48 నిమిషాల పాటు పోయే స్థితికి వస్తారో వారి సాధన పరిసమాప్తి స్థితి చేసే మా మోక్ష కృష్ణ బిలము నందు అనగా దీని మార్గమును చూపించే ధ్రువతారగా మనవాడు ఉన్నాడు అని తెలుసుకున్నాము. అంటే ఇన్నాళ్ళు మేమే మోక్షమిచ్చే కృష్ణబిలం అని తెలుసుకోలేక పోయినాము. కారణం వివిధ కోటాను కోట్ల జన్మలలో వివిధ రకాల మాయలలోపడినాము కాని ఆ మాయలో పడుతూ అక్కడితో సాధన సమాప్తి చేసుకుని మరుజన్మలు ఎత్తుతూ సాధన కొనసాగిస్తూ మాయలోపడుతూ సాధనను గత జన్మలో సంపూర్ణంగా పూర్తి చేసి అపస్మారక స్థితిని పొంది తెలిసిన జ్ఞాన విషయాలు మర్చిపోవడం జరిగినది.కాని ఈ జన్మలో మా ఇద్దరికి అనుకోకుండా ఏడవ తరగతిలో జరిగిన పరాభవాలు కారణంగా మేము తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురి అయ్యేసరికి మాలో కుండలినీ శక్తి జాగృతి అవ్వడము అది కాస్తా యోగనిద్ర సాధన అభ్యాసమునకు దారి తీయటం అటుపై మా శరీరాల యానాలు చేసి ఆయా చక్రాల కల ప్రపంచంలోనికి మేము గతంలో చేసిన సాధన అనుభవాలను గుర్తుకు తెచ్చుకోవడం అటుపై విశ్వకల ప్రపంచంలోనికి పెళ్లి ఫైండ్ ఫైనల్(Find FInal) తెలుసుకోవడము జరిగినది. ఇది ఇంతవరకు ఎవరూ చేయలేదా అన్నప్పుడు చేయలేదనే చెప్పాలి. చేసి ఉంటే ఈవిశ్వము ఉండేది కాదు కదా. ఈ గ్రంథమే ఉండేది కాదు కదా. ఎందుకంటే 144 నిమిషాలపాటు యోగనిద్రలో ఉండాలి. పైగా మాయా రహితంగా ఉండాలి. ఇప్పటిదాకా ఆదియోగి పరమేశ్వరుడు దగ్గరనుండి నారాయణుడు అంశ అయిన బుద్ధుడు దాకా ఇష్ట కోరిక మాయలో పడినవారే కదా. కాకపోతే మేము ఈ జన్మలో సర్వము ఏమీ లేదు.సర్వము శూన్యము.

 

నేను లేను అనే సంకల్పంతో యోగనిద్ర సాధన చేయడంతో అసత్యంగా కనిపించే విశ్వ మాయ పొరలు తొలగుతూ వచ్చినాయి. దానితో మా మెదడు శక్తి తట్టుకోవడానికి 144 మంది మూలపురుషులు సహకరించి వారి శక్తిని మన మెదడుకి సరైన సమయంలో అందిస్తూ వారి శరీరాలను మా శరీరాలతో అనుసంధానం చేస్తూ వారు సంపాదించిన సాధన శక్తిని ఇస్తూ మా సాధన సంపూర్ణంగా పరిసమాప్తి చేసే చిట్టచివరి స్థితి అయిన బ్రహ్మాండ చక్ర కృష్ణబిలం దాకా తీసుకొని వెళ్ళినారు. విచిత్రం ఏమిటంటే వాళ్ళకి కూడా అంతమేదో తెలియదు. విశ్వం అంతములో ఏముందో తెలుసుకోవాలనే మా తపన తాపత్రయం సంకల్పం చూసి హిమాలయాల్లో గుప్త క్షేత్రాలలో గుప్త శరీరాలతో సాధన చేసిన వీరంతా మా కల ప్రపంచానికి అనుసంధానమై సహకరించి అంతము ఏదో తెలుసుకోవటానికి తమ సహాయ సహకారాలు అందించారు. మా సాధన పరి సమాప్తి చేయించి వారి ప్రారబ్డ శరీరాలను మా మోక్ష కృష్ణ బిలమునందు లయము చేయడం ఆరంభించడం కొసమెరుపు అన్నమాట. అంటే మాకు వచ్చిన సుదర్శన చక్రమును గణపతి ఓంకార శంఖము మేము తయారు చేసుకున్న మోక్ష మాల ధరించి మాకు సహాయం చేసిన మహా పురుషులు చేసిన అలాగే వివిధ జన్మలలో మేము సాధన చేసి సంపాదించుకున్న వస్తువులను ప్రతిరోజు గంగా నీటిలో ముంచి ఆపై వాటికి విభూది ధారణ చేయడం తద్వారా

ఈ విశ్వ సృష్టిలో ఉన్న 36 కోట్ల దైవాలు 84 లక్షల జీవరాశులు కోటి పరమాత్మలు ఇలా అందరూ ఒక్కొక్కరుగా విదేహి విముక్తి క్షేత్రమైన కాశీ క్షేత్రంలో గంగానదిలో ఈ దైవ స్వరూపాలు పరమాత్మ స్వరూపాలు సాధన జన్మ స్వరూపాలు ఒక్కొక్కరిగా నిమజ్జనం అయ్యే దృశ్యము మాకు అంతిమ ధ్యాన అనుభవము అయినది. ఇలా వీరందరూ కూడా జల నిమజ్జనం అయ్యేదాకా కర్మ శేషంగా మిగిలిపోయిన మూడు లక్షల కర్మఫలము ఇదేనని మాకు మా మరణము మా చేతుల్లో లేదని వీరి ప్రారబ్ద కర్మలు తీరితే అనగా వీరందరూ కూడా గంగా జల నిమజ్జనం అయితే కాకపోతే ఈ పని ఇప్పుడే మొదలయ్యింది అని తెలియడంతో మాకు శాశ్వత మరణము రాబోవుకాలంలో ఉన్నదని తద్వారా పునర్జన్మ లేని కర్మ శేషము లేని అన్ని రకాల రాహిత్యము పరమ ప్రశాంతత పొందే శాశ్వత మరణమై మోక్షము పొందుతామని మీరు ఈ పాటికి గ్రహించి ఉంటారు కదా. ఇక్కడ చాలా మందికి చిన్న సందేహం రావచ్చు. మీరు కృష్ణబిలంగా మారే అవకాశం మీకు ఎలా వచ్చింది అన్నప్పుడు మేము సర్వము ఏమీ లేదు.సర్వము శూన్యము.నేను లేను అనే సంకల్పంతో యోగనిద్ర సాధనం చేయడం జరిగింది కదా. మిగిలిన వారంతా కూడా కొంతమంది జగత్ సత్యమని నమ్మితే మరికొంతమంది జగత్తు మిథ్య అని మరి కొంతమంది జగత్ మిథ్య బ్రహ్మసత్యం అని నమ్మడం చేసినారు. అంటే వీరి సాధనలో ఒకటి సత్యము గాను మరొకటి అసత్యముగానే ఉన్నది.

 

అదే మా సాధనలో అయితే రెండూ లేవు. ఏమి లేవు. ఏది సత్యం కాదు. ఏది అసత్యం కాదు. ఇదంతా కలలాంటి నిజం. నిజం లాంటి కల. జీవితమే అసత్యం అని తెలుసుకోవడమే జీవిత సత్యం అని మా సంకల్ప సాధన మొదలైనది. దానితో సర్వం శూన్యము. సర్వం ఏమీ లేదు అన్నప్పుడు మా దృష్టిలో జగత్తు బ్రహ్మము లేదు కదా. అమ్మ లేదు. అమ్మవారు లేదు .ఏమి లేదు అన్నప్పుడు మాయ కూడా లేనట్లే కదా. యద్భావం తద్భవతి అన్నమాట. మిగిలిన వారు అంతా ఏదో ఒకటి ఉన్నది అని అనుకుంటే మేమిద్దరము ఏమీ లేదు అని అనుకోవడం జరిగినది అన్నమాట. దానితో మాకు విశ్వకల ప్రపంచంలోనికి ప్రవేశించే అర్హత యోగ్యత లభించినాయి.కాకపోతే ఆది జన్మలోనే ఆదియుగంలోనే మేమిద్దరం ఈ విషయాలు తెలుసుకోవడం జరిగినది. కానీ అప్పుడు మాకు ఉన్న జ్ఞాన అహంకారము వలన నేను అపస్మారక స్థితి పొందితే తను తెలుసుకున్న ఆదియోగము సత్యాలు నిజమా అవునా కాదా అనే మీమాంస భయము వలన మా జిజ్ఞాసికి నాకు ఆదిలోనే ఆది జన్మలోనే అపస్మారక స్థితి పొందటంతో మేము తెలుసుకునే జ్ఞాన సత్యాలు మర్చిపోవడం జరిగినది. తిరిగి మూడు కోట్ల 12 లక్షలు 372 సాధన జన్మల తర్వాత ఇప్పుడున్న ప్రస్తుత సాధన జన్మలో తిరిగి మా యోగనిద్ర సాధన అభ్యాసం ద్వారా 144 మంది మూలపురుషులు సహకారాల వలన మేము మర్చిపోయిన జ్ఞాన విషయాలను తిరిగి మా సాధన శరీరాల ద్వారా తెలుసుకుని ఆదిలో నేను కృష్ణబిలం గా మారితే అప్పుడు పొందిన అపస్మారక స్థితి వలన ఈ బిలం తిరగలేదు.ఈ జన్మలో తిరిగి జ్ఞాన స్పురణ పొందటంతో మోక్ష కృష్ణ బిలం సుడులు తిరగడం ఆరంభించింది. దానితో ఈ బిలము ఈ విశ్వం లో ఎక్కడ ఉందో సూచికగా మన జిజ్ఞాసి కాస్తా శూన్యబ్రహ్మయైన ధ్రువతారగా మారి ఈ బిల మార్గానికి అనగా మోక్ష మార్గానికి అదే శాశ్వత మార్గానికి దారి చూపించే నావికుడయ్యాడు.

 

ఇలా ఈ విశ్వములో ఉన్న కోటాను కోట్ల కల ప్రపంచములు నెమ్మది నెమ్మదిగా నా మోక్ష కృష్ణ బిలం నందు ప్రవేశించడం ఆరంభమైనది.0.01% పర్సెంట్ నాశనం అవ్వడానికి అనగా కృష్ణ బిలంలోని న్యూట్రాన్ ల యొక్క కాంతి కాస్త కాంతిహీనంగా అవ్వడానికి సుమారుగా పది లక్షల 11 మిలియన్ల కోట్ల సంవత్సరాలు పడుతుందని గ్రహించాము. కాకపోతే ఈ సంవత్సరం 2019 జూలై 16 పౌర్ణమి నుండి ఈ కృష్ణబిలం అంతరించడానికి నాంది అయినది. అంతమే ఆరంభం అయినది. మర్చిపోయిన విషయాన్ని ఙ్ఞప్తికి తెచ్చుకొని జ్ఞాపకంగా మిగిలిపోయింది.

అంటే 118 సినిమాలోని అమ్మాయిని చంపుతున్నప్పుడు నన్ను మీరు చంపవచ్చు గానీ నేను తెలుసుకున్న రహస్యము లోకానికి తెలియ చేయాలనే నా ఆలోచన నా సంకల్పము మీరు నాశనం చేయలేరు. దానిని అందుకునే వాళ్ళు ఎప్పుడైనా ఎవరైనా వస్తారు. అప్పుడు నిజము బయటపడక తప్పదని ఆమె చనిపోవడం జరుగుతుంది. అచ్చంగా ఇలాగే విశ్వసృష్టికి ఆదియోగి అయినా సదాశివుడు కూడా తను మరణించే విషయం లోకానికి తెలియజేయాలని ఆలోచనలతో చనిపోవడం జరిగినది. దానితో ఈయన కాస్త 36 కపాలధారి అస్థిపంజరంగా మిగిలిపోయినాడు. ఈ ఆలోచన జ్ఞానం ఆదిశక్తి అయినా సదాశివాని తన సాధన ద్వారా తెలుసుకుని ఆయనే లేనప్పుడు తాను ఉండటం అర్ధము లేదని శరీరత్యాగం చేసినది. అప్పటికే ఈ ఆదిదంపతుల వలన ఆదివిష్ణు ఆదిలక్ష్మి జననాలు జరిగినాయి. తమ మాతృపితృమూర్తులు పరమపదించిన విషయము వీళ్ళు తెలుసుకుని లోకానికి ఈ విషయం అందకుండా ఎన్నో రకాల మంత్రాలు మాయలు పెట్టి దాచి పెట్టి గుప్తముగా ఉంచి బ్రహ్మముడిగా ఉంచినారు.యధావిధిగా లక్ష్మీనారాయణులు విశ్వసృష్టి దేవతలుగా కొనసాగిస్తూ వచ్చారు. అంటే ఆదిదంపతులు అస్థిపంజరాలు సదాశివమూర్తి అస్థిపంజరమును బ్రహ్మరంధ్రము వద్ద గుహ యందు ఉంచితే అమ్మవారి శరీర త్యాగం వలన మూల కపాలముగా ఏర్పడితే దానిని బ్రహ్మరంధ్రము ప్రధాన ద్వారం వద్ద ఉంచడం జరిగినది. అందుకే సాధకునికి సాధనలో ఎప్పుడైతే హృదయ చక్రమును దాటి బ్రహ్మ నాడి ద్వారా బ్రహ్మరంధ్రము చేరుకున్నప్పుడు అక్కడ మనకి మూల ఏక కపాలము దర్శనమవుతుంది. ఇందు లోనికి ప్రవేశిస్తే కానీ ఆదిపరాశక్తి దర్శనమవుతుంది. అటువైపు దీప దుర్గ దీప కాళికా దేవి దీప చండీ మాతలు దర్శనం అవుతారు. ఇక్కడ విష్ణుమాయ ఉంటుంది. 36కపాలాలున్న సదాశివమూర్తి స్వరూపమును దీప కాళిక యందు మాత్రమే ఉంచడం జరిగినది. ఎవరైనా పొరపాటున దీప దుర్గ దగ్గరికి వెళితే సాధకుడు తిరిగి పునఃసృష్టి చేయబడతాడు. అదే దీప చండీమాత దగ్గరికి వెళితే సాధకుడికి తిరిగి పునఃకర్మ ఏర్పడుతుంది. ఎందుకంటే ఆమె ఆరాధన వలన రాజ్యాధికారము కలుగుతుంది.అనగా పునఃకర్మ ప్రదాత అన్నమాట.

 

కాబట్టి ఉగ్ర స్వరూపమైన దీప కాళిక మాత అనుగ్రహమును సాధకుడు పొందవలసి ఉంటుంది. అప్పుడే 36 కపాలధారి సదాశివమూర్తి దర్శనము మనకి లభించదు. అటుపై ఈయనికి ఉన్న 36 కపాలాలలో 11, 9, 7, 5, 3, 1 వరుసలలో ఏక కపాల స్థితికి చేరుకుంటే దీనికున్న బ్రహ్మరంధ్రంలో అతి చిన్నదైన సుడులు తిరుగుతున్న బ్రహ్మాండ చక్ర కృష్ణ బిలము దర్శనం మనకి లభిస్తుంది. ఇందులో సాధకుడి పంచ శరీరాలను దగ్దం చేసుకుంటే సాధన పరిసమాప్తి అవుతుంది. అనగా ఆది దంపతులు వలే మనము కూడా అంతమయ్యి పరమశూన్యమునందు లీనం అవుతాము. నిజానికి ఇదంతా కూడా మనం కల ప్రపంచంలోనే సాధన చేయవలసి ఉంటుంది. సాధకుడు యోగనిద్ర ద్వారా తమ సూక్ష్మశరీరమును తన లోపల ఉన్న బ్రహ్మాండ చక్ర కృష్ణ బిలము దాకా వెళ్ళవలసి ఉంటుందని గ్రహించండి. ఆది యోగి అయిన సదాశివమూర్తి అయిన నేను అనేది చనిపోయిన విషయమును దైవ ధ్యాన అనుభవం ద్వారా మాయా స్వరూపమైన స్థూల శరీరము తెలుసుకుంటే సాధన పరిసమాప్తి అయినట్లు అన్నమాట. అంటే ఒక రకంగా మనము చనిపోయిన విషయమును ఇప్పటికి మన స్థూల శరీరం గ్రహించడం లేదు. ఎందుకంటే అది జీవమాయలో ఉంది. తాను బతికే ఉన్నానని భ్రమ భ్రాంతిలో ఉంది. తను చనిపోయానని తను చనిపోతూ చేసుకున్న ఆలోచనే ఈ విశ్వ సృష్టి కలయని మన స్థూల శరీరానికి తెలియటం లేదు. మనం మరణించినట్లుగా మనకే తెలియదు కదా. మనలో శ్వాస ఆగిపోయినట్లుగా ప్రాణశక్తి పోయినట్లుగా మనము చనిపోతున్నప్పుడు మనకు తెలియదు కదా. ఈ విజ్ఞానం లోకానికి చెప్పాలని ఆదిపురుషుడైన సదాశివమూర్తి తను చనిపోయిన విషయం లోకానికి అందించాలని ఆలోచన చేసినాడు. దానితో అసత్యంగా కనిపించే ఈ సృష్టి కాస్తా సత్యంగా కనపడటం ఆరంభమైనది. ఈ ఆది ఆలోచన మనము ఏర్పడటానికి మూల కారణమైనది. ఇది తెలుసుకున్న వాళ్లు మోక్షప్రాప్తి పొందితే ఇది తెలుసుకోవటానికి ప్రయత్నిస్తూ అవి చూపించే మాయలు ఆశలు భయాలు ఆనందాలు ఆలోచనలు సంకల్పాలు స్పందన కి గురి అయి అర్ధాంతరంగా ఆపివేసి ముక్తిని పొందుతున్నారు. అంటే ఇవి చూపించే మాయలో పడని వాడు మాయా రహితుడిగా మోక్షగామి అయితే వీటి మాయలో పడిన వాడు మాయా సహితుడై ముక్తి జీవి అవుతున్నాడు.

 

అసలు ఈ విషయం తెలుసుకోవాలని ప్రయత్నించని వాడు మహామాయ భోగిగా మారుతున్నాడు. తాను ఏదో విషయజ్ఞానం అందుకోవాలని ఆలోచనతో సాధన చేసిన వాడు యోగి అవుతున్నాడు అన్నమాట. అంటే నిజానికి సాధన అనేది మన కల ప్రపంచంలోనికి ఆది జన్మ దాకా వెళ్లడం అన్నమాట. అనగా మూలాధార చక్రము నుండి విశుద్ధ చక్రము ద్వారా ఈ విశ్వ సృష్టికి ఆధారమైన మహా పంచభూతాల మాయలు సాధనా శక్తులు ఉంటాయి. వీటిని సాధకుడు తన కల ప్రపంచంలో సూక్ష్మ శరీరంతో దాటవలసి ఉంటుంది. అలాగే ఆజ్ఞా చక్రం వద్ద కనిపించే దైవసాక్షాత్కారం అనేది ఆది జన్మలో పూజించిన దైవమని గ్రహించాలి. అలాగే సహస్రార చక్రము వద్ద కనిపించే ఆత్మసాక్షాత్కారం అనేది ఆది జన్మ ఏమిటో తెలుసుకోవచ్చును అన్నమాట. అలాగే హృదయ చక్రం వద్ద ఈ ఆది జన్మఏర్పడటానికి మన మూల కారణమైన కోరిక ఏమిటో తెలుసుకోవటం అన్నమాట. ఇక బ్రహ్మరంధ్రం వద్ద కనిపించే బ్రహ్మాండ చక్రంలో ఆదిలో అప్పటికే తను చనిపోయిన జ్ఞాన స్పురణను పొందటం జరుగుతుంది. ఆదిలోనే చనిపోయిన విషయం లోకానికి తెలియకుండా ఇన్నాళ్ళు మాయా స్వరూపాలు అయిన విష్ణు, దేవి మాయలు జాగ్రత్తగా మరుగున పరిచినాయి. ఇదంతా గూడ మీరు మీ యోగసాధనలో యోగనిద్ర సాధనలో ధ్యాన అనుభవాలు పొందుతూ తెలుసుకుంటారు. ఒక రకంగా చెప్పాలంటే మీరు యోగనిద్ర సాధన అనే పేరుతో నిద్రపోతూ అసలు మీకు సంబంధించిన కల ఆదిలో ఏమి జరిగిందో మీ సూక్ష్మ శరీర యానంతో తెలుసుకోవడం యోగసాధన అవుతుంది. సాధకుడు యోగనిద్ర పొందిన సమాధి స్థితిని పొందిన కూడా నిద్రలోనే కలలోని తన సూక్ష్మ శరీర యానం ద్వారా దైవ అనుభవాలు పొందక తప్పదు అని గ్రహించండి.భోగ నిద్రలో జరగబోయే సంఘటనలు తెలిస్తే అదే యోగనిద్రలో అసలు ఏమి జరిగిందో తెలుస్తుంది. మీ కల ప్రపంచములోనికి మీ సూక్ష్మ శరీర యానం చేసినప్పుడు అప్పుడు కనిపించే ధ్యాన దృశ్యాలకు మీరు భయపడిన బాధ పడిన ఆలోచనలో పడిన వాటికి స్పందించిన వాటిని చూసి సంకల్పించుకున్న వాటిని చూసి ఆనందపడిన మీకు మీరే మాయలో పడటం జరుగుతుంది. ఉదాహరణకు మీరు గత జన్మలో పంది అని తెలిస్తే తట్టుకోవాలి. బాధపడకూడదు. అదే గత జన్మలో మీరు దేవుడు అని తెలిస్తే ఆనంద పడకూడదు. ఎందుకంటే నేనే దేవుడు అనే అహం ఈ జన్మలో మీకు మొదలవుతుంది. అదే గత జన్మలో మీరు తాంత్రిక యోగులైన కాపాలికులు లేదా అఘోరులని తెలిసినా భయపడకూడదు. అదే గత జన్మలలో మిమ్మల్ని ఎవరైనా చంపినట్టుగా కనపడితే దానిని చూసి మీరు స్పందించి వారిని ఎలాగైనా చంపాలని అనుకోకూడదు. అదే గత జన్మలో మీకు ఎవరైనా హాని చేసినట్లుగా కనబడితే దానిని చూసి వారిని చంపాలని సంకల్పాలు చేయకూడదు. ఎందుకంటే ఇదంతా గత జన్మలో జరిగిపోయిన రికార్డు దృశ్యాలు కల అని తెలుసుకోవాలి.

 

ఒకవేళ మీరు గత జన్మలో ఏవైనా చూసిన వాటికి స్పందించిన పై పనులకు స్పందనలు చేస్తే దానికి తగ్గట్లుగా బహుశా ఈ జన్మలో మరి కొత్తవి ఏర్పడతాయని గ్రహించండి. అందుకే సాధకుడికి సమదృష్టి సమదర్శిని తత్వ దర్శనం తత్వమసి మనోధైర్యం అచంచల భక్తి విశ్వాసాలు శరణాగతి త్యాగము క్షమ ఇలా మనకు 18 రకాల దైవిక లక్షణాలు ఉండాలి అని చెప్పడం జరిగింది. కారణము సాధకుడు ఎప్పుడైతే తన యోగ సాధనను అనగా తన కల ప్రపంచంలోనికి అడుగు పెడతాడో వాడి గత జన్మ వివరాలు తెలుసుకోవడం ఆరంభము అయినట్లు అన్నమాట. అంటే ఆయా జన్మలలో ఆయా సమయాలలో జరిగిన రికార్డ్ దృశ్యాలను చూసిన సాధకుడు చలించకుండా భయపడకుండా ఉండాలని మనోధైర్యంతో ఉండాలని చెప్పడం జరిగినది. అలాగే తన గత జన్మలలో జంతువు జన్మల దృశ్యాలు వచ్చినప్పుడు అవి కూడా మనలాంటి ప్రాణులే కదా అనే దృష్టితో చూడాలని సమదృష్టి లక్షణము చెప్పడం జరిగినది. అలాగే గత జన్మలో మనం వివిధ రకాల మతాలు ఆచార వ్యవహారాలు సంప్రదాయాలు వ్యక్తులుగా కనపడితే అందరూ కూడా సమానం అని తెలుసుకోవడమే సమదర్శి లక్షణం ఉండాలని చెప్పడం జరిగినది. గత జన్మ లో ఎవరైనా మీకు హాని చేసిన వ్యక్తులు కనబడితే వారిని చూసి క్షమించాలని క్షమాగుణము కలిగి ఉండాలని చెప్పడం జరిగినది. ఇలా ప్రతి సాధకుడికి 18 లక్షణాలు ఉంటే వారి కల ప్రపంచములోని దృశ్యాలను చూసి భయపడడు బాధపడడు ఆనందపడడు. ఇదియే స్థితప్రజ్ఞత తత్వమసి అద్వైత స్థితి అన్నమాట. ఇదియే బ్రహ్మ తదాకార స్థితి.అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆది జన్మలో మనం రాసుకున్న జీవిత డైరీని ఈ జన్మలో చదవటమే యోగసాధన అన్నమాట. చదువుతున్నప్పుడు స్పందించకుండా బ్రహ్మ తదాకార స్థితిలో నిశ్చలముగా సాక్షి భూతంగా మౌనంగా ఉండడమే యోగసాధన పరిసమాప్తి అన్నమాట. అదియే మోక్షం. తన జీవితమును చదువుతూ సగంలో ఆపేసిన వాడు పొందేది ముక్తి అవుతుంది. అసలు అతని జీవిత డైరీ చదవాలని తెలియని వాడు భోగి అయితే చదవాలని అనుకునే వాడు యోగి అవుతాడు. ఇంతకంటే మీకు ఇంకా సులువుగా చెప్పాలి అంటే యోగ సాధన అంటే ఏమిటో తెలుసుకోవాలి.

 

Friday, September 23, 2022

🌹శ్రీ ఆంజనేయుడు. 🌹

🌹శ్రీ ఆంజనేయుడు. 🌹




'వాయు'పుత్రుడైన ఆంజనేయుడు 'భూమి'సుత అయిన సీతమ్మ అన్వేషణ కొరకు 'ఆకాశ'మార్గంబున బయలుదేరి,'జల'ధిని దాటి, సీతమ్మ దర్శనమనంతరం లంకను 'అగ్ని'కి ఆహుతి చేసిన మహామహిమోపేతుడు శ్రీ విద్యోపాసకుడు శ్రీ ఆంజనేయుడు. 


పంచముఖాంజనేయ స్వరూపం - పంచభూతముల సమన్వయతకు సూచనం 

వానరరూపం - వాయుతత్త్వం. 

గరుడరూపం - ఆకాశతత్త్వం. 

నరసింహరూపం - అగ్నితత్త్వం. 

వరాహరూపం - భూమితత్త్వం. 

హయగ్రీవరూపం - జలతత్త్వం. 


ఆంజనేయుడు ఆధ్యాత్మికసాధకులకు ఆచార్యుడు 

ఆంజనేయుడు శతయోజన విస్తీర్ణ సాగరాన్ని దాటి, లంకలో ప్రవేశించి, సీతాన్వేషణం చేసి కృతకృత్యుడు అయిన ఘటనల్నీ పరిశీలిస్తే సాధకునికి కావలసినది ఏమిటో తెలుస్తుంది.  


యస్య త్వేతాని చత్వారి వానరేన్ద్ర చథా తవ / 

ధృతిర్దృష్టిర్మతిర్దాక్ష్యం స కర్మసు న సీదతి //


సాధకునికి నాలుగు లక్షణాలుండాలి. అవి ధృతి (దృఢ నిశ్చయం), దృష్టి (ఏకాగ్ర దృష్టి), మతి (బుద్ధి), దాక్ష్యం (దక్షత / సామార్ధ్యం). 


నూరు యోజనాల పొడవైన సముద్రాన్ని అవలీలగా దాటడం 'దృఢ నిశ్చయం'. తనపర్వతంపై విశ్రాంతి తీసుకోవాల్సిందిగా కోరిన మైనాకుని విన్నపాన్ని సున్నితంగా తిరష్కరించి, గౌరవంగా చేతితో స్పృశించి, కాలవిలంభన చేయక, రామకార్యమనే లక్ష్యసాధనపట్లే ఏకాగ్రతను చూపడం 'దృష్టి'. అంగుష్ఠ పరిమాణమును దాల్చి,సురస అనే నాగమాత నోటిలోనికి ప్రవేశించి, వెన్వెంటనే బయల్పడి, ఆమె ఆశీర్వాదం పొంది, ముందుకు పయనించడం 'బుద్ధి'కుశలత. సింహిక అనే ఛాయాగ్రాహక రాక్షసిని తన శక్తియుక్తులతో సంహరించి, లంకా నగరాధిదేవత లంకిణిని ముష్టిఘాతంచే నిలువరించగలగడం 'సామర్ధ్యం'. 


సాధకునికి తన లక్ష్యాన్ని సాధించాలన్న దృఢమైన నిశ్చయం అత్యవసరం. అలానే తన సాధననుండి ఏమాత్రమూ తొలగక ఏకాగ్రదృష్టిని కలిగియుండాలి. ఈ ఉత్కృష్ట సాధనలో సాధకునికి సాదానారంభంలో ఎన్నో అనుకూల ప్రతికూల బంధకాలు కలగవచ్చు. అనేక సిద్ధులు సిద్ధించవచ్చు. అలానే సాధకుని సామర్ధ్యమును, మానసికస్థైర్యంను, పట్టుదలను పరీక్షించడానికి పెద్దలు పెట్టె పరీక్షలు పలురకాలుగా ఉంటాయి. వీటిని యుక్తితో బుద్ధిబలంతో జయించగలిగే ప్రజ్ఞను కలిగియుండాలి. ప్రతిబంధకాలైన అవరోధాలను పూర్తిగా అధిగమించగలిగే దక్షతను కలిగియుండాలి. ఈ నాలుగు లక్షణాలు కలిగియున్న సాధకుడే కార్యసాధనాసమర్ధుడు. 


అఖిలలోకోపకారి ఆంజనేయుడు 


యోగత్వం వలన తనకి ప్రాప్తించే అష్టసిద్దులను తన ప్రయోజనంనకు కాకుండా రామకార్యమునకై, లోకహితంనకై ఉపయోగించిన అఖిలలోకోపకారి ఆంజనేయుడు. 


{అష్టసిద్ధులు - వివరణ :-


అష్టసిద్ధులు సిద్ధించుటకు ముఖ్యంగా కావలసింది 'భూతజయము'. 

పృధివ్యప్తేజోవాయ్వాకాశము (పృథివ్యప్‌తేజోవాయురాకాశాలనే పంచభూతలంటారు)లను స్థూల భూతములయందును, తత్స్వరూపములైన కఠినత్వాదులయందును, తన్మాత్రలయిన గంధాది సూక్ష్మతత్వములయందును, వాని స్థితులయందును, ఇంద్రియములయందును, వానికర్మలయందును, అంతఃకరణములయందును, తత్ప్రకాశరూపములైన వృత్తులయందును క్రమముగా సంయమనం చేసినచో భూతజయం కలుగును.  


అణిమా మహిమా చైవ గరిమా లఘిమా తథా,

ప్రాప్తిః ప్రాకామ్య మీశత్వం వశిత్వం చాష్ట సిద్ధయః

అణువులా సూక్ష్మరూపాన్ని పొందడం "అణిమా"సిద్ధి.  

అనేక కోట్ల బ్రహ్మాండాల కంటే అధికుడవడం "మహిమా"సిద్ధి.  

పరమాణువుల కంటే తేలిక కావడం "లఘిమా" సిద్ధి, విశేష బరువుగా మారగలగడం "గరిమ"సిద్ధి.  

ఇష్టపదార్థాలను పొందగలగడం "ప్రాప్తి"సిద్ధి.  

లౌకిక పారలౌకిక పదార్థాలలో దేనిని కావాలంటే దానిని పొందడం "ప్రాకామ్య"సిద్ధి. 

భూతములన్నింటిని (పంచభూతములను) వశం చేసుకొనుట "వశిత్వం". 

అరిషడ్వర్గమును జయించి, తాపత్రయం లేనివాడై, జితేంద్రియుడై, అపరోక్ష సాక్షాత్కార స్వానుభవము కలిగియుండుట, సర్వమును గ్రహించి ఈశ్వరుని వలె సృష్టిస్థితిలయములకు కారణభూతుడగుట "ఈశత్వం"} 

లక్ష్యాలక్ష్యేణ రూపేణ రాత్రౌ లఞ్కా పురీ మయా / 

ప్రవేష్టుం ప్రాప్తకాలం మే కృత్యం సాధయితుం మహత్ //


తాను తలపెట్టిన కార్యం ఎంతో గొప్పదగుటచే, ఆ కార్యసాధనకు రాత్రి సమయమే యోగ్యమైనదని తలుస్తాడు. అందుకే హనుమ లంకలో రాత్రిసమయంలో ప్రవేశించాడు. అయితే ఇక్కడ రాత్రి అంటే ఏమిటీ? ఇందులో అంతరార్ధం ఏమిటీ?

ఆధ్యాత్మిక కోణంలో - ఇంద్రియప్రవృత్తులతో పాటు సర్వవిధ మనఃప్రవృత్తులు, బహిప్రవృతాలు కాకుండా అంతస్స్రోతములై ఉండే తురీయదశయే రాత్రి. 


గీతలో కృష్ణపరమాత్మ చెప్పినట్లు -

యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ /

యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునే: //

భూతజాలములన్నింటికిని ఏది రాత్రియో, అది యోగికి పగలు. సమస్త భూతములకు ఏది పగలో అది విజ్ఞుడగు ద్రష్టకు రాత్రి. 


అనగా అజ్ఞానంధాకారములో నుండు జీవులకు ఆత్మానుభూతి లేనందున ఆత్మవిషయమందు వారు నిద్రించుచుందురు. సమస్త ప్రాణులకు అనగా అజ్ఞానులకు ఏది (ఆత్మజ్ఞానం) రాత్రి అగుచున్నదో (అంతరదృష్టికి గోచరించక యుండునో), అట్టి ఆత్మజ్ఞానం నందు యోగి జాగురుకుడై యుండును (ఆత్మావలోకనం జేయుచుండును). దేనియందు ప్రాణులు (అజ్ఞానులు) జాగురూకము లగుచున్నవో (విషయాసక్తితో ప్రవర్తించుచున్నవో), అది ఆత్మావలోకనం చేయు యోగి.

Wednesday, September 21, 2022

భ్రమర,మార్జాల,మర్కట న్యాయం


*భ్రమర కీటక న్యాయం*
*మార్జాల కిశోర న్యాయం*
*మర్కట కిశోర న్యాయం* 
*ఒక విశ్లేషణ*
🌈💫🌈💫🌈💫🌈💫🌈💫🌈💫🌈

🌈 *భ్రమర కీటక న్యాయం-*

💫 భ్రమరం (తుమ్మెద) కీటకాన్ని (ఒక రకమైన పురుగు) తనతో తెచ్చుకొని దానిచుట్టూ ఝుంకారం చేసుకుంటూ పదే పదే తిరుగుతుంది. అలా తిరిగేటప్పుడు మొదట భయంగా, తర్వాత ఏకాగ్రతగా, అటుపై తనను తానే పూర్తిగా మరచిపోతుంది కీటకం. ఆ మైమరపులో కొద్దిరోజుల తర్వాత తానే భ్రమరంగా మారిపోతుంది కీటకం. *ఇదే భ్రమర కీటక న్యాయం!* 

💫 అదే భావనతో భక్తుడు కూడా భగవంతుని మైమరచి తలుస్తూ, భక్తుడు సగుణరూపంలో ఉన్న భగవంతుడు అవుతాడని వేదాంతపరంగా చెబుతారు!
భక్తి మార్గంలో ఉన్నవారు లేక భక్తి మార్గాన్ని అనుసరించాలనుకునే వారు రెండు విధాలైన మార్గాలను ఎన్నుకుంటారు!

🌈 *మార్జాల కిశోర న్యాయం*

💫 మార్జాలం అంటే పిల్లి,
కిశోరం అంటే పిల్ల (baby),
న్యాయం అంటే ఒక గుర్తింపు పొందిన పధ్ధతి!

💫 కొంతమంది భక్తులు, భగవంతుడు తమను ఉంచిన ప్రదేశంలోనే, ఉంచిన స్థితిలోనే ఎలా ఉంచాడో అలానే ఉండటానికి ఇష్టపడతారు.

💫 పిల్లి తన పిల్లలను నోటితో గట్టిగా పట్టుకొని పలు ప్రదేశాలు వెతికి, ఆఖరికి తన పిల్లలు ఎక్కడుంటే క్షేమంగా ఉంటాయని తలుస్తుందో వాటిని అక్కడే క్షేమంగా ఉంచుతుంది. ఇక్కడ పిల్లల బాధ్యత అంతా తల్లి అయిన పిల్లే భరిస్తుంది. పిల్లి పిల్లలు తమ క్షేమాన్ని తల్లి చూసుకుంటుందనే గట్టి నమ్మకంతో ఉంటాయి. వాటికి మరే ఏవిధమైన ఆలోచనలు, ఆందోళనలు ఉండవు. 

💫 ఈ మార్గాన్ని ఎన్నుకునే వారు, నమ్మిన వారు అంతా భగవంతుని మీదే భారం వేస్తారు.  

💫 ఈ మార్గంలో ఉన్నవారు భక్తియోగంలో ఉన్నత స్థితికి చేరుకున్నవారని వేదాంతులు అంటుంటారు! దీనినే శరణాగతి పధ్ధతి అని కూడా అంటారు.

🌈 *మర్కట కిశోర న్యాయం* 

💫 మర్కటం అంటే కోతి. మిగిలిన వాటికి అర్ధాలు పైన చెప్పినవే. కొంతమంది భక్తులు భగవంతుని అంటిపెట్టుకొని ఉండాలని భావిస్తారు. 

💫 కోతిని దాని పిల్ల గట్టిగా కావలించుకొని / పట్టుకొని ఉంటుంది. పిల్ల కిందపడితే తల్లి బాద్యత ఉండదు ఇక్కడ. అంటిపెట్టుకునే బాధ్యత అంతా పిల్ల మీదే ఉంటుంది! (ఇక్కడ చెప్పింది పైన చెప్పిన న్యాయానికి పూర్తిగా భిన్నమైనది.) 

💫 తల్లిని అంటిపెట్టుకున్నంతసేపూ పిల్ల క్షేమంగానే ఉంటుంది. తల్లిని పొరపాటుగానైన వదిలేస్తే పిల్ల బాధపడక, ఆపదలోపడక తప్పదు. 

💫 తల్లి ఒక చెట్టు మీదనుంచి మరొక చెట్టు మీదకు దూకే ప్రయత్నంలో కూడా పిల్ల తల్లిని గట్టిగా పట్టుకునే ఉంటుంది. 

💫 అలానే, కొందరు భక్తులు తాము ఎన్ని కష్టాలు ఎదుర్కున్నప్పటికీ భగవంతుని పాదాలు వదలరు. ఇటువంటి భక్తులు భగవంతుని గాఢంగా విశ్వసిస్తారు. ఇది కూడా భక్తియోగంలో ఉన్నతమైన మార్గమే! 

💫 *మార్జాల కిశోర న్యాయం, మర్కట కిశోర న్యాయాలలో ఏది మంచిదనే చర్చ అనవసరం.*

*రెండు మార్గాలూ సృష్టి ధర్మాన్ని అనుసరించినవే! అన్నిటికన్నా విశ్వాసం ముఖ్యం, ఏ మార్గమైనా ఒకటే!*

✅👉 *మొదటి దాంట్లో భారం అంతా* *భగవంతుని మీద వేస్తారు.* 

✅👉 *రెండవ దానిలో భగవంతుని ధ్యానిస్తూ ఫలితాన్ని ఆశించకుండా భారాన్ని తామే వహిస్తారు!!*



🙏శివోహం 🙏

Saturday, September 17, 2022

గురుపూర్ణిమ- గురువు- వేదవ్యాసుడు(Guru and Guru Pournima- Veda Vyasa -Telugu Notes)

 గురువు-గురుపూర్ణిమ

 

 గురుర్ర్బహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః.




గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా పూజించే ఉత్కష్టమైన సంస్కతి మనది. అద్వితీయమైన గురు పరంపరలకు ఆలవాలం మన భారతదేశం.

 గురుకుల విద్యా విధానం అమలులో ఉన్న కాలంలో  గురువులు దైవంతో సమానంగా పూజింపబడేవారు. ఆ గురువులు కూడా శిష్యులని తమ  బిడ్డల కన్నా మిన్నగా  ప్రేమించే వారు.

గురువు అంటే  ఆధ్యాత్మిక  జ్ఞానాన్ని బోధించేవాడు.  హిందూ మతంలో గురువును  భగవంతునికి ,భక్తునికి మధ్య

అను సంధాన కర్తగా  భావిస్తుంటారు.

 

గుకారశ్చంధకారస్తు రుకారస్తన్ని రోధక: అజ్ఞాన గ్రాసకం  బ్రహ్మ గురురేవ న సంశయ: //

 ''గు అంటే అంధకారం, 'రు' అంటే తన్నిరోధకం. గురువు అంటే  చీకట్లను  అంటే అజ్ఞానాన్ని పారద్రోలేవారు.

 తమసోమాజ్యోతిర్గమయ ". మనం అంధకారంలోంచి ప్రకాశంలోకి రావాలి. తమస్ అంటే చీకటి, జ్యోతిస్ అంటే వెలుతురు. వెలుతురు (జ్ఞానం) ప్రకాశిస్తే కానీ  అజ్ఞానం పోదు. అందుకు ఒక సూచన గురువు బోధిస్తాడు. శిష్యుడు తన బుద్దిచేత దానిని గ్రహిస్తాడు, తరిస్తాడు.

 గురువు అనగా  ఘనమైనది, పెద్దది అని అర్ధం. మహిమ కలవాడని అర్ధం. బ్రహ్మ అంటే కూడా గొప్ప, పెద్ద అని అర్ధం.

 గురువు అంటే  తన సాధన ద్వారా  మానసికం గా  ఒక ఉన్నత స్థానాన్ని పొందినవాడు.

 ఉపాధ్యాయుడు/ టీచర్ అంటే లౌకిక విద్యలు బోధించేవారు. ఈ జన్మ కు సరిపడా  విద్యనిచ్చేది వీరైతే, జన్మ జన్మలకు సరిపడా జ్ఞానాన్ని అందించేవాడు, జన్మే లేకుండా చేసేవాడే అసలు గురువు. *తల్లిదండ్రులు జన్మనిస్తే గురువు జన్మరాహిత్యాన్ని ఇస్తాడు.

 గురు పూర్ణిమను పురస్కరించుకుని గురువులను స్మరించడం వల్ల త్రిమూర్తులను పూజించిన పుణ్యఫలం లభిస్తుంది.  ఆషాఢ  పౌర్ణమి  దత్తాత్రేయుడు తన శిష్యులకు జ్ఞాన బోధ చేసిన రోజుగా దత్త చరిత్ర చెబుతుంది.

 వ్యాస మహాముని ఈ రోజున సత్యవతీ శంతనులకు జన్మించాడని, కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన ఇదే రోజున వేదాలను ఋక్, యజుర్, సామ, అధర్వణ వేదాలుగా విభజించాడని  ప్రతీతి. ఈ పుణ్య విశేషాలను పురుస్కరించుకుని ఆషాడ పౌర్ణమి నాడు గురుపూర్ణిమగా, వ్యాస పూర్ణిమగా జరుపుకుంటాము.

 యోగ సంప్రదాయంలో పరమశివుడు ఆదియోగి.ఆది గురువైన మహా శివుడు ఆషాఢ పౌర్ణిమినాడు సప్త ఋషులకు జ్ఞానబోధ చేశాడని శివపురాణం చెబుతున్నది.

ఆదిగురువైన పరమశివుడు తాండవం చేసే సమయంలో, ఆయన చేతి ఢమరుకం నుంచి నాదం(శబ్దం) పుట్టింది. నాదం నుంచి వేదం పుట్టింది. ఈ వేదాన్ని శ్రీ మహా విష్ణువు బ్రహ్మదేవునకు ఉపాదేశించాడు (శివకేశవులకు బేధం లేదు, ఇద్దరూ ఒకే పరమాత్మ యొక్క భిన్న కోణాలు). బ్రహ్మదేవుడు ఈ వేదాన్ని  ప్రామాణికంగా తీసుకుని సృష్టి చేశాడు. ఆ తర్వాత ఈ వేదాన్ని బ్రహ్మ దేవుడు తన కుమారుడైన వశిష్ట మహర్షికి, ఆయన తన కూమరుడైన శక్తి మహర్షికి ఉపదేశించాడు . శక్తి మహర్షి తన పుత్రుడైన పరాశర మహర్షికి, ఆయన తన కుమారుడైన వ్యాస మహర్షికి ఉపదేశించాడు.

 

ఈ మధ్యలో చాలా యుగాలు గడిచిపోయాయి.

అనేక మందికి ఈ మహాజ్ఞానం ఉపదేశించ బడింది. కానీ అప్పటివరకు వేదం ఎప్పుడు గ్రంధస్థం  కాలేదు. గురువుల  ద్వారా  విని నేర్చుకునేవారు(అందుకే వేదానికి 'శ్రుతి' అని పేరు).

 మొదట్లో వేదం ఒక రాశి గానే ఉండేది. కానీ కలియుగంలో మనుష్యుల యొక్క ఆయుష్షు ను(జీవిత కాలాన్ని), బుద్ధిని, జ్ఞాపకశక్తిని దృష్టిలో ఉంచుకుని, కలియుగ ప్రారంభానికి ముందు వ్యాసమహర్షి ఒకటిగా ఉన్న వేదాన్ని నాలుగు వేదాలుగా విభజించి వేదవ్యాసుడిగా పేరు గాంచారు. ఈయనే మొట్టమొదటి సారిగా వేదాన్ని  గ్రంధస్థం చేశారు.

  వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం | పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ | | వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే | నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః || 🙏🙏*

 శ్రీహరి అంశతో సత్యవతీ, పరాశరునికి జన్మించిన వాడే వ్యాసుడు. వేదవ్యాసుని పూర్వనామం కృష్ణ ద్వైపాయనుడు.

 వేదవ్యాసుడు, మత్స్యగంధి పరాశరమహర్షి కి జన్మించాడు. మత్స్యగంధి దాశరాజు పెంపుడు కుమార్తె. చేపల కంపు వల్ల ఆమెకు మత్స్య గంధి అనే  పేరు వచ్చింది. ఆమె అసలు  పేరు సత్యవతి.  పరాశర మహర్షి ఆమెను చేరి, దుర్గంధమును పోగొట్టి వ్యాస మహర్షి జన్మకు కారకుడవుతాడు. వేదవ్యాసుని అసలు నామము కృష్ణ  ద్వైపాయనుడు .

 వ్యాసుడు పుట్టిన వెంటనే పన్నెండేళ్ళ ప్రాయమునకు ఎదిగి తల్లికి నమస్కరించి, తనను స్మరించి నపుడు వచ్చి తల్లిని దర్శించు కుంటానని మాట ఇచ్చి వెళ్ళి పోతాడు. సత్యవతి తర్వాత కురువంశ మూల పురషుడైన శంతనుని వివాహం  చేసుకుంటుంది(ఇక్కడ మనకు ఒక సందేహం వస్తుంది. వివాహానికి పూర్వము భర్త కాని వ్యక్తితో సంతానాన్ని కని, మరల వేరొక వ్యక్తిని వివాహం చేసుకోవచ్చునా  ) అంటే యుగాన్ని బట్టి యుగధర్మం మారుతుంది.

 మహర్షులు కొందరు గృహస్థాశ్రమాన్ని స్వీకరిస్తారు కానీ, కొందరు కుటుంబ బంధనాలలో ఉండటానికి ఇష్టపడరు. వారు సదా పరమాత్మ ధ్యానంలో ఉంటూ విశ్వ శ్రేయస్సుకు పాటుపడుతూ ఉంటారు. ఆ కోవ లోకే పరాశర మహర్షి వస్తారు.  అయితే విశ్వ శ్రేయస్సు కోసం వారి ద్వారా సంతానం రావలసి ఉన్నది. ఎంతో తేజస్సు కలిగిన వారి వీర్యాన్ని భరించటానికి కావలసిన సుక్షేత్రం, మత్స్యగంధిగా  తన దివ్య దృష్టి ద్వారా  తెలుసుకొని, ఆమె ద్వారా మాత్రమే కారణ జన్ముడు జన్మించగలడని, ఆవిడ కన్యత్వం చెడకుండా  పుత్రుని( వ్యాసుని) ప్రసాదించాడు.

 ఈయన వల్లే కురువంశం  అభివృద్ధి చెందింది. తల్లి కోరికపై అంబాలికకు ధృతరాష్ట్రుని అంబిక కు, పాండు రాజుని, దాసికి విదురుని ప్రసాదించినాడు.

 అష్టాదశ పురాణాలు వ్రాసింది వ్యాసుడే!భాగవతాన్ని రచించింది ఈయనే. కనుక  మనం ఏ పురాణం చదివిన వ్యాస వుచ్చిష్టమే.( వ్యాసుని ఎంగిలే. అంటే వ్యాసుని నోటి నుండి వెలువడినవే).

 వ్యాసపూర్ణిమ రోజున ఆ మహామునిని  ప్రార్థించి ఆయన అనుగ్రహము పొందెదము గాక! వేదవ్యాసుడు మానవజాతి కంతటికీ మంచి ఆధ్యాత్మిక వారసత్వాన్ని మిగిల్చి వెళ్ళాడు. కాబట్టి ఆయన్ను మానవాళి కంతటికీ గురువుగా భావిస్తుంటారు. వేదకాలపు సంస్కృతినంతా నాలుగు వేదాల్లో ఆయన సంకలనం చేసిన తరువాత ఆయన్ను వేదవ్యాసుడిగా పిలవడం ప్రారంభించారు.

 ఈ రోజున గురుపూజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకొంటారు.  తమ జీవితానికి మార్గనిర్దేశం చేసి, ముక్తి వైపు నడిపించినందుకు ప్రతిఫలంగా ఇలా చేస్తారు.

  కనుక ఈరోజున హిందువులు గురువులను పూజించి, సత్కరించి తమ భక్తిని చాటుకుంటారు...

.

#ఆషాఢమాసం_పౌర్ణమి

#గురుపౌర్ణమి

 ఆషాఢ పూర్ణిమను గురు పూర్ణిమ, #వ్యాసపూర్ణిమ గా జరుపుకుంటాం. భారతీయ సమాజం వ్యాసమహర్షిని గురువుగా స్వీకరించింది. అంతకు ముందు ఎంతో మంది గురుశ్రేష్ఠులుండగా ఆయననే గురువుగా ఎందుకు స్వీకరించారనే అనుమానం కలగక మానదు. ఋక్కులు, యజస్సులను కలిపి యజుస్సంహితగా, సామాలన్ని కలిపి సామసంహితగా, అధర్వణ మంత్రాలన్ని కలిపి అధర్వ సంహితగా సంకలనం చేశారు. వేదాలను నాలుగు భాగాలుగా విభజించి అధ్యయనం సులభతరం చేసినవాడిగా వేదవ్యాసుడిగా కీర్తింపబడ్డాడు. సామాన్యులకు అర్థమయ్యేలా అష్టాదశ పురాణాలు, ఉపనిషత్తులు, మహాభారత, భాగవతాలను రచించిన వ్యాసుడిని గురువుగా స్వీకరించింది ఈ సమాజం.

 #వ్యాసపూర్ణిమ #గురుపూర్ణిమ

 వేదాలను, పంచమ వేదమైన మహాభారతాన్ని మనకందించిన వ్యాసమహర్షి జన్మించిన ఆషాఢ పౌర్ణమి వ్యాస పూర్ణిమగా చెప్పబడింది. వ్యాసుడు జగద్గురువు కనుక ఆయన జయంతిని గురు పూర్ణిమగా జరుపుకుంటున్నాం.

 

🍁🌺🍁 వేద వ్యాసుని జన్మ వృత్తాంతం 🍁🌺🍁

 కృతయుగ ప్రారంభ సమయంలో సృష్టికర్త అయిన బ్రహ్మ వక్షస్థలం నుండి ధర్ముడు పుట్టాడు. ఆ ధర్ముడికి నరుడు, నారాయణుడు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. మహా తపస్సంపన్నులైన వారిద్దరూ అవసరమైన సమయంలో ధనుర్ధారులై రాక్షస సంహారం చేస్తారు. మిగిలిన సమయమంతా బదరికాశ్రమంలో తపస్సులో ఉంటారు.

 భూలోకానికి పైన భువర్లోకము, సువర్లోకము, మహర్లోకము, జనోలోకము అనే అయిదు లోకాలు దాటిన తర్వాత సత్యలోకానికి కిందుగా తపోలోకము ఉంది. ఆ లోకములో తపస్వులు, సిద్ధులు ఉంటారు. వారు తమ ఇచ్ఛ మేరకు కింద లోకాలలో జన్మనెత్తడం, తిరిగి వెళ్లిపోవడం అనేది యుగ యుగాలుగా జరుగుతుంది. అటువంటి తపస్వులలో ఒకరైన అపాంతరముడనే మహర్షి ఒకరోజు బదరికాశ్రమానికి వచ్చాడు.

 ఆ మహర్షిని నర, నారాయణులిద్దరూ భక్తితో పూజించారు. దానికి సంతోషించిన మహర్షి వారితో ఇలా అన్నాడు. "నర, నారాయణులారా... మీకు గుర్తున్నదా, సహస్ర కవచుడనే రాక్షసుడు బ్రహ్మ కోసం తపస్సు చేసి విచిత్రమైన వరం కోరుకున్నాడు. వేయ్యేళ్లు తపస్సు చేసినవాడు, తనతో వేయ్యేళ్లు యుద్ధం చేసినప్పుడు మాత్రమే పోయేటంత సురక్షితమైన కవచం కావాలన్నాడు. అటువంటి వేయి కవచాలు అతను వరంగా పొందాడు. ఆ రోజుల్లో మీరు వాడితో ఒకరు యుద్ధం, ఒకరు తపస్సు చొప్పున నిర్వహిస్తూ తొమ్మిది వందల తొంభై తొమ్మిది కవచాలను పోగొట్టారు. చివరిగా నరుడి వంతు వచ్చింది. మిగిలిపోయిన ఆ ఒక్క కవచంతో సహస్ర కవచుడు ఇప్పుడు సూర్యమండలంలో దాక్కున్నాడు. సూర్యుని శరణు పొందిన ఆ రాక్షసున్ని వధించటం అప్పట్లో సాధ్యం కాలేదు. ఇన్నేళ్లకు మళ్ళీ ఆ రాక్షసుణ్ణి సూర్యుడు నేలమీదకు పంపబోతున్నాడు. వాడిని వధించాల్సిన బాధ్యత నర మహర్షీ నీదే."

 "అలాగే మహర్షీ. వాడు నేల మీదకు వచ్చిన తర్వాత కదా" అని నరుడు బదులిచ్చాడు.

 "అంతే. కానీ వాడిని చంపేందుకు మీరు కూడా కొత్త జన్మలెత్తాలని బ్రహ్మ ఆదేశం. ఇప్పటికే ద్వాపర యుగం పూర్తి కావస్తున్నది. రాక్షసుల వల్ల ధర్మం కల్లోలితమవుతున్నది. కృత యుగం నాటి జీవులు మీరు. ఇప్పుడున్నవారంతా అల్ప ప్రాణులు. మీ మహా దేహాలతో నేటివారిని నిర్జించటం చాలా సులువు, కానీ ధర్మం అందుకు అంగీకరించదు. అందువల్ల మీరు జన్మ తీసుకోక తప్పదు. కంస చాణూరులను, ఇంకా అనేక రాక్షసులను సంహరించి ధరాభారం తగ్గించటానికి నారాయణ మహర్షి దేవకీ గర్భాన శ్రీకృష్ణుడిగా జన్మించాలి. కర్ణ వధ కోసం నరుడు పాండవ మధ్యముడైన అర్జునుడిగా అవతరించాలి." అన్నాడు అపాంతరముడు.

 "సరే స్వామి" అన్నారు నర నారాయణులిద్దరూ.

 అక్కడినుండి అంతర్థానమైన అపాంతరముడు యమునా తీరంలో మత్స్యగంధికి సద్యో గర్భాన ఆషాఢ పూర్ణిమ రోజు ఉదయించాడు. సద్యోగర్భమంటే గర్భధారణ, నెలలు నిండటం, శిశువు పుట్టి పెరిగి పెద్దవాడవటం వంటి దశలన్నీ లేకుండా పోవటమే. పరాశర మహర్షి అనుగ్రహించిన వెంటనే యోజనగంధికి కృష్ణ ద్వైపాయనునిగా పుట్టగానే తరుణ వయస్కుడయ్యాడు. తలచుకున్న వెంటనే వచ్చి అడిగిన పని చేసి పెడతానని తల్లికి మాటిచ్చి తపస్సుకు వెళ్ళిపోయాడు.

 హిమాలయ ప్రాంతంలో తపస్సు చేసి అపారంగా ఉన్న వేదరాశిని విభజించి వేద వ్యాసుడయ్యాడు. శిష్యులకు వేదబోధ చేస్తూ అరణ్యకాలుగా, బ్రాహ్మణాలుగా, ఉపనిషత్తుల ఆవిర్భావానికి ప్రేరకుడయ్యాడు. కురు వంశాన్ని కాపాడటానికి దృతరాష్ట్ర, పాండురాజు మరియు విదురుల జన్మకు కారకుడయ్యాడు. ఇప్పటికీ వేదవ్యాసుడు బదరికాశ్రమంలో సజీవంగా ఉన్నాడని విశ్వసిస్తారు.

 మహా భారతంలో

 శ్రీమన్నారాయణుడు ప్రజాసృష్టి చేయటానికి సంకల్పించిన వెంటనే అతని నాభికమలం నుండి బ్రహ్మ జన్మించాడు. ఆ బ్రహ్మ ముఖం నుండి వేదాలు ప్రసరించాయి. వాటికి మేలు చేయటానికి సంకల్పించిన బ్రహ్మ ఒక అపార జ్ఞానిని పుత్రునిగా పొందాడు. ఆయనే అపాంతరముడు. ఆయన వేదాలన్నింటినీ అధ్యయనం చేసి క్రమబద్ధం చేసాడు. అందుకు సంతోషించిన శ్రీమన్నారాయణుడు అన్ని మన్వంతరాలలో మిక్కిలి ఆనందం పొందుతావని వరమిచ్చాడని మహాభారతంలో శాంతి పర్వం చెబుతుంది.......

Friday, September 16, 2022

దివ్యదృష్టి గురించి విశేషాలు


🌹*దివ్యదృష్టి గురించి విశేషాలు*🙏
*శివోహం శివోహం శివోహం*
మంత్ర తంత్ర యోగసాధనల్లో ఏ సాధన చేసినా సిద్దిని పొందే దశలో సాధకుడికి లభించేది దివ్యదృష్టి. భౌతికంగా చర్మచక్షువులతో చూడలేని విషయాలు చూడగలగటం దీంట్లో జరుగుతుంది. సాధనకు మొదట్లో తీవ్రమైన ఏకాగ్రత చేత తన ధ్యేయమూర్తిని మాత్రమే చూడగలుగుతాడు. అది కరచరణాది సహితమైన ఆకారం కావచ్చు, రేఖాసమన్వితమైన యంత్రాకారం కావచ్చు ‌ . లేకపోతే ఒట్టి తేజఃపుంజమే కావచ్చు. అది క్రమ క్రమంగా దేవతానుగ్రహం వలన తాను కోరిన వాటిని కూడా చూడగలిగే శక్తి సాధకుడికి వస్తుంది. కొందరు అమ్మవారి విగ్రహాన్ని చూస్థూనే ఆన్ని విషయాలు చూడగలరు. దర్శించగలరు. ఏ దేవతా మంత్రం అయినా ఈ స్థితికి తప్పకి దారి తీయాలి. ఆజ్ఞా చక్ర స్థానం అయిన భ్రూమధ్యంలో మూడవ కన్ను అదృశ్యరూపంగా యోగికి ఉదయిస్తుంది అన్నమాట. శివుడు ఫాలాక్షుడు అనడంలోని తాంత్రిక రహస్యం ఇక్కడ గుర్తించాలి. 

కాళిదాసు కుమారసంభవం లో శివతపోభంగానికి మన్మధుడు వస్తున్న సందర్భంగా ఆ దక్షిణామూర్తిని త్రయంభకునిగా వర్ణించాడు. మారుడు పుష్పాస్త్రాలను విడిచిన తర్వాత కొద్ది పాటి మనస్సంచలనం కలిగినా నిగ్రహించుకొని పరమేశ్వరుడు ధ్యాన దృష్టితో విషయాన్ని గ్రహించి మూడవ కన్నులో నుంచి అగ్నిని పుట్టించి మన్మధుడిని భస్మం చేశాడు. రుద్రుడు మూడవ కన్ను తెరిస్తే అగ్నిజ్వాల మాత్రమే ఉదయిస్తుంది అని చాలాచోట్ల వర్ణించబడింది. కానీ హరవిలాసంలో శ్రీనాథసార్వభౌముడు దారుకావనవిహారంలో శివుడు రంబావక్షోజ సౌందర్యాన్ని మూడు కన్నులతో చూసి ఆనందిచినట్లు వర్ణించాడు. దీనిని బట్టి మూడవ కన్ను కేవలం దహనానికి మాత్రమే కాదు మామూలుగా చూడటానికి కూడా ఉపయోగించవచ్చు అని కవిరాజు చెప్పినట్లు అయింది. 

మనుషుల్లో ఈ మూడవ కన్ను వికసించుకోమే ఉపనయనం, బ్రహ్మోపదేశము అనే ప్రక్రియను ప్రాచీన ఋషులు నిర్మించారు. ఉపనయనం అంటే అధికమైన కన్ను అని అర్థం. భ్రూమధ్యంలో ఈ కన్ను తెరుచుకుని అదృశ్య దేవలోకములను దర్శించడానికి ఈ ఉపనయనం ఉద్దేశించబడింది. టిబెట్ లో లామాలకు ఈ విశేషం బాగా తెలుసు. పాశ్చాత్య దేశాలలో నెప్ట్యూన్ ఫాలబాగమున కన్నుగల దేవతగా వర్ణన చేయబడినది. ఈజిప్టు రాజులు అయి ఫారోల భ్రూమద్యమునందు కనిపించే సర్వదర్శక స్పర్పచిహ్నం దివ్య దర్శనానికి ఒక సంకేతము అని పండితులు భావిస్తున్నారు.

పురాణాలలో చాలా చోట్ల మహనీయులైన ఋషులు తమ దివ్య దృష్టి ప్రభావం చేత త్రికాలములలోని ( భూత భవిష్యత్ వర్తమాన) విషయాలను తెలుసుకోగలినట్లు చెప్పబడింది. ఉదాహరణకు రఘువంశంలో దిలీపమహరాజుకు చాలా కాలం సంతానం లేదు. ఎంత కాలమో వేచి అనేక వ్రతాలు చేసినా ఫలితం కనబడక చివరికి కులగురువైన వశిష్టుని ఆశ్రమానికి వెళ్ళి ఆయన పాదపద్మములను ఆశ్రయించారు. ఆ మహర్షి ధ్యాన సమాధి లో గత కాలలో జరిగిన దిలీపుని దోషగాధను, దాని వలన అతడు తెలియకుండానే కామధేనువు చేత పొందిన శాపాన్ని వివరించి ఆ దోషాన్ని పోగొట్టుకోవడానికి మార్గం కూడా ఉపదేశించాడు. ప్రతీ పురాణంలోనూ ఇటువంటి విశేషాలు అడుగడుగునా కనబడుతూ ఉంటాయి. 

ఈ మధ్య కాలంలో కూడా సిద్ద వ్యక్తులు అయిన వారు ఈ దివ్యదృష్టిని సాధించినవారే. మహానుభావులు రామకృష్ణ పరమహంస దర్శనానుభవాలను పరిశీలిస్తే ఎన్నెన్నో విచిత్ర విశేషాలు కనిపిస్తాయి. ఈ జన్మకు రాకముందు ఊద్థ్వలోకాల నుంచి ఒక దివ్య శిశువు గా క్రిందికి దిగి వస్తూ మధ్య దారిలో కనబడిన ఒక మహర్షిని తనతోపాటు మానవజన్మ ఎత్తి , తనకు సహకరించడానికి రమ్మని కోరినట్లు గా పరమహంస ఒకచోట అన్నారు. ఆ ఋషి పేరు వివేకానందుడు అని కూడా వివరించారు. తనకు శిష్యులు కావాలని కోరివచ్చిన వారి యోగ్యతలను తెలుసుకోవడానికి వారి యొక్క పూర్వ జన్మలు వాటి సంస్కారాలు మొదలైన వాటిని తన అంతరంగ దృష్టితో చూసి తగిన వాళ్ళు అని అనిపిస్తే కానీ ఆయన స్వీకరించేడట. ఆ తర్వాత కాలంలో వివేకానంద స్వామికి కూడా ఈ శక్తి వికసించినట్లు ఆయన జీవిత చరిత్ర చదివితే తెలుస్తుంది.

అరుణాచలవాసి ప్రసిద్ధుడైన రమణ మహర్షి దృష్టి మహత్వాన్ని గురించి ఎన్నో కథలు వ్యాపించి ఉన్నాయి. ఒకే ఒక్క చూపులోనే అవతలి వ్యక్తి లోని విశేషాన్ని గుర్తించి తన ప్రబావం చేత వాళ్ళ జీవితాలనే ఆయన మార్చగలిగేవారు. గుడిపాటి వెంకటాచలం వంటివారు మారింది ఆ దృష్టి ప్రభావం వల్లనే రమణ మహర్షిని గురించి అంతో ఇంతో వ్రాసి ప్రచురించిన పాల్ బ్రంటన్ ఈజిప్టు లో జరిపిన అన్వేషణ ఫలితంగా అక్కడి కొందరు సిద్ద వ్యక్తుల పరిచయాన్ని పొంది, దాని వలన అతడి మనోనేత్రం వికసించగా, పూర్వ జన్మలో తాను ఒక ఈజీప్ట్ దేశపు దేవాలయ అర్చకుడు అని చూసి తెలుసుకోగలిగాడు. 

మంత్ర సిద్దుడు , మహకవి అయిన కావ్యకంఠ గణపతి ముని తన పూర్వ జన్మ విశేషాలను తెలుసుకోవడం మాత్రమే కాకుండా ఎందరో వ్యక్తుల విశేషాలను చూడగానే చెప్పగలిగేవారు.

రమణ మహర్షి అప్రఖ్యాతుడై అరుణాచలంలో తపస్సు చేసుకుంటూ ఉండే తరుణంలో ఒక రోజు ఆయనను తనకు కలిగిన అనుభూతిని కావ్యకంఠ గణపతి ముని ఇలా పలికాడు.

"" పశ్యామిదేవదత్తేన జ్ఞానేత్వాం ముహుర్ముహుః బ్రహ్మణ్యానాం పరంబ్రహ్మన్ సుబ్రహ్మణ్యం నరాకృతిం"" 

" పురాకుమారిలోనామ భూత్వాబ్రాహ్మణస్తత్తమః ధర్మం వేదోదితం నాధత్వం సంస్థాపితవానసి ""

" జైనైర్వాకులితే ధర్మే భగవాన్ ద్రవిడేషుచ భూత్వాత్వం జ్ఞాన సంబంధః భక్తిం స్దాపితవానసి ""

"అదునాత్వం మహభాగ బ్రహ్మజ్ఞానస్య గుప్తయే శాస్త్రజ్ఞానేన సంతృపైః నిరుద్దస్యాగతోధరాం " 

దేవతలు నాకు ప్రసాదించిన జ్ఞానంతో బ్రహ్మణ్యులలో శ్రేష్ఠునిగా నరరూపం ధరించిన సుబ్రహ్మణ్యునిగా నిన్ను చూస్తున్నాను. పూర్వం కుమారిలభట్టనే బ్రాహ్మణోత్తమునిగా పుట్టి వేదోదితమైన ధర్మమును నువ్వు స్థాపించావు. దేశంలో వేద ధర్మం జైనుల చేత వ్యాకులపాటు చెందగా నువ్వు ద్రవిడులలో జ్ఞానసంబందర్ అనే పేరుతో ఉదయించి భక్తిని స్థాపించావు. ఈ రోజు శాస్త్రజ్ఞానం చేత సంతృప్తి చెందిన వారి చేత నిరోధించబడిన బ్రహ్మ జ్ఞానాన్ని గోపనం చేయడానికి నువ్వు ( రమణ మహర్షి గా ) భూమికి వచ్చావు. 

కుమార స్వామి భూలోకంలో మూడు జన్మలు ఎత్తుతాడు అని రమణ మహర్షి ది మూడవది, చివరిది అయిన జన్మ అని గణపతి ముని పలికారు. జీవించి ఉండగా కఫాలభేదన సిద్ది పొందిన మహా తపస్విగా ఖ్యాతిగాంచిన వారి మాటలు అర్షవిజ్ఞానపు మూటలు. 

ఒక్క పూర్వ జన్మకు సంబంధించిన వివేషాలే కాదు, ఇహ పర జన్మలోని కష్టసుఖాలు అన్నింటికి మూలమైన అంశాలు అన్ని దివ్య దృష్టి తో తెలుసుకుంటారు తపస్వులు. దాని వలన ఎంతో లోకోపకారం జరుగుతుంది. 

ఇంక ఈ మూడవ కన్ను లేక మనోనేత్రం , దివ్య దృష్టి తెరుచుకునే మార్గం ఏమిటి!? 

|| శ్లో||  ఆకుంచ్యవాయు మవిజిత్యచ వైరిషట్కం ఆలోక్యనిశ్చలధియానిజ నాసికాగ్రం "

గాలిని కుంభించి, అరిషడ్వర్గాలను జయించి నిశ్చల మనసుతో నాసాగ్రంను చూస్తూ ఉండాలి. అని యోగ శాస్త్రం చెబుతోంది. 

తిక్కన మహాభారతం లో హరిహరనాదుడ్ని నాసాగ్రనివాస రసికునిగా వర్ణించాడు. భ్రూమధ్యంలో ఆజ్ఞా చక్ర స్థానం. లలితా సహస్ర నామాలలో ఆజ్ఞాచక్రాంతరాళస్థారుద్ర గ్రంథి విభేదిని" అని ఉంది. పరమేశ్వరీ ప్రదాన స్థానాలలో అది ఒకటి. 

సిద్దుడైన మంత్రవిదుని చేత ఉపదేశం పొంది భ్రూమధ్యం యందు దేవతను నిలుపుకొని కళ్ళు మూసుకుని జపం సాధన ఏకాగ్రత గా చేస్తే తప్పకుండా మూడవ కన్ను అంతరలోచనం వికసిస్తుంది. స్వతంత్రంగా ఎటువంటి శిక్షణ లేకుండా గాలిని కుంభించడం చేయకూడదు. 

ఈ చూసే దృష్టి సాధనలో ఇంకా కొన్ని సాధనలు కూడా ఉన్నాయి. అంతర్లక్ష్యం, బహిర్ దృష్టి , పౌర్ణమి దృష్టి, కలిగింది శాంభవి ముద్ర. కొందరు ఊరికే కళ్ళు తెరిచి ఉంటారు. బయట వస్తువును దేనిని కూడా చూడరు. అది లక్ష్యరహితమైన చూపులా కనిపిస్తుంది. కానీ అది శాంభవీ ముద్ర సాధన యొక్క విశేషం. ఇంకొంత మంది దీప సాధన చేస్తారు. దీప దుర్గ వంటి మంత్రాలు కొన్ని ఉన్నాయి. ఇంకా చాలా చాలా ఉన్నాయి. ముఖ్యంగా 13 రకాల పద్ధతులు ఉన్నాయి. ఆ దీపపు వెలుగులో వారి జీవిత రహస్యాలు చూస్తారు.

ఆ మార్గంలన్నింటిలోకి అంజన విద్య మరొకటి. కొన్ని రకాల మూలికలతో కాటుక తయారు చేసి తమలాపాకు పైన లేక భొటన వ్రేలి గోరుపైననో దానిని రాసి సాధకుడు దానిని చూడటమో లేక ఇతరుల చేత చూపించడమో ఇందులో జరుగుతుంది. కావాల్సిన విశేషాలు ఆ అంజనంలో దృశ్యాలుగా కనిపిస్తూ ఉంటాయి. 

వీటిలో దేనికైనా ఏకాగ్రత, మనోశ్చలత, మంత్రసిద్ది చాలా ముఖ్యం. లోపం ఉండకూడదు. ........

...

....

.....

ఏదైనా అందరికి, చాలా తేలికగా ఉండే పద్దతి సర్వసాధకులకు "ధ్యానం" ద్వారా దివ్య దృష్టి పొందడం అత్యంత ప్రధానమైన దశ. 

నుదుటిపై ధరించే సిందూరం లేక గంధం గుర్తుల గురించి మాట్లాడే ముందు రెండు సంఘటనల గురించి వివరించాలి. దాని వలన ఇది అర్థం చేసుకోవడం తేలిక అవుతుంది. రెండూ చారిత్రాత్మక సంఘటనలే. 

1888 లో , దక్షిణ భారతదేశంలో రామానుజం అనే ఒక వ్యక్తి భీద బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. అతను  పేరుమోసిన గణిత శాస్త్రజ్ఞుడు అయ్యాడు. అతను ఎక్కువ చదువుకోలేకపోయాడు. కానీ గణితంలో అతని ప్రతిభ సాటిలేనిది. బాగా చదువుకున్న చాలా మంది గణత శాస్త్రజ్ఞులు , సంవత్సరాల తరబడి తీసుకున్న శిక్షణ వలన , ఇతరుల మార్గదర్శకత్వం వలన పేరు తెచ్చుకున్నారు. కానీ రామానుజం విశ్వవిద్యాలయ ప్రవేశార్హత కూడా లేనివాడు. అంతే కాకుండా అతడు ఎవరి నుంచి శిక్షణ కానీ, మార్గదర్శకత్వం కానీ పొందలేదు.  అందుకే , గణిత శాస్త్రం తెలిసినవారు రామానుజాన్ని మించిన గణిత శాస్త్ర ప్రావీణ్యత ఉన్నవారు ఎప్పుడూ లేరు అంటారు. 

అతడు చాలా కష్టం మీద గుమాస్తా ఉద్యోగం సంపాదించుకున్నాడు. కానీ అతి త్వరలోనే అతడికి గణిత శాస్త్రం లో అద్భుతమైన ప్రతిభ ఉంది అన్న వార్త ప్రచారంలోకి వచ్చింది. ఆ రోజుల్లో , కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం లో ఎంతో ప్రసిద్ధి గాంచిన ప్రొఫెసర్ హర్డీకి ఒక జాబు వ్రాయమని ఎవరో అతనికి సలహ ఇచ్చారు. అతడు జాబు వ్రాయలేదు, కానీ రెండు రేఖాగణిత సంబంధించిన సిద్దాంత సమస్యలకు సమాధానం కొనుక్కొని హార్డీకి పంపాడు. వాటిని అందుకొని హర్డి చాలా ఆశ్చర్యపడ్డాడు, అంత చిన్న వయసులోనే ఆ సిద్ధాంతాలకు , ప్రతిపాదనలు, సమాధానాలు వ్రాయగలిగాడంటే నమ్మలేకపోయాడు. రామానుజానికి వెంటనే జాబు వ్రాసి ఇంగ్లాండుకి రమ్మని ఆహ్వానించాడు. రామానుజాన్ని మొదటి సారి కలిసినప్పుడు, గణిత శాస్త్రం లో అతడి ముందు తానొక చిన్నపిల్లాడి లాంటి వాడినని హర్డీకి అనిపించింది. రామానుజం ప్రతిభా సామర్థ్యాలు అతడి మానసిక సామర్థ్యం వలన కాదు ఎందుకంటే మేధస్సు చాలా నిదానం గా పనిచేస్తుంది, ఆలోచించడానికి సమయం తీసుకుంటుంది. కానీ హార్డీ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి రామారావు సమయం తీసుకోలేదు. సమస్య బోర్డు మీద వ్రాసి వ్రాయకముందే లేదా నోటిమాటలతో చెప్పగానే, ఆలోచించడానికి వ్యవది తీసుకోకుండా రామానుజం సమాధానం ఇవ్వడం మొదలు పెట్టేవారు. అంత గొప్ప గణిత శాస్త్రజ్ఞుడికి అది ఎలా సాధ్యం అయిందో అర్థం చేసుకోవడం కష్టమైంది. సమస్యని పరిష్కరించడానికి ఒక ప్రసిద్ధ గణిత శాస్త్రజ్ఞుడు ఆరుగంటల పాటు తీసుకుని, అందులోనూ నిస్సందేహంగా అదే నిర్దిష్టమైన సమాధానం అని చెప్పలేని స్థితిలో ఉంటే రామానుజం వెంటనే, ఏ విధమైన తప్పు లేకుండా దాన్ని పరిష్కారం చేశాడు. 

రామానుజం మానసికంగా సమాధానాలు ఇవ్వడం లేదని ఋజువైంది. అతడు బాగా చదువుకున్నవాడు కాదు.. అతడు మెట్రుక్యులేషన్ పరీక్షలో తప్పాడు .. అతడి మేధా సామర్థ్యం గురించిన సూచనలు వేరే ఏం లేవు, కానీ గణిత శాస్త్ర సంబంధం గా అతడు మానవాతీతుడు. మానవ మస్తిష్కం అర్థం చేసుకోలేనిది ఏదో జరుగుతోంది. 

36 సంవత్సరాల వయస్సు లో అతడు క్షయరోగంతో మరణించారు. అతడు ఆసుపత్రిలో ఉన్నప్పుడు గణిత శాస్త్రజ్ఞులైన ఇద్దరు, ముగ్గురు స్నేహితులతో హార్డీ అతడిని చూడటానికి వెళ్ళాడు. అతడు తన కారుని ఒక చోట నిలిపాడు. రామానుజానికి ఆ కారు నెంబర్ ప్లేట్ కనిపించింది.హర్డీ  గదిలోకి రాగానే, రామానుజం అతఢి కారు నెంబర్ ప్లేట్ విశిష్టంగా ఉంది అని అన్నారు: దానికి నాలుగు ప్రత్యేక దృక్పథాలు ఉన్నాయి అని అన్నారు. ఆ తర్వాత , రామానుజం మరణించారు. రామానుజం చెప్పింది అర్థం చేసుకోవడానికి హర్డీకి ఆరు నెలలు పట్టింది, కానీ అతడు నాలుగింటిలో మూడు విశిష్టతలని మాత్రమే తెలుసుకోగలిగాఢు. అతడు చనిపోయేటప్పుడు వీలు నామాలో నాలుగో దృక్పథాన్ని కనుక్కోవడానికి ఆ సంఖ్య గురించిన పరిశోధన కొనసాగించాలని కోరాడు. రామానుజం నాలుగు అన్నారు, కనుక  నాలుగొ దృక్పథం తప్పనిసరిగా ఉంటుంది . హార్డీ చనిపోయిన ఇరవై రెండు సంవత్సరాల తర్వాత, ఆ నాల్గవ దాన్ని కనిపెట్టారు. రామానుజం చెప్పింది నిజమే. 

అతడు ఏదైనా గణిత శాస్త్ర సమస్యను పరిష్కరించడానికి కూర్చున్నప్పుడల్లా అతడి కనుబొమ్మల మధ్య భాగంలో ఏదో జరగడం మొదలు పెట్టేది. ఆ నిర్దిష్ట స్థలం కేంద్రంగా, అతడి కనుగుడ్లు రెండూ పైకి తిరిగేవి! యోగాలో , ఆ స్థలాన్ని మూడవ నేత్రపు స్థానం అని వర్ణిస్తారు. దీనిని మూడవ నేత్రం అని ఎందుకు అంటారు అంటే , ఈ కన్ను ఉత్తేజం అయితే వివిధ జగత్తులకు ( లోకాలకు) సంబంధించిన కొన్ని సంఘటనలని, దృశ్యాలను సంపూర్ణంగా చూడవచ్చు. అది మీ ఇంటి ద్వారం లో ఉన్న ఒక చిన్న రంద్రంలో నుంచి బయటి ప్రపంచాన్ని చూడటం లాంటిది, ఆకస్మికంగా తలుపు తెరుచుకుంటే , నువ్వు ఆకాశం అంతా చూస్తావు. అక్కడ ఆ రెండు కను బొమ్మల మద్య ఓ స్థలం ఉంది, అక్కడే ఒక చిన్న రంధ్రం ఉంది. రామానుజం విషయం లో అది ఒక్కొక్క సారి తెరుచుకుంటుంది. సమస్యను పరిష్కరించడానికి అతడి కళ్ళు మూడవ కన్ను వైపు తిరిగేవి. సమీప భవిష్యత్తులో హర్డీ కానీ, పాశ్చాత్య శాస్త్రజ్ఞులు కానీ ఈ ప్రక్రియను అర్థం చేసుకోలేకపోయారు.

నేను మీకు సింధూరం ధరించడానికి సంబంధించిన మరొక సంఘటన చెబుతాను, మూడవ నేత్రానికి దానికి ఉన్న సంబంధం అప్పుడు అర్ధం అవుతుంది.

ఎడ్గార్ కైస్ 1945 లో మరణించాడు. దానికి నలభై సంవత్సరాలకు ముందు, అంటే 1905 లో అతడు జబ్బుపడి , మూడు రోజుల పాటు అపస్మారక స్థితిలో ఉన్నాడు. వైద్యులు ఆశలు వదులుకున్నారు, అతడిని చైతన్య స్థితికి తీసుకురాగల మార్గమే కనిపించలేదు అన్నారు. అతడు చాలా గాఢమైన అపస్మారక స్థితిలోకి వెళ్ళాడని, దానిలో నుంచి బహుశా అతడు ఎప్పటికీ బయటపడలేడనీ వారు భావించారు. ఎన్నో రకాల ముందులు వాడారు, కానీ అతడు స్పృహలోకి వచ్చే సూచనలు ఏమీ కనిపించలేదు. 

మూడవ రోజు సాయంత్రం వైద్యులు తాము ఇంక ఏమీ చేయలేం అని, అతడు నాలుగు లేక ఆరు గంటలలో మరణించవచ్చు అనీ, ఒక వేళ అతడు బ్రతికినా , అతడి మెదడు దెబ్బతింటుంది అనీ, అది చావు కంటే హీనం అని, ఎందుకు అంటే కాలం గడిచేకొద్దీ సున్నితమైన రక్తనాళాలు, మెదడులోని కణాలు విడిపోతాయి అని ప్రకటించారు. కానీ కైస్ అపస్మారక స్థితిలో ఉండి కూడా అకస్మాత్తుగా మాట్లాడటం మొదలు పెట్టాడు. వైద్యులు దీనిని నమ్మలేకపోయారు:అతడి శరీరం అపస్మారక స్థితిలో ఉంది, కానీ అతడు మాట్లాడుతూ ఉన్నాడు. తను చెట్టు మీద నుంచి పడిపోయానని, వెన్నెముక దెబ్బతింది అనీ, అందుకే అపస్మారక స్థితిలో ఉన్నాను అని చెప్పాడు. తనకి ఆరుగంటల లోపు చికిత్స జరగకపోతే తన మెదడు దెబ్బతింటుంది అనీ, తాను చనిపోతాను అనీ కూడా చెప్పాడు. అతను త్రాగటానికి ఒక ఔషదానికి సంబంధించిన మందు ఇవ్వాలి అని, అప్పుడు పన్నెండు గంటలలో తను కోలుకుంటానని కూడా చెప్పాడు.

తనకు కావాలని కోరిన ఔషదాల పేర్లు ఎడ్గార్ కైస్ కి తెలిసే అవకాశం లేదు, అతడి మెదడు దెబ్బతినడం వలన అలా మాట్లాడుతున్నాడు అని వాళ్ళు ముందు అనుకున్నారు. ఎందుకు అంటే అతడు సూచించిన జౌషదాలు ఏవీ ఇలాంటి జబ్బును తగ్గించినట్లు వినలేదు. కానీ కైస్ ప్రత్యేకంగా వాటిని సూచించాడు కనుక వాటిని ప్రయత్నించి చూద్దాం అనుకున్నారు. అవి తెప్పించి కైస్ కి ఇచ్చారు: అతడు పన్నెండు గంటలలో కోలుకోవడం జరిగింది. 

అతడికి తెలివి వచ్చాక జరిగిన సంఘటన అతడికి చెప్పినప్పుడు, కైస్ కి మందు గురించి తాను అలా చెప్పినట్లు గుర్తు రాలేదు, ఆ మందుల పేర్లు తెలియడం కానీ, వాటిని గుర్తించడం కానీ చేయలేకపోయాడు. కానీ ఎడ్గార్ కైస్ జీవితంలోని ఈ సంఘటన అరుదైనవి సంభవించడానికి ఆరంభం. అతను బాగు చేయడానికి వీలులేని జబ్బులకు మందులను సూచించడంలో నిపుణుడు అయ్యాడు; అతడి జీవిత కాలం లో అతను ముప్పై వేల మందికి జబ్బు నయం చేశాడు. అతడు ఏ జౌషదాన్ని సూచించినా అది సరైనదే అయ్యేది, ఏ మినహాయింపు లేకుండా, అతను చెప్పిన మందు వాడిన ప్రతీ రోగి బాగుపడ్డాడు. కానీ కైస్ దాని గురించి వివరించలేకపోయేవాడు. చికిత్స కోసం అతడు ఎప్పుడు కళ్ళు మూసుకున్నా అతడి కళ్ళు కనుబొమ్మల మధ్యస్థానం వైపుకి, ఏవో లాగుతున్నట్లు తిరిగేవని మాత్రమే చెప్పేవాడు. అతడి కళ్ళు అక్కడ నిలిచేవి, మిగతావన్నీ అతను పూర్తిగా మర్చిపోయేవాడు, ఒక నిర్దిష్ట స్థితికి చేరుకున్నప్పుడు మాత్రమే పరిసరాలను మర్చిపోయేవాడని, ఆ స్థితికి వచ్చే వరకు చికిత్స విధానం అతడికి తెలిసేది కాదని మాత్రమే గుర్తుండేది. అతడు అద్భుతమైన రోగచికిత్సలు సూచించేవాడు. అందులో అర్థం చేసుకోవాల్సినవి రెండు ఉన్నాయి. 

అమెరికా లో రోత్ చిల్డ్స్ అనే ధనిక కుటుంబం ఉంది. ఆ కుటుంబం లోని ఒక స్త్రీ చాలా కాలం జబ్బపడింది, ఏ చికిత్సా పనిచేయలేదు. ఆమెని ఎడ్గార్ కైస్ దగ్గరకు తీసుకొని వచ్చారు, అచేతన స్థితిలో అతడు ఓ నిర్దిష్ట మందును సూచించాడు. అచేతన స్థితిలో ఉన్నాడని మనం అంటాం, కానీ ఆ రహస్య ప్రక్రియ గురించి తెలిసిన వారు ఆ సమయంలో అతడు పూర్తి చైతన్యంలో ఉన్నాడు అంటారు. నిజానికి, మూడవ కన్ను గురించి తెలిసే స్థితికి ఎదిగేవరకు ఆ అచేయనత్వం కొనసాగుతూనే ఉంటుంది. 

రోత్ చిల్డ్స్ కోటిశ్వరుడు, అందువలన మందుల కోసం అమెరికా అంతా వెతికించాడు, కానీ అవి అతడికి దొరకలేదు. ఆ మందు నిజంగా ఉందో లేదో ఎవ్వరూ చేప్పలేకపోయారు. అంతర్జాతీయ పత్రికలలో ఆ మందు గురించి సమాచారం తెలియజేయవల్సిందిగా ప్రకటనలు ఇచ్చారు. మూడు వారాల తర్వాత ఆ పేరు గల మందు లేదని, ఇరవై సంవత్సరాల క్రితం ఆ పేరు గల మందు పై తన తండ్రికి హక్కు ఉండేది అని, కానీ దాన్ని ఎప్పుడూ తయారు చేయలేదు అని స్వీడన్ నుంచి ఒక వ్యక్తి వ్రాశాడు. తన తండ్రి చనిపోయాడు అని, ఆ ఔషద సూత్రం పంపగలను అని వ్రాశాడు. అప్పుడు ఆ మందు తయారు చేయించి ఆమెకు ఇవ్వడంతో, ఆమె తేరుకుంది. మార్కెట్ లో కూడా లేని మందు గురించి కైస్ కి ఎలా తెలుసుకోగలిగాడు !? 

ఇంకో సందర్భంలో , ఒకరికి ఒక ప్రత్యేకమైన మందు సూచించాడు . దాని కోసం వెతికారు కానీ అది దొరకలేదు. ఒక సంవత్సరం తర్వాత ఆ మందు అందుబాటులో ఉందని పత్రికా ముఖంగా ప్రకటించారు. గతించిన సంవత్సరం లో ఆ మందు పరిశోదనశాలలో శోధింపబడే ప్రక్రియ లో ఉంది. దానికి ఇంకా పేరు కూడా పెట్టలేదు. కానీ కైస్ కి  దాని గురించి తెలుసు. అప్పుడు ఆ రోగికి ఆ మందు ఇచ్చారు ,అతడు ఆరోగ్యాన్ని పొందాడు.  ...

మనం మంచి నిద్ర లో ఉన్నప్పుడు మన కళ్ళు పైకి లాగబడి ఉంటాయి. అది మనం ఎంత గాఢంగా నిద్రపోతున్నాం అన్నదానిపై ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనస్తత్వ శాస్త్రవేత్తలు నిద్రపై ప్రయోగాలు జరుపుతున్నారు. నిద్ర ఎంత గాఢంగా ఉంటే, కళ్ళు అంత పైకి లాగబడి ఉంటాయి. కళ్ళు ఎంత కిందకి ఉంటే, అంత కదలికలు ఉంటాయి. కనురెప్పల చాటున కళ్ళు ఎంత వేగంగా కదులుతూ ఉంటే అంత ఎక్కువ సంఘటనలతో కూడిన కల నీకు వస్తుంది అన్నమాట. ప్రయోగాల ద్వారా ఇప్పుడు ఇది శాస్త్రీయంగా నిరూపితమైంది. కంటి కదలికలు తర్వాత కదులుతున్న కలని సూచిస్తాయి. కళ్ళు కిందికి ఉంటే కళ్ళ కదలిక ఎక్కువ వేగంగా ఉంటుంది. కళ్ళు పైకి వెళుతుంటే కళ్ళ కదలిక వేగం తగ్గుతుంది. కళ్ళ కదలికే లేనప్పుడు మంచి నిద్ర లో ఉన్నట్లు. ఆ స్థితిలో కనుబొమ్మల మధ్య స్థానం లో కళ్ళు కదలకుండా నిలిచి ఉంటాయి.

సమాధిలో, గాడ ధ్యానం లో మనం ఏ స్థితికైతే చేరుకుంటామో గాఢనిద్రలో కూడా అదే స్థితికి చేరుకుంటామని యోగా చెబుతుంది. గాఢమైన నిద్రలోనూ, సమాధి స్థితిలోనూ కళ్ళు నిలిచి ఉండేది ఒకే స్థానంలో.

ఈ రెండు చారిత్రాత్మక సంఘటనల గురించి ఎందుకు చెప్పాను అంటే ( రామానుజం, ఎడ్గర్ కైస్) కనుబొమ్మల మధ్య స్థానం లో ప్రాపంచిక జీవితం ఆగిపోయి పరలోక జీవితం మొదలు అవుతుంది అని సూచించడానికే. ఆ ద్వారానికి ఇటువైపు ప్రపంచం వర్థిల్లుంటే, అటువైపు తెలియని, మానవాతీతమైన అద్భుతమైన ప్రపంచం ఉంది. 

తిలకం సిందూరం గుర్తు తెలియని ఆ ప్రపంచానికి సంకేతంగా కనిపెట్టబడింది. ఎక్కడ అంటే అక్కడ దాన్ని పెట్టకూడదు, నుదిటిపై చేయిపెట్టి ఆ స్థానాన్ని కనుక్కున్న వ్యక్తి మాత్రమే, తిలకం ఎక్కడ పెట్టవలసినది చెప్పగలడు. తిలకం ఎక్కడంటే అక్కడ పెట్టడం వలన ప్రయోజనం లేదు, ఎందుకు అంటే అందరికీ ఆ స్థానం ఒకేచోట ఉండదు. మూడవ కన్ను అందరికీ ఒకేచోట ఉండదు, చాలా మందికి అది కనుబొమ్మల మద్యపై బాగంలో ఎక్కడో ఉంటుంది. గతజన్మ లో ఎవరైనా ఎక్కువ కాలం ధ్యానం చేసి ఉంటే, అతడికి సమాధి అనుభవం లభించి ఉంటే, అతఢి మూడవ కన్ను కొద్దిగా కింద ఉంటుంది. ధ్యానమే చేసి ఉండకపోతే ఆ స్థానం నుదిటి మీద పై భాగంలో ఉంటుంది. ఆ బిందువు ఉన్న స్థానాన్ని బట్టి గతజన్మ లో నీ ద్యానస్థితిని నిర్ణంచవచ్చు. గతజన్మ లో సమాధి స్థితి అనుభవించావా లేదా అనేది అది సూచిస్తుంది. అది తరచుగా జరిగి ఉంటే ఆ బిందువు క్రిందకి దిగి ఉంటుంది. నీ కళ్ళతో సమానమైన స్థాయిలో అది ఉంటుంది. అది అంతకంటే కిందకి వెళ్ళలేదు. ఆ బిందువు నీ కళ్ళకి సమాంతరంగా ఉంటే, ఒక చిన్న సంఘటనతో ఎవరైనా సమాధిలోకి ప్రవేసించగలరు. నిజానికి, జరిగింది చాలా చిన్నది కావడంతో ప్రాముఖ్యత లేనిదానిలాగా కనిపిస్తుంది. స్పష్టమైన కారణం ఏమీ లేకుండానే ఎవరైనా సమాధిలోకి వెళితే మనం ఆశ్చర్యపోతాం 

సింధూరం లేదా గంధపు గుర్తు సరియైన స్థలంలో పెడితే, అది చాలా విషయాలను సూచిస్తుంది. మొదటిగా, ఒక ప్రత్యేకమైన స్థలంలో తిలకం ధరించమని మీ గురువు చెబితే, అక్కడ నీకు ఏదో అనుభవం మొదలవుతుంది. దాన్ని గురించి నువ్వు ఆలోచించి ఉండకపోవచ్చు, కానీ నువ్వు కళ్ళు మూసుకుని కూర్చుంటే ఎవరైనా రెండు కళ్ళ మధ్య దగ్గరగా వేలు పెడితే, ఎవరో నీ వైపు వేలుపెట్టి చూపిస్తున్నట్లు నీకు అనిపిస్తుంది. మూడవ కన్ను గ్రహణ శక్తి అదే.

తిలకం నీ మూడవ కన్ను నేత్రపు పరిణామం అంత ఉండి సరియైన స్థలంలో పెడితే, నువ్వు ఆ స్థలాన్ని 24 గంటలూ గుర్తుంచుకుంటావు, మిగిలిన శరీరాన్ని మర్చిపోతావు. దీని వలన తిలకం పట్ల ఎరుక పెరుగుతుంది మరియు శరీరం పట్ల ఎరుక తగ్గుతుంది. అప్పుడు తిలకం తప్ప శరీరం గురించి ఏ విధమైన గుర్తు లేని క్షణం వస్తుంది. అది జరిగినప్పుడు నీ మూడవ నేత్రాన్ని తెరుచుకోగలవు. ఈ సాధన లో , నువ్వు పూర్తిగా నీ శరీరాన్ని మర్చిపోయి, తిలకాన్ని మాత్రమే గుర్తుంచుకునే ప్రయోగంలో నీ చైతన్యం మొత్తం స్పటికం గా మారి, మూడవ నేత్రంపై కేంద్రీకరిస్తుంది. మూడవ నేత్రాన్ని తెరిచే తాళం చెవి కేంద్రీకరించబడిన చైతన్యమే. ఒక భూతద్దం సహాయంతో సూర్య కిరణాలను ఒక కాగితపు ముక్క మీద కేంద్రీకరిస్తే, ఆ కాగితాన్ని మండించడానికి సరిపోయినంత వేడిని సృష్టిస్తావు. ఆ కిరణాలు కేంద్రీకరించినప్పుడు మంట ఉత్పత్తి అవుతుంది. శరీరం అంతా చైతన్యం వ్యాపించి ఉన్నప్పుడు అది నీ జీవితాన్ని నిర్వహించడం అనే పని చేస్తూ ఉంటుంది. కానీ అది పూర్తిగా మూడవ నేత్రంపై కేంద్రీకరిస్తే , మూడవ నేత్రంతో చూడటానికి అడ్డంగా ఉన్నది తగలబడుతుంది. , అప్పుడు నీకు అంతర్గత ఆకాశాన్ని చూడనిచ్చే తలుపు తెరుచుకుంటుంది. 

తిలకం యొక్క మొదటి ఉపయోగం ఏమిటి అంటే తిలకాన్ని 24 గంటలూ గుర్థుంచుకోవడం కోసం శరీరంలో నీకు సరియైన చోటుని చూపించడం. తిలకం యొక్క రెండవ ఉపయోగం ఏమిటి అంటే గురువు నీ నుదుటిపై చేయి పెట్టకుండా నీ ప్రగతిని గమనించడాన్ని అది సుగమం చేస్తుంది.. ఎందుకు అంటే ఆ బిందువు కిందకి జరిగే కొద్దీ తిలకం కొంచెం కిందకి పెడతావు. ప్రతీ రోజూ ఆ స్థలాన్ని గమనించి మూడవ నేత్రం ఎక్కడైతే ఉందని అనుకుంటావో అక్కడ తిలకాన్ని పెట్టాలి

🙏🌹🙏🌹🙏