*భ్రమర కీటక న్యాయం*
*మార్జాల కిశోర న్యాయం*
*మర్కట కిశోర న్యాయం*
*ఒక విశ్లేషణ*
🌈💫🌈💫🌈💫🌈💫🌈💫🌈💫🌈
🌈 *భ్రమర కీటక న్యాయం-*
💫 భ్రమరం (తుమ్మెద) కీటకాన్ని (ఒక రకమైన పురుగు) తనతో తెచ్చుకొని దానిచుట్టూ ఝుంకారం చేసుకుంటూ పదే పదే తిరుగుతుంది. అలా తిరిగేటప్పుడు మొదట భయంగా, తర్వాత ఏకాగ్రతగా, అటుపై తనను తానే పూర్తిగా మరచిపోతుంది కీటకం. ఆ మైమరపులో కొద్దిరోజుల తర్వాత తానే భ్రమరంగా మారిపోతుంది కీటకం. *ఇదే భ్రమర కీటక న్యాయం!*
💫 అదే భావనతో భక్తుడు కూడా భగవంతుని మైమరచి తలుస్తూ, భక్తుడు సగుణరూపంలో ఉన్న భగవంతుడు అవుతాడని వేదాంతపరంగా చెబుతారు!
భక్తి మార్గంలో ఉన్నవారు లేక భక్తి మార్గాన్ని అనుసరించాలనుకునే వారు రెండు విధాలైన మార్గాలను ఎన్నుకుంటారు!
🌈 *మార్జాల కిశోర న్యాయం*
💫 మార్జాలం అంటే పిల్లి,
కిశోరం అంటే పిల్ల (baby),
న్యాయం అంటే ఒక గుర్తింపు పొందిన పధ్ధతి!
💫 కొంతమంది భక్తులు, భగవంతుడు తమను ఉంచిన ప్రదేశంలోనే, ఉంచిన స్థితిలోనే ఎలా ఉంచాడో అలానే ఉండటానికి ఇష్టపడతారు.
💫 పిల్లి తన పిల్లలను నోటితో గట్టిగా పట్టుకొని పలు ప్రదేశాలు వెతికి, ఆఖరికి తన పిల్లలు ఎక్కడుంటే క్షేమంగా ఉంటాయని తలుస్తుందో వాటిని అక్కడే క్షేమంగా ఉంచుతుంది. ఇక్కడ పిల్లల బాధ్యత అంతా తల్లి అయిన పిల్లే భరిస్తుంది. పిల్లి పిల్లలు తమ క్షేమాన్ని తల్లి చూసుకుంటుందనే గట్టి నమ్మకంతో ఉంటాయి. వాటికి మరే ఏవిధమైన ఆలోచనలు, ఆందోళనలు ఉండవు.
💫 ఈ మార్గాన్ని ఎన్నుకునే వారు, నమ్మిన వారు అంతా భగవంతుని మీదే భారం వేస్తారు.
💫 ఈ మార్గంలో ఉన్నవారు భక్తియోగంలో ఉన్నత స్థితికి చేరుకున్నవారని వేదాంతులు అంటుంటారు! దీనినే శరణాగతి పధ్ధతి అని కూడా అంటారు.
🌈 *మర్కట కిశోర న్యాయం*
💫 మర్కటం అంటే కోతి. మిగిలిన వాటికి అర్ధాలు పైన చెప్పినవే. కొంతమంది భక్తులు భగవంతుని అంటిపెట్టుకొని ఉండాలని భావిస్తారు.
💫 కోతిని దాని పిల్ల గట్టిగా కావలించుకొని / పట్టుకొని ఉంటుంది. పిల్ల కిందపడితే తల్లి బాద్యత ఉండదు ఇక్కడ. అంటిపెట్టుకునే బాధ్యత అంతా పిల్ల మీదే ఉంటుంది! (ఇక్కడ చెప్పింది పైన చెప్పిన న్యాయానికి పూర్తిగా భిన్నమైనది.)
💫 తల్లిని అంటిపెట్టుకున్నంతసేపూ పిల్ల క్షేమంగానే ఉంటుంది. తల్లిని పొరపాటుగానైన వదిలేస్తే పిల్ల బాధపడక, ఆపదలోపడక తప్పదు.
💫 తల్లి ఒక చెట్టు మీదనుంచి మరొక చెట్టు మీదకు దూకే ప్రయత్నంలో కూడా పిల్ల తల్లిని గట్టిగా పట్టుకునే ఉంటుంది.
💫 అలానే, కొందరు భక్తులు తాము ఎన్ని కష్టాలు ఎదుర్కున్నప్పటికీ భగవంతుని పాదాలు వదలరు. ఇటువంటి భక్తులు భగవంతుని గాఢంగా విశ్వసిస్తారు. ఇది కూడా భక్తియోగంలో ఉన్నతమైన మార్గమే!
💫 *మార్జాల కిశోర న్యాయం, మర్కట కిశోర న్యాయాలలో ఏది మంచిదనే చర్చ అనవసరం.*
*రెండు మార్గాలూ సృష్టి ధర్మాన్ని అనుసరించినవే! అన్నిటికన్నా విశ్వాసం ముఖ్యం, ఏ మార్గమైనా ఒకటే!*
✅👉 *మొదటి దాంట్లో భారం అంతా* *భగవంతుని మీద వేస్తారు.*
✅👉 *రెండవ దానిలో భగవంతుని ధ్యానిస్తూ ఫలితాన్ని ఆశించకుండా భారాన్ని తామే వహిస్తారు!!*
🙏శివోహం 🙏
No comments:
Post a Comment