Translate

Friday, September 16, 2022

దివ్యదృష్టి గురించి విశేషాలు


🌹*దివ్యదృష్టి గురించి విశేషాలు*🙏
*శివోహం శివోహం శివోహం*
మంత్ర తంత్ర యోగసాధనల్లో ఏ సాధన చేసినా సిద్దిని పొందే దశలో సాధకుడికి లభించేది దివ్యదృష్టి. భౌతికంగా చర్మచక్షువులతో చూడలేని విషయాలు చూడగలగటం దీంట్లో జరుగుతుంది. సాధనకు మొదట్లో తీవ్రమైన ఏకాగ్రత చేత తన ధ్యేయమూర్తిని మాత్రమే చూడగలుగుతాడు. అది కరచరణాది సహితమైన ఆకారం కావచ్చు, రేఖాసమన్వితమైన యంత్రాకారం కావచ్చు ‌ . లేకపోతే ఒట్టి తేజఃపుంజమే కావచ్చు. అది క్రమ క్రమంగా దేవతానుగ్రహం వలన తాను కోరిన వాటిని కూడా చూడగలిగే శక్తి సాధకుడికి వస్తుంది. కొందరు అమ్మవారి విగ్రహాన్ని చూస్థూనే ఆన్ని విషయాలు చూడగలరు. దర్శించగలరు. ఏ దేవతా మంత్రం అయినా ఈ స్థితికి తప్పకి దారి తీయాలి. ఆజ్ఞా చక్ర స్థానం అయిన భ్రూమధ్యంలో మూడవ కన్ను అదృశ్యరూపంగా యోగికి ఉదయిస్తుంది అన్నమాట. శివుడు ఫాలాక్షుడు అనడంలోని తాంత్రిక రహస్యం ఇక్కడ గుర్తించాలి. 

కాళిదాసు కుమారసంభవం లో శివతపోభంగానికి మన్మధుడు వస్తున్న సందర్భంగా ఆ దక్షిణామూర్తిని త్రయంభకునిగా వర్ణించాడు. మారుడు పుష్పాస్త్రాలను విడిచిన తర్వాత కొద్ది పాటి మనస్సంచలనం కలిగినా నిగ్రహించుకొని పరమేశ్వరుడు ధ్యాన దృష్టితో విషయాన్ని గ్రహించి మూడవ కన్నులో నుంచి అగ్నిని పుట్టించి మన్మధుడిని భస్మం చేశాడు. రుద్రుడు మూడవ కన్ను తెరిస్తే అగ్నిజ్వాల మాత్రమే ఉదయిస్తుంది అని చాలాచోట్ల వర్ణించబడింది. కానీ హరవిలాసంలో శ్రీనాథసార్వభౌముడు దారుకావనవిహారంలో శివుడు రంబావక్షోజ సౌందర్యాన్ని మూడు కన్నులతో చూసి ఆనందిచినట్లు వర్ణించాడు. దీనిని బట్టి మూడవ కన్ను కేవలం దహనానికి మాత్రమే కాదు మామూలుగా చూడటానికి కూడా ఉపయోగించవచ్చు అని కవిరాజు చెప్పినట్లు అయింది. 

మనుషుల్లో ఈ మూడవ కన్ను వికసించుకోమే ఉపనయనం, బ్రహ్మోపదేశము అనే ప్రక్రియను ప్రాచీన ఋషులు నిర్మించారు. ఉపనయనం అంటే అధికమైన కన్ను అని అర్థం. భ్రూమధ్యంలో ఈ కన్ను తెరుచుకుని అదృశ్య దేవలోకములను దర్శించడానికి ఈ ఉపనయనం ఉద్దేశించబడింది. టిబెట్ లో లామాలకు ఈ విశేషం బాగా తెలుసు. పాశ్చాత్య దేశాలలో నెప్ట్యూన్ ఫాలబాగమున కన్నుగల దేవతగా వర్ణన చేయబడినది. ఈజిప్టు రాజులు అయి ఫారోల భ్రూమద్యమునందు కనిపించే సర్వదర్శక స్పర్పచిహ్నం దివ్య దర్శనానికి ఒక సంకేతము అని పండితులు భావిస్తున్నారు.

పురాణాలలో చాలా చోట్ల మహనీయులైన ఋషులు తమ దివ్య దృష్టి ప్రభావం చేత త్రికాలములలోని ( భూత భవిష్యత్ వర్తమాన) విషయాలను తెలుసుకోగలినట్లు చెప్పబడింది. ఉదాహరణకు రఘువంశంలో దిలీపమహరాజుకు చాలా కాలం సంతానం లేదు. ఎంత కాలమో వేచి అనేక వ్రతాలు చేసినా ఫలితం కనబడక చివరికి కులగురువైన వశిష్టుని ఆశ్రమానికి వెళ్ళి ఆయన పాదపద్మములను ఆశ్రయించారు. ఆ మహర్షి ధ్యాన సమాధి లో గత కాలలో జరిగిన దిలీపుని దోషగాధను, దాని వలన అతడు తెలియకుండానే కామధేనువు చేత పొందిన శాపాన్ని వివరించి ఆ దోషాన్ని పోగొట్టుకోవడానికి మార్గం కూడా ఉపదేశించాడు. ప్రతీ పురాణంలోనూ ఇటువంటి విశేషాలు అడుగడుగునా కనబడుతూ ఉంటాయి. 

ఈ మధ్య కాలంలో కూడా సిద్ద వ్యక్తులు అయిన వారు ఈ దివ్యదృష్టిని సాధించినవారే. మహానుభావులు రామకృష్ణ పరమహంస దర్శనానుభవాలను పరిశీలిస్తే ఎన్నెన్నో విచిత్ర విశేషాలు కనిపిస్తాయి. ఈ జన్మకు రాకముందు ఊద్థ్వలోకాల నుంచి ఒక దివ్య శిశువు గా క్రిందికి దిగి వస్తూ మధ్య దారిలో కనబడిన ఒక మహర్షిని తనతోపాటు మానవజన్మ ఎత్తి , తనకు సహకరించడానికి రమ్మని కోరినట్లు గా పరమహంస ఒకచోట అన్నారు. ఆ ఋషి పేరు వివేకానందుడు అని కూడా వివరించారు. తనకు శిష్యులు కావాలని కోరివచ్చిన వారి యోగ్యతలను తెలుసుకోవడానికి వారి యొక్క పూర్వ జన్మలు వాటి సంస్కారాలు మొదలైన వాటిని తన అంతరంగ దృష్టితో చూసి తగిన వాళ్ళు అని అనిపిస్తే కానీ ఆయన స్వీకరించేడట. ఆ తర్వాత కాలంలో వివేకానంద స్వామికి కూడా ఈ శక్తి వికసించినట్లు ఆయన జీవిత చరిత్ర చదివితే తెలుస్తుంది.

అరుణాచలవాసి ప్రసిద్ధుడైన రమణ మహర్షి దృష్టి మహత్వాన్ని గురించి ఎన్నో కథలు వ్యాపించి ఉన్నాయి. ఒకే ఒక్క చూపులోనే అవతలి వ్యక్తి లోని విశేషాన్ని గుర్తించి తన ప్రబావం చేత వాళ్ళ జీవితాలనే ఆయన మార్చగలిగేవారు. గుడిపాటి వెంకటాచలం వంటివారు మారింది ఆ దృష్టి ప్రభావం వల్లనే రమణ మహర్షిని గురించి అంతో ఇంతో వ్రాసి ప్రచురించిన పాల్ బ్రంటన్ ఈజిప్టు లో జరిపిన అన్వేషణ ఫలితంగా అక్కడి కొందరు సిద్ద వ్యక్తుల పరిచయాన్ని పొంది, దాని వలన అతడి మనోనేత్రం వికసించగా, పూర్వ జన్మలో తాను ఒక ఈజీప్ట్ దేశపు దేవాలయ అర్చకుడు అని చూసి తెలుసుకోగలిగాడు. 

మంత్ర సిద్దుడు , మహకవి అయిన కావ్యకంఠ గణపతి ముని తన పూర్వ జన్మ విశేషాలను తెలుసుకోవడం మాత్రమే కాకుండా ఎందరో వ్యక్తుల విశేషాలను చూడగానే చెప్పగలిగేవారు.

రమణ మహర్షి అప్రఖ్యాతుడై అరుణాచలంలో తపస్సు చేసుకుంటూ ఉండే తరుణంలో ఒక రోజు ఆయనను తనకు కలిగిన అనుభూతిని కావ్యకంఠ గణపతి ముని ఇలా పలికాడు.

"" పశ్యామిదేవదత్తేన జ్ఞానేత్వాం ముహుర్ముహుః బ్రహ్మణ్యానాం పరంబ్రహ్మన్ సుబ్రహ్మణ్యం నరాకృతిం"" 

" పురాకుమారిలోనామ భూత్వాబ్రాహ్మణస్తత్తమః ధర్మం వేదోదితం నాధత్వం సంస్థాపితవానసి ""

" జైనైర్వాకులితే ధర్మే భగవాన్ ద్రవిడేషుచ భూత్వాత్వం జ్ఞాన సంబంధః భక్తిం స్దాపితవానసి ""

"అదునాత్వం మహభాగ బ్రహ్మజ్ఞానస్య గుప్తయే శాస్త్రజ్ఞానేన సంతృపైః నిరుద్దస్యాగతోధరాం " 

దేవతలు నాకు ప్రసాదించిన జ్ఞానంతో బ్రహ్మణ్యులలో శ్రేష్ఠునిగా నరరూపం ధరించిన సుబ్రహ్మణ్యునిగా నిన్ను చూస్తున్నాను. పూర్వం కుమారిలభట్టనే బ్రాహ్మణోత్తమునిగా పుట్టి వేదోదితమైన ధర్మమును నువ్వు స్థాపించావు. దేశంలో వేద ధర్మం జైనుల చేత వ్యాకులపాటు చెందగా నువ్వు ద్రవిడులలో జ్ఞానసంబందర్ అనే పేరుతో ఉదయించి భక్తిని స్థాపించావు. ఈ రోజు శాస్త్రజ్ఞానం చేత సంతృప్తి చెందిన వారి చేత నిరోధించబడిన బ్రహ్మ జ్ఞానాన్ని గోపనం చేయడానికి నువ్వు ( రమణ మహర్షి గా ) భూమికి వచ్చావు. 

కుమార స్వామి భూలోకంలో మూడు జన్మలు ఎత్తుతాడు అని రమణ మహర్షి ది మూడవది, చివరిది అయిన జన్మ అని గణపతి ముని పలికారు. జీవించి ఉండగా కఫాలభేదన సిద్ది పొందిన మహా తపస్విగా ఖ్యాతిగాంచిన వారి మాటలు అర్షవిజ్ఞానపు మూటలు. 

ఒక్క పూర్వ జన్మకు సంబంధించిన వివేషాలే కాదు, ఇహ పర జన్మలోని కష్టసుఖాలు అన్నింటికి మూలమైన అంశాలు అన్ని దివ్య దృష్టి తో తెలుసుకుంటారు తపస్వులు. దాని వలన ఎంతో లోకోపకారం జరుగుతుంది. 

ఇంక ఈ మూడవ కన్ను లేక మనోనేత్రం , దివ్య దృష్టి తెరుచుకునే మార్గం ఏమిటి!? 

|| శ్లో||  ఆకుంచ్యవాయు మవిజిత్యచ వైరిషట్కం ఆలోక్యనిశ్చలధియానిజ నాసికాగ్రం "

గాలిని కుంభించి, అరిషడ్వర్గాలను జయించి నిశ్చల మనసుతో నాసాగ్రంను చూస్తూ ఉండాలి. అని యోగ శాస్త్రం చెబుతోంది. 

తిక్కన మహాభారతం లో హరిహరనాదుడ్ని నాసాగ్రనివాస రసికునిగా వర్ణించాడు. భ్రూమధ్యంలో ఆజ్ఞా చక్ర స్థానం. లలితా సహస్ర నామాలలో ఆజ్ఞాచక్రాంతరాళస్థారుద్ర గ్రంథి విభేదిని" అని ఉంది. పరమేశ్వరీ ప్రదాన స్థానాలలో అది ఒకటి. 

సిద్దుడైన మంత్రవిదుని చేత ఉపదేశం పొంది భ్రూమధ్యం యందు దేవతను నిలుపుకొని కళ్ళు మూసుకుని జపం సాధన ఏకాగ్రత గా చేస్తే తప్పకుండా మూడవ కన్ను అంతరలోచనం వికసిస్తుంది. స్వతంత్రంగా ఎటువంటి శిక్షణ లేకుండా గాలిని కుంభించడం చేయకూడదు. 

ఈ చూసే దృష్టి సాధనలో ఇంకా కొన్ని సాధనలు కూడా ఉన్నాయి. అంతర్లక్ష్యం, బహిర్ దృష్టి , పౌర్ణమి దృష్టి, కలిగింది శాంభవి ముద్ర. కొందరు ఊరికే కళ్ళు తెరిచి ఉంటారు. బయట వస్తువును దేనిని కూడా చూడరు. అది లక్ష్యరహితమైన చూపులా కనిపిస్తుంది. కానీ అది శాంభవీ ముద్ర సాధన యొక్క విశేషం. ఇంకొంత మంది దీప సాధన చేస్తారు. దీప దుర్గ వంటి మంత్రాలు కొన్ని ఉన్నాయి. ఇంకా చాలా చాలా ఉన్నాయి. ముఖ్యంగా 13 రకాల పద్ధతులు ఉన్నాయి. ఆ దీపపు వెలుగులో వారి జీవిత రహస్యాలు చూస్తారు.

ఆ మార్గంలన్నింటిలోకి అంజన విద్య మరొకటి. కొన్ని రకాల మూలికలతో కాటుక తయారు చేసి తమలాపాకు పైన లేక భొటన వ్రేలి గోరుపైననో దానిని రాసి సాధకుడు దానిని చూడటమో లేక ఇతరుల చేత చూపించడమో ఇందులో జరుగుతుంది. కావాల్సిన విశేషాలు ఆ అంజనంలో దృశ్యాలుగా కనిపిస్తూ ఉంటాయి. 

వీటిలో దేనికైనా ఏకాగ్రత, మనోశ్చలత, మంత్రసిద్ది చాలా ముఖ్యం. లోపం ఉండకూడదు. ........

...

....

.....

ఏదైనా అందరికి, చాలా తేలికగా ఉండే పద్దతి సర్వసాధకులకు "ధ్యానం" ద్వారా దివ్య దృష్టి పొందడం అత్యంత ప్రధానమైన దశ. 

నుదుటిపై ధరించే సిందూరం లేక గంధం గుర్తుల గురించి మాట్లాడే ముందు రెండు సంఘటనల గురించి వివరించాలి. దాని వలన ఇది అర్థం చేసుకోవడం తేలిక అవుతుంది. రెండూ చారిత్రాత్మక సంఘటనలే. 

1888 లో , దక్షిణ భారతదేశంలో రామానుజం అనే ఒక వ్యక్తి భీద బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. అతను  పేరుమోసిన గణిత శాస్త్రజ్ఞుడు అయ్యాడు. అతను ఎక్కువ చదువుకోలేకపోయాడు. కానీ గణితంలో అతని ప్రతిభ సాటిలేనిది. బాగా చదువుకున్న చాలా మంది గణత శాస్త్రజ్ఞులు , సంవత్సరాల తరబడి తీసుకున్న శిక్షణ వలన , ఇతరుల మార్గదర్శకత్వం వలన పేరు తెచ్చుకున్నారు. కానీ రామానుజం విశ్వవిద్యాలయ ప్రవేశార్హత కూడా లేనివాడు. అంతే కాకుండా అతడు ఎవరి నుంచి శిక్షణ కానీ, మార్గదర్శకత్వం కానీ పొందలేదు.  అందుకే , గణిత శాస్త్రం తెలిసినవారు రామానుజాన్ని మించిన గణిత శాస్త్ర ప్రావీణ్యత ఉన్నవారు ఎప్పుడూ లేరు అంటారు. 

అతడు చాలా కష్టం మీద గుమాస్తా ఉద్యోగం సంపాదించుకున్నాడు. కానీ అతి త్వరలోనే అతడికి గణిత శాస్త్రం లో అద్భుతమైన ప్రతిభ ఉంది అన్న వార్త ప్రచారంలోకి వచ్చింది. ఆ రోజుల్లో , కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం లో ఎంతో ప్రసిద్ధి గాంచిన ప్రొఫెసర్ హర్డీకి ఒక జాబు వ్రాయమని ఎవరో అతనికి సలహ ఇచ్చారు. అతడు జాబు వ్రాయలేదు, కానీ రెండు రేఖాగణిత సంబంధించిన సిద్దాంత సమస్యలకు సమాధానం కొనుక్కొని హార్డీకి పంపాడు. వాటిని అందుకొని హర్డి చాలా ఆశ్చర్యపడ్డాడు, అంత చిన్న వయసులోనే ఆ సిద్ధాంతాలకు , ప్రతిపాదనలు, సమాధానాలు వ్రాయగలిగాడంటే నమ్మలేకపోయాడు. రామానుజానికి వెంటనే జాబు వ్రాసి ఇంగ్లాండుకి రమ్మని ఆహ్వానించాడు. రామానుజాన్ని మొదటి సారి కలిసినప్పుడు, గణిత శాస్త్రం లో అతడి ముందు తానొక చిన్నపిల్లాడి లాంటి వాడినని హర్డీకి అనిపించింది. రామానుజం ప్రతిభా సామర్థ్యాలు అతడి మానసిక సామర్థ్యం వలన కాదు ఎందుకంటే మేధస్సు చాలా నిదానం గా పనిచేస్తుంది, ఆలోచించడానికి సమయం తీసుకుంటుంది. కానీ హార్డీ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి రామారావు సమయం తీసుకోలేదు. సమస్య బోర్డు మీద వ్రాసి వ్రాయకముందే లేదా నోటిమాటలతో చెప్పగానే, ఆలోచించడానికి వ్యవది తీసుకోకుండా రామానుజం సమాధానం ఇవ్వడం మొదలు పెట్టేవారు. అంత గొప్ప గణిత శాస్త్రజ్ఞుడికి అది ఎలా సాధ్యం అయిందో అర్థం చేసుకోవడం కష్టమైంది. సమస్యని పరిష్కరించడానికి ఒక ప్రసిద్ధ గణిత శాస్త్రజ్ఞుడు ఆరుగంటల పాటు తీసుకుని, అందులోనూ నిస్సందేహంగా అదే నిర్దిష్టమైన సమాధానం అని చెప్పలేని స్థితిలో ఉంటే రామానుజం వెంటనే, ఏ విధమైన తప్పు లేకుండా దాన్ని పరిష్కారం చేశాడు. 

రామానుజం మానసికంగా సమాధానాలు ఇవ్వడం లేదని ఋజువైంది. అతడు బాగా చదువుకున్నవాడు కాదు.. అతడు మెట్రుక్యులేషన్ పరీక్షలో తప్పాడు .. అతడి మేధా సామర్థ్యం గురించిన సూచనలు వేరే ఏం లేవు, కానీ గణిత శాస్త్ర సంబంధం గా అతడు మానవాతీతుడు. మానవ మస్తిష్కం అర్థం చేసుకోలేనిది ఏదో జరుగుతోంది. 

36 సంవత్సరాల వయస్సు లో అతడు క్షయరోగంతో మరణించారు. అతడు ఆసుపత్రిలో ఉన్నప్పుడు గణిత శాస్త్రజ్ఞులైన ఇద్దరు, ముగ్గురు స్నేహితులతో హార్డీ అతడిని చూడటానికి వెళ్ళాడు. అతడు తన కారుని ఒక చోట నిలిపాడు. రామానుజానికి ఆ కారు నెంబర్ ప్లేట్ కనిపించింది.హర్డీ  గదిలోకి రాగానే, రామానుజం అతఢి కారు నెంబర్ ప్లేట్ విశిష్టంగా ఉంది అని అన్నారు: దానికి నాలుగు ప్రత్యేక దృక్పథాలు ఉన్నాయి అని అన్నారు. ఆ తర్వాత , రామానుజం మరణించారు. రామానుజం చెప్పింది అర్థం చేసుకోవడానికి హర్డీకి ఆరు నెలలు పట్టింది, కానీ అతడు నాలుగింటిలో మూడు విశిష్టతలని మాత్రమే తెలుసుకోగలిగాఢు. అతడు చనిపోయేటప్పుడు వీలు నామాలో నాలుగో దృక్పథాన్ని కనుక్కోవడానికి ఆ సంఖ్య గురించిన పరిశోధన కొనసాగించాలని కోరాడు. రామానుజం నాలుగు అన్నారు, కనుక  నాలుగొ దృక్పథం తప్పనిసరిగా ఉంటుంది . హార్డీ చనిపోయిన ఇరవై రెండు సంవత్సరాల తర్వాత, ఆ నాల్గవ దాన్ని కనిపెట్టారు. రామానుజం చెప్పింది నిజమే. 

అతడు ఏదైనా గణిత శాస్త్ర సమస్యను పరిష్కరించడానికి కూర్చున్నప్పుడల్లా అతడి కనుబొమ్మల మధ్య భాగంలో ఏదో జరగడం మొదలు పెట్టేది. ఆ నిర్దిష్ట స్థలం కేంద్రంగా, అతడి కనుగుడ్లు రెండూ పైకి తిరిగేవి! యోగాలో , ఆ స్థలాన్ని మూడవ నేత్రపు స్థానం అని వర్ణిస్తారు. దీనిని మూడవ నేత్రం అని ఎందుకు అంటారు అంటే , ఈ కన్ను ఉత్తేజం అయితే వివిధ జగత్తులకు ( లోకాలకు) సంబంధించిన కొన్ని సంఘటనలని, దృశ్యాలను సంపూర్ణంగా చూడవచ్చు. అది మీ ఇంటి ద్వారం లో ఉన్న ఒక చిన్న రంద్రంలో నుంచి బయటి ప్రపంచాన్ని చూడటం లాంటిది, ఆకస్మికంగా తలుపు తెరుచుకుంటే , నువ్వు ఆకాశం అంతా చూస్తావు. అక్కడ ఆ రెండు కను బొమ్మల మద్య ఓ స్థలం ఉంది, అక్కడే ఒక చిన్న రంధ్రం ఉంది. రామానుజం విషయం లో అది ఒక్కొక్క సారి తెరుచుకుంటుంది. సమస్యను పరిష్కరించడానికి అతడి కళ్ళు మూడవ కన్ను వైపు తిరిగేవి. సమీప భవిష్యత్తులో హర్డీ కానీ, పాశ్చాత్య శాస్త్రజ్ఞులు కానీ ఈ ప్రక్రియను అర్థం చేసుకోలేకపోయారు.

నేను మీకు సింధూరం ధరించడానికి సంబంధించిన మరొక సంఘటన చెబుతాను, మూడవ నేత్రానికి దానికి ఉన్న సంబంధం అప్పుడు అర్ధం అవుతుంది.

ఎడ్గార్ కైస్ 1945 లో మరణించాడు. దానికి నలభై సంవత్సరాలకు ముందు, అంటే 1905 లో అతడు జబ్బుపడి , మూడు రోజుల పాటు అపస్మారక స్థితిలో ఉన్నాడు. వైద్యులు ఆశలు వదులుకున్నారు, అతడిని చైతన్య స్థితికి తీసుకురాగల మార్గమే కనిపించలేదు అన్నారు. అతడు చాలా గాఢమైన అపస్మారక స్థితిలోకి వెళ్ళాడని, దానిలో నుంచి బహుశా అతడు ఎప్పటికీ బయటపడలేడనీ వారు భావించారు. ఎన్నో రకాల ముందులు వాడారు, కానీ అతడు స్పృహలోకి వచ్చే సూచనలు ఏమీ కనిపించలేదు. 

మూడవ రోజు సాయంత్రం వైద్యులు తాము ఇంక ఏమీ చేయలేం అని, అతడు నాలుగు లేక ఆరు గంటలలో మరణించవచ్చు అనీ, ఒక వేళ అతడు బ్రతికినా , అతడి మెదడు దెబ్బతింటుంది అనీ, అది చావు కంటే హీనం అని, ఎందుకు అంటే కాలం గడిచేకొద్దీ సున్నితమైన రక్తనాళాలు, మెదడులోని కణాలు విడిపోతాయి అని ప్రకటించారు. కానీ కైస్ అపస్మారక స్థితిలో ఉండి కూడా అకస్మాత్తుగా మాట్లాడటం మొదలు పెట్టాడు. వైద్యులు దీనిని నమ్మలేకపోయారు:అతడి శరీరం అపస్మారక స్థితిలో ఉంది, కానీ అతడు మాట్లాడుతూ ఉన్నాడు. తను చెట్టు మీద నుంచి పడిపోయానని, వెన్నెముక దెబ్బతింది అనీ, అందుకే అపస్మారక స్థితిలో ఉన్నాను అని చెప్పాడు. తనకి ఆరుగంటల లోపు చికిత్స జరగకపోతే తన మెదడు దెబ్బతింటుంది అనీ, తాను చనిపోతాను అనీ కూడా చెప్పాడు. అతను త్రాగటానికి ఒక ఔషదానికి సంబంధించిన మందు ఇవ్వాలి అని, అప్పుడు పన్నెండు గంటలలో తను కోలుకుంటానని కూడా చెప్పాడు.

తనకు కావాలని కోరిన ఔషదాల పేర్లు ఎడ్గార్ కైస్ కి తెలిసే అవకాశం లేదు, అతడి మెదడు దెబ్బతినడం వలన అలా మాట్లాడుతున్నాడు అని వాళ్ళు ముందు అనుకున్నారు. ఎందుకు అంటే అతడు సూచించిన జౌషదాలు ఏవీ ఇలాంటి జబ్బును తగ్గించినట్లు వినలేదు. కానీ కైస్ ప్రత్యేకంగా వాటిని సూచించాడు కనుక వాటిని ప్రయత్నించి చూద్దాం అనుకున్నారు. అవి తెప్పించి కైస్ కి ఇచ్చారు: అతడు పన్నెండు గంటలలో కోలుకోవడం జరిగింది. 

అతడికి తెలివి వచ్చాక జరిగిన సంఘటన అతడికి చెప్పినప్పుడు, కైస్ కి మందు గురించి తాను అలా చెప్పినట్లు గుర్తు రాలేదు, ఆ మందుల పేర్లు తెలియడం కానీ, వాటిని గుర్తించడం కానీ చేయలేకపోయాడు. కానీ ఎడ్గార్ కైస్ జీవితంలోని ఈ సంఘటన అరుదైనవి సంభవించడానికి ఆరంభం. అతను బాగు చేయడానికి వీలులేని జబ్బులకు మందులను సూచించడంలో నిపుణుడు అయ్యాడు; అతడి జీవిత కాలం లో అతను ముప్పై వేల మందికి జబ్బు నయం చేశాడు. అతడు ఏ జౌషదాన్ని సూచించినా అది సరైనదే అయ్యేది, ఏ మినహాయింపు లేకుండా, అతను చెప్పిన మందు వాడిన ప్రతీ రోగి బాగుపడ్డాడు. కానీ కైస్ దాని గురించి వివరించలేకపోయేవాడు. చికిత్స కోసం అతడు ఎప్పుడు కళ్ళు మూసుకున్నా అతడి కళ్ళు కనుబొమ్మల మధ్యస్థానం వైపుకి, ఏవో లాగుతున్నట్లు తిరిగేవని మాత్రమే చెప్పేవాడు. అతడి కళ్ళు అక్కడ నిలిచేవి, మిగతావన్నీ అతను పూర్తిగా మర్చిపోయేవాడు, ఒక నిర్దిష్ట స్థితికి చేరుకున్నప్పుడు మాత్రమే పరిసరాలను మర్చిపోయేవాడని, ఆ స్థితికి వచ్చే వరకు చికిత్స విధానం అతడికి తెలిసేది కాదని మాత్రమే గుర్తుండేది. అతడు అద్భుతమైన రోగచికిత్సలు సూచించేవాడు. అందులో అర్థం చేసుకోవాల్సినవి రెండు ఉన్నాయి. 

అమెరికా లో రోత్ చిల్డ్స్ అనే ధనిక కుటుంబం ఉంది. ఆ కుటుంబం లోని ఒక స్త్రీ చాలా కాలం జబ్బపడింది, ఏ చికిత్సా పనిచేయలేదు. ఆమెని ఎడ్గార్ కైస్ దగ్గరకు తీసుకొని వచ్చారు, అచేతన స్థితిలో అతడు ఓ నిర్దిష్ట మందును సూచించాడు. అచేతన స్థితిలో ఉన్నాడని మనం అంటాం, కానీ ఆ రహస్య ప్రక్రియ గురించి తెలిసిన వారు ఆ సమయంలో అతడు పూర్తి చైతన్యంలో ఉన్నాడు అంటారు. నిజానికి, మూడవ కన్ను గురించి తెలిసే స్థితికి ఎదిగేవరకు ఆ అచేయనత్వం కొనసాగుతూనే ఉంటుంది. 

రోత్ చిల్డ్స్ కోటిశ్వరుడు, అందువలన మందుల కోసం అమెరికా అంతా వెతికించాడు, కానీ అవి అతడికి దొరకలేదు. ఆ మందు నిజంగా ఉందో లేదో ఎవ్వరూ చేప్పలేకపోయారు. అంతర్జాతీయ పత్రికలలో ఆ మందు గురించి సమాచారం తెలియజేయవల్సిందిగా ప్రకటనలు ఇచ్చారు. మూడు వారాల తర్వాత ఆ పేరు గల మందు లేదని, ఇరవై సంవత్సరాల క్రితం ఆ పేరు గల మందు పై తన తండ్రికి హక్కు ఉండేది అని, కానీ దాన్ని ఎప్పుడూ తయారు చేయలేదు అని స్వీడన్ నుంచి ఒక వ్యక్తి వ్రాశాడు. తన తండ్రి చనిపోయాడు అని, ఆ ఔషద సూత్రం పంపగలను అని వ్రాశాడు. అప్పుడు ఆ మందు తయారు చేయించి ఆమెకు ఇవ్వడంతో, ఆమె తేరుకుంది. మార్కెట్ లో కూడా లేని మందు గురించి కైస్ కి ఎలా తెలుసుకోగలిగాడు !? 

ఇంకో సందర్భంలో , ఒకరికి ఒక ప్రత్యేకమైన మందు సూచించాడు . దాని కోసం వెతికారు కానీ అది దొరకలేదు. ఒక సంవత్సరం తర్వాత ఆ మందు అందుబాటులో ఉందని పత్రికా ముఖంగా ప్రకటించారు. గతించిన సంవత్సరం లో ఆ మందు పరిశోదనశాలలో శోధింపబడే ప్రక్రియ లో ఉంది. దానికి ఇంకా పేరు కూడా పెట్టలేదు. కానీ కైస్ కి  దాని గురించి తెలుసు. అప్పుడు ఆ రోగికి ఆ మందు ఇచ్చారు ,అతడు ఆరోగ్యాన్ని పొందాడు.  ...

మనం మంచి నిద్ర లో ఉన్నప్పుడు మన కళ్ళు పైకి లాగబడి ఉంటాయి. అది మనం ఎంత గాఢంగా నిద్రపోతున్నాం అన్నదానిపై ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనస్తత్వ శాస్త్రవేత్తలు నిద్రపై ప్రయోగాలు జరుపుతున్నారు. నిద్ర ఎంత గాఢంగా ఉంటే, కళ్ళు అంత పైకి లాగబడి ఉంటాయి. కళ్ళు ఎంత కిందకి ఉంటే, అంత కదలికలు ఉంటాయి. కనురెప్పల చాటున కళ్ళు ఎంత వేగంగా కదులుతూ ఉంటే అంత ఎక్కువ సంఘటనలతో కూడిన కల నీకు వస్తుంది అన్నమాట. ప్రయోగాల ద్వారా ఇప్పుడు ఇది శాస్త్రీయంగా నిరూపితమైంది. కంటి కదలికలు తర్వాత కదులుతున్న కలని సూచిస్తాయి. కళ్ళు కిందికి ఉంటే కళ్ళ కదలిక ఎక్కువ వేగంగా ఉంటుంది. కళ్ళు పైకి వెళుతుంటే కళ్ళ కదలిక వేగం తగ్గుతుంది. కళ్ళ కదలికే లేనప్పుడు మంచి నిద్ర లో ఉన్నట్లు. ఆ స్థితిలో కనుబొమ్మల మధ్య స్థానం లో కళ్ళు కదలకుండా నిలిచి ఉంటాయి.

సమాధిలో, గాడ ధ్యానం లో మనం ఏ స్థితికైతే చేరుకుంటామో గాఢనిద్రలో కూడా అదే స్థితికి చేరుకుంటామని యోగా చెబుతుంది. గాఢమైన నిద్రలోనూ, సమాధి స్థితిలోనూ కళ్ళు నిలిచి ఉండేది ఒకే స్థానంలో.

ఈ రెండు చారిత్రాత్మక సంఘటనల గురించి ఎందుకు చెప్పాను అంటే ( రామానుజం, ఎడ్గర్ కైస్) కనుబొమ్మల మధ్య స్థానం లో ప్రాపంచిక జీవితం ఆగిపోయి పరలోక జీవితం మొదలు అవుతుంది అని సూచించడానికే. ఆ ద్వారానికి ఇటువైపు ప్రపంచం వర్థిల్లుంటే, అటువైపు తెలియని, మానవాతీతమైన అద్భుతమైన ప్రపంచం ఉంది. 

తిలకం సిందూరం గుర్తు తెలియని ఆ ప్రపంచానికి సంకేతంగా కనిపెట్టబడింది. ఎక్కడ అంటే అక్కడ దాన్ని పెట్టకూడదు, నుదిటిపై చేయిపెట్టి ఆ స్థానాన్ని కనుక్కున్న వ్యక్తి మాత్రమే, తిలకం ఎక్కడ పెట్టవలసినది చెప్పగలడు. తిలకం ఎక్కడంటే అక్కడ పెట్టడం వలన ప్రయోజనం లేదు, ఎందుకు అంటే అందరికీ ఆ స్థానం ఒకేచోట ఉండదు. మూడవ కన్ను అందరికీ ఒకేచోట ఉండదు, చాలా మందికి అది కనుబొమ్మల మద్యపై బాగంలో ఎక్కడో ఉంటుంది. గతజన్మ లో ఎవరైనా ఎక్కువ కాలం ధ్యానం చేసి ఉంటే, అతడికి సమాధి అనుభవం లభించి ఉంటే, అతఢి మూడవ కన్ను కొద్దిగా కింద ఉంటుంది. ధ్యానమే చేసి ఉండకపోతే ఆ స్థానం నుదిటి మీద పై భాగంలో ఉంటుంది. ఆ బిందువు ఉన్న స్థానాన్ని బట్టి గతజన్మ లో నీ ద్యానస్థితిని నిర్ణంచవచ్చు. గతజన్మ లో సమాధి స్థితి అనుభవించావా లేదా అనేది అది సూచిస్తుంది. అది తరచుగా జరిగి ఉంటే ఆ బిందువు క్రిందకి దిగి ఉంటుంది. నీ కళ్ళతో సమానమైన స్థాయిలో అది ఉంటుంది. అది అంతకంటే కిందకి వెళ్ళలేదు. ఆ బిందువు నీ కళ్ళకి సమాంతరంగా ఉంటే, ఒక చిన్న సంఘటనతో ఎవరైనా సమాధిలోకి ప్రవేసించగలరు. నిజానికి, జరిగింది చాలా చిన్నది కావడంతో ప్రాముఖ్యత లేనిదానిలాగా కనిపిస్తుంది. స్పష్టమైన కారణం ఏమీ లేకుండానే ఎవరైనా సమాధిలోకి వెళితే మనం ఆశ్చర్యపోతాం 

సింధూరం లేదా గంధపు గుర్తు సరియైన స్థలంలో పెడితే, అది చాలా విషయాలను సూచిస్తుంది. మొదటిగా, ఒక ప్రత్యేకమైన స్థలంలో తిలకం ధరించమని మీ గురువు చెబితే, అక్కడ నీకు ఏదో అనుభవం మొదలవుతుంది. దాన్ని గురించి నువ్వు ఆలోచించి ఉండకపోవచ్చు, కానీ నువ్వు కళ్ళు మూసుకుని కూర్చుంటే ఎవరైనా రెండు కళ్ళ మధ్య దగ్గరగా వేలు పెడితే, ఎవరో నీ వైపు వేలుపెట్టి చూపిస్తున్నట్లు నీకు అనిపిస్తుంది. మూడవ కన్ను గ్రహణ శక్తి అదే.

తిలకం నీ మూడవ కన్ను నేత్రపు పరిణామం అంత ఉండి సరియైన స్థలంలో పెడితే, నువ్వు ఆ స్థలాన్ని 24 గంటలూ గుర్తుంచుకుంటావు, మిగిలిన శరీరాన్ని మర్చిపోతావు. దీని వలన తిలకం పట్ల ఎరుక పెరుగుతుంది మరియు శరీరం పట్ల ఎరుక తగ్గుతుంది. అప్పుడు తిలకం తప్ప శరీరం గురించి ఏ విధమైన గుర్తు లేని క్షణం వస్తుంది. అది జరిగినప్పుడు నీ మూడవ నేత్రాన్ని తెరుచుకోగలవు. ఈ సాధన లో , నువ్వు పూర్తిగా నీ శరీరాన్ని మర్చిపోయి, తిలకాన్ని మాత్రమే గుర్తుంచుకునే ప్రయోగంలో నీ చైతన్యం మొత్తం స్పటికం గా మారి, మూడవ నేత్రంపై కేంద్రీకరిస్తుంది. మూడవ నేత్రాన్ని తెరిచే తాళం చెవి కేంద్రీకరించబడిన చైతన్యమే. ఒక భూతద్దం సహాయంతో సూర్య కిరణాలను ఒక కాగితపు ముక్క మీద కేంద్రీకరిస్తే, ఆ కాగితాన్ని మండించడానికి సరిపోయినంత వేడిని సృష్టిస్తావు. ఆ కిరణాలు కేంద్రీకరించినప్పుడు మంట ఉత్పత్తి అవుతుంది. శరీరం అంతా చైతన్యం వ్యాపించి ఉన్నప్పుడు అది నీ జీవితాన్ని నిర్వహించడం అనే పని చేస్తూ ఉంటుంది. కానీ అది పూర్తిగా మూడవ నేత్రంపై కేంద్రీకరిస్తే , మూడవ నేత్రంతో చూడటానికి అడ్డంగా ఉన్నది తగలబడుతుంది. , అప్పుడు నీకు అంతర్గత ఆకాశాన్ని చూడనిచ్చే తలుపు తెరుచుకుంటుంది. 

తిలకం యొక్క మొదటి ఉపయోగం ఏమిటి అంటే తిలకాన్ని 24 గంటలూ గుర్థుంచుకోవడం కోసం శరీరంలో నీకు సరియైన చోటుని చూపించడం. తిలకం యొక్క రెండవ ఉపయోగం ఏమిటి అంటే గురువు నీ నుదుటిపై చేయి పెట్టకుండా నీ ప్రగతిని గమనించడాన్ని అది సుగమం చేస్తుంది.. ఎందుకు అంటే ఆ బిందువు కిందకి జరిగే కొద్దీ తిలకం కొంచెం కిందకి పెడతావు. ప్రతీ రోజూ ఆ స్థలాన్ని గమనించి మూడవ నేత్రం ఎక్కడైతే ఉందని అనుకుంటావో అక్కడ తిలకాన్ని పెట్టాలి

🙏🌹🙏🌹🙏

No comments:

Post a Comment