Translate

Thursday, November 7, 2019

25 names of Lalitha Amma-25 శ్రీ లలితా మహాత్రిపురసుందరి పేర్లు

25 శ్రీ లలితా మహాత్రిపురసుందరి పేర్లు

ఇది బ్రహ్మా మహాపురాణం యొక్క ఉత్తరాభాద్ర అనే లలితోపాఖ్యానంలోనూ, మూడవది భండాసురునితో యుద్ధానికి ముందుకు వచ్చినప్పుడు దేవతలు శ్రీదేవిని, ఆమె శక్తి సేనుని స్తుతించారు. ఈ శ్రేణిలోని మొదట శ్రీ వారాహి దేవి యొక్క పన్నెండు నామాలు, రెండవది, శ్రీ శ్యామల యొక్క పదహారు నామాలు మరియు చివరగా శ్రీ లలితా మహాత్రిపురసుందరి యొక్క ఇరవై ఐదు నామాలు. 

శ్రీ అగస్త్య ముని కోరిన విధంగా శ్రీ హయగ్రీవ సమేత శ్రీ లలితా దేవి రచించిన లలితాోపేఖ్యాన, కాంచీపురంలోని కామాక్షి ఆలయంలో
अगस्त्य उवाच
वाजिवक्त्ररमहाबुद्धे पञ्चविंशति नामभि: |
ललिता परमेशान्या देहि कर्णरसायनम् | 1 |
అగస్త్య ఉవాచ
వజ్రవత్ర మహాబుద్ధే ప ~ న్చ విమ్షతి నమోభిః |
లలితా పరమేశన్యా దేహి కర్ణ రసానామ్ | |
1. అగస్త్యుడు ఇలా అంటాడు, "ఓ గుఱ్ఱం ఎదురయింది ప్రభూ! దయచేసి చెవులకు మకరందం లాంటి ఆ ఇరవై ఐదు పేర్లు చెప్పండి "


1.      సింహాసనేశి,
2.      లలితా,
3.      మహారాజ్ఞి,
4.      వరానకుషా,
5.      చాపిని,
6.      త్రిపురఛైవ
7.      మహాత్రిపురసుందరి,
8.      సుందరి
9.      చక్రనాథచ
10.  సామ్రాజ్ని, 
11.  చక్రినితథ
12.  చక్రేశ్వరి,
13.  మహాదేవి,
14.  కామేశి,
15.  పరమేశ్వరి,
16.  కామరాజప్రియ, 
17.  కామకోటిక
18.  చక్రవర్తిని,
19.  మహావిద్య,
20.  శివారంగవల్లభ,
21.  సర్వపాఠల, 
22.  కులనాథ
23.  అమ్నయనాథ 
24.  సర్వన్మాయనవాహిని, 
25.  శృంగారనాయక.    

Monday, August 12, 2019

ప్రియమైన మా టైగీ - We Miss you

Aug 12th 2019


ప్రియమైన మా టైగీ ,

 మనిషి అభిమానం, ప్రేమ స్వార్దం తొ నిండిపొయిన ఈ కాలం లో  శివుడు మాకొసం ఇచ్చిన అద్బుతానివి తల్లి, నువ్వు మాకు ఇచ్చిన హద్దులు, పరిమితులు లేని నీ ప్రేమ కు ఈ నాన్న .. ఎమి ఇవ్వగలడు..

శివుడు నిన్ను మాదగ్గరకు ఎందుకు పంపించాడో?.. మళ్ళి ఎందుకు తీసుకువెల్లడో? ..
కారణం నాకు ఇప్పుడు తెలియకపొవచ్చు,..కాని కారణం లేకుండా నా శివుడు ఏమి చెయ్యడు అని మాత్రం తెలుసు.  
  
నేను గమ్యం చేరే గమనం లొ ..నీ రాక మకు వరం ..నీ ఙపకం ఒక అద్బుతం .. మేము కార్చే కన్నీరు .. మేము చేసే ప్రార్ధన.. కేవలం మేము నీకు  చుపించే అనిర్వచనీయమైన మా ప్రేమ .  నీ మరణం నా గమనాన్ని మరింత నిశ్చితం చేసింది 

నా శివుడు నీకు అదే హద్దులు లేని ప్రేమని ..జన్మ రాహిత్యన్ని  నీకు ప్రసాదించాలని కొరుకుంటున్నను. 

నిస్తేజం గా నిన్ను దూరం చేసుకున్న
 నీ 
నాన్న (Suresh),అమ్మ(Lavanya), అక్క (Veda) 

Thursday, June 27, 2019

Pournami Songs - Bharatha Vedamuga -









తద్ధింతాదిది ధింధిమీ పరుల తాండవకేళీతత్పర

గౌరీమంజుల సింజిణీ జతుల లాస్యవినోదవ శంకర



భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిది ఈశ

శివ నివేదనగ అవని వేదనగ పలికెను పదము పరేశ

నీలకంధరా జాలిపొందరా కరుణతొ ననుగనరా

నేలకందరా శైలమందిరా మొరవిని బదులిడరా

నగజామనోజ జగదీశ్వరా మాలేందుశేఖరా శంకరా



హర హర మహాదేవ



అంతకాంత నీ సతి అగ్నితప్తమైనది మేను త్యాగమిచ్చి తాను నీలో లీనమైనది
ఆదిశక్తి ఆకృతి అద్రిజాత పార్వతి తాణువైన ప్రాణధవుని చెంతకు చేరుకున్నది
భవుని భువికి తరలించేలా ధరణి దివిని తలపించేలా
రసతరంగిణీలీల యతిని నృత్యరతులు చేయగలిగే ఈ వేళ

జంగమ సావర గంగాచ్యుత శిర భృతమణి పుటకర పురహరా
భక్తశుభంకర భవనా శంకర స్వరహర దక్షాత్వరహరా
పాలవిలోచన పాలిత జనగణ కాల కాల విశ్వేశ్వర
ఆసుతోష అథనాశ విశాషణ జయగిరీశ బృహదీశ్వరా

వ్యోమకేశ నిను హిమగిరి వరసుత ప్రేమపాశమున పిలువంగా
యోగివేష నీ మనసున కలగద రాగలేశమైనా
హే మహేశ నీ భయదపదాహతి దైత్యశోషణము జరుపంగ
భోగిభూష భువనాళిని నిలుపవ అభయముద్రలోన

నమక చమకముల నాదాన యమక గమకముల యోగాన
పలుకుతున్న ప్రాణాన ప్రణవనాద ప్రథమనాథ శృతివినరా

హర హర మహాదేవ

Jaya Janardana krishna radhika pathe- Telugu Lyrics







జయ జనార్ధనా కృష్ణా రాధికా పతే
జనవిమోచనా కృష్ణా జన్మమోచనా

జయ జనార్ధనా కృష్ణా రాధికా పతే
జనవిమోచనా కృష్ణా జన్మమోచనా
గరుడవాహనా కృష్ణా గోపికాపతే
నయనమోహనా కృష్ణా నీరజేక్షణా
జయ జనార్ధనా కృష్ణా రాధికా పతే
జనవిమోచనా కృష్ణా జన్మమోచనా

సుజనబాంధవా కృష్ణా సుందరాకృతే
మదనకోమలా కృష్ణా మాధవాహరే
వసుమతీపతే కృష్ణా వాసవానుజా
వరగుణాకరా కృష్ణా వైష్ణవాకృతే
సురుచినాననా కృష్ణా సౌర్యవారిధే
మురహరా విభో కృష్ణా ముక్తిదాయకా
విమలపాలకా కృష్ణా వల్లభీపతే
కమలలోచనా కృష్ణా కామ్యదాయకా

జయ జనార్ధనా కృష్ణా రాధికా పతే
జనవిమోచనా కృష్ణా జన్మమోచనా

విమలగాత్రనే కృష్ణా భక్తవత్సలా
చరణపల్లవం కృష్ణా కరుణకోమలం
కువలయేక్షణా కృష్ణా కోమలాకృతే
తవపదాంభుజం కృష్ణా శరణమాశ్రయే
భువననాయకా కృష్ణా పావనాకృతే
గుణగణోజ్వలా కృష్ణా నళినలోచనా
ప్రణయవారిధే కృష్ణా గుణగణాకరా
రామసోదరా కృష్ణా దీనవత్సలా

జయ జనార్ధనా కృష్ణా రాధికా పతే
జనవిమోచనా కృష్ణా జన్మమోచనా

కామసుందరా కృష్ణా పాహిసర్వదా
నరకనాశనా కృష్ణా నరసహాయకా
దేవకీసుతా కృష్ణా కారుణ్యాంబుధే
కంసనాశనా కృష్ణా ద్వారకాస్థితా
పావనాత్మకా కృష్ణా దేహిమంగళం
తృత్పదాంభుజం కృష్ణా శ్యామకోమలం
భక్తవత్సలా కృష్ణా కామ్యదాయకా
పాలిశెన్ననూ కృష్ణా శ్రీహరీనమో

జయ జనార్ధనా కృష్ణా రాధికా పతే
జనవిమోచనా కృష్ణా జన్మమోచనా

భక్తదాసనా కృష్ణా హరసునీసదా
కాదునింతినా కృష్ణా సలహెయావిభో
గరుడవాహనా కృష్ణా గోపికాపతే
నయనమోహనా కృష్ణా నీరజేక్షణా
జయ జనార్ధనా కృష్ణా రాధికా పతే
జనవిమోచనా కృష్ణా జన్మమోచనా
గరుడవాహనా కృష్ణా గోపికాపతే
నయనమోహనా కృష్ణా నీరజేక్షణా

జయ జనార్ధనా కృష్ణా రాధికా పతే
జనవిమోచనా కృష్ణా జన్మమోచనా

జయ జనార్ధనా కృష్ణా రాధికా పతే
జనవిమోచనా కృష్ణా జన్మమోచనా
జయ జనార్ధనా కృష్ణా రాధికా పతే
జనవిమోచనా కృష్ణా జన్మమోచనా

జయ జనార్ధనా కృష్ణా రాధికా పతే
జనవిమోచనా కృష్ణా జన్మమోచనా

జయ జనార్ధనా కృష్ణా రాధికా పతే
జనవిమోచనా కృష్ణా జన్మమోచనా


Saturday, May 25, 2019

లింగాష్టకం /lingaashTakam (Telugu Lyrics)

లింగాష్టకం 
బ్రహ్మమురారి సురార్చిత లింగం
నిర్మలభాసిత శోభిత లింగమ్ |
జన్మజ దుఃఖ వినాశక లింగం
తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 1 ||
దేవముని ప్రవరార్చిత లింగం
కామదహన కరుణాకర లింగమ్ |
రావణ దర్ప వినాశన లింగం
తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 2 ||
సర్వ సుగంధ సులేపిత లింగం
బుద్ధి వివర్ధన కారణ లింగమ్ |
సిద్ధ సురాసుర వందిత లింగం
తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 3 ||
కనక మహామణి భూషిత లింగం
ఫణిపతి వేష్టిత శోభిత లింగమ్ |
దక్ష సుయఙ్ఞ నినాశన లింగం
తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 4 ||
కుంకుమ చందన లేపిత లింగం
పంకజ హార సుశోభిత లింగమ్ |
సంచిత పాప వినాశన లింగం
తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 5 ||
దేవగణార్చిత సేవిత లింగం
భావై-ర్భక్తిభిరేవ చ లింగమ్ |
దినకర కోటి ప్రభాకర లింగం
తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 6 ||
అష్టదళోపరివేష్టిత లింగం
సర్వసముద్భవ కారణ లింగమ్ |
అష్టదరిద్ర వినాశన లింగం
తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 7 ||
సురగురు సురవర పూజిత లింగం
సురవన పుష్ప సదార్చిత లింగమ్ |
పరాత్పరం పరమాత్మక లింగం
తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 8 ||
లింగాష్టకమిదం పుణ్యం యః పఠేశ్శివ సన్నిధౌ |
శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే |