Translate

Wednesday, January 1, 2025

వేమన శతకము (vemana Satakam telugu)

  


వేమన శతకము

అనువుగాని చోట నధికుల మనరాదు 
కొంచెముండుటెల్ల
 కొదువకాదు 
కొండ
 యద్దమందు గొంచెమై యుండదా? 
విశ్వదాభిరామ
 వినురవేమ!

 

ఉప్పుగప్పురంబు న్రొక్కపోలికనుండు

చూడచూడ రుచుల జాడవేరు

పురుషులందు పుణ్య పురుషులువేరయ

విశ్వదాభిరామ వినుర వేమ

 

గంగిగోవు పాలు గరిటడైనను చాలు

కడివెడైన నేల ఖరముపాలు

భక్తికలుగు కూడు పట్టెడైననుజాలు

విశ్వదాభిరామ వినుర వేమ

 

ఆత్మ శుద్దిలేని యాచార మదియేల

భాండ సుద్దిలేని పాకమేల

చిత్తశుద్దిలేని శివపూజ లేలరా

విశ్వదాభి రామ వినుర వేమ

 

అల్పుడెపుడు బల్కు నాడంబరముగాను

సజ్జనుండు పలుకు చల్లగాను

కంచుమ్రోగినట్లు కనకంబుమ్రోగునా

విశ్వదాభిరామ వినురవేమ.

 

అనగ ననగ రాగ మతిశయిల్లుచునుండు

తినగ తినగ వేము తీయగనుండు

సాధనమున పనులు సమకూరు ధరలోన

విశ్వదాభిరామ వినుర వేమ

 

ఇనుము విరిగెనేని యినుమారు ముమ్మారు

కాచి యతుకనేర్చు గమ్మరీడు

మనసు విరిగినేని మరియంట నేర్చునా?

విశ్వదాభిరామ వినురవేమ

 

ఎలుగుతోలు తెచ్చి యెన్నాళ్ళు నుదికిన

నలుపు నలుపేకాని తెలుపు కాదు

కొయ్యబొమ్మదెచ్చి కొట్టిన పలుకునా?

విశ్వదాభిరామ వినురవేమ

 

ఆపదైన వేళ నరసి బంధుల జూడు

భయమువేళ జూడు బంటుతనము

పేదవేళ జూడు పెండ్లాము గుణమును

విశ్వదాభిరామ వినురవేమ

 

చిప్పలోనబడ్డ చినుకు ముత్యంబయ్యె

నీట బడ్డ చినుకు నీట గలిసె

బ్రాప్తి గలుగు చోట ఫలమేల తప్పురా

విశ్వదాభిరామ వినురవేమ

 

చిక్కియున్న వేళ సింహంబునైనను

బక్కకుక్క కరచి బాధచేయు

బలిమి లేనివేళ బంతంబు చెల్లదు

 

విశ్వదాభిరామ వినురవేమ

 

మృగము మృగమనుచును మృగమును దూషింత్రు 
మృగము
 కన్న చెడ్డ మూర్ఖుడగును 
మృగముకున్న
 గుణము మూర్ఖునకేదయా? 
విశ్వదాభిరామ
 వినురవేమ!

హీనుడెన్ని
 విద్య లిల నభ్యసించిన 
ఘనుడు
 గాడు మొరకు జనుడె గాని 
పరిమళములు
 గార్దభము మోయ ఘనమౌనె 
విశ్వదాభి
 రామ వినురవేమ! 

విద్యలేనివాడు
 విద్వాంసు చేరువ 
నుండగానె
 పండితుండు కాడు 
కొలది
 హంసల కడ కొక్కెర లున్నట్లు 
విశ్వదాభిరామ
 వినురవేమ! 

అంతరంగమందు
 నపరాధములు సేసి 
మంచివాని
 వలెనె మనుజుడుండు 
ఇతరు
 లెరుగకున్న నీశ్వరుడెరుగడా? 
విశ్వదాభిరామ
 వినురవేమ! 

అల్ప
 బుద్ధి వాని కథికారమిచ్చిన 
దొడ్డ
 వారి నెల్ల తొలగగొట్టు 
చెప్పు
 దినెడి కుక్క చెరకు తీపెరుగునా? 
విశ్వదాభిరామ
 వినురవేమ! 

అల్పుడెపుడు
 బల్కు నాడంబరముగాను 
సజ్జనుండు
 బల్కు చల్లగాను 
కంచు
 మ్రోగునట్లు కనకంబు మ్రోగునా? 
విశ్వదాభిరామ
 వినురవేమ! 

కాని
 వానితోడ గలసి మెలంగిన 
హాని
 వచ్చు నెంతవానికైన 
కాకి
 గూడి హంస కష్టంబు పొందదా? 
విశ్వదాభిరామ
 వినురవేమ! 

గంగపారుచుండు
 కదలని గతితోడ 
మురికి
 వాగు పారు మ్రోతతోడ 
అధికుడోర్చునట్టు
 లధముడోర్వగలేడు 
విశ్వదాభిరామ
 వినురవేమ! 

వేరు
 పురుగుచేరి వృక్షంబు జెరచును 
చీడ
 పురుగు చేరి చేను జెరుచు 
కుత్సితుండు
 చేరి గుణవంతు జెరచును 
విశ్వదాభిరామ
 వినురవేమ! 

అల్పుడెన్ని
 పల్కులలయక పల్కిన 
నధికుడూరకుండు
 నదిరి పడక 
చెట్టు
 మీద కాకి రెట్ట వేసిన యట్లు 
విశ్వదాభిరామ
 వినురవేమ!

అధముడైన
 మనుజుడర్ధవంతుండైన 
అతని
 మాట నడచు నవనిలోన 
గణపతి
 కొలువందు గవ్వలు చెల్లవా? 
విశ్వదాభిరామ
 వినురవేమ! 

ఎంత
 చదువు చదివి యెన్ని నేర్చినగాని 
హీనుడవగుణంబు
 మానలేడు 
బొగ్గు
 పాలగడుగ బోవునా మలినంబు 
విశ్వదాభిరామ
 వినురవేమ!

కుళ్ళుబోతు
 నొద్ద గూడి మాటాడిన 
గొప్ప
 మర్మములను జెప్పరాదు 
పేరు
 తీరు దెల్ప నూరెల్ల ముట్టించు 
విశ్వదాభిరామ
 వినురవేమ! 

చెప్పులోన
 రాయి, చెవిలోన జోరిగ 
కంటిలోని
 నలుసు, కాలిముల్లు 
ఇంటిలోని
 పోరు, నింతంతగాదయా! 
విశ్వదాభిరామ
 వినురవేమ! 

తల్లిదండ్రులందు
 దయలేని పుత్రుండు 
పుట్టనేమి!
 వాడు గిట్టనేమి! 
పుట్టలోన
 చెదలు పుట్టదా!గిట్టదా! 
విశ్వదాభిరామ
 వినురవేమ! 

పాలపిట్ట
 శకున ఫలమిచ్చునందురు; 
పాలపిట్టకేమి
 ఫలము దెలియు? 
తనదు
 మేలు కీళ్ళు తనతోడ నుండగ 
విశ్వదాభిరామ
 వినురవేమ!

.
రామనామ
 జపముచే మున్ను వాల్మీకి 
పాపి
 బోయడయ్యు బాపడయ్యె! 
కులను
 ఘనము గాదు గుణమే ఘనమ్ము రా 
విశ్వదాభిరామ
 వినురవేమ!

ఔనటంచు
 నొక్కడాడిన మాటకు 
కాదటంచు
 బలుక క్షణము పట్టు, 
దాని
 నిలువదీయ ధాతయె దిగవలె 
విశ్వదాభిరామ
 వినురవేమ! 

ఆత్మశుద్ధిలేని
 యాచారమదియేల? 
భాండశుద్ధిలేని
 పాక మేల? 
చిత్తశుద్ధిలేని
 శివపూజ లేలరా? 
విశ్వదాభిరామ
 వినురవేమ! 

ఉప్పుకప్పురంబు
 నొక్క పోలికనుండు 
చూడజూడ
 రుచుల జాడ వేరు; 
పురుషులందు
 పుణ్య పురుషులు వేరయా 
విశ్వదాభిరామ
 వినురవేమ! 

బంధుజనులజూడు,
 బాధల సమయాన, 
భయమువేళ
 జూడు, బంటుతనము, 
పేదపడ్డ
 వెనుక, పెండ్లాము మతిజూడు 
విశ్వదాభిరామ
 వినురవేమ! 

ఇనుమువిరిగెనేని
 యిమ్మారు ముమ్మారు 
కాచి
 యతుకనేర్చు కమ్మరీడు 
మనసు
 విరిగెనేని మరియంట నేర్చునా? 
విశ్వదాభిరామ
 వినురవేమ! 

తప్పులెన్నువారు
 తండోపతండంబు 
లుర్వి
 జనులకెల్ల నుండు తప్పు 
తప్పులెనువారు
 తమ తప్పు లెరుగరు 
విశ్వదాభిరామ
 వినురవేమ! 

నీళ్ళోన
 మొసలి, నిగిడి యేనుగుబట్టు 
బైట
 కుక్క చేత భంగపడును, 
స్థానబల్మికాని
 తనబల్మి కాదయా 
విశ్వదాభిరామ
 వినురవేమ!

.
వెన్న
 చేతబట్టి వివరంబు తెలియక 
ఘృతము
 కోరునట్టి యతని భంగి 
తాను
 దైవమయ్యు దైవంబు దలచును, 
విశ్వదాభిరామ
 వినురవేమ! 

ధర్మజ్ఞులైన
 పురుషులు 
ధర్మవునకు
 బాధసేయు ధర్మవునైనన్ 
ధర్మనుగా
 మదిదలపరు 
ధర్మను
 సర్వంబునకు హితంబుగ వలయున్. 

సుగుణవంతురాలు
 సుదతియై యుండిన 
బుద్ధి
 మంతులైన పుత్రులోప్ప 
స్వర్గమేటికయ్య
 సంసారికింకను! 
విశ్వదాభిరామ
 వినురవేమ! 

పుణ్యమంత
 గూడి పురుషుడై జన్మింప 
పాప
 మంతగూడి పడతి యగునె? 
స్త్రీలు
 పురుషులనుచు ఏలయూ భేదమ్ము? 
విశ్వదాభిరామ
 వినురవేమ!

ఉరుబలాఢ్యుడైన
 యుద్యోగి పరుడైన 
తగిన
 విత్తమున్న తరుణమందె 
పరులకుపకరించి
 పాలింపగల్గును 
విశ్వదాభిరామ
 వినురవేమ!

ఓర్పు
 లేని భార్య యున్న ఫలంబేమి? 
బుద్ధి
 లేని బిడ్డ పుట్టి యేమి? 
సద్గుణంబు
 లేని చదువది యేలరా? 
విశ్వదాభిరామ
 వినురవేమ! 

కాని
 వాని చేత కాసు వీసములుంచి 
వెంట
 తిరుగు వాడు వెర్రి వాడు 
పిల్లి
 తిన్న కోడి పిలిచిన పలుకునా? 
విశ్వదాభిరామ
 వినురవేమ! 

కాని
 వాని తోడ కలసి మెలంగువాడు 
కాని
 వాని గానె కాన బడును 
తాటి
 క్రింద పాలు త్రాగిన చందమౌ 
విశ్వదాభిరామ
 వినురవేమ! 

కోతి
 బట్టి దెచ్చి కొత్త పుట్టము గట్టి 
కొండముచ్చు
 లెల్ల గొల్చునట్టు 
నీతిహీనునొద్ద
 నిర్భాగ్యులుందురు 
విశ్వదాభిరామ
 వినురవేమ! 

గొర్రెలు
 పదివేలు కూడి యుండిన చోట 
తల్లి
 నెరిగి వచ్చు దాని కొదమ 
పరమయోగి
 నెరిగి భక్తుండు వచ్చురా 
విశ్వదాభిరామ
 వినురవేమ! 

చిక్కి
 యున్న వేల సింహంబునైనను 
బక్క
 కుక్కయైన బాధ పెట్టు 
బలిమిలేని
 వేల పంతముల్ చెల్లవు 
విశ్వదాభిరామ
 వినురవేమ! 

తనువులస్థిరమని
 ధనములస్థిరమని 
తెలుపగల్డు
 తాను తెలియలేడు 
చెప్పవచ్చు
 పనులు చేయుట కష్టమౌ! 
విశ్వదాభిరామ
 వినురవేమ! 

తామసించి
 చేయ దగదెట్టి కార్యంబు 
వేగిరింపనదియు
 విషమగును 
పచ్చికాయ
 దెచ్చి పడవేయ ఫలమౌనె 
విశ్వదాభిరామ
 వినురవేమ! 

కల్లు
 కుండకెన్ని ఘన భూషణములిడ్డ 
అందులోని
 కంపు చిందులిడదె? 
తులువ
 పదవిగొన్న తొలి గుణమేమగు? 
విశ్వదాభిరామ
 వినురవేమ! 

కసవు
 తినును గాదె పసరంబు లెప్పుడు 
చెప్పినట్లు
 వినుచుజేయు బనులు, 
వానిసాటియైన
 మానవుడొప్పడా? 
విశ్వదాభిరామ
 వినురవేమ! 

గాడ్దె
 మేను మీద గంధంబు పూసిన 
బూది
 లోన పడుచు, పొరలు మరల, 
మోటువాని
 సొగసు మోస్తరియ్యది సుమీ 
విశ్వదాభిరామ
 వినురవేమ! 

తన్ను
 జూచి యొరులు తగ మెచ్చవలెనని 
సొమ్ము
 లరవు దెచ్చి నెమ్మి మీర, 
యొరుల
 కొరకు తానె యుబ్బును, మూర్ఖుడు 
విశ్వదాభిరామ
 వినురవేమ!

.
తల్లి
 యున్న యపుడె తనకు గారాబము 
ఆమె
 పోవ, తన్ను నరయ రెవరు, 
మంచి
 కాలమపుడె మర్యాద నార్జింపు 
విశ్వదాభిరామ
 వినురవేమ!


నీళ్ళ
 మునుగనేల? నిధుల బెట్టగనేల? 
మొనసి
 వేల్పులకును మ్రొక్కనేల? 
కల్మషములెన్నొ
 కడుపులోనుండగా 
విశ్వదాభిరామ
 వినురవేమ! 

రాతి
 బొమ్మలకేల రంగైన వలువలు? 
గుళ్ళు
 గోపురములు కుంభములును, 
కూడు
 గుడ్డ తాను కోరునా దేవుడు? 
విశ్వదాభిరామ
 వినురవేమ! 

ఉప్పులేని
 కూర యొప్పదు రుచులకు 
పప్పులేని
 తిండి ఫలము లేదు 
అప్పులేనివాడె
 యధిక సంపన్నుడు 
విశ్వదాభిరామ
 వినురవేమ! 

అనువుగాని
 చోట నధికుల మనరాదు 
కొంచెముండుటెల్ల
 కొదువకాదు 
కొండ
 యద్దమందు గొంచెమై యుండదా? 
విశ్వదాభిరామ
 వినురవేమ! 

మైల
 కోక తోడ మాసిన తల తోడ 
యొడలి
 మురికి తోడ నుండెనేని, 
అధిక
 కులజునైన అట్టిట్టు పిలువరు, 
విశ్వదాభిరామ
 వినురవేమ! 

ఇహము
 విడువ ఫలము లింపుగ గలవని 
మహిని
 బల్కు వారి మాటకల్ల, 
ఇహములోనె
 పరము నెరుగుట కానరా? 
విశ్వదాభిరామ
 వినురవేమ! 

వంపుగానికర్రగాచి
 వంపు తీర్చగవచ్చు 
కొండలన్ని
 పిండి గొట్టవచ్చు 
కఠిన
 చిత్తు మనసు కరగింపగారాదు 
విశ్వదాభిరామ
 వినురవేమ!

.
ఆలివంక
 వార లాత్మబందువులైరి 
తల్లి
 వంక వారు తగిన పాటి 
తండ్రి
 వంక వారు దాయాది తగవులౌ 
విశ్వదాభిరామ
 వినురవేమ!


మేడిపండు
 జూడ మేలిమై యుండును 
పొట్ట
 విచ్చి చూడ పురుగు లుండు 
పిరికివాని
 మదిని బింక మీ లాగురా, 
విశ్వదాభిరామ
 వినురవేమ!


అనగననగరాగ
 మతిశయించునుండు
తినగ
 తినగ వేము తియ్యనుండు
సాధనమున
 పనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ
 వినుర వేమ.

 

No comments:

Post a Comment