Translate

Wednesday, January 1, 2025

నూతన సంవత్సరం శుభాకాంక్షలతో ....

 నూతన సంవత్సరం శుభాకాంక్షలతో ....


గడిచిన ప్రతి క్షణం ఒక గతం, ఆ గతం లో ఎన్నో జ్ఞాపకాలు వాటిని ఒక్కసారి తలచు కుందాం, మనవరాళ్లందరినీ ఇంకొక్కసారి గుర్తు తెర్చుకుందాం. అందరు మనకు కొంచెం దూరం గా వున్నారనే తప్ప మన జ్ఞాపకాలకి కాదు.మన మధ్య లేని వారిని తలచుకోని వారి  జ్ఞాపకలలో బాధ పడకుండా, వాళ్ళ స్పూర్తితో ముందుకు సాగుదాం.


కేవలం జ్ఞాపకాలలో ఉండిపోకుండా  జ్ఞాపకాలని మన పురోగతికి సాధనం గా మార్చు కుందాం 

ఎన్నో ఆనందాలు వచ్చే నూతన సంవత్సరం మరిన్ని పెంచు కుందాం

అజ్ఞానంలో చేసిన తప్పులని, మూర్ఖంగా మాట్లాడిన మాటలని, అహంకారంతో అన్న మాటలు, ప్రేమతో మన్నించు కుందాం.

అర్దం లేని ఆలోచనలని, భయాలని వదిలేద్దాం గత సంవత్సరంలో వదిలేద్దం , 

అనవసరమైన అపోహలని తొలగుంచుకుందాం. 

మన ఆరోగ్యం మన వాళ్ళ కోసం , మన గమ్యం  కోసం కాపాడు కుందాం.

కొన్ని అవమానాలు పడ్డాం వాటిని క్షమించు కుందాం. 

ఒకరి కోసం ఒకరు అవసరమైన ప్రతీ సారి నిలబడ్డాం- అది మరింత ముందుకు కొనసాగిద్దాం. 



మన అందరిలోనూ వున్న మన గుణాలైన క్షమించడం- ప్రేమించడం- అర్థంచేసుకోవటం- ప్రార్థించటం, ఆధ్యాత్మిక పురోగతితో మన గురించి మనం తెలుసుకోవటం లాంటివి మరింత అలవాటు చేసుకుందాం.


నూతన సంవత్సరం  అంటే కేవలం క్యాలెండర్ లొ రోజు/సంవత్సరం మాత్రమే కాదు మన ఆలోచనలు కూడా క్రొత్తగా మరింత పరిపక్వత గా మారాలని నా శివుడిని  ప్రార్థిస్తున్నాను.


నూతన సంవత్సరం శుభాకాంక్షలతో ....

 

ప్రేమతో మీ

సురేష్ కలిమహంతి

No comments:

Post a Comment