Translate

Monday, February 7, 2022

కుండలిని శక్తి (kundalini telugu) Notes- Part- 5 - శారీరక, మానసిక క్రియలు


కుండలిని శక్తి (kundalini telugu) Notes- Part- 5

శారీరక, మానసిక క్రియలు



 కుండలినీ సిద్ధ మహా యోగం, అభ్యాసం చేస్తున్న సమయంలో గురు కృపతో క్రియలు రావడం కద్దు. క్రియలు ఇతోధికంగా వస్తున్నాయి అంటే, కుండలినీ శక్తి విడుదల అవుతోందని అర్థం.


     కుండలినీ శక్తిని, విడుదల చెయ్యడం అనేది , సుశిక్షుతుడైన గురువు సమక్షంలో జరిగినట్లయినచో...అది ఒక ఉన్నతమైన అభ్యాసం. కుండలినీ శక్తి, స్వేచ్ఛగా - ఎటువంటి ఆటంకాలు లేకుండా విడుదల అయినచో... ఆ మహాశక్తి, అనూహ్యమైన రీతుల్లో ఒక సాధకుని యొక్క పురోభివృద్ధిని కాంక్షిస్తుంది. కొంత మంది లక్షితులైన వ్యక్తులు, కొంత మంది ఉన్నత ఆశయాలు గల వ్యక్తులు కూడా...తమ లక్ష్య సాధనకు...కుండలినీ శక్తిని మేల్కొలపడాన్ని ఇష్టపడతారు. కుండలినీ శక్తి, ఒక సాధకునిలో మేల్కొంటే, దానికి నిరూపణగా అనేక శారీరక, మానసిక క్రియలు జరుగుతాయి. వారి వారి శరీర స్థాయిల్లో, మనో మట్టాల్లో...గణనీయమైన మార్పులు సంభవిస్తాయి. ఇది ఒక అతి పరిణామము. అనగా ఉన్నత స్థాయిలకు పురోగమించు పరిణామము. కుండలినీ శక్తి జాగరణ వలన, అతని చిత్తంలో అనగా Sub - Conscious mind లో, అనేకానేక జన్మల నుండి ఈ క్షణం దాకా వస్తున్న , సంస్కారాలు దగ్దం అయిపోతాయి. అంటే దగ్దం అయిపోవడాన్ని, మనం క్రియల రూపంలో అనుభవిస్తాం. కుండలినీ శక్తి జాగరణ వలన, శరీరం విష రహితం అవుతుంది. ఉదాహరణకు, హఠయోగంలో ఒక క్రియ "నౌళి క్రియ". ఈ నౌళి క్రియ వలన , శరీరంలో ప్రాణ శక్తి సంచారం చక్కగా జరుగుతుంది. ఈ నౌళి క్రియ వలన జీర్ణ శక్తి కూడా వృద్ధి చెందుతుంది. సాధారణంగా నౌళి క్రియను, ప్రయత్న పూర్వకంగా చేస్తారు. కానీ కుండలినీ శక్తి జాగరణ చెందితే, కొన్ని సాధకుడిలో అసంకల్పితంగా కూడా ఈ "నౌళి క్రియ" జరిగి, శరీరం శుద్ధి అవుతుంది.


      ఒక సాధకునిలో కుండలినీ శక్తి జాగరణ జరిగితే, అతనిలో ప్రాణాయమ ప్రక్రియలు, ముద్రలు, బంధాలు కూడా ...అసంకల్పితంగా వస్తాయి. అసంకల్పిత నాదం వస్తుంది. ఇదివరకు ఎప్పుడూ ఎరగని, స్థితులన్నీ అనుభవానికి వస్తాయి.


...కుండలినీ శక్తి మేల్కొనింది అనడానికి గుర్తు. మీ మూలాధార స్థానంలో కొట్టుకుంటున్నట్లు, ఆ ప్రాంతం ఒత్తిడికి గురి అవుతున్నట్లు...మీరు ఆయా స్పందనలు, అనుభూతులకు, అనుభవాలకు లోనవుతారు. మీ శరీరమంతా విద్యుత్ప్రవాహ గతిని మీరు అనుభవిస్తారు. మీలో కుండలినీ శక్తి జాగృతమైందని అర్థం. మీరు సాధనలో ఉన్నప్పుడు, శరీరం అసంకల్పితంగా  కుదుపులకు లోనవుతుంది. శరీరమంతా విద్యుత్ స్పందనలు అనుభవిస్తారు. శరీరం సంకోచ - వ్యాకోచాలకు లోనవుతుంది. శరీరంలో అసంకల్పితంగా భిన్న భిన్న ప్రాణాయామ క్రియలు జరుగుతాయి. మీ ప్రమేయం లేకుండా కేవల కుంభకం జరుగుతుంది. అసంకల్పితంగా ఉచ్ఛ్వాస - నిశ్వాస ప్రక్రియలు సాగుతాయి. శరీరం నియంత్రణలో లేని విధంగా, ఉచ్ఛ్వాస - నిశ్వాస క్రియలు సాగుతాయి. తీవ్రమైన వేడిని గాని , చల్ల దనాన్ని గాని అనుభవిస్తారు. కుదుపులు, వణకడం, శరీరంలో ఏదో ఒక అగోచర శక్తి సంచారం జరుగుతున్నట్లు అనుభవానికి లోనవుతారు. కొంతమంది సాధకులకు అసంకల్పితంగా, యోగాసనాలు వస్తాయి. కొంతమందికి అసంకల్పిత ముద్రలొస్తాయి. కొంతమందికి కేవల కుంభకం జరుగుతుంది. కుండలినీ శక్తి జాగరణ జరిగిన తరువాత, సాధకుడి కర్మ సంచయం దగ్దం అవ్వడం ప్రారంభం అవుతుంది. (అంటే ఇతః పూర్వం కర్మానుభవం రాదా...అంటే...వస్తుంది. అది మెల్లగా సాగుతుంది. కుండలినీ శక్తి జాగరణ తరువాత కర్మానుభవం వేగవంతం అవుతుంది. కుండలినీ శక్తి ఊర్థ్వ ముఖత్వం చెందే కొద్దీ, జ్ఞానంతో కూడిన గాఢమైన శాంత స్థితి అనుభవానికి వస్తుంది. కుండలినీ శక్తి జాగరణ చెంది, ప్రయాణం ప్రారంభమైన తరువాత వివిధ అంతర నాదాలు అనుభవానికి వస్తాయి. వివిధ బీజాక్షరాలతో కూడిన మంత్రాలు, సాధకుడు అసంకల్పితంగా ఉచ్ఛరిస్తాడు. దశ విధ నాదాలు కూడా క్రమంగా అనుభవానికి వస్తాయి. కుండలినీ శక్తి జాగరణ జరిగాక, సాధకుడి మనో మట్టాలలో గణనీయమైన మార్పులు సంభవిస్తాయి. 


.....క్రియలనేవి, కుండలినీ శక్తి చైతన్యం అవుతున్న దశలలో, వ్యక్తం అయ్యే శారీరక, మానసిక కదలికలు. ఈ తీవ్రమైన కుండలినీ శక్తి, శరీరమందలి 72,000 సూక్ష్మ నాడుల గుండా ప్రవహించేటపుడు, శారీరక - మానసిక ఆటంకాలను, ఆటంక రహితం చేస్తుంది. ఈ కుండలినీ శక్తి వైశ్విక శక్తి. సాధకుడు, ధ్యానానికి ఉపక్రమించగానే (శక్తి పాత దీక్ష తీసుకున్న తరువాత), ఈ శక్తి ప్రవాహం అనుభవానికి వస్తుంది. కుండలినీ సిద్ధ మహా యోగంలో, క్రియలనేవి సూక్ష్మమైనవి, మార్మికమైనవి, అసాధారణమైనవి. 


     అదే సమయంలో, ఈ దృగ్విషయం అనేది సామాన్యమైనది కూడా...ఈ క్రియలు, అన్ని సమయాలలోనూ, కుండలినీ శక్తి ప్రచోదనమైనప్పుడు మాత్రం జరిగే అవకాశముంది. ఈ క్రియలలో, ప్రతీ స్థితిలో ప్రతి సాధకుడి అనుభవం ప్రత్యేకమైనది. ఈ క్రియలు, గత కర్మల ఆధారంగానే జరుగుతాయి. సాధకుడి చిత్తంలో అనేకానేక జన్మల నుండి వస్తున్న సంస్కారాలు, క్రియల రూపంలో వ్యక్తం కావడం జరుగుతుంది. సాధకులు, ఈ క్రియలను ఎలా అర్థం చేసుకోవాలంటే,  ఈ క్రియలనేవి శరీరాన్ని, మనస్సును శుద్ధి చేసే ప్రక్రియలు. అయితే ఈ శుద్ధీ కరణ ప్రక్రియ, సంవత్సరాల పర్యంతము కొనసాగవచ్చు. అంతవరకు, సాధన వదలిపెట్ట కూడదు. మహా యోగుల లెక్క ప్రకారం ఈ క్రియలు 1,00,000 పైగా ఉంటాయి. వీటిలో అన్ని గానీ,కొన్ని గానీ సాధకుడికి అనుభవం కావచ్చు. ఈ క్రియలు, ఎక్కువ భాగం...రక రకాల పౌనఃపున్యాలలో సంకోచ - వ్యాకోచాలను పోలియుంటాయి. కొన్ని సార్లు క్రియల సందర్భంగా కుదుపులు వస్తూ ఉంటాయి కూడా. క్రియలను ఈ విధంగా వర్గీకరించవచ్చు.  యోగ క్రియలు, ప్రాణ శక్తి కదలికలు, వైశ్విక చైతన్యము యొక్క మార్మిక క్రియలు, మనో క్రియలు, అతీంద్రీయ క్రియలు గా వర్గీకరించవచ్చు. 

No comments:

Post a Comment