Translate

Showing posts with label సదాశివాష్టకమ్ (SadaShiva Ashtakam in Telugu). సదాశివా. Saddaa Siva. Show all posts
Showing posts with label సదాశివాష్టకమ్ (SadaShiva Ashtakam in Telugu). సదాశివా. Saddaa Siva. Show all posts

Saturday, February 1, 2025

సదాశివాష్టకమ్ (SadaShiva Ashtakam in Telugu)

సదాశివాష్టకమ్

 పతంజలిరువాచ

సువర్ణపద్మినీతటాన్తదివ్యహర్మ్యవాసినే..
సుపర్ణవాహనప్రియాయ సూర్యకోటితేజసే |
అపర్ణయా విహారిణే ఫణాధరేంద్రధారిణే
సదా నమః శివాయ తే సదాశివాయ శంభవే || ||

సతుంగభంగజహ్నుజాసుధాంశుఖండమౌళయే
పతంగపంకజాసుహృత్కృపీటయోనిచక్షుషే |
భుజంగరాజమండనాయ పుణ్యశాలిబంధవే
సదా నమః శివాయ తే సదాశివాయ శంభవే || ||

చతుర్ముఖాననారవిందవేదగీతభూతయే
చతుర్భుజానుజాశరీరశోభమానమూర్తయే |
చతుర్విధార్థదానశౌండ తాండవస్వరూపిణే
సదా నమః శివాయ తే సదాశివాయ శంభవే || ||

శరన్నిశాకరప్రకాశమందహాసమంజులా-
-ధరప్రవాళభాసమానవక్త్రమండలశ్రియే |
కరస్ఫురత్కపాలముక్తరక్తవిష్ణుపాలినే
సదా నమః శివాయ తే సదాశివాయ శంభవే || ||

సహస్రపుండరీకపూజనైకశూన్యదర్శనా-
-త్సహస్రనేత్రకల్పితార్చనాచ్యుతాయ భక్తితః |
సహస్రభానుమండలప్రకాశచక్రదాయినే
సదా నమః శివాయ తే సదాశివాయ శంభవే || ||

రసారథాయ రమ్యపత్రభృద్రథాంగపాణయే
రసాధరేంద్రచాపశింజినీకృతానిలాశినే |
స్వసారథీకృతాబ్జయోనినున్నవేదవాజినే
సదా నమః శివాయ తే సదాశివాయ శంభవే || ||

అతిప్రగల్భవీరభద్రసింహనాదగర్జిత-
-శ్రుతిప్రభీతదక్షయాగభాగినాకసద్మనామ్ |
గతిప్రదాయ గర్జితాఖిలప్రపంచసాక్షిణే
సదా నమః శివాయ తే సదాశివాయ శంభవే || ||

మృకండుసూనురక్షణావధూతదండపాణయే
సుగండమండలస్ఫురత్ప్రభాజితామృతాంశవే |
అఖండభోగసంపదర్థలోకభావితాత్మనే
సదా నమః శివాయ తే సదాశివాయ శంభవే || ||

మధురిపువిధిశక్రముఖ్యదేవై-
-రపి నియమార్చితపాదపంకజాయ |
కనకగిరిశరాసనాయ తుభ్యం
రజతసభాపతయే నమః శివాయ || ||

హాలాస్యనాథాయ మహేశ్వరాయ
హాలాహలాలంకృత కంధరాయ |
మీనేక్షణాయాః పతయే శివాయ
నమో నమః సుందరతాండవాయ || ౧౦ ||

ఇతి శ్రీహాలాస్యమాహాత్మ్యే పతంజలికృత సదాశివాష్టకమ్ |