కపాల మోక్షం
ఎప్పుడైతే మన స్థూల శరీరము నిద్రలోకి జారుకుని మన సూక్ష్మ శరీర మెలుకువ స్థితి
అనగా యోగనిద్ర స్థితికి వచ్చినప్పుడు మన కుండలినీ శక్తి ప్రవాహము మన స్థూల శరీరము
నందు సుష్మ నాడి యందు ప్రవేశించినప్పుడు మనకి భ్రమరీ నాదము వినపడితే మనము మూలాధార
చక్రము లోని కల ప్రపంచంలోనికి మన సూక్ష్మ శరీర యానం ప్రవేశించినట్లు అన్నమాట. ఇది
మన స్థూల శరీర చక్ర ప్రవాహము బట్టి మన సాధన కల ప్రపంచంలోనికి మన సూక్ష్మ శరీర యానం
చేస్తుందని గ్రహించండి. అప్పుడు మనము ఆదిలో ప్రారంభ మూలాధార చక్రం ప్రపంచంలోనికి
ప్రస్తుత జన్మ సూక్ష్మశరీరం ప్రవేశిస్తుంది. అక్కడ రమారమిగా మనలాంటి వాళ్లే
ఉంటారు. వాళ్ళ పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు. సాధన చేసే వాళ్ళు భాగంలో ఉండే వాళ్లు
మాయలో పడే వాళ్లు ఇలా భూలోకంలో ఎలా ఉంటుందో అలాగే అక్కడ ఉంటుంది. కానీ మన
సూక్ష్మశరీరము ఆ లోకములోనికి ప్రవేశించినట్లు అందరికీ కనపడుతుంది. దానిని తెలిసినవాడు
పలకరిస్తారు కూడా అన్నమాట. అప్పుడు మూలాధార చక్ర సాధన చేసిన నా జన్మ తాలూకూ
విషయాలు అక్కడ ఉన్న వారిని కనుక్కొని అక్కడ సాధన చేస్తున్న మూలాధార జన్మ వ్యక్తి
దగ్గరికి ఈ సూక్ష్మ శరీరధారి వెళ్ళటం అక్కడ ఉన్న దైవిక వస్తువులు అలాగే పొందిన
అనుభవాలు వివరాలు తెలుసుకుని వెనకకు తిరిగి ప్రస్తుతం ఉన్న భూలోకంలో ఉన్న స్థూల
శరీరములోనికి ప్రవేశించి అక్కడ తెలుసుకున్న అన్ని విషయాలు మన మెదడుకు సంకేతాల
రూపంలో అందిస్తే అది కాస్త వివేక జ్ఞాన బుద్ధి వలన జ్ఞాన స్పందన కలిగి మర్చిపోయిన
సాధన విషయాలు గుర్తుకు వస్తుంది. దానితో ఆ కల ప్రపంచంలోని సంబంధించిన దైవిక
వస్తువులు ఈ లోకములో ఈ కల ప్రపంచంలో ఎక్కడ ఏ రూపంలో ఏ ప్రాంతంలో ఎవరి దగ్గర
ఉన్నాయో తెలిసిపోయేది.వాటిని తిరిగి మేమిద్దరము స్థూల శరీరంతో ఆ చోటికి వెళ్లి
తెచ్చుకుని లేదా వాళ్లంతట వాళ్లు చిత్రముగా వస్తువులను తిరిగి ఇచ్చేవాళ్ళు. ఆ తర్వాత
యోగనిద్రను సాధన ముందుకి కొనసాగించే వాళ్ళం. ఇలా ఒక్కొక్కచక్రానికి
ఒక్కొక్కనాదముతో ఆయా చక్ర కల ప్రపంచములోనికి మా యోగనిద్రసాధనతో చేరుకొని చివరికి ఈ
గ్రంథం రాకముందు వరకు శంఖనాదం ద్వారా సహస్ర చక్రం వరకు స్వానుభవాలు పొందే వాళ్ళం.
ఎప్పుడైతే సాధన అనేది సహస్రార చక్రము వద్ద ఆగిపోదని హృదయ చక్రం దాకా ఉంటుందని మాకు
భగవద్గీత ద్వారా అలాగే అరుణాచల రమణ మహర్షి అనుభవాలు చదివేదాకా తెలిసేది కాదు.
దానితో మా సాధనను కొనసాగించాలని విశ్వసృష్టి అంతమేదో చూడాలని ఫైండ్ ఫైనల్(Find Final) దాని మీద మా సాధన కొనసాగించాము. ఎందుకంటే సహస్రార చక్రము
దాకానే మన ప్రపంచం అటుపై అదంతా విశ్వ కల అన్నమాట. ఇది విశ్వ మూల రహస్యాలు
దాచుకున్న బ్రహ్మముడి అన్నమాట. నేను ఎవరు అనేది మనకు సహస్రంలోనే తెలిసిపోతుంది.
అప్పటికి యోగనిద్ర కాలము 48 నిమిషాలు అవుతుంది.అంటే పది
లక్షల సంవత్సరాలు సమానము అన్నమాట.
Example: మా సూక్ష్మ శరీర యానము అదే యోగనిద్రలో ఎలా ఉంటుందో
నీకు బాగా అర్థం అవ్వాలి అంటే కళ్యాణ్ రామ్ నటించిన 118 సినిమా
చూడండి. అందులో హీరోకి 118 లో ఉన్నప్పుడు 1గంటా 18 నిమిషాలకి(1:18) ఒక
అమ్మాయి అతని కలలోకి వచ్చి జరిగిన ప్రమాదాలు చూపిస్తుంది. దీని మీద హీరో పరిశోధన
చేస్తే ఆమె కాస్తా ఆ రూంలో వచ్చిన అందరికీ చూపించిన కల ఆధారంగా అందులో ఆమె
చూపించిన క్లూస్ ఆధారంగా పరిశోధన చేస్తూ ఆమె చేసుకున్న బ్రాస్లేట్ లోని అసలు
రహస్యం ఉందని తెలుసుకుని అది ఎక్కడ ఉందో తెలుసుకోవాలని యోగనిద్ర లోనికి వెళ్లి ఆ
బ్రాస్లెట్లు ఉన్నప్పుడు జరిగిన సంఘటనలను ఆమె ఒక కల ప్రపంచంలోనికి మన హీరో చూసి
వెనక్కి వచ్చి ఆమె స్థూల శరీరమును పాతిపెట్టిన స్థలమని గుర్తించి త్రవ్వించి
అస్థిపంజరంగా మారిన ఆమె దేహానికి ఉన్న బ్రాస్లెట్ ని గుర్తించి దానిని బయటకు తీసి
అందులో ఉన్న మెమరీ కార్డు బయటకు తీసి అందులో ఉంచిన రహస్య వీడియోలు డాక్యుమెంట్లను
బయటకు తీసి చంపిన వారి వివరాలు ఎందుకు చంపిన వివరాలు అన్నీ లోకానికి తెలుస్తాయి.
హీరో సూక్ష్మ శరీర యానము లాగానే నా సాధన ప్రపంచంలో అనగా మూలాధార చక్రము నుండి
బ్రహ్మరంధ్రము దాక కొనసాగి అక్కడ మా పంచ శరీరాలు తెలుసుకున్న విషయాల సమాహారమే ఈ
కపాలమోక్షం గ్రంథం అని తెలుసుకోండి. స్థూల శరీరంయానం విశుద్ధ చక్రం వరకు అయితే
సూక్ష్మ శరీర యానం ఆజ్ఞాచక్రం నుండి సహస్రార చక్రము వరకు అయితే కారణ శరీరము
సహస్రార చక్రము నుండి హృదయ చక్రము దాకా హృదయ చక్రం నుండి బ్రహ్మరంధ్రము దాక సంకల్ప
శరీర యానం ఆపై ప్రాంతంలో బ్రహ్మరంధ్రం లోపలికి అనగా బ్రహ్మాండ చక్ర కృష్ణబిలం దాకా
ఆకాశ శరీర యానాలు సంయోగం చెంది ఏక ఆకాశ శరీరంగా మారి సాధన చేసిన ప్రసిద్ధ
ప్రదేశాలు దైవిక వస్తువులు అనుభవాలు మన స్థూల శరీరానికి అందజేసిన దీని కోసము 72+
72 మంది యోగగురువులు అనగా 144 మంది సహకరించడం
వలన మా యోగనిద్ర 144 నిమిషాలకు చేరుకున్నది. వీరి వివరాలు
మీకు సంపూర్ణ అద్వైత సిద్ధాంతములో వివరించడం జరిగినది. అనగా ఆదిలో
మూలాధారచక్రంలోని జీవ బ్రహ్మ గణపతితో మొదలైన మా శరీర యానాలు అంతములోని
బ్రహ్మరంధ్రంలో ఉన్న మూల గణపతిని దాటి బ్రహ్మాండ చక్ర కృష్ణ బిలంగా మేమున్నామని
గ్రహించే సరికి మా బుర్రలు తిరిగాయి. అనగా మోక్ష కృష్ణ బిలంగా నేనున్నానని అదే మా
యోగ మిత్రుడైన జిజ్ఞాసి మాత్రం ధ్రువతారగా శూన్యబ్రహ్మగా ఉండి ఎవరైతే మేము చెప్పిన
మోక్షమాల అనగా 13 రుద్రాక్షలు 12 స్పటికాలు
11 కపాలాలు కలిపి 36 మాలగా వేసుకుని
గండకీ నది విష్ణు సుదర్శన చక్రము అలాగే ఓంకారనాదంను చేసే మహాగణపతి శంఖ నాదము
చేస్తూ యోగనిద్రను 48 నిమిషాల పాటు పోయే స్థితికి వస్తారో
వారి సాధన పరిసమాప్తి స్థితి చేసే మా మోక్ష కృష్ణ బిలము నందు అనగా దీని మార్గమును
చూపించే ధ్రువతారగా మనవాడు ఉన్నాడు అని తెలుసుకున్నాము. అంటే ఇన్నాళ్ళు మేమే
మోక్షమిచ్చే కృష్ణబిలం అని తెలుసుకోలేక పోయినాము. కారణం వివిధ కోటాను కోట్ల
జన్మలలో వివిధ రకాల మాయలలోపడినాము కాని ఆ మాయలో పడుతూ అక్కడితో సాధన సమాప్తి
చేసుకుని మరుజన్మలు ఎత్తుతూ సాధన కొనసాగిస్తూ మాయలోపడుతూ సాధనను గత జన్మలో
సంపూర్ణంగా పూర్తి చేసి అపస్మారక స్థితిని పొంది తెలిసిన జ్ఞాన విషయాలు మర్చిపోవడం
జరిగినది.కాని ఈ జన్మలో మా ఇద్దరికి అనుకోకుండా ఏడవ తరగతిలో జరిగిన పరాభవాలు
కారణంగా మేము తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురి అయ్యేసరికి మాలో కుండలినీ శక్తి
జాగృతి అవ్వడము అది కాస్తా యోగనిద్ర సాధన అభ్యాసమునకు దారి తీయటం అటుపై మా శరీరాల
యానాలు చేసి ఆయా చక్రాల కల ప్రపంచంలోనికి మేము గతంలో చేసిన సాధన అనుభవాలను
గుర్తుకు తెచ్చుకోవడం అటుపై విశ్వకల ప్రపంచంలోనికి పెళ్లి ఫైండ్ ఫైనల్(Find
FInal) తెలుసుకోవడము జరిగినది. ఇది ఇంతవరకు ఎవరూ చేయలేదా అన్నప్పుడు
చేయలేదనే చెప్పాలి. చేసి ఉంటే ఈవిశ్వము ఉండేది కాదు కదా. ఈ గ్రంథమే ఉండేది కాదు
కదా. ఎందుకంటే 144 నిమిషాలపాటు యోగనిద్రలో ఉండాలి. పైగా మాయా
రహితంగా ఉండాలి. ఇప్పటిదాకా ఆదియోగి పరమేశ్వరుడు దగ్గరనుండి నారాయణుడు అంశ అయిన
బుద్ధుడు దాకా ఇష్ట కోరిక మాయలో పడినవారే కదా. కాకపోతే మేము ఈ జన్మలో సర్వము ఏమీ
లేదు.సర్వము శూన్యము.
నేను లేను అనే సంకల్పంతో యోగనిద్ర సాధన చేయడంతో అసత్యంగా కనిపించే విశ్వ మాయ
పొరలు తొలగుతూ వచ్చినాయి. దానితో మా మెదడు శక్తి తట్టుకోవడానికి 144 మంది మూలపురుషులు సహకరించి వారి శక్తిని మన మెదడుకి సరైన
సమయంలో అందిస్తూ వారి శరీరాలను మా శరీరాలతో అనుసంధానం చేస్తూ వారు సంపాదించిన సాధన
శక్తిని ఇస్తూ మా సాధన సంపూర్ణంగా పరిసమాప్తి చేసే చిట్టచివరి స్థితి అయిన
బ్రహ్మాండ చక్ర కృష్ణబిలం దాకా తీసుకొని వెళ్ళినారు. విచిత్రం ఏమిటంటే వాళ్ళకి
కూడా అంతమేదో తెలియదు. విశ్వం అంతములో ఏముందో తెలుసుకోవాలనే మా తపన తాపత్రయం సంకల్పం
చూసి హిమాలయాల్లో గుప్త క్షేత్రాలలో గుప్త శరీరాలతో సాధన చేసిన వీరంతా మా కల
ప్రపంచానికి అనుసంధానమై సహకరించి అంతము ఏదో తెలుసుకోవటానికి తమ సహాయ సహకారాలు
అందించారు. మా సాధన పరి సమాప్తి చేయించి వారి ప్రారబ్డ శరీరాలను మా మోక్ష కృష్ణ
బిలమునందు లయము చేయడం ఆరంభించడం కొసమెరుపు అన్నమాట. అంటే మాకు వచ్చిన సుదర్శన
చక్రమును గణపతి ఓంకార శంఖము మేము తయారు చేసుకున్న మోక్ష మాల ధరించి మాకు సహాయం
చేసిన మహా పురుషులు చేసిన అలాగే వివిధ జన్మలలో మేము సాధన చేసి సంపాదించుకున్న
వస్తువులను ప్రతిరోజు గంగా నీటిలో ముంచి ఆపై వాటికి విభూది ధారణ చేయడం తద్వారా
ఈ విశ్వ సృష్టిలో ఉన్న 36 కోట్ల
దైవాలు 84 లక్షల జీవరాశులు కోటి పరమాత్మలు ఇలా అందరూ
ఒక్కొక్కరుగా విదేహి విముక్తి క్షేత్రమైన కాశీ క్షేత్రంలో గంగానదిలో ఈ దైవ
స్వరూపాలు పరమాత్మ స్వరూపాలు సాధన జన్మ స్వరూపాలు ఒక్కొక్కరిగా నిమజ్జనం అయ్యే
దృశ్యము మాకు అంతిమ ధ్యాన అనుభవము అయినది. ఇలా వీరందరూ కూడా జల నిమజ్జనం అయ్యేదాకా
కర్మ శేషంగా మిగిలిపోయిన మూడు లక్షల కర్మఫలము ఇదేనని మాకు మా మరణము మా చేతుల్లో
లేదని వీరి ప్రారబ్ద కర్మలు తీరితే అనగా వీరందరూ కూడా గంగా జల నిమజ్జనం అయితే
కాకపోతే ఈ పని ఇప్పుడే మొదలయ్యింది అని తెలియడంతో మాకు శాశ్వత మరణము రాబోవుకాలంలో
ఉన్నదని తద్వారా పునర్జన్మ లేని కర్మ శేషము లేని అన్ని రకాల రాహిత్యము పరమ
ప్రశాంతత పొందే శాశ్వత మరణమై మోక్షము పొందుతామని మీరు ఈ పాటికి గ్రహించి ఉంటారు
కదా. ఇక్కడ చాలా మందికి చిన్న సందేహం రావచ్చు. మీరు కృష్ణబిలంగా మారే అవకాశం మీకు
ఎలా వచ్చింది అన్నప్పుడు మేము సర్వము ఏమీ లేదు.సర్వము శూన్యము.నేను లేను అనే
సంకల్పంతో యోగనిద్ర సాధనం చేయడం జరిగింది కదా. మిగిలిన వారంతా కూడా కొంతమంది జగత్
సత్యమని నమ్మితే… మరికొంతమంది జగత్తు మిథ్య అని… మరి కొంతమంది జగత్ మిథ్య బ్రహ్మసత్యం అని నమ్మడం
చేసినారు. అంటే వీరి సాధనలో ఒకటి సత్యము గాను మరొకటి అసత్యముగానే ఉన్నది.
అదే మా సాధనలో అయితే రెండూ లేవు. ఏమి లేవు. ఏది సత్యం కాదు. ఏది అసత్యం కాదు.
ఇదంతా కలలాంటి నిజం. నిజం లాంటి కల. జీవితమే అసత్యం అని తెలుసుకోవడమే జీవిత సత్యం
అని మా సంకల్ప సాధన మొదలైనది. దానితో సర్వం శూన్యము. సర్వం ఏమీ లేదు అన్నప్పుడు మా
దృష్టిలో జగత్తు బ్రహ్మము లేదు కదా. అమ్మ లేదు. అమ్మవారు లేదు .ఏమి లేదు
అన్నప్పుడు మాయ కూడా లేనట్లే కదా. యద్భావం తద్భవతి అన్నమాట. మిగిలిన వారు అంతా ఏదో
ఒకటి ఉన్నది అని అనుకుంటే మేమిద్దరము ఏమీ లేదు అని అనుకోవడం జరిగినది అన్నమాట.
దానితో మాకు విశ్వకల ప్రపంచంలోనికి ప్రవేశించే అర్హత యోగ్యత లభించినాయి.కాకపోతే
ఆది జన్మలోనే ఆదియుగంలోనే మేమిద్దరం ఈ విషయాలు తెలుసుకోవడం జరిగినది. కానీ అప్పుడు
మాకు ఉన్న జ్ఞాన అహంకారము వలన నేను అపస్మారక స్థితి పొందితే తను తెలుసుకున్న
ఆదియోగము సత్యాలు నిజమా అవునా కాదా అనే మీమాంస భయము వలన మా జిజ్ఞాసికి నాకు
ఆదిలోనే ఆది జన్మలోనే అపస్మారక స్థితి పొందటంతో మేము తెలుసుకునే జ్ఞాన సత్యాలు
మర్చిపోవడం జరిగినది. తిరిగి మూడు కోట్ల 12 లక్షలు 372 సాధన జన్మల తర్వాత ఇప్పుడున్న ప్రస్తుత
సాధన జన్మలో తిరిగి మా యోగనిద్ర సాధన అభ్యాసం ద్వారా 144 మంది
మూలపురుషులు సహకారాల వలన మేము మర్చిపోయిన జ్ఞాన విషయాలను తిరిగి మా సాధన శరీరాల
ద్వారా తెలుసుకుని ఆదిలో నేను కృష్ణబిలం గా మారితే అప్పుడు పొందిన అపస్మారక స్థితి
వలన ఈ బిలం తిరగలేదు.ఈ జన్మలో తిరిగి జ్ఞాన స్పురణ పొందటంతో మోక్ష కృష్ణ బిలం
సుడులు తిరగడం ఆరంభించింది. దానితో ఈ బిలము ఈ విశ్వం లో ఎక్కడ ఉందో సూచికగా మన
జిజ్ఞాసి కాస్తా శూన్యబ్రహ్మయైన ధ్రువతారగా మారి ఈ బిల మార్గానికి అనగా మోక్ష
మార్గానికి అదే శాశ్వత మార్గానికి దారి చూపించే నావికుడయ్యాడు.
ఇలా ఈ విశ్వములో ఉన్న కోటాను కోట్ల కల ప్రపంచములు నెమ్మది నెమ్మదిగా నా మోక్ష
కృష్ణ బిలం నందు ప్రవేశించడం ఆరంభమైనది.0.01% పర్సెంట్ నాశనం అవ్వడానికి అనగా కృష్ణ బిలంలోని న్యూట్రాన్ ల యొక్క కాంతి
కాస్త కాంతిహీనంగా అవ్వడానికి సుమారుగా పది లక్షల 11 మిలియన్ల
కోట్ల సంవత్సరాలు పడుతుందని గ్రహించాము. కాకపోతే ఈ సంవత్సరం 2019 జూలై 16 పౌర్ణమి నుండి ఈ కృష్ణబిలం అంతరించడానికి
నాంది అయినది. అంతమే ఆరంభం అయినది. మర్చిపోయిన విషయాన్ని ఙ్ఞప్తికి తెచ్చుకొని
జ్ఞాపకంగా మిగిలిపోయింది.
అంటే 118 సినిమాలోని అమ్మాయిని
చంపుతున్నప్పుడు నన్ను మీరు చంపవచ్చు గానీ నేను తెలుసుకున్న రహస్యము లోకానికి
తెలియ చేయాలనే నా ఆలోచన నా సంకల్పము మీరు నాశనం చేయలేరు. దానిని అందుకునే వాళ్ళు
ఎప్పుడైనా ఎవరైనా వస్తారు. అప్పుడు నిజము బయటపడక తప్పదని ఆమె చనిపోవడం జరుగుతుంది.
అచ్చంగా ఇలాగే విశ్వసృష్టికి ఆదియోగి అయినా సదాశివుడు కూడా తను మరణించే విషయం
లోకానికి తెలియజేయాలని ఆలోచనలతో చనిపోవడం జరిగినది. దానితో ఈయన కాస్త 36 కపాలధారి అస్థిపంజరంగా మిగిలిపోయినాడు. ఈ ఆలోచన జ్ఞానం ఆదిశక్తి అయినా
సదాశివాని తన సాధన ద్వారా తెలుసుకుని ఆయనే లేనప్పుడు తాను ఉండటం అర్ధము లేదని
శరీరత్యాగం చేసినది. అప్పటికే ఈ ఆదిదంపతుల వలన ఆదివిష్ణు ఆదిలక్ష్మి జననాలు
జరిగినాయి. తమ మాతృపితృమూర్తులు పరమపదించిన విషయము వీళ్ళు తెలుసుకుని లోకానికి ఈ
విషయం అందకుండా ఎన్నో రకాల మంత్రాలు మాయలు పెట్టి దాచి పెట్టి గుప్తముగా ఉంచి
బ్రహ్మముడిగా ఉంచినారు.యధావిధిగా లక్ష్మీనారాయణులు విశ్వసృష్టి దేవతలుగా
కొనసాగిస్తూ వచ్చారు. అంటే ఆదిదంపతులు అస్థిపంజరాలు సదాశివమూర్తి అస్థిపంజరమును
బ్రహ్మరంధ్రము వద్ద గుహ యందు ఉంచితే అమ్మవారి శరీర త్యాగం వలన మూల కపాలముగా
ఏర్పడితే దానిని బ్రహ్మరంధ్రము ప్రధాన ద్వారం వద్ద ఉంచడం జరిగినది. అందుకే
సాధకునికి సాధనలో ఎప్పుడైతే హృదయ చక్రమును దాటి బ్రహ్మ నాడి ద్వారా బ్రహ్మరంధ్రము
చేరుకున్నప్పుడు అక్కడ మనకి మూల ఏక కపాలము దర్శనమవుతుంది. ఇందు లోనికి ప్రవేశిస్తే
కానీ ఆదిపరాశక్తి దర్శనమవుతుంది. అటువైపు దీప దుర్గ దీప కాళికా దేవి దీప చండీ
మాతలు దర్శనం అవుతారు. ఇక్కడ విష్ణుమాయ ఉంటుంది. 36కపాలాలున్న
సదాశివమూర్తి స్వరూపమును దీప కాళిక యందు మాత్రమే ఉంచడం జరిగినది. ఎవరైనా పొరపాటున
దీప దుర్గ దగ్గరికి వెళితే సాధకుడు తిరిగి పునఃసృష్టి చేయబడతాడు. అదే దీప చండీమాత
దగ్గరికి వెళితే సాధకుడికి తిరిగి పునఃకర్మ ఏర్పడుతుంది. ఎందుకంటే ఆమె ఆరాధన వలన
రాజ్యాధికారము కలుగుతుంది.అనగా పునఃకర్మ ప్రదాత అన్నమాట.
కాబట్టి ఉగ్ర స్వరూపమైన దీప కాళిక మాత అనుగ్రహమును సాధకుడు పొందవలసి ఉంటుంది.
అప్పుడే 36 కపాలధారి సదాశివమూర్తి దర్శనము మనకి
లభించదు. అటుపై ఈయనికి ఉన్న 36 కపాలాలలో 11, 9, 7, 5,
3, 1 వరుసలలో ఏక కపాల స్థితికి చేరుకుంటే దీనికున్న బ్రహ్మరంధ్రంలో
అతి చిన్నదైన సుడులు తిరుగుతున్న బ్రహ్మాండ చక్ర కృష్ణ బిలము దర్శనం మనకి
లభిస్తుంది. ఇందులో సాధకుడి పంచ శరీరాలను దగ్దం చేసుకుంటే సాధన పరిసమాప్తి
అవుతుంది. అనగా ఆది దంపతులు వలే మనము కూడా అంతమయ్యి పరమశూన్యమునందు లీనం అవుతాము. నిజానికి
ఇదంతా కూడా మనం కల ప్రపంచంలోనే సాధన చేయవలసి ఉంటుంది. సాధకుడు యోగనిద్ర ద్వారా తమ
సూక్ష్మశరీరమును తన లోపల ఉన్న బ్రహ్మాండ చక్ర కృష్ణ బిలము దాకా వెళ్ళవలసి ఉంటుందని
గ్రహించండి. ఆది యోగి అయిన సదాశివమూర్తి అయిన నేను అనేది చనిపోయిన విషయమును దైవ
ధ్యాన అనుభవం ద్వారా మాయా స్వరూపమైన స్థూల శరీరము తెలుసుకుంటే సాధన పరిసమాప్తి
అయినట్లు అన్నమాట. అంటే ఒక రకంగా మనము చనిపోయిన విషయమును ఇప్పటికి మన స్థూల శరీరం
గ్రహించడం లేదు. ఎందుకంటే అది జీవమాయలో ఉంది. తాను బతికే ఉన్నానని భ్రమ భ్రాంతిలో
ఉంది. తను చనిపోయానని తను చనిపోతూ చేసుకున్న ఆలోచనే ఈ విశ్వ సృష్టి కలయని మన స్థూల
శరీరానికి తెలియటం లేదు. మనం మరణించినట్లుగా మనకే తెలియదు కదా. మనలో శ్వాస
ఆగిపోయినట్లుగా ప్రాణశక్తి పోయినట్లుగా మనము చనిపోతున్నప్పుడు మనకు తెలియదు కదా. ఈ
విజ్ఞానం లోకానికి చెప్పాలని ఆదిపురుషుడైన సదాశివమూర్తి తను చనిపోయిన విషయం
లోకానికి అందించాలని ఆలోచన చేసినాడు. దానితో అసత్యంగా కనిపించే ఈ సృష్టి కాస్తా
సత్యంగా కనపడటం ఆరంభమైనది. ఈ ఆది ఆలోచన మనము ఏర్పడటానికి మూల కారణమైనది. ఇది
తెలుసుకున్న వాళ్లు మోక్షప్రాప్తి పొందితే ఇది తెలుసుకోవటానికి ప్రయత్నిస్తూ అవి
చూపించే మాయలు ఆశలు భయాలు ఆనందాలు ఆలోచనలు సంకల్పాలు స్పందన కి గురి అయి
అర్ధాంతరంగా ఆపివేసి ముక్తిని పొందుతున్నారు. అంటే ఇవి చూపించే మాయలో పడని వాడు
మాయా రహితుడిగా మోక్షగామి అయితే వీటి మాయలో పడిన వాడు మాయా సహితుడై ముక్తి జీవి
అవుతున్నాడు.
అసలు ఈ విషయం తెలుసుకోవాలని ప్రయత్నించని వాడు మహామాయ భోగిగా మారుతున్నాడు.
తాను ఏదో విషయజ్ఞానం అందుకోవాలని ఆలోచనతో సాధన చేసిన వాడు యోగి అవుతున్నాడు
అన్నమాట. అంటే నిజానికి సాధన అనేది మన కల ప్రపంచంలోనికి ఆది జన్మ దాకా వెళ్లడం
అన్నమాట. అనగా మూలాధార చక్రము నుండి విశుద్ధ చక్రము ద్వారా ఈ విశ్వ సృష్టికి
ఆధారమైన మహా పంచభూతాల మాయలు సాధనా శక్తులు ఉంటాయి. వీటిని సాధకుడు తన కల ప్రపంచంలో
సూక్ష్మ శరీరంతో దాటవలసి ఉంటుంది. అలాగే ఆజ్ఞా చక్రం వద్ద కనిపించే
దైవసాక్షాత్కారం అనేది ఆది జన్మలో పూజించిన దైవమని గ్రహించాలి. అలాగే సహస్రార
చక్రము వద్ద కనిపించే ఆత్మసాక్షాత్కారం అనేది ఆది జన్మ ఏమిటో తెలుసుకోవచ్చును
అన్నమాట. అలాగే హృదయ చక్రం వద్ద ఈ ఆది జన్మఏర్పడటానికి మన మూల కారణమైన కోరిక ఏమిటో
తెలుసుకోవటం అన్నమాట. ఇక బ్రహ్మరంధ్రం వద్ద కనిపించే బ్రహ్మాండ చక్రంలో ఆదిలో
అప్పటికే తను చనిపోయిన జ్ఞాన స్పురణను పొందటం జరుగుతుంది. ఆదిలోనే చనిపోయిన విషయం
లోకానికి తెలియకుండా ఇన్నాళ్ళు మాయా స్వరూపాలు అయిన విష్ణు, దేవి మాయలు జాగ్రత్తగా మరుగున పరిచినాయి. ఇదంతా గూడ మీరు మీ
యోగసాధనలో యోగనిద్ర సాధనలో ధ్యాన అనుభవాలు పొందుతూ తెలుసుకుంటారు. ఒక రకంగా
చెప్పాలంటే మీరు యోగనిద్ర సాధన అనే పేరుతో నిద్రపోతూ అసలు మీకు సంబంధించిన కల
ఆదిలో ఏమి జరిగిందో మీ సూక్ష్మ శరీర యానంతో తెలుసుకోవడం యోగసాధన అవుతుంది. సాధకుడు
యోగనిద్ర పొందిన సమాధి స్థితిని పొందిన కూడా నిద్రలోనే కలలోని తన సూక్ష్మ శరీర
యానం ద్వారా దైవ అనుభవాలు పొందక తప్పదు అని గ్రహించండి.భోగ నిద్రలో జరగబోయే
సంఘటనలు తెలిస్తే అదే యోగనిద్రలో అసలు ఏమి జరిగిందో తెలుస్తుంది. మీ కల
ప్రపంచములోనికి మీ సూక్ష్మ శరీర యానం చేసినప్పుడు అప్పుడు కనిపించే ధ్యాన
దృశ్యాలకు మీరు భయపడిన బాధ పడిన ఆలోచనలో పడిన వాటికి స్పందించిన వాటిని చూసి
సంకల్పించుకున్న వాటిని చూసి ఆనందపడిన మీకు మీరే మాయలో పడటం జరుగుతుంది. ఉదాహరణకు
మీరు గత జన్మలో పంది అని తెలిస్తే తట్టుకోవాలి. బాధపడకూడదు. అదే గత జన్మలో మీరు
దేవుడు అని తెలిస్తే ఆనంద పడకూడదు. ఎందుకంటే నేనే దేవుడు అనే అహం ఈ జన్మలో మీకు
మొదలవుతుంది. అదే గత జన్మలో మీరు తాంత్రిక యోగులైన కాపాలికులు లేదా అఘోరులని
తెలిసినా భయపడకూడదు. అదే గత జన్మలలో మిమ్మల్ని ఎవరైనా చంపినట్టుగా కనపడితే దానిని
చూసి మీరు స్పందించి వారిని ఎలాగైనా చంపాలని అనుకోకూడదు. అదే గత జన్మలో మీకు
ఎవరైనా హాని చేసినట్లుగా కనబడితే దానిని చూసి వారిని చంపాలని సంకల్పాలు చేయకూడదు.
ఎందుకంటే ఇదంతా గత జన్మలో జరిగిపోయిన రికార్డు దృశ్యాలు కల అని తెలుసుకోవాలి.
ఒకవేళ మీరు గత జన్మలో ఏవైనా చూసిన వాటికి స్పందించిన పై పనులకు స్పందనలు
చేస్తే దానికి తగ్గట్లుగా బహుశా ఈ జన్మలో మరి కొత్తవి ఏర్పడతాయని గ్రహించండి.
అందుకే సాధకుడికి సమదృష్టి సమదర్శిని తత్వ దర్శనం తత్వమసి మనోధైర్యం అచంచల భక్తి
విశ్వాసాలు శరణాగతి త్యాగము క్షమ ఇలా మనకు 18 రకాల దైవిక లక్షణాలు ఉండాలి అని చెప్పడం జరిగింది. కారణము సాధకుడు
ఎప్పుడైతే తన యోగ సాధనను అనగా తన కల ప్రపంచంలోనికి అడుగు పెడతాడో వాడి గత జన్మ
వివరాలు తెలుసుకోవడం ఆరంభము అయినట్లు అన్నమాట. అంటే ఆయా జన్మలలో ఆయా సమయాలలో
జరిగిన రికార్డ్ దృశ్యాలను చూసిన సాధకుడు చలించకుండా భయపడకుండా ఉండాలని
మనోధైర్యంతో ఉండాలని చెప్పడం జరిగినది. అలాగే తన గత జన్మలలో జంతువు జన్మల దృశ్యాలు
వచ్చినప్పుడు అవి కూడా మనలాంటి ప్రాణులే కదా అనే దృష్టితో చూడాలని సమదృష్టి లక్షణము
చెప్పడం జరిగినది. అలాగే గత జన్మలో మనం వివిధ రకాల మతాలు ఆచార వ్యవహారాలు
సంప్రదాయాలు వ్యక్తులుగా కనపడితే అందరూ కూడా సమానం అని తెలుసుకోవడమే సమదర్శి
లక్షణం ఉండాలని చెప్పడం జరిగినది. గత జన్మ లో ఎవరైనా మీకు హాని చేసిన వ్యక్తులు
కనబడితే వారిని చూసి క్షమించాలని క్షమాగుణము కలిగి ఉండాలని చెప్పడం జరిగినది. ఇలా
ప్రతి సాధకుడికి 18 లక్షణాలు ఉంటే వారి కల ప్రపంచములోని
దృశ్యాలను చూసి భయపడడు బాధపడడు ఆనందపడడు. ఇదియే స్థితప్రజ్ఞత తత్వమసి అద్వైత
స్థితి అన్నమాట. ఇదియే బ్రహ్మ తదాకార స్థితి.అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆది జన్మలో
మనం రాసుకున్న జీవిత డైరీని ఈ జన్మలో చదవటమే యోగసాధన అన్నమాట. చదువుతున్నప్పుడు
స్పందించకుండా బ్రహ్మ తదాకార స్థితిలో నిశ్చలముగా సాక్షి భూతంగా మౌనంగా ఉండడమే
యోగసాధన పరిసమాప్తి అన్నమాట. అదియే మోక్షం. తన జీవితమును చదువుతూ సగంలో ఆపేసిన
వాడు పొందేది ముక్తి అవుతుంది. అసలు అతని జీవిత డైరీ చదవాలని తెలియని వాడు భోగి
అయితే చదవాలని అనుకునే వాడు యోగి అవుతాడు. ఇంతకంటే మీకు ఇంకా సులువుగా చెప్పాలి
అంటే యోగ సాధన అంటే ఏమిటో తెలుసుకోవాలి.