Translate

Thursday, April 15, 2021

Spiritual Gurus - Terminology - గురువు- పరిభాష

 

  • ఆచార్య - గురువు (ఏ రంగంలోనైనా, ఆధ్యాత్మికత అవసరం లేదు). ఉదాహరణ: అర్జునుడి గురువు ధ్రోణాచార్య .
  • శంకరాచార్యులు - శ్రీ ఆది శంకర్చార్యులు స్థాపించిన ఆశ్రమాల సన్యాసి. ఉదాహరణ: చంద్రశేఖరేంద్ర సరస్వతి.
  • గాడ్మాన్ - దేవుడు గ్రహించిన సాధువు, లేదా అవతారం, అనగా దేవుడు అని నమ్ముతారు. (ఇది సాధారణంగా ప్రతికూల పదంగా ఉపయోగించబడుతుంది, అందువల్ల నాకు ఉదాహరణలు లేవు).
  • గురు - ఆధ్యాత్మిక గురువు లేదా ఆధ్యాత్మిక గురువు. ఉదాహరణ: శ్రీ యుక్తేశ్వర్ గిరి స్వామి స్వామి పరమహంస యోగానంద గురువు.
  • జగద్గురు - ప్రపంచం మొత్తానికి ఆధ్యాత్మిక గురువు. అంటే ఆయన తన బోధను అందరికీ ఉచితంగా పంపిణీ చేస్తాడు, ఆయన బోధలను స్వీకరించడానికి ఎవరూ దీక్ష పొందవలసిన అవసరం లేదు! ఉదాహరణ: శ్రీ కృష్ణ ఎవరి భగవద్గీత అందరికీ అందుబాటులో ఉంది.
  • మహర్షి - గొప్ప ఋషి. ఉదాహరణ: మహర్షి వ్యాస , దీని గొప్పతనానికి వివరణ అవసరం లేదు.
  • పండిట్ - నేర్చుకున్న వ్యక్తి.
  • పరమహంస - దేవుడు గ్రహించిన సుప్రీం సెయింట్. అతను మూడు గుణాలను మించిపోయాడు. ఉదాహరణ: శ్రీ రామకృష్ణ పరమహంస .
  • పరమగురు - గురువుల గురువు. ఉదాహరణ: ఆది శంకరాచార్యులు అన్ని శంకరాచార్యులకు పరమ గురువు.
  • రాజర్షి  - రాజుతో పాటు గొప్ప ఋషి అయిన గొప్ప ఋషి . ఉదాహరణ: విశ్వమిత్ర.
  • రిషి - గొప్ప ఋషి. ఉదాహరణ: అగస్త్య.
  • సాధన - ఆధ్యాత్మిక ఆకాంక్ష. ఉదాహరణ: మీరు మరియు నేను.
  • సెయింట్ - పవిత్రమైన మనిషి. ఉదాహరణ: చాలా మంది సాధువులు ఉన్నారు.
  • సన్యాసా - పునర్నిర్మాణం లేదా సన్యాసి. ఉదాహరణ: శంకరాచార్యులు.
  • సత్గురు - భగవంతుడే మానవుడిగా వస్తాడు, మానవ రూపంలో ఈశ్వరుడు సత్గురుడు. ఉదాహరణ: శ్రీ కృష్ణ.
  • స్వామి - శంకరాచార్యులు స్థాపించిన స్వామి క్రమం యొక్క సన్యాసి. (ఇతరులు కూడా దీనిని ఉపయోగిస్తారని నేను నమ్ముతున్నాను)
  • యోగి - యోగా సాధన మరియు యోగ సూత్రాల ద్వారా సాక్షాత్కారం సాధించే మానవుడు. ఉదాహరణ: క్రియా యోగులు.

ప్రస్తావనలు:

[a]: ఒక యోగి యొక్క ఆత్మకథ, పరమహంస యోగానంద, అధ్యాయం 1, ఫుట్‌నోట్ 3.

[బి]: ఓం ఖేరా రాసిన 'పునర్జన్మ ఐచ్ఛికం' ప్రకారం సత్గురు దేవుడు మనిషిలో వ్యక్తమవుతాడు

Tuesday, April 13, 2021

Sri Hanuman Badabanala Stotram in Telugu Lyrics (శ్రీ హనుమాన్ బడబానల స్తోత్రం)

 

శ్రీ హనుమాన్ బడబానల స్తోత్రం



ఓం అస్య శ్రీ హనుమద్బడబానల స్తోత్ర మంత్రస్య శ్రీ రామచంద్ర ఋషిః శ్రీ బడబానల హనుమాన్ దేవతా మమ సమస్త రోగ ప్రశమనార్ధం ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృధ్యర్ధం సమస్త పాపక్షయార్ధం శ్రీ సీతా రామచంద్ర ప్రీత్యర్ధం హనుమద్భడబానల స్తోత్ర జప మహం కరిష్యే ||

ఓం హ్రాం హ్రీం ఓం నమోభగవతే శ్రీ మహా హనుమతే ప్రకట పరాక్రమ సకల దిక్మండల యశోవితాన ధవళీ కృత, జగత్రిత్రయ వజ్రదేహ, రుద్రావతార, లంకాపురి దహన, ఉమాఅనలమంత్ర, ఉదధి బంధన, దశశిరః కృతాంతక, సీతాశ్వాసన, వాయుపుత్ర, అంజనీ గర్బసంభూత, శ్రీ రామ లక్ష్మణానందకర, కపిసైన్య ప్రాకార, సుగ్రీవసాహా య్యకరణ, పర్వతోత్పాటన, కుమార బ్రహ్మ చారిన్, గంభీరనాథ సర్వపాప గ్రహవారణ, సర్వ జ్వరోచ్చాటన డాకినీ విద్వంసన ||

ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే మహా వీరాయ, సర్వ దుఃఖనివారణాయ, గ్రహమండల, భూత మండల, సర్వ పిశాచ మండలోచ్చాటన భూత జ్వరై, కాహిక జ్వర, ద్వాహిక జ్వర, త్రాహిక జ్వర, చాతుర్ధిక జ్వర, సంతాప జ్వర, విషమ జ్వర, తాప జ్వర, మహేశ్వర వైష్ణవ జ్వరాన్ చింది చింది, యక్ష రాక్షస భూత ప్రేత పిశాచాన్ ఉచ్చాటయ ఉచ్చాటయ, ఓం హ్రాం హ్రీం నమో భగవతే శ్రీ మహా హనుమతే ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రః ఆం హాం హాం హాం హాం ఔం సౌం ఏహి ఏహి, ఓం హం, ఓం హం, ఓం హం, ఓం నమో భగవతే శ్రీ మహా హనుమతే, శ్రవణ చక్షుర్భూతానం, శాకినీ డాకినీ విషమ దుష్టానాం, సర్వ విషం హర హర, ఆకాశం భువనం, భేదయ భేదయ, ఛేదయ ఛేదయ, మారయ మారయ, శోషయ శోషయ, మోహయ మోహయ, జ్వాలాయ జ్వాలాయ, ప్రహారయ ప్రహారయ, సకల మాయాం, భేదయ భేదయ, ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే శ్రీ మహా హనుమతే సర్వగ్రహో చ్చాటన పరబలం, క్షోభయ క్షోభయ, సకల బంధన మోక్షణం కురు, శిరఃశూల, గుల్ప్హశూల, సర్వశూల నిర్మూలయ నిర్మూలయ, నాగపాశానంత వాసుకి తక్షక కర్కోటక కాళియాన్ యక్షకుల, జలగత బిలగత, రాత్రిమ్చర దివాచర సర్వాన్నిర్విషం కురు కురు స్వాహా, రాజభయ చోరభయ పరయంత్ర పరమంత్ర పరతంత్ర పరవిధ్యాచ్చేదయ చేదయ, స్వమంత్ర స్వయంత్ర స్వవిద్యాః, ప్రకటయ ప్రకటయ సర్వారిష్టాన్నాశయ నాశయ, సర్వశత్రూన్నాశయ నాశయ, అసాధ్యం సాదయ సాదయ హుం ఫట్ స్వాహా ||

Sunday, April 11, 2021

సత్కర్మ బిచ్చ సత్ఫలితం...-ఏ కన్ను చూడదనా telugu lyrics

 

https://www.youtube.com/watch?v=TjCWHx5dgfw

సత్కర్మ బిచ్చ సత్ఫలితం...


సత్కర్మ బిచ్చ సత్ఫలితం...దుష్కర్మ ఏవ దుష్ఫలం

అచ్యుత్కట పుణ్య పాపాణాం ..సత్యం పరాణి ..భవ మిహం


*ఈ చోటి కర్మ ఈ చోటే..ఈ నాటి కర్మ మారునాడే

అనుభవించి తీరాలంతే..ఈ సృష్టి నియమం ఇదే....


ఎన్ని కన్నీళ్ల ఉసురుది

వెంటాడుతున్నది నీడల్లే కర్మ 

ధర్మమే నీ పాలిట దండమై...

దండించ తప్పించుకోలేదు జన్మ...


సత్కర్మ బిచ్చ సత్ఫలితం...దుష్కర్మ ఏవ దుష్ఫలం

అచ్యుత్కట పుణ్య పాపాణాం ..సత్యం పరాణి ..భవ మిహం


*పాపం ,పుణ్యం,

రెండింటికి నీదే పూచి

కన్ను తెరచి అడుగు వేయి ఆచి ,తూచి


*ఈ చోటి కర్మ ఈ చోటే..ఈ నాటి కర్మ మారునాడే

అనుభవించి తీరాలంతే..ఈ సృష్టి నియమం ఇదే...


ఏ కన్ను చూడదనా..నీ విచ్చల విడి మిడిసిపాటు...

ఏ చేయి ఆపదనా..తప్పటడుగుల నీ అలవాటు...

అదృశ్య సృష్టి గా సకల సృష్టి..గమనిస్తున్నది లెక్కగట్టి....


" ఎంత బ్రతుకు ..నీదెంత బ్రతుకు

ఓ గుప్పెడు మెతుకు కొరకు... ఇన్నాటలు, వేటలు అవసరమా...!


మనుజా...మనుజా

ఏమారితే నిను కబళిస్తుంది రా..మాయదారి పంజా...

కోరి కొని తెచ్చుకోమాకు కర్మ..దాన్ని విడిపించుకోలేదు జన్మ.....!!!!


సత్కర్మ బిచ్చ సత్ఫలితం...దుష్కర్మ ఏవ దుష్ఫలం

అచ్యుత్కట పుణ్య పాపాణాం ..సత్యం పరాణి ..భవ మిహం


*ఈ చోటి కర్మ ఈ చోటే..ఈ నాటి కర్మ మారునాడే

అనుభవించి తీరాలంతే..ఈ సృష్టి నియమం ఇదే.... 

Diksoochi Song Telugu Lyrics (హర హార శంకర శ్రీఖర సన్నుతి )

https://www.youtube.com/watch?v=LlxABX7AUO0


హర హార శంకర శ్రీఖర సన్నుతి.. మనిషికి జీవన దిక్సూచీ ..

హార హర లయకర దమరుక రవక్రూతి..మరుమరు జన్మకు దిక్సూచీ ..

మట్టిలోనా మట్టీరా దేహమన్నదీ.

  

వీర్యపు కణ మై కడుపున పడుతు.  ..నెల నెల యెదిగి న ఓ శిశువా ..

తనువే తొడిగి భువిలో పడుతు...తెలియని పుట్టు క నీది కదా.

పూర్వ జన్మాల స్ముతీని మరిచిపోయావు మానవా.

మాయ నిన్నావరించి నడక నేర్చావు మెల్లగా ..పసలేని అజ్ఞా నా విద్యలే నేర్చి గర్వపడతావురా.

ఈ రక్త మాంసాలా దేహమే చూసి మురిసిపోతావురా.

వెనువెంట వస్తున్న మ్రృత్యు పాషాన్నీ మరిచిపోబోకురా ..

సాగితే నీ సరిలేరని ఢాంభికం తెగ పలకకురా ..

పీనుగయి మారిన క్షణమున కుక్క త్తోసమమవ్వ రా ..

 

 

 

ధనమే సుఖమని బ్రమలో పడుతు. కనులే కానకా తిరిగెదవా.

తలకు మోముకు రంగాలు వేస్తు .. కాలం కన్నులు మూసెదవా ..

పోగు చెసినా లక్షలు కోట్లూ నిన్ను బ్రతికించవురా ..

నువ్వు పొందిన ఎన్నో బిరుదులు చావు తప్పీంచవురా ..

భార్య బిడ్డలు వెంట వత్తురని కలలో కూడ తలచకురా ..

వదలక నీతో వెంట వచ్చినా ఆ వల్లకాటి వరకేరా ..

నిన్ను మోసినా పల్లకి చివరకు నీ పాడే అవుతదీ ..

నువ్వు ఉండినా గృహమే చిరకరకు నిను వెల్లమంటదీ.

నిను కాల్చివేయు కట్టెలుగ ..ఓ చెట్టుకు రాసి వుంటది ..

పరిమళాలు పులుముకున్న తనువు..ఈ మన్ను కలవకా తప్పదదీ ..

పోయే ముందర కాలం పక పక ..పరిహాసమాడుటా తధ్యమది ..

 

శవం తిరిగే తెరలో శివమా...నువ్ ఎరగనీ కద నీది కదా. 

నెట్తుటి మాంసపు ముద్దగ ఎదిగిన. ..కాయమ్ కూలుట ఖాయమురా ..

 

కాబోయే శవం నీవు కదర దేహం పై మోహమ్ ఏలరా ..

ఇన్నాల్లూ సాదించింది ఏది రా, నీకోసమ్ ఏమ్ చేసావురా !!!

నాటకమల్లె గడిపేసావు కన్నులు తెరిచేదెన్నడురా ..

పెద్ద నిద్దరే చట్టుముట్టగా ..చిరికికి బూడిద కుప్పవుర ..

 

 

 

 



Saturday, April 10, 2021

🍃 యోగానికి అర్హులు 🍃

🍃  యోగానికి అర్హులు 🍃

 మనోనిగ్రహము, అంతరింద్రియ నిగ్రహము, తపస్సు, బాహ్యాభ్యంతర శుచి, ఓర్పు, కపటము లేకుండుట, శాస్త్రజ్ఞాన అనుభవము, దేవుని యందు, గురువునందు, శాస్త్రములందు విశ్వాసము. 

 మనపూర్వీక యోగుల కులమతములు: 

1. ఆదిబ్రహ్మ:- అదే ఆత్మ, సృష్టికి ఆదియైనవాడు, ఆదియందు అంతయు బీజాంకురములో ఉన్నది. 
2. ఆదిశక్తులు:- సృష్టికి మూల శక్తులు, కుల, మత, జాతి వర్ణ భేదములు లేనివారు. 
3. బ్రహ్మ:- విష్ణువు నాభి యందు పుట్టినవాడు. 
4. శ్రీకృష్ణుడు:- దేవకీదేవి గర్భమున పుట్టినవాడు. 
5. ఋష్యశృంగుడు:- లేడియందు జన్మించినవాడు. 
6. జంబుక ముని:- నక్కయందు పుట్టినవాడు. 
7. గౌతముడు:- కుందేలు నందు జన్మించినవాడు. 
8. మాండవ్యుడు:- కప్పయందు జన్మించినవాడు. 
9. సాంఖ్య ముని:- ఛండాల స్త్రీ కి జన్మించినవాడు. 
10. గార్గేయ మహాముని:- గాడిద యందు జన్మించినవాడు. 
11. శౌనక మహా ఋషి:- కుక్కయందు జన్మించినవాడు. 
12. విశ్వామిత్రుడు:- క్షత్రియుడు. 
13. వసిష్టుడు:- వేశ్యకు జన్మించినవాడు. 
14. వేదవ్యాసుడు:- సూతజాతివాడు. 
15. నారదుడు:- దాసి పుత్రుడు 
16. శ్రీ శుకులు:- అల్పజాతివాడే. శుకమైధునము చూచిన వ్యాసుని సంకల్పము వలన పుట్టినవాడు. 
17. వాల్మికి:- ఒక ఛండాలుడు18. హేతుజట:- కిరాతప్రభువు. 
19. అగస్త్యుడు:- భాండమందు జన్మించినవాడు. 
20. సత్యకాముడు:- వేశ్య, శూద్రజాతి స్త్రీ అయిన జాబాలికి జన్మించినవాడు. 
21. సంజయుడు:- సూతపుత్రుడు 
22. ధర్మవ్యాధుడు:- శూద్రుడు 
23. భరద్వాజుడు:- 'బృహస్పతి' 'మమత'ను కామించగా పుట్టినవాడు. 
24. శకుంతల:- అప్సరస మేనకకు, విశ్వామిత్రునికి జన్మించినది. 
25. బలరాముడు:- సర్పజాతివాడు. 
26. రాముడు:- క్షత్రియుడు. 
27. బుద్ధుడు:- క్షత్రియుడు. 
28. గజేంద్రుడు:- ఒక మృగము. 
29. ఆంజనేయుడు:- వానరుడు, మృగజాతి. 
30. జమదగ్ని:- బ్రాహ్మణుడు, భార్య అయిన రేణుక క్షత్రియ స్త్రీ. 
31. పరశురాముడు:- జమదగ్ని, రేణుకకు జన్మించినవాడు. 
32. భీష్ముడు:- శంతన మహారాజు, గంగా దేవికి జన్మించినవాడు. 
33. కర్ణుడు:- సూర్యుని వలన కుంతికి జన్మించినవాడు. 
34. సుభద్ర:- క్షత్రియుడైన అర్జునుని వివాహమాడెను. 
35. బృహస్పతి:- అంగీరసుని కుమారుడు. దేవగురువు.36. ప్రహ్లాదుడు:- అసురరాజు. 
37. శబరి:- భిల్లజాతి మహిళ. 
38. కుబేరుడు:- యక్ష రాక్షస రాజు. రావణ, కుంభకర్ణులకు సవతి సోదరుడు. 
39. భక్తకన్నప్ప:- వనవాసుడు, బోయవాడు. 
40. భగీరుడు:- కోసల రాజు. 
41. శిఖిద్వజుడు:- ఒక రాజర్షి 
42. విరాట్‌ పోతులూరి వీరబ్రహ్మం:- ఒక కంసాలి. 
43. శిద్ధయ్య:- దూదేకులవాడు. 
44. శుక్రాచార్యులు:- అసుర గురువు. 
45. రంతిదేవుడు:- రాజుకుమారుడు 
46. బిళ్వమంగళుడు:- బ్రాహ్మణుడు, దురాచారుడు, వేశ్యాలోలుడు. 
47. నిషాదుడు:- నిషాద జాతివాడు. శ్రీరామునికి ఆతిధ్యమిచ్చినవాడు. 
48. కార్తికేయుడు:- శివుని కుమారుడు. 
49. సూర్యుడు:- కశ్యబ్రహ్మకు పుట్టినవాడు. 
50. చంద్రుడు:- అత్రిమహామునికి పుట్టినవాడు. 

ఈ విధముగా అల్పజాతికి చెందినవారు, శూద్రులు, వైశ్యులు, క్షత్రియులు, కర్మాచరణచే శ్రేష్ఠత్వమును పొందిరి. పాపులు కూడా కర్మల ద్వారా పుణ్యత్వమును పొందిరి. ఈ విధముగా పరిశోధించి చూడగా కుల, మత, వర్ణ భేదములు సృష్ఠిరీత్య లేవని తెలియచున్నవి. ఇట్టి కుల, మత, జాతి భేదములు కేవలము మిథ్యావాదుల విరుద్ధవాదనలు మాత్రమేనని గ్రహించవలెను. కావున వర్ణములు అనిత్యము. ఆత్మయైన సచ్చిదానంద స్వరూపమే సత్యము. 

🌹సర్వయోగ సమన్వయము🌹
🌹 🌹 🌹 🌹 🌹

పదనాలుగు లోకాలు

పదనాలుగు లోకాలు 




మొదటి మూడు లోకాల్లోను అంటే భూలోకం , భువర్లోకం, సువర్లోకాలను " కృతక లోకాలు " అంటారు. జీవులు తాము చేసుకొన్న కర్మఫలాన్ని బట్టి ఈ మూడు లొకాల్లొను ఉంటారు.
 
 నాల్గొవదైన మహర్లోకం 
కల్పాన్తములో కూడా నశించదు. ఈ లొకంలొ కల్పాంత జీవులు ఉంటారు.

 అయిదోవది అయిన జనలోకంలొ 
బ్రహ్మ దేవుని మానస పుత్రులైన సనక సనందన సనత్కుమారాదులు నివసిస్తారు.

 ఆరొవదైన తపోలోకంలో 
దోష వర్జితులు , దేహ రహితులు అయిన వైరాజులనే వారు ఉంటారు.

 ఏడో లొకం మరియు ఊర్ధ్వ లోకములలో ఆఖరది అయిన సత్యలోకం మరణ దర్మం లేని పుణ్య లొకం.
ఇందులొ సిద్ధాది మునులు నివసిస్తారు.

 ఎనిమిదొవ లోకం అయిన అతలంలో మయదానవుని సంతతికి చెందిన అసురులు నివశిస్తారు.

 తొమ్మిదొవది అయిన వితలం లొ హోటకేస్వరుడు మరియు ఆయన పరివారం ఉంటారు.

 పదోవది అయిన సుతలం లొ బలిచక్రవర్తి , అతని అనుయాయులు నివశిస్తూ ఉంటారు.

 పదకొండవధి అయిన తలాతలం లొ త్రిపురాధిపతి అయిన యమధర్మ రాజు , మహాదేవ రక్షితుడై ఉంటాడు.

 పన్నెండో వది అయిన మహాతలం లొ 
కద్రువ సంతతి వారైన నానా శిరస్సులు గల కాద్రవేయులు ఉంటారు. వీరిలో తక్షకుడు, కాలుడు, సుషేణుడు మొదలైనవారు ఉన్నారు .

 పదమూడవధి అయిన రసాతలం లొ 
"పణి " అనబడే దైత్యులు , రాక్షసులు నివశిస్తూ ఉంటారు. నిరత కవచులు, కాలేయులు, హిరణ్య పురవాసులు వీరే .

 పదనాలుగోవ ది అయిన పాతాళ లొకం లో 
 శంఖుడు, మహాశంఖుడు, శ్వేతుడు , ధనంజయుడు, శంఖచూడుడు, కంబలుడు, ధృతరాష్ట్రుడు, అశ్వతరుడు, దేవదత్తుడు మొదలయిన సర్వజాతుల వారు నివశిస్తు ఉంటారు.
🙏🙏🙏🙏🙏

Friday, April 9, 2021

eekagrata rahsyam- ఏకాగ్రతా రహస్యం : NOtes

ఏకాగ్రతా రహస్యం :

ఏకాగ్రతే విజయరహస్యం. ఆ సంగతి తెలుసుకున్న వాళ్ళు వివేకవంతులు. కేవలం యోగులకే ఏకాగ్రత అవసరమని అనుకోవడం శుద్ధ పొరపాటు. ప్రతి ఒక్కరికి ఏకాగ్రత అత్యవసరం. ఎవరు ఏ పని చేస్తున్న ఏకాగ్రత అవసరం ఎందుకంటే ఏమరపాటుగా ఉంటే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంటుంది కాబట్టి. ఉదాహరుణకు సుత్తితో కొడుతున్నప్పుడు కమ్మరి ఏ కొద్దిగా ఏమరపాటుగా ఉన్నా, అతని చేతి మీద సుత్తి దెబ్బ పడే ప్రమాదం ఉంది, అదే విధంగా ప్రతి ఒక్కరికి వారి వారి పనివ్రుత్తులలో మరియు విద్యార్థుల చదువు విషయంలో అన్నిట్లో ఏకాగ్రత అందరికి అవసరం. కాబట్టి అందరూ ఎంతో అప్రమత్తంగా, తమ మనస్సును అదుపులో పెట్టుకొంటూ పని చేస్తుంటారు. దీనిని బట్టి చూస్తే అందరూ నిరంతరం వారి మనస్సును ప్రయత్నం ద్వార ఏకాగ్రతను సాధిస్తున్నారని మనకు అర్ధమవుతుంది.

భగవద్గీతలో అర్జునుడి ప్రశ్నకు సైతం భగవాన్ శ్రీకృష్ణుల వారు చెప్పిన సమాధానం :
అర్జునుడు : కృష్ణా! మనసు ఎంతో చంచలమైనది. అది నిరంతరం అవిశ్రాంతితో చరిస్తూ ఉంటుంది. అదే సమయంలో మనస్సు శక్తివంతమైనది కూడ! దానిని నియంత్రణలో ఉంచడం అంటే గాలిని పట్టి బందించడం లాంటిదే! మరి అలాంటి మనసును నియంత్రణలోకి తీసుకురావడం ఎలా?
శ్రీకృష్ణుడు : అర్జునా! నువ్వు చెబుతున్నది నిజమే. మనస్సు చంచలమైనది. దాన్ని నియంత్రించడం అంతా సులభమైన పని కాదన్నది నిజమే! అయితే అంతటి చంచలమైన మనసును సైతం నిరంతర సాధన ,అంటీ ముట్టని ధోరణి అనే బలం ద్వారా నియంత్రణలోకి తీసుకురావచ్చన్నది అంతే నిజం.

మనస్సును నియంత్రణలోకి తీసుకురావడానికి అన్నిటికన్నా ముఖ్యంగా, మొట్టమొదట ఓ విషయం తెలుసుకోవాలి. తాము పోరాడదలచిన మనస్సు స్వభావాన్ని స్పష్టంగా అర్ధం చేసికోవాలి. మనస్సనేది కోతి లాగ చంచలమైనది. తప్పతాగి మత్తెక్కిన ఏనుగు లాగ చాల బలమైనది. అలాంటి మనసును నియంత్రించడమనేది అర్జునుడు చెప్పినట్లుగా, గాలిని పట్టుకోవడం లాంటిదే! కోతులను పట్టుకోవడంలోను, ఏనుగులకు శిక్షణ ఇవ్వడం లోను ఎలాంటి నైపుణ్యం అవసరమో – అంతా నేర్పు మనస్సును క్రమబద్దీకరించడానికి కావాలి.

భూమి మీద ఉన్న ప్రతి ప్రాణికీ, ప్రతి వస్తువుకు ఓ విలక్షణమైన స్వభావం ఉంటుంది. ఉదాహరునకు వీయడమనేది గాలి స్వభావం. కాల్చడమనేది నిప్పు స్వభావం. పారడమనేది నీటి స్వభావం. అదే విధంగా ప్రతిదాంట్లో తల దూర్చడం, ఒక విషయం మీద నుంచి మరో విషయానికి దూకడం, విచిత్రమైన కోరికలు కోరడం, వేలాది విషయాల గురించి ఆలోచించడం, ఎన్నెన్నో సమస్యల గురించి దుఃఖించడం, గాలిలో మేడలు కట్టడం, మనకు అప్పగించిన పని గురించి కాకుండా మిగిలిన ప్రతి ఒక్క పని గురించి పట్టించుకోవడం – ఇదీ మనస్సు స్వభావం. ఇటువంటి మనస్సును నియంత్రించగలిగితే, మనం ఎంతటి ఉన్నత లక్ష్యాలనైనా సాధించ గలుగుతాం. ఎలా నింత్రించాలి? ఆ పని ఎలా చేస్తాం? మన శరీరంలోని ఐదు జ్ఞానేంద్రియాల పాత్ర ఇక్కడ వస్తుంది.

కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక మరియు చర్మం – ఈ అయిదు మనసుకు వాహనాలు. జ్ఞానేంద్రియాలన్ని మనస్సును అన్ని వైపులా లాగుతూ ఉంటాయి. కాబట్టి, వివేకాన్ని ఉపయోగించడం ద్వార ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి. ఇలా ఇంద్రియాలను అదుపులో ఉంచడాన్నే సంస్కృతంలో ‘దమం’ అంటారు. నిజానికి ,ఇంద్రియాల సహాయం లేకుండానే స్వతంత్రంగా కూడా ఇష్టమొచ్చిన చోటుకు మనస్సు పోగలదు. అలాంటి సందర్భాలలో బుద్దిని ఉపయోగించి దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకురావాలి. ఇలా తిన్నగా మనస్సును నిశ్చలంగా ఉంచే పద్ధతినే ‘శమం’ అంటారు.

మనస్సు గురించి, దాని ఏకాగ్రత గురించి ఎన్నో వివరాలు తెలిసిన తరువాత, ‘అసలింతకీ, మనసును అదుపులో పెట్టాల్సిన అవసరం ఏమిటి?’ అని కొందరు అడుగవచ్చు. దీనికి సరైన సమాధానం తెలుసుకొని తీరాలి. దానికి సరైన జవాబు ఒక్కటే: మనస్సు గనక అదుపులో ఉంటె ఉన్నత లక్ష్యాలను సైతం సాధించాగాలుగుతాం. అదే మనస్సు అదుపులో లేనట్లయితే, అత్యంత సామాన్యమైన పనులు చేయడం కూడా సాధ్యం కావు. మనస్సుకు నిజంగానే అపారమైన రాక్షస బలం ఉంటుంది.

కొందరు కొన్ని సందర్భాలలో, మరికొందరు తమ జీవిత పర్యంతము దుర్భల మనష్కులుగా కనిపిస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. వారి మానసిక శక్తులన్నీ విచక్షణారహితంగా వేర్వేరు అంశాలపైన చెల్లచెదురై పోవడం వలన వారు అలా దుర్భల మనష్కులుగా కనిపిస్తుంటారు. అగ్నిని సృష్టించే శక్తి సూర్యకిరణాలకు ఉందని అందరికీ తెలియదు. వాళ్ళకు ఎందుకు తెలియదంటారా? సూర్యకిరణాలు నిప్పును పుట్టిస్తూ, వస్తువులను కాల్చి వేస్తుండడం వారు చూసి ఉండకపోవచ్చు! కానీ అవే సూర్యకిరణాలను ఓ కుంభాకార దర్పణం గుండా పోనిచ్చి, ఓ కాగితం ముక్క మీద పడేలా చేస్తే ,వారే ఆ కాగితాన్ని కాల్చవచ్చు. మరి , ఆ కిరాణాలకు ఆ శక్తి ఎక్కడ నుంచి వచ్చింది? ఆ కిరాణాలను ఏక బిందుముఖంగా సాగేల చేసి, ఆ రకంగా వాటిని ‘ఎకాగ్రపరచడం’ వలన కలిగిన ఫలితమే ఆ కాగితం కాలడం! అంతకు ముందు, ఆ కిరణాలు వివిధ దిశల్లో చెల్లాచెదురుగా ఉన్నాయి. దాంతో, ఉష్ణాన్ని పుట్టించే శక్తి వాటికి ఉన్నప్పటికీ, అవి వేటిని కాల్చలేకపోయాయి. కానీ, వాటిని ఎకాగ్రపరచిన వెంటనే ప్రకాశవంతమైన నిప్పును పుట్టించాయి. ఈ రహస్యం మనం గ్రహించాలి.
ఇదే రకంగా, మన మనస్సుల్లో సహజసిద్దంగానే అసాధారణమైన శక్తి ఉంటుంది. అయితే, అవసరమైన, అవసరం లేని అన్ని రకాలైన అంశాల మీద ఈ శక్తిని మనం ఖర్చు చేస్తున్నాం. అందువల్లే మనం అత్యంత సాధారణమైన పనులు తప్ప మిగిలినవేవి చేయలేకపోతున్నాం. ఘనకార్యాలు సాధించాలంటే, చెల్లా చెదురుగా ఉన్న మానసిక శక్తులన్నిటిని క్రమబద్దీకరించాలి. మన మనస్సులు స్వాధీనంలో ఉన్నప్పుడే మనం ఆ పని చేయగలం.

ప్రాచీనకాలంలో మన ఋషులు నిరంతర ప్రయత్నాలతో మనస్సును తమ అదుపులోకి తెచ్చుకొని ,మానసిక సమతౌల్యాన్ని సాధించారు. అదే వారు చేసిన మొదటి పని. అలాంటి మనసును ఏకాగ్రపరిచినప్పుడు అద్భుతమైన యోగ రహస్యాలను వారు కనుగోనేలా అది (మనస్సు) చేసింది. అది వారికి దివ్య జ్ఞానాన్ని అందించింది.

స్వామి వివేకానంద చెప్పినట్లు, ఏకాగ్రతతో కూడుకున్న మనస్సు నిజంగా ఓ సెర్చి దీపం లాంటిది. దూరంగా, చీకటి మూలల్లో పడి ఉన్న వస్తువులను కూడా మనకు కనిపించేలా చేస్తుంది ఆ సెర్చి దీపం.

సరే! మనస్సును ఏకాగ్రపరచాలన్న మాట నిజమే? కానీ, దాన్నీ ఏ వస్తువు మీద ఏకాగ్రపరచాలి? మనం అందరం యోగులం అవడానికి ప్రయత్నిస్తున్నాం కావున, మనం అందరం స్వయం ప్రకాశితమైన మన ఆత్మజ్యోతి మీద మన మనస్సును ఏకాగ్రపరచాలి.

మనం ప్రతి నిత్యం సాధన చేస్తూ మన మనస్సును ఆత్మ జ్యోతి మీద ద్రుష్టి నిలిపివుంటే, పరిసరాలనే కాకుండా చివరకు తన దేహాన్ని సైతం మర్చిపోయి పూర్తిగా మునిగిపోతే, అదే ఏకాగ్రతకు కచ్చితమైన సూచన!.