🍃 యోగానికి అర్హులు 🍃
మనోనిగ్రహము, అంతరింద్రియ నిగ్రహము, తపస్సు, బాహ్యాభ్యంతర శుచి, ఓర్పు, కపటము లేకుండుట, శాస్త్రజ్ఞాన అనుభవము, దేవుని యందు, గురువునందు, శాస్త్రములందు విశ్వాసము.
మనపూర్వీక యోగుల కులమతములు:
1. ఆదిబ్రహ్మ:- అదే ఆత్మ, సృష్టికి ఆదియైనవాడు, ఆదియందు అంతయు బీజాంకురములో ఉన్నది.
2. ఆదిశక్తులు:- సృష్టికి మూల శక్తులు, కుల, మత, జాతి వర్ణ భేదములు లేనివారు.
3. బ్రహ్మ:- విష్ణువు నాభి యందు పుట్టినవాడు.
4. శ్రీకృష్ణుడు:- దేవకీదేవి గర్భమున పుట్టినవాడు.
5. ఋష్యశృంగుడు:- లేడియందు జన్మించినవాడు.
6. జంబుక ముని:- నక్కయందు పుట్టినవాడు.
7. గౌతముడు:- కుందేలు నందు జన్మించినవాడు.
8. మాండవ్యుడు:- కప్పయందు జన్మించినవాడు.
9. సాంఖ్య ముని:- ఛండాల స్త్రీ కి జన్మించినవాడు.
10. గార్గేయ మహాముని:- గాడిద యందు జన్మించినవాడు.
11. శౌనక మహా ఋషి:- కుక్కయందు జన్మించినవాడు.
12. విశ్వామిత్రుడు:- క్షత్రియుడు.
13. వసిష్టుడు:- వేశ్యకు జన్మించినవాడు.
14. వేదవ్యాసుడు:- సూతజాతివాడు.
15. నారదుడు:- దాసి పుత్రుడు
16. శ్రీ శుకులు:- అల్పజాతివాడే. శుకమైధునము చూచిన వ్యాసుని సంకల్పము వలన పుట్టినవాడు.
17. వాల్మికి:- ఒక ఛండాలుడు18. హేతుజట:- కిరాతప్రభువు.
19. అగస్త్యుడు:- భాండమందు జన్మించినవాడు.
20. సత్యకాముడు:- వేశ్య, శూద్రజాతి స్త్రీ అయిన జాబాలికి జన్మించినవాడు.
21. సంజయుడు:- సూతపుత్రుడు
22. ధర్మవ్యాధుడు:- శూద్రుడు
23. భరద్వాజుడు:- 'బృహస్పతి' 'మమత'ను కామించగా పుట్టినవాడు.
24. శకుంతల:- అప్సరస మేనకకు, విశ్వామిత్రునికి జన్మించినది.
25. బలరాముడు:- సర్పజాతివాడు.
26. రాముడు:- క్షత్రియుడు.
27. బుద్ధుడు:- క్షత్రియుడు.
28. గజేంద్రుడు:- ఒక మృగము.
29. ఆంజనేయుడు:- వానరుడు, మృగజాతి.
30. జమదగ్ని:- బ్రాహ్మణుడు, భార్య అయిన రేణుక క్షత్రియ స్త్రీ.
31. పరశురాముడు:- జమదగ్ని, రేణుకకు జన్మించినవాడు.
32. భీష్ముడు:- శంతన మహారాజు, గంగా దేవికి జన్మించినవాడు.
33. కర్ణుడు:- సూర్యుని వలన కుంతికి జన్మించినవాడు.
34. సుభద్ర:- క్షత్రియుడైన అర్జునుని వివాహమాడెను.
35. బృహస్పతి:- అంగీరసుని కుమారుడు. దేవగురువు.36. ప్రహ్లాదుడు:- అసురరాజు.
37. శబరి:- భిల్లజాతి మహిళ.
38. కుబేరుడు:- యక్ష రాక్షస రాజు. రావణ, కుంభకర్ణులకు సవతి సోదరుడు.
39. భక్తకన్నప్ప:- వనవాసుడు, బోయవాడు.
40. భగీరుడు:- కోసల రాజు.
41. శిఖిద్వజుడు:- ఒక రాజర్షి
42. విరాట్ పోతులూరి వీరబ్రహ్మం:- ఒక కంసాలి.
43. శిద్ధయ్య:- దూదేకులవాడు.
44. శుక్రాచార్యులు:- అసుర గురువు.
45. రంతిదేవుడు:- రాజుకుమారుడు
46. బిళ్వమంగళుడు:- బ్రాహ్మణుడు, దురాచారుడు, వేశ్యాలోలుడు.
47. నిషాదుడు:- నిషాద జాతివాడు. శ్రీరామునికి ఆతిధ్యమిచ్చినవాడు.
48. కార్తికేయుడు:- శివుని కుమారుడు.
49. సూర్యుడు:- కశ్యబ్రహ్మకు పుట్టినవాడు.
50. చంద్రుడు:- అత్రిమహామునికి పుట్టినవాడు.
ఈ విధముగా అల్పజాతికి చెందినవారు, శూద్రులు, వైశ్యులు, క్షత్రియులు, కర్మాచరణచే శ్రేష్ఠత్వమును పొందిరి. పాపులు కూడా కర్మల ద్వారా పుణ్యత్వమును పొందిరి. ఈ విధముగా పరిశోధించి చూడగా కుల, మత, వర్ణ భేదములు సృష్ఠిరీత్య లేవని తెలియచున్నవి. ఇట్టి కుల, మత, జాతి భేదములు కేవలము మిథ్యావాదుల విరుద్ధవాదనలు మాత్రమేనని గ్రహించవలెను. కావున వర్ణములు అనిత్యము. ఆత్మయైన సచ్చిదానంద స్వరూపమే సత్యము.
🌹సర్వయోగ సమన్వయము🌹
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment