Translate

Monday, November 29, 2021

ఓంకారం సకలకళా శ్రీకారం- Omkaaram Sakala saakram telugu song lyrics(Sankaracharya, Telugu )

 





ఓంకారం సకలకళా శ్రీకారం

చతుర్వేద సాకారం

చైతన్య సుధాపూరం

జ్ఞాన కమల కాసారం

 

ధ్యాన పరిమళాసారం

మధుర భక్తి సింధూరం

మహా భక్త మందారం

భవ భేరీ భాండారం

 

హృదయ శంఖ హుంకారం

ధర్మ ధనుష్టంకారం

జగత్ విజయ ఝంకారం

అద్వైత ప్రాకారం భజేహం

 

అండాకారాండ పిండ భాస్వత్

బ్రహ్మాండ భాండ నాదలయత్

బ్రహ్మ్యాత్మక నవ్య జీవనాధారం

వర్ణ రహిత వర్గమధిత

 

లలిత లలిత భావ లులిత భాగ్య

రజిత భోగ్య మహిత వసుధైక కుటిరం

కామితార్ధ బందురం

కళ్యాణ కందరం

సద్గుణైక మందిరం

సకలలోక సుందరం

పుణ్య వర్ణ పుష్కరం

దురిత కర్మ దుష్కరం


శుభకరం సుధాకరం

సురుచిరం సుదీపరం

భవకరం భవాకరం

త్రిఅక్షరం అక్షరం భజేహం

 

మాధవ మాయా మయ బహు

కఠిన వికట కంటక పద సంసార

కానన సుఖ యాన శకట విహారం

 

అష్టాక్షరీ ప్రహృష్ట పంచాక్షరీ విశిష్ట

మహా మంత్ర యంత్ర తంత్ర

మహిమాలయ గోపురం

ఘనగంభీరాంబరం

జంబూ భూభంబరం

నిర్మల యుగ నిర్గరం

నిరుపమాన నిర్జరం

మధుర భోగి కుంజరం

పరమ యోగి భంజరం

ఉత్తరం నిరుత్తరం మనుత్తరం

మహత్తరం మహాకరం మహాంకురం

తత్త్వమసీ తత్పరం

తధితరాత్త మోహరం

మృత్యోర్మమృతత్వకరం

అజరం అమరం

 

'' కారం '' కారం '' కారం

ఓం కారం అద్వైత ప్రాకారం

Tuesday, November 23, 2021

నా గురుడు నన్నింక యోగి గమ్మనెనే....- Naa gurudu nannika - Telugu Lyrics

 యోగి తత్వం



నా గురుడు నన్నింక యోగి గమ్మనెనే....

నా గురుడు నన్నింక యోగి గమ్మనెనే...
నా గురుడు నన్నింక యోగి గమ్మనె రాజా.....యోగి గమ్మనె....భోగి గమ్మనెనే...
నా గురుడు నన్నింక త్యాగి గమ్మనెనే....త్యాగి గమ్మనెనే.... జ్ఞాని గమ్మనెనే..

మొట్టమొదటా నీవు పుట్టాలదనెనే...
మొట్టమొదటా నీవు పుట్టాలదనెనే...పుట్టుగిట్టులులేని బట్టాబయలయెనే...
నా గురుడు నన్నింక యోగి గమ్మనె రాజా.....యోగి గమ్మనె....భోగి గమ్మనెనే...

మూలామించుక లేని కీలెరుగు మనెనే...
మూలామించుక లేని కీలెరుగు మనెనే...కాలకాలములెల్ల కల్లా జగమనెనే...
నా గురుడు నన్నింక యోగి గమ్మనె రాజా.....యోగి గమ్మనె....త్యాగి గమ్మనెనే...

మాయా లేని చొటు మరుగెరుగుమనెనే....
మాయా లేని చొటు మరుగెరుగుమనెనే....మరుగునెరుగితే నీవు తిరిగిరావనెనే..
నా గురుడు నన్నింక యోగి గమ్మనె రాజా.....యోగి గమ్మనె....భోగి గమ్మనెనే...

ఉన్న విన్నదిగన్నది సున్నా జేయుమనెనే..
ఉన్న విన్నదిగన్నది సున్నా జేయుమనెనే..సున్నా జేసియు దాని యెన్నాగవలెననే...
నా గురుడు నన్నింక యోగి గమ్మనె రాజా.....యోగి గమ్మనె....భోగి గమ్మనెనే...

మాట లయమయ్యేటి చోటెరుగుమనెనే...
మాట లయమయ్యేటి చోటెరుగుమనెనే...
మాట మహదేవుపేట మలికిదాసనెనే...
నా గురుడు నన్నింక యోగి గమ్మనె రాజా.....యోగి గమ్మనె....భోగి గమ్మనెనే...
నా గురుడు నన్నింక యోగి గమ్మనె రాజా.... త్యాగి గమ్మనె.... జ్ఞాని గమ్మనెనే...

Satkarmabhisha Song - సత్కర్మభీశ్చ సత్ఫలితం


సత్కర్మభీశ్చ సత్ఫలితం
దుష్కర్మ ఏవ దుష్ఫలం
అత్యుత్కట పుణ్య పాపానాం సత్యంబలానుభవమిహం
ఈ చోటి కర్మ ఈ చోటే
ఈ నాటి కర్మ మరునాడే అనుభవించి తీరాలంతే
ఈ సృష్టి నియమం ఇదే
ఎన్ని కన్నీళ్ళ ఉసురిది వెంటాడుతున్నది నీడల్లే కర్మ
ధర్మమే నీ పాలిదండమై దండించ తప్పించుకోలేదు జన్మ
సత్కర్మభీశ్చ సత్ఫలితం
దుష్కర్మ ఏవ దుష్ఫలం
అత్యుత్కట పుణ్య పాపానాం సత్యంబలానుభవమిహం
పాపం, పుణ్యం రెండింటికీ నీదే పూచి
కన్ను తెరిచి అడుగువెయ్ ఆచి తూచి
ఈ చోటి కర్మ ఈ చోటే
ఈ నాటి కర్మ మరునాడే అనుభవించి తీరాలంతే
ఈ సృష్టి నియమం ఇదే
ఏ కన్నూ చూడదనా
నీ విచ్చలవిడి మిడిసిపాటు
ఏ చెయ్యి ఆపదనా
తప్పటడుగే నీ అలవాటు
అదృశ్య దృష్టిగా సకల సృష్టి నిను గమనిస్తున్నది లెక్కగట్టి
ఎంత బతుకు నీదెంత బతుకు
ఓ గుప్పెడు మెతుకుల కడుపు కొరకు
ఇన్ని ఆటలు వేటలు అవసరమా మనుజా... మనుజా
ఏమారిక నిన్ను కబళిస్తుందిరా మాయదారి పంజా
కోరి కొని తెచ్చుకోమాకు కర్మ
దాన్ని విడిపించుకోలేదు జన్మ
సత్కర్మభీశ్చ సత్ఫలితం
దుష్కర్మ ఏవ దుష్ఫలం
అత్యుత్కట పుణ్య పాపానాం సత్యంబలానుభవమిహం
ఈ చోటి కర్మ ఈ చోటే
ఈ నాటి కర్మ మరునాడే అనుభవించి తీరాలంతే
ఈ సృష్టి నియమం ఇదే

Sunday, November 7, 2021

మంత్రం అంటే ఏమిటి? What is Mantra ? Telugu

మంత్రం అంటే ఏమిటి?




మంత్రానికి ఉన్న అర్థమేమిటి?

మననాత్ త్రాయతే ఇతి మంత్ర: అని అంటారు. అంటే మననం చేయడం వల్ల మనల్ని రక్షించేది అని అర్ధం. అలాంటి మహా శక్తివంతమైన మంత్రాలను మన రుషులు అమోఘ తపశ్శక్తితో, భగవదావేశంలో పలికిన వాక్యాలే మంత్రాలుగా రూపాంతరం చెందాయ్‌. మనుషుల్ని మంచి మార్గం వైపు నడిపిస్తున్నాయ్.
ఓం, ఐం, శ్రీం, హ్రీం, క్లీం. ఇవే బీజాక్షరాలా? ఈ బీజాక్షరాలను ఎలా పలకాలి? బీజాక్షరాలు చాలానే ఉన్నా... ఉపాసాన పద్ధతిలో చేయాల్సినవి మాత్రం వేళ్ల మీదే లెక్కపెట్టవచ్చు. ఆయా దేవతల పేర్లతో కలిపి బీజాక్షరాలను జపించడం వల్ల కలిగే ఫలితం అనంతం. మాన్యుల నుంచి సామాన్యుల దాకా ప్రతీ ఒక్కరి జీవితంలో ఒక్కటంటే ఒక్కసారైనా అనుభూతిని ఇచ్చేది ఈ మంత్రసాధనే. అలా శక్తిమంతమైన పరమోద్భుత మంత్రాలుగా మారే క్రమం మహాద్భుతంగా కనిపిస్తుంది. మంత్రాల అసలు లక్ష్యం. మన ఇష్టదేవతలను ప్రసన్నం చేసుకోవడం. అలా మూడు విధాలుగా విభజించి... ఉచ్ఛరించిన మంత్రాలకు మహాశక్తి ఉంటుంది. క్షుద్రంతో ఉచ్చాటన చేసే తామస మంత్రాలు... యుద్ధంలో గెలుపు కోసం చేసే రాజ మంత్రాలు... ఆధ్యాత్మిక సాధన కోసం జపించే సాత్విక మంత్రాలుగా కాలక్రమంలో ఆవిర్భవించాయ్.
అన్ని మంత్రాలకు ముందు ఓం కారాన్ని చేర్చి జపిస్తాం. అదెవ్వరికైనా అనితర సాధ్యం కాని పనికాదు. ఇలా ఎందుకు పలికాలి? ఎందుకంటే ఓంకారం లేని మంత్రం ఫలవంతం కాదు. అలాంటి మంత్రం ప్రాణ వాయువు లేని జీవం లాంటిది. ఈ ఓంకారం సర్వేశ్వరుని నుంచి జ్యోతిగా ప్రారంభమై అందులో నుంచి ఒక నాదం ధ్వనించింది. ఆ ధ్వనే ఓంకారంగా రూపాంతరం చెందింది. ఓం నుంచి వేదరాశులే ఉద్భవించాయ్. రుగ్వేదం నుంచి ఆకారం, యజుర్వేదం నుంచి ఊకారం, సామవేదం నుంచి మాకారం.... ఈ మూడు కలసి ఓంకారంగా ఏర్పడిందన్నది రుషివాక్కు. అందుకే ఓంకారాన్ని బీజాక్షరంతో ముడిపెట్టారు మన పెద్దలు.
అసలు బీజాక్షరాలు అంటే ఏమిటి?.. భాషలోని అక్షరాలే బీజాలా?..ప్రతీ బీజానికి ప్రత్యేక మహత్తు ఉంటుందా?..ఈ బీజాక్షరాల ఏకీకరణమే మంత్ర నిర్మాణమా?.. మంత్రాల స్పష్టమైన ఉచ్చారణతో అద్భుత ఫలితం సాధ్యమేనా?.. కళ్లకు కనిపించనివి.. కొలతకూ, తూకానికీ దొరకనివే బీజాక్షారాలా?

ఈ జగత్తు స్థూలమనీ, సూక్ష్మమనీ రెండు విధాలుగా విభజించారు. శరీరం స్థూలమైతే.... మనస్సు సూక్ష్మం. స్థూలమైన దానికంటే సూక్ష్మమైన దానికే శక్తి ఎక్కువ. మన శారీరక శక్తికంటే, మానసికశక్తి చాలా గొప్పది. బలవత్తరమైనది కూడా. సూక్ష్మశక్తుల జాగృతి వల్లే మానవుడు మహాత్ముడై అసాధారణ కార్యాలు చేయగలుగుతాడు. ఈ సూక్ష్మశక్తుల జాగృతికి మంత్ర శబ్ధతరంగాలు తోడ్పడితే అద్భుతం సాధించడం అదేమంత కష్టమేమీ కాదు. జీవులలోని అంతశక్తులనే కాదు, ప్రకృతిలో ఆవరించి ఉన్న అనేక అదృశ్య శక్తుల్ని కూడా బీజాక్షరాలు మంత్రాల రూపంలో ప్రేరేపిస్తాయంటారు. వర్షాలు కురిపించడం, దీపాలు వెలిగించడంలాంటి పనులు శబ్ధ తరంగాల ప్రక్రియతో మన పూర్వీకులు సాధించి చూపించారు.
అణువులను కదిలించే శబ్ధ తరంగాలకు ఉండడం వల్లే ఇవన్నీ సాధ్యమవుతాయ్. ఇది నిజం. కానీ ఇక్కడొక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. మంత్రాలను పలికినప్పుడు చాలా స్పష్టంగా పలకాలి. పర్‌ఫెక్ట్‌ ప్రీక్వెన్సీతో నిర్ణీత స్వరాన్ని అనుసరించి పలకాలి. అలా అయితేనే దాని ఫలితం ఉంటుంది. మనకు కనిపిస్తుంది. జీవులలోని సూక్ష్మశక్తుల్నీ, ప్రకృతిలోని వివిధ శక్తుల్నీ ప్రేరేపించడానికీ, దైవశక్తిని మనకు అనుసంధాన పరచడానికీ మంత్రశబ్ధలు ఉపకరిస్తాయనడంలో అణుమాత్రం కూడా సందేహం లేదు.
ప్రకృతిలోనే కాకుండా, సృష్టిలో కూడా అనంతంగా వ్యాపించి ఉన్న శక్తిని మంత్రాలు...సరైన ఉచ్ఛరణతో మనకు అందిస్తాయ్. దైవాంశను మనకు అనుసంధానపరచే శబ్ధమే ఓంకారం. మంత్రానికి త్రికరణ శుద్ధి చాలా అవసరం. మనసా, వాచా, కర్మణా శుద్ధి కలిగిన జీవికే మంత్రోచ్చారణ సంపూర్ణ ఫలితాన్ని ఇస్తుంది. కంప్యూటర్‌ కాలంలో త్రికరణ శుద్ధి పూర్తిగా తగ్గిపోతుంది. క్రమంగా తరిగిపోతుంది. అందుకే మంత్రాల ప్రభావం కూడా సన్నగిల్లుతుంది. పురాణ కాల మేధావులు మంత్రాలకు చింతకాయలనే కాదు, అవసరమైతే నక్షత్రాలను కూడా రాలగొట్టగలిగే శక్తి కలిగి ఉండేవారని మనం విన్నాం. మనకు ఫలించనంత మాత్రాన మంత్రశక్తిని విమర్శించడం అవివేకం. చేతకాక పోయినా కూడా కనీసం శాస్త్రీయ సత్యాన్ని తెలుసుకోవడం వివేకం.
అందుకే ప్రతి అక్షరం బీజాక్షరం. ప్రతి బీజాక్షరం దేవతాశక్తి స్వరూపం. విశ్వచైతన్యం దేవతగా అవతరించినపుడు అతి సూక్ష్మంగా కనిపించే అతీంద్రియ శక్తే మంత్రం. అందుకే మంత్ర నిర్మాణం ఆశ్చర్యకరమే కాక ఆసక్తికరమైన శాస్త్రం కూడా. ఎంతో అపురూపమైన మంత్రాలను ఎవరైనా భక్తితో సాధన చేయవచ్చు. సిద్ధిని, లబ్ధిని, దివ్యానుభూతిని పొందవచ్చు. దీనికి శాస్త్రీయత ఉంది. అసశాస్త్రీయంగా రుజువు అయింది కూడా.!!
మరి మంత్రాలకు, వేదాలకు సంబంధం ఏమిట?. పురాణాల్లో, వేదాల్లోనూ మంత్ర ప్రస్తావన ఉందా?..మంత్రశాస్త్రంలోనూ సైన్స్‌ కనిపిస్తుందా?.. శబ్ధ తరంగాలకు ఉన్న శక్తిని ఎలా అర్థం చేసుకోవాలి? పురాణకాలాన్ని మంత్రయుగమంటే... .ఆధునిక కాలాన్ని యంత్రయుగమని పిలవాలా?.. నిజంగా మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? కొందరు అనుకుంటున్నట్టు మంత్రం సైన్స్‌కి విరుద్ధమా?.. జీవ నాడీ వ్యవస్థపై బీజాక్షరాల ప్రభావం ఎంత?
ఇలా మంత్రాల గురించి, బీజాక్షరాల మర్మం గురించి చాలా మందిలో చాలా రకాలైన అపోహలు ఉన్నాయ్. అంతెందుకు తప్పుగా ఆలోచించే వాళ్లూ లేకపోలేదు. మంత్రాలను వాడాల్సిన విధంగా వాడితే... అవి అద్భుతమైన ఫలితాలు ఇస్తాయని చెబుతున్నారు పండితులు. పురాణాల్లోని సైన్సు విషయాల్ని తెలుసుకునేటప్పుడు మంత్రం అనే అంశంపై కచ్చితమైన అవగాహన ఉండి తీరాలి. ఎందుకంటే పురాణాల్లో అనేక మంత్ర తంత్రాలు కనిపిస్తాయి మనకు. అందుకే మంత్రాలకూ, సైన్సుకూ ఉన్న సంబంధాన్ని తెలుసుకొని తీరాలి. పురాణకాలంగా మంత్రయుగంగా... ఆధునికకాలం యంత్రయుగంగా మారుతుంది. ఇది నిజమే కావచ్చు కానీ మంత్రం సైన్సుకు ఏమాత్రం విరుద్ధం కాదు. ఇది నిజం కానే కాదు. మంత్రం అనేది నూటికి నూరుపాళ్లు ఒక సైన్సు ప్రక్రియే.
దేవతానామాన్ని లేదా బీజాక్షరాన్ని స్మరించడాన్ని మంత్ర జపం అంటారు. కొన్ని అక్షరాలను క్రమబద్ధంగా కలిపి వాడటమే. ఇలా వాడటం వల్ల ఉత్పన్నమయ్యే వైబ్రేషన్‌ను ఒక లక్ష్యం కోసం వాడటం వల్ల ఆ ఉద్భవించిన శక్తి మనకు అనుకూలంగా గాని వ్యతిరేకంగా గాని మారుతుంది. అది మంత్రానికి ఉన్న పవర్‌. తరుచూగా ఉచ్చరించే శబ్ధ తరంగాలే మంత్రాలు. ఆ మంత్ర శబ్ధ తరంగాలు చాలా శక్తివంతమైనవి కూడా. శబ్ధ తరంగాలు జీవుల మీదా, ప్రకృతి మీదా, సృష్టి మీదా ప్రభావాన్ని చూపిస్తాయ్. ఇది సైన్సు కూడా ఒప్పుకుంటున్న సత్యం.
జీవుల శారీరక, మానసిక స్థితులపై శబ్ధ తరంగాల ప్రభావం ఉంటుంది. కొన్ని రకాల శబ్ధ తరంగాల వల్ల ఆరోగ్యం క్షీణించడం, భయం కలగడం, నిరాశ ఆవరించడం చూస్తుంటాం. మరి కొన్ని శబ్ధ తరంగాల వల్ల ఆరోగ్యం బాగుపడటం, ఉత్సాహం రావడాన్ని కూడా గమనిస్తుంటాం. అందుకే మంత్రాలంటే శక్తిమంతమైనవి శబ్దతరంగాలే. అందుకే మంత్ర ప్రభావం మన సూక్ష్మగ్రంథులపైనా, షట్‌ చక్రాలపైనా శక్తి కేంద్రాలపైనా సూటిగా పడుతుంది. అప్పుడు మనలోని సూక్ష్మ జగత్ శక్తి కేంద్రం మేల్కొంటుంది. మంత్ర శబ్దాలు గ్రంథులకు చలనం కలిగించి జాగృతం చేస్తుంది. పోగొట్టుకున్న శక్తిని అవి మేల్కొలుపుతాయ్. మంత్రోచ్చారణ ద్వారా ఉద్భవించిన శబ్ధ తరంగాలు ముందుగా చెవిని చేరి, తర్వాత మెదడుకు వెళ్తాయి. మెదడు నుంచి మంత్ర శబ్ధ తరంగాల ప్రభావం ప్రతీ అవయవాన్ని ద్విగుణీకృతం చేస్తుంది. ఎక్కడ కనిపించని అత్యంత శక్తిమంతమైన ముక్తిప్రదం మన పెద్దలు మనకిచ్చిన మంత్రసాధన. మంత్రాలు కేవలం పదాల నిర్మితాలే కాదు. శక్తికి ప్రతిరూపాలు. పరమేశ్వరా అనుగ్రహంతో, పంచభూతాత్మకమైన దేహంతో, అద్భుతమైన మేథా సంపత్తిని పొందిన మానవుడి ఆలోచనాశక్తి అనిర్వచనీయమైన అనుభూతిని ఇచ్చేది మంత్రమే

జ్ఞానం అంటే ఏమిటి?What is Knowledge? Telugu

 

జ్ఞానం అంటే ఏమిటి?



జ్ఞానం అంటే చాల మందికి గుర్తు వచ్చే అంశం బుద్దుడికి రావి చెట్టు కింద జ్ఞానోదయం అయింది. అయితే జ్ఞానం అంటే ఏమిటి? అసలు ఆ బుద్దునికి రావి చెట్టు కింద వచ్చిన జ్ఞానం ఏంటి? మనం గ్రహించని ఆ జ్ఞానం ఏది? సాధారణంగా మనకు అందరికి తెలిసిన విషయం ఏమిటంటే జ్ఞానం అనగానే చాల మంది వారి తెలివితేటలూ అని అనుకుంటారు. కాని తెలివితేటలూ జ్ఞానం కాదు. మరి జ్ఞానం అంటే ఏమిటి? భగవద్గీతలో మరియు ఉపనిషత్తులలో ఈ జ్ఞానం అనే పదం వచ్చింది. కనుక ఇప్పుడు మనం అక్కడ జ్ఞానం అంటే ఏమి చెప్పారో తెలుసుకుందాం?
మన సనాతన హిందూ ధర్మ వేదాలలో ఉపనిషత్తులలో, భగవద్గీతలో మరియు ఎందఱో సద్గురువులు, జగద్గురువులు చెప్పబడిన జ్ఞానం అయితే బ్రహ్మ జ్ఞానం. జ్ఞానం అంటే తెలుసుకోవడం. జ్ఞానాన్ని దేని ద్వార తెలుసుకోవాలి అంటే ఒకటి గురువు బోధించడం వలన లేక వేద వేదాంగాలను క్షుణ్ణంగా గ్రహించి తెలుసుకోవడం వలన పొందేదే బ్రహ్మ జ్ఞానం. అంటే ఎవరైతే గురువు, బ్రహ్మ విద్యను తెలుపుతారో లేక వేద వేదాంగాల బ్రహ్మ విద్యను చదివి తెలుసుకుంటారో వారు తెలుసుకునేదే బ్రహ్మ జ్ఞానం. అంతే కాని మనం ఇప్పుడు చదివిన B.Tech,MBA,MCA,MBBS మరియు PG చదువులు చదివి తెలుసుకున్నది కాదు. ఇది అంతయు విద్యే కావచ్చు కాని బ్రహ్మ విద్య కాదు.
సరే బ్రహ్మ విద్యను తెలుసుకోవడం అంటే జ్ఞానం అన్నారు. ఆ జ్ఞానం అంటే ఏమిటి ? నిజమైన జ్ఞానం అంటే ఆత్మానాత్మ వివేకం. వివేకం అంటే తెలివితేటలు మరియు క్షుణ్ణంగా తెలుసుకోవడం. అంటే ఇక్కడ ఏది ఆత్మ? ఏది అనాత్మ? అనాత్మ అయినది దేని నుండి పుడుతుంది? వీటితో పాటు మరీ ముఖ్యంగా “నేను” ఎవరు? “దేవుడు” ఎవరు? ఈ శరీరము, మనస్సు,బుద్ధి మరియు ఈ కనిపించే ప్రకృతి ఎట్లా వచ్చింది, ఎవరు సృష్టించారు, నేను ఎందుకు పుట్టాను. ఇలా ఈ విధంగా క్షుణ్ణంగా తెలుసుకోవడాన్నే జ్ఞానం అంటారు.

జ్ఞానం అంటే భగవంతుని గురించి సంపూర్ణంగా పరిపూర్ణంగా అయన స్వస్వరుపాన్ని మరియు నీవు అంటే ఎవరు అన్న విషయాలను కూలంకషంగా గ్రహించడమే జ్ఞానం. దీనికి అన్యమైనది ఏదైనా అజ్ఞానమే. భగవంతుని స్వస్వరూపం అంటే ఏముంది దేవుడు అంటే అయన ఎదో ఒక రూపంలో వుంటాడు, దేవునికి రూపం అనడమే అజ్ఞానం. దేవుడైన పరమాత్ముడు నిరాకారుడు, నిర్గుణుడు, సత్యుడు, శాస్వితుడు, అమరుడు, పుట్టుకలు లేనివాడు, నిత్యుడు, పురాతనుడు అయిన ఎల్లప్పుడూ నూతనుడు, ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటాడు ఆయన ఈ సమస్తం వ్యాపించి ఉంటాడు. మరియు ఈ ప్రక్రుతి అంతయు కూడ ఆయనే అయి ఉన్నాడు.అది ఆ దేవదేవుడైన పరమాత్మా యొక్క స్వస్వరూపం.మరి నీవు ఎవరు ? అనగానే నేను అంటే ఈ శరీరం అనే భావన మనకు వస్తుంది. కాని ఈ శరీరం ఇప్పటికి కాకపోయిన ఎదో ఒక రోజు నశిస్తుంది కదా! అప్పుడు నీ పరిస్తితి ఏంటి. దానిని తెలుసుకోవడమే జ్ఞానం. నీవు అంటే ఈ మాంసపు ముద్దలతో ఉన్న ఈ శరీరము కాదు. మరి ఎవరు పోనీ నేను అంటే ఈ మనస్సా, బుద్ధా లేక ప్రాణమా! ఇవి ఏవియు నీవు కాదు వీటికి అన్నిటికి అతీతంగా వుంటూ వీటికి అన్నిటికి శక్తినిచ్చే ఒక సాక్షిభూతమైన ఆత్మ స్వరూపుడివి మాత్రమే నీవు అన్నది తెలుసుకోవడమే జ్ఞానం. ఈ విధంగా ఆత్మానాత్మ వివేకాన్ని సంపూర్ణంగా గ్రహించి దానిని నీ నిత్య జీవితంలో అమలుపరచుకొని ఆ పరమాత్మునిని స్మరిస్తూ ఇలా మనలోని అజ్ఞానాన్ని రూపుమాపుకొని, మన స్వరూపాన్ని మనం గ్రహించినప్పుడు, అప్పడు సర్వభయాలనుండి, బంధాలనుండి, సంచితకర్మల నుండి విముక్తి పొందడమే ముక్తి. అదే మోక్షం. ఇలా స్వస్వరుపాన్ని తెలుసుకోవటమే జ్ఞానం . ఆ జ్ఞానంవల్ల జ్ఞానాగ్ని పుడుతుంది. ఆ జ్ఞానగ్నిలో సర్వకర్మలు దహించుకు పోతాయి.

శ్రీ కృష్ణుడు భగవద్గీతలో చెప్పిన విషయాలు చుడండి.

1. ఆత్మజ్ఞానమందు మనస్సు లగ్నము చేయుట, మోక్షప్రాప్తి యందు ద్రుష్టి కలిగియుండుట జ్ఞానమార్గములనియు ఇవికాక ఇతరములైనవి అజ్ఞానము లనియు చెప్పబడును.
2. జ్ఞానసంపన్నుడైన మానవుడు అనేక జన్మములేత్తిన పిమ్మట విజ్ఞానియై నన్ను (నిరాకర రూపమైన పరమాత్మను) శరణమునొందుచున్నాడు.
3. అర్జునా! ఎవని అజ్ఞానము జ్ఞానము చేత నశింపబడునో అతనికి జ్ఞానము సూర్యునివలె ప్రకాశించి పరమార్ధతత్వము జూపును.
4. ఎవని కర్మాచరణములు కామ సంకల్పములు కావో యెవని కర్మలు జ్ఞానమను నిప్పుచే కాల్పబడినవో, అట్టి వానిని పండితులని విద్వాంసులని పల్కుదురు.
5. అనురాగము, భయము, క్రోధము వదిలి నాయందు (పరమాత్మా) మనస్సు లగ్నము చేసి, ఆశ్రయించిన సత్పురుషులు జ్ఞానయోగము చేత పరిశుద్ధులై నా సాన్నిధ్యము పొందిరి.
6. పొగచేత అగ్ని, మురికిచేత అద్దము, మావిచేత శిశువు యెట్లు కప్పబడునో, అట్లు కామము (కోరికల) చేత జ్ఞానము కప్పబడి యున్నది.
7. శ్రద్ధ, ఇంద్రియ నిగ్రహము గలవాడు జ్ఞానమును పొందుటకు సమర్ధుడగును. అట్టి జ్ఞాని ఉత్కృష్టమైన మోక్షమును పొందును.
Source : వేద శాస్త్రం

Sunday, September 26, 2021

Sankaraacharya -శంకరాచార్యులు:శంకరం - లోక శంకరం :వాస్తవిక

శంకరం - లోక శంకరం :వాస్తవిక 


.....ఈ‌ వ్యావహారిక‌‌ శకానికి పూర్వం (Before Common Era) 509లో శంకరులు పుట్టారని, 
అని ప్రధానమైన శంకరమఠాల గురు పరంపర ద్వారానూ, శంకరాచార్యులు స్థాపించిన పీఠాల చరిత్ర ద్వారానూ తెలియవస్తోంది.  వారి కాలంలో  సనాతన ధర్మానికీ, భారతప్రదేశానికీ హిందూ పదం ఆపాదించబడలేదు. 
అందుకే వారి రచనలలో ఎక్కడా 
హిందూ అన్న పదం మనకు కనిపించదు.‌ 
మనం చదివినట్లుగా వారి జననం వ్యావహారిక(Common Era ) శకం 788 అయి ఉంటే అప్పటికి హిందూ పదం చలామణిలోకి వచ్చింది, కాబట్టి వారి రచనల్లో ఎక్కడైనా హిందూ పదం కనిపించి ఉందేది. 6వ శతాబ్దికి చెందిన న్యాయ‌ సిద్ధాంత తాత్త్వికుడు ఉద్యోతకార శంకరులు ఈయన ప్రసక్తి  చెయ్యలేదు. 5వ శతాబ్దికి చెందిన  ప్రముఖ బౌద్ధ‌ పండితుడు దిజ్ఞాగుడు.  దిజ్ఞాగుని ప్రసక్తి కూడా శంకరులు చెయ్యలేదు. అంటే శంకరుల కాలం వీళ్లకు పూర్వంది. వ్యావహారిక శకం 700 -750 కాలం నాటి సంస్కృత నాటకకర్త భవభూతి శంకరుల  వివర్త వాద ప్రసక్తి చేశాడు. అంటే అప్పటికి శంకరులు చాలా పూర్వం వారని తెలుస్తోంది. వ్యావహరిక శకానికి పూర్వం 5వ శతాబ్దికి చెందిన గౌతమ‌బుద్ధుడి ప్రసక్తి కూడా ఎక్కడా శంకరులు‌ చెయ్యలేదు. శంకరుల కాలానికి ఉన్న వివిధ‌ స్వదేశీ‌ మతాల్లో బౌద్ధమతం‌ లేదు. అంటే శంకరులు బుద్ధుడి కన్నా పూర్వం వారు అన్నది కూడా స్పష్టమౌతున్నది.

 ఆది శంకరాచార్య భారతావనిపై పుట్టి జీవించింది 32 సంవత్సరాలే! శంకరులు వైశాఖ శుక్ల పంచమినాడు కాలడి‌ (ప్రస్తుత కేరళ రాష్ట్రం) గ్రామంలో శివగురువు,‌ ఆర్యాంబ దంపతులకు జన్మించారు. శంకరులు బాల్యం నుంచే అపూర్వ, అద్వితీయ వ్యక్తిత్వంతో, ధీ శక్తితో ఎదిగారు. అనితరసాధ్యమైన మేధతో 16 ఏళ్లకే తమ ఇతర‌ రచనలతో పాటు ప్రస్థానత్రయమైన దశోపనిషత్తులూ, బ్రహ్మసూత్రాలూ, భగవద్గీతలకు భాష్యాలు వ్రాసారు. నిజానికి భగవద్గీతకు అంతకు ముందే భాష్యాలు ఉన్నా శంకరుల భాష్యం తరువాతే భగవద్గీత వ్యాప్తికి వచ్చింది. ప్రస్థాన త్రయాన్ని శంకరులు తమ భాష్యాలతో జనబాహుళ్యంలోకి‌‌ తీసుకువచ్చారు. ఆది శంకారాచార్య వేఱు, వేఱు దేవతలపై 64 స్తోత్రాలూ, 37 ప్రకరణ గ్రంథాలూ వ్రాసి మనకందించారు. 

...వక్రపు వ్యాఖ్యానాలతోనూ, వక్రపు ధోరణులతోనూ, దోష సంప్రదాయాలతోనూ సనాతన ధర్మం‌‌ అస్తవ్యస్తమైన కాలంలో ఆది శంకరాచార్యులు  వేద ప్రతిపాదిత సత్యాన్ని సంస్థాపించడానికి పూనుకుని ఉద్యమించారు.  కృతకృత్యులూ అయ్యారు. తాత్త్విక, సామాజిక, ఆధ్యాత్మిక చింతనలతో  విశేషంగా కృషిచేశారు వారు.  ఆది శంకరాచార్యులు తమ అసమాన బహుముఖ ప్రజ్ఞతో, విప్లవాత్మక ధోరణితో ఆనాడు సమాజంలో పాతుకుపోయి ఉన్న  సామాజిక,‌ సైద్ధాంతిక, మత మౌఢ్యంపై తిరుగుబాటు చేసి విజయం‌ సాధించారు. వేద ప్రతిపాదిత అద్వైత సిద్ధాంతాన్ని మళ్లీ ప్రసరింపజేశారు,‌ ప్రవహింపజేశారు. 

ఒక విస్మయకరమైన మేధావి, ఒక జ్ఞాని, ఒక పూజనీయమైన ఆచార్యుడు, ఒక భక్తుడు, ఒక కర్మ యోగి, ఒక వివేకి, ఒక పండితుడు,‌ ఒక దార్శనికుడు, ఒక సంస్కర్త‍‍, ఒక ఆధ్యాత్మిక యోగి, ఒక సిద్ధుడు‍, ఒక‌ మహాకవి. ఒక ముముక్షువు, ఒక మార్మికుడు,‌ ఒక తత్త్వవేత్త, ఒక తార్కికుడు, ఒక‌ అద్వైతి, ఒక భాష్యకారుడు, ఒక ఉద్యమ కారుడు, ఒక విప్లవశీలి, ఒక సనాతన ధర్మనిర్మాత ఆది శంకరాచార్య. 

ఆది శంకరుల నుడి‌ తత్త్వానికి బడి, ఆపై సత్యానికి గుడి. మనందఱికీ వారే ఒరవడి. శంకరత్వాన్ని సరిగ్గా‌‌ స్మరించుకుందాం‌‌ ఇదిగో ఇలా ...

"ఏవమాత్మా రణౌ ధ్యానమథనే సతతం‌‌ కృతే / ఉదితాన గతి ర్జ్వాలా సర్వాజ్ఞానేంధనం దహేత్" (ఆత్మబోధ 42వ శ్లోకం) అంటే ఆత్మే ఒక ఆరణి (నిప్పును రగిలించేందుకు ఉపయోగించే జమ్మి చెట్టు‌ కఱ్ఱ)కాగా, నిరంతర ధ్యానమే మథనం కాగా ఆందులోంచి పుట్టిన జ్వాలలో మొత్తం అజ్ఞానం అనే ఇంధనం దహించుకుపోతుంది అని అర్థం.‌ ఎంత అద్భుతంగా చెప్పారు శంకరులు!

 "సత్యాపి భేదాపగ్మే నాథ్ తవాహం న మామ్ కీనస్త్వమ్ / సాముద్రో హి తరంగః క్వచన్ సముద్రో న తారంగః" (విష్ణుష్టపదీ శ్లోకం 3) అంటే నేను భిన్నత్వానికి లోబడినా నాథా,  నేను నీవాణ్ణి. కానీ నువ్వు నా వాడివి కాదు అన్నది‌ నిజం‌. కెరటాలు సముద్రానికి చెందినవి కావచ్చు‌. కానీ సముద్రం కెరటాలకు సంబంధించినది కాదు అని అర్థం. ఇక్కడ శంకరులు ఒక మహోన్నతమైన విషయ వివరణ చేశారు. "స్వప్నో జాగరణేఽలీకః స్వప్నేఽపి నహి జాగరః / ద్వయమేవ లయే నాస్తి లయోఽపి హ్యు భయోర్న చ"(అపరోక్షానుభూతి- శ్లోకం 57) అంటే మెలకువలో కల లేదు. కలలో  మెలకువ లేదు. ఈ‌‌ రెండూ మరణం‌(లయ)లో‌ లేవు. ఈ మరణం మెలకువలోనూ, కలలోనూ లేదు అని అర్థం.‌  అత్యున్నతమైన విషయాన్ని అసదృశంగా చెప్పారు శంకరులు!

"జ్ఞానం‌ లేకపోతే స్వేచ్ఛ లేదు. అగ్ని లేకపోతే వంట లేనట్లుగా" (ఆత్మబోధ‌- శ్లోకం 2). "విద్య అవిద్యను పోగొడుతుంది‌‌. తేజస్సు మాత్రమే అంధకారాన్ని పోగొట్టగలిగినట్లు". (ఆత్మబోధ- శ్లోకం 3) "నీళ్లలో బుడగలు పుడతాయి. కాసేపు నీళ్లపై  ఆడతాయి. ఆ తరువాత నీళ్లలోనే కలిసిపోతాయి". (ఆత్మబోధ- శ్లోకం 8) ఈ విధమైన రచనలు మనకు కవులు రూమీలోనూ, ఖలీల్ జిబ్రాన్ లోనూ కనిపిస్తుంది. "పైన ఉన్న ఊకను తీసేస్తే బియ్యపు గింజ చక్కగా తెలుస్తుంది". (ఆత్మబోధ - శ్లోకం16) ఈ చెప్పడం ఎంత సహజంగా ఉందో? ఈ ఉపమానంలో జీవనం కనిపిస్తోంది కదూ?
"దీపానికి ఇంకో దీపం అక్కర్లేదు  తనే ప్రకాశిస్తుంది కాబట్టి".(ఆత్మ‌బోధ . శ్లోకం 29) ఈ ధోరణి మనకు కవి రూమీలో కూడా కనిపిస్తుంది‌. "రోగాన్ని ఔషధం ఏ విధంగా పోగొడుతుందో ఆవిధంగా". (ఆత్మబోధ- శ్లోకం 37)  సహజమైన ఉపమ‌‌ ఇది!  ఇలాంటివి కవి లావ్ ట్సూ లోనూ  కనిపిస్తాయి. "నీళ్లలో నీళ్లు లాగా, ఆకాశంలో‌ ఆకాశం లాగా, తేజస్సులో తేజస్సులాగా" (ఆత్మబోధ- శ్లోకం 53)
ఈ అనడం ఎంత గొప్పగా ఉందో కదా?‌ రూమీ, ఖలీల్ జిబ్రాన్, లావ్ ట్సూ వంటి కవుల్లో ఈ ధోరణి ఉన్నది. "పాలలో వెన్న అంతటా వ్యాపించి ఉంటుంది" (ఆత్మబోధ- శ్లోకం 59) ఇక్కడ
"పచ్చిపాలలోన వెన్న పరమాత్ముడు" అని అన్నమయ్య అన్నదానికి మూలం ఇదే..
"అగ్నిలో కాలుతున్న ఇనుము అగ్నిలాగానే ప్రకాశించినట్లు" (ఆత్మబోధ-‌శ్లోకం 62) ఈ చెప్పడం ఎంతో అద్భుతంగా ఉంది! ఈ స్థాయి‌‌ మాటలు‌ శంకరులు ఎన్నో అన్నారు.

"ఎవరు నీ భార్య? ఎవరు నీ కొడుకు? ఈ సంసారం చాలా విచిత్రమైనది. నువ్వెవరివి? ఎక్కణ్ణుంచి వచ్చావు? తమ్ముడూ, ఆ విషయం గుఱించి‌ ఇప్పుడు ఆలోచించు. ( 8 వ శ్లోకం మోహముద్గర లేదా  భజగోవిందం‌ శ్లోకాలు) కవి‌ ఖలీల్ జిబ్రాన్  "your children are not your chidren" అని అనడానికి వందల ఏళ్ల క్రితమే శంకరులు ఈ మాటలు అన్నారు.
"నీ ధనం, నీ పరివారం, నీ యవ్వనం వీటితో గర్వించకు. అవి నిమిషంలో నశిస్తాయి. అవి మాయ. అది తెలుసుకుని బ్రహ్మ‌ పథంలోకి ప్రవేశించు.‌ (11వ శ్లోకం భజగోవింద‌ం‌ శ్లోకాలు) ఇలా అంటూ శంకరులు మనల్ని కదిలిస్తారు.

"ఆదౌ కర్మ ప్రసంగాత్ కలయతి కలుషం మాతృ కుక్షౌ స్థితం మాం
విణ్మూత్ర మేధ్య మధ్యేక్కథ యతి‌ నితరాం జాఠరో జాతవేదాః
యద్యద్వై తత్ర దుఃఖం వ్యథయతి నితరాం శక్యతే కేన వక్తుం".(శివాపరాథ క్షమాపణ స్తోత్రం.‌‌ శ్లోకం 1)  అంటే మొదట్లో కర్మ అవసరం వల్ల (లేదా కర్మ విస్తరణ వల్ల) కలుషితమై‌న తల్లి కడుపులో ఉండేవాణ్ని నేను. మలమూత్రాలు, కడుపులోని వేడి, ఇతరమైనవి ఏవైతే ఉన్నాయో వాటివల్ల కలిగిన దుఃఖం, వ్యథల్ని ఇతరులు చెప్పడం ఎలా సాధ్యమౌతుంది? అని అర్థం. "గర్భంలోని శిశువు దుఃఖాన్ని , వ్యథను ఎవరు‌ చెప్పగలరు?"‌ ఈ భావన చేసిన‌‌ తొలి కవి, తాత్త్వికులు ఆది‌శంకరాచార్యులే. లావ్ ట్సూ , రూమీ, ఖలీల్ జిబ్రాన్ , షేక్స్పియర్ వంటి కవులెవ్వరూ ఇలాంటి‌ లేదా ఈ‌ స్థాయి చింతన,‌ భావన చెయ్యలేదు. ఇలాంటి రచన, చింతన ఇది ఒక్కటే!

"దేవి సురేశ్వరి భగవతి గంగే త్రిభువనతారిణి తరల తరంగే" (గంగా స్తోత్రం - శ్లోకం 1) ఆది‌శంకరులు తమ‌ గంగా స్తోత్రంలో గంగా‌‌ నదిని "తరల‌ తరంగే‌" ‌అన్నారు. "తరలం" అంటే కదిలేది, ప్రకాశించేది,‌ అనురాగం ఉన్నది, హారం మధ్యలో ఉండే ప్రధాన రత్నం, వజ్రం అని అర్థాలు. ఒక్క మాటతో గంగా నది గుఱించి చెప్పేశారు. ఇలా ఒక్క మాటతో వస్తువుపై సరైన అవగాహన కలిగించడం ఒక మహాకవి లక్షణం. ఆ గంగా‌ నదిని (వసుధాహారం) "భూమికి‌ హారం" అన్నారు. ఇది శంకరుల భవ్య‌మైన భావుకత.

ప్రశ్నోత్తర రత్నమాలికలో అడగబడ్డ కొన్ని ప్రశ్నలకు శంకరులు ఇచ్చిన‌ జవాబులు మనకు దిశా నిర్దేశం చేస్తాయి.‌ ఆలకించండి ... 

ఏది అన్నిటికన్నా  ప్రయోజనకరమైనది?

జవాబు: ధర్మం 

ఏది వాంఛింపదగినది?

జవాబు: స్వ, పర హితం.
 
శత్రువు ఎవరు?

జవాబు: సోమరితనం.

ఏది దుఃఖం?

జవాబు: ఉత్సాహం‌ లేకపోవడం.

ఏది‌ జాడ్యం?
జవాబు:‌ నేర్చుకున్నది ఆచరించకపోవడం.

ఏది వెలలేనిది?
జవాబు: అవసరం వచ్చినప్పుడు ఇవ్వబడేది.

ఎవరి చేత ప్రపంచం జయించబడుతుంది?
జవాబు: సత్యం, ఓర్పు ఉన్న వ్యక్తి చేత.

 ఏది దానం?
జవాబు: ఆకాంక్ష లేనిది.

ఎవరు స్నేహితులు?
జవాబు: పాపాన్ని నివారించే వాళ్లు‌.

ఏది పాతకం?
జవాబు:‌ హింస.

ఎవరు ఎదుగుతారు?
జవాబు: వినయం ఉన్నవాళ్లు. 

ఎవరు ప్రత్యక్ష దేవత?
జవాబు: అమ్మ.

వేటిని మనుషులు సంపాదించాలి?
జవాబు: విద్య, ధనం, బలం, కీర్తి , పుణ్యం.

వేటిని కాపాడుకోవాలి?
జవాబు:‌ కీర్తి , పతివ్రత, బుద్ధి
 
ఎవరు శూరులు?
జవాబు: భయంతో ఉన్నవాళ్లను రక్షించేవాళ్లు.

ఆది శంకరాచార్యులు తమ సౌందర్యలహరి 75వ శ్లోకంలో తమను తాము "ద్రావిడ శిశు" అని‌ ప్రకటించుకున్నారు. ఆ శ్లోకం: "తవ స్తన్యం మన్యే తుహినగిరి కన్యే హృదయతః/పయఃపారావారః పరివహతి సారస్వత మివ / దయావత్యా దత్తం ద్రవిడశిశు‌రాస్వాద్య తవ యత్ / కవీనాం ప్రౌఢానా నుజని‌ కమనీయః కవయితా".  శంకరులు సామాజిక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు అంటే వారు ఆర్యులు అయుండాలి కదా? పైగా సంస్కృతంలో వ్రాశారు. సంస్కృతం ద్రావిడుల భాష కాదని కదా మనం‌‌ చదువుకున్నది?. ఇక్కడ ఆర్యులైన శంకరులు  సంస్కృతంలో తమను తాము‌ ద్రావిడ శిశు‌‌ అని ప్రకటించుకుంటున్నారు! అదేంటి?‌  నిజమేమిటంటే,  "శంకరుల కాలానికి మన దేశంలో ఆర్య‌ ద్రావిడులు అన్నది లేదు". నిజానికి ఆర్య అన్న జాతి ఎప్పుడూ లేదు. ద్రావిడ అంటే దక్షిణ భూభాగానికి సంబంధించిన అని అర్థం. ద్రావిడ అనే పదం భాషల విభజనకు చెందిన పదం కావచ్చు. ద్రావిడ అన్నది ప్రదేశాన్ని సూచించేది. ద్రావిడ అన్నది జాతిని సూచించేది కాదు. ఆర్య అన్నది జాతిని సూచించేది కాదు. ఆర్య అన్నది శ్రేష్ఠులను సంబోధించే పదం.  అయ్యా , మహాశయా అన్నట్లుగా.... శంకరుల ఈ శ్లోకం వల్ల ఆర్య ద్రావిడ జాతులు అన్నవి నిజం కాని అభూత కల్పనలు అని‌ తెలియవస్తున్నది.‌ ("Aryan invasion is an abandoned theory"  అని Oxford Reference Dictionary కొన్నేళ్ల క్రితం తేల్చి చెప్పింది) ఈ శ్లోకానికి‌ అర్థం : హిమగిరి పుత్రికా (పార్వతీ), నీ స్తన్యం హృదయం నుంచి పుట్టినదైన పాల కడలి.   సారస్వతం (సరస్వతికి‌ సంబంధించినది) దాని నుంచే ప్రవహిస్తోందని తలుస్తున్నాను (అనుకుంటున్నాను).‌ఆ స్తన్యాన్ని ఈ ద్రవిడ శిశువు తాగి ప్రౌఢ కవులలో కమనీయమైన కవిగా పుట్టాడేమో? అద్భుతమైన భావుకతనూ, రచనా‌ సంవిధానాన్నీ‌ చూపారు ఇక్కడ శంకరులు‌. ఇవాళ ప్రపంచంలో గొప్ప కవిత్వాన్నిచ్చిన కవులుగా ఎక్కువగా చదవబడుతున్న లావ్‌ట్సూ , రూమీ, ఖలీల్ జిబ్రాన్, షేక్స్పియర్‌ల రచనా సంవిధానం పుష్కలంగా శంకరులలో తొణికిసలాడుతూంటుంది. నిజానికి‌ వీళ్లే కాదు, రవీంద్రనాథ్ ఠాగూర్, శ్రీశ్రీ , వంటి కవులు కూడా శంకరుల కవితా రచనా‌‌ పరిధిలోని వాళ్లే!

వివేక చూడామణి....ఆది‌ శంకరాచార్య కృతులలో ఈ వివేకచూడామణి అత్యున్నతమైనది. ఈ విషయకంగా దీనికి సరిపోలగల రచన విశ్వంలో మఱొకటి లేదు. ప్రస్థానత్రయం తరువాత మన భూమిలో పుట్టిన మహోన్నతమైన రచన ఇది. ఆ‌‌ వివేక చూడామణి (శ్లోకం‌ 63)లో ‌"అజ్ఞాన సర్ప‌దష్టుడైన (శ్రీశ్రీ‌ బాధాసర్ప దష్టులారా,‌ అనడానికి శంకరుల‌‌ ఈ ప్రయోగమే మూలం) వాడికి బ్రహ్మజ్ఞాన ఔషధం తప్పితే వేదాల వల్ల ఏం ప్రయోజనం?, శాస్త్రాలవల్ల ఏం ప్రయోజనం?, మందుల వల్ల ఏం ప్రయోజనం?‌‌ అనీ, (శ్లోకం‌ 64లో)
"మందుల పేర్లవల్ల కాదు వాటిని‌ సేవిస్తే తప్ప వ్యాధి పోదు‌‌. స్వానుభవం‌ (అపరోక్షానుభవం) తప్పితే బ్రహ్మం, పేరు (శబ్దం) వల్ల నివృత్తి కాదు" అనీ తెలియజెప్పప్పడం వారి ప్రత్యేకతనూ,‌ ఔన్నత్యాన్నీ , దార్శనికతనూ తెలియజేస్తోంది.

ఆది శంకరాచార్య ఒక సర్వజ్ఞ. "మీకు చెప్పులు కుట్టడం వచ్చా"  అని అడిగినప్పుడు శంకరులు చెప్పును రెండుపాదాల మధ్యలో పెట్టకుని సూదిని‌ ముక్కు‌ పక్కభాగంలో రుద్దుకుని చెప్పు కుట్టారట‌. ఇలా సూదిని ముక్కు పక్కన రుద్దడం‌ వృత్తిగా చెప్పులు కుట్టే వాళ్లు చేస్తారు. శంకరులు మడికట్టుకుని కూర్చోలేదు. వీధిలోకి‌ వచ్చి ఉద్యమించారు. వారిని చంపాలని ప్రయత్నాలూ జరిగాయి. అయినా‌ భయపడకుండా సత్యం కోసం‌ పయనించారు, పని చేశారు. 

"ఆది శంకరాచార్యుల వారికి సాటిరాగల మానవ మూర్తిమత్వం ఈ విశ్వంలో మఱొకటి లేనేలేదు"

అటువంటి ఆ మహాశక్తికి,‌ ఆ సనాతన అభివ్యక్తికి; ఆ ఆధ్యాత్మిక సూర్యుడికి, ఆ తాత్త్విక కాంతికి; ఆ‌ విశ్వ మహాకవికి, ఆ భవ్య సాహిత్యానికి; ఆ విశేష నైజానికి, ఆ విశిష్ట వైప్లవ్యానికి; ఆ ధర్మజ్ఞతకు, ఆ దార్శనికతకు;  ఈ మట్టి మనుషులంగా మనసా, వాచా ప్రణామం చేద్దాం. 

"శంకరత్వం ఒక‌ సుజ్ఞాన సత్వం.
సదా అనుగమించాల్సిన తత్త్వం"🙏🙏🙏

Wednesday, September 15, 2021

Understanding consciousness- చైతన్యాన్ని అర్థం చేసుకోవడం

 🌹🌹🌹జాగ్రత్త.. స్వప్న  సుషుప్తి🙏🌹🌹🌹


జాగృదావస్త కన్నా స్వప్నావస్త మిన్న, 

దానికి కన్నా సుషుప్తావస్థ ఇంకాస్త మిన్న, 

దానికన్నా తురియావస్త అద్భుతః. 

అన్నిటికన్నా తురియాతీతవస్త అత్యంత అద్భుతః. 


ఎందుకంటే ఇందులో పరమాత్మ ఉంటారు కనక. కానీ మన ఖర్మ ఏంటి అంటే,  

మన జీవితంలో అధిక భాగం జాగృదావస్త లో, ఆ తరువాత మిగిలినదానిలో ఆదిక శాతము స్వప్నావస్త లో ఉంటాము. 

సుషుప్తి అవస్థలో చాలా తక్కువగా ఉంటాము. తురియా అవస్థలో అస్సలు ఉండము. 


ఇంక తుర్యాతీత అవస్థ ఎక్కడనుండి వస్తుంది మనకి.

ఏమంటారు అంటే..ఏమనరు లెండి, ఏంటో వీడి గోల ప్రొద్దునే అనుకుంటారు.


ఇంతకీ అవస్తాపంచకం ఆంటే వివరంగా కావాలా? అవస్థాపంచకము


పరమేశ్వరిని స్తుతిచేసేటప్పుడు జాగ్రస్వప్న సుషుప్తి నాం సాక్షిభూత్ర్యైనమో నమః అన్నారు. అంటే జాగ్రస్వప్న సుషుమ్నలనబడే మూడు అవస్థలకు ఆ పరమేశ్వరి సాక్షి కాని

అవస్థలు ఐదు.

1. జాగ్రదవస్థ 

2. స్వప్నావస్థ 

3. సుషుప్తి 

4. తురీయావస్థ 

5. తురీయాతీతము

1. జాగ్రదవస్థ : ఇది మేలుకొని ఉన్నటువంటి స్థితి. ఈ స్థితి ననుభవించేది స్థూలదేహము. ఈ స్థితిలో ఉండే పురుషుణ్ణి వైశ్వానరుడు అంటారు. విశ్వములోని

నరులకందరికీ ప్రతీక అయినవాడు. భోగాలు అనుభవించటానికి ఈ దేహమే ఆధారము. జీవి ఈ శరీరంతోనే సుఖదుఃఖాలు అనుభవిస్తాడు. స్థూలశరీరం ఎప్పుడూ జాగ్రదావస్థలోనే అనుభవం పొందుతుంది. అటువంటి స్థూలదేహానికి ప్రతినిధి వైశ్వానరుడు. జాగ్రదావస్థ ఇతని సంచారస్థానము. ఇతడికి ఏడు అంగములు, పంథానిమిదినోళ్ళు ఉంటాయని

మాండూక్యోపనిషత్తు చెబుతోంది.


సప్తాంగాలు 

1. స్వరము - శిరస్సు

2. సూర్యుడు _ కన్ను

3. వాయువు - ప్రాణం

4, ఆకాశం - శరీరం

5. జలం - మూత్రస్థానం

6. భూమి పాదాలు

7.ఆహవనీయాగ్ని = నోరు


ఇతనికి ముఖాలు పంథొనిమిది. ఇక్కడ ముఖము అంటే శిరస్సు కాదు. అనుభవించే సాధనం అవి.


జ్ఞానేంద్రియాలు - 5

కర్మేంద్రియాలు - 5

ప్రాణాలు - 5

అంతఃకరణచతుష్టయం  -4

(మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము) 19


 

2. స్వప్నావస్థ : ఆత్మ యొక్క రెండవపాదం తైజసుడు. స్వప్నావస్థ ఇతని సంచారస్థానము. స్వప్నంలో ఇంద్రియాలన్నీ మనసులో లయం అయిపోతాయి. అప్పుడు మనసు అనేక విషయాలను అనుభవిస్తుంది. స్వప్నంలో లేనివన్నీ తనకుతానే సృష్టించుకుని

తనవితీరా అనుభవిస్తుంది.


స్వప్నం చూసే వాడికి అది నిజంగా జరుగుతోంది అనిపిస్తుంది. రకరకాల వస్తు సముదాయాన్ని పొందుతాడు. ఎనలేని ఆనందం అనుభవిస్తాడు. కొన్నిసార్లు భయపడతాడు. దుఃఖిస్తాడు. ఈ రకంగా జాగ్రదావస్థలో కలిగే అనుభవాలన్నీ స్వప్నావస్థలో కలుగుతాయి. ఇక్కడ తైజసుడు సూక్ష్మశరీరుడు. ఇతడికి కూడా వైశ్వానరుడుకి మల్లేనే ఏడు అంగాలు,

పంధొనిమిది ముఖాలు ఉన్నాయి.


౩. సుషుప్తి: నిద్రించినపుడు ఏ కోరికలులేని స్థితి. గాఢనిద్ర ఇక్కడ సంచారం చేసేవాడు ప్రాజ్ఞుడు. ఇక్కడ అనుభవాలన్నీ ఏకమైపోతాయి. అంటే జాగ్రస్వప్నవస్థలలోని అనుభవాలన్నీ కరిగిపోతాయి. అంతేగాని నశించవు. ఆ అనుభవాలకు ప్రత్యేకత ఏమీలేదు. చేతనాశక్తి - అంటే గ్రహణశక్తి అస్పష్టంగా నిలిచిపోతుంది. గతించిన అనుభవాలు ఎక్కడో లోపల నిలిచిపోతాయి. అసలు అతను బ్రతికి ఉన్నాడా ? లేదా ? అనిపిస్తుంది. ఆ స్థితిలో ఆనందమయుడై ఆనందం అనుభవిస్తాడు. ఈ ఆనందం స్తబ్దమైనది. తమోగుణ ప్రధానమైనది. ఈ ఆనందంలో 

1. అజ్ఞానము 

2. అహంభావము 

3. సుఖము ఉంటాయి.

ఈ ఆనందము, బ్రహ్మానందము ఒకటి కాదు.


4. తురీయావస్థ : యోగసాధనలో కుండలినీ శక్తిని సహస్రారానికి చేర్చిన అవస్థ. ఇక్కడ మనసు కూడా పనిచెయ్యదు. ఇది స్థూల సూక్ష్మ కారణ శరీరాలకు అతీతమైనది.


5. తురీయాతీతము : ఈ నాలుగు స్థితులకు అతీతమైనది. సాధకుడు తురీయాన్ని దాటితే అన్నింటినీ వదలివేస్తాడు. ఇది వ్యష్టి సమిష్ట్యాత్మకమైన స్థితి. ఈ స్థితి పొందినవాడు సాక్షాత్తూ పరమేశ్వరుడు. ఇక్కడ అన్ని కాలములయందు ఆనందమే ఉంటుంది.


ఈ అవస్థలలో ఆ పరమేశ్వరి సాక్షీభూతమై ఉంటుంది. అంటూ 256 నామం దగ్గరనుంచి 268 నామం దాకా అవస్థా పంచకాన్ని వివరిస్తున్నారు.


 విశ్వరూపా


సృష్టి ఏరకంగా జరిగిందో ముందు చూద్దాం. సృష్టి క్రమంలో ముందుగా ఆవిర్భవించింది తమస్సు. ఆ తరువాత మహసృష్టి జరిగింది. ఆ తరువాతనే అహంకారము వచ్చింది. దాని నుండి పరంచతన్మాత్రలు వచ్చినాయి. అవే శబ్దస్పర్శరూప రసగంధాలు.


ఇవి సూక్ష్మరూపంలో ఉంటాయి. వీటిలో ఐదు జ్ఞానశక్తులు, ఐదుక్రియాశక్తులు ఉన్నాయి. వీటిలో ఉన్న జ్ఞానశక్తులు జ్ఞానేంద్రియాలను ఏర్పరుస్తున్నాయి. అవి


శబ్దము - చెవి

స్పర్శ - చర్మము

రూపము - కన్ను

రసము - నాలుక

గంధము - నాసిక


సమిష్టిగా అంతఃకరణ ఏర్పడుతున్నది. ఆ తరువాత క్రియాశక్తులవల్ల కర్మేంద్రియాలు ఆవిర్భవిస్తున్నాయి. ఇవి సమిష్టిగా ప్రాణాలను పుట్టిస్తున్నాయి. తన్మాత్రలు పంచభూతాలను సృష్టిస్తున్నాయి. ఇప్పుడు పంచభూతాలు, తన్మాత్రలు, కారణ ఉపాధులతో కూడిన చైతన్యము క్రమంగా విశ్వతైజసప్రాజ్ఞ అనబడుతున్నది. వాటితో కూడిన సమిష్టితత్వము వైశ్వానర, హిరణ్యగర్భ ఈశ్వరులవుతున్నారు. అంతఃకరణకు కారణమైన పరమాత్మే హిరణ్యగర్భుడు.

ప్రాణాకారంతో కూడినవాడు సూత్రాత్మ. వేరుగాని, విడిపోనటువంటి ఈ రెండు కారణాలను అనుసరించి కూడినటువంటివాడు అంతరాత్మ అని చెప్పబడుతున్నాడు. ఇప్పుడు ఈ మూడు అంటే 1. పరమాత్మ 2. సూత్రాత్మ 2. అంతరాత్మలే బ్రహ్మ విష్ణు రుద్రులు. వ్యష్టిగా విశ్వతైజసప్రాజ్ఞులకు, సమిష్టిగా వైశ్వానర, హిరణ్యగర్భసూత్రాత్మలకు భేదము

ఉపనిషత్తులననుసరించి చెప్పబడింది. ఉపనిషణ్మతములో జీవాత్మ, వపరమాత్మలకు

ప్రత్యేకంగా ఐదువిభాగాలు ఏర్పడుతున్నాయి. అవి సృష్టి స్థితి లయ జీవాత్మ పరమాత్మలు. కొంతమంది ఈ జగత్తుకు మూడే కారణాలు అంటారు. అవే సృష్టి స్థితి లయాలు. వీరిద్దరికీ తేడా లేదు. ఎందుచేతనంటే స్థూలకారణాలు మూడు. కాగా సూక్ష్మకారణాలు

ఐదు. వీటన్నింటినీ మాండూక్యోపనిషత్తులో వివరించారు.


సర్వంహ్యేతద్‌ బ్రహ్మ, అయమాత్మా బ్రహ్మ, సో౭ యమాత్మా చతుప్పాత్‌


ఈ చరాచరజగత్తంతా బ్రహ్మమయమే. ఆత్మ కూడా పరబ్రహ్మమే. ఆత్మకు నాలుగుపాదాలున్నాయి.


జాగరితస్థానో బహిః ప్రజ్ఞః సప్తాంగ వికోనవింశతి


ముఖః స్థూలభుగ్‌ వైశ్వానరః ప్రథమపాదః

 

విశ్వములోని జీవులన్నింటి స్వరూపుడు అయినవాడు వైశ్వానరుడు. జాగ్రదవస్థ ఇతని సంచారస్థానం. అలాగే రెండవవాడు తైజసుడు. స్వప్నమే ఇతని సంచారస్థానం.

మూడవవాడు ప్రాజ్ఞుడు. సుషుప్తి అవస్థ ఇతని సంచారస్థానము. ఈ రకంగా ఉపనిషత్తు చెబుతుంది.


సుషుప్తిలో ప్రాజ్ఞుడికి బ్రహ్మభావం కలుగుతుంది. ఛాందోగ్యోపనిషత్తులో ఉద్దాలకుడు తన కుమారుడైన శ్వేతకేతువుకు సుషుప్తిని గురించి వివరిస్తాడు.


కుమారా ! గాఢనిద్రలో ఉన్నప్పుడు అతడు సుషుప్తిలో ఉన్నాడు అంటారు. ఆ స్థితిలో జీవుడు పరమసత్తను పొందుతాడు. అంటే తన నిజస్వరూపాన్ని పొందుతాడు. తన ఆత్మను తాను పొందుతాడు. కాబట్టి అతన్ని గురించి చెప్పేటప్పుడు అతను నిద్రిస్తున్నాడు అంటారు.


అద్దంలో చూసినప్పుడు మన ప్రతిబింబం మనకు కనిపిస్తుంది. కాని అద్దం తియ్యగానే అది మాయమైపోతుంది. మన నిజరూపం మాత్రమే మిగులుతుంది. అదేవిధంగా సుషుప్తావస్తలో మనస్సు ఇంద్రియాలు పనిచెయ్యటం మానేస్తాయి. అప్పుడు

మిగిలేది ఆత్మ మాత్రమే. ఆ ఆత్మ నిజరూపంలో మిగులుతుంది. ప్రతిబింబంలాంటి జీవభావంపోయి ఆత్మభావం మిగులుతుంది. ఆ స్థితిలో ఆత్మను 'స్వపితి” అంటారు. తన ఆత్మ తనలోనే ఉన్నాడని, నిద్రిస్తున్నాడని అంటారు. ఇంద్రియాలన్నీ అలసట చెంది

ఒక్కొక్కటి మనసులో లీనమైపోతాయి. మనసు ప్రాణంలో లీనమైపోతుంది. అంటే సుషుప్తావస్తలో ప్రాణం ఒక్కటే మేల్కొని ఉంటుంది. ఆ ప్రాణమే ఇంద్రియాల యొక్క మనసు యొక్క అలసటను తీరుస్తుంది. మనసుకు బంధనస్థానమైన ప్రాణమే పరదేవత.


బృహదారణ్యకోపనిషత్తులో అజాతశత్రువు అనే రాజు బాలాకి అనే బ్రాహ్మణబాలుడికి సుషుప్తి గురించి వివరిస్తాడు.


సుషుప్తిలో జీవికి బ్రహ్మభావం కలుగుతుంది. అప్పుడు అతణ్ణి ప్రాజ్ఞుడు అంటారు. కాని జీవుడు అవిద్యతో కలిసి ఉంటాడు. అందుచేత అతడు పరమాత్మకాడు. అందుకని సుషుప్తి పొందిన జీవుణ్ణి కారణశరీరమని, తురీయావస్థ పొందిన జీవుణ్ణి మహాకారణ శరీరము అని అంటారు. తురీయావస్థ పైన ఉండేది తురీయాతీతము. ఇది ఐదవ అవస్థ. ఈ స్థితిలో జీవి శివతుల్యుడు అవుతాడు. ముండకోపనిషత్తులో “నిరంజనుడు

అంతకన్న పరమసామ్యము పొందుతాడు” అని చెబుతోంది. పరమసామ్యము అంటే - ఐక్యము. ఈ స్థితిలో పూర్ణజీవత్వము పూర్ణశివత్వాలు వేరుగా లేవు.

 

ఐదువిధాలయిన జీవోపాధులు పంచకోశాలుగా వ్యవహరించబడుతున్నాయి. పరమాత్మకు తిరోధానము అనుగ్రహము అనబడే బంధమోక్షాలు ఉపాధులు కావటం చేత బహిరున్మేషుడు (ప్రత్యక్షము అయ్యేవాడు - శివుడు) అవుతున్నాడు. సదాశివుడు నిమేషాంతుడు. అంటే - కొంత ప్రత్యక్షము, కొంత అప్రత్యక్షము. కాబట్టి తిరోదాన అనుగ్రహముల స్థితులు రుద్రుని కన్న వేరైనవి.


విశ్వ అంటే - జాగరిదావస్థ. స్థూలరూపం గల చైతన్యము గల జీవులు. ఆ జీవుల సమష్టిరూపమే వైశ్వానరుడు.


పరమేశ్వరి ధర్మాధర్మవివర్జితా అని చెప్పబడింది. కాబట్టి జగత్తుకు, దేవికి భేదం లేదు. అందుచేత పరమేశ్వరి రూపము విశ్వరూపము అవుతున్నది. ఈ విశ్వానికి ఆధారము ఆ దేవి. అందుచేత ధర్మిభూతమైన ఇంకొక శరీరము ఆమెకు లేదు.


విష్ణుపురాణంలో “అరటిచెట్టు ఆకులకన్న వేరుగా కనిపించినట్లుగానే, ఓ పరమేశ్వరీ! ఈ విశ్వమంతా నీ యందే ఉన్నది. విశ్వము నీకన్నవేరైనదికాదు” అని చెప్పబడింది. దేవీభాగవతంలో ఆ పరమేశ్వరి శ్రీ మహావిష్ణువుతో “ఈ సమస్తమునేనే. నాకన్న

సనాతనమైనది వేరేలేదు” అంటుంది.


విశ్వరూపము అని గ్రహించిన బ్రహ్మ యొక్క జీవభావము మిక్కిలి నీచ రూపము. అటువంటి నీచ రూపము ఎవరి మహిమవల్ల నాశనమవుతుందో ఆమె విశ్వరూప. ఆమె అనుగ్రహము వలననే నీచమైన సేవ వంటి అనుగ్రహము లభించును.


ఆ పరమేశ్వరి పదహారు కళల స్వరూపము. దర్శ నుండి పూర్ణిమ వరకు 15 కళలు కాగా 16వ కళ సచ్చిదానందరూపిణి అయి ఉన్నది. తిథేలే నిత్యాదేవతలు. నిత్యలే కళలు. ఈ నిత్యాదేవతలను 15వ నామం “అష్టమీచంద్రభిభ్రాజదలిక స్థలశోభితా”లో

వివరించటం జరిగింది. ఈ 15 తిథుల స్వరూవమే శ్రీవిద్య. 16వ కళయే మహాత్రిపురసుందరి. ఈ రకంగా తిథులే పంచదశీమంత్రము అని చెప్పటంవల్ల తిథులు,

పంచదశిమంత్రము, చంద్రమండలము, ఆ పరమేశ్వరి అంతా ఒకటే అవుతున్నారు. అందుకే ఆమె విశ్వరూపా.


తైత్తిరీయ బ్రాహ్మణంలో శుక్లపక్ష కృష్ణపక్ష తిథులను వివరించటం జరిగింది.


వీటిలో మళ్ళీ పగటి తిథులు వేరు రాత్రి తిథులు వేరు. ఆ వివరాలను ఇక్కడ ఇవ్వటం జరుగుతోంది. శుక్లపక్షపగటి పేర్లు.

 


సంజ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం జానదభిజానతాత్‌

సంకల్పమానం ప్రసంకల్ప మానం ఉపకల్పమానము పక్షప్తం

క్షప్తం శ్రేయోవశీయ ఆయస్సంభూతం భూతం.


శుక్లపక్షరాత్రుల పేర్లు


దర్శాదృష్టా దర్శితా విశ్వరూపా సుదర్శనా


ఆప్యాయమానా ప్యాయమానా ప్యాయా సూనృతా ఇరా

అపూర్వమాణా పూర్వమాణా పూరయంతీ పూర్ణాపూర్ణమాసి


 

సంఖ్య తిది నిత్యతిది పగటి తిధి రాత్రి తిధి


1. పాడ్యమి కామేశ్వరి సంజ్ఞానం దర్శ


2. విదియ భగమాలిని విజ్ఞానం దృష్టా


3. తదియ నిత్యక్లిన్నా ప్రజ్ఞానం దర్శతా


4.చవితి భేరుండా జానత్‌ విశ్వరూపా


5. పంచమి వహ్నివాసిని అభిజానత్‌ సుదర్శనా


6. షష్టి మహావజ్రేశ్వరి సంకల్పమానం ఆప్యాయమానా


7. సప్తమి శివదూతి ప్రకల్పమానం ఆప్యాయమానా


8. అష్టమి త్వరిత ఉపకల్పమానం ఆప్యాయా


9. నవమి కులసుందరి ఉపక్షప్తం సూనృతా


10. దశమి నిత్యా క్షప్తం ఇరా


11. ఏకాదశి నీలపతాక శ్రేయః అపూర్వమాణా


12. ద్వాదశి విజయా వశీయః పూర్వమాణా

13. త్రయోదశి | సర్వమంగళా | ఆయత్‌ పూరయంతే


14. చతుర్దశి జ్వాలామాలిని | సంభూతం పూర్ణా


15. పూర్ణిమ చిత్రా భూతం పూర్ణమాసీ


కృష్ణ పక్ష పగటి తిధులు పట్టిక లో చూడండి


ప్రష్టుతం విష్ణుతగిం సంస్తుతం కల్యాణం విశ్వరూపం

శుక్ర మమృతం తేజస్వి తేజ స్సమిద్ధం

అరుణం భాను త్మరీచీ మదభితపస్తపస్విదితి


  


పంచదశీ మహామంత్రము మూడుఖండములు గల మంత్రము మొదటిఖండంలో 5, రెండవఖండంలో 6, మూడవఖండంలో 4 బీజాక్షరాలుంటాయి. తిథులను కూడా మూడుభాగాలుగా చేయటం జరిగింది.


మొదటి భాగంలో 5, రెండవభాగంలో దశమి, ఏకాదశి రెండూ ఒకటిగానే పరిగణస్తారు కాబట్టి 6. మూడవభాగంలో ద్వాదశి నుంచి 4 తిథులుంటాయి. అయితే

 

ఇంకొక మతం ప్రకారము మూడు ఖండాలలోను ఐదు చొప్పున 15 తిథులు ఉంటాయి. ఈ తిథులే పంచదశి మంత్రంలోని బీజాక్షరాలు.


ఈ రకంగాచూస్తే శుక్లపక్షపు నాల్గవనాటిరాత్రి పేరు విశ్వరూపా. ఇది వాగ్భావకూటమిలోని నాల్గవఅక్షరము, పరమేశ్వరిని విశ్వరూపా అనటం ఈ రాత్రిపేరున చెప్పటముకాక వేరుకాదు.


దేవీభాగవతంలోని సప్తమస్కంధంలోని 81వ అధ్యాయంలో తారకాసురుని బాధలు పడలేక దేవతలంతా ఆ పరమేశ్వరిని ప్రార్ధిస్తారు. అప్పుడు ఆమె వారికి సాక్షాత్కరించింది. హిమవంతుడు. “తల్లీ ! నీ విశ్వరూపం చూడాలని కోరికగా ఉన్నది. దేవతలంతా కూడా ఇదే కోరుతున్నారు. ఒకసారి మాకు చూపవలసినది. అని అడుగుతాడు. అప్పుడు ఆ

పరమేశ్వరి తన విరాడ్రూపం వారికి చూపింది.


ద్యౌ ర్మస్తకం భవే ద్యస్య చంద్రసూర్యౌ చ చక్షుషీ


దిశః శ్రోత్రో వచో వేదాః ప్రాణోవాయుః ప్రకీర్తితాః


విశ్వం హృదయమిత్యాహుః పృథివీజఘనం స్మృతమ్‌ 1


నభస్తలం నాభిసరో జ్యోతిశ్చక్ర మురః స్థలమ్‌


మహర్లోకస్తు (గ్రీవాస్యా జ్ఞనోలోకో ముఖంస్కృతమ్‌ ॥


తపోలోకో లలాటస్తు సత్యలోకాదధః స్థితః


ఇంద్రాదయో బాహవః స్యు శబ్ధః శోత్రం మహేశితుః ॥


నాసత్య దస్రా నాసేస్తో గంధో ఘ్రాణం స్మృతోబుదైః


ముఖమగ్నిః సమాఖ్యాతో దివారాత్రీ చ పక్ష్మణీ ॥


బ్రహ్మస్థానం భ్రూవిజృంభోల ప్యాపస్తాలుః ప్రకీర్తితా


రసోజిహ్వాసమాఖ్యాతా యమోదంప్రాః ప్రకీర్తితా ॥


దంతాః స్నేహకలా యస్య హాసోమాయా ప్రకీర్తితా


సర్గ స్త్వపాంగమోక్షః స్యాద్రీడోర్ట్వోష్థా మబేశితుః ॥


లోభః స్యాదధరోష్టోల_ స్యా ధర్మమార్గ స్తు పృష్టభూః


ప్రజాపతి శ్చ మేడ్రం స్యాదః స్రష్టా జగతీతలే ॥


కుక్షిః సముద్రా గిరయోల_ స్టీని దేవ్యా మహేశితుః

నద్యోనాడ్యః సమాఖ్యాతా వృక్షౌః కేశాః ప్రకీర్తితాః ॥


అంటూ దేవి విశ్వరూపాన్ని వర్ణిస్తారు.

 

 

అనేక బాహువులు, వేలతలలు, నానారకాల ఆయుధాలు ధరించి కోట్లకొలది సూర్యులకాంతితో ప్రకాశిస్తున్నది ఆ పరమేశ్వరి.


శ్రీమద్భాగవతంలోకూడా శ్రీ మహా విష్ణువును ఈ రకంగానే వర్ణించటం జరిగింది.


బ్రహ్మావాచ

వాచాం వషే ర్ముఖం క్షేత్రం ఛందసాం సప్తధాతవః !

హవ్యకవ్యామృతాన్నానాంజిహ్వా సర్వరసస్య చ ॥

సర్వాసూనాంచ వాయోశ్చ తన్నాసే పరమాయనే ॥

అశ్వినోరోషధీనాంచ కఘ్రాణోమోద ప్రమోదయోః ॥

రూపాణాం తేజసాం చక్షుర్దివః సూర్యస్య చాక్షిణీ |

కర్ణౌదిశాంచతీర్థానాం శ్రోత్రమాకాశ శబ్దయోః ॥

తద్గాత్రం వస్తు సారాణాం సౌభగ్యస్య చ భాజనం ॥

త్వగస్య స్పర్శవాయోశ్చ సర్వమేధస్య చైవ హి!

రోమాణ్యు ద్భి జ్ఞజాతీనాం యైర్వాయజ్ఞస్తు సంభృతః ॥

కేశ శ్మశ్రు నఖాన్యస్య శిలా లోహాథ్రవిద్యుతామ్‌ ।

బాహవో లోకపాలానాం ప్రాయశః క్షేమకర్మణాం ॥

విక్రమో భూర్భువః స్వశ్చక్షేమస్య శరణస్య చ।

సర్వకామ వరస్యాపి హరేశ్చరణ ఆస్పదమ్‌ ॥

అపాం వీర్యస్య సర్గస్య పర్జన్యస్య ప్రజాపతేః ।

పుంసః శిశ్చ ఉపస్థస్తు ప్రజాత్వానంద నిర్వృతేః 1

పాయుర్యమస్య మిత్రస్య పరిమోక్షస్య నారద ।

హింసాయా నిర్రుతేర్మ ఛఎత్యోర్నిరయస్య గుదః స్మృతః ॥

పరాభూతేరధర్మస్య తమసశ్చాపి పశ్చిమః ।

నాడ్యోనదనదీనాం తు గోత్రాణామాస్థి సంహతిః ॥

అవ్యక్త రస సింధూనాం భూతానాం నిధనస్యచ ।

ఉదరం విదితం పుంసో హృదయం మనసః పదమ్‌ ॥

ధర్మస్య మమ తుభ్యం చ కుమారాణాం భవస్యచ ।

విజ్ఞానస్యచ సత్త్వస్య పరస్యాత్మా పరాయణమ్‌ ॥

అహం భవాన్‌ భవశ్చెవ త ఇమే మునయోల గ్రజాః !

సురాసురనరా నాగాః ఖగా మృగ సరీసృపాః ॥

 

గంధర్వాప్సరసో యక్షా రక్షోభూతగణోరగాః ।


పశవః పితరః సిద్ధా విద్యాథ్రా శ్చారణా ద్రుమాః ॥


అన్యేచ వివిధా జీవా జలస్థలనభౌకసః ॥


గ్రహరకేతవస్తారా స్తడితః స్తనయిత్చవః ॥


సర్వం పురుష ఏ వేదం భూతం భవ్యం భవశ్చయత్‌ ।

తేవేదమావృతం విశ్వం వితస్తిమధి తిష్టతి ॥


స్వధిష్ట్యం ప్రతపన్‌ ప్రాణో బహిశ్చ ప్రతపత్యసౌ


ఏవం విరాజం ప్రతపంస్తపత్యన్తర్భహిః పుమాన్‌ ॥


సోల మృ తస్యాభ యస్యే శో మర్త్యమన్నం యదత్యగాత్‌ ।

మహిమైష తతోబ్రహ్మన్‌ పురుషస్య దురత్యయః ॥


పాదేషు సర్వభూతాని పుంసః స్థితిపదోవిదుః ॥


అమృతం క్షేమమభయం త్రిమూర్శోోలి. ధాయి మూర్ధసు 

పాదాస్త్రయో బహిశ్చాసన్న ప్రజానాం య ఆశ్రమాః ।


అంత స్రిలోక్యాస్త్వ స్త౧పరో గృహమేధోవ ౨ బృహద్ర్వతః (

సృతీ విచక్రమే విప్ప్వజ సాశనానశనే ఉభౌ ।


యదవిద్యా చ విద్యాచ పురుష స్తూభయాశ్రయః ॥

యస్మాదండం విరాడ్‌ జజ్లే భూతేంద్రియ గుణాత్మకః ।

తద్‌ ద్రవ్యమత్యగాద్‌ విశ్వం గోభిః సూర్యయివాతపన్‌ ॥

 

 నీలకంధరునకు, నీకు నాకు సనత్కు

మారముఖ్య సుతసమాజమునకు

ధర్మసత్వబుద్ధి తత్త్వములకు నీశ్వ

రాత్మవినుము పరమమైన నెలవు ॥


నరసురాసుర పితృనాగకుంజర మృగ, గంధర్వ యక్షరాక్షస మహీజ

సిద్ధ విద్యాధర జీమూతచారణ గ్రహ తారకాప్సరోగణ విహంగ

భూతతటిద్వసు పుంజంబులును, నీవు ముక్కుంటియును, మహామునులు, 

సలిలనభస్థ్థలచరములు మొదలైన వివిధ జీవులతోడి విశ్వమెల్ల

విష్ణుమూర్తిమయము పుత్ర | వేయేల, బ్రహ్మాండ


మతని జేనలోన నడగియుండు

బుద్ధినెరుగరాదు; భూతభవద్భవ్య

లోకమెల్ల విష్ణులోన నుండు ॥

మండలములోన భాస్కరుం 

డుండి జంగబులకు దీప్తి నొసంగెడి క్రియ బ్ర

హ్యాండములోపల నచ్యుతుం

డుండుచు బహిరంతరముల నొగి వెలింగించున్‌

 

భగవద్గీతలోని 11వ అధ్యాయంలో 15 నుంచి 28 వరకు శ్లోకాలలో శ్రీకృష్ణుని


విశ్వరూపాన్ని వర్ణించాడు అర్జునుడు.


పశ్యామి దేవాన్‌ తవ దేవ ! దేహే

సర్వాన్‌ తథా భూతవిశేష సంఘాన్‌ ।

బ్రహ్మాణం ఈశం కమలాసనస్థం

బుషీన్‌ చ సర్వానురగాన్‌ చ దివ్యాన్‌ 11


శ్రీకృష్ణా ! నీ శరీరమునందు సకల దేవతలను, సమస్త ప్రాణి సమూహములను,


చతుర్ముఖ బ్రహ్మను, బ్రహ్మ ఆజ్ఞానువర్తియగు రుద్రుని, సకల బుషిపుంగవులను, ప్రకాశించు వాసుకి మొదలగు సర్పరాజములను చూచుచున్నాను.


అనేక బాహూదర వక్రనేత్రం

పశ్యామిత్వాం సర్వతోల_ నంతరూపం ।

నాంతం న మధ్యం న పునస్తవాదిం

పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప ! ॥


ప్రపంచమునకు నాథుడవగు ఓ విశ్వరూపధరా ! నిన్ననేక భుజములు, కడుపులు, ముఖములు, కన్నులు కలిగి ఇంతింతనరాని యాకారములు కలవానినిగా నంతటను చూచుచున్నాను. పైగా నీయాది మధ్యాంతములు నాకు గోచరించుటలేదు.


కిరీటినం గదినం చక్రిణం చ

తేజోరాశిం సర్వతో దీప్తిమంతం ॥

పశ్యామి త్వాం దుర్నిరీక్షం సమంతాత్‌

దీప్తానలార్మద్యుతిం అప్రమేయమ్‌ ॥


కాంతిపుంజమై యంతటను నిండిన కాంతివలన చూడశక్యముగాక మండుచున్న నిప్పు, సూర్యుల కాంతివంటి కాంతి గలిగి యముంతయని హద్దుగా చెప్పదగని నిన్ను కిరీటాది భూషణములను చక్రగదాద్యాయుధములను ధరించియున్నట్లు దర్శించుచున్నాను.


త్వమక్షరం పరమం వేదితవ్యం

త్వమస్య విశ్వస్య పరం నిధానం !

త్వమవ్యయ శాశ్వత ధర్మగోప్తా

సనాతనస్త్వం పురుషో మతో మే ॥

 

ముండకాది ఉపనిషత్తులలో తెలియదగినదిగా నిర్దేశింపబడిన పరమైన అక్షరము

నీవే. ఈ జగత్తునకు సర్వోత్కృష్టమైన ఆధారము నీవే, స్వరూపాదుల యందెల్లప్పుడు

నొక్క రూపముతో నుండువాడవు నీవే. నిత్యమైన ధర్మములను కాపాడువాడవు నీవే,

పురాణపురుషుడవు నీవే యని నాకిప్పుడు తెలిసినది.


అనాది మధ్యాంతం అనంతవీర్యం

అనంతబాహుం శశిసూర్యనేత్రం ॥

పశ్యామి త్వాం దీప్రహుతాశవక్రం

స్వతేజసా విశ్వమిదం తపంతమ్‌ ॥


ఆది మధ్యాంతములు లేనట్టియు, అపరిమిత పరాక్రమము కలిగి యునృట్టియు,

లెక్కలేనన్ని చేతులు కలిగియున్చట్టియు, చంద్రునివలె చల్లగను, సూర్యునివలె తీవ్రముగా

నుండు కండ్లు కలిగినట్టియు, కాలాగ్సివలె మండుచున్న ముఖము కలిగినట్టి నీ తేజస్సుచేత

ఈ ప్రపంచమును తపింపజేయుచున్న నిన్ను జూచుచున్నాను.ద్యావాపృథివ్యోః ఇదమంతరం హి


వ్యాప్తం త్వయైకేన దిశశ్చ సర్వాః |

దృష్ట్వా ద్భుతం రూపముగ్రం తవేదం

లోకత్రయం ప్రవ్యథితం మహాత్మన్‌ ! ॥

భూమి ఆకాశముల మధ్యభాగమంతయును అన్ని దిక్కులను నీవే వ్యాపించి

యున్నావు. మహాత్మా! బ్రహ్మాది దేవతావర్ణములో అనుకూలురు - ప్రతికూలురు మధ్యస్థులు

అనెడు మూడు విధముల వారును అత్యద్భుతమై అతి భయంకరమైయుండు నీ రూపమును

జూచి భయపడుచున్నారు. (అర్జునునకు తన ఐశ్వర్యమును జూపుటకై భగవానుడు

వీరందరికిని దివ్యదృష్టి నొసంగెను.)


అమీ హిత్వాం సురసంఘా విశంతి

కేచిత్‌ భీతాః ప్రాంజలయో గృణంతి ॥

స్వస్తీ త్యుక్వా మహర్షి సిద్ధసంఘాః

స్తువంతి త్వాం స్తుతిభిః పుష్కలాభిః ॥

 ఈ గొప్ప దేవతా సమూహము నీ సమీపమునకు వచ్చుచున్నది. కొందరు భయపడి చేతులు జోడించి స్తోత్రము చేయుచున్నారు. భృగువు మొదలగు మహర్షులు, సనకాది సిద్ధులును నీకు మంగళాశాసనమును గావించి నీకు తగిన సంపూర్ణస్తోత్రములచే నిన్ను స్తుతించుచున్నారు.


రుద్రాదిత్యా వసవో యే చ సాధ్యాః

విశ్వేల శ్వినౌ మరుతశ్చ ఊప్మపాశ్చ ॥

గంధర్వ యక్షాసుర సిద్ధ సంఘాః

వీక్షంతే త్వాం విస్మితాశ్రైవ సర్వే 1!


ఏకాదశ రుద్రులును, ద్వాదశాదిత్యులును, అష్టవసువులును, సకల సాధ్యులును,

విశ్వేదేవతలును, ఇద్దరశ్వినీదేవతలును, సప్తమరుత్తులును, పితృదేవతలును, గంధర్వ యక్ష

రాక్షస సిద్ధసమూహములున్ను, అందరును ఆశ్చర్యమును పొంది నిన్ను చూచుచున్నారు.


రూపం మహత్తే బహువక్రనేత్రం

మహాబాహో ! బహుబాహూరుపాదం ॥

బహూదరం బహుదం ప్రాకరాళం

దృష్ట్వా లోకాః ప్రవ్యధితాస్తథాల హమ్‌ ॥॥


శ్రీకృష్ణా ! అనేక ముఖములను, లెఖ్ఖలేని కన్నులును పరిమితిలేని భుజములును, పెక్కుతొడలును, బహుపాదములును, అనేకములగు కడుపులును, పెక్కు కోరలచేత అతిభయంకరమగు నీ యిట్టి గొప్ప ఆకారమును జూచి జనులందరును అతిభయముతో

వణుకుచున్నారు, అట్లే నేనును భయపడుచున్నాను.


వేదంలోని పురుషసూక్తంలో


సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష సహస్రపాత్‌ .....

పద్భ్యాంభూమిః దిశశ్రోత్రాత్‌ తథా లోకాగ్‌ం అకల్పయన్‌ అని చెప్పబడింది.

ఈ రకంగా విశ్వమంతా ఆమెలో నిండి ఉన్నది కాబట్టే విశ్వరూపా అనబడింది.

అలాగే “విశ్వరూపం” అనేది కృష్ణపక్షంలో పంచపమితిథి పగటిపేరు. అంటే తిధులస్వరూపం గలది ఆ దేవి. ఈ రకంగా కృష్ణపక్షంలో పగటితిథులు, రాత్రి తిథులు

కూడా ఆ దేవతాస్వరూపమే. 


సమయ మతస్తులు శుక్లపక్ష రాత్రులందు చివరిభాగంలో మాత్రమే ఉపాసన చేస్తారు గౌడపాదులవారు తమ సుభగోదయస్తుతిలోని 31వ శ్లోకంలో

అతః శుక్లేపక్షే ప్రతిదిన మిహ త్వాం భగవతీం

నిశాయాంసేవంతే నిశి చరమభాగే సమయినః

అన్నారు. శుక్లపక్షరాత్రులందు మాత్రమే కుండలినీ ప్రబోధం జరుగుతుంది.


శంకరభగవత్పాదులవారు కూడా తమ సౌందర్య లహరిలోని 87వ శ్లోకంలో ఇ మాటను చెప్పారు.

హిమానీ హన్తవ్యం హిమగిరి నివాసైక చతురౌ

నిశాయాం నిద్రాణాం నిశి చరమభాగే చ విశదౌ


కాబట్టి శుక్లపక్ష తిథులన్నీ పరమేశ్వరి స్వరూపమే. ఈ రకంగా తిథులు, కాలమానమ అంతా పరమేశ్వరి స్వరూపమే కాబట్టి ఆ దేవిని “విశ్వరూపా” అన్నారు.


శుక్లపక్షరాత్రులు మధుకృతులు. పగళ్ళు మధువృషులు అని వేదం చెబుతోందిఈ విషయాన్ని తెలుసుకున్నవాడి శరీరంలో 'బ్రహ్మరంధ్రము నుంచి మధువు వర్శిస్తుంది

అతనికి ఇష్టా పూర్తి కలిగిస్తుంది. ఈ విషయం తెలియని వాడికి మధువు స్రవించదు అతని కర్మలు సఫలంకావు.


విశ్వము అంటే ప్రపంచం. పరమేశ్వరి ప్రపంచమంతా ఆవరించి ఉన్నది కాబట్టి విశ్వరూపా అనబడుతోంది.


బ్రహ్మాండము-విరాడ్రూపము. పిండాండము-జీవుని శరీరము. ఈ రెండింటికీ తేడా ఏమీలేదు. ఇక్కడ విశ్వరూపా అంటే పరమేశ్వరికి ఈ జగత్తుకూ భేదము లేదని భావము


ఈ కారణాలచేత పరమేశ్వరి విశ్వరూపా అనబడుతోంది.


 జాగరిణీ


జాగ్రదవస్థ అందరికీ ప్రసిద్ధమైనది. సర్వేంద్రియ గోచరమైనది. ప్రభోధాత్మకమైన సర్వేంద్రియజ్ఞానము గల విశ్వుడు అనే జీవుని అవస్థ జాగరము. అటువంటి జాగ్రదావస్థ గలది ఆ పరమేశ్వరి.

 జాగ్రదవస్థలో స్థూలశరీరాభిమాని అయిన దేవి విశ్వునిరూపంలో ఉంటుంది. అందుచేత జాగరిణీ అనబడుతోంది. మాండూక్యోపనిషత్తులో

సోయమాత్మాచతుప్పాత్‌ ఆత్మకు నాలుగుపాదాలు ఉన్నాయి. అందులో మొదటిది

జాగరితస్థానో బహిః  ప్రజ్ఞః సప్తాంగ ఏకోనవింశతి

ముఖః ! స్థూల భుగ్‌ వైశ్వానరో ప్రథమపాదః ॥

ఆత్మ యొక్క మొదటిపాదం వైశ్వానరుడు. ఇతడు విశ్వంలోని నరులందరికీ ప్రతినిధి. స్థూల శరీరమున్నవారందరికీ ప్రతినిధి. భోగాలు అనుభవించటానికి ఈ దేహమే ఆధారం. జీవి ఈ శరీరంతోనే సుఖదుఃఖాలు అనుభవిస్తాడు.


గృహస్తుకు గృహంలాగా జీవికి దేహం ఆధారమై ఉన్నది. జగత్తులో ఇటువంటి దేహానికి ప్రతినిధి వైశ్వానరుడు. జాగ్రదవస్థ ఇతని సంచారస్థానము. ఆ రూపంలో ఉన్నది కాబట్టే పరమేశ్వరి జాగరిణీ అనబడుతోంది.


స్వపంతీ


నిద్రావస్థాయామంతః ప్రజ్ఞామాత్రేణ ప్రపంచానుభవో వాసనారూపేణ సః స్వప్నః


నిద్రావస్థయందలి మానసికమగు ప్రపంచానుభవము స్వప్నము అని తెలియబడును. స్వప్నమనేది సూక్ష్మశరీర సంబంధమైన వ్యవహారము. జాగ్రదవస్థలో ప్రపంచానుభవాలన్నీ బీజం రూపంలో ఉండి, స్వప్నకాలంలో మనసుకు కనిపిస్తాయి. ఇవి అన్నీ ఈ జన్మలోని అనుబంధాలే అవనవసరంలేదు. ఆ అనుభూతులు గతజన్మలకు సంబంధించినవి కూడా

కావచ్చు. ఈ దశలో శరీరంలోని ఇంద్రియాలు విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయి. మనస్సు మేల్కొని ఉంటుంది. ఈ మనస్సే ఇంద్రియధర్మాలను నిర్వర్తిస్తూ ఉంటుంది.

జాగ్రదవస్థలో ఇంద్రియజ్ఞానము స్థిరము. స్వప్నావస్థలో ఇంద్రియజ్ఞానము స్థిరము కాదు. మనసే ఇంద్రియాల పనులన్నీ చేస్తుంటుంది. స్వప్నమనేది కేవలము మానసిక సంబంధము. నిద్రాసమయంలో విషయాలు తెలుస్తాయి. మెలకువరాగానే అవన్నీ

మాయమవుతాయి. ఈ రకంగా సూక్ష్మశరీరంతో మానవుడు పొందే అనుభూతికి ఆ పరమేశ్వరియే సాక్షీభూతంగా ఉన్నది. అందుకే ఆమె స్వపంతీ అనబడుతుంది.

 

 తైజసాత్మికా

స్వప్నస్థానము పొందిన సూక్ష్మదేహాభిమాని అయిన జీవుల సమిష్టిరూపుడైన తైజసుడను హిరణ్యగర్భుని యొక్క ఆత్మ గలది.


స్వప్నము సూక్ష్మదేహము యొక్క వ్యవహారము. ఈ స్థితిలో వ్యష్టిదేహాభిమాని తైజసుడు. సమిష్టిగా అతడు హిరణ్యగర్భుడు. సూక్ష్మదేహంతో చేసే కర్మలన్నింటికీ సాక్షి ఆ పరమేశ్వరి. ఆమె తైజసుని రూపంలో ఉంటుంది. కాబట్టి తైజసాత్మికా అనబడుతున్నది.

మాండుక్యోపనిషత్తులో స్వప్నస్థానాన్ని వివరిస్తూ


స్వప్నస్థానోల. ౦తః ప్రజ్ఞః ! సప్తాంగ ఏకోనవింశతిముఖః


ప్రవివిక్త భుక్‌ తైజసో ద్వితీయ పాదః ॥


ఆత్మ యొక్క రెండవపాదము తైజసుడు. అదే మానసికస్థితి. ఈ మానసికస్థితికి హిరణ్యగర్భుడని పేరు. ఇతడు అంతర్ముఖమైన చేతన కలవాడు. స్వప్నంలో జరిగే విషయాలను మాత్రమే గ్రహించగలడు.


ఆ తైజసుని ఆత్మ గల పరమేశ్వరి తైజసాత్మికా అనబడుతుంది.


సుప్తా

సుప్తా అంటే ఇంద్రియవ్యాపారము నశించిన నిద్రావస్థ. శివసూత్రాలలో ఇది మాయ, అజ్ఞానము సౌషుప్తము అని ఉన్నది. బాహ్య వస్తువులను గురించిన జ్ఞానము ఏ

మాత్రము ఉండదు. అందుకే నేను సుఖంగా నిద్రపోయాను నాకేం తెలియదు అంటాడు. ఇలా చెప్పటంవల్ల అవిద్యావృత్తులు మూడు ప్రస్ఫుటమవుతున్నాయి. 1. అజ్ఞానము 2. అహంభావము 3. సుఖము. ఈ మూడు వృత్తులు కలది సుషుప్తావస్థ. ఈ అవస్థకు అభిమాని ప్రాజ్ఞుడు.


నిర్వికార స్వరూపస్థితినే సుషుప్తి అంటారు. ఈ అవస్థను సంప్రసాదావస్థ అని కూడా అంటారు. మనస్సు, బుద్ధి కూడా హృదయంలో లీనమయ్యే స్థితి అది.


ఈ స్థితిలో ఇంద్రియాలు, బుద్ధి ముఖ్య ప్రాణంలో కలిసిపోతాయి. ఈ రకంగా మనసు, బుద్ధి కూడా లయమయినప్పటికీ, మెలకువరాగానే తాను సుఖంగా నిద్రించాను అని తెలుస్తోంది. అంటే జ్ఞానము మాత్రము ఉన్నది. ఇక్కడ ఆనందాన్ని పొందుతుంది. కాబట్టి పరమేశ్వరి సుప్తా అనబడింది.


ప్రాజ్ఞాత్మికా

సుషుప్తిలో ఆనందము పొందిన జీవులయొక్క సమిష్టిరూపము కలది ఆ పరమేశ్వరి. ఈ స్థితిలో జీవుడు వ్యష్టిగా ప్రాజ్ఞుడు, సమిష్టిగా ఈశ్వరుడు. ప్రాజ్ఞుడిరూపంలో ఉన్నది కాబట్టి ఆ దేవి ప్రాజ్ఞాత్మికా అనబడుతుంది. మాండూక్యోపనిషత్తులో


నిద్రించినపుడు ఏ కోరికలు, కలలు లేని స్థితి సుషుప్తి. గాఢనిద్ర. ప్రాజ్ఞుడు సుషుప్తిలో సంచారం చేస్తాడు. ఇక్కడ అతని అనుభవాలన్నీ ఏకమైపోతాయి. చేతనాశక్తి అంటే గ్రహణశక్తి అస్పష్టంగా నిలచిపోతుంది. అసలు అతను చేతనుడా ? కాదా ? అని కూడా అనిపిస్తుంది. అటువంటి ప్రాజ్ఞుని ఆత్మగా కలది కాబట్టి ప్రాజ్ఞాత్మికా అనబడుతుంది ఆ పరమేశ్వరి.

 

తుర్యా


ఇది యోగంలో సాధించే స్థితి. మనస్సు, బుద్ధి రెండూ బ్రహ్మరంధ్రం చేరినప్పుడు కలిగే స్థితి, ఇది స్థూల సూక్ష్మ కారణ శరీరాలకు అతీతమైనది. మనస్సు, బుద్దుల

యొక్క మార్పులను బట్టి అవస్థలు మారతాయి.


మనసు బుద్ధి కళ్ళను ఆశ్రయిస్తే - జాగ్రదవస్థ

మనసు బుద్ది మనోగతమైతే -  స్వప్నావస్థ

అవి హృదయగతమైతే - సుషుప్తావస్థ

అవి సహస్రారం చేరితే - తురీయావస్థ


సాధకుడు యోగసాధనలో తురీయస్థితి చేరటము గతంలో వివరించటం జరిగింది. ఈ రకంగా మూడు అవస్థలలోనూ ఉంటూ అన్నింటికీ సాక్షీభూతమైనది కాబట్టే ఆ పరమేశ్వరి తుర్యా అనబడింది.


అందుకే లలితా అష్టోత్తరంలో జాగ్రస్వప్నసుషుప్తీనాం సాక్షిభూత్యైనమోనమః అని చెప్పబడింది.

          

సర్వావస్థావివర్జితా


జాగ్రస్వప్న సుషుప్తులు మూడు అవస్థలు నాల్గవది తురీయావస్థ. ఇక ఐదవ అవస్థ తురీయాతీతము. తురీయాన్ని దాటిన తరువాత సాధకుడు అన్నింటినీ వదలివేస్తాడు.

వివర్జిత - వర్జించినది. విడిచినది. ఒక దాని నుంచి వేరొక దానికి రాలేనిది. పునరావృత్తి లేనిది. ఈ అవస్థ వ్యష్టి సమష్ట్యాత్మకమైనది. తురీయాన్ని గనక గట్టిగాసాధిస్తే,

తురీయాతీతము లభిస్తుంది. ఇదే పరమపదము. తుర్యాతీతము పొందినవాడు శివునితో సమానమగును. ఏ మాత్రము ద్వైతభావము లేనిస్థితి. ఇక్కడ కాలభేదముండదు. అన్ని కాలాలయందు ఆనందమే స్వరూపము. ఇటువంటి సాధకుడు జీవన్యుక్తుడు. దేహేంద్రియాలు ఉన్నప్పటికీ అతడు కర్మలు చెయ్యడు. మాడిపోయి మొలకెత్తటానికి

పనికిరాని విత్తనము వంటివాడు.


అతడు జీవించి ఉన్నప్పటికీ కర్మలు చేయడు. లోకంతో అతనికి సంబంధం లేదు. అతడు పరమేశ్వర స్వరూపుడు.

ఈ రకంగా జీవి యొక్క ఐదు అవస్థలను వివరించటం జరిగింది.