My Spiritual Research Sounds-Vibrations-Reactions-Connectivity- నేను చదివిన,తెలుసుకొన్న కొన్ని విషయల గమనికలు.. కేవలం నా పునఃపరిశీలన కోసం వ్రాసుకున్నది- దయచేసి తప్పులు ఎమైన వున్నా, అభ్యంతరాలు ఎమైన వున్న తెలుపగలరు - సురేష్ కలిమహంతి
Translate
Monday, December 14, 2015
Excellent Song Of Lord Shiva Ever
ఈశ గిరీశ నరేశ పరేశ మహేశ బిలేశయభూషణ భో |
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగమ్ ||
ఉమయా దివ్యసుమంగళవిగ్రహయాలింగితవామాంగ విభో |
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగమ్ ||
ఊరీకురు మామజ్ఞమనాథం దూరీకురుమే దురితంభో |
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగమ్ ||
శివాయ నమఓం, శివాయ నమహ, శివాయ నమఓం, నమశ్శివాయ (2)
ఋషివరమానసహంస చరాచర జనన స్థితిలయ కారణభో |
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగమ్ ||
అంతఃకరణ విశుద్దిం భక్తిం చత్వయి సతీం ప్రదేహి విభో |
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగమ్ ||
కరుణావరుణాలయ మయి దాస ఉదాసస్తవో చితో నహిభో |
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగమ్ ||
శివాయ నమఓం, శివాయ నమహ, శివాయ నమఓం, నమశ్శివాయ (2)
జయ కైలాసనివాస ప్రమథగణాధీశ భూసురార్చితభో |
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగమ్ ||
ఝణుతక ఝంకిణు ఝణుతత్కిటతక-శబ్దైర్నటసి మహానటభో
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగమ్ ||
ధర్మస్థాపనదక్ష త్ర్యక్ష గురో దక్ష యజ్ఞ శిక్షక భో |
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగమ్ ||
శివాయ నమఓం, శివాయ నమహ, శివాయ నమఓం, నమశ్శివాయ (2)
బలమారోగ్యం చాయుస్త్వద్గుణ రుచితాం చిరంప్రదేహి విభో |
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగమ్ ||
భగవన్భర్గ భయాపహ భూతపతే భూతిభూషితాంగ విభో |
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగమ్ ||
సర్వ దేవ సర్వోత్తమ సర్వద దుర్విత,,గర్వహరణ విభో |
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగమ్ ||
శివాయ నమఓం, శివాయ నమహ, శివాయ నమఓం, నమశ్శివాయ (2)
సత్యం జ్ఞానమనంతం బ్రహ్మేత్యే తల్లక్షణ లక్షిత భో |
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగమ్||
హాహాహూహూముఖసురగాయకగీతాపదానపద్య విభో |
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగమ్||
శివాయ నమఓం, శివాయ నమహ, శివాయ నమఓం, నమశ్శివాయ (2)
Khaleja-Sada Shiva sanyasi HD Full Video song www.princemahesh.com
ఓం నమో శివరుద్రాయ ఓం నమో శితికంఠాయ
ఓం నమో హర నాగాభరణాయ ప్రణవాయ
ఢమ ఢమ ఢమరుక నాదానందాయ ఓం నమో నిటలాక్షాయ
ఓం నమో భస్మాంగాయ ఓం నమో హిమశైలావరణాయ ప్రమదాయ
ధిమి ధిమి తాండవకేళీ లోలాయ సదాశివా సన్యాసీ తాపసి కైలాసవాసి
నీ పాదముద్రలు మోసి పొంగిపోయినాది పల్లె కాశి
హే సూపుల సుక్కాని దారిగా సుక్కల తివాసి మీదుగా
సూడసక్కని సామి దిగినాడురా వేసేయరా ఊరూవాడా దండోరా
హే రంగుల హంగుల పొడ లేదురా వీడు జంగమ శంకర శివుడేనురా
నిప్పు గొంతున నిలుపు మచ్చ సాచ్చిగా నీ తాపం శాపం తీర్చే వాడేరా
పైపైకలా భైరాగిలా ఉంటాదిరా ఆ లీల
లోకాలనేలే తోడు నీకు సాయం కాకపోడు
హే నీలోనే కొలువున్నోడు నిన్ను దాటి పోనే పోడు
ఓం నమః శివ జై జై జై ఓం నమః శివ జై జై జై
ఓం నమః శివ groove to the trans and say జై జై జై
Sing Along Sing శివ శివ శంభో All the way
ఓం నమః శివ జై జై జై Heal the world is all we pray
Save our lives and take our pain away జై జై జై
Sing Along Sing శివ శివ శంభో All the way
సదాశివా సన్యాసీ తాపసి కైలాసవాసి
నీ పాదముద్రలు మోసి పొంగిపోయినాది పల్లె కాశి
ఎక్కడ వీడుంటే నిండుగా అక్కడ నేలంతా పండగ
చుట్టు పక్కల చీకటి పెల్లగించగా అడుగేశాడంట కాచే దొరలగా
మంచును మంటను ఒకతీరుగా లెక్క సెయ్యనే సెయ్యని శంకరయ్యగా
ఉక్కుపెంచగా ఊపిరి నిలిపాడురా మనకండా దండా ఇక వీడే నికరంగా
సామీ అంటే హామీ తనై ఉంటాడురా చివరంటా
లోకాలనేలే తోడు నీకు సాయం కాకపోడు
హే నీలోనే కొలువున్నోడు నిన్ను దాటి పోనే పోడు
ఓం నమః శివ జై జై జై ఓం నమః శివ జై జై జై
ఓం నమః శివ groove to the trans and say జై జై జై
Sing Along Sing శివ శివ శంభో All the way
ఓం నమః శివ జై జై జై Heal the world is all we pray
Save our lives and take our pain away జై జై జై
Sing Along Sing శివ శివ శంభో All the way
Swarna Kamalam Movie Songs | Andela Ravali Video Song | Venkatesh, Bhanu...
గురుః బ్రహ్మ గురుః విష్ణుః గురుః దేవో మహేశ్వరః
గురుః సాక్షాత్ పరబ్రహ్మ గురుః సాక్షాత్ పరబ్రహ్మ
తస్మై శ్రీ గురవే నమః
ఓం నమో నమో నమః శివాయ
మంగళప్రదాయ గోతురంగతే నమః శివాయ
గంగయా తరంగితోత్త మాంగతే నమః శివాయ
ఓం నమో నమో నమః శివాయ
శూలినే నమో నమః కపాలినే నమః శివాయ
పాలినే విరంచితుండ మాలినే నమః శివాయ
అందెల రవమిది పదములదా
అందెల రవమిది పదములదా అంబరమంటిన హృదయముదా
అందెల రవమిది పదములదా అంబరమంటిన హృదయముదా
అమృతగానమిది పెదవులదా అమితానందపు యద సడిదా
సాగిన సాధన సార్థకమందగ యోగబలముగా యాగఫలముగా
సాగిన సాధన సార్థకమందగ యోగబలముగా యాగఫలముగా
బ్రతుకు ప్రణవమై మ్రోగు కదా .. అందెల రవమిది పదములదా
మువ్వలు ఉరుముల సవ్వడులై మెలికలు మెరుపుల మెలకువలై
మువ్వలు ఉరుముల సవ్వడులై మెలికలు మెరుపుల మెలకువలై
మేను హర్ష వర్షమేఘమై.. వేణి విసురు వాయువేగమై
అంగభంగిమలు గంగ పొంగులై హావభావములు నింగి రంగులై
లాస్యం సాగే లీల రసఝరులు జాలు వారేలా
జంగమమై జడమాడగా జలపాతగీతముల తోడుగా
పర్వతాలు ప్రసవించిన పచ్చని ప్రకృతి ఆకృతి పార్వతి కాగా
అందెల రవమిది పదములదా
నయనతేజమే నకారమై .. మనోనిశ్చయం మకారమై
శ్వాసచలనమే శికారమై .. వాంఛితార్థమే వకారమై
యోచన సకలము యకారమై
నాదం నకారం మంత్రం మకారం స్తోత్రం శికారం
వేదం వకారం యజ్ఞం యకారం
ఓం నమః శివాయ
భావమే భవునకు భావ్యము కాగా .. భరతమే నిరతము భాగ్యము కాగా
తుహిన గిరులు కరిగేలా తాండవమాడే వేళా
ప్రాణపంచమమే పంచాక్షరిగా పరమపదము ప్రకటించగా
ఖగోళాలు పద కింకిణులై పది దిక్కుల ధూర్జటి ఆర్భటి రేగా
అందెల రవమిది పదములదా అంబరమంటిన హృదయముదా
అమృతగానమిది పెదవులదా అమితానందపు యద సడిదా
అందెల రవమిది పదములదా ...
Anveshana Songs - Keeravaani - Karthik, Banupriya
సా ని స రి సా ని సా ని స మ గా మ రి
ప ద సా ని స రి సా ని సా ని స మ గా మ రి
ప ద స స స ని రి రి రి స గ గ గ రి
మ మ మ గ పా సా ని ద ప మ గ రి స ని
కీరవాణి చిలకలా కొలికిరో పాడవేమే
వలపులే తెలుపగా విరబూసిన ఆశలు విరితేనేలు చల్లగ
అలరులు కురిసిన ఋతువుల తడిసిన మధురసవాణి
కీరవాణి చిలకలా కొలికిరో పాడవేమే
వలపులే తెలుపగా
గ రి స ప మ గ పా ని స రి గ రి గ స నీ ప
ఈ పూలలో అందమై ఈ గాలిలో గంధమై
నా తోటలో చైత్రమై ఈ బాటనే నడచిరా
నీ గగనాలలో నే చిరుతారనై ... నీ అధరాలలో నే చిరునవ్వునై
స్వరమే లయగా ముగిసే
సలలిత కలరుత స్వరనుత గతియుత గమకము తెలియకనే
కీరవాణి చిలకలా కలకలా పాడలేదు
వలపులే తెలుపగా ఇల రాలిన పువ్వులు వెదజల్లిన తావుల
అలికిడి ఎరుగని పిలుపుల అలిగిన మంజులవాణీ
కీరవాణీ చిలకలా కలకలా పాడలేదు
వలపులే తెలుపగా
నీ కన్నుల నీలమై ... నీ నవ్వుల వెన్నెలై
సంపెంగల గాలినై తారాడనా నీడనై
నీ కవనాలలో నే తొలిప్రాసనై నీ జవనాలలో జాజులవాసనై
యదలో యదలే కదిలే
పడుచుల మనసుల పంజరసుఖముల పలుకులు తెలియకనే
కీరవాణి చిలకలా కలకలా పాడలేదు
వలపులే తెలుపగా విరబూసిన ఆశలు విరితేనేలు చల్లగ
అలరులు కురిసిన ఋతువుల తడిసిన మధురసవాణి
కీరవాణి చిలకలా కొలికిరో పాడవేమే
వలపులే తెలుపగా
Subscribe to:
Posts (Atom)