Translate

Monday, December 14, 2015

Swarna Kamalam Movie Songs | Andela Ravali Video Song | Venkatesh, Bhanu...



గురుః బ్రహ్మ గురుః విష్ణుః గురుః దేవో మహేశ్వరః
గురుః సాక్షాత్ పరబ్రహ్మ గురుః సాక్షాత్ పరబ్రహ్మ
తస్మై శ్రీ గురవే నమః

ఓం నమో నమో నమః శివాయ
మంగళప్రదాయ గోతురంగతే నమః శివాయ
గంగయా తరంగితోత్త మాంగతే నమః శివాయ
ఓం నమో నమో నమః శివాయ
శూలినే నమో నమః కపాలినే నమః శివాయ
పాలినే విరంచితుండ మాలినే నమః శివాయ

అందెల రవమిది పదములదా
అందెల రవమిది పదములదా అంబరమంటిన హృదయముదా
అందెల రవమిది పదములదా అంబరమంటిన హృదయముదా
అమృతగానమిది పెదవులదా అమితానందపు యద సడిదా
సాగిన సాధన సార్థకమందగ యోగబలముగా యాగఫలముగా
సాగిన సాధన సార్థకమందగ యోగబలముగా యాగఫలముగా
బ్రతుకు ప్రణవమై మ్రోగు కదా .. అందెల రవమిది పదములదా

మువ్వలు ఉరుముల సవ్వడులై మెలికలు మెరుపుల మెలకువలై
మువ్వలు ఉరుముల సవ్వడులై మెలికలు మెరుపుల మెలకువలై
మేను హర్ష వర్షమేఘమై.. వేణి విసురు వాయువేగమై
అంగభంగిమలు గంగ పొంగులై హావభావములు నింగి రంగులై
లాస్యం సాగే లీల రసఝరులు జాలు వారేలా
జంగమమై జడమాడగా జలపాతగీతముల తోడుగా
పర్వతాలు ప్రసవించిన పచ్చని ప్రకృతి ఆకృతి పార్వతి కాగా
అందెల రవమిది పదములదా

నయనతేజమే నకారమై .. మనోనిశ్చయం మకారమై
శ్వాసచలనమే శికారమై .. వాంఛితార్థమే వకారమై
యోచన సకలము యకారమై
నాదం నకారం మంత్రం మకారం స్తోత్రం శికారం
వేదం వకారం యజ్ఞం యకారం
ఓం నమః శివాయ
భావమే భవునకు భావ్యము కాగా .. భరతమే నిరతము భాగ్యము కాగా
తుహిన గిరులు కరిగేలా తాండవమాడే వేళా
ప్రాణపంచమమే పంచాక్షరిగా పరమపదము ప్రకటించగా
ఖగోళాలు పద కింకిణులై పది దిక్కుల ధూర్జటి ఆర్భటి రేగా
అందెల రవమిది పదములదా అంబరమంటిన హృదయముదా
అమృతగానమిది పెదవులదా అమితానందపు యద సడిదా
అందెల రవమిది పదములదా ...

No comments:

Post a Comment