Translate

Monday, May 25, 2020

విజ్ఞాన భైరవ in తెలుగు (Telugu Vigyana Bharava)- My Notes


విజ్ఞాన భైరవ తంత్రం :


  ప్రపంచం లోని అత్యుత్తమ ధ్యాన సాహిత్యం లో *రుద్ర యామళ తంత్రం* లో భాగమైన *విజ్ఞాన భైరవ తంత్రం* ఒకటి. దీనిమీద చాలా మంది ఇప్పటికే వ్యాఖ్యానించి ఉన్నారు. ఓషో రజనీష్ గారు దీనిపైన ఇచ్చిన ఉపన్యాసాలు *"The Book of Secrets"* అనే పేరుతో పబ్లిష్ అయి అమెరికాలో మూడు దశాబ్దాల క్రితం సంచలనం సృష్టించింది.

ఇటువంటి తంత్ర గ్రంధాలు ఎన్నో మూర్ఖులు,హింసా వాదుల దండ యాత్రలలో నాశనం అయ్యాయి. నలందా విశ్వ విద్యాలయం తగులబెట్టి నపుడు కొన్ని లక్షల విలువైన రీసెర్చి పుస్తకాలు నాశనం అయ్యాయి.  నెలల పాటు ఆ లైబ్రరీ తగులబడుతూనే ఉందంటే... ఎన్ని లక్షల విలువైన పుస్తకాలు అందులో భస్మం అయ్యాయో ఊహించుకోవచ్చు. ఆ జ్ఞానంతరువాత తరాలకు అందకుండా మాయం అయ్యింది.

 *Witch Hunt* పేరుతో మధ్య యుగాలలో ఎందఱో మార్మిక విజ్ఞాన ఖనులైన వనితలను , యోగులను,తాంత్రికులను , మంత్రగాండ్రు అనే పేరుతో పైశాచికంగా సజీవ దహనం చేసారు, కొంత మంది మూర్ఖ ధర్మాల వారు.

అలా దాడులలో నాశనం కాగా మిగిలిన అతి కొద్ది తంత్ర గ్రంధాలలో ఇదీ ఒకటి. ఈ ప్రక్రియల లోతునీ, అర్థ బాహుళ్యాన్నీ పరిశీలిస్తే మన దేశపు విజ్ఞానం ఎంతటి ఉన్నతమో అర్థం అవుతుంది. నాశనం అయి మనకు అందకుండా పోయినవిజ్ఞాన సంపదను తలుచుకుంటే భారతీయుని గా పుట్టిన ప్రతివానికీ కన్నీరు కారుతుంది. ఇటువంటి మతాలు మనకు ఏదో నేర్పాలని చూడటం వింతల్లో వింత. తాతకు దగ్గులు నేర్పటం లాంటిది.

విజ్ఞాన భైరవ తంత్రం లో శివుడు శక్తి కి ఉపదేశించిన 112 ధ్యాన విధానాలు ఉన్నాయి. ఈ జ్ఞానాన్ని నేరుగా పొందాలి, అనుకునే వారికి ఉపయోగ పడే దీపికలు. ముఖ్యంగా ఏకాగ్రతను, ధారణను అభ్యాసం చేసేవారు వీటినిఆచరించ వచ్చు. వారి వారి అభ్యాస తీవ్రతను బట్టి ఫలితాలు పొందవచ్చు.

వీటిలోని ఔన్నత్యం ఏమిటంటే ఎక్కడాదేవతల గురించి పూజల గురించి నమ్మకం గురించి చెప్పని కేవల జ్ఞాన సంబంధ మైన సాహిత్యం ఇది. ఈ ప్రక్రియచెయ్యి ఈ ఫలితం పొందు అని మాత్రమే చెబుతుంది. అందుకే పేరు కూడా చాలా సరిగ్గా *విజ్ఞాన భైరవ తంత్రం* అనిపెట్టారు. ఈ 112 అభ్యాసాలనూ వరుసగా చూద్దాం.
 

   ఈ విజ్ఞాన భైరవ తంత్రం వేదాంతపరము మరియు లోతైన ముక్తిపరమైన కాశ్మీర శైవానికి సంబంధించిన ప్రాచీన గ్రంథం. దీనికి ఎక్కడా తెలుగు బాషలో మూలం కానీ భావం కానీ లభ్యం కావట్లేదు. ఇందులో స్వయంగా ఈశ్వరుడు పార్వతికి *తంత్ర మార్గంలో* ధ్యాన పద్ధతులను ఉపదేశం చేస్తాడు.  *భైరవ తత్త్వం ఏమిటి?* అని...శివుణ్ణి ప్రశ్నిస్తుంది. అప్పుడు ఈశ్వరుడు *భైరవ తత్త్వం* ఆలోచనా పరిధికి అందేది కాదని వివరిస్తూ భైరవి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునేందుకు *112* విధాలైన ధ్యాన మార్గాలను వివరిస్తాడు. ఆ ధ్యానాల సమాహారమే ఈ *విజ్ఞాన భైరవ తంత్రం*. ఇందులో ధ్యానపద్ధతులన్నీ సంభవోపాయం (ఉన్నత జ్ఞానం కలిగినవారు పాటించతగిన పద్ధతి), శక్త్యోపాయం (కొంచెం జ్ఞానం కలిగినవారు పాటించతగిన పద్ధతి) మరియు ఆణవోపాయం (సామాన్య పద్ధతి)గా విభజించబడ్డాయి. సాధారణంగా శక్త్యోపాయం బాహ్య ప్రపంచంపై ఆధారపడేదిగాను, సంభవోపాయం పూర్తిగా అంతర్గతం మరియు నిరాధారంగానూ ఉంటాయి. కాశ్మీర శైవానికి మూలపురుషుడైనటువంటి అభినవగుప్తుడి ప్రకారం ఒక ఆధ్యాత్మికాభిలాషి తగినంత అవగాహన చేకూర్చుకుని సంభవోపాయాన్నే ఎంచుకోవాలి.


 విజ్ఞాన భైరవ తంత్రమన్నది *భైరవాగమము* నందు గల రుద్రయామళ తంత్రమునందొక భాగము. ఇది జ్ఞాన తంత్రము.
అనగా భౌతికములైన తంతులతో సంబంధము లేని, ధారణా విధానములు దీనిలో చెప్పబడినవి.
నూట పన్నెండు పైగా ధారణా విధానములు దీనిలో ఉన్నవి.

దక్షిణ భారతము కంటే ఉత్తర, తూర్పు భారతమున ఈ తంత్ర ఉపాసకులు ఎక్కువగా మనకు కన్పిస్తూ ఉంటారు.
ముఖ్యముగా, కాశ్మీర శైవమునకు చెందిన త్రిక సాంప్రదాయులగు కౌలాచారులకు ఇది ప్రామాణిక గ్రంథము.

   ప్రాణ నిగ్రహము, మనో నిగ్రహము, ధారణ, ధ్యానములు అలవాటైన వారు మాత్రమే ఈ సాధనలను చేయగలరు.
మిగతా వారికి ఊరకే చదివి ఆనందించుటకు మాత్రమే ఇవి ఉపయోగిస్తాయి. ధారణా విధానములు సూటిగా బోధించుట ఈ తంత్రము ప్రత్యేకత.

తంత్ర మార్గమందు నడిచే ఇచ్చ ఉన్నవారు, సమర్ధుడైన గురువును అన్వేషించి, ఆయన ద్వారా ఈ ధారణల యొక్క
లోతుపాతులను గ్రహించి, వాటిని అభ్యసించినచో, అవి సూచించుచున్నట్టి అనుభవములను పొందగలుగుతారు.
 

 పూర్ణ భైరవ తత్వాన్ని ఆధ్యాత్మిక రూపాన్ని అవగాహన చేసుకోవాలంటే,  *"విజ్ఞాన భైరవ తంత్రం"* చదవాలి. ఇందులో అనేక రహస్యాలూ శూన్యానికి, ప్రణవానికి, యోగానికి వున్న సంబంధాలూ వున్నాయి. ఇందులో భైరవుడు యోగిగా, పరబ్రహ్మ తత్వంతో కనిపిస్తాడు. పతంజలి యోగసూత్రాలవంటి యోగ రహస్యాలని విశదీకరిస్తాడు.


  *యధాలోకేన దీపస్య* *కిరణౌర్భాస్కరస్య చ*
*జ్ఞాయతే దిగ్విభాగాది తద్వచ్చక్యా శివః ప్రియే*


సూర్యకిరణాలతో లోకం తేజోమయమై దర్శనీయమైనట్లు శివుడుకూడా (స్వ)శక్తి వల్ల దర్శనీయమౌతాడు. శక్తి పెరిగేకొద్ది శివానుభూతి అనుభవైకవేద్యమవుతుంది.


*ఓం నమః శివాయ*

Source : poojanilayam Blog

Tset- 2

Test-2

Test-1

tstesr

Thursday, May 21, 2020

బ్రాహ్మీ ముహూర్తం.- Brahmi Muhurtam-Telugu


























బ్రహ్మ ముహూర్తం

*అద్భుతమైన వరం బ్రహ్మముహూర్తం.పూర్వం కాలాన్ని ఘడియలలో లెక్కించేవారు. ఒక ఘడియకు మన ప్రస్తుత కాలమాన ప్రకారంగా 24 నిమిషాలు. ఒక ముహూర్తం అనగా 2 ఘడియల కాలం అని అర్థం. అంటే 48 నిమిషాలను ఒక ముహూర్తం అంటారు. ఒక పగలు, ఒక రాత్రినీ కలిపిన మొత్తాన్ని అహోరాత్రం అంటారు. ఒక అహోరాత్రంకు ఇలాంటివి 30 ముహూర్తాలు ఉంటాయి. అంటే… ఒక రోజులో 30 ముహూర్తాలు జరుగుతాయి. సూర్యోదయమునకు ముందు వచ్చే ముహూర్తాలలో మొదటిది. దీనినే ‘బ్రహ్మముహూర్తం’ అంటారు. అంటే రోజు మొత్తంలో 29వది బ్రహ్మ ముహూర్తం. ఈ ముహూర్తానికి అధిదేవత బ్రహ్మ. కాబట్టి దీనికి బ్రహ్మ ముహూర్తం అనే పేరు వచ్చింది.నిజానికి తెల్లవారుజామును 2 భాగాలుగా విభజించారు.*


 *సూర్యోదయమునకు 2 ఘడియల ముందు కాలాన్ని అనగా 48 నిమిషముల ముందు కాలాన్ని ఆసురీ ముహూర్తం అని ఆసురీ ముహుర్తానికి ముందు 48 నిమిషముల ముందు కాలాన్ని బ్రహ్మముహూర్తం అని అంటారు. ప్రతిరోజు బ్రహ్మముహుర్తమున లేచి భగవంతుని ధ్యానించి పనులు ప్రారంభించాలని అంటారు. బ్రహ్మమూహూర్తానికి ఉన్న అత్యధిక ప్రాధాన్యత దృష్ట్యా అనేక మంది నూతన గృహప్రవేశానికి ఈ సమయాన్ని ఎన్నుకుంటారు. ఈ సమయంలోనే మానవుని మేథాశక్తికి భగవంతుని శక్తి తోడవుతుంది.*


 *పురాణగాథ బ్రహ్మముహూర్తం అనే పేరు ఎలా వచ్చిందనే విషయంపై పురాణగాథలు ఉన్నాయి. కశ్యప బ్రహ్మకు, వినతకు జన్మించిన వాడు అనూరుడు. ఈయన గరుత్మంతునికి సోదరుడు. ఇంకా అనూరుడు సూర్యునికి రథసారథి. ఒక సమయంలో తల్లి వినత పుత్రుడిని చూసుకోవాలని కుతూహలంతో అండం పగల గొట్టింది.* 


*అప్పుడు సగం శరీరంతో అనూరుడు జన్మించాడు. బ్రహ్మ అతన్ని సూర్యునికి సారథిగా నియమించి, నీవు భూలోకాన మొదటగా కనిపించిన కాలమునే బ్రహ్మముహూర్త కాలమంటారు. ఆ సమయమున ఏ నక్షత్రాలు, గ్రహలుగాని చెడు చేయలేవు అని అనూరునికి వరమిచ్చాడు.అందుకే బ్రహ్మముహూర్త కాలం అన్ని శుభ కార్యాలకు ఉన్నతమైందని శాస్త్రం చెబుతోంది. ఈ బ్రహ్మ ముహూర్తకాలమున చదివే చదువు.. చేసే శుభకార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని చెప్పవచ్చు. ఏం చేయాలి..?*


*ఉదయం 3 గంటల నుంచి 6 గంటల వరకు ఉండే సమయం బ్రహ్మముహూర్తం. ఆధ్యాత్మిక చింతన చేసేవారికి, విద్యార్ధులకు, ధ్యానం, జపతపాదులు చేయువారికి చాలా విలువైన సమయం. ఆ సమయంలో మనసు ప్రశాంతంగా ఉండి స్వచ్ఛంగా ఉంటుంది. సాత్వికమైన వాతావరణం కూడా గోచరిస్తుంటుంది. మనసు స్వచ్ఛంగా తెల్లకాగితంలా దైనందిన జీవితంలో ఉండే గజిబిజి ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి రాగ ద్వేషాలు, ఇష్టాయిష్టాలు లేని సమయం. ఈ సమయంలో మన మనసు ఎలా కావాలంటే అటు తేలికగా మారుతుంది.*


*ఆధ్యాత్మిక ఆనందాన్ని చాలా సులువుగా పొందవచ్చు. అందుకే ఆ సమయంలో యోగులు, పరమహంసలు, సన్యాసులు, ఋషులు… హిమాలయాలలో ధ్యానంలో ఉంటూ వారి వారి తపఃశక్తి తరంగాలను ప్రపంచమంతా ప్రసరింపచేస్తారు. అందువలన ఆ సమయంలో చేసే ధ్యానం మనకు ఆధ్యాత్మికంగా సిద్ధిస్తుంది. అయితే చాలామంది ఆ సమయంలో నిద్రతో సమయాన్ని వృధా చేస్తూ ఆధ్యాత్మిక తరంగాలని నష్టపోతుంటారు.*


*ఎలాంటి పూజలు, ధ్యానాలు, సాధనలు లేకపోయినా కనీసం మేలుకొని ఉండమంటారు మన పెద్దవాళ్లు.చల్లని నీటితో తలస్నానం చాలా మంచిది. దీంతో మెదడు, కళ్లు చల్లగా ఉంటాయి. బ్రహ్మముహూర్తంలో ధ్యానం, జపం, ప్రాణాయామం,ఆసనాలు, కీర్తనలు, స్తోత్రాలు సాధన చేయటం చాలా మంచిది.*


*బ్రహ్మముహూర్తం చాలా విలువైన కాలం. ఈ సమయాన్ని వృధా చేయకూడదు. పూజలకు, యోగాకు, ప్రాణాయామానికి ఉపయోగించుకోవాలి. పద్మాసనంలో గానీ, సుఖాసనంలో గానీ కూర్చుని చేసే ధ్యానానికి అ సమయంలో మనోశక్తి లభిస్తుంది. మొదలుపెట్టే ముందు 12 సార్లు ఓంకారం, 5 నిముషాలు ఏదైన కీర్తన పాడటం వలన మనసు త్వరగా భగవధ్యానంలో ఏకాగ్రతను కుదుర్చుకుంటుంది.*


*బ్రహ్మముహుర్తంలో చేసిన ఓంకార ధ్వని వలన సుషుమ్న నాడి తెరుచుకుంటుంది. అందుకే ఋషులు, యోగులు, ఈ సమయంలో బిగ్గరగా ఓంకారం జపిస్తారు. ఎపుడైతే మన నాసిక రంధ్రాలలోకి శ్వాస ప్రవహిస్తూ ఉంటుందో వెంటనే సుషుమ్న నాడి పని చేయడం మొదలుపెడుతుంది. అప్పుడే ధ్యానం బాగా కుదురుతుంది. ముందు మనం మన అంతర్యామిలోని ఆత్మలో లీనమై తద్వారా పరమాత్మను చేరుకుంటాము.*

Monday, May 4, 2020

సౌందయలహరి స్తోత్రం- Telugu Notes



భుమౌస్ఖలిత పాదానామ్ భూమిరేవా వలంబనమ్ |
త్వయీ జాతా పరాధానామ్ త్వమేవ శరణమ్ శివే ||

శివః శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం
న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి|
అతస్త్వామ్ ఆరాధ్యాం హరి-హర-విరిన్చాదిభి రపి
ప్రణంతుం స్తోతుం వా కథ-మక్ర్త పుణ్యః ప్రభవతి|| 1 ||

తనీయాంసుం పాంసుం తవ చరణ పంకేరుహ-భవం
విరించిః సంచిన్వన్ విరచయతి లోకా-నవికలమ్ |
వహత్యేనం శౌరిః కథమపి సహస్రేణ శిరసాం
హరః సంక్షుద్-యైనం భజతి భసితోద్ధూళ నవిధిమ్|| 2 ||

అవిద్యానా-మంత-స్తిమిర-మిహిర ద్వీపనగరీ
జడానాం చైతన్య-స్తబక మకరంద శ్రుతిఝరీ |
దరిద్రాణాం చింతామణి గుణనికా జన్మజలధౌ
నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి|| 3 ||

త్వదన్యః పాణిభయా-మభయవరదో దైవతగణః
త్వమేకా నైవాసి ప్రకటిత-వరభీత్యభినయా |
భయాత్ త్రాతుం దాతుం ఫలమపి చ వాంఛాసమధికం
శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ || 4 ||

హరిస్త్వామారధ్య ప్రణత-జన-సౌభాగ్య-జననీం
పురా నారీ భూత్వా పురరిపుమపి క్షోభ మనయత్ |
స్మరోఽపి త్వాం నత్వా రతినయన-లేహ్యేన వపుషా
మునీనామప్యంతః ప్రభవతి హి మోహాయ మహతామ్ || 5 ||

ధనుః పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచ విశిఖాః
వసంతః సామంతో మలయమరు-దాయోధన-రథః |
తథాప్యేకః సర్వం హిమగిరిసుతే కామపి కృపాం
అపాంగాత్తే లబ్ధ్వా జగదిద-మనంగో విజయతే || 6 ||

క్వణత్కాంచీ-దామా కరి కలభ కుంభ-స్తననతా
పరిక్షీణా మధ్యే పరిణత శరచ్చంద్ర-వదనా |
ధనుర్బాణాన్ పాశం సృణిమపి దధానా కరతలైః
పురస్తా దాస్తాం నః పురమథితు రాహో-పురుషికా || 7 ||

సుధాసింధోర్మధ్యే సురవిట-పివాటీ-పరివృతే
మణిద్వీపే నీపో-పవనవతి చింతామణి గృహే |
శివకారే మంచే పరమశివ-పర్యంక నిలయామ్
భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానంద-లహరీమ్ || 8 ||

మహీం మూలాధారే కమపి మణిపూరే హుతవహం
స్థితం స్వధిష్టానే హృది మరుత-మాకాశ-ముపరి |
మనోఽపి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపథం
సహస్రారే పద్మే స హరహసి పత్యా విహరసే || 9 ||

సుధాధారాసారై-శ్చరణయుగలాంత-ర్విగలితైః
ప్రపంచం సిన్ఞంతీ పునరపి రసామ్నాయ-మహసః|
అవాప్య స్వాం భూమిం భుజగనిభ-మధ్యుష్ట-వలయం
స్వమాత్మానం కృత్వా స్వపిషి కులకుండే కుహరిణి || 10 ||

చతుర్భిః శ్రీకంఠైః శివయువతిభిః పంచభిపి
ప్రభిన్నాభిః శంభోర్నవభిరపి మూలప్రకృతిభిః |
చతుశ్చత్వారింశద్-వసుదల-కలాశ్చ్-త్రివలయ-
త్రిరేఖభిః సార్ధం తవ శరణకోణాః పరిణతాః || 11 ||

త్వదీయం సౌందర్యం తుహినగిరికన్యే తులయితుం
కవీంద్రాః కల్పంతే కథమపి విరించి-ప్రభృతయః |
యదాలోకౌత్సుక్యా-దమరలలనా యాంతి మనసా
తపోభిర్దుష్ప్రాపామపి గిరిశ-సాయుజ్య-పదవీమ్ || 12 ||

నరం వర్షీయాంసం నయనవిరసం నర్మసు జడం
తవాపాంగాలోకే పతిత-మనుధావంతి శతశః |
గలద్వేణీబంధాః కుచకలశ-విస్త్రిస్త-సిచయా
హటాత్ త్రుట్యత్కాఞ్యో విగలిత-దుకూలా యువతయః || 13 ||

క్షితౌ షట్పంచాశద్-ద్విసమధిక-పంచాశ-దుదకే
హుతశే ద్వాషష్టి-శ్చతురధిక-పంచాశ-దనిలే |
దివి ద్విః షట్ త్రింశన్ మనసి చ చతుఃషష్టిరితి యే
మయూఖా-స్తేషా-మప్యుపరి తవ పాదాంబుజ-యుగమ్ || 14 ||

శరజ్జ్యోత్స్నా శుద్ధాం శశియుత-జటాజూట-మకుటాం
వర-త్రాస-త్రాణ-స్ఫటికఘుటికా-పుస్తక-కరామ్ |
సకృన్న త్వా నత్వా కథమివ సతాం సన్నిదధతే
మధు-క్షీర-ద్రాక్షా-మధురిమ-ధురీణాః ఫణితయః || 15 ||

కవీంద్రాణాం చేతః కమలవన-బాలాతప-రుచిం
భజంతే యే సంతః కతిచిదరుణామేవ భవతీమ్ |
విరించి-ప్రేయస్యా-స్తరుణతర-శ్రృంగర లహరీ-
గభీరాభి-ర్వాగ్భిః ర్విదధతి సతాం రంజనమమీ || 16 ||

సవిత్రీభి-ర్వాచాం చశి-మణి శిలా-భంగ రుచిభి-
ర్వశిన్యద్యాభి-స్త్వాం సహ జనని సంచింతయతి యః |
స కర్తా కావ్యానాం భవతి మహతాం భంగిరుచిభి-
ర్వచోభి-ర్వాగ్దేవీ-వదన-కమలామోద మధురైః || 17 ||

తనుచ్ఛాయాభిస్తే తరుణ-తరణి-శ్రీసరణిభి-
ర్దివం సర్వా-ముర్వీ-మరుణిమని మగ్నాం స్మరతి యః |
భవంత్యస్య త్రస్య-ద్వనహరిణ-శాలీన-నయనాః
సహోర్వశ్యా వశ్యాః కతి కతి న గీర్వాణ-గణికాః || 18 ||

ముఖం బిందుం కృత్వా కుచయుగమధ-స్తస్య తదధో
హరార్ధం ధ్యాయేద్యో హరమహిషి తే మన్మథకలామ్ |
స సద్యః సంక్షోభం నయతి వనితా ఇత్యతిలఘు
త్రిలోకీమప్యాశు భ్రమయతి రవీందు-స్తనయుగామ్ || 19 ||

కిరంతీ-మంగేభ్యః కిరణ-నికురుంబమృతరసం
హృది త్వా మాధత్తే హిమకరశిలా-మూర్తిమివ యః |
స సర్పాణాం దర్పం శమయతి శకుంతధిప ఇవ
జ్వరప్లుష్టాన్ దృష్ట్యా సుఖయతి సుధాధారసిరయా || 20 ||

తటిల్లేఖా-తన్వీం తపన శశి వైశ్వానర మయీం
నిష్ణ్ణాం షణ్ణామప్యుపరి కమలానాం తవ కలాం |
మహాపద్మాతవ్యాం మృదిత-మలమాయేన మనసా
మహాంతః పశ్యంతో దధతి పరమాహ్లాద-లహరీమ్ || 21 ||

భవాని త్వం దాసే మయి వితర దృష్టిం సకరుణాం
ఇతి స్తోతుం వాంఛన్ కథయతి భవాని త్వమితి యః |
తదైవ త్వం తస్మై దిశసి నిజసాయుజ్య-పదవీం
ముకుంద-బ్రమ్హేంద్ర స్ఫుట మకుట నీరాజితపదామ్ || 22 ||

త్వయా హృత్వా వామం వపు-రపరితృప్తేన మనసా
శరీరార్ధం శంభో-రపరమపి శంకే హృతమభూత్ |
యదేతత్ త్వద్రూపం సకలమరుణాభం త్రినయనం
కుచాభ్యామానమ్రం కుటిల-శశిచూడాల-మకుటమ్ || 23 ||

జగత్సూతే ధాతా హరిరవతి రుద్రః క్షపయతే
తిరస్కుర్వ-న్నేతత్ స్వమపి వపు-రీశ-స్తిరయతి |
సదా పూర్వః సర్వం తదిద మనుగృహ్ణాతి చ శివ-
స్తవాజ్ఞా మలంబ్య క్షణచలితయో ర్భ్రూలతికయోః || 24 ||

త్రయాణాం దేవానాం త్రిగుణ-జనితానాం తవ శివే
భవేత్ పూజా పూజా తవ చరణయో-ర్యా విరచితా |
తథా హి త్వత్పాదోద్వహన-మణిపీఠస్య నికటే
స్థితా హ్యేతే-శశ్వన్ముకులిత కరోత్తంస-మకుటాః || 25 ||

విరించిః పంచత్వం వ్రజతి హరిరాప్నోతి విరతిం
వినాశం కీనాశో భజతి ధనదో యాతి నిధనమ్ |
వితంద్రీ మాహేంద్రీ-వితతిరపి సంమీలిత-దృశా
మహాసంహారేఽస్మిన్ విహరతి సతి త్వత్పతి రసౌ || 26 ||

జపో జల్పః శిల్పం సకలమపి ముద్రావిరచనా
గతిః ప్రాదక్షిణ్య-క్రమణ-మశనాద్యా హుతి-విధిః |
ప్రణామః సంవేశః సుఖమఖిల-మాత్మార్పణ-దృశా
సపర్యా పర్యాయ-స్తవ భవతు యన్మే విలసితమ్ || 27 ||

సుధామప్యాస్వాద్య ప్రతి-భయ-జరమృత్యు-హరిణీం
విపద్యంతే విశ్వే విధి-శతమఖాద్యా దివిషదః |
కరాలం యత్ క్ష్వేలం కబలితవతః కాలకలనా
న శంభోస్తన్మూలం తవ జనని తాటంక మహిమా || 28 ||

కిరీటం వైరించం పరిహర పురః కైటభభిదః
కఠోరే కోఠీరే స్కలసి జహి జంభారి-మకుటమ్ |
ప్రణమ్రేష్వేతేషు ప్రసభ-ముపయాతస్య భవనం
భవస్యభ్యుత్థానే తవ పరిజనోక్తి-ర్విజయతే || 29 ||

స్వదేహోద్భూతాభి-ర్ఘృణిభి-రణిమాద్యాభి-రభితో
నిషేవ్యే నిత్యే త్వా మహమితి సదా భావయతి యః |
కిమాశ్చర్యం తస్య త్రినయన-సమృద్ధిం తృణయతో
మహాసంవర్తాగ్ని-ర్విరచయతి నీరాజనవిధిం || 30 ||

చతుః-షష్టయా తంత్రైః సకల మతిసంధాయ భువనం
స్థితస్తత్త్త-సిద్ధి ప్రసవ పరతంత్రైః పశుపతిః |
పునస్త్వ-న్నిర్బంధా దఖిల-పురుషార్థైక ఘటనా-
స్వతంత్రం తే తంత్రం క్షితితల మవాతీతర-దిదమ్ || 31 ||

శివః శక్తిః కామః క్షితి-రథ రవిః శీతకిరణః
స్మరో హంసః శక్ర-స్తదను చ పరా-మార-హరయః |
అమీ హృల్లేఖాభి-స్తిసృభి-రవసానేషు ఘటితా
భజంతే వర్ణాస్తే తవ జనని నామావయవతామ్ || 32 ||

స్మరం యోనిం లక్ష్మీం త్రితయ-మిద-మాదౌ తవ మనో
ర్నిధాయైకే నిత్యే నిరవధి-మహాభోగ-రసికాః |
భజంతి త్వాం చింతామణి-గుణనిబద్ధాక్ష-వలయాః
శివాగ్నౌ జుహ్వంతః సురభిఘృత-ధారాహుతి-శతై || 33 ||

శరీరం త్వం శంభోః శశి-మిహిర-వక్షోరుహ-యుగం
తవాత్మానం మన్యే భగవతి నవాత్మాన-మనఘమ్ |
అతః శేషః శేషీత్యయ-ముభయ-సాధారణతయా
స్థితః సంబంధో వాం సమరస-పరానంద-పరయోః || 34 ||

మనస్త్వం వ్యోమ త్వం మరుదసి మరుత్సారథి-రసి
త్వమాప-స్త్వం భూమి-స్త్వయి పరిణతాయాం న హి పరమ్ |
త్వమేవ స్వాత్మానం పరిణ్మయితుం విశ్వ వపుషా
చిదానందాకారం శివయువతి భావేన బిభృషే || 35 ||

తవాజ్ఞచక్రస్థం తపన-శశి కోటి-ద్యుతిధరం
పరం శంభు వందే పరిమిలిత-పార్శ్వం పరచితా |
యమారాధ్యన్ భక్త్యా రవి శశి శుచీనా-మవిషయే
నిరాలోకే ఽలోకే నివసతి హి భాలోక-భువనే || 36 ||

విశుద్ధౌ తే శుద్ధస్ఫతిక విశదం వ్యోమ-జనకం
శివం సేవే దేవీమపి శివసమాన-వ్యవసితామ్ |
యయోః కాంత్యా యాంత్యాః శశికిరణ్-సారూప్యసరణే
విధూతాంత-ర్ధ్వాంతా విలసతి చకోరీవ జగతీ || 37 ||

సమున్మీలత్ సంవిత్కమల-మకరందైక-రసికం
భజే హంసద్వంద్వం కిమపి మహతాం మానసచరం |
యదాలాపా-దష్టాదశ-గుణిత-విద్యాపరిణతిః
యదాదత్తే దోషాద్ గుణ-మఖిల-మద్భ్యః పయ ఇవ || 38 ||

తవ స్వాధిష్ఠానే హుతవహ-మధిష్ఠాయ నిరతం
తమీడే సంవర్తం జనని మహతీం తాం చ సమయామ్ |
యదాలోకే లోకాన్ దహతి మహసి క్రోధ-కలితే
దయార్ద్రా యా దృష్టిః శిశిర-ముపచారం రచయతి || 39 ||

తటిత్వంతం శక్త్యా తిమిర-పరిపంథి-స్ఫురణయా
స్ఫుర-న్నా నరత్నాభరణ-పరిణద్ధేంద్ర-ధనుషమ్ |
తవ శ్యామం మేఘం కమపి మణిపూరైక-శరణం
నిషేవే వర్షంతం-హరమిహిర-తప్తం త్రిభువనమ్ || 40 ||

తవాధారే మూలే సహ సమయయా లాస్యపరయా
నవాత్మాన మన్యే నవరస-మహాతాండవ-నటమ్ |
ఉభాభ్యా మేతాభ్యా-ముదయ-విధి ముద్దిశ్య దయయా
సనాథాభ్యాం జజ్ఞే జనక జననీమత్ జగదిదమ్ || 41 ||

ద్వితీయ భాగః - సౌందర్య లహరీ

గతై-ర్మాణిక్యత్వం గగనమణిభిః సాంద్రఘటితం
కిరీటం తే హైమం హిమగిరిసుతే కీతయతి యః ||
స నీడేయచ్ఛాయా-చ్ఛురణ-శకలం చంద్ర-శకలం
ధనుః శౌనాసీరం కిమితి న నిబధ్నాతి ధిషణాం || 42 ||

ధునోతు ధ్వాంతం న-స్తులిత-దలితేందీవర-వనం
ఘనస్నిగ్ధ-శ్లక్ష్ణం చికుర నికురుంబం తవ శివే |
యదీయం సౌరభ్యం సహజ-ముపలబ్ధుం సుమనసో
వసంత్యస్మిన్ మన్యే బలమథన వాటీ-విటపినామ్ || 43 ||

తనోతు క్షేమం న-స్తవ వదనసౌందర్యలహరీ
పరీవాహస్రోతః-సరణిరివ సీమంతసరణిః|
వహంతీ- సిందూరం ప్రబలకబరీ-భార-తిమిర
ద్విషాం బృందై-ర్వందీకృతమేవ నవీనార్క కేరణమ్ || 44 ||

అరాలై స్వాభావ్యా-దలికలభ-సశ్రీభి రలకైః
పరీతం తే వక్త్రం పరిహసతి పంకేరుహరుచిమ్ |
దరస్మేరే యస్మిన్ దశనరుచి కింజల్క-రుచిరే
సుగంధౌ మాద్యంతి స్మరదహన చక్షు-ర్మధులిహః || 45 ||

లలాటం లావణ్య ద్యుతి విమల-మాభాతి తవ యత్
ద్వితీయం తన్మన్యే మకుటఘటితం చంద్రశకలమ్ |
విపర్యాస-న్యాసా దుభయమపి సంభూయ చ మిథః
సుధాలేపస్యూతిః పరిణమతి రాకా-హిమకరః || 46 ||

భ్రువౌ భుగ్నే కించిద్భువన-భయ-భంగవ్యసనిని
త్వదీయే నేత్రాభ్యాం మధుకర-రుచిభ్యాం ధృతగుణమ్ |
ధను ర్మన్యే సవ్యేతరకర గృహీతం రతిపతేః
ప్రకోష్టే ముష్టౌ చ స్థగయతే నిగూఢాంతర-ముమే || 47 ||

అహః సూతే సవ్య తవ నయన-మర్కాత్మకతయా
త్రియామాం వామం తే సృజతి రజనీనాయకతయా |
తృతీయా తే దృష్టి-ర్దరదలిత-హేమాంబుజ-రుచిః
సమాధత్తే సంధ్యాం దివసర్-నిశయో-రంతరచరీమ్ || 48 ||

విశాలా కల్యాణీ స్ఫుతరుచి-రయోధ్యా కువలయైః
కృపాధారాధారా కిమపి మధురాఽఽభోగవతికా |
అవంతీ దృష్టిస్తే బహునగర-విస్తార-విజయా
ధ్రువం తత్తన్నామ-వ్యవహరణ-యోగ్యావిజయతే || 49 ||

కవీనాం సందర్భ-స్తబక-మకరందైక-రసికం
కటాక్ష-వ్యాక్షేప-భ్రమరకలభౌ కర్ణయుగలమ్ |
అముంచంతౌ దృష్ట్వా తవ నవరసాస్వాద-తరలౌ
అసూయా-సంసర్గా-దలికనయనం కించిదరుణమ్ || 50 ||

శివే శంగారార్ద్రా తదితరజనే కుత్సనపరా
సరోషా గంగాయాం గిరిశచరితే విస్మయవతీ |
హరాహిభ్యో భీతా సరసిరుహ సౌభాగ్య-జననీ
సఖీషు స్మేరా తే మయి జనని దృష్టిః సకరుణా || 51 ||

గతే కర్ణాభ్యర్ణం గరుత ఇవ పక్ష్మాణి దధతీ
పురాం భేత్తు-శ్చిత్తప్రశమ-రస-విద్రావణ ఫలే |
ఇమే నేత్రే గోత్రాధరపతి-కులోత్తంస-కలికే
తవాకర్ణాకృష్ట స్మరశర-విలాసం కలయతః|| 52 ||

విభక్త-త్రైవర్ణ్యం వ్యతికరిత-లీలాంజనతయా
విభాతి త్వన్నేత్ర త్రితయ మిద-మీశానదయితే |
పునః స్రష్టుం దేవాన్ ద్రుహిణ హరి-రుద్రానుపరతాన్
రజః సత్వం వేభ్రత్ తమ ఇతి గుణానాం త్రయమివ || 53 ||

పవిత్రీకర్తుం నః పశుపతి-పరాధీన-హృదయే
దయామిత్రై ర్నేత్రై-రరుణ-ధవల-శ్యామ రుచిభిః |
నదః శోణో గంగా తపనతనయేతి ధ్రువముమ్
త్రయాణాం తీర్థానా-ముపనయసి సంభేద-మనఘమ్ || 54 ||

నిమేషోన్మేషాభ్యాం ప్రలయముదయం యాతి జగతి
తవేత్యాహుః సంతో ధరణిధర-రాజన్యతనయే |
త్వదున్మేషాజ్జాతం జగదిద-మశేషం ప్రలయతః
పరేత్రాతుం శంంకే పరిహృత-నిమేషా-స్తవ దృశః || 55 ||

తవాపర్ణే కర్ణే జపనయన పైశున్య చకితా
నిలీయంతే తోయే నియత మనిమేషాః శఫరికాః |
ఇయం చ శ్రీ-ర్బద్ధచ్ఛద\ఎమ్దశ్ పుటకవాటం కువలయం
జహాతి ప్రత్యూషే నిశి చ విఘతయ్య ప్రవిశతి|| 56 ||

దృశా ద్రాఘీయస్యా దరదలిత నీలోత్పల రుచా
దవీయాంసం దీనం స్నపా కృపయా మామపి శివే |
అనేనాయం ధన్యో భవతి న చ తే హానిరియతా
వనే వా హర్మ్యే వా సమకర నిపాతో హిమకరః || 57 ||

అరాలం తే పాలీయుగల-మగరాజన్యతనయే
న కేషా-మాధత్తే కుసుమశర కోదండ-కుతుకమ్ |
తిరశ్చీనో యత్ర శ్రవణపథ-ముల్ల్ఙ్య్య విలసన్
అపాంగ వ్యాసంగో దిశతి శరసంధాన ధిషణామ్ || 58 ||

స్ఫురద్గండాభోగ-ప్రతిఫలిత తాటంక యుగలం
చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మథరథమ్ |
యమారుహ్య ద్రుహ్య త్యవనిరథ మర్కేందుచరణం
మహావీరో మారః ప్రమథపతయే సజ్జితవతే || 59 ||

సరస్వత్యాః సూక్తీ-రమృతలహరీ కౌశలహరీః
పిబ్నత్యాః శర్వాణి శ్రవణ-చులుకాభ్యా-మవిరలమ్ |
చమత్కారః-శ్లాఘాచలిత-శిరసః కుండలగణో
ఝణత్కరైస్తారైః ప్రతివచన-మాచష్ట ఇవ తే || 60 ||

అసౌ నాసావంశ-స్తుహినగిరివణ్శ-ధ్వజపటి
త్వదీయో నేదీయః ఫలతు ఫల-మస్మాకముచితమ్ |
వహత్యంతర్ముక్తాః శిశిరకర-నిశ్వాస-గలితం
సమృద్ధ్యా యత్తాసాం బహిరపి చ ముక్తామణిధరః || 61 ||

ప్రకృత్యాఽఽరక్తాయా-స్తవ సుదతి దందచ్ఛదరుచేః
ప్రవక్ష్యే సదృశ్యం జనయతు ఫలం విద్రుమలతా |
న బింబం తద్బింబ-ప్రతిఫలన-రాగా-దరుణితం
తులామధ్రారోఢుం కథమివ విలజ్జేత కలయా || 62 ||

స్మితజ్యోత్స్నాజాలం తవ వదనచంద్రస్య పిబతాం
చకోరాణా-మాసీ-దతిరసతయా చంచు-జడిమా |
అతస్తే శీతాంశో-రమృతలహరీ మామ్లరుచయః
పిబంతీ స్వచ్ఛందం నిశి నిశి భృశం కాంజి కధియా || 63 ||

అవిశ్రాంతం పత్యుర్గుణగణ కథామ్రేడనజపా
జపాపుష్పచ్ఛాయా తవ జనని జిహ్వా జయతి సా |
యదగ్రాసీనాయాః స్ఫటికదృష-దచ్ఛచ్ఛవిమయి
సరస్వత్యా మూర్తిః పరిణమతి మాణిక్యవపుషా || 64 ||

రణే జిత్వా దైత్యా నపహృత-శిరస్త్రైః కవచిభిః
నివృత్తై-శ్చండాంశ-త్రిపురహర-నిర్మాల్య-విముఖైః |
విశాఖేంద్రోపేంద్రైః శశివిశద-కర్పూరశకలా
విలీయంతే మాతస్తవ వదనతాంబూల-కబలాః || 65 ||

విపంచ్యా గాయంతీ వివిధ-మపదానం పశుపతే-
స్త్వయారబ్ధే వక్తుం చలితశిరసా సాధువచనే |
తదీయై-ర్మాధుర్యై-రపలపిత-తంత్రీకలరవాం
నిజాం వీణాం వాణీం నిచులయతి చోలేన నిభృతమ్ || 66 ||

కరగ్రేణ స్పృష్టం తుహినగిరిణా వత్సలతయా
గిరిశేనో-దస్తం ముహురధరపానాకులతయా |
కరగ్రాహ్యం శంభోర్ముఖముకురవృంతం గిరిసుతే
కథంకరం బ్రూమ-స్తవ చుబుకమోపమ్యరహితమ్ || 67 ||

భుజాశ్లేషాన్నిత్యం పురదమయితుః కన్టకవతీ
తవ గ్రీవా ధత్తే ముఖకమలనాల-శ్రియమియమ్ |
స్వతః శ్వేతా కాలా గరు బహుల-జంబాలమలినా
మృణాలీలాలిత్యం వహతి యదధో హారలతికా || 68 ||

గలే రేఖాస్తిస్రో గతి గమక గీతైక నిపుణే
వివాహ-వ్యానద్ధ-ప్రగుణగుణ-సంఖ్యా ప్రతిభువః |
విరాజంతే నానావిధ-మధుర-రాగాకర-భువాం
త్రయాణాం గ్రామాణాం స్థితి-నియమ-సీమాన ఇవ తే || 69 ||

మృణాలీ-మృద్వీనాం తవ భుజలతానాం చతసృణాం
చతుర్భిః సౌంద్రయం సరసిజభవః స్తౌతి వదనైః |
నఖేభ్యః సంత్రస్యన్ ప్రథమ-మథనా దంతకరిపోః
చతుర్ణాం శీర్షాణాం సమ-మభయహస్తార్పణ-ధియా || 70 ||

నఖానా-ముద్యోతై-ర్నవనలినరాగం విహసతాం
కరాణాం తే కాంతిం కథయ కథయామః కథముమే |
కయాచిద్వా సామ్యం భజతు కలయా హంత కమలం
యది క్రీడల్లక్ష్మీ-చరణతల-లాక్షారస-చణమ్ || 71 ||

సమం దేవి స్కంద ద్విపివదన పీతం స్తనయుగం
తవేదం నః ఖేదం హరతు సతతం ప్రస్నుత-ముఖమ్ |
యదాలోక్యాశంకాకులిత హృదయో హాసజనకః
స్వకుంభౌ హేరంబః పరిమృశతి హస్తేన ఝడితి || 72 ||

అమూ తే వక్షోజా-వమృతరస-మాణిక్య కుతుపౌ
న సందేహస్పందో నగపతి పతాకే మనసి నః |
పిబంతౌ తౌ యస్మా దవిదిత వధూసంగ రసికౌ
కుమారావద్యాపి ద్విరదవదన-క్రౌంచ్దలనౌ || 73 ||

వహత్యంబ స్తంబేరమ-దనుజ-కుంభప్రకృతిభిః
సమారబ్ధాం ముక్తామణిభిరమలాం హారలతికామ్ |
కుచాభోగో బింబాధర-రుచిభి-రంతః శబలితాం
ప్రతాప-వ్యామిశ్రాం పురదమయితుః కీర్తిమివ తే || 74 ||

తవ స్తన్యం మన్యే ధరణిధరకన్యే హృదయతః
పయః పారావారః పరివహతి సారస్వతమివ |
దయావత్యా దత్తం ద్రవిడశిశు-రాస్వాద్య తవ యత్
కవీనాం ప్రౌఢానా మజని కమనీయః కవయితా || 75 ||

హరక్రోధ-జ్వాలావలిభి-రవలీఢేన వపుషా
గభీరే తే నాభీసరసి కృతసఙో మనసిజః |
సముత్తస్థౌ తస్మా-దచలతనయే ధూమలతికా
జనస్తాం జానీతే తవ జనని రోమావలిరితి || 76 ||

యదేతత్కాలిందీ-తనుతర-తరంగాకృతి శివే
కృశే మధ్యే కించిజ్జనని తవ యద్భాతి సుధియామ్ |
విమర్దా-దన్యోన్యం కుచకలశయో-రంతరగతం
తనూభూతం వ్యోమ ప్రవిశదివ నాభిం కుహరిణీమ్ || 77 ||

స్థిరో గంగా వర్తః స్తనముకుల-రోమావలి-లతా
కలావాలం కుండం కుసుమశర తేజో-హుతభుజః |
రతే-ర్లీలాగారం కిమపి తవ నాభిర్గిరిసుతే
బేలద్వారం సిద్ధే-ర్గిరిశనయనానాం విజయతే || 78 ||

నిసర్గ-క్షీణస్య స్తనతట-భరేణ క్లమజుషో
నమన్మూర్తే ర్నారీతిలక శనకై-స్త్రుట్యత ఇవ |
చిరం తే మధ్యస్య త్రుటిత తటినీ-తీర-తరుణా
సమావస్థా-స్థేమ్నో భవతు కుశలం శైలతనయే || 79 ||

కుచౌ సద్యః స్విద్య-త్తటఘటిత-కూర్పాసభిదురౌ
కషంతౌ-దౌర్మూలే కనకకలశాభౌ కలయతా |
తవ త్రాతుం భంగాదలమితి వలగ్నం తనుభువా
త్రిధా నద్ధ్మ్ దేవీ త్రివలి లవలీవల్లిభిరివ || 80 ||

గురుత్వం విస్తారం క్షితిధరపతిః పార్వతి నిజాత్
నితంబా-దాచ్ఛిద్య త్వయి హరణ రూపేణ నిదధే |
అతస్తే విస్తీర్ణో గురురయమశేషాం వసుమతీం
నితంబ-ప్రాగ్భారః స్థగయతి సఘుత్వం నయతి చ || 81 ||

కరీంద్రాణాం శుండాన్-కనకకదలీ-కాండపటలీం
ఉభాభ్యామూరుభ్యా-ముభయమపి నిర్జిత్య భవతి |
సువృత్తాభ్యాం పత్యుః ప్రణతికఠినాభ్యాం గిరిసుతే
విధిజ్ఞే జానుభ్యాం విబుధ కరికుంభ ద్వయమసి || 82 ||

పరాజేతుం రుద్రం ద్విగుణశరగర్భౌ గిరిసుతే
నిషంగౌ జంఘే తే విషమవిశిఖో బాఢ-మకృత |
యదగ్రే దృస్యంతే దశశరఫలాః పాదయుగలీ
నఖాగ్రచ్ఛన్మానః సుర ముకుట-శాణైక-నిశితాః || 83 ||

శ్రుతీనాం మూర్ధానో దధతి తవ యౌ శేఖరతయా
మమాప్యేతౌ మాతః శేరసి దయయా దేహి చరణౌ |
యయఓః పాద్యం పాథః పశుపతి జటాజూట తటినీ
యయో-ర్లాక్షా-లక్ష్మీ-రరుణ హరిచూడామణి రుచిః || 84 ||

నమో వాకం బ్రూమో నయన-రమణీయాయ పదయోః
తవాస్మై ద్వంద్వాయ స్ఫుట-రుచి రసాలక్తకవతే |
అసూయత్యత్యంతం యదభిహననాయ స్పృహయతే
పశూనా-మీశానః ప్రమదవన-కంకేలితరవే || 85 ||

మృషా కృత్వా గోత్రస్ఖలన-మథ వైలక్ష్యనమితం
లలాటే భర్తారం చరణకమలే తాడయతి తే |
చిరాదంతః శల్యం దహనకృత మున్మూలితవతా
తులాకోటిక్వాణైః కిలికిలిత మీశాన రిపుణా || 86 ||

హిమానీ హంతవ్యం హిమగిరినివాసైక-చతురౌ
నిశాయాం నిద్రాణం నిశి-చరమభాగే చ విశదౌ |
వరం లక్ష్మీపాత్రం శ్రియ-మతిసృహంతో సమయినాం
సరోజం త్వత్పాదౌ జనని జయత-శ్చిత్రమిహ కిమ్ || 87 ||

పదం తే కీర్తీనాం ప్రపదమపదం దేవి విపదాం
కథం నీతం సద్భిః కఠిన-కమఠీ-కర్పర-తులామ్ |
కథం వా బాహుభ్యా-ముపయమనకాలే పురభిదా
యదాదాయ న్యస్తం దృషది దయమానేన మనసా || 88 ||

నఖై-ర్నాకస్త్రీణాం కరకమల-సంకోచ-శశిభిః
తరూణాం దివ్యానాం హసత ఇవ తే చండి చరణౌ |
ఫలాని స్వఃస్థేభ్యః కిసలయ-కరాగ్రేణ దదతాం
దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిశ-మహ్నాయ దదతౌ || 89 ||

దదానే దీనేభ్యః శ్రియమనిశ-మాశానుసదృశీం
అమందం సౌందర్యం ప్రకర-మకరందం వికిరతి |
తవాస్మిన్ మందార-స్తబక-సుభగే యాతు చరణే
నిమజ్జన్ మజ్జీవః కరణచరణః ష్ట్చరణతామ్ || 90 ||

పదన్యాస-క్రీడా పరిచయ-మివారబ్ధు-మనసః
స్ఖలంతస్తే ఖేలం భవనకలహంసా న జహతి |
అతస్తేషాం శిక్షాం సుభగమణి-మంజీర-రణిత-
చ్ఛలాదాచక్షాణం చరణకమలం చారుచరితే || 91 ||

గతాస్తే మంచత్వం ద్రుహిణ హరి రుద్రేశ్వర భృతః
శివః స్వచ్ఛ-చ్ఛాయా-ఘటిత-కపట-ప్రచ్ఛదపటః |
త్వదీయానాం భాసాం ప్రతిఫలన రాగారుణతయా
శరీరీ శృంగారో రస ఇవ దృశాం దోగ్ధి కుతుకమ్ || 92 ||

అరాలా కేశేషు ప్రకృతి సరలా మందహసితే
శిరీషాభా చిత్తే దృషదుపలశోభా కుచతటే |
భృశం తన్వీ మధ్యే పృథు-రురసిజారోహ విషయే
జగత్త్రతుం శంభో-ర్జయతి కరుణా కాచిదరుణా || 93 ||

కలంకః కస్తూరీ రజనికర బింబం జలమయం
కలాభిః కర్పూరై-ర్మరకతకరండం నిబిడితమ్ |
అతస్త్వద్భోగేన ప్రతిదినమిదం రిక్తకుహరం
విధి-ర్భూయో భూయో నిబిడయతి నూనం తవ కృతే || 94 ||

పురారంతే-రంతః పురమసి తత-స్త్వచరణయోః
సపర్యా-మర్యాదా తరలకరణానా-మసులభా |
తథా హ్యేతే నీతాః శతమఖముఖాః సిద్ధిమతులాం
తవ ద్వారోపాంతః స్థితిభి-రణిమాద్యాభి-రమరాః || 95 ||

కలత్రం వైధాత్రం కతికతి భజంతే న కవయః
శ్రియో దేవ్యాః కో వా న భవతి పతిః కైరపి ధనైః |
మహాదేవం హిత్వా తవ సతి సతీనా-మచరమే
కుచభ్యా-మాసంగః కురవక-తరో-రప్యసులభః || 96 ||

గిరామాహు-ర్దేవీం ద్రుహిణగృహిణీ-మాగమవిదో
హరేః పత్నీం పద్మాం హరసహచరీ-మద్రితనయామ్ |
తురీయా కాపి త్వం దురధిగమ-నిస్సీమ-మహిమా
మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మమహిషి || 97 ||

కదా కాలే మాతః కథయ కలితాలక్తకరసం
పిబేయం విద్యార్థీ తవ చరణ-నిర్ణేజనజలమ్ |
ప్రకృత్యా మూకానామపి చ కవితా0కారణతయా
కదా ధత్తే వాణీముఖకమల-తాంబూల-రసతామ్ || 98 ||

సరస్వత్యా లక్ష్మ్యా విధి హరి సపత్నో విహరతే
రతేః పతివ్రత్యం శిథిలపతి రమ్యేణ వపుషా |
చిరం జీవన్నేవ క్షపిత-పశుపాశ-వ్యతికరః
పరానందాభిఖ్యం రసయతి రసం త్వద్భజనవాన్ || 99 ||

ప్రదీప జ్వాలాభి-ర్దివసకర-నీరాజనవిధిః
సుధాసూతే-శ్చంద్రోపల-జలలవై-రఘ్యరచనా |
స్వకీయైరంభోభిః సలిల-నిధి-సౌహిత్యకరణం
త్వదీయాభి-ర్వాగ్భి-స్తవ జనని వాచాం స్తుతిరియమ్ || 100 ||

సౌందయలహరి ముఖ్యస్తోత్రం సంవార్తదాయకమ్ |
భగవద్పాద సన్క్లుప్తం పఠేన్ ముక్తౌ భవేన్నరః ||
సౌందర్యలహరి స్తోత్రం సంపూర్ణం

SOundryalahiri English-NOtes


  1. Winning in every field
  2. Attracting all the world
  3. Attainment of all knowledge
  4. Removal of all fears, Curing of diseases
  5. Mutual attraction between male and female
  6. Getting sons as progeny
  7. Seeing the Goddess in person, Winning over enemies
  8. Avoiding of birth and death
  9. For return of people who have gone on journey, For getting eight types of wealth
  10. Getting a strong body, virility
  11. Good progeny, Getting a meaning for life
  12. To attain Lord Shiva, To make a dumb man speak
  13. Victory in the matters of love
  14. Avoiding famine, dacoity and epidemic
  15. Ability to write poems and ability to become scholar
  16. Mastery of Vedas
  17. mastery over words, Knowledge of science
  18. Victory in love
  19. Victory in love
  20. Curing of all poisons and curing of all fevers
  21. Attracting every one, Making everyone happy
  22. Getting of all powers
  23. getting of all riches
  24. Management of fear of Bhoothas, Prethas and Pishachas
  25. Getting higher posts and power
  26. Destruction of enemies
  27. Realization of self and ultimate truth
  28. Fear of poison, Untimely death
  29. Avoiding of abortions, Taming bad people
  30. Entering to another body
  31. Attraction of everything
  32. long life, Attracting of everything
  33. All benefits
  34. Development of mutual liking
  35. Curing of Tuberculosis
  36. Curing of all diseases
  37. Removal of Bhootha , Pretha Pisacha and Brahma Rakshasa
  38. Curing of sickness during childhood
  39. To see in the dream what we think about
  40. Blessings from Lakshmi, realization of good dreams, Not seeing bad dreams
  41. Seeing of the Goddess in person, curing of sexual diseases
  42. attracting everything, Curing diseases caused by water
  43. Victory over al
  44. curing of all diseases
  45. Blessing of Goddess of wealth, Your word becoming a fact
  46. Getting blessed with a son
  47. Victory in all efforts
  48. Removal of problems created by nine planets
  49. Victory in everything, Locating of treasures
  50. Seeing afar, Curing of small pox
  51. Attracting all people
  52. Victory in love, Curing of diseases of ears and eye
  53. Attracting all the world, Seeing the Goddess in person
  54. Destruction of all sins., Curing of eye diseases
  55. power to protect, Curing of diseases of kidney
  56. To get freed from imprisonment, Curing of eye diseases
  57. All round luck
  58. Cure from all diseases, Victory in love
  59. attracting every one
  60. Giving power of speech to dumb, Making your predictions come true
  61. Victory over mind, Getting of wealth
  62. Good sleep
  63. Bewitching all
  64. Getting of all knowledge
  65. Victory, Control over words
  66. Sweet words, Mastery in music
  67. Appearance in person of the Goddess
  68. Attracting the king
  69. Mastery over music
  70. Compensation for mistakes done to God Shiva
  71. Getting of wealth
  72. Conquering fear of darkness, Getting grace from Goddess, Making slave of Yakshini
  73. Production of milk, Redemption
  74. Good fame
  75. Capacity to write poems
  76. Complete renunciation, Victory in love
  77. Gaining Micro sight, Attracting every one
  78. Attracting all the universe
  79. Getting magical capability, Bewitching all others
  80. Getting remarkable beauty, Becoming expert in magic
  81. Stopping fire
  82. Stopping flood, Getting powers like Indhra
  83. Stopping of the army
  84. Getting redemption, Entering into another body
  85. Removing fear of ghosts
  86. Removing fear of ghosts, Victory over enemies
  87. Attracting of serpents
  88. Making wild beasts obey
  89. Getting rid of all diseases
  90. Cutting of bad spells cast
  91. Getting of land, Getting riches
  92. Getting ability to rule
  93. Fulfillment of desires
  94. Getting all desires
  95. Getting of all desires
  96. Attainment of knowledge and wealth
  97. Redemption of the soul
  98. Mastery over words
  99. Attainment of ultimate bliss
  100. Attainment of all occult power

Soundarya Lahari notes: సౌందర్యలహరి telugu- BY Adi Sankarachaarya


  1. ప్రతి రంగంలోనూ గెలుపు
  2. ప్రపంచమంతా ఆకర్షిస్తోంది
  3. సమస్త జ్ఞాన సాధన
  4. అన్ని భయాలను తొలగించడం, వ్యాధులను దూరం చేయడం
  5. స్త్రీ పురుష మధ్య పరస్పర ఆకర్షణ
  6. కుమారులను ప్రోజెగా పొందడం
  7. వ్యక్తిలోని దేవతను చూసి, శత్రువులపై గెలిచి
  8. జనన మరణ నివారణ
  9. ప్రయాణంలో వెళ్ళిపోయిన ప్రజల కోసం, ఎనిమిది రకాల సంపదను పొందడం కోసం
  10. బలమైన దేహాన్ని పొందడం, విరుకుతనం
  11. మంచి ప్రోజెంటు, జీవితానికి ఒక అర్థాన్ని పొందడం
  12. పరమశివుని సాధించడం, మూగ మనిషిని మాట్లాడేలా చేయడం
  13. ప్రేమ విషయాలలో విజయం
  14. కరవు, దాపరికం, మహమ్మారిని నివారించి
  15. పద్యాలు రాసే సామర్థ్యం, పండితులుగా మారే సామర్థ్యం
  16. వేదాల ఆధిపత్యం
  17. మాటలపై ఆధిపత్యం, విజ్ఞానశాస్త్ర విజ్ఞానం
  18. ప్రేమలో విజయం
  19. ప్రేమలో విజయం
  20. అన్ని విషతులాలు దూరం కావడం మరియు అన్ని రకాల జ్వరాలను దూరం చేయడం
  21. ప్రతి ఒక్కరిని ఆకర్షించడం, అందరిని సంతోషపెట్టడం
  22. అన్ని అధికారాలు పొందడం
  23. సకల ఐశ్వర్యాలను పొందటం
  24. భూత, ప్రేత, పిశాచాల భయాన్ని యాజమాన్యం
  25. ఉన్నత పదవులు, అధికారం పొందడం
  26. శత్రువుల విధ్వంసం
  27. ఆత్మ మరియు అంతిమ సత్యము యొక్క సాక్షాత్కారము
  28. విషభయం, అకాల మరణం
  29. గర్భస్రావాలు అరికట్టడం, చెడ్డ వ్యక్తులను తిట్టడం
  30. మరో శరీరంలోకి ప్రవేశించడం
  31. ప్రతిదానికి ఆకర్షణ
  32. దీర్ఘమైన జీవితం, ప్రతిదాన్నీ ఆకర్షించడం
  33. అన్ని ప్రయోజనాలు
  34. పరస్పర ఇష్టా వికాసం
  35. క్షయ వ్యాధి దూరం
  36. అన్ని వ్యాధుల దూరం
  37. భూత, ప్రేత పిశాచా, బ్రహ్మ రాక్షస తొలగింపు
  38. బాల్యంలో అనారోగ్యం దూరం
  39. మనం దేని గురించి ఆలోచిస్తాం అనే కలల్లో చూడాలంటే
  40. లక్ష్మీ నుండి ఆశీర్వాదాలు, మంచి కలల సాక్షాత్కారం, చెడు కలలను చూడకపోవడం
  41. వ్యక్తిలోని దేవతను చూసి, లైంగిక వ్యాధుల దూరం
  42. ప్రతిదాన్నీ ఆకర్షించడం, నీటి వల్ల కలిగే వ్యాధులను దూరం చేయడం
  43. అల్ ది విక్టరీ
  44. అన్ని వ్యాధుల దూరం
  45. సంపదల దేవత ఆశీర్వాదం, మీ మాట నిజం కావడమే
  46. కుమారుడితో ఆశీర్వాదం పొందడం
  47. అన్ని ప్రయత్నాలలో విజయం
  48. తొమ్మిది గ్రహాలు సృష్టించిన సమస్యల తొలగింపు
  49. ప్రతిదానిలో విజయం, సంపదను గుర్తించడం
  50. దూరం చూసి, స్మాల్ పాక్స్ దూరం
  51. ప్రజలందరి ఆకర్షణలో
  52. ప్రేమలో విజయం, చెవులు మరియు కంటి వ్యాధుల దూరం
  53. లోకమంతా ఆకర్షిస్తూ, వ్యక్తిలోని దేవతను చూసి
  54. సర్వపాపాలు నశిస్తే., కంటి వ్యాధుల దూరం
  55. కాపాడే శక్తి, మూత్రపిండాల వ్యాధుల దూరం
  56. ఖైదు నుండి విముక్తి పొందుటకు, కంటి వ్యాధుల క్యూరింగ్
  57. ఆల్ రౌండ్ లక్
  58. అన్ని వ్యాధుల నుండి నయం, ప్రేమలో విజయం
  59. ప్రతిఒక్కరు ఆకర్షించడం
  60. మూగ వారికి వాక్ శక్తి ఇవ్వడం, మీ అంచనాలు నిజం చేయడం
  61. మనసు మీద విజయం, సంపద పొందడం
  62. మంచి నిద్ర
  63. అన్నీ బెడిసికొడుతోంది
  64. అన్ని జ్ఞానం పొందడం
  65. విజయం, మాటలపై నియంత్రణ
  66. మధురమైన మాటలు, సంగీతంలో ప్రావీణ్యం
  67. దేవత వ్యక్తిలోని స్వరూపం
  68. ఆకర్షించే రాజు
  69. సంగీతంపై ఆధిపత్యం
  70. దేవునికి చేసిన తప్పులకు పరిహారము శివుడు
  71. సంపద పొందడం
  72. చీకటి భయాన్ని జయించి, దేవత నుండి కృప పొందడం, యక్షకి బానిస చేయడం
  73. పాల ఉత్పత్తి, విమోచనం
  74. మంచి ఫేమ్
  75. పద్యాలు రాసే సామర్ధ్యం
  76. సంపూర్ణ సన్యాసం, ప్రేమలో విజయం
  77. సూక్ష్మ దృష్టిని పొందడం, ప్రతి ఒక్కరం ఆకర్షించడం
  78. విశ్వమంతా ఆకర్షించే
  79. మ్యాజికల్ సామర్ధ్యం పొందడం, ఇతరులను ఎక్కువగా వేడడం
  80. అద్భుతమైన అందాన్ని పొందడం, మ్యాజిక్ లో నిపుణురాలిగా మారడం
  81. ఆగని నిప్పు
  82. ఆగని ప్రళయం, ఇంధ్ర లాంటి శక్తులు వచ్చినపుడు
  83. సైన్యాన్ని ఆపటం
  84. విమోచనం పొందడం, మరో శరీరంలోకి ప్రవేశించడం
  85. దెయ్యాల భయాన్ని తొలగించడం
  86. దెయ్యాల భయాన్ని తొలగించడం, శత్రువులపై విజయం
  87. సర్పాలను ఆకర్షించే
  88. క్రూర మృగాలను లోబడడ౦
  89. అన్ని వ్యాధుల నుంచి విముక్తి పొందడం
  90. చెడ్డ స్పెల్స్ కాస్ట్ కట్టింగ్
  91. భూమి పొందడం, ఐశ్వర్యం పొందడం
  92. పాలించే సామర్థ్యాన్ని పొందడం
  93. కోరికలు నెరవేరాలంటే
  94. కోరికలన్నీ తీర్చటం
  95. కోరికలన్నీ తీరిపోవడం
  96. జ్ఞాన సంపదల సాధన
  97. ఆత్మ విమోచనం
  98. మాటల మీద ఆధిపత్యం
  99. అంతిమ దివ్యానందం పొందడం
  100. సమస్త క్షుద్ర శక్తిని సాధించడం