Translate

Monday, February 24, 2025

శివానందలహరి (Shivanandalahari in Telugu )





కలాభ్యాం చూడాలంకృతశశి కలాభ్యాం నిజ తపః
ఫలాభ్యాం భక్తేషు ప్రకటితఫలాభ్యాం భవతు మే ।
శివాభ్యామస్తోకత్రిభువనశివాభ్యాం హృది
పునర్భవాభ్యామానన్దస్ఫురదనుభవాభ్యాం నతిరియమ్ ।।1।।


గలన్తీ శంభో త్వచ్చరితసరితః కిల్బిషరజో
దలన్తీ ధీకుల్యాసరణిషు పతన్తీ విజయతామ్ ।
దిశన్తీ సంసారభ్రమణపరితాపోపశమనం
వసన్తీ మచ్చేతోహృదభువి శివానన్దలహరీ ।।2।।


త్రయీవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం
జటాభారోదారం చలదురగహారం మృగ ధరమ్ ।
మహాదేవం దేవం మయి సదయభావం పశుపతిం
చిదాలంబం సాంబం శివమతివిడంబం హృది భజే ।।3।।


సహస్రం వర్తన్తే జగతి విబుధాః క్షుద్రఫలదా
న మన్యే స్వప్నే వా తదనుసరణం తత్కృతఫలమ్ ।
హరిబ్రహ్మాదీనామపి నికటభాజాంఅసులభం
చిరం యాచే శంభో శివ తవ పదాంభోజభజనమ్ ।।4।।


స్మృతౌ శాస్త్రే వైద్యే శకునకవితాగానఫణితౌ
పురాణే మన్త్రే వా స్తుతినటనహాస్యేష్వచతురః।
కథం రాజ్ఞాం ప్రీతిర్భవతి మయి కోఽహం పశుపతే
పశుం మాం సర్వజ్ఞ ప్రథితకృపయా పాలయ విభో ।।5।।


ఘటో వా మృత్పిణ్డోఽప్యణురపి చ ధూమోఽగ్నిరచలః
పటో వా తన్తుర్వా పరిహరతి కిం ఘోరశమనమ్ ।
వృథా కణ్ఠక్షోభం వహసి తరసా తర్కవచసా
పదాంభోజం శంభోర్భజ పరమసౌఖ్యం వ్రజ సుధీః ।।6।।


మనస్తే పాదాబ్జే నివసతు వచః స్తోత్రఫణితౌ
కరౌ చాభ్యర్చాయాం శ్రుతిరపి కథాకర్ణనవిధౌ ।
తవ ధ్యానే బుద్ధిర్నయనయుగలం మూర్తివిభవే
పరగ్రన్థాన్ కైర్వా పరమశివ జానే పరమతః ।।7।।


యథా బుద్ధిశ్శుక్తౌ రజతమితి కాచాశ్మని మణిః
జలే పైష్టే క్షీరం భవతి మృగతృష్ణాసు సలిలమ్ ।
తథా దేవభ్రాన్త్యా భజతి భవదన్యం జడ జనో
మహాదేవేశం త్వాం మనసి చ న మత్వా పశుపతే ।।8।।


గభీరే కాసారే విశతి విజనే ఘోరవిపినే
విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం జడమతిః ।
సమర్ప్యైకం చేతస్సరసిజం ఉమానాథ భవతే
సుఖేనావస్థాతుం జన ఇహ న జానాతి కిమహో ।। 9 ।।


నరత్వం దేవత్వం నగవనమృగత్వం మశకతా
పశుత్వం కీటత్వం భవతు విహగత్వాదిజననమ్ ।
సదా త్వత్పాదాబ్జస్మరణపరమానన్దలహరీ
విహారాసక్తం చేద్ హృదయమిహ కిం తేన వపుషా ।।10।।


వటుర్వా గేహీ వా యతిరపి జటీ వా తదితరో
నరో వా యః కశ్చిద్భవతు భవ కిం తేన భవతి ।
యదీయం హృత్పద్మం యది భవదధీనం పశుపతే
తదీయస్త్వం శంభో భవసి భవ భారం చ వహసి ।।11।।


గుహాయాం గేహే వా బహిరపి వనే వాఽద్రిశిఖరే
జలే వా వహ్నౌ వా వసతు వసతేః కిం వద ఫలమ్ ।
సదా యస్యైవాన్తఃకరణమపి శంభో తవ పదే
స్థితం చేద్ యోగోఽసౌ స చ పరమయోగీ స చ సుఖీ ।।12।।


అసారే సంసారే నిజభజనదూరే జడధియా
భ్రమన్తం మామన్ధం పరమకృపయా పాతుముచితమ్ ।
మదన్యః కో దీనస్తవ కృపణ రక్షాతినిపుణః
త్వదన్యః కో వా మే త్రిజగతి శరణ్యః పశుపతే ।।13।।


ప్రభుస్త్వం దీనానాం ఖలు పరమబన్ధుః పశుపతే
ప్రముఖ్యోఽహం తేషామపి కిముత బన్ధుత్వమనయోః ।
త్వయైవ క్షన్తవ్యాః శివ మదపరాధాశ్చ సకలాః
ప్రయత్నాత్కర్తవ్యం మదవనమియం బన్ధుసరణిః ।।14।।


ఉపేక్షా నో చేత్ కిం న హరసి భవద్ధ్యానవిముఖాం
దురాశాభూయిష్ఠాం విధిలిపిమశక్తో యది భవాన్ ।
శిరస్తద్వైధాత్రం న నఖలు సువృత్తం పశుపతే
కథం వా నిర్యత్నం కరనఖముఖేనైవ లులితమ్ ।।15।।


విరిఞ్చిర్దీర్ఘాయుర్భవతు భవతా తత్పరశిరశ్చతుష్కం
సంరక్ష్యం స ఖలు భువి దైన్యం లిఖితవాన్ ।
విచారః కో వా మాం విశదకృపయా పాతి శివ తే
కటాక్షవ్యాపారః స్వయమపి చ దీనావనపరః ।।16।।


ఫలాద్వా పుణ్యానాం మయి కరుణయా వా త్వయి విభో
ప్రసన్నేఽపి స్వామిన్ భవదమలపాదాబ్జయుగలమ్ ।
కథం పశ్యేయం మాం స్థగయతి నమఃసంభ్రమజుషాం
నిలింపానాం శ్రేణిర్నిజకనకమాణిక్యమకుటైః ।।17।।


త్వమేకో లోకానాం పరమఫలదో దివ్యపదవీం
వహన్తస్త్వన్మూలాం పునరపి భజన్తే హరిముఖాః ।
కియద్వా దాక్షిణ్యం తవ శివ మదాశా చ కియతీ
కదా వా మద్రక్షాం వహసి కరుణాపూరితదృశా ।।18।।


దురాశాభూయిష్ఠే దురధిపగృహద్వారఘటకే
దురన్తే సంసారే దురితనిలయే దుఃఖ జనకే ।
మదాయాసం కిం న వ్యపనయసి కస్యోపకృతయే
వదేయం ప్రీతిశ్చేత్ తవ శివ కృతార్థాః ఖలు వయమ్ ।।19।।


సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌ
నటత్యాశాశాఖాస్వటతి ఝటితి స్వైరమభితః ।
కపాలిన్ భిక్షో మే హృదయకపిమత్యన్తచపలం
దృఢం భక్త్యా బద్ధ్వా శివ భవదధీనం కురు విభో ।।20।।


ధృతిస్తంభాధారం దృఢగుణ నిబద్ధాం సగమనాం
విచిత్రాం పద్మాఢ్యాం ప్రతిదివససన్మార్గఘటితామ్ ।
స్మరారే మచ్చేతఃస్ఫుటపటకుటీం ప్రాప్య విశదాం
జయ స్వామిన్ శక్త్యా సహ శివ గణైస్సేవిత విభో ।।21।।


ప్రలోభాద్యైః అర్థాహరణ పరతన్త్రో ధనిగృహే
ప్రవేశోద్యుక్తస్సన్ భ్రమతి బహుధా తస్కరపతే
ఇమం చేతశ్చోరం కథమిహ సహే శంకర విభో
తవాధీనం కృత్వా మయి నిరపరాధే కురు కృపామ్ ।।22।।


కరోమి త్వత్పూజాం సపది సుఖదో మే భవ విభో
విధిత్వం విష్ణుత్వమ్ దిశసి ఖలు తస్యాః ఫలమితి ।
పునశ్చ త్వాం ద్రష్టుం దివి భువి వహన్ పక్షిమృగతాం
అదృష్ట్వా తత్ఖేదం కథమిహ సహే శంకర విభో ।।23।।


కదా వా కైలాసే కనకమణిసౌధే సహగణైః
వసన్ శంభోరగ్రే స్ఫుటఘటిత మూర్ధాంజలిపుటః ।
విభో సాంబ స్వామిన్ పరమశివ పాహీతి నిగదన్
విధాతౄణాం కల్పాన్ క్షణమివ వినేష్యామి సుఖతః ।।24।।


స్తవైర్బ్రహ్మాదీనాం జయజయవచోభిః నియమానాం
గణానాం కేలీభిః మదకలమహోక్షస్య కకుది ।
స్థితం నీలగ్రీవం త్రినయనంఉమాశ్లిష్టవపుషం
కదా త్వాం పశ్యేయం కరధృతమృగం ఖణ్డపరశుమ్ ।।25।।


కదా వా త్వాం దృష్ట్వా గిరిశ తవ భవ్యాంఘ్రియుగలం
గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్ ।
సమాశ్లిష్యాఘ్రాయ స్ఫుటజలజగన్ధాన్ పరిమలాన్
అలభ్యాం బ్రహ్మాద్యైః ముదమనుభవిష్యామి హృదయే ।।26।।


కరస్థే హేమాద్రౌ గిరిశ నికటస్థే ధనపతౌ
గృహస్థే స్వర్భూజాఽమరసురభిచిన్తామణిగణే ।
శిరస్థే శీతాంశౌ చరణయుగలస్థేఅఖిల శుభే
కమర్థం దాస్యేఽహం భవతు భవదర్థం మమ మనః ।।27।।


సారూప్యం తవ పూజనే శివ మహాదేవేతి సంకీర్తనే
సామీప్యం శివ భక్తిధుర్యజనతాసాంగత్యసంభాషణే ।
సాలోక్యం చ చరాచరాత్మక తనుధ్యానే భవానీపతే
సాయుజ్యం మమ సిద్ధిమత్ర భవతి స్వామిన్ కృతార్థోస్మ్యహమ్ ।।28।।


త్వత్పాదాంబుజమర్చయామి పరమం త్వాం చిన్తయామ్యన్వహం
త్వామీశం శరణం వ్రజామి వచసా త్వామేవ యాచే విభో ।
వీక్షాం మే దిశ చాక్షుషీం సకరుణాం దివ్యైశ్చిరం ప్రార్థితాం
శంభో లోకగురో మదీయమనసః సౌఖ్యోపదేశం కురు ।।29।।


వస్త్రోద్ధూత విధౌ సహస్రకరతా పుష్పార్చనే విష్ణుతా
గన్ధే గన్ధవహాత్మతాఽన్నపచనే బహిర్ముఖాధ్యక్షతా ।
పాత్రే కాంచనగర్భతాస్తి మయి చేద్ బాలేన్దు చూడామణే
శుశ్రూషాం కరవాణి తే పశుపతే స్వామిన్ త్రిలోకీగురో ।।30।।


నాలం వా పరమోపకారకమిదం త్వేకం పశూనాం పతే
పశ్యన్ కుక్షిగతాన్ చరాచరగణాన్ బాహ్యస్థితాన్ రక్షితుమ్ ।
సర్వామర్త్యపలాయనౌషధం అతిజ్వాలాకరం భీకరం
నిక్షిప్తం గరలం గలే న గలితం నోద్గీర్ణమేవత్వయా ।।31।।


జ్వాలోగ్రస్సకలామరాతిభయదః క్ష్వేలః కథం వా త్వయా
దృష్టః కిం చ కరే ధృతః కరతలే కిం పక్వ జంబూఫలమ్ ।
జిహ్వాయాం నిహితశ్చ సిద్ధఘుటికా వా కణ్ఠదేశే భృతః
కిం తే నీలమణిర్విభూషణమయం శంభో మహాత్మన్ వద ।।32।।


నాలం వా సకృదేవ దేవ భవతస్సేవా నతిర్వా నుతిః
పూజా వా స్మరణం కథాశ్రవణమప్యాలోకనం మాదృశామ్ ।
స్వామిన్నస్థిరదేవతానుసరణాయాసేన కిం లభ్యతే
కా వా ముక్తిరితః కుతో భవతి చేత్ కిం ప్రార్థనీయం తదా ।।33।।


కిం బ్రూమస్తవ సాహసం పశుపతే కస్యాస్తి శంభో
భవద్ధైర్యం చేదృశమాత్మనః స్థితిరియం చాన్యైః కథం లభ్యతే ।
భ్రశ్యద్దేవగణం త్రసన్మునిగణం నశ్యత్ప్రపఞ్చం లయం
పశ్యన్నిర్భయ ఏక ఏవ విహరత్యానన్దసాన్ద్రో భవాన్ ।।34।।


యోగక్షేమధురంధరస్య సకలఃశ్రేయః ప్రదోద్యోగినో
దృష్టాదృష్టమతోపదేశకృతినో బాహ్యాన్తరవ్యాపినః ।
సర్వజ్ఞస్య దయాకరస్య భవతః కిం వేదితవ్యం మయా
శంభో త్వం పరమాన్తరంగ ఇతి మే చిత్తే స్మరామ్యన్వహమ్ ।।35।।


భక్తో భక్తిగుణావృతే ముదమృతాపూర్ణే ప్రసన్నే మనః
కుమ్భే సాంబ తవాంఘ్రిపల్లవ యుగం సంస్థాప్య సంవిత్ఫలమ్ ।
సత్త్వం మన్త్రముదీరయన్నిజ శరీరాగార శుద్ధిం వహన్
పుణ్యాహం ప్రకటీ కరోమి రుచిరం కల్యాణమాపాదయన్ ।।36।।


ఆమ్నాయాంబుధిమాదరేణ సుమనస్సంఘాఃసముద్యన్మనో
మన్థానం దృఢ భక్తిరజ్జుసహితం కృత్వా మథిత్వా తతః ।
సోమం కల్పతరుం సుపర్వసురభిం చిన్తామణిం ధీమతాం
నిత్యానన్దసుధాం నిరన్తరరమాసౌభాగ్యమాతన్వతే ।।37।।


ప్రాక్పుణ్యాచలమార్గదర్శితసుధామూర్తిః ప్రసన్నశ్శివః
సోమస్సద్గుణసేవితో మృగధరః పూర్ణాస్తమో మోచకః ।
చేతః పుష్కర లక్షితో భవతి చేదానన్దపాథో నిధిః
ప్రాగల్భ్యేన విజృంభతే సుమనసాం వృత్తిస్తదా జాయతే ।।38।।


ధర్మో మే చతురంఘ్రికః సుచరితః పాపం వినాశం గతం
కామక్రోధమదాదయో విగలితాః కాలాః సుఖావిష్కృతాః ।
జ్ఞానానన్దమహౌషధిః సుఫలితా కైవల్య నాథే సదా
మాన్యే మానసపుణ్డరీకనగరే రాజావతంసే స్థితే ।।39।।


ధీయన్త్రేణ వచోఘటేన కవితాకుల్యోపకుల్యాక్రమైః
ఆనీతైశ్చ సదాశివస్య చరితాంభోరాశిదివ్యామృతైః ।
హృత్కేదారయుతాశ్చ భక్తికలమాః సాఫల్యమాతన్వతే
దుర్భిక్షాన్మమ సేవకస్య భగవన్ విశ్వేశ భీతిః కుతః ।।40।।


పాపోత్పాతవిమోచనాయ రుచిరైశ్వర్యాయ మృత్యుంజయ
స్తోత్రధ్యాననతిప్రదిక్షిణసపర్యాలోకనాకర్ణనే ।
జిహ్వాచిత్తశిరోంఘ్రిహస్తనయనశ్రోత్రైరహం ప్రార్థితో
మామాజ్ఞాపయ తన్నిరూపయ ముహుర్మామేవ మా మేఽవచః ।।41।।


గాంభీర్యం పరిఖాపదం ఘనధృతిః ప్రాకార ఉద్యద్గుణ
స్తోమశ్చాప్త బలం ఘనేన్ద్రియచయో ద్వారాణి దేహే స్థితః ।
విద్యావస్తుసమృద్ధిరిత్యఖిలసామగ్రీసమేతే సదా
దుర్గాతిప్రియదేవ మామకమనోదుర్గే నివాసం కురు ।।42।।


మా గచ్ఛ త్వమితస్తతో గిరిశ భో మయ్యేవ వాసం కురు
స్వామిన్నాది కిరాత మామకమనః కాన్తారసీమాన్తరే ।
వర్తన్తే బహుశో మృగా మదజుషో మాత్సర్యమోహాదయః
తాన్ హత్వా మృగయా వినోద రుచితాలాభం చ సంప్రాప్స్యసి ।।43।।


కరలగ్న మృగః కరీన్ద్రభంగో
ఘన శార్దూలవిఖణ్డనోఽస్తజన్తుః ।
గిరిశో విశదాకృతిశ్చ చేతః
కుహరే పఞ్చ ముఖోస్తి మే కుతో భీః ।।44।।


ఛన్దశ్శాఖి శిఖాన్వితైః ద్విజవరైః సంసేవితే శాశ్వతే
సౌఖ్యాపాదిని ఖేదభేదిని సుధాసారైః ఫలైర్దీపితే ।
చేతః పక్షి శిఖామణే త్యజ వృథా సంచారం అన్యైరలం
నిత్యం శంకరపాదపద్మయుగలీనీడే విహారం కురు ।।45।।


ఆకీర్ణే నఖరాజికాన్తివిభవైరుద్యత్సుధావైభవైః
ఆధౌతేపి చ పద్మరాగలలితే హంసవ్రజైరాశ్రితే ।
నిత్యం భక్తివధూ గణైశ్చ రహసి స్వేచ్ఛావిహారం కురు
స్థిత్వా మానసరాజహంస గిరిజా నాథాంఘ్రిసౌధాన్తరే ।।46।।


శంభుధ్యానవసన్తసంగిని హృదారామేఅఘజీర్ణచ్ఛదాః
స్రస్తా భక్తి లతాచ్ఛటా విలసితాః పుణ్యప్రవాలశ్రితాః ।
దీప్యన్తే గుణకోరకా జపవచః పుష్పాణి సద్వాసనా
జ్ఞానానన్దసుధామరన్దలహరీ సంవిత్ఫలాభ్యున్నతిః ।।47।।


నిత్యానన్దరసాలయం సురమునిస్వాన్తాంబుజాతాశ్రయం
స్వచ్ఛం సద్ద్విజసేవితం కలుషహృత్ సద్వాసనావిష్కృతమ్ ।
శంభుధ్యానసరోవరం వ్రజ మనోహంసావతంస స్థిరం
కిం క్షుద్రాశ్రయపల్వలభ్రమణసంజాతశ్రమం ప్రాప్స్యసి ।।48।।


ఆనన్దామృతపూరితా హరపదాంభోజాలవాలోద్యతా
స్థైర్యోపఘ్నముపేత్య భక్తి లతికా శాఖోపశాఖాన్వితా ।
ఉచ్ఛైర్మానస కాయమానపటలీమాక్రంయ నిష్కల్మషా
నిత్యాభీష్ట ఫలప్రదా భవతు మే సత్కర్మ సంవర్ధితా ।।49।।


సన్ధ్యారంభవిజృంభితం శ్రుతిశిర స్థానాన్తరాధిష్ఠితం
సప్రేమ భ్రమరాభిరామమసకృత్ సద్వాసనా శోభితమ్ ।
భోగీన్ద్రాభరణం సమస్త సుమనఃపూజ్యం గుణావిష్కృతం
సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితమ్ ।।50।।


భృంగీచ్ఛానటనోత్కటః కరిమదగ్రాహీ స్ఫురన్
మాధవాహ్లాదో నాదయుతో మహాసితవపుః పంచేషుణా చాదృతః ।
సత్పక్షస్సుమనోవనేషు స పునః సాక్షాన్మదీయే మనో
రాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభుః ।।51।।


కారుణ్యామృతవర్షిణం ఘనవిపద్గ్రీష్మచ్ఛిదాకర్మఠం
విద్యాసస్యఫలోదయాయ సుమనస్సంసేవ్యం ఇచ్ఛాకృతిమ్ ।
నృత్యద్భక్తమయూరం అద్రినిలయం చంచజ్జటా మణ్డలం
శంభో వాంఛతి నీలకన్ధర సదా త్వాం మే మనశ్చాతకః ।।52।।


ఆకాశేన శిఖీ సమస్త ఫణినాం నేత్రా కలాపీ
నతాఽనుగ్రాహి ప్రణవోపదేశ నినదైః కేకీతి యో గీయతే
శ్యామాం శైల సముద్భవాం ఘనరుచిం దృష్ట్వా నటన్తం ముదా
వేదాన్తోపవనే విహారరసికం తం నీలకణ్ఠం భజే ।।53।।


సన్ధ్యా ఘర్మదినాత్యయో హరికరాఘాతప్రభూతానక
ధ్వానో వారిద గర్జితం దివిషదాం దృష్టిచ్ఛటా చంచలా ।
భక్తానాం పరితోష బాష్ప వితతిర్వృష్టిర్మయూరీ శివా
యస్మిన్నుజ్జ్వల తాణ్డవం విజయతే తం నీలకణ్ఠం భజే ।।54।।


ఆద్యాయామిత తేజసే శ్రుతి పదైర్వేద్యాయ సాధ్యాయ తే
విద్యానన్దమయాత్మనే త్రిజగతస్సంరక్షణోద్యోగినే ।
ధ్యేయాయాఖిల యోగిభిస్సురగణైర్గేయాయ మాయావినే
సంయక్ తాణ్డవ సంభ్రమాయ జటినే సేయం నతిశ్శంభవే ।।55।।


నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయనీ శ్రేయసే
సత్యాయాది కుటుమ్బినే మునిమనః ప్రత్యక్ష చిన్మూర్తయే ।
మాయా సృష్ట జగత్త్రయాయ సకలామ్నాయాన్త సంచారిణే
సాయం తాణ్డవ సంభ్రమాయ జటినే సేయం నతిశ్శంభవే ।।56।।


నిత్యం స్వోదర పోషణాయ సకలానుద్దిశ్య విత్తాశయా
వ్యర్థం పర్యటనం కరోమి భవతస్సేవాం న జానే విభో ।
మజ్జన్మాన్తర పుణ్యపాక బలతస్త్వం శర్వ సర్వాన్తరః
తిష్ఠస్యేవ హి తేన వా పశుపతే తే రక్షణీయోఽస్మ్యహమ్ ।।57।।


ఏకో వారిజ బాన్ధవః క్షితినభో వ్యాప్తం తమోమణ్డలం
భిత్వా లోచనగోచరోపి భవతి త్వం కోటిసూర్య ప్రభః ।
వేద్యః కిం న భవస్యహో ఘనతరం కీదృఙ్భవేన్మత్తమస్
తత్సర్వం వ్యపనీయ మే పశుపతే సాక్షాత్ ప్రసన్నో భవ ।।58।।


హంసః పద్మవనం సమిచ్ఛతి యథా నీలాంబుదం చాతకః
కోకః కోకనద ప్రియం ప్రతిదినం చన్ద్రం చకోరస్తథా ।
చేతో వాఞ్ఛతి మామకం పశుపతే చిన్మార్గ మృగ్యం విభో
గౌరీ నాథ భవత్పదాబ్జయుగలం కైవల్య సౌఖ్యప్రదమ్ ।।59।।


రోధస్తోయహృతః శ్రమేణ పథికశ్ఛాయాం తరోర్వృష్టితః
భీతః స్వస్థ గృహం గృహస్థం అతిథిర్దీనః ప్రభం ధార్మికమ్ ।
దీపం సన్తమసాకులశ్చ శిఖినం శీతావృతస్త్వం తథా
చేతస్సర్వ భయాపహం వ్రజ సుఖం శంభోః పదాంభోరుహమ్ ।।60।।


అంకోలం నిజ బీజ సన్తతిరయస్కాన్తోపలం సూచికా
సాధ్వీ నైజ విభుం లతా క్షితిరుహం సిన్ధుస్సరిద్ వల్లభమ్ ।
ప్రాప్నోతీహ యథా తథా పశుపతేః పాదారవిన్దద్వయం
చేతోవృత్తిరుపేత్య తిష్ఠతి సదా సా భక్తిరిత్యుచ్యతే ।।61।।


ఆనన్దాశ్రుభిరాతనోతి పులకం నైర్మల్యతశ్ఛాదనం
వాచా శంఖ ముఖే స్థితైశ్చ జఠరాపూర్తిం చరిత్రామృతైః ।
రుద్రాక్షైర్భసితేన దేవ వపుషో రక్షాం భవద్భావనా
పర్యంకే వినివేశ్య భక్తి జననీ భక్తార్భకం రక్షతి ।।62।।


మార్గావర్తిత పాదుకా పశుపతేరఙ్గస్య కూర్చాయతే
గణ్డూషాంబు నిషేచనం పురరిపోర్దివ్యాభిషేకాయతే
కించిద్భక్షిత మాంసశేషకబలం నవ్యోపహారాయతే
భక్తిః కిం న కరోత్యహో వనచరో భక్తావతంసాయతే ।।63।।


వక్షస్తాడనమన్తకస్య కఠినాపస్మార సంమర్దనం
భూభృత్ పర్యటనం నమత్సురశిరః కోటీర సంఘర్షణమ్ ।
కర్మేదం మృదులస్య తావకపద ద్వన్ద్వస్య గౌరీపతే
మచ్చేతో మణిపాదుకా విహరణం శంభో సదాంగీకురు ।।64।।


వక్షస్తాడన శంకయా విచలితో వైవస్వతో నిర్జరాః
కోటీరోజ్జ్వల రత్నదీపకలికా నీరాజనం కుర్వతే ।
దృష్ట్వా ముక్తివధూస్తనోతి నిభృతాశ్లేషం భవానీపతే
యచ్చేతస్తవ పాదపద్మభజనం తస్యేహ కిం దుర్లభమ్ ।।65।।


క్రీడార్థం సృజసి ప్రపంచమఖిలం క్రీడామృగాస్తే జనాః
యత్కర్మాచరితం మయా చ భవతః ప్రీత్యై భవత్యేవ తత్ ।
శంభో స్వస్య కుతూహలస్య కరణం మచ్చేష్టితం నిశ్చితం
తస్మాన్మామక రక్షణం పశుపతే కర్తవ్యమేవ త్వయా ।।66।।


బహువిధ పరితోష బాష్పపూర
స్ఫుట పులకాంకిత చారుభోగ భూమిమ్ ।
చిరపద ఫలకాంక్షి సేవ్యమానాం
పరమ సదాశివ భావనాం ప్రపద్యే ।।67।।


అమిత ముదమృతం ముహుర్దుహన్తీం
విమల భవత్పదగోష్ఠమావసన్తీమ్ ।
సదయ పశుపతే సుపుణ్య పాకాం
మమ పరిపాలయ భక్తి ధేనుమేకామ్ ।।68।।


జడతా పశుతా కలంకితా
కుటిల చరత్వం చ నాస్తి మయి దేవ ।
అస్తి యది రాజమౌలే
భవదాభరణస్య నాస్మి కిం పాత్రమ్ ।।69।।


అరహసి రహసి స్వతన్త్ర బుద్ధ్యా
వరివసితుం సులభః ప్రసన్న మూర్తిః ।
అగణిత ఫలదాయకః ప్రభుర్మే
జగదధికో హృది రాజ శేఖరోస్తి ।।70।।


ఆరూఢ భక్తిగుణ కుంచిత భావ చాప
యుక్తైశ్శివ స్మరణ బాణగణైరమోఘైః ।
నిర్జిత్య కిల్బిషరిపూన్ విజయీ
సుధీన్ద్రస్సానన్దమావహతి సుస్థిర రాజలక్ష్మీమ్ ।।71।।


ధ్యానాంజనేన సమవేక్ష్య తమఃప్రదేశం
భిత్వా మహాబలిభిరీశ్వరనామ మన్త్రైః ।
దివ్యాశ్రితం భుజగభూషణముద్వహన్తి
యే పాద పద్మమిహ తే శివ తే కృతార్థాః ।।72।।


భూదారతాముదవహద్ యదపేక్షయా శ్రీ
భూదార ఏవ కిమతస్సుమతే లభస్వ ।
కేదారమాకలిత ముక్తి మహౌషధీనాం
పాదారవిన్ద భజనం పరమేశ్వరస్య ।।73।।


ఆశాపాశక్లేశదుర్వాసనాది
భేదోద్యుక్తైః దివ్యగన్ధైరమన్దైః ।
ఆశాశాటీకస్య పాదారవిన్దం
చేతఃపేటీం వాసితాం మే తనోతు ।।74।।


కల్యాణినం సరసచిత్రగతిం సవేగం
సర్వేంగితజ్ఞమనఘం ధ్రువ లక్షణాఢ్యమ్ ।
చేతస్తురంగమ్ అధిరుహ్య చర స్మరారే
నేతస్సమస్త జగతాం వృషభాధిరూఢ ।।75।।


భక్తిర్మహేశ పదపుష్కరమావసన్తీ
కాదంబినీవ కురుతే పరితోషవర్షమ్ ।
సంపూరితో భవతి యస్య మనస్తటాకః
తజ్జన్మసస్యమఖిలం సఫలం చ నాన్యత్ ।।76।।


బుద్ధిఃస్థిరా భవితుమీశ్వర పాదపద్మ
సక్తా వధూర్విరహిణీవ సదా స్మరన్తీ ।
సద్భావనా స్మరణదర్శనకీర్తనాది
సంమోహితేవ శివమన్త్ర జపేన విన్తే ।।77।।


సదుపచార విధిష్వనుబోధితాం
సవినయాం సుహృదం సదుపాశ్రితామ్ ।
మమ సముద్ధర బుద్ధిమిమాం ప్రభో
వరగుణేన నవోఢ వధూమివ ।।78।।


నిత్యం యోగి మనస్సరోజదల సంచార క్షమస్త్వత్
క్రమశ్శంభో తేన కథం కఠోర యమరాడ్ వక్షఃకవాటక్షతిః ।
అత్యన్తం మృదులం త్వదంఘ్రి యుగలం హా మే మనశ్చిన్తయతి
ఏతల్లోచన గోచరం కురు విభో హస్తేన సంవాహయే ।।79।।


ఏష్యత్యేష జనిం మనోఽస్య కఠినం తస్మిన్నటానీతి
మద్రక్షాయై గిరి సీమ్ని కోమలపదన్యాసః పురాభ్యాసితః ।
నోచేద్ దివ్య గృహాన్తరేషు సుమనస్తల్పేషు వేద్యాదిషు
ప్రాయస్సత్సు శిలాతలేషు నటనం శంభో కిమర్థం తవ ।।80।।


కంచిత్కాలముమామహేశ భవతః పాదారవిన్దార్చనైః
కంచిద్ధ్యాన సమాధిభిశ్చ నతిభిః కఞ్చిత్ కథాకర్ణనైః ।
కంచిత్ కంచిదవేక్షణైశ్చ నుతిభిః కంచిద్దశామీదృశీం
యఃప్రాప్నోతి ముదా త్వదర్పిత మనా జీవన్ స ముక్తఃఖలు ।।81।।


బాణత్వం వృషభత్వం అర్ధవపుషా భార్యాత్వం ఆర్యాపతే
ఘోణిత్వం సఖితా మృదంగ వహతా చేత్యాది రూపం దధౌ ।
త్వత్పాదే నయనార్పణం చ కృతవాన్ త్వద్దేహ భాగో హరిః
పూజ్యాత్పూజ్యతరస్స ఏవ హి న చేత్ కో వా తదన్యోఽధికః ।।82।।


జననమృతియుతానాం సేవయా దేవతానాం
న భవతి సుఖ లేశస్సంశయో నాస్తి తత్ర ।
అజనిమమృత రూపం సాంబమీశం భజన్తే
య ఇహ పరమ సౌఖ్యం తే హి ధన్యా లభన్తే ।।83।।


శివ తవ పరిచర్యా సన్నిధానాయ గౌర్యా
భవ మమ గుణధుర్యాం బుద్ధికన్యాం ప్రదాస్యే ।
సకల భువన బన్ధో సచ్చిదానన్ద సిన్ధో
సదయ హృదయగేహే సర్వదా సంవస త్వమ్ ।।84।।


జలధి మథన దక్షో నైవ పాతాల భేదీ
న చ వన మృగయాయాం నైవ లుబ్ధః ప్రవీణః ।
అశన కుసుమ భూషా వస్త్ర ముఖ్యాం సపర్యాం
కథయ కథమహం తే కల్పయానీన్దుమౌలే ।।85।।


పూజాద్రవ్య సమృద్ధయో విరచితాః పూజాం కథం కుర్మహే
పక్షిత్వం న చ వా కీటిత్వమపి న ప్రాప్తం మయా దుర్లభమ్ ।
జానే మస్తకమఙ్ఘ్రిపల్లవముమా జానే న తేఽహం విభో
న జ్ఞాతం హి పితామహేన హరిణా తత్త్వేన తద్రూపిణా ।।86।।


అశనం గరలం ఫణీ కలాపో
వసనం చర్మ చ వాహనం మహోక్షః ।
మమ దాస్యసి కిం కిమస్తి శంభో
తవ పాదాంబుజ భక్తిమేవ దేహి ।।87।।


యదా కృతాంభోనిధి సేతుబన్ధనః
కరస్థ లాధః కృత పర్వతాధిపః ।
భవాని తే లంఘిత పద్మసమ్భవః
తదా శివార్చాస్తవ భావనక్షమః ।।88।।


నతిభిర్నుతిభిస్త్వమీశ పూజా
విధిభిర్ధ్యానసమాధిభిర్న తుష్టః ।
ధనుషా ముసలేన చాశ్మభిర్వా
వద తే ప్రీతికరం తథా కరోమి ।।89।।


వచసా చరితం వదామి
శంభోరహం ఉద్యోగ విధాసు తేఽప్రసక్తః ।
మనసాకృతిమీశ్వరస్య సేవే
శిరసా చైవ సదాశివం నమామి ।।90।।


ఆద్యాఽవిద్యా హృద్గతా నిర్గతాసీత్
విద్యా హృద్యా హృద్గతా త్వత్ప్రసాదాత్ ।
సేవే నిత్యం శ్రీకరం త్వత్పదాబ్జం
భావే ముక్తేర్భాజనం రాజమౌలే ।।91।।


దూరీకృతాని దురితాని దురక్షరాణి
దౌర్భాగ్య దుఃఖ దురహంకృతి దుర్వచాంసి ।
సారం త్వదీయ చరితం నితరాం పిబన్తం
గౌరీశ మామిహ సముద్ధర సత్కటాక్షైః ।।92।।


సోమ కలాధరమౌలౌ
కోమల ఘనకన్ధరే మహామహసి ।
స్వామిని గిరిజా నాథే
మామక హృదయం నిరన్తరం రమతామ్ ।।93।।


సా రసనా తే నయనే
తావేవ కరౌ స ఏవ కృతకృత్యః ।
యా యే యౌ యో భర్గం
వదతీక్షేతే సదార్చతః స్మరతి ।।94।।


అతి మృదులౌ మమ
చరణావతి కఠినం తే మనో భవానీశ ।
ఇతి విచికిత్సాం సంత్యజ
శివ కథమాసీద్గిరౌ తథా ప్రవేశః ।।95।।


ధైర్యాంకుశేన నిభృతం
రభసాదాకృష్య భక్తిశృంఖలయా ।
పురహర చరణాలానే
హృదయ మదేభం బధాన చిద్యన్త్రైః ।।96।।


ప్రచరత్యభితః ప్రగల్భవృత్త్యా
మదవానేష మనఃకరీ గరీయాన్ ।
పరిగృహ్య నయేన భక్తిరజ్జ్వా
పరమ స్థాణుపదం దృఢం నయాముమ్ ।।97।।


సర్వాలంకారయుక్తాం సరలపదయుతాం సాధువృత్తాం సువర్ణాం
సద్భిస్సంస్తూయమానాం సరస గుణయుతాం లక్షితాం లక్షణాఢ్యామ్ ।
ఉద్యద్భూషావిశేషామ్ ఉపగతవినయాం ద్యోతమానార్థరేఖాం
కల్యాణీం దేవ గౌరీప్రియ మమ కవితాకన్యకాం త్వం గృహాణ ।।98।।


ఇదం తే యుక్తం వా పరమశివ కారుణ్య జలధే
గతౌ తిర్యగ్రూపం తవ పదశిరోదర్శనధియా ।
హరిబ్రహ్మాణౌ తౌ దివి భువి చరన్తౌ శ్రమయుతౌ
కథం శంభో స్వామిన్ కథయ మమ వేద్యోసి పురతః ।।99।।


స్తోత్రేణాలం అహం ప్రవచ్మి న మృషా దేవా విరించాదయః
స్తుత్యానాం గణనాప్రసంగసమయే త్వామగ్రగణ్యం విదుః ।
మాహాత్మ్యాగ్రవిచారణప్రకరణే ధానాతుషస్తోమవత్
ధూతాస్త్వాం విదురుత్తమోత్తమ ఫలం శంభో భవత్సేవకాః ।।100।।


ఇతి శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్య

శ్రీమత్ శంకరాచార్య విరచితా శివానన్ద లహరీ సమాప్తా ।। 

Sree Tavrita

 



Sree Tavrita

Saturday, February 22, 2025

శ్రీ అఘోరాష్టకం - Sree AghoraAshtakam in Telugu


 || శ్రీ అఘోరాష్టకం ||



కాలాభ్రోత్పలకాలగాత్రమనలజ్వాలోర్ధ్వకేశోజ్జ్వలం
దంష్ట్రాద్యస్ఫుటదోష్ఠబింబమనలజ్వాలోగ్రనేత్రత్రయం .
రక్తాకోరకరక్తమాల్యరచితం(రుచిరం)రక్తానులేపప్రియం
వందేఽభీష్టఫలాప్తయేఽఙ్ఘ్రికమలేఽఘోరాస్త్రమంత్రేశ్వరం .1

 

జంఘాలంబితకింకిణీమణిగణప్రాలంబిమాలాంచితం
(దక్షాంత్రం)డమరుం పిశాచమనిశం శూలం చ మూలం కరైః .
ఘంటాఖేటకపాలశూలకయుతం వామస్థితే బిభ్రతం
వందేఽభీష్టఫలాప్తయేఽఙ్ఘ్రికమలేఽఘోరాస్త్రమంత్రేశ్వరం .2

 

నాగేంద్రావృతమూర్ధ్నిజ(ర్ధజ) స్థిత(శ్రుతి)గలశ్రీహస్తపాదాంబుజం
శ్రీమద్దోఃకటికుక్షిపార్శ్వమభితో నాగోపవీతావృతం .
లూతావృశ్చికరాజరాజితమహాహారాంకితోరస్స్థలం
వందేఽభీష్టఫలాప్తయేఽఙ్ఘ్రికమలేఽఘోరాస్త్రమంత్రేశ్వరం .3

 

ధృత్వా పాశుపతాస్త్రనామ కృపయా యత్కుండలి(యత్కృంతతి)ప్రాణినాం
పాశాన్యే క్షురికాస్త్రపాశదలితగ్రంథిం శివాస్త్రాహ్వయం (?) .
విఘ్నాకాంక్షిపదం ప్రసాదనిరతం సర్వాపదాం తారకం
వందేఽభీష్టఫలాప్తయేఽఙ్ఘ్రికమలేఽఘోరాస్త్రమంత్రేశ్వరం .4

 

ఘోరాఘోరతరాననం స్ఫుటదృశం సంప్రస్ఫురచ్ఛూలకం
ప్రాజ్యాం(జ్యం)నృత్తసురూపకం చటచటజ్వాలాగ్నితేజఃకచం .
(జానుభ్యాం)ప్రచటత్కృతా(రినికరం)స్త్రగ్రుండమాలాన్వితం
వందేఽభీష్టఫలాప్తయేఽఙ్ఘ్రికమలేఽఘోరాస్త్రమంత్రేశ్వరం .5

 

భక్తానిష్టకదుష్టసర్పదురితప్రధ్వంసనోద్యోగయుక్
హస్తాగ్రం ఫణిబద్ధహస్తచరణం ప్రారబ్ధయాత్రాపరం .
స్వావృత్త్యాస్థితభీషణాంకనికరప్రారబ్ధసౌభాగ్యకం ?
వందేఽభీష్టఫలాప్తయేఽఙ్ఘ్రికమలేఽఘోరాస్త్రమంత్రేశ్వరం .6

 

యన్మంత్రాక్షరలాంఛితాపఘనవన్మర్త్యాశ్చ(చ్చ) వజ్రార్చిషో
భూతప్రేతపిశాచరాక్షసకలానిర్ఘాతపాతా ఇవ(దివ) .
ఉత్సన్నాశ్చ భవంతి సర్వదురితప్రోచ్చాటనోత్పాదకం
వందేఽభీష్టఫలాప్తయేఽఙ్ఘ్రికమలేఽఘోరాస్త్రమంత్రేశ్వరం .7

 

యద్ధ్యానో ధ్రువపూరుషో(ధ్యానోద్యతపూరుషో)షితగృహగ్రామస్థిరాస్థాయినో
భూతప్రేతపిశాచరాక్షసప్రతిహతా నిర్ఘాతపాతా ఇవ .
యద్రూపం విధినా స్మరన్ హి విజయీ శత్రుక్షయం ప్రాప్నుతే
వందేఽభీష్టఫలాప్తయేఽఙ్ఘ్రికమలేఽఘోరాస్త్రమంత్రేశ్వరం .8

 

.. ఇతి శ్రీఅఘోరాష్టకం సంపూర్ణం ..

 

Tuesday, February 18, 2025

గురు పాదుకా స్తోత్రం (Guru Paduka Stotram in telugu)

 


 

గురు పాదుకా స్తోత్రం

 

అనంతసంసారసముద్రతార-
నౌకాయితాభ్యాం గురుభక్తిదాభ్యామ్ ।
వైరాగ్యసామ్రాజ్యదపూజనాభ్యాం
నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ ॥ 1

 

కవిత్వవారాశినిశాకరాభ్యాం
దౌర్భాగ్యదావాంబుదమాలికాభ్యామ్ ।
దూరీకృతానమ్రవిపత్తితాభ్యాం
నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ ॥ 2

 

నతా యయోః శ్రీపతితాం సమీయుః
కదాచిదప్యాశు దరిద్రవర్యాః ।
మూకాశ్చ వాచస్పతితాం హి తాభ్యాం
నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ ॥ 3

 

నాలీకనీకాశపదాహృతాభ్యాం
నానావిమోహాదినివారికాభ్యామ్ ।
నమజ్జనాభీష్టతతిప్రదాభ్యాం
నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ ॥ 4

 

నృపాలిమౌలివ్రజరత్నకాంతి-
సరిద్విరాజజ్ఝషకన్యకాభ్యామ్ ।
నృపత్వదాభ్యాం నతలోకపంక్తేః
నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ ॥ 5

 

పాపాంధకారార్కపరంపరాభ్యాం
తాపత్రయాహీంద్రఖగేశ్వరాభ్యామ్ ।
జాడ్యాబ్ధిసంశోషణవాడవాభ్యాం
నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ ॥ 6

 

శమాదిషట్కప్రదవైభవాభ్యాం
సమాధిదానవ్రతదీక్షితాభ్యామ్ ।
రమాధవాంఘ్రిస్థిరభక్తిదాభ్యాం
నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ ॥ 7

 

స్వార్చాపరాణామఖిలేష్టదాభ్యాం
స్వాహాసహాయాక్షధురంధరాభ్యామ్ ।
స్వాంతాచ్ఛభావప్రదపూజనాభ్యాం
నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ ॥ 8

 

కామాదిసర్పవ్రజగారుడాభ్యాం
వివేకవైరాగ్యనిధిప్రదాభ్యామ్ ।
బోధప్రదాభ్యాం ద్రుతమోక్షదాభ్యాం
నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ ॥ 9




చంద్రశేఖరాష్టకం (ChandraSekhara Ashtakam in Telugu)




 చంద్రశేఖరాష్టకం

చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమామ్ ।
చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమామ్ ॥ 

 

రత్నసాను శరాసనం రజతాద్రి శృంగ నికేతనం
శింజినీకృత పన్నగేశ్వర మచ్యుతానల సాయకమ్ ।
క్షిప్రదగ్ద పురత్రయం త్రిదశాలయై-రభివందితం
చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః ॥ 1

 

పంచపాదప పుష్పగంధ పదాంబుజ ద్వయశోభితం
ఫాలలోచన జాతపావక దగ్ధ మన్మధ విగ్రహమ్ ।
భస్మదిగ్ధ కళేబరం భవనాశనం భవ మవ్యయం
చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమామ్ ॥ 2

 

మత్తవారణ ముఖ్యచర్మ కృతోత్తరీయ మనోహరం
పంకజాసన పద్మలోచన పూజితాంఘ్రి సరోరుహమ్ ।
దేవ సింధు తరంగ శ్రీకర సిక్త శుభ్ర జటాధరం
చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమామ్ ॥ 3

 

యక్ష రాజసఖం భగాక్ష హరం భుజంగ విభూషణం
శైలరాజ సుతా పరిష్కృత చారువామ కళేబరమ్ ।
క్షేళ నీలగళం పరశ్వధ ధారిణం మృగధారిణం
చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమామ్ ॥ 4

 

కుండలీకృత కుండలీశ్వర కుండలం వృషవాహనం
నారదాది మునీశ్వర స్తుతవైభవం భువనేశ్వరమ్ ।
అంధకాంతక మాశ్రితామర పాదపం శమనాంతకం
చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమామ్ ॥ 5

 

భేషజం భవరోగిణా మఖిలాపదా మపహారిణం
దక్షయజ్ఞ వినాశనం త్రిగుణాత్మకం త్రివిలోచనమ్ ।
భక్తి ముక్తి ఫలప్రదం సకలాఘ సంఘ నిబర్హణం
చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమామ్ ॥ 6

 

భక్తవత్సల-మర్చితం నిధిమక్షయం హరిదంబరం
సర్వభూత పతిం పరాత్పర-మప్రమేయ మనుత్తమమ్ ।
సోమవారిన భూహుతాశన సోమ పాద్యఖిలాకృతిం
చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమామ్ ॥ 7

 

విశ్వసృష్టి విధాయకం పునరేవపాలన తత్పరం
సంహరం తమపి ప్రపంచ మశేషలోక నివాసినమ్ ।
క్రీడయంత మహర్నిశం గణనాథ యూథ సమన్వితం
చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమామ్ ॥ 8

 

మృత్యుభీత మృకండుసూనుకృతస్తవం శివసన్నిధౌ
యత్ర కుత్ర చ యః పఠేన్న హి తస్య మృత్యుభయం భవేత్ ।
పూర్ణమాయురరోగతామఖిలార్థసంపదమాదరం
చంద్రశేఖర ఏవ తస్య దదాతి ముక్తిమయత్నతః ॥ 9

Sunday, February 16, 2025

హయగ్రీవుడు - Who is Hayigreeva in telugu

                                                                హయగ్రీవుడు


విద్యకు అధిపతి హయగ్రీవుడు

సాధారణంగా కష్టాలతో సతమతమైపోతున్న వారిని పలకరించినప్పుడు, ఇక ఆ భగవంతుడే చల్లగా చూడాలి అని అంటూ వుంటారు. అలా తన భక్తులను చల్లగా చూడటం కోసమే శ్రీ మహావిష్ణువు అనేక అవతారాలను ధరించాడు. అలాంటి అవతా రాల్లో 'హయగ్రీవావతారం' ఒకటి. పూర్వం హయగ్రీవుడు అనే రాక్షసుడు ఉండేవాడు. గుర్రం తలను కలిగిన హయగ్రీవుడు ... బ్రహ్మదేవుడి గురిం చి కఠోర తపస్సు చేశాడు. తన ఆకారాన్ని పోలి నవారి చేతిలో మాత్రమే తన కి మరణం సంభవించేలా వరాన్ని పొందాడు.వర గర్వంతో హయగ్రీవుడు సాధు సత్పురుషులను నానార కాలుగా హింసించ సాగాడు. దాంతో దేవత లంతా ఆది దంపతులను శరణువేడారు. యోగ నిద్రలో వున్న విష్ణువును మేల్కొలిపితే ఆయనే హయగ్రీవుడిని సంహరిస్తాడని పార్వతీ దేవి వారితో చెప్పింది. శ్రీ మహావిష్ణువు తన విల్లు చివరి భాగాన్ని గెడ్డంకింద పెట్టుకుని నిద్రిస్తున్నాడు. ఆయనను మేల్కొల్పడం కోసం శివుడు చెద పురుగుగా మారి వింటి తాడును తెంపాడు.వింటి తాడు తెగిన కారణంగా విల్లు పైకి ఎగదన్నడంతో శ్రీ మహావిష్ణువు తల శరీరం నుంచి వేరై పోయింది. ఇక అపుడు ఏమి చేయాలో తోచక పరాశక్తిని వేడుకొంటే ఆ తల్లి అశ్వముఖాన్ని మహావిష్ణువుకు అతికించమని చెప్పిందట. ఆ అమ్మచెప్పినట్టుగా దేవతలు చేయగా హయగ్రీవవతారుడయనాడు మహావిష్ణువు. ఆ పైన ఆ వేదాలను అపహరించిన హయగ్రీవుడను రాక్షసునితో పోరాడి మహావిష్ణువు విజయం సాధించాడు. రాక్షసులు దొంగిలించిన వేదాలను ఈ హయగ్రీవుడే తిరిగి తెచ్చినట్టు విష్ణు ధర్మోత్తరం చెబుతోంది. అమ్మవారితో సహా దేవాధి దేవతలు తమ జ్ఞానాన్ని, శక్తి సామర్ధా్యలను గుర్రం తల గల శ్రీ మహావిష్ణువుకి ధారపోశారు.

ఈ కారణంగానే హయగ్రీవ స్వామి విద్యలకు అధిపతిగా, జ్ఞానప్రదాతగా పూజలు అందు కుంటున్నాడు. తన అవతార కార్యాన్ని నెరవేర్చిన స్వామి లక్ష్మీ సమేతుడై దేవతలకు దర్శనమిచ్చాడు. స్వామివారు ఈ అవతారాన్ని ధరించిన రోజు శ్రావణ పౌర్ణమి. ఈ రోజున లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామిని పూజించడం వలన విద్య - విజ్ఞానం లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి.

విద్యార్థులకు జ్ఞానప్రదాత

గుర్రం శిరస్సును పొందిన నారాయణుడుకి సమస్త దేవతలు తమ జ్ఞాన శక్తిని ధారపోస్తారు. దాంతో హయగ్రీవుడనే అసురుడిని సంహరించిన స్వామి వేదాలను కాపాడతాడు. అసుర సంహారం అనంతరం స్వామివారిని లక్ష్మీదేవి శాంతింపజేస్తుంది. నారాయణుడు, హయగ్రీవుడిగా అవతరించిన ఈ రోజున ఎవరైతే లక్ష్మీ సమేతుడైన హయగ్రీవుడిని ఆరాధిస్తారో, వాళ్లకి జ్ఞానసిద్ధి కలిగి విద్యయందు రాణిస్తారనీ, విజయంతో పాటుగా సంపదలను పొందుతారని సాక్షాత్తు జగజ్జనని అయిన పార్వతీదేవి పలుకుతుంది. ఆ రోజు నుంచి హయగ్రీవుడు జ్ఞానాన్ని ప్రసాదించే దైవంగా పూజాభిషేకాలను అందుకుంటున్నాడు. అందువలన విద్యార్థులు తప్పనిసరిగా హయగ్రీవస్వామిని ఆరాధిస్తూ వుండాలి. ఆయన అనుగ్రహంతో అభివృద్ధిని సాధిస్తూవుండాలి.

" జ్ఞానానంద మయం దేవం, నిర్మలాస్ఫటికాకృతమ్‌

ఆధారం సర్వ విద్యానాం, హయగ్రీవ ముపాస్మహే "


జ్ఞానం, ఆనందం, మూర్తీభవించిన దైవస్వరూపం హయగ్రీవుడు. నిర్మలమైన స్ఫటికాకృతి కలిగి సర్వవిద్యలకు ఆధారభూతమైన విద్యాధిదేవత హయగ్రీవునకు నమస్కారము.

అశ్వ ముఖంతో, మానవ శరీరంతో వామాంకమున శ్రీ లక్ష్మీదేవితో తెల్లని శరీర ఛాయతో, చతుర్భు జాలతో, శంఖ, చక్ర చిన్ముద్ర పుస్త్తకాలను దాల్చిన శ్రీమన్నారాయణుడి హయగ్రీవావతారాన్ని చూచిన దేవతలందరూ చేతులెత్తి మొక్కారు. ఈ అవతారాన్ని కొలిచినవారికి జ్ఞానం అపారంగా కలుగుతుందని పురాణ వచనం. ఈ తండ్రిని కొలవడం వల్ల విద్యార్థులకు విద్యనే కాదు అన్యాయం జరిగినవారికి న్యాయం జరుగుతుంది. భూవివాదాలు ఏమైనా ఉంటే అవి త్వరలో పరిష్కరించబడుతాయి. శత్రు వినాశనం కూడా జరుగుతుంది. ఇలా ప్రతి సమస్యను పరిష్కరించి హయగ్రీవుడు మానవులందరినీ చల్లగా చూస్తాడు.

హయగ్రీవ ప్రస్థావన

దేవీ పురాణం, స్కాంధ పురాణం, శ్రీమద్భాగవతంతోపాటు ఆగమ శాసా్తల్ల్రో హయగ్రీవుని ప్రస్తావన ఉంది. వేద విద్యాభ్యాసాన్ని కూడా హయగ్రీవ జయంతినాడే ప్రారంభిస్తారు. విద్యార్థులందరూ ఈ రోజున హయగ్రీవుని అర్చించాలి. లౌకిక, పారలౌకిక విద్యలు సిద్ధించేందుకు హయగ్రీవార్చన శీఘ్ఫ్రలకరం. హయగ్రీవ జయంతి రోజున స్వామిని షోడశోపచారాలతో, అష్టోత్తరాలతో పూజించాలి.

హయగ్రీవునికి యాలకులు ప్రీతికరమైనవి. యాలకుల మాలను ధరింపజేసి శనగలు, గుగ్గుళ్ళను తయారుచేసి నివేదించాలి. మరియు తెల్లపూవులతో పూజించాలి. మరీ ఎక్కువ వాసన కలిగించే పుష్పాలతో పూజించకూడదు. ఇలా శ్రావణ పౌర్ణమినాడు హయగ్రీవ పూజ చేయడం సర్వశ్రేష్ఠం. పిల్లలున్న ఇంట హయగ్రీవ పూజ పిల్లలకు విద్యాటంకాలు తొలగించి, ఉన్నత విద్యను అందిస్తుంది. సకలైశ్వర్యాలను కలిగించే హయగ్రీవ పూజ చేయడానికి స్త్రీపురుష తారతమ్యం లేదు.కానీ ఈ రోజు ఉప్పులేని ఆహారాన్ని మాత్రం స్వీకరించాలి.

సరస్వతీదేవి కి గురువు

సరస్వతీదేవి, వేదవ్యాసుడు హయగ్రీవుని నుండి విద్యాశక్తిని సముపార్జించారని హయగ్రీవ స్తోత్రంలో దేశికాచార్యులు పేర్కొన్నారు. హయగ్రీవోపాసన వాక్‌శక్తిని, విద్యాశక్తిని, జ్ఞానశక్తిని సిద్ధింపచేస్తుంది. అందుకే శుద్ధ పూర్ణిమనాడు హయగ్రీవారాధన విశేష ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. హయగ్రీవోపాసన చేసిన వారికి సకలవిద్యలూ కరతలామలకం అవుతాయ. విశ్వశ్రేయోదాకమైన వేదాలను రాక్షసుల చేతిలో పడనీయక హరియే హయగ్రీవునిగా అవతరించిన ఈ రోజు మనం కూడా హయగ్రీవుని పూజించి ధర్మ సంస్థాపనకు మనవంతు చేయూతనిద్దాం.తన అవతార కార్యాన్ని నెరవేర్చిన స్వామి లక్ష్మీ సమేతుడై దేవతలకు దర్శనమిచ్చాడు. స్వామివారు ఈ అవతారాన్ని ధరించిన రోజు శ్రావణ పౌర్ణమి. ఈ రోజున లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామిని పూజించడం వలన విద్య - విజ్ఞానం లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి.

ఓం నమో హయగ్రీవ దేవాయ నమః

అపరాధ క్షమాపణ (aparadha kshamapana-Telugu) :శివ/మహాదేవ


అపరాధ క్షమాపణ (aparadha kshamapana) :శివ/మహాదేవ


అపరాధ క్షమాపణ (aparadha kshamapana-Telugu) :శివ/మహాదేవ


గతం పాపం గతం దుఃఖం- గతం దారిద్ర్యమేవచ | ఆగతా సుఖ సంపత్తిః -పుణ్యాశ్చ తవ దర్శనాత్ ||
 
మంత్ర హీనం క్రియా హీనం భక్తి హీనం సురేశ్వర |
యత్ పూజితం మయాదేవ పరిపూర్ణ తదస్తుమే ||
హర హర మహాదేవ యదక్షర పద భ్రష్టం | 
 మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వ క్షమ్యతాం దేవ ప్రసీద శివశంకర ||
 
మృత్యుంజయ మహా రుద్ర త్రాహిమాం శరణాగతం |
జన్మ మృత్యు జరా వ్యాధి పీఢితం కర్మ బంధనైః ||
 
మంత్రేణక్షర హీనేయ పుష్ఠేణ విఫలేనచ - పూజతోసి మహాదేవ తత్సర్వం క్షమ్యతం మమ||
 
కర చరణ కృతం  వా  క్కాయజం  కర్మజం వా- 
శ్రవణ నయనజం వా మానసం వాపరాధమ్ । 
విహితమవిహితం వా సర్వమేతత్-క్షమస్వ -
 జయ జయ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో||
 
ఆవాహనం న జానామి న జానామి తవార్చనం ।  పూజాం చైవ న జానామి క్షమస్వ పరమేశ్వరః ||
అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ | తస్మాత్ కారుణ్య భావేన రక్షరక్షో మహేశ్వరా/పార్వతీనాథః  ||

 

 

Saturday, February 15, 2025

శ్రీ మహాదేవ స్తుతిః (బ్రహ్మాదిదేవ కృతమ్) -(Sree mahaadeva Stuti/Strotram)

 

 శ్రీ మహాదేవ స్తుతిః



దేవా ఊచుః –
నమో భవాయ శర్వాయ రుద్రాయ వరదాయ చ | పశూనాం పతయే నిత్యముగ్రాయ చ కపర్దినే || 1 ||

మహాదేవాయ భీమాయ త్ర్యంబకాయ విశాంపతే | ఈశ్వరాయ భగఘ్నాయ నమస్త్వంధకఘాతినే || 2 ||

నీలగ్రీవాయ భీమాయ వేధసాం పతయే నమః | కుమారశత్రువిఘ్నాయ కుమారజననాయ చ || ||

విలోహితాయ ధూమ్రాయ ధరాయ క్రథనాయ చ | నిత్యం నీలశిఖండాయ శూలినే దివ్యశాలినే || 4 ||

ఉరగాయ సునేత్రాయ హిరణ్యవసురేతసే | అచింత్యాయాంబికాభర్త్రే సర్వదేవస్తుతాయ చ || 5 ||

వృషధ్వజాయ చండాయ జటినే బ్రహ్మచారిణే | తప్యమానాయ సలిలే బ్రహ్మణ్యాయాజితాయ చ || 6 ||

విశ్వాత్మనే విశ్వసృజే విశ్వమావృత్య తిష్ఠతే | నమోఽస్తు దివ్యసేవ్యాయ ప్రభవే సర్వసంపదామ్ || 7 ||

అభిగమ్యాయ కామ్యాయ సవ్యాపారాయ సర్వదా | భక్తానుకంపినే తుభ్యం దిశ మే జన్మనో గతిమ్ || 8 ||

ఇతి శ్రీమత్స్యపురాణే బ్రహ్మాదిదేవకృత మహాదేవస్తుతిః |