శివా,
నేను పుట్టాను…
పెరిగాను… చదువుకున్నాను… ప్రపంచాన్ని చూశాను… పనిచేశాను… బాధ్యతలు
నిర్వర్తించాను… అందరిని చూసుకున్నాను… ప్రేమ పంచాను… క్షమించాను… భరించాను…
స్నేహాలు చేసాను… ప్రేమించాను… కోపపడాను… అసూయ పడ్డాను… ఏడ్చాను… ఆర్తితో
తల్లడిల్లాను.
పూజలు చేశాను… చెట్టుకూ
మొక్కాను… పుట్టకీ మొక్కాను… రాయికీ మొక్కాను… మనిషికీ మొక్కాను. తెలుసుకోవాలి
అనిపించింది… ఇంకా ఎంతో తెలుసుకోవాలి అనిపించింది. అడవుల్లో నడిచాను… కొండలు
ఎక్కాను… తీర్థక్షేత్రాలు దర్శించాను… నదులు, సముద్రాలు దాటాను… ఎడారులు కూడా చూశాను. ఎంతోమంది గురువులను,
సిద్ధులను కలిశాను — కానీ
వాళ్లందరూ వాళ్ల ప్రయాణాల్లో నిమగ్నమై ఉన్నారు.
నా జీవిత ప్రయాణం అసంపూర్ణంగా అనిపించింది… నా గమనానికి గమ్యం లేదు అని అనిపించింది, … అలసిపోయాను. “ఎందుకు తెలుసుకోవాలి? దేనికోసం తపించాలి? ఎంతకాలం?” అనే ప్రశ్నలు మనసులో గిరికీలు కొట్టాయి. ఏదో తెలియని అసంపూర్ణత, ఏదో తెలియని ఆత్మనూన్యత భావం, అభద్రత భావం, నా చుట్టూ కారుమబ్బులలాగ కమ్ముకున్నయి , తెలియని అసంపూర్ణత… తక్కువతన భావం… అభద్రత… నన్ను కమ్మేశాయి.
తప్పిపొయిన చిన్న పిల్లాడు తల్లి కోసం ఎదురు చూసినట్టు… నేను నా శివుడి కోసం… నా తల్లివంటి దైవం కోసం ఎదురు చూస్తున్నాను. నువ్వు ఎప్పుడూ నాతోనే ఉన్నావని నాకు తెలుసు… కానీ నేను చూడలేకపోతున్నాను. నిన్ను అనుభవించే శక్తిని నాకు ఇవ్వు. నా తల్లి… నా తండ్రి… నా శివా… తెలిసీ తెలియక చేసిన తప్పులకోసం… ఎవరికైనా నొప్పిచ్చి ఉంటే… అందుకు నిజమైన పశ్చాత్తాపంతో క్షమాపణ కోరుతున్నాను. నా చేయి వదలొద్దు శివా… నేను తప్పిపోతాను.
భక్తి, వినయం, సంపూర్ణ సమర్పణతో,
Suresh Kalimahanthi
No comments:
Post a Comment