Translate

Tuesday, December 6, 2016

హొమం /Homam



ఓం అపవిత్రః ఫవిత్రొ వా సర్వ-అవస్థాం గతొ-[అ]పి వా |

యః స్మరేత్-పుణ్డరీకాక్షం స బాహ్య-అభ్యంతరః సుచిహి |   


గురుస్తోత్రం/గురు ప్రార్ధన

అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరమ్ |
తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః 

అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా 
చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః

గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః |
గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః |


త్వమేవ మాతా పితా త్వమేవ
త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ |
త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ

త్వమేవ సర్వం మమ దేవదేవ 



వినాయకుని శ్లోకం:
శుక్లాం బరదరం విష్ణుం శశి వర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం 
అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే.

వక్ర తుండ మహా కాయ సూర్య కోటి సమ ప్ర
నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా

ఓమ్ శ్రీ మహా గణాధి పతయే నమః 
{అని నమఃస్కారం చేసుకోవాలి}


శాంతి మంత్రం

ఆచమనం:

{చెయ్యి అలివేణి (ప్లేటు)లో కడుగుకోవాలి}
ఓం కేశవాయస్వాహ --- {అని తీర్ధం తీసుకోవాలి}
ఓం నారాయనాయస్వాహ --- {అని తీర్ధం తీసుకోవాలి}

ఓం మాధవాయస్వాహ --- {అని తీర్ధం తీసుకోవాలి}
{మళ్లీ చెయ్యి కడుగుకోవాలి}
ఓం గోవిందయనమః --- {అనుచూ నీళ్ళను క్రిందకు వదలవలెను.}



సంకల్పం

మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం (కులదైవాన్ని సంభోదించుకోవాలి "పరశ్వరుని" బదులుగా) శుభేశోభనే ముహూర్తే - శ్రీ మహావిష్ణో రాజ్ఞయా

ప్రవర్తమానస్య - ఆద్యబ్రహ్మణః
ద్వితియ పరార్ధే - శ్వేత వరాహకల్పే
వైవస్వత మన్వంతరే - కలియుగే
ప్రథమపాదే - జంబూద్వీపే
భరతవర్షే -భరతఖండే
(India లో వుంటే "భరతఖండే" అని చదవాలి, U.S లో వుంటే "యూరప్ఖండే" చదవాలి)
మేరోః దక్షిణ దిగ్భాగే
(ఏ నది కి దగ్గర వుంటే ఆ నది సమీపే అని చదవాలి)
(శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే కృష్ణా / గంగా / గోదావర్యోః మధ్యదేశే" )
కావేరి నదీ సమీపే
నివాసిత గృహే 
(Own house అయితే "సొంత గృహే"అని చదవాలి)
అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన (for details check this site:
శ్రీ ఖర నామ సంవత్సరే
ఉత్తరాయనే 
(దక్షిణాయనే from 17th july / ఉత్తరాయనే from 15th jan --- -[6 months కి ఒక సారి మారుతుంది. See panchamgam])
గ్రీష్మ ఋతువే 
('గ్రీష్మ ఋతువే' - 'Summer Season' / 'వర్ష ఋతువే' - 'Rainy Season' / 'వసంత ఋతువే' - 'Winter Season') 
జ్యేష్ఠ మాసే 
(తెలుగు నెల)(శ్రావణ, చైత్ర, జ్యేష్ఠ, )
శుక్ల పక్షే 
(శుక్ల పక్షం [as the size of the moon increases] / బహుళ పక్షం [as the size of the moon decreases], కృష్ణ పక్షం)
________ తిధౌ 
(morning ఏ తిథి start అయితే ఆ తిథే చదువుకోవాలి)
(Ex: పాడ్యమి, విదియ, తదియ, చవితి, పంచమి, షస్టి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ or అమావాస్య.)
________ వాసరే 
(ఏ వారం అయితే ఆ వారం చదువుకోవాలి Ex: ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని.)
శుభ నక్షత్రే, శుభ యోగే, శుభ కరుణే,
ఏవం గుణవిశేషణ విశిష్టాయాం,

శుభ తిథౌ శ్రీమాన్ ______ గోత్రా  (Ex: భారద్వాజస )
అహం __________ నామ ధేయా 
(భర్త పేరు చదువు కోవాలి) (Ex: సత్య ప్రకాష్) 
ధర్మ పత్ని ______________ నామ ధేయా,
(Ex: లక్ష్మీ శైలజ)

సకుటుంభాయాః సకుటుంబస్య - ఉపాత్త దురితక్షయ ద్వారా, 
శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం, క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృద్ధ్యర్ధం,

ధర్మార్ధ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్ధ సిద్ధ్యర్ధం,
సర్వాపదాం నివారణార్ధం, సకలకార్య విఘ్న నివారణార్ధం,
సత్సంతాన సిద్ధ్యర్ధం, శ్రీ పార్వతీ సహిత పరమేశ్వర దేవతా ముద్దిశ్య,
కల్పోక్త విధానేన యధాశక్తి షోడశోపచార పూజాం కరిష్యే,
{అని చదివి అక్షంతలు నీరు కలిపి పళ్ళెములో విడువవలెను.}

                                                కలశారాధన

అదౌ నిర్విఘ్న పరి సమాప్త్యర్ధం శ్రీ మహాగణపతి పూజార్ధం తదంగ కలశారాధనం కరిష్యే.
{కలశమునకు గంధం, కుంకుమ బొట్లు పెట్టి, కలశంలో ఒక పువ్వు, కొద్దిగా అక్షంతలు వేసి, కుడి చేటితో కలశంను మూసి పెట్టి, ఈ క్రింది మంత్రాలను చెప్పవలెను.}

                            కలశస్యముఖే విష్ణుః కంఠేరుద్ర స్సమాశ్రితః మూలే తత్ర స్థితోబ్రహ్మా

మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌ తు సాగరా స్సర్వే సప్తద్వీపా 
వసుంధరా ఋద్వేదో థ యజుర్వేద స్సామవేదోహ్యథర్వణః అంగైశ్చ 
సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః గంగేచ యమునే చైవ 
గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు.
{శిరస్సు పైన పూజా ద్రవ్యముల పైన నీరు చల్లవలెను}
ఆత్మానం సంప్రోక్ష్య, పూజ ద్రవ్యాణి సంప్రోక్ష్య.


హొమం 

  1. భుప్రార్ధన
  2. నవగ్రహ ప్రార్ధన
  3. అగ్ని ప్రార్ధన
  4. దిక్పాలక పూజ
  5. గణపతి ప్రార్ధన
  6. శుద్ధి మంత్రం 
  7. ప్రాణ ప్రతిష్ట
  8. స్వాహ మంత్రం
  9. మంత్ర పుష్పం
  10. వసొర్ధారా (శం చమే)
  11. పూర్ణహుతి 
  12. మగళ హరతి 
  13. శాంతి మంత్రం 






No comments:

Post a Comment