త్రాటకము :
కనురెప్పలు వాల్చకుండా...ఒక జ్యోతి స్వరూపము మీద, తదేక దృష్టి నుంచుటను "త్రాటకము" అంటారు. (త్ర = రక్షణ). త్రాటకము ద్వారా కనులకు దివ్యమైన శక్తి లభించును. తద్వారా సాధకుడు దివ్య అవస్థలను అనుభూతి చెందును. సాధకుడు, వ్యక్తుల యొక్క ప్రకాశ వలయమును చూడగలుగును. Hypnotism...త్రాటకము యొక్క నిమ్న స్థాయి అనుభవము. త్రాటకము ద్వారా సాధకుడు ...అతీతమైన అతీంద్రియ అవస్థలకు పోగలుగును. శూన్య బ్రహ్మ అవస్థకు చేరగలుగును. త్రాటకము చేయునపుడు ...సాధకుని నేత్రములు అర్థ నిమీలితములగును. మరికొంత సాధన తరువాత దివ్య, దివ్య తర అవస్థలను దర్శించును. సిద్ధ,చారణ, గంధర్వ, దేవతా మరియూ విరాట్ స్వరూపములను, సాధకుడు త్రాటకము ద్వారా దర్శించగలుగును. ఈ అంతర్దర్శనములన్నియూ నిత్యజీవితములో భాగమగును. పదార్థ నిర్మాణమునకు మూలమైన అణు, పరమాణు అవస్థలను, విశ్వము యొక్క విరాట్ స్వరూపమును చూచును.
సంత్ జ్ఞానేశ్వర్...త్రాటకమును వర్ణించుచూ "ఇప్పుడు నా కనులు అంతర్ముఖమై చూడలేని దానిని చూచుచున్నవి"అంటారు.
No comments:
Post a Comment