సమాధి - వివిధ రకాల సమాధి స్థితులు - విశ్లేషణ:
మూలం : మహర్షి పతంజలి
యోగ శాస్త్రంలో 8 రకములైన సమాధి స్థితుల వర్ణన కలదు. ఇవి 8 రకాలైన జ్ఞానోదయ పద్ధతులు కూడా. అయితే ఈ "సమాధి" స్థితిని వర్ణించడం దుర్లభం కూడా. అయితే, ఈ సమాధి అనుభవం కూడా అంతే దుర్లభం.
సమాధి స్థితిలో, ఏ లక్ష్యమూ లేకుండా చిత్తాన్ని ఉంచినపుడు జ్ఞాన స్వరూపమూ, శాశ్వతమూ, సర్వవ్యాప్తమై వెలిగే
స్వస్థితిని సాధకుడు పొందుతాడు. అంటే అర్ధం మాత్రమే భాసిస్తుంది. ఇదే యోగుల గమ్యమైన "సమాధిస్థితి"
సమాధులు 1. సంప్రజ్ఞాత సమాధి, 2.అసంప్రజ్ఞాత సమాధి
3.సవితర్క సమాధి
4.నిర్వితర్క సమాధి
5.సబీజ సమాధి
6.నిర్బీజ సమాధి
7.ధర్మ మేఘ సమాధి అని 8. ప్రకృతి లయ సమాధి...అని రకములు.
ఇంకనూ అనేక సమాధి స్థితులు ఉన్ననూ, ప్రస్తుతానికి ఇవి చాలును.
సంప్రజ్ఞాత సమాధి:
దీన్లో చిత్తవృత్తులు శాంతించే ఉంటాయి. కాని బీజరూపంలో సంస్కారాలు మిగిలి, సమయం వచ్చినపుడు తిరిగి మొలకెత్తడానికి అనువుగా ఉంటాయి. కాబట్టే దీన్ని "సబీజ సమాధి" అనికూడా అంటారు. ధ్యాన, ధారణా, సబీజ సమాధులను పొందిన యోగికి సర్వశక్తులు, సర్వజ్ఞత్వము కలుగుతాయి గాని ముక్తుడు కాలేడు. ఇంకా పునర్జన్మను కలిగించే కర్మబీజాలు ఉంటాయి. అణిమాది సిద్ధులు కలుగుతాయి.
అసంప్రజ్ఞాత సమాధి :
దీన్లో నేను అనే అహంకారం ఉండదు. బీజరూపంలో ఉండే చిత్త వృత్తులు నశిస్తాయి. కర్మబీజం దగ్ధమై ఉండటంవల్ల "నిర్బీజ సమాధి"అని అంటారు. దీన్లో వాసనలు నశించి, మనో నాశనము కూడ కలగటం వల్ల, యోగి పరమాత్మను తెలిసుకొని ముక్తిని పొందుతాడు.
వితర్కం, విచారణం (యుక్తాయుక్త విచక్షణ) – ఆనందం, ఆస్మితం అనే స్థితులతో కూడుకున్న సమాధిస్థితిని సంప్రజ్ఞాత సమాధి అంటారు. సంప్రజ్ఞాత సమాధి మళ్ళీ నాలుగు రకాలు.
మొదటిది – సవితర్క సమాధి. ఇందులో మనసు ఒకానొక విషయాన్ని, తదితర విషయాల నుండి వేరు చేసి, దాన్నే పదే పదేధ్యానిస్తూ ఉంటుంది.
రెండవది – నిర్వితర్క సమాధి. దేశ కాలాల నుండి పృధివ్యాది భూతాలని వేరు చేసి, వాటిని వాస్తవ రూపంలో చింతన చేస్తే దానిని నిర్వితర్కమంటారు.
మూడవది... నిర్విచార సమాధి – పైన చెప్పిన ధ్యానంలో దేశ కాలాలని తొలగించి, సూక్ష్మ భూతాలను వాటి వాస్తవ రూపంలో చింతన చేస్తే ఆ ధ్యానాన్ని నిర్విచార సమాధి అంటారు.
నాల్గవది ..... ఆనంద సమాధి. స్థూల, సూక్ష్మభూతాలను కూడా వదిలివేసి, అంతరింద్రియ మనసు ధ్యేయమై, అంతఃకరణం రజస్తమోగుణరహితమై ఉందని భావిస్తే దానిని ఆనంద సమాధి అంటారు. చిత్తవృత్తులనన్నింటినీ నిరాకరించే, నిరంతర అభ్యాసం ద్వారా లభించే, అవ్యక్త సంస్కారాలు మాత్రమే చిత్తంలో శేషించి ఉండే మరొక సమాధి స్థితి ఉంది. ఇదే అతీంద్రియ జ్ఞానావస్థ అయిన అసంప్రజ్ఞాత సమాధి. దీని వల్ల మోక్షం లభిస్తుంది. కానీ ప్రకృతి తత్వాలను దాటాలి కదా! ఇదే కదా, సాంఖ్యం చెబుతుంది.
అభ్యాస వైరాగ్యాలను అవలంబించకుండా, మనసును సంకల్ప శూన్యం చేసేవాడు మూర్ఖుడు. మనసును వృత్తి శూన్యం చేయాలంటే ఉత్కృష్ట బలం, అత్యున్నత నిగ్రహం కావాలి.(తీవ్ర వైరాగ్యం లేకుంటే ఈ సమాధి) విదేహు (దేవత)లకూ, ప్రకృతి లయులకూ పునర్జన్మ హేతువవుతుంది.
క్షీణవృత్తులు కల యోగి చిత్తం ఆత్మ లేక పురుషునిలో వర్ణయుక్త వస్తువులు ఎదుట ఉన్న స్ఫటికం వలే తాదాత్మ్యం పొందుతుంది. ధ్యానస్థిత యోగి పువ్వు ముందున్న స్ఫటికం వంటివాడు. పువ్వు ఎర్రగా ఉంటే, దాని దగ్గర ఉండే స్ఫటికం కూడా ఎర్రగా కనిపిస్తుంది. "సమాపత్తి" అనగా సాక్షాత్కారము. సాక్షాత్కారము పొందడమే సంప్రజ్ఞాత సమాధి ఫలం.
శబ్దం, అర్థం, జ్ఞానం అనే మూడు కలిసి ఉన్నప్పుడు "సవితర్క సమాధి" అంటారు.
స్మృతి పరిశుద్ధమై గుణరహితమై ధ్యేయపు అర్థాన్ని మాత్రమే భాసింపచేస్తున్నప్పుడు "నిర్వితర్క సమాధి" కలుగుతుంది. నిర్వితర్క ధ్యానాన్ని చిరకాలం అభ్యాసం చేస్తే శబ్దార్ధజ్ఞానాలని వేర్వేరుగా గ్రహించగలం. దీన్నే "నిర్వికల్పసమాధి" అంటారు.
సవితర్క, నిర్వితర్క, సవిచార, నిర్విచార సమాధులు బీజసమాధులై ఉంటాయి. ఇవి పూర్వకర్మ బీజాలను నిర్మూలించలేవు. కాబట్టి వీటి వల్ల మోక్షం సిద్ధించదు.
నిర్విచార సమాధిలో పొందే ప్రజ్ఞ సత్య పరిపూర్ణమైనది. ఈ స్థితిని అందుకొన్న యోగి పొందే ప్రజ్ఞే "ఋతంభర ప్రజ్ఞ".
ప్రత్యక్షానుభవాలతో లభించే జ్ఞానం సామాన్య విషయాలను తెలుపుతుంది.
ఈ సమాధి వల్ల కలిగే ప్రజ్ఞ, ప్రత్యక్షానుమానాలతో గ్రహించలేని విషయాలను ప్రకాశింపచేస్తుంది. వేదాలనన్నింటినీ పఠించినా, మనకెట్టి సాక్షాత్కారం కలగదు. అయితే వేదవిదులని అనుసరించి సాధన చెయ్యడం వల్ల "అవాఙ్మానసగోచర అఖండసచ్చిదానంద స్థితి" పొందగలం అని ఈ సూత్రకారుడి (పతంజలి) అభిప్రాయం. అయితే పతంజలి... ఋషి కాబట్టి...ఆ మహితాత్ముడు చెప్పినది "ఆప్తవాక్యమే"... హేతువాదం మరియు తర్కజ్ఞానంతో అతీంద్రియ జ్ఞానం కలగదని మనకి తెలుసు. ఆత్మ, పరమాత్మ...... వంటి తత్త్వాలు బాహ్యేంద్రియగోచరాలు కాజాలవు. ఇంద్రియజన్య జ్ఞానాన్ని దాటితే తప్ప సాక్షాత్కారం అనేది ఎప్పటికీ కలగదు. తార్కిక జ్ఞానాతీతుడు కాదగ్గ శక్తి మనిషికి ఉంది. యోగాభ్యాసంతో ఈ శక్తి వికసించగానే మనిషి తార్కిక జ్ఞానాతీతుడై అతీంద్రియ విషయాలను ప్రత్యక్షంగా అవలోకిస్తాడు. అయితే...సమాధి వల్ల కలిగే సంస్కారం, ఇతర సంస్కారాలన్నింటినీ నిరోధిస్తుంది.
చిత్తాన్ని ఏకాగ్రం చేయటానికి ప్రారంభించగానే చిత్త వృత్తులు విజృంభిస్తాయి. కానీ పైన చెప్పిన సాధన వలన ఏకాగ్రత పెరిగి, తద్ద్వారా కలిగే సంస్కారాలు ఇతర సంస్కారాలని నిరోధించగలిగేంత ప్రబలంగా ఉంటాయి.
ఇతర సంస్కారాలను నిరోధించే ఈ సంస్కారాన్ని కూడా నిరోధించడం వల్ల సర్వం నిరోధితమై నిర్భీజసమాధి ఏర్పడుతుంది.
పామరుడు తన శరీరమే ఆత్మ లేక పురుషుడు అనుకుంటాడు, పండితుడు అయినా తన మనసే ఆత్మ అనుకుంటాడు. ఇద్దరూ భ్రమలోనే ఉన్నారు. వివిధ చిత్త వృత్తులు పురుషుని ఆవరించి ఉండడం వల్ల, ఈ ఆవరణం ద్వారా పురుషుని ప్రతిబింబమే మనకు ఛాయామాత్రంగా గోచరిస్తుంది. కాబట్టి కోపం అనే చిత్తవృత్తి కలిగిన వెంటనే “నాకు కోపం వచ్చింది” అంటూ, పురుషునికి కోపం వచ్చినట్టు అనుకుంటాం. ప్రేమ అనే చిత్త వృత్తి కలిగితే, ఆ ప్రతిబింబాన్ని పురుషునిలో చూసి “మాకు ప్రేమ ఉంది” అని చెబుతాం. చిత్తం అనే సరస్సును, వృత్తులు అనే తరంగాలు ఆవరించిఉన్నంతకాలం పురుషుడిని దర్శించాలేం. కాబట్టి మొదటగా చిత్త వృత్తుల స్వభావ స్థితుల గురించి, తర్వాత చిత్త వృత్తులని నిరోధించే ఉపాయాలని గురించి, అగ్నిని అగ్నియే దహిస్తుంది – అన్న రీతిలో ఒక్క వృత్తియే, ఇతర వృత్తులనన్నింటినీ నిరోధించేదాకా ఆ వృత్తిని ప్రబలం చేసే విధానాన్ని పతంజలి బోధించాడు. ఒకటే చిత్త వృత్తి మిగిలి ఉన్నప్పుడు దానిని నిరోధించడం సులభం. అప్పుడు కలిగే సమాధినే "నిర్భీజసమాధి" అంటారు.
ఇలా వృత్తి నిరోధం సిద్ధించగానే, అద్వితీయ – కేవల – జననమరణరహిత – నిత్య – నిర్వికార – స్వయంజ్యోతి అయిన పురుషుడు సహజ వైభవంతో ప్రకాశిస్తాడు.-------మహర్షి పతంజలి
అభ్యాస వైరాగ్యాలను అవలంబించకుండా, మనసును సంకల్ప శూన్యం చేసేవాడు మూర్ఖుడు. మనసును వృత్తి శూన్యం చేయాలంటే ఉత్కృష్ట బలం, అత్యున్నత నిగ్రహం కావాలి.(తీవ్ర వైరాగ్యం లేకుంటే ఈ సమాధి) విదేహు (దేవత)లకూ, ప్రకృతి లయులకూ పునర్జన్మ హేతువవుతుంది.
క్షీణవృత్తులు కల యోగి చిత్తం ఆత్మ లేక పురుషునిలో వర్ణయుక్త వస్తువులు ఎదుట ఉన్న స్ఫటికం వలే తాదాత్మ్యం పొందుతుంది. ద్యానస్థిత యోగి పువ్వు ముందున్న స్ఫటికం వంటివాడు. పువ్వు ఎర్రగా ఉంటే, దాని దగ్గర ఉండే స్ఫటికం కూడా ఎర్రగా కనిపిస్తుంది. సమాపత్తి అనగా సాక్షాత్కారము. సాక్షాత్కారము పొందడమే సంప్రజ్ఞాత సమాధి ఫలం.
శబ్దం, అర్థం, జ్ఞానం అనే మూడు కలిసి ఉన్నప్పుడు "సవితర్క సమాధి" అంటారు.
స్మృతి పరిశుద్ధమై గుణరహితమై ధ్యేయపు అర్థాన్ని మాత్రమే భాసింపచేస్తున్నప్పుడు నిర్వితర్క సమాధి కలుగుతుంది. నిర్వితర్క ధ్యానాన్ని చిరకాలం అభ్యాసం చేస్తే శబ్దార్ధజ్ఞానాలని వేర్వేరుగా గ్రహించగలం. దీన్నే "నిర్వికల్ప సమాధి' అంటారు. సవితర్క, నిర్వితర్క, సవిచార, నిర్విచార సమాధులు బీజసమాధులై ఉంటాయి. ఇవి పూర్వకర్మ బీజాలను నిర్మూలించలేవు. కాబట్టి వీటి వల్ల మోక్షం సిద్ధించదు.
నిర్విచార సమాధిలో పొందే ప్రజ్ఞ సత్య పరిపూర్ణమైనది. ఈ స్థితిని అందుకొన్న యోగి పొందే ప్రజ్ఞే "ఋతంభర ప్రజ్ఞ".
ప్రత్యక్షానుభవాలతో లభించే జ్ఞానం సామాన్య విషయాలను తెలుపుతుంది.
ఈ సమాధి వల్ల కలిగే ప్రజ్ఞ, ప్రత్యక్షానుమానాలతో గ్రహించలేని విషయాలను ప్రకాశింపచేస్తుంది. అయితే వేదవిదులని అనుసరించి సాధన చెయ్యడం వల్ల అవాఙ్మానసగోచర అఖండసచ్చిదానంద స్థితి పొందగలం అని సూత్రకారుడి అభిప్రాయం. అయితే పతంజలి... ఋషి కాబట్టి...ఆ మహితాత్ముడు చెప్పినది "ఆప్తవాక్యమే"... హేతువాదం మరియు తర్కజ్ఞానంతో అతీంద్రియ జ్ఞానం కలగదని మనకి తెలుసు. ఆత్మ, పరమాత్మల వంటి తత్త్వాలు బాహ్యేంద్రియ గోచరాలు కాజాలవు. ఇంద్రియజన్య జ్ఞానాన్ని దాటితే తప్ప సాక్షాత్కారం అనేది ఎప్పటికీ కలగదు. తార్కిక జ్ఞానాతీతుడు కాదగ్గ శక్తి మనిషికి ఉంది. యోగాభ్యాసంతో ఈ శక్తి వికసించగానే మనిషి తార్కిక జ్ఞానాతీతుడై అతీంద్రియ విషయాలను ప్రత్యక్షంగా అవలోకిస్తాడు. అయితే...సమాధి వల్ల కలిగే సంస్కారం, ఇతర సంస్కారాలన్నింటినీ నిరోధిస్తుంది.
చిత్తాన్ని ఏకాగ్రం చేయటానికి ప్రారంభించగానే చిత్త వృత్తులు విజృంభిస్తాయి. కానీ పైన చెప్పిన సాధన వలన ఏకాగ్రత పెరిగి, తద్ద్వారా కలిగే సంస్కారాలు ఇతర సంస్కారాలని నిరోధించగలిగేంత ప్రబలంగా ఉంటాయి.
ఇతర సంస్కారాలను నిరోధించే ఈ సంస్కారాన్ని కూడా నిరోధించడం వల్ల సర్వం నిరోధితమై నిర్భీజసమాధి ఏర్పడుతుంది.
సమాధిని పొందిన వ్యక్తికి , ఇంకా సూక్ష్మ శరీర భావన ఉంటుంది. ముక్తిని పొందకుండా లయమయ్యే విదేహులను , ప్రకృతి లయులు అంటారు. ప్రకృతి లయుల యొక్క అత్యున్నత ధ్యాన దశను "ప్రకృతి లయ సమాధి" అంటారు.
పామరుడు తన శరీరమే ఆత్మ లేక పురుషుడు అనుకుంటాడు, పండితుడు అయినా తన మనసే ఆత్మ అనుకుంటాడు. ఇద్దరూ భ్రమలోనే ఉన్నారు. వివిధ చిత్త వృత్తులు పురుషుని ఆవరించి ఉండడం వల్ల, ఈ ఆవరణం ద్వారా పురుషుని ప్రతిబింబమే మనకు ఛాయామాత్రంగా గోచరిస్తుంది. కాబట్టి కోపం అనే చిత్తవృత్తి కలిగిన వెంటనే “నాకు కోపం వచ్చింది” అంటూ, పురుషునికి కోపం వచ్చినట్టు అనుకుంటాం. ప్రేమ అనే చిత్త వృత్తి కలిగితే, ఆ ప్రతిబింబాన్ని పురుషునిలో చూసి “మాకు ప్రేమ ఉంది” అని చెబుతాం. చిత్తం అనే సరస్సును వృత్తులు అనే తరంగాలు ఆవరించి ఉన్నంతకాలం పురుషుడిని దర్శించలేం. కాబట్టి మొదటగా చిత్త వృత్తుల స్వభావ స్థితుల గురించి, తర్వాత చిత్త వృత్తులని నిరోధించే ఉపాయాలని గురించి, అగ్నిని అగ్నియే దహిస్తుంది – అన్న రీతిలో ఒక్క వృత్తియే, ఇతర వృత్తులనన్నింటినీ నిరోధించేదాకా ఆ వృత్తిని ప్రబలం చేసే విధానాన్ని పతంజలి బోధించాడు. : ఇక్కడ ధర్మ మేఘ సమాధి గూర్చి, సూత్రకారుడేం చెబుతున్నాడో చూద్దాం! సర్వ తత్వాలను, చక్కగా వివేచించే జ్ఞానాన్ని పొంది, ఫలాపేక్ష లేక ఉండేవానికి, అలాంటి పరిపూర్ణ వివేకికి "ధర్మ మేఘం" అనే సమాధి సిద్ధిస్తుంది. ఇలాంటి వివేకాన్ని పొందిన యోగికి, అణిమాది అష్ట సిద్ధులన్నీ కలుగుతాయి. కానీ నిజమైన యోగి వాటిని పరిత్యాగం చేస్తాడు. అలాంటి యోగికి, "ధర్మ మేఘం" అనే విచిత్ర, వికాస అపూర్వ జ్ఞానం కలుగుతుంది. అటువంటి యోగి సమస్త జ్ఞానం తననుండే కలుగుతుందని గ్రహిస్తాడు.
ఇక్కడ, యోగికి వివేక ఖ్యాతి లభించినచో, దాని సహాయముతో, సర్వ భావాధిష్ఠాతృత్వాది సిద్ధులను, ఆశించినచో , ఆ యోగి "కుసీదుడు" అనబడును. (కుసీదుడు - సద్గురు మళయాళ స్వామి వచనం)
శివోహం శివోహం శివోహం🌹🙏🌹🙏🌹🙏