Translate

Saturday, August 28, 2021

శక్తిపాతం-Shakthipath

శక్తిపాతం అంటే ఏమిటి ? / What  is Shakthipath ?








విశ్వ శక్తి మానవుని శరీరం నుండి బాహ్యంగా ప్రవహిస్తూ సృజనాత్మక దిశలో ఉన్నప్పుడు, మానవ జీవితం సృష్టించ బడుతుంది మరియు నిరంతరం ధారణ చేయబడుతూ ఉంటుంది. 

ఇది వెన్నెముక - మస్తిష్క వ్యవస్థ ద్వారా మానవుని మనో నేత్రం మీద ప్రసరింప చేయబడుతుంది మరియు ఇంద్రియాల మాధ్యమంగా అనంతం లోకి కూడా ప్రసరింప చేయబడుతుంది. 

దీని ఫలితంగా మానవుడు "జీవితం" అని పిలువబడే అనుభవానికి లోనవుతాడు. ఈ విధంగా మానవుని యొక్క భ్రమ పూరితమైన ఉనికి మొదలవుతుంది. 

అయితే  ఇది స్వప్న అవస్థలో మారుతుంది, నిద్రలో విలీనం చేయబడి, జాగృత స్థితిలో మళ్ళీ సృష్టించ బడుతుంది. కానీ వ్యక్తి యొక్క జ్ఞాన స్థితి  అలాగే ఉంటుంది. 

ఈ విశ్వ శక్తిని శక్తిపాత్  అనే ప్రక్రియ ద్వారా తిరోగమనం చేయగలిగితే, అప్పుడు కర్మలు శుభ్రం కావడంతో మానవుని యొక్క భ్రమ పూరితమైన జగత్తు కూడా విలీనం కావడం మొదలవుతుంది. 

విశ్వ శక్తిని సృజనాత్మక దిశ నుండి తిరోగమనం చేయబడే ఈ ఖచ్చితమైన దశని కుండలిని శక్తి జాగృతం అంటారు.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 What  is Shakthipath ? 🌹

When the primordial cosmic energy is in outbound creative mode....human life is created and sustained continuously.....

It is projected onto the human psyche by means of the cerebro spinal system.....as a result the human being is made to undergo the experience which is referred to as LIFE....

Since psyche is projected into infinity through the human senses.....thus the illusionary existence of the human being begins.....it gets altered during dream state, destroyed during sleep state and created again during the waking state.....

But the knowledge level of the person remains the same....if this cosmic energy can be reversed by a process called Shakthipat....

Then the illusionary existence of human life starts to get nuetralised as the karmas get cleaned up.....this precise stage when the primordial cosmic energy or Kundalini energy as it is popularly called gets awakened is called....AWAKENING in loose words.....
🌹 🌹 🌹 🌹 🌹




Saturday, August 14, 2021

మానవశరీరం -చక్రాలు/కుండలిని (Telugu-Human Body and Chakras/Kundalini)

 మానవశరీరం -చక్రాలు/కుండలిని 



మానవ శరీరంలో ఆరు చక్రాలు మరియు సహస్రారం (కుండలిని) తో కలుపుకొని ఏడు.

ఇలా ఆరు చక్రాలు ఒకదానిపై మరొకటి ఆధారపడి గుండ్రంగా చలిస్తూ ఉంటాయి.ఈ ఆరు చక్రాలలో ఒక్క చక్రం చలించటం నిలిచిపోయిన మానవ శరీరం నుండి జీవుడు వెళ్లిపోతాడని శాస్త్ర వివరణ.ఆ చక్రాలు ఈ క్రింది విధంగా మానవ శరీరమందు లీనమై ఉంటాయి.

1.మూలాధారం(Root chakra)

2.స్వాధిష్ఠానం(Spleen chakra)

3.మణిపూరక(Solar chakra)

4.అనాహత(Heart chakra)

5.విశుధ్ధ(Throat chakra)

6.ఆజ్ఞా(Brow chakra)

7.సహస్రారం(Crown chakra)

ఇక ఈ చక్రాల స్థానాలు మరియు వాటి స్థానాలలో గల దేవతలను గురించి చూద్దాం.


పంచ భూతాలు అనగా 1.భూమి 2.ఆకాశం 3.నీరు 4.నిప్పు 5.గాలి ఇలా పంచ భూతాలు మానవ శరిరంలో లీనం అయి ఉంటాయి. 


1.మూలాధారం: ఇది మానవ శరీరానికి నడి భాగంలో ఉంటుంది.ఇది పృద్వి భూత స్ధానం (భూమి) 

ఈ చక్రానికి అధిపతి గణపతి.


2.స్వాధిష్ఠానం:ఇది మూలాధారానికి దాదాపుగా రెండు అంగులాలపైన అనగా పొత్తి కడుపులో ఉంటుంది.ఇది జల భూత స్థానం (నీరు) ఈ చక్రానికి అధిపతి బ్రహ్మ.


3.మణిపూరక: ఇది మానవ శరీరానికి బోడ్డు స్థానంలో ఉంటుంది.ఇది అగ్ని భూత స్థానం (నిప్పు) దీనికి అధిపతి విష్ణువు.


4.అనాహత:ఇది మానవ హృధయ స్థానంలో ఉంటుంది.ఇది వాయు భూత స్థానం(గాలి).దీనికి అధిపతి రుద్రుడు


5.విశుద్ధ: ఇది మానవ శరీరంలో గొంతు స్థానంలో ఉంటుంది.ఇది దివి భూత స్థానం (ఆకాశం)దీనికీ అధిపతి జీవుడు.


6.ఆజ్ఞా: ఇది మానవ శరీరంలో నీదుటి స్థానంలో ఉంటుంది. ఇది జీవాత్మ స్థానం.దీనికీ అధిపతి జీవుడు.


7.సహస్రారం:ఇది తల పై భాగాన (నడి  నెత్తిన) ఉంటుంది.ఇది చక్రం కాదు రంద్రం దీనినే బ్రహ్మ రంద్రం అని కూడా చెపుతారు.దీనికి అధిపతి ఈశ్వరుడు.


మరియు మన హైందవ సాంప్రదాయ పెళ్ళిల్లలో సైతం తలపై జీలకర్ర మరియు బెల్లం మిశ్రమాన్ని తలపై పెట్టిన తరువాత వధూ వరులను ఒకరికొకరిని చూసుకొమని చెబుతారు.కారణం అలా జీల కర్రా మరియు బెల్లం మిశ్రమాన్ని తలపై పెట్టగానే బ్రహ్మ రంద్రం తెరుచుకుంటుంది.అలా తెరుచుకున్న తరువాత మొదటగా చూసిన వారే జీవిత భాగ స్వామిగా బ్రహ్మ స్థలిలో నిర్ణీతం అవుతుంది.


ఇలా అనేక అంగాల కలయికే చక్రం అని పిలవబడుతుంది. ఇలా ఒక్కో చక్రం శరీరంలో ఒక్కో స్థానంలొ లినమై ఉంటుంది.

అనాపానసతి వలన కుండలినీ జాగృతమై,షట్ చక్రాలలో శుద్ది జరుగుతుంది.

కుండలినీ ఎప్పుడైతే సహస్రాణంతో స్తితమవుతుందో అపుడు మనిషి నిర్వాణ స్తితిని పొందుతాడు.

                                               

కుండలిని అంటే ఏమిటి ?


కుండలినికి సంబంధించిన కధలు ఎన్నో విని ఉంటారు మీరు. ఇది అర్థం చేసుకోవాలంటే మీ జీవితంలో జరిగే సంఘటనలనే ఉదాహరణగా తీసుకోవడం సమంజసనం. ఉదాహరణకి మీ ఇంటి గోడకి ఒక ప్లగ్ -పాయింట్ ఉంటుంది కానీ  విద్యుత్పత్తి అందులోనుండి జరగదు కదా? ఈ విద్యుత్పత్తి ఎక్కడో ఉన్న విద్యత్త్తు కేంద్రంలో జరుగుతుంది. అలాగని మనకి విద్యుత్తు ఈ కేంద్రం నుండి నేరుగా వచ్చేస్తుందా? రాదు కదా? మన ఇంటిగోడకి ఉన్న ప్లగ్ -పాయింట్ ద్వారా ఈ విద్యుత్తుని అందుకుంటాము. మనం ఏదైనా ఉపకరణాన్ని వాడేటప్పుడు ఈ ప్లగ్ -పాయింట్ని వాడుతాము , అయినా ఈ విద్యత్త్తు కేంద్రం గురించి పెద్దగా ఆలోచించము..అసలు దాని మీదకి దృష్టే వెళ్ళదు. అంత పెద్ద విద్యత్త్తు కేంద్రం ఒకటుందని, అందులోనుండి మనకి రోజూ విద్యుత్ సరఫరా జరుగుతోందని తలచుకోము. అయితే ఈ ఉపకరణాన్ని వాడాలంటే మాత్రం ప్లగ్ -పాయింట్ ఉపయోగించాలని తెలుసు. అలా చేస్తే కానీ అది పని చేయదు మరి.


మూల-ఆధార అంటే, అన్నింటికీ మూలం అని అర్థం. ఇక మిగిలిన ఆరు చక్రాలలో ఐదు చక్రాలు ప్లగ్ అన్నమాట.

అలాగే కుండలిని ఒక ప్లగ్ -పాయింట్ లాంటిది కానీ అది విద్యత్త్తు కేంద్రం మాత్రం కాదు. అందులోనూ ఇది 3 – పిన్ పాయింట్ కాదు , ఇది 5 – పిన్ పాయింట్. మనశరీరంలో ఏడు చక్రాలు ఉన్నాయని మీరు వినే ఉంటారు. ఈ చక్రాలలో మూలాధార చక్రం ఒక ప్లగ్ -పాయింట్ లాంటిది. అందుకే దానికి ఆ పేరు. మూల-ఆధార అంటే, అన్నింటికీ మూలం అని అర్థం. ఇక మిగిలిన ఆరు చక్రాలలో ఐదు చక్రాలు ప్లగ్ అన్నమాట. అయితే ఏడవది ఏంటి? అది ఒక కాంతి బల్బ్ అన్నమాట. దీన్ని గనక ప్లగ్ -పాయింట్లో పెడితే మీలోని ప్రతీ అంశం దేదీప్యమానంగా వెలుగుతుంది. మీరు సరిగ్గా గనక ప్లగ్ చేసినట్లైతే మీకు 24  గంటలూ విద్యుత్సరఫరా ఉంటుంది, ఆ వెలుతురూ అలాగే ఉంటుంది, బాటరీ అయిపోతుందన్న బెంగలేదు అలాగే వదిలేయవచ్చు .  ఇలా నిర్లక్ష్యంగా రోజంతా ఉంచేసినా/ వదిలేసినా కరెంటు అయిపోతుందన్న బాధ లేదు, ఎందుకంటే మీరు నేరుగా ఆ  విద్యత్త్తు కేంద్రంతోనే  కనెక్ట్ అయ్యి ఉన్నారు కదా?

ప్రస్తుతం మీలో కూడా ఆ శక్తి ప్రవహిస్తోంది , నేను చెప్పే మాటలు మీరు వింటున్నారు, అర్థం చేసుకుంటున్నారు, కానీ మీలోని ఈ జీవశక్తులు కొంత మటుకు మాత్రమే పనిచేస్తున్నాయి. మీరే గనక ఈ శక్తులని సరిగ్గా ప్లగ్ చేసినట్లయితే ఆ శక్తి అంతా మీ సొంతమౌతుంది. ఇక మీ క్రియా శక్తి అపారం, దీనితో మీరుచేయలేని పని ఉండదు, ఎందుకంటే శక్తివంతమైన ఈ కరెంటు ఇప్పుడు మీలో ప్రవహిస్తోంది కదా? మీ ఇంట్లో కూడా


చూసే ఉంటారు, ఒక్క ప్లగ్ పాయింట్ తో ఎన్నో ఉపకరణాలు పని చేస్తాయి కానీ, అన్నిటికీ అదే విద్యుత్తు . ఇక్కడ వచ్చిన సమస్య ఏమిటంటే , మీరు ఇంక ప్లగ్ అయ్యి లేరు.


ఈ సృష్టికి మూలమే శక్తి. ఈ విషయం గ్రహిస్తే జీవన మూలం గ్రహించినట్లే. ఈ శక్తి గమ్యాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకుంటే , ఈ సృష్టి యంత్రరచన తెలుసుకున్నట్లే!

సరే, మీ శక్తిని మీరే ఉత్పత్తిచేయాలి అని అనుకున్నారు, రోజుకి ఐదు సార్లు ఆహారం తీసుకుంటారు, అయినా రోజంతా అలసటగానే ఉంటుంది. ఇలా అయితే బ్రతుకు జట్కా బండి ముందుకి వెళ్ళడానికి చాలా కష్టపడుతుంది. శక్తి అంటే.. అది కేవలం బాహ్య ప్రపంచానికి, మన పనులు చేసుకోవడానికి కావలసిన శక్తి కాదు. ఇది జీవితానికీ, జీవనానికీ సంబంధించినది. ఈ సృష్టి అంతా శక్తే కదా? ఈ సృష్టికి మూలమే శక్తి. ఈ విషయం గ్రహిస్తే జీవన మూలం గ్రహించినట్లే. ఈ శక్తి గమ్యాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకుంటే , ఈ సృష్టి యంత్రరచన తెలుసుకున్నట్లే! అందుకే చెపుతున్నాను కుండలిని అంటే, ఆ అపారమైన విద్యుత్త్ కేంద్రానికి కనెక్ట్ అయి ఉండడం అని. ఆ కుండలినికి మీరు నేరుగా కనెక్ట్ అయిఉంటే ఆ విద్యుత్తు ఎలా ఉత్పత్తి అవుతుంది అన్న అవగహన మీకు ఉండక పోవచ్చు, కానీ అది ఎంత శక్తివంతమైనదో, ఎం చేయగలదో మీకు అనుభూతిలోకి వస్తుంది, కచ్చితంగా అర్థం అవుతుంది. అనంతమైన ఈ విద్యుత్త్ కేంద్రమే  కుండలిని.

ఒక ఉపకరణాన్ని మీరు వాడాలనుకున్నప్పుడు  దాన్ని ప్లగ్ పాయింటులో పెట్టడానికి ప్రయత్నిస్తారు, కానీ మీ చేతులు వణుకుతూ ఉంటే, గోడంతా గీతలు పెడతారు , విఫలమౌతారు. అలాగే ఈ 5 పాయింట్లున్న పిన్నుని ప్లగ్ చేయడానికి చాలామంది ఎంతో శ్రమ పడతారు, ఎందుకంటే వారి శరీరంలో , భావోద్వేగాలలో, జీవశక్తులలో, మనసులో స్థిరత్వం  లేదు కాబట్టి. మనం చేసే ఈ యోగా అంతా కూడా ఆ స్థిరత్వం కోసమే. ఆ కుండలినికి మనం సరిగ్గా ప్లగ్ అయిఉంటే అనంతమైన శక్తిని నేరుగా అందుకున్నట్లే. ఇలా జరగడానికి ఆ విద్యుత్త్ కేంద్రం గురించి మీరు తెలుసుకుని అర్ధంచేసుకునే అవసరంలేదు. ఆ కుండలినికి కనెక్ట్ అయి ఉంటే చాలు. యోగ శాస్త్రం అంతా కూడా ఈ కుండలినితో మీరు ఎలా కనెక్ట్ అవ్వాలో నేర్పుతుంది. ఎడతెగని ఈ శక్తి మీలో నిర్విరామంగా ప్రవహిస్తూ ఉంటే సహజంగానే మీరు జీవితంలో ముందుకి సాగిపోతారు. జీవితగమ్యం వైపే సూటిగా పయనిస్తారు. అనవసరమైన భ్రమల్లో, ఆలోచనలలో, భావోద్వేగాలలో , బాహ్యప్రపంచపు చిక్కుల్లో పడరు.


శ్లోకం 38


పద్మనాభోరవిందాక్ష: పద్మగర్భ: శరీరభృత్ |

మహర్దిదృద్ధో వృద్ధాత్మా మహాక్షో గరుడధ్వజ: ||


తాత్పర్యం :


పద్మము నాభియందు కలవాడు (పద్మనాభ), కమలరేకులవంటి కన్నులు కలవాడు (అరవిందాక్ష), పద్మమునందు నివసించువాడు (పద్మగర్భ), ప్రాణుల శరీరములను పోషించువాడు (శరీరభృత్), అంతులేని ధనము కలవాడు (మహర్ధి), ఎల్లప్పుడూ వృద్ధి చెందువాడు (ఋద్ధ), పూర్తిగా పరిణితి చెందినవాడు (వృద్ధాత్మా), ఒక వాహనమునకు బలవంతమైన ఇరుసువంటివాడు (మహాక్ష), తన పతాకమునందు గరుడ చిహ్నము కలవాడూ (గరుడధ్వజ)


వివరణ :


ఇంతకుమునుపు శ్లోకంలో పద్మం మానసిక పరిపక్వతకు చిహ్నం అని చెప్పుకున్నాం. సనాతన ధర్మంలో పద్మానికి నాభికి (నడిబొడ్డు) చాలా సంబంధం ఉంది. యోగశాస్త్రం ప్రకారం, జీవిలోని చైతన్యాన్ని అనేక శక్తులుగా విభజిస్తే, ఆ శక్తులను మొత్తం ఏడు చక్రాలుగా వర్గీకరించవచ్చు.


మూలాధార చక్రం (నాభికి పూర్తిగా క్రిందుగా)- ఆకలి, దప్పిక, భయం, పోట్లాడు-లేదా-పారిపో గుణం (ఇంగ్లీషులో ఫైట్ ఆర్ ఫ్లైట్)


స్వాధిష్టాన చక్రం (పొత్తికడుపులో) - పునరోత్పత్తికి చెందిన శక్తులు, వాటికి సంబంధించిన అవయవాలు  


మణిపుర చక్రం (సౌర వలయం) - జీవ క్రియకు సంబంధించిన శక్తులు, ఉదాహరణకు, ఆహారాన్ని జీర్ణించి శక్తిగా మార్చే అవయవాలు వాటికి సంబంధించిన జ్ఞానం


అనాహత చక్రం (హృదయం) - భౌతికేతర భావనలు, ఉదాహరణకు, ప్రేమ, క్రోధం, దయా, దు:ఖం, ఈ చక్రం మన రోగనిరోధక శక్తిని నియంత్రిస్తుంది


విశుద్ధ చక్రం (గొంతు/వాక్కు) - ఈ చక్రం వాక్కుని నియంత్రిస్తుంది


ఆజ్ఞా చక్రం (కనుబొమల మధ్య ప్రదేశం, నుదురు) - జ్ఞానం, జాగృత్/స్వప్న/సుషుప్త స్థితులు


సహస్రారా చక్రం (నడి నెత్తి) - బ్రహ్మం లేదా అంతిమ జ్ఞాన స్థితి


ఈ చక్రాలను మనం జాగ్రత్తగా గమనిస్తే, బొడ్డు క్రిందుగా ఉన్న చక్రాలు కేవలం భౌతిక శక్తులను మాత్రమే నియంత్రిస్తాయి. బుద్ధి లేదా మానసిక పరిపక్వత అన్నది బొడ్డు పైనున్న చక్రాలకు సంబంధించింది. వికసించిన పద్మాన్ని మానసిక పరిపక్వతతో పోలిస్తే, ఆ పద్మ యొక్క ఆవిర్భావం నాభి నుంచే మొదలవాలి (చిహ్నాపూర్వకంగా).


పద్మం ఒక్కసారి విచ్చుకున్న తరువాత మళ్లీ ముడుచుకోదు. ఆలాగే జ్ఞానం ఒక్కసారి సంపాయించిన తరువాత మనం తిరిగి అధమ స్థితులకు జారిపోకూడదు. పద్మముల వంటి కన్నులు కలవాడు (ఆరవిందాక్ష) మరియు పద్మములో నివసించువాడు (పద్మ గర్భ) అన్న గుణాల్లోని సూక్ష్మం.


ఋద్ధ మరియు వృద్ధాత్మ అన్నవి పరస్పర భిన్న గుణాలు. ఎల్లప్పుడూ వృద్ధి చెందువాడు అన్న గుణంపూర్తిగా వృద్ధి చెందిన వాడూ అన్న గుణంతో ఎలా సరిపోతుంది? వృద్ధాత్మ అన్న గుణం గమ్యం అయితే ఋద్ధ అన్న గుణం గమనం. మా


నవుడిగా పూర్తి పరిణితి చెందడం అన్నది మన గమ్యం అయితే దానిని చేరడానికి మనం చేసే ప్రయత్నమే ఋద్ధ అన్న గుణం.


కుండలినీ శక్తి మరియు చక్రాల కోణంలో చెప్పలంటే, వెన్నెముక క్రిందుగా నిద్రపోతున్న కుండలినీ శక్తి నిద్రలేచి మూలాధారం నుండి సహస్రారం వరకు చేసే ప్రయాణమే ఋద్ధ అన్న గుణానికి నిర్వచనం. సహస్రారం చేరితే అప్పుడు ఆ వ్యక్తి వృద్ధాత్మ అవుతాడు. 


ప్రాక్టికల్ గా చెప్పాలంటే, మనకు ఆసక్తి కలిగించే ఒక విషయాన్ని పట్టుకుని దానిగురించి పరిశోధన చేసి ఆ విషయంపై సంపూర్ణ జ్ఞానం సంపాయించాలి. ఉదాహరణకు, మీకు ఫోటోలు తీయడంలో ఆసక్తి ఉందనుకోండి, ఆ విషయంపై మీరు వీలైనంతగా పరిశొధనచేసి ఫోటోగ్రఫిలోని సూక్ష్మాలను అధ్యయనం చేసి వాటిని అమలుచేయండి. అలాగే, వృత్తిలో కానీ, ఉద్యోగంలో కానీ, మీరు చేసే ప్రతీ పనిలో, సంపూర్ణ జ్ఞానం సంపాయించడానికి ప్రయత్నం చేయండి. ఇదే ఈ శ్లోకంలోని సూక్ష్మం.


యోగశాస్త్రం ప్రకారం, గరుడుడు మనలోని ఐదు వాయువులకు ప్రతిరూపం (ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన). ఈ ఐదు వాయువులను ప్రాణాయామం ద్వారా నియంత్రిస్తే మనలోని కుండలినీ శక్తి నిద్రలేస్తుంది. నిద్రలేచిన కుండలినీ శక్తి సహాయంతో జ్ఞాన సముపార్జన చేసి మానవ జన్మలో అత్యున్నత స్థానం చేరవచ్చు.


జాగ్రత్తగా పరిశీలిస్తే, ఈ శ్లోకంలో మతానికి సంబంధించిన విషయం ఏమైనా మీకు కనిపిస్తుందా? ఈ శ్లోకం మొత్తం మనకు మనలో నిష్క్రియాత్మకంగా నిద్రిస్తున్న చైతన్యాన్ని ఎలా జాగృతం చేయాలి అని చెబుతుంది, అది కూడా, చాలా ప్రాక్తికల్ గా.          


కుండలినీ, చక్రాలు మరియు జీవ నాడుల గురించి తెలుసుకోవాలంటే లలితా సహస్రనామాలకు మించిన మూలం మనకు ఇంకొకటి ఉండదు

లలితా సహస్రనామ

🌹💐🌻🌻👏

Thursday, August 12, 2021

🧘‍♂️సప్త ఋషుల🧘‍♀️ Sapta Rishis- Telugu🧘‍♀️

🧘‍♂️సప్త ఋషుల🧘‍♀️ Sapta Rishis- Telugu🧘‍♀️ 


భాద్రపద శుద్ధ పంచమిని ఋషి పంచమిగా వ్యవహరిస్తారు..... ఆరోజున అత్రి, కశ్యప, భరద్వాజ, గౌతమ, వశిష్ట, విశ్వామిత్ర జమదగ్ని మహర్షుల గురించి ఒక్కసారైనా తలచుకోవాలని చెబుతారు పెద్దలు.*


 అరణ్యవాసంలో సీతారాములకు అభయమిచ్చినవాడు అత్రి మహర్షి.


 సాక్షాత్తూ శ్రీహరినే పుత్రునిగా పొందిన మహానుభావుడు..... సీతారాములకు చిత్రకూటానికి దారి చూపినవాడు. భరద్వాజ మహర్షి.


తన భార్య అహల్య ద్వారా రామునికి తన తప:ఫలాన్ని అందింపజేసిన మహారుషి గౌతముడు.


 రాముని గురువు విశ్వామిత్రుడు...... కులగురువు వశిష్టుడు.


విష్ణువు అంశావతారమైన పరశురాముని కన్న తండ్రి జమదగ్ని మహర్షి.


 దశావతారాల్లో ఒకటైన వామనుడి జనకుడు.
 కశ్యపమహర్షి.


 ఋషిపంచమినాడు రామాయణం చదివితే ఈ మహర్షులందరినీ తలుచుకున్నట్టే.....


యోగులలో పరబ్రహ్మమే ప్రథమ యోగి. ఇతడు సర్వజ్ఞుడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు యోగ నిద్రలో ఉండి యోగమాయతో ఈ సృష్టిని నిర్వహించు చున్నారు. వేద విజ్ఞానము ముందుగా అగ్ని, వాయువు, ఆదిత్యుడు, అంగీరసులను వారిలో ప్రకాశించెను.


సృష్టి ప్రారంభమున ఋషివర్గమంతయు స్వయంగా ఉద్భవించి జ్ఞానము, శ్రవణము, తపస్సు అను నిశ్చిత రూపములో ఉండియున్నారు. వీరినే బ్రహ్మవేత్తలు అనియు, ఇంద్రియములను జయించి బ్రహ్మనిష్ఠను పొందినవారనియు పిలిచిరి.


మునులు అనగా మనన శీలులై ఎల్లపుడు పరమాత్మయందు లీనమై, పరమాత్మనే స్వస్వరూపముగా ధ్యానించువారు. వీరు ఆత్మ సర్వవ్యాప్తము, సర్వ శ్రేష్ఠమని ఆరూఢమై యుందురు.


దేవలోకమున నివసించువారిని దేవర్షులనిరి. వీరు త్రికాలజ్ఞులు, మంత్ర ప్రవక్తలు, సత్యవాదులు, గొప్ప తపశ్శక్తితో సర్వలోకములలో నిరంతరము సంచరించుచూ, దేవతలను కూడా తమ అధీనములో ఉంచుకొనువారు. ఇట్టి లక్షణములు కల దేవతలు, బ్రహ్మణులు, రాజర్షులు, శూద్రులు కూడా దేవర్షులన బడుదురు.


ఉదాహరణ:- నరనారాయణులు, నారదుడు, వ్యాసుడు మొదలగువారు.


సనకసనందనాదులు కూడా బ్రహ్మ మానస పుత్రులే. వీరు బ్రహ్మ మనస్సు నుండి పుట్టినవారు. వీరు అందరకు జ్ఞానము ప్రసాదించిన ఆచార్యులు.


మనువులు పదునాల్గురు. ప్రతి మన్వంతరమునకు మనువులు మారుచుందురు. వారితోపాటు సప్త ఋషులు, దేవతలు, ఇంద్రుడు, మనుపుత్రులు కూడా మారిపోదురు.


సప్త ఋషులు, బ్రహ్మ మానస పుత్రులు భగవత్‌ కార్యములను ఆచరించుచుందురు. వీరు మరీచి, ఆత్రి, పులహుడు, వసిష్టుడు, అంగీరసుడు, పులస్త్యుడు, క్రతువు. వీరు ధర్మరక్షకులు, లోకరక్షకులు. 


విశ్వామిత్రుడు జమదగ్ని, భరద్వాజుడు, గౌతముడు, కశ్యపుడు మొదలగువారు బ్రహ్మ మానస పుత్రులు కాదు. పిదప బ్రహ్మర్షి అయినవారు.


వసిష్టుడు సప్త ఋషులలో శ్రేష్ఠుడు. శ్రీరామచంద్రుని గురువు. వీరి ధర్మ పత్ని అరుంధతి. అష్ట సిద్ధులు కలవారు. వీరి నూర్గురు కుమారులను విశ్వామిత్రుడు వధించినను ప్రతీకారము తీర్చుకొనలేదు. తపస్సు కంటెను సత్‌సాంగత్యము గొప్పదని విశ్వామిత్రునితో వాదించి రుజువుచేసెను. శ్రీయోగ వాసిష్టి గ్రంథము, శ్రీవసిష్టునికి, శ్రీరామచంద్రునికి జరిగిన సంవాదమే. ఇది వసిష్ట గీత అని పిలువబడినది.


సప్త ఋషులలో ఒకడైన మరీచికి అనేక మంది భార్యలు కుమారులు కలరు. కశ్యప మహర్షి ఈయన కుమారుడే. బ్రహ్మ పురాణమును మొదట బ్రహ్మదేవుడు మరీచికి వినిపించెను.


అత్రి మహర్షి గొప్పతపస్సంపన్నుడు. మహా పతివ్రత అయిన అనసూయ ఈయన ధర్మపత్నియే. అనసూయ కపిల మహర్షి యొక్క చెల్లెలు. వీరికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ప్రత్యక్షమై, వీరి అంశతో దత్తాత్రేయులు విష్ణు అంశతో జన్మించెను. అలాగే చంద్రుడు బ్రహ్మ అంశతోనూ, దుర్వాసుడు శివుని అంశతోనూ జన్మించిరి.


పులస్త్యుడు సమస్త యోగ శాస్త్ర పారంగుతుడు. మహా తపస్వి. ధర్మ పరాయణుడు. వీరికి ముగ్గురు భార్యలు కలరు. పెక్కు మంది కుమారులు కలరు. విశ్వవసువు వీరికుమారులు. కుబేరుడు, రావణుడు, కుంభకర్ణుడు, విభీషణులు విశ్వవసువు కుమారులే.


పులహుడు మహజ్ఞాని. వీరు సనందన మహర్షి నుండి జ్ఞానమును పొందిరి. వీరికి ఇద్దరు భార్యలు ఒకరు దక్షప్రజాపతి కుమారై అయిన 'క్షమ', రెండవ వారు కర్దమ పుత్రిక అయిన 'గతి' అనువారు. వీరికి అనేక మంది పుత్రులు, పుత్రికలు కలరు.


క్రతువు మహాతేజస్సంపన్నుడు. ఇతనికి ఇద్దరు భార్యలు. ఒకరు కర్దమ మహార్షి పుత్రిక 'క్రియ' ఇంకొకరు దక్ష కుమార్తె 'సన్నతి' వీరి వలన వాలఖిల్యులు అను పేరు గల్గిన అరవై వేల మంది ఋషులు జన్మించారు.


అంగీరసుడు అసాధారణ ఋషి. అధ్యాత్మిక తేజోసంపన్నుడు.


సప్త ఋషులు బ్రహ్మ ద్వారా సృష్టించబడి సంతాన ఉత్పత్తికి తద్వారా భూలోక ప్రజా జీవనమునకు, ప్రధాన కారకులైరి.


సప్త ఋషుల లక్షణములు:-    బ్రహ్మ మానస పుత్రులు, తేజోమూర్తులు, ధర్మాచరణ ప్రవక్తలు, ప్రజాపతులు, దీర్ఘాయువులు, వేదమంత్రప్రవక్తలు, దివ్యశక్తి, సంకల్ప శక్తి గల్గి దివ్య దృష్టి కలవారు, సర్వ ధర్మమర్మజ్ఞులు యజ్ఞములు చేయుట, చేయించుటలో ప్రవీణులు, గురుకులముల ద్వారా విద్యాభివృద్ధికి తోడ్పడతారు. సంతాన ప్రాప్తికి గృహస్తాశ్రమములు స్వీకరించిరి. సంతానము, గోధన సంపన్నులు. ప్రాపంచిక భోగములందు ఆసక్తి లేని వారు. మనస్సును జయించినవారు. వాక్‌ శుద్ధి కలిగిన వారు.


ఇతర మహా ఋషులలో ముఖ్యులు:


కాక భుషుండి మహర్షి:-  ఇతని చే రచింపబడిన 'కాక భుజందర్‌ నాడీ'. అను గ్రంథము చాలా ప్రసిద్ధి చెందినది. ఈ గ్రంథములో అనేక ఆశ్చర్యకర విశేషములతో పాటు ఎన్నో రహస్యాలు వర్ణింపబడినవి. కేవలము కారణజన్ములు. అవతారముర్తులను గూర్చి వారి రహస్యములను ఇందు తెలుపబడినవి.


పరాశరమహర్షి:- వీరు రచించిన ''హోరానాడి'' అను గ్రంథము అద్భుతము, ఆశ్చర్యకరమైనది. అందు యోగజ్ఞానము, సత్యజ్ఞానము, లోకజ్ఞానము, సృష్టి రహస్యములు తెలుపబడినవి. భూతభవిష్యత్‌ విషయములు వర్ణింపబడినవి.

కపిల మహర్షి:- అణువులో బ్రహ్మశక్తిని ధర్శించిన వారిలో కణ్వ, గౌతమ మహర్షుల తర్వాత కపిల మహర్షిని పేర్కొనబడిరి. అణువు నందు గల శక్తియే బ్రహ్మము అను అణు సిద్ధాంతాన్నీ మొదట కపిల మహర్షి రూపొందించారు.


విశ్వా మిత్రుడు:- ఇతడు పదివేల సంవత్సరములు తపస్సు చేసిన క్షత్రియుడు బ్రహ్మర్షి అయ్యెను. దశరధుని కుమారుడైన రామచంద్రుని తన యాగ రక్షణుకు తీసుకొని వెళ్ళి అతనికి అనేక అస్త్ర శస్త్రములను బోధించినవాడు. వీరు కాక వాల్మికి, కర్దముడు, భృగువు, చ్యవనుడు, ఉద్దాలకుడు, ఉశీలుడు, వామదేవుడు, దుర్వాసుడు, భరద్వాజుడు, బుచీకుడు మొదలైన అనేక మంది వేద వేదాంగ పారంగతులైరి.


ఈ ప్రపంచమున నివశించు ప్రజలందరు ఎవరికి సంతతి అయినారో అట్టి పూర్వీకులైన సప్తఋషులకు కూడా సనక సనందనాదులు, వసువులు, దేవర్షులు మొదలగువారు చాలా పూర్వీకులు. వీరందరినుండియె ఈ ప్రపంచములోని జనులందరు పుట్టిరి. అందుకే వారి గోత్రనామాలను మనము ఇప్పటికి వంశానుసారముగా కలిగి యున్నాము.

🕉️🌞🌏🌙🌟🚩


సప్తఋషి ధ్యాన శ్లోకములు :-


కశ్యప ఋషి :-
 కశ్యపస్సర్వ లోకాఢ్యః సర్వ శాస్త్రార్థ కోవిదః| ఆత్మయోగ బలేనైవ సృష్టి స్థిత్యంత కారకః||
ఓం అదితి సహిత కశ్యపాయ నమః||


అత్రి ఋషి :- అగ్నిహోత్రరతం శాంతం సదావ్రత పరాయణమ్| సత్కర్మనిరతం శాంత మర్చయే దత్రిమవ్యయమ్||    ఓం అనసూయా సహిత అత్రయేనమః||


భరద్వాజ ఋషి :- జటిలం తపసాసిద్ధం యఙ్ఞ సూత్రాక్ష ధారిణమ్| కమండలు ధరం నిత్యం భరద్వాజం నతోస్మ్యహమ్||    ఓం సుశీలా సహిత భరద్వాజాయ నమః||


విశ్వామిత్ర ఋషి :- కృష్ణాజిన ధరం దేవం సదండ పరిధానకమ్| దర్భపాణిం జటాజూటం విశ్వామిత్రం సనాతనమ్||     ఓం కుముద్వతీ సహిత విశ్వామిత్రాయనమః||


గౌతమ ఋషి :- యోగాఢ్యః సర్వభూతానాం అన్నదానరతస్సదా| అహల్యాయాః పతిశ్శ్రీమాన్ గౌతమస్సర్వ పావనః||    ఓం అహల్యా సహిత గౌతమాయనమః||


జమదగ్ని ఋషి :- అక్షసూత్ర ధరం దేవం ఋషీనామధిపం ప్రభుమ్| దర్భపాణిం జటాజూటం మహాతేజస్వినం భజే||     ఓం రేణుకా సహిత జమదగ్నయే నమః


వసిష్ఠ ఋషి :- శివధ్యాన రతం శాంతం త్రిదశైరభి పూజితమ్| బ్రహ్మసూనుం మాహాత్మానం వసిష్ఠం పూజయేత్సదా||  
 ఓం అరుంధతీ సహిత వసిష్ఠాయ నమః||


కశ్యపత్రి ర్భరద్వాజో విశ్వా మిత్రోథ గౌతమః| 
వసిష్ఠో జమదగ్నిశ్చ సప్తయతే ఋషయస్తథా||
                                       సప్తఋషిభ్యో నమః
------------------------------------------------------------------------------------------


Indian ఋషులు జాబితా

అక్షర క్రమంలో హిందూ ఋషుల పేర్లు


అ - ఆ - ఇ - ఈ - ఉ - ఊ - ఋ - ఎ - ఏ - ఐ - ఒ - ఓ - ఔ - అం - క - ఖ - గ - ఘ - చ - ఛ - జ - ఝ - ట - ఠ - డ - ఢ - త - థ - ద - ధ - న - ప - ఫ - బ - భ - మ -య - ర - ల - వ - శ - ష - స - హ - ళ - క్ష


  • దేవర్షి    దేవలోకంలో ప్రతిష్ఠి కలవారు దేవర్షులు.
  • బ్రహ్మర్షి  ఉత్తమ శ్రేణికి చెందిన మహర్షులను బ్రహ్మర్షులు అంటారు.
  • మహర్షి  సామాన్య ఋషి స్థాయిని దాటిని గొప్ప ఋషులను మహర్షి అంటారు.
  • రాజర్షి   రాజుగా ఉంటూనే ఋషిత్వం పొందినవాడు రాజర్షి.


  • అగ్ని మహర్షి
  • అగస్త్య మహర్షి
  • అంగీరస మహర్షి
  • అంగిరో మహర్షి
  • అత్రి మహర్షి
  • అర్వరీవత మహర్షి
  • అభినామన మహర్షి
  • అగ్నివేశ మహర్షి
  • అరుణి మహర్షి
  • అష్టావక్ర మహర్షి
  • అష్టిక మహర్షి
  • అథర్వణ మహర్షి
  • ఆత్రేయ మహర్షి
  • అథర్వాకృతి‎
  • అమహీయుడు
  • అజామిళ్హుడు‎
  • అప్రతిరథుడు‎
  • అయాస్యుడు‎
  • అవస్యుడు
  • అంబరీషుడు


ఇరింబిఠి‎


ఉపమన్యు మహర్షి

ఉత్తమ మహర్షి

ఉన్మోచన

ఉపరిబభ్రవుడు

ఉద్దాలకుడు‎

ఉశనసుడు

ఉత్కీలుడు


ఊర్ఝ మహర్షి

ఊర్ద్వబాహు మహర్షి


ఋచీక మహర్షి

ఋషభ మహర్షి

ఋష్యశృంగ మహర్షి

ఋషి


ఔపమన్యవ మహర్షి

ఔరవ మహర్షి


కపిల మహర్షి

కశ్యప మహర్షి

క్రతు మహర్షి

కౌకుండి మహర్షి

కురుండి మహర్షి

కావ్య మహర్షి

కాంభోజ మహర్షి

కంబ స్వాయంభువ మహర్షి

కాండ్వ మహర్షి

కణ్వ మహర్షి

కాణ్వ మహర్షి

కిందమ మహర్షి

కుత్స మహర్షి

కౌరుపథి‎

కౌశికుడు‎

కురువు

కాణుడు‎

కలి

కాంకాయనుడు

కపింజలుడు‎

కుసీదుడు


గౌతమ మహర్షి

గర్గ మహర్షి

గృత్సమద మహర్షి

గృత్సదుడు‎

గోపథుడు‎

గోతముడు

గౌరీవీతి

గోపవనుడు

గయుడు


చ్యవన మహర్షి

చైత్ర మహర్షి

చాతనుడు‎


జమదగ్ని మహర్షి

జైమిని మహర్షి

జ్యోతిర్ధామ మహర్షి

జాహ్న మహర్షి

జగద్బీజ

జాటికాయనుడు‎


తండి మహర్షి

తిత్తిరి మహర్షి

త్రితుడు

తృణపాణి


దధీచి మహర్షి

దుర్వాస మహర్షి

దేవల మహర్షి

దత్తోలి మహర్షి

దాలయ మహర్షి

దీర్ఘతమ మహర్షి

ద్రవిణోదస్సు‎


నచికేత మహర్షి

నారద మహర్షి

నిశ్ఛర మహర్షి

సుమేధా మహర్షి

నోధా

నృమేధుడు


పరశురాముడు

పరాశర మహర్షి

పరిజన్య మహర్షి

పులస్త్య మహర్షి

ప్రాచేతస మహర్షి

పులహ మహర్షి

ప్రాణ మహర్షి

ప్రవహిత మహర్షి

పృథు మహర్షి

పివర మహర్షి

పిప్పలాద మహర్షి

ప్రత్య్సంగిరసుడు

పతివేదనుడు

ప్రమోచన‎

ప్రశోచనుడు‎

ప్రియమేథుడు

పార్వతుడు

పురుహన్మ‎

ప్రస్కణ్వుడు

ప్రాగాథుడు

ప్రాచీనబర్హి

ప్రయోగుడు

పూరుడు

పాయు


భరద్వాజ మహర్షి

భృగు మహర్షి

భృంగి మహర్షి

బ్రహ్మర్షి మహర్షి

బభ్రుపింగళుడు

భార్గవవైదర్భి‎

భాగలి

భృగ్వంగిరాబ్రహ్మ

బ్రహ్మస్కందుడు‎

భగుడు‎

బ్రహ్మర్షి

బృహత్కీర్తి‎

బృహజ్జ్యోతి‎

భర్గుడు


మరీచి మహర్షి

మార్కండేయ మహర్షి

మిత మహర్షి

మృకండు మహర్షి

మహాముని మహర్షి

మధు మహర్షి

మాండవ్య మహర్షి

మాయు

మృగారుడు‎

మాతృనామ‎

మయోభువు‎

మేధాతిథి

మధుచ్ఛందుడు

మనువు

మారీచుడు

మైత్రేయ


యాజ్ఞవల్క మహర్షి

యయాతి‎


రురు మహర్షి

రాజర్షి మహర్షి

రేభుడు


వశిష్ట మహర్షి

వాలఖిల్యులు

వాల్మీకి మహర్షి

విశ్వామిత్ర మహర్షి

వ్యాస మహర్షి

విభాండక ఋషి

వాదుల మహర్షి

వాణక మహర్షి

వేదశ్రీ మహర్షి

వేదబాహు మహర్షి

విరాజా మహర్షి

వైశేషిక మహర్షి

వైశంపాయన మహర్షి

వర్తంతు మహర్షి

వృషాకపి

విరూపుడు‎

వత్సుడు‎

వేనుడు

వామదేవుడు‎

వత్సప్రి

విందుడు


శంఖ మహర్షి

శంకృతి మహర్షి

శతానంద మహర్షి

శుక మహర్షి

శుక్ర మహర్షి

శృంగి ఋషి

శశికర్ణుడు

శంభు‎

శౌనకుడు

శంయువు‎

శ్రుతకక్షుడు


సమ్మిత మహర్షి

సనత్కుమారులు

సప్తర్షులు

స్థంభ మహర్షి

సుధామ మహర్షి

సహిష్ణు మహర్షి

సాంఖ్య మహర్షి

సాందీపణి మహర్షి

సావిత్రీసూర్య

సుశబ్దుడు‎

సుతకక్షుడు‎

సుకక్షుడు‎

సౌభరి

సుకీర్తి‎

సవితామహర్షి సామావేదానికి మూలము.

సింధుద్వీపుడు

శునఃశేపుడు

సుదీతి


హవిష్మంత మహర్షి

హిరణ్యరోమ మహర్షి.                          

Tuesday, August 10, 2021

సృష్టి_రహస్యం - Notes

  🙏సృష్టి_రహస్యం🏵️





శివోహం శివోహం శివోహంశివోహం శివోహం శివోహంశివోహం శివోహం శివోహంశివోహం శివోహం 

--------------------------------------

1 సృష్టి ఎలా ఏర్పడ్డది.

2 సృష్టి కాల చక్రం ఎలా నడుస్తుంది.

3 మనిషిలో ఎన్ని తత్వాలున్నాయి.


( సృష్ఠి ) ఆవిర్బావము:

1 ముందు (పరాపరము) దీనియందు శివం పుట్టినది

2 శివం యందు శక్తి

3 శక్తి యందు నాదం

4 నాదం యందు బిందువు

5 బిందువు యందు సదాశివం

6 సదాశివం యందు మహేశ్వరం

7 మహేశ్వరం యందు ఈశ్వరం

8 ఈశ్వరం యందు రుద్రుడు

9 రుద్రుని యందు విష్ణువు

10 విష్ణువు యందు బ్రహ్మ

11 బ్రహ్మ యందు ఆత్మ

12 ఆత్మ యందు దహరాకాశం

13 దహరాకాశం యందు వాయువు

14 వాయువు యందు అగ్ని

15 ఆగ్ని యందు జలం

16 జలం యందు పృద్వీ.

పృద్వీ యందు ఓషధులు

17 ఓషదుల వలన అన్నం

18 ఈ అన్నము వల్ల నర మృగ పశు పక్షి స్థావర జంగమాదులు పుట్టినవి.


( సృష్ఠి ) కాల చక్రం:

పరాశక్తి ఆదీనంలో నడుస్తుంది.

ఇప్పటివరకు ఏంతో మంది శివులు ఏంతోమంది విష్ణువులు ఏంతోమంది బ్రహ్మలు వచ్చారు ఇప్పటివరకు 50 బ్రహ్మలు వచ్చారు.ఇప్పుడు నడుస్తుంది 51 వాడు.

1 కృతయుగం

2 త్రేతాయుగం

3 ద్వాపరయుగం

4 కలియుగం

నాలుగు యుగలకు 1 మహయుగం.

71 మహ యుగలకు 1మన్వంతరం.

14 మన్వంతరాలకు ఒక సృష్ఠి ఒక కల్పం.

15 సందులకు ఒక ప్రళయం ఒక కల్పం

1000 యుగలకు బ్రహ్మకు పగలు సృష్ఠి .

1000 యుగాలకు ఒక రాత్రి ప్రళయం.

2000 యుగాలకు ఒక దినం.

బ్రహ్మ వయస్సు 51 సం.

ఇప్పటివరకు 27 మహ యుగాలు గడిచాయి.

1 కల్పంకు 1 పగలు 432 కోట్ల సంవత్సరంలు.

7200 కల్పాలు బ్రహ్మకు 100 సంవత్సరములు.

14 మంది మనువులు.

ఇప్పుడు వైవస్వత మనువులో ఉన్నాం. శ్వేతవారహ యుగంలో ఉన్నాం.

5 గురు భాగన కాలంకు 60 సం

1 గురు భాగన కాలంకు 12 సం

1 సంవత్సరంకు 6 ఋతువులు.

1 సంవత్సరంకు 3 కాలాలు.

1 రోజుకు 2 పూటలు పగలు రాత్రి

1 సం. 12 మాసాలు.

1 సం. 2 ఆయనాలు

1సం. 27 కార్తెలు

1 నెలకు 30 తిధులు

27 నక్షత్రాలు - వివరణలు

12 రాశులు

9 గ్రహాలు

8 దిక్కులు

108 పాదాలు

1 వారంకు 7 రోజులు

పంచాంగంలో 1 తిధి. 2 వార. 3 నక్షత్రం. 4 కరణం. 5 యోగం.


సృష్ఠి యవత్తు త్రిగుణములతోనే ఉంటుంది


దేవతలు జీవులలో చేట్లు అన్ని వర్గలలో మూడే గుణములు ఉంటాయి

1 సత్వ గుణం

2 రజో గుణం

3 తమో గుణం


( పంచ భూతంలు అవిర్బావాం )

1 ఆత్మ యందు ఆకాశం

2 ఆకాశం నుండి వాయువు

3 వాయువు నుండి అగ్ని

4 అగ్ని నుండి జలం

5 జలం నుండి భూమి అవిర్బవించాయి.


5 ఙ్ఞానింద్రియంలు

5 పంచ ప్రాణంలు

5 పంచ తన్మాత్రలు

5 ఆంతర ఇంద్రియంలు

5 కర్మఇంద్రియంలు = 25 తత్వంలు


1 ( ఆకాశ పంచికరణంలు )

ఆకాశం - ఆకాశంలో కలవడం వల్ల ( జ్ఞానం )

ఆకాశం - వాయువులో కలవడం వల్ల ( మనస్సు )

ఆకాశం - అగ్నిలో కలవడం వల్ల ( బుద్ది )

ఆకాశం - జలంతో కలవడంవల్ల ( చిత్తం )

ఆకాశం - భూమితో కలవడంవల్ల ( ఆహంకారం ) పుడుతుతున్నాయి


2( వాయువు పంచికరణంలు )

వాయువు - వాయువుతో కలవడం వల్ల ( వ్యాన)

వాయువు - ఆకాశంతో కలవడంవల్ల ( సమాన )

వాయువు - అగ్నితో కలవడంవల్ల ( ఉదాన )

వాయువు - జలంతో కలవడంవల్ల ( ప్రాణ )

వాయువు - భూమితో కలవడంవల్ల ( అపాన ) వాయువులు పుడుతున్నాయి.


3 ( అగ్ని పంచికరణములు )

అగ్ని - ఆకాశంతో కలవడంవల్ల ( శ్రోత్రం )

అగ్ని - వాయువుతో కలవడంవల్ల ( వాక్కు )

అగ్ని - అగ్నిలో కలవడంతో ( చక్షువు )

అగ్ని - జలంతో కలవడంతో ( జిహ్వ )

అగ్ని - భూమితో కలవడంతో ( ఘ్రాణం ) పుట్టేను.


4 ( జలం పంచికరణంలు )

జలం - ఆకాశంలో కలవడంవల్ల ( శబ్దం )

జలం - వాయువుతో కలవడంవల్ల ( స్పర్ష )

జలం - అగ్నిలో కలవడంవల్ల ( రూపం )

జలం - జలంలో కలవడంవల్ల ( రసం )

జలం - భూమితో కలవడం వల్ల ( గంధం )పుట్టేను.


5 ( భూమి పంచికరణంలు )

భూమి - ఆకాశంలో కలవడంవల్ల ( వాక్కు )

భూమి - వాయువుతో కలవడం వల్ల ( పాని )

భూమి - అగ్నితో కలవడంవల్ల ( పాదం )

భూమి - జలంతో కలవడంతో ( గూహ్యం )

భూమి - భూమిలో కలవడంవల్ల ( గుదం ) పుట్టేను.


( మానవ దేహ తత్వం ) 5 ఙ్ఞానింద్రియంలు

1 శబ్ద

2 స్పర్ష

3 రూప

4 రస

5 గంధంలు.


5 ( పంచ తన్మాత్రలు )

1 చెవులు

2 చర్మం

3 కండ్లు

4 నాలుక

5 ముక్కు


5 ( పంచ ప్రాణంలు )

1 అపాన

2 సామనా

3 ప్రాణ

4 ఉదాన

5 వ్యాన


5 ( అంతఃర ఇంద్రియంలు ) 5 ( కర్మఇంద్రియంలు )

1 మనస్సు

3 బుద్ది

3 చిత్తం

4 జ్ఞానం

5 ఆహంకారం


1 వాక్కు

2 పాని

3 పాదం

4 గుహ్యం

5 గుదం


6 ( అరిషడ్వర్గంలు )

1 కామం

3 క్రోదం

3 మోహం

4 లోభం

5 మదం

6 మచ్చార్యం


3 ( శరీరంలు )

1 స్థూల శరీరం

2 సూక్ష్మ శరీరం

3 కారణ శరీరం


3 ( అవస్తలు )

1 జాగ్రదవస్త

2 స్వప్నవస్త

3 సుషుప్తి అవస్త


6 ( షడ్బావ వికారంలు )

1 ఉండుట

2 పుట్టుట

3 పేరుగుట

4 పరినమించుట

5 క్షిణించుట

6 నశించుట


6 ( షడ్ముర్ములు )

1 ఆకలి

2 దప్పిక

3 శోకం

4 మోహం

5 జర

6 మరణం


7 ( కోశములు ) ( సప్త ధాతువులు )

1 చర్మం

2 రక్తం

3 మాంసం

4 మేదస్సు

5 మజ్జ

6 ఎముకలు

7 శుక్లం


3 ( జీవి త్రయంలు )

1 విశ్వుడు

2 తైజుడు

3 ప్రఙ్ఞాడు


3 ( కర్మత్రయంలు )

1 ప్రారబ్దం కర్మలు

2 అగామి కర్మలు

3 సంచిత కర్మలు


5 ( కర్మలు )

1 వచన

2 ఆదాన

3 గమన

4 విస్తర

5 ఆనంద


3 ( గుణంలు )

1 సత్వ గుణం

2 రజో గుణం

3 తమో గుణం


9 ( చతుష్ఠయములు )

1 సంకల్ప

2 అధ్యాసాయం

3 ఆభిమానం

4 అవధరణ

5 ముదిత

6 కరుణ

7 మైత్రి

8 ఉపేక్ష

9 తితిక్ష


10 ( 5 పంచభూతంలు పంచికరణ చేయనివి )

( 5 పంచభూతంలు పంచికరణం చేసినవి )

1 ఆకాశం

2 వాయువు

3 ఆగ్ని

4 జలం

5 భూమి


14 మంది ( అవస్థ దేవతలు )

1 దిక్కు

2 వాయువు

3 సూర్యుడు

4 వరుణుడు

5 అశ్వీని దేవతలు

6 ఆగ్ని

7 ఇంద్రుడు

8 ఉపేంద్రుడు

9 మృత్యువు

10 చంద్రుడు

11 చతర్వకుడు

12 రుద్రుడు

13 క్షేత్రజ్ఞుడు

14 ఈశానుడు


10 ( నాడులు ) 1 ( బ్రహ్మనాడీ )

1 ఇడా నాడి

2 పింగళ

3 సుషుమ్నా

4 గాందారి

5 పమశ్వని

6 పూష

7 అలంబన

8 హస్తి

9 శంఖిని

10 కూహు

11 బ్రహ్మనాడీ


10 ( వాయువులు )

1 అపాన

2 సమాన

3 ప్రాణ

4 ఉదాన

5 వ్యానా

6 కూర్మ

7 కృకర

8 నాగ

9 దేవదత్త

10 ధనంజమ


7 ( షట్ చక్రంలు )

1 మూలాధార

2 స్వాదిస్థాన

3 మణిపూరక

4 అనాహత

5 విశుద్ది

6 ఆఙ్ఞా

7 సహస్రారం


( మనిషి ప్రమాణంలు )

96 అంగళంలు

8 జానల పోడవు

4 జానల వలయం

33 కోట్ల రోమంలు

66 ఎముకలు

72 వేల నాడులు

62 కీల్లు

37 మురల ప్రేగులు

1 సేరు గుండే

అర్ద సేరు రుధిరం

4 సేర్లు మాంసం

1 సరేడు పైత్యం

అర్దసేరు శ్లేషం


( మానవ దేహంలో 14 లోకలు ) పైలోకలు 7

1 భూలోకం - పాదాల్లో

2 భూవర్లలోకం - హృదయంలో

3 సువర్లలోకం - నాభీలో

4 మహర్లలోకం - మర్మంగంలో

5 జనలోకం - కంఠంలో

6 తపోలోకం - భృమద్యంలో

7 సత్యలోకం - లాలాటంలో


అధోలోకలు 7

1 ఆతలం - అరికాల్లలో

2 వితలం - గోర్లలో

3 సుతలం - మడమల్లో

4 తలాతలం - పిక్కల్లో

5 రసాతలం - మొకల్లలో

6 మహతలం - తోడల్లో

7 పాతాళం - పాయువుల్లో


( మానవ దేహంలో సప్త సముద్రంలు )

1 లవణ సముద్రం - మూత్రం

2 ఇక్షి సముద్రం - చేమట

3 సూర సముద్రం - ఇంద్రియం

4 సర్పి సముద్రం - దోషితం

5 దది సముద్రం - శ్లేషం

6 క్షిర సముద్రం - జోల్లు

7 శుద్దోక సముద్రం - కన్నీరు


( పంచాగ్నులు )

1 కాలగ్ని - పాదాల్లో

2 క్షుదాగ్ని - నాభీలో

3 శీతాగ్ని - హృదయంలో

4 కోపాగ్ని - నేత్రంలో

5 ఙ్ఞానాగ్ని - ఆత్మలో


7 ( మానవ దేహంలో సప్త దీపంలు )

1 జంబు ద్వీపం - తలలోన

2 ప్లక్ష ద్వీపం - అస్తిలోన

3 శాక ద్వీపం - శిరస్సుప

4 శాల్మల ధ్వీపం - చర్మంన

5 పూష్కార ద్వీపం - గోలమందు

6 కూశ ద్వీపం - మాంసంలో

7 కౌంచ ద్వీపం - వేంట్రుకల్లో


10 ( నాధంలు )

1 లాలాది ఘోష - నాధం

2 భేరి - నాధం

3 చణీ - నాధం

4 మృదంగ - నాధం

5 ఘాంట - నాధం

6 కీలకిణీ - నాధం

7 కళ - నాధం

8 వేణు - నాధం

9 బ్రమణ - నాధం

10 ప్రణవ - నాధం.ఓం. శనైశ్చ రాయనమః


సృష్టి – అర్థము, స్వభావము:

ఈ పదార్థ విశ్వం పరమాత్మ పొందిన పరిణామం కాదు అలాగని అది తనంతతానుగా వచ్చింది కాదు. పదార్థం, జీవుల యొక్క గర్భంలో పరమాత్మ వలన కలిగిన అంత: చైతన్యం వలన ఈ సృష్టి ప్రారంభమైంది. సృష్టి భగవంతుని అపారమైన కరుణకు, శక్తికి ఒక ప్రతీక. ఈ

విధమైన సృష్టి చేయాలని పరమాత్మకు ఎందుకు అనిపించింది. అప్పటివరకూ


 


నిద్రాణంగా తనలో ఉన్న సృజనా శక్తిని ఎందుకు జాగృతం చేసి ఈ సృష్టి

చేయవలసిన అవసరం వచ్చింది పరమాత్మకు?

ఈ ప్రశ్నలు అవశ్యం సాధకుల కు వచ్చేవే. అందుకే మధ్వాచార్యులు వీటికి సమాధానంగా చాలా వివరణలు ఇచ్చారు.


సృష్టి ఒక యథార్థ ప్రక్రియ. ఇది ఒక నిరంతర ప్రక్రియ. ఈ ప్రక్రియలో ఉన్న ముఖ్యమైన అంశాలు (కాలము, కర్మ, ద్రవ్యము, స్వభావముతో కూడుకున్న జీవులు) ఎల్లప్పుడూ పరబ్రహ్మంపై ఆధారపడి ఉంటాయి. పరమాత్మ శక్త , వ్యక్త స్థితుల్లో సందర్భానుసారంగా వ్యక్తమౌతూ ఈ సృష్టిని కొనసాగిస్తూ

ఉంటాడు. సర్వజ్ఞత, సత్తా అనే సహజమైన విశేషాలతో పరమాత్మ ఒక కాలక్రమంలో

సృష్టి, లయ అనే పరస్పర విరుద్ధమైన కార్యాలను చేస్తూ ఉంటాడు. ఈ కాలక్రమం

ఎప్పుడు మొదలెైంది మొట్టమొదటగా అనేది సాధకులకు అందే జ్ఞానం కాదు. ఇదే సనాతన జ్ఞానం. ఇది తెలిస్తేనే నేను ద్వైతాన్ని నమ్ముతాను లేదా భగవంతుని

అస్తిత్వాన్ని ఒప్పుకుంటాను అనే వితండ వాదాలకు అతీతమైన జ్ఞానం అది.


సృష్టి ఆదిఎప్పుడు అనేది ముక్త జీవాలకి సైతం అర్థం కాని విషయం. అదే పరమాత్మ తత్త్వం. ఆయనను పూర్తిగా వివరించగల సత్తా వాక్కుకి లేదు కనుక సాధకుల గ్రాహ్యత కు అందని విషయం అందుకే “భూతకృద్భూత భ్రుధ్భావో భూతాత్మా, భూత భావనః, అప్రమేయో హృషీకేశ: పద్మనాభోమరప్రభు:” అని భీష్మునిచే కీర్తించబడ్డాడు శ్రీకృష్ణుడు. జీవులు తీసుకున్న వివిధ ఉపాధులలో ఉండే


 


విశేషాలు, పుట్టే, గిట్టే సమయం వంటి వాటిని సహజమైన కాల భేదాలు (అవి కాలానికి, ఆకాశానికి ఉన్న స్వాభావిక విశేషాలు) నిర్ధారిస్తాయి. అలా

సృష్టించబడిన ఈ విశ్వం తనకు ఆధారభూతమైన పరమాత్మతో నిత్యం సంబంధాన్ని కలిగి ఉంటుంది. పరిపూర్ణుడు, మారని వాడు అయిన పరమాత్మ వలన ఈ విశ్వం నిరంతరం మార్పులు చెందుతూ ఉంటుంది. కాబట్టి ఈ మారే విశ్వం నిరంతరం మారని పరబ్రహ్మతో కలసి ఉంటుంది “ప్రవాహతో అనాది ”. ఇలా స్వతంత్ర – పరతంత్ర మనే ద్వైత భావనలోనే పరమాత్మ తత్త్వం ద్యోతకమౌతుంది అనాదిగా. నిజానికి ద్వైతం మధ్వాచార్యులు మరల సాధకులకు అందించిన అనాదియైన సాధనా విధానం.


మహాప్రళయం -సృష్టి ఆవిర్భావం -ఋషులు – జీవరాసి

అపారమైన జ్ఞాన విజ్ఞానము లకు, సంస్కృతి సంప్రదాయా లకు ఆలవాలమైన దేశం మన భారత దేశం. భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు మూలాధారం ఋషులు, జీవరాశికి మూలపురుషులు ఋషులే. మనను నిత్యమూ నడిపిస్తూ,మనకుసంప్రదాయాన్ని ఇచ్చినవారు ఋషులు. ఈ ఋషులు భౌతికమైన ప్రపంచా నికి తండ్రులు. బ్రహ్మ ముఖం నుండి వేదం పుట్టింది, కాని దానిని మనకు ప్రసాదించినది ఋషులే. ఋషి అంటే మంత్రద్రష్ట, త్రికాలజ్ఞాని, సద్గురువు, వేదవిజ్ఞాన ప్రచారకుడు, తపశ్శాలి , మానవాళికి మార్గదర్శకుడు.


ప్రతి మనిషికి ఎప్పుడో ఒకప్పుడు సందేహం కలుగుతుంది – నేనెవరు, నా మూలపురుషులెవరు, వారి చరిత్ర ఎటువంటిది అని – దీనికి ముందుగా మనం కొంత సృష్టి ఆవిర్భావం గురించి (క్లుప్తంగా ) తెలుసుకొని – ఆ తరువాత మన ఋషులు, మనగోత్రాలు, ప్రవర చెప్పుకొందాం.


మానవులందరికీ మూలపురుషుడు మనువు. మనువు యొక్క సంతతి కాబట్టి మనం మనుషులం.


అసలు ఈ మనువు ఎవరు? సప్తఋషులు ఎవరు? ఇది తెలుసుకొందాం.


మహాప్రళయం తరవాత అనంత జలరాశిలో శయనించిన మహావిష్ణువు యొక్క నాభికమలంలోంచి ఉద్భవించిన బ్రహ్మకు సృష్టి భాద్యతని అప్పచెప్పాడు విష్ణుమూర్తి. కాని ఎలాగో చెప్పలెదు. ఆ నాభికమలం చాలా దూరం వెళ్ళిపోయింది, అక్కడ బ్రహ్మ మాత్రమే ఉన్నాడు. సృష్టి ఎలా చెయ్యాలో తెలియలేదు, తెలుసుకొనేందుకు తపస్సు చేసాడు. ఆ తపస్సులో ఆయనకి అవగతం అయింది – ముందు నేను సృష్టికి హేతువు లైన ఋషులను సృష్టించాలి. అంటే వారికీ ప్రపంచ జ్ఞానము, బ్రహ్మ జ్ఞానము రెండు ఉంటాయన్నమాట. వాళ్ళే మానవాళికి మంచిచెడులు భోధించి చెపుతారు.


 


అలా బ్రహ్మ తలలోంచి మొదట పుట్టినవాళ్ళు – సనక, సనందన, సనాతన, సనత్కుమారులు అనే నలుగురు పుట్టారు. వీరిని బ్రహ్మ మానసపుత్రులు అంటారు. కాని వాళ్ళు సహజంగా బ్రహ్మ జ్ఞానం ఉండటంతో సృష్టి కార్యక్రమం చెయ్యలేమని తపస్సు కు వెళ్లిపొయరు.


తరవాత బ్రహ్మ విశ్వంనందు జీవకోటిని సృష్టించుటకై మనువులను, శతరూప అనే సుందరిని, ప్రజాపతులను, ఋషులను సృష్టించాడు. ఆ తరవాత సృష్టిక్రమం ప్రారంభం అయింది. ఇది మనకి సంబంధించిన విశ్వం. ఇటువంటివి అనేకానేక విశ్వాలు ఉన్నాయని మన పురాణాలు చెపుతున్నాయి.


ఇప్పుడు బ్రహ్మ యొక్క కాలం గురించి తెలుసుకొందాం.


బ్రహ్మ యొక్క ఒక రోజు

“పగటి కాలాన్ని” ఒక

” కల్పము ” అంటారు. ఈ పగటి కాలాన్ని (14) పద్నాలుగు భాగాలుగా చేసి, ఒకొక్క భాగానికి ఒకొక్క మనువుని సృష్టించాడు. ఒకొక్క మనువు కాలం అయిపోగానే మళ్ళా కొత్త మనువుని సృష్టిస్తూఉంటాడు. మనువు, మనువుతో పాటు ప్రజాపతులు, సప్తఋషులు, రుద్రులను, ఇంద్రుడు, దేవతలు ఇలా.,


బ్రహ్మ ఒక రోజు పగటి కాలం (కల్పము ) = 1000 మహాయుగాలు (432,00,00,000 మానవ సంవత్సరాలు)


(43,20,000X 1000) (432 కోట్లు సంవత్సరాలు)


ఒక మహాయుగం = కృతయుగం + త్రేతాయుగం + ద్వాపరయుగం + కలియుగం (చాతుర్యుగాలు )


కలియుగం = 4,32,000 సం.।।లు


ద్వాపరయుగం = (432000 X 2) = 8,64,000సం.।।లు


త్రేతాయుగం = (432000X 3) = 12,96,000సం.।।లు


కృత(సత్య)యుగం = (432000X 4)= 17,28,000సం.।।లు


మొత్తం 43,20,000 సం.।।లు


బ్రహ్మగారి పగలు కాలం అంటే 1000 మహా యుగాలు పూర్తి అయితే ఒక మహాప్రళయం వస్తుంది. (end of kalpa ). భూమి, జీవకోటి మొత్తం ప్రళయంలో అంతం అయిపోతుంది, కాని విశ్వం ఉంటుంది. బ్రహ్మ గారి 1000 మహా యుగాల రాత్రి సమయం గడిచాక మళ్ళా సృష్టి పునరావృతం అవుతుంది.


1000 మహా యుగాలు పగలు + 1000 మహా యుగాలు రాత్రి కలిపితే బ్రహ్మ ఒక రోజు. దీన్ని మహాకల్పముఅంటారు. ఇలాంటి 360 రోజులైతే ఒక సంవత్సరం. బ్రహ్మ ఆయుర్దాయం 100 (దేవ) సంవత్సరాలు.


 


ప్రస్తుత బ్రహ్మ గారికి (మన గెలాక్సీ) మన శాస్త్రాల ప్రకారం 50 సంవత్సరాలు ( దేవ సంవత్సరాలు) గడచిపోయాయి.


ప్రస్తుతం బ్రహ్మగారి 51 వ సంవత్సరంలో పగటి కాలం 7వ మనువు కంట్రోల్ లో మనం ఉన్నము.


మనువు – మన్వంతరాలు:

ఇప్పుడు ఏదైతే జరుగుతోందో ఆ కల్పానికి (day of brahma) “శ్వేతవరాహ కల్పము ” అని పేరు. బ్రహ్మగారి పగటి కాలాన్ని (14) భాగాలు చేసి ఒకో భాగానికి ఒకో మనువును appoint చేసారని మనం చెప్పుకొన్నాం.


ఈ ప్రకారం ఒక మనువు కాలం = 71 మహాయుగాలు = 308571414 (మానవ)సంవత్సరాలు (71+కృతయుగ(approx )

ప్రస్తుతం మనం 7వ మనువైన “వైవస్వతమనువు” కాలంలో ఉన్నాము. దీన్ని “వైవస్వత మన్వంతరం” అంటారు.


ఈ “వైవస్వతమన్వంతరం” లో 27 మహాయుగాలు గడచిపోయాయి. ఇప్పుడు మనం 28వ మహాయుగంలో నాలుగవదైన కలియుగంలో ఉన్నాము. (ఈ మహాయుగం లో మొదటి మూడు యుగాలు గడచిపోయాయి). కలియుగంలో ఇప్పటికి 5116 సంవత్సరాలు (out of 4,32,000 years) గడచిపోయాయి.


పూజ చేసుకొనే టప్పుడు సంకల్పం లో చెప్పుకొంటాము(మనం ఎక్కడ ఉన్నాం ఏ కాలంలో ఉన్నాం ) — శ్వేతవరాహకల్పే, వైవస్వతమన్వంతరే, కలియుగే, ప్రధమపాదే, జంబూద్వీపే, భరతఖండే…


“వైవస్వతమనువు” గారు సృష్టి కార్యక్రమం చేపట్టి 27 మహాయుగాలుఅయిపొయింది (27X 43,20,000). ఇప్పుడు మనం 28వ మహాయుగంలో నాలుగవదైన కలియుగంలో ఉన్నము. కలియుగం ప్రవేశించి 5116 సంవత్సరాలు అయింది( ఇంకా 4,32,000-5116=4,26,884 ఉంది ). మనువుల వివరాలు కొన్నికొన్ని పురాణాల్లో కొంతకొంత తేడాలతో ఉన్నాయి. ముఖ్య ప్రమాణం భాగవతం, విష్ణుపురాణం.


సంక్షిప్తంగా ఈ కల్పం యొక్క కాలపరిమితులు ఇవి.

మనువు మారినప్పుడల్లా అంటే మన్వంతరంలో (71 మహాయుగాల అనంతరం) ప్రళయం వస్తుందా అంటే వస్తుంది అనే చాల పురాణాలు చెపుతున్నాయి, కాని అది కల్పాంతం అంటే బ్రహ్మగారి పగలు ముగిసి రాత్రి మొదలు అయ్యేటప్పుడు వచ్చేప్రళయం లా మొత్తం solar system అంతా లయం కాదు అంటున్నాయి.


మన పురాణాల్లో మూడు రకాలైన ప్రళయాలు చెప్పబడ్డాయి.

1. ప్రాకృతిక ప్రళయం లేదా మహాప్రళయం 311040000000000(311trillion 40billion ) అంటే బ్రహ్మగారి 100 దేవసంవత్స రాల ఆయుర్దాయం తరవాత. (బ్రహ్మగారి ఒక పగలు కాలం =4320,000000X 2 X 100) మొత్తం విశ్వం, పంచభూతాలు అంతా వినాశనం అవుతుంది. ఆ తరవాత పునః ప్రారంభం మొదలు పెడతారు with new brahma.


2. నైమిత్తిక ప్రళయం లేదా కల్పాంతం – అంటే బ్రహ్మ గారి ఒక పగలుకాలం – 4320,000000 (432 కోట్ల సంవత్సరాలు) అప్పుడొచ్చే ప్రళయంలో అన్ని జీవరాసులు నశించిపోతాయి, భూమి కుంగి పోతుంది, కాని విశ్వం ఉంటుంది – ఆయన రాత్రి నిద్రకి వెళ్ళేటప్పుడు జీవకోటి నంతా నాశనం చేసి మళ్ళా ఉదయం సృష్టి మొదలు పెడతారు


 


3. మన్వంతర ప్రళయ : ఒక మనువు కాలం అంటే 71 మహాయుగాలు (30.7 కోట్లు సంవ ) అప్పుడుకూడా ప్రళయం వస్తుంది, కానీ కల్పాంతం అంత పెద్దది కాదు, కాని ఇక్కడ కూడా జీవకోటి చాలా నశించిపోతుంది. భూమి కూడా కుంగుతుంది.


ఇవి కాక ఒక మహాయుగం అంటే (4) చాతుర్యుగాలు పూర్తి అయినప్పుడు ఒక ప్రళయం, జీవకోటికి అపార నష్టం కలుగుతుంది.ఇది కాక ఇంకా సౌర కుటుంబంలో వచ్చే ప్రళయాలు చాలా చెప్పారు మన పురాణాల్లో.


అన్ని పురాణాలలోను మహాప్రళయం ఒక భయంకరమైన వర్షంతో (deluge ) మొదలవుతుందని సమస్త ప్రాణికోటి నీటిలో పరిసమాప్తి అవుతుందని, భగవంతుడు ఒక మనిషిని సాక్షీభూతంగా భవిష్యత్తు మానవాళి కోసం ఎన్నుకొంటా డని అతడే మనువు (వైవస్వతమను) అని చెపుతున్నయి.బైబిల్లో కూడా ప్రళయం ఇంచుమించు ఇదే విధంగా వర్ణించారు – బైబిల్ ప్రకారం ఆ మానవుడు నోహ్ (NOAH). BIG BANG THEORY ప్రకారం ప్రళయం తరువాత విశ్వంలో జరిగే మార్పులు కూడా కొచెం ఇంచుమించులో ఇంతే.


మొత్తం మీద సారాంశం ఏమిటంటే ఈ విశ్వం సృస్టించ బడుతూ, లయం చెయ్యబడుతూ, మళ్ళా సృజించబడుతూ ఈ కాలచక్రాన్ని ఆ పరబ్రహ్మ (brahman ) అంటే అనంత శక్తిస్వరూపం దీన్ని ఇలా నడిపిస్తోంది. దీనికి ఆది లేదు అంతం లేదు, చావు, పుట్టుకల మద్యలో కాలచక్రం ఇలా తిరుగుతూ ఉంటుంది .


మరి ఎప్పటివో ఈ విషయా లన్నీ మానవులకి ఎలా తెలిసాయి. జ్ఞాన, అజ్ఞానాల మధ్యలో మనుషులు ఎలా కొట్టుమిట్టాడుతున్నారు. వీళ్ళకి మార్గదర్శకులు ఎవరు?


పూర్వకల్పంలో బ్రహ్మ మొదట సృష్టించిన అతడి మానస పుత్రులు సనకసనందనాదులు వాళ్ళు బ్రహ్మ జ్ఞానంతో సృష్టి కార్యంలో పాలుపంచుకొలెదు. తరవాత బ్రహ్మ ప్రజపతులను, దేవతలను, ఋషులను సృష్టించాడు. వాళ్ళే ఈ సృష్టిలో జ్ఞానులై పుట్టటం, సంతతిని వృది చెయ్యటం జరిగింది. బ్రహ్మ ఉద్దేశ్యం ఏమిటంటే – మనుషులు పెళ్ళిచేసుకోవాలి పిల్లల్ని కనాలి సంతానం వృది చెయ్యాలి భూమి కళకళ లాడాలి – ఇలా ఉండాలంటే వారికీ అవిద్య,అజ్ఞానం, దేహత్మభావన, దేహాభిమానం – ఇట్లాంటి లక్షణాలుంటే తప్ప మనుషులు వృది పొందరు. అందరూ శుద్ధజ్ఞానంలో ఉంటె సృష్టి జరగదు. కాబట్టి మనుషులలో అవిద్య, అజ్ఞానం ప్రవేశపెట్టారు.


ఈ సృష్టి రహస్యం, జీవకోటి లక్షణాలు అంతా సంపూర్ణంగా తెలిసినవారు, జగత్తు యొక్క భూత, భవిష్యత్, వర్తమానా లు తెలిసినవారు, జీవులకు ఏది క్షేమకరమో అది తెలిసిన వారు మహర్షులు. ఆద్యంతమూ సృష్టి రహస్యం తెలిసి, వాళ్ళ కర్తవ్యం నిర్వహిస్తూ మనకి కర్తవ్య భోధ చేస్తూ, పుట్టబోయేవారి యోగక్షేమాలు కూడా ఆలోచించే వారు మహర్షులు . అనేకమంది మహర్షులు ఆర్య సంస్కృతిని రక్షించి జీవకోటిని ఉద్దారించారు, వేదములు, దర్శనములు, స్మృతులు మొదలైన వాజ్మయప్రపంచాన్ని ఈ ప్రపంచానికి అందించారు.


ఇటువంటి మహనీయుల వంశపరంపరలో జన్మించిన మనకి మన గోత్రములు, ఋషులు తప్పక తెలియాలి, తెలుసుకోవటం మన ధర్మం. సంధ్యావందనం లో ప్రతి రోజు గోత్ర ప్రవరలు చెప్పుకోవాలని మన ధర్మశాస్త్రం చెపుతుంది.


ప్రతిమనిషికి విద్యావంశము, జన్మ వంశము ఉంటాయి . జన్మవంశము అంటే తండ్రి, తాత,ముత్తాత పేర్లు,

విద్యా వంశము అంటే తన గురువు నుండి వారి గురువు వారినుండి భగవంతుని వరకు. ఈ రెండూ కాక గోత్ర ప్రవర ప్రతివాళ్ళకి తెలియలి. గోత్రమున ఏ ఋషి పేరుంటుందో అతడే మన వంశమునకుమూలపురుషుడు, అతనినుండి ఈ వంశము ఆవిర్భవించింది, ఆ ఋషి యొక్క శిష్యులు, వారి శిష్యులు లేదా ఋషి తండ్రి, తాత, సోదరులు, ఇలా ప్రతి వంశానికి(1),(2), (3),(5),(7),(9) ఇలా ఋషులు ఉంటారు . మన పుట్టుకకి ఆధారమైన ఈ మహనీయులని మనం రోజు స్మరించుకోవాలి. వారి చరిత్రలు తెలుసుకోవాలి. ఋషి సమూహమున సప్తఋషులు పరమ పూజ్యులు నక్షత్ర రూపమున ఇప్పటికి దర్శనమిస్తున్నారు . వీరే కాకా జమదగ్ని, గౌతమ, వశిష్ట ఇలా చాల మంది మూల ఋషులుగా కలిగిన సుమారు (49) గోత్రముల ఋషి మూలములు ఉన్నట్లుగా అంచనా.


ప్రవర:

ప్రవర అంటే శ్రేష్టుడు అని అర్ధం. ప్రవర అంటేఎంతమంది శ్రేష్టులైన ఋషులు ఆ గోత్రంలో ఉన్నారో తెలియచెప్పేది.

Thursday, August 5, 2021

అంతః కరణ శుద్ధి- Anthahkarana Suddi

 🧘‍♂️అంతః కరణ శుద్ధి🧘‍♀️















అంతః కరణ శుద్ధి ఎట్లా వస్తుంది?..


భగవంతుని కోసం నిరంతరం పరితపించటాన్నే "తపస్సు" అంటారు.

మనోవాక్కాయకర్మల యందు అధ్యాత్మిక చింతనతో తపించటాన్నే తపస్సు అంటారు. నిత్యకృత్యాలు నెరవేరుస్తున్నా భగవంతునితో అనుసంధానం అయి ఉండే కార్యాచరణను కావించటాన్నే తపస్సు అంటారు. ఈ విధంగా ప్రతి మానవుడు పారమార్థిక ఆత్మనిగ్రహ ప్రయత్నాన్ని ఒక్కొక్క తపస్సుగా గ్రహిస్తాడు.

అట్లా తపస్సు చేయటం చేత మల విక్షేప ఆవరణాలు అనే త్రివిధ దోషాలు తొలగిపోతాయి. శ్రవణం చేత మల దోషం తొలగుతుంది. మననం చేత విక్షేప దోషం తొలగుతుంది. నిరంతర ధ్యానమనే నిది ధ్యాస చేత ఆవరణ దోషం తొలగుతుంది. ఈ విధంగా మనస్సుని శరీరాన్ని శుద్ధి చేసుకొన్న వారికి పాపాలు క్షీణిస్తాయి. వాసనాక్షయం జరుగుతుంది.

పూర్వ జన్మ వాసనలు క్రమేపీ తొలగుతాయి. ఆ విధంగా మనస్సు పాపవాసనాక్షయం చేకూర్చుకోగానే ప్రశాంతత నొందిన రూపం మనస్సుకు చేకూరుతుంది. శారీరకమైన ఆవేదనల్నీ, ఇంద్రియలోలత్వాన్ని బుద్ధిపూర్వకంగా నిగ్రహించుకోవటంవల్ల మానవునికి ప్రశాంతత ఏర్పడుతుంది.

కావున శారీరకంగాను, మానసికంగాను, తపస్సనేధనాన్ని పొందాలి. తపస్సు చేయాలంటే ఇల్లు విడిచి పెట్టాలి, అడవులు పట్టాలి, ఆశ్రమాలు చేరాలి అని కాదు. ప్రతి మానవుడు తాను జీవించే విధానంలో, తన పరిసరాల్లో ఆ వాతావరణాన్ని పెంపొందించుకోవాలి. తన ఇల్లే తనకు, తపస్సుకు కూడా అనుకూలంగా కుదిరేటట్లు మార్చుకోవాలి. తాను మారాలి. ఎందుకు ? మోక్షాకాంక్ష ఉండబట్టి.

మానవుడై పుట్టిన ప్రతివాడిని భగవంతుడు తనను చేరమని, చేరటానికి దారితెలుసుకోమని (నిర్దేశించాడు, ఉద్దేశించాడు) ఏర్పరిచాడు. మానవుడు దాన్ని మర్చిపోయి జీవిస్తున్నాడు. అట్లా కాకుండా మానవుడు త్రికరణ శుద్ధిగా తపస్సంపన్నుడు కావాలి. దేనికి? ఆనందం కోసం - మానవుడు కర్మేంద్రియాలను అరికట్టినా మనస్సు మాత్రం విషయాలన్నిటినీ తలపోస్తూ బహిర్ముఖంగా సంచరిస్తూ గడుపుతుంది.

ఆనందం ఎక్కడ ఉంది? ఆనందం ఆత్మలోనే ఉంది. ఆత్మానందమే నిజమైన సచ్చిదానందం. దానికి ఆత్మజ్ఞానం కలిగితే మానవుడు సక్రమ మార్గంలో జీవించటానికి వీలు కలుగుతుంది.

నిషిద్ధమైన కర్మల్ని ఆచరించకుండా ఉంటే మనో మాలిన్యమనే పాపం పేరుకోకుండా ఉంటుంది. పాపం చెయ్యకుండా ఉండటమే కాదు, మానసికమైన వికారాలు కూడా లేకుండా చూసుకోవాలి. మనిషి మాత్రం ప్రశాంతంగా కూర్చొని ఉంటాడు. కాని మనస్సు పరిపరివిధాల  ఉంటుంది. మానవుడు కర్మేంద్రియాలను అరికట్టినా మనస్సు మాత్రం విషయాలన్నిటినీ తలపోస్తూ బహిర్ముఖంగా సంచరిస్తూ గడుపుతుంది.

ఈ ఆధునిక కాలంలో మానవులందరిలోను జరుగుతున్న నిత్య కృత్యం ఈ మానసికమైన సరికాని ఆలోచనా విధానం. దాన్ని అన్ని విధాల అరికట్టాలి. దాన్ని అరికట్టటానికి మనస్సుకి తోడుగా ఆత్మ అనే భగవంతుని దానికి అందించి, ఆత్మతో మనస్సు అనురక్తమై జీవించే విధానాన్ని అలవడేటట్లు చెయ్యాలి. దానివల్ల అంతఃకరణశుద్ధి ఏర్పడుతుంది. దీనికి వివేకం, వైరాగ్యం తోడయితే లక్ష్యం సిద్ధిస్తుంది. బంగారానికి తావి అబ్బినట్లు అవుతుంది.

అయితే పాపాలు నశించి, ప్రశాంతత చేకూరి, సాధకుడు మోక్షం కోసం జీవించాలంటే అనురాగం కూడా నశించినవాడై ఉండాలన్నారు. విషయాల్ని దూరం చేసినంత మాత్రం చేత రాగం నశించదు. విషయంతోపాటు దానియందలి అనురాగం కూడా దూరం కావాలి అంటే మనస్సుకి ఆత్మ అనే భగవంతునితో అనుసంధానం చేకూరిస్తేనే రాగం కూడా నశిస్తుంది. సాధకుడు అభిమానం, అహంకారం వంటి వాటికి తనలో స్థానం ఏర్పరుచుకొంటే ప్రత్యేకమైన కోరికలకు అది నిలయం అవుతుంది.

కావున సాధకుడు అభిమానం, అహంకారం అనే వాటికి స్థానం లేకుండా చేసుకొంటూ వెళ్ళాలి. అప్పుడు కోరికలకు స్థానం లేకుండా పోతుంది. మనస్సుకి నిస్సంకల్ప స్థితి చేకూరుతుంది. అదే మోక్షాన్ని కాంక్షించటానికి తగిన స్థితి.

మోక్షం అంటే మనస్సుని, శరీరాన్ని ఆత్మ నుంచి శరీరం ఉండగానే, చైతన్యం ఉండగానే వేర్పాటు చేయటం అన్నమాట. మనస్సుని ఆత్మలో లయమయ్యేటట్లు చెయ్యటం అన్నమాట. మోక్షం అంటే మరణించిన తర్వాత పొందేదని చాలా మంది భ్రమపడుతుంటారు. అది తప్పు.

బ్రతికి ఉండగానే ఆత్మతో జీవించగలిగేటట్లు సాధనలో సాధ్యమయ్యేటట్లు చేసుకోవటమేకాని మరొకటి కాదు. సాధనలో మెలకువలో నిద్రను, నిద్రలో మెలకువను అనుభవించాలి. అదే మోక్షం.

ఎవరి అనుభూతిని వాళ్ళే పొందాలి. ఎవరి నిగ్రహానికి తగిన విధంగా వాళ్ళవాళ్ళకు తగిన అనుభవం సాధనలో చేకూరుతూనే ఉంటుంది. దాన్ని ఎంత అని ప్రతినిత్యం కొలవటం కాదు చేయవలసింది.

ఆత్మ అనే భగవంతునితో అనుసంధానమై ఆత్మసాధన కొనసాగిస్తూ జీవించటం నేర్చుకోవాలి. కొద్దిపాటి శ్రద్ధాసక్తులు కలిగిన ప్రతివాళ్ళు దీన్ని అనుభూతి పొందుతారు.

ఆ నమ్మకంతో, ఆ పట్టుదలతో, నిరంతర తపనతో, ఆత్మ జ్ఞానం కోసం ఆనందం పొందాలనేకునే వారందరూ ఆత్మ మార్గంలో సాధన చెయ్యాలి.

Saturday, July 17, 2021

సమాధి స్థితి - దశ విధ నాదాలు :

 సమాధి స్థితి - దశ విధ నాదాలు :



     సాధకుడు ఎడతెగని నిష్ఠతో సాధనలో ఉన్నపుడు....కుండలినీ శక్తి మేల్కొని, అనాహత చక్రం చైతన్య వంతమైతే "దశ విధ నాదాలు" అనుభవానికి వస్తాయి. కుండలినీ శక్తి ఆజ్ఞా చక్రంలో స్థిర పడితే, రక రకాల కాంతులు అనుభవానికి వస్తాయి. ఈ కాంతులనే "చిత్కళలు" అంటారు. కూటస్త చైతన్యమునే "బిందువు" అంటారు. అయితే ఇవన్నీ లయం కావలసిందే. అప్పుడు నిర్వికల్ప సమాధి సిద్ధించును.


నాద యోగాభ్యాసంలో భాగంగా,  ప్రణవ సాధన చేసేవారికి....మొదటి దశలో, లోపలి నాదం అనేక రకాలుగా వినిపిస్తుంది. నిరంతరం, దీక్షగా అభ్యాసం చేస్తూ ఉంటే, చివరికది సూక్ష్మ నాదంగా పరిణమిస్తుంది. ప్రారంభంలో, లోపల నుండి (1). సముద్ర ఘోష  (2). మేఘ ఘర్జన (3). భేరీ నాదం (4). నదీ ప్రవాహం చప్పుడు.......వినిపిస్తుంది. అయితే ఈ నాదాలు ప్రణవం యొక్క వివిధ పరిణామ రూపాలే. సాధన మధ్య దశలో 1. మద్దెల శబ్దం 2. ఘంటా నాదం 3. కాహళ నాదం వినిపిస్తాయి. ఇవన్నీ, కుండలినీ శక్తి జాగృతిలో, "నాదానుసంధాన" యోగ సాధనలో, ధ్యానావస్థల్లోని...పరిపూర్ణ దశలలో వినిపించే నాదాలివి. ఈ ప్రణవ అభ్యాసం చివరి దశలో, చిరుమువ్వల చప్పుడు, మధురమైన వేణు గానం, తుమ్మెద ఝంకారం....లాంటి వివిధ నాదాలు....అత్యంత సూక్ష్మంగా సాధకునికి వినిపిస్తాయి. 


  సాధకుడు, తన సమాధి స్థితిలో నాదాన్ని వింటూన్నపుడు, మధ్యలో మహాభేరీ నాదాలు కూడా వినపడతాయి. ఆ సమయంలో, దాని వెనుకే....అత్యంత సూక్ష్మ నాదాలు వినపడతాయి. ఈ నాదాలను కూడా జాగ్రత్తగా వినాలి. సూక్ష్మ నాదాలు వింటూ...పెద్ద ధ్వనులను విడిచి పెట్టాలి. అలాగే పెద్ద ధ్వనులు వినేటపుడు, సూక్ష్మ నాదాలు విడిచి పెట్టాలి. ఇలా నిరంతరం నాదాభ్యాసం చేస్తున్నపుడు, మనస్సు ఒక నాటికి ఏదియో ఒక నాదంపై ఏకాగ్రతను పొంది, మనోలయం జరుగుతుంది. మనోలయమే కదా, కావలసింది

Tuesday, July 13, 2021

సప్త జ్ఞాన భూమికలు- సూర్యుడి నుండి వచ్చే ఏడు కిరణాలు- The seven rays coming from the sun

 సప్త జ్ఞాన భూమికలు

  నుండి వచ్చే ఏడు కిరణాలు ను సప్త జ్ఞాన భూమికలు అంటారు...

 

జ్ఞానంలో ఏడు స్థితులున్నాయి. వీటిని సప్త జ్ఞాన భూమికలు అంటాం...

1) శుభేచ్ఛ

2) విచారణ

3) తనుమానసం

4) సత్త్వాపత్తి

5) అసంసక్తి

6) పదార్ధభావని

7) తురీయం

 

..అన్నవే సప్త జ్ఞాన భూమికలు.

 

1) శుభేచ్ఛ...

 నాకు బ్రహ్మజ్ఞానం కావాలి అన్న ఇచ్ఛ నేను శాశ్వత దుఃఖరాహిత్య పదవి పొందాలి అన్న తీవ్ర ఆకాంక్ష.

 

2) విచారణ...

 బ్రహ్మజ్ఞాన ప్రాప్తి ఏ విధంగా పొందాలి.. అన్న మీమాంస "బ్రహ్మజ్ఞాన" ప్రాప్తి విధానమే.. ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం అని తెలుసుకోవడం.

 

3) తనుమానసం...

 ఇంక విచారణ ద్వారా సాధనా మార్గం తెలుసుకున్నాం గనుక, తత్ సాధనలో నిమగ్నులై ఉండడమే తనుమానసం. అంటే, ధ్యాన, స్వాధ్యాయ, సజ్జన సాంగత్యాలకు ఏ రోజూ విఘ్నం లేకుండా గడపడం. అదే "తనుమానసం"

 

4) సత్త్వాపత్తి... 

శుద్ధసాత్త్వికం సాధించడమే సత్త్వాపత్తి, అంటే తమోగుణం, రజోగుణం అన్నవి పూర్తిగా శూన్యమైన స్థితి. ఇక మిగిలింది శుద్ధ సాత్త్వికమే...

 

      "తమోగుణం" అంటే సోమరితనం

      "రజోగుణం" అంటే నాకు తెలుసు అనే అధికార దర్పం.

 

ఈ నాల్గవ జ్ఞానభూమిక ధ్యాన, స్వాధ్యాయ, సజ్జన సాంగత్యాల సాధన తీవ్రస్థాయి నందుకునే స్థితి; ఆ తీవ్రత ద్వారా నాడీమండలం పూర్తిగా శుద్ధమైన స్థితి; మనస్సు పూర్తిగా కంట్రోలు అయిన స్థితి; అదే యోగి అయిన స్థితి. అహం బ్రహ్మాస్మి అని చక్కగా సిద్ధాంతపరంగా తెలుసుకున్న స్థితి. బ్రహ్మవిదుడు అయిన స్థితి.

 

5) అసంసక్తి...

 దివ్యచక్షువు ఉత్తేజితమవుతున్న స్థితి. తనువు, మరి సంసారం, రెండూ తాత్కాలికమైనవే అని సంపూర్ణంగా తెలుసుకున్న స్థితి. కనుక, ఈ రెంటి మీద పూర్తిగా అనాసక్తి పొందిన స్థితి; అదే అసంసక్తి. దీన్నే పద్మపత్రమివాంభసా అన్నాడు కృష్ణుడు గీతలో. అయితే ఇతనికి సంసారంలో అసంసక్తి వున్నా, ధర్మ-నిష్టుడు, మరి కర్మ – నిష్టుడు; తనువు పట్లా, మరి సంసారం పట్లా తటస్థ దృష్టి కలిగి వున్నవాడు. దివ్యచక్షువు ఉత్తేజితమైంది కనుక, సత్యద్రష్ట కాబోతున్నాడు కనుక, పూర్తిగా దాని మీదే ఆసక్తినీ, ఏకాగ్రతనూ నిలిపినివాడు. ఇదే అసంసక్తి. ఇతనినే బ్రహ్మవిద్వరుడు అంటాం.

 

6) పదార్ధభావని

 అంటే దివ్య చక్షువును క్షుణ్ణంగా ఉపయోగించుకుంటున్నవాడు. ప్రతి పదం యొక్క అర్ధంలో, ప్రతి వస్తువు యొక్క భావంలో ప్రత్యక్షంగా నివసిస్తున్న వాడు. అంటే బ్రహ్మవిద్వరీయుడు అయిన స్థితి. ఇదే సిద్ధస్థితి; ఇదే సవికల్ప సమాధిస్థితి కూడా. అంటే ఎన్నో సమాధానాలు దొరికినా ఇంకా కొద్దిగా, సంశయాలు వున్న స్థితి.

 

7) తురీయం...

 ఇది మానవుని యొక్క పూర్ణవికాసస్థితి, సిద్ధుడు బుద్ధుడు అయిన స్థితి. అందరినీ యోగులుగా, సిద్ధులుగా, బుద్ధుళ్ళుగా మలచడానికి కంకణం కట్టుకొని, తత్ పరిశ్రమలో పూర్తిగా నిమగ్నమై వున్నవాళ్ళనే "బుద్ధుడు" అంటాం. ఇదే "సహస్రదళకమలం".

 

ఒక్కొక్క మనిషినీ యోగిగా మలచినప్పుడల్లా "సహస్రదళ కమలంలో ఒక్కొక్క రేకు విచ్చుకుంటుంది". ఇతనినే బ్రహ్మ విద్వరిష్టుడు అంటాం.

 

 "తురీయం" అంటే సర్వసామాన్యమైన జాగృత, స్వప్న, సుషుప్త స్థితులను దాటినవాడు. తురీయ అంటే మూడింటినీ దాటిన అని అర్థం. అంటే నిర్వికల్పసమాధి స్థితి కి చేరుకున్న స్థితి. సమాధి అంటే సమాధానాలు తెలుసుకున్న స్థితి. నిర్వికల్ప సమాధి అంటే ఏ సందేహాలూ, ఏ సంశయాలూ లేని స్థితి.