Translate

Sunday, April 6, 2025

శ్రీ నీల సరస్వతీ స్తోత్రం (Sri Neela Saraswathi Stotram in Telugu )

శ్రీ నీల సరస్వతీ స్తోత్రం (Sri Neela Saraswathi Stotram)

 


ఘోరరూపే మహారావే సర్వశత్రుక్షయంకరీ | భక్తేభ్యో వరదే దేవి త్రాహి మాం శరణాగతమ్ || 1 ||

సురాఽసురార్చితే దేవి సిద్ధగంధర్వసేవితే | జాడ్యపాపహరే దేవి త్రాహి మాం శరణాగతమ్ || 2 ||

జటాజూటసమాయుక్తే లోలజిహ్వానుకారిణీ | ద్రుతబుద్ధికరే దేవి త్రాహి మాం శరణాగతమ్ || 3 ||

సౌమ్యరూపే క్రోధరూపే చండరూపే నమోఽస్తు తే | సృష్టిరూపే నమస్తుభ్యం త్రాహి మాం శరణాగతమ్ || 4 ||

జడానాం జడతాం హంసి భక్తానాం భక్తవత్సలా | మూఢతాం హర మే దేవి త్రాహి మాం శరణాగతమ్ || 5 ||

హ్రూం హ్రూంకారమయే దేవి బలిహోమప్రియే నమః | ఉగ్రతారే నమస్తుభ్యం త్రాహి మాం శరణాగతమ్ || 6 ||

బుద్ధిం దేహి యశో దేహి కవిత్వం దేహి దేవి మే | మూఢత్వం చ హరేర్దేవి త్రాహి మాం శరణాగతమ్ || 7 ||

ఇంద్రాదిదేవ సద్వృందవందితే కరుణామయీ | తారే తారధినాథాస్థే త్రాహి మాం శరణాగతమ్ || 8 ||

అష్టమ్యాం చ చతుర్దశ్యాం నవమ్యాం చ పఠేన్నరః | షణ్మాసైః సిద్ధిమాప్నోతి నాఽత్ర కార్యా విచారణా || 9 ||

మోక్షార్థీ లభతే మోక్షం ధనార్థీ లభతే ధనమ్ | విద్యార్థీ లభతే విద్యాం తర్కవ్యాకరణాదికమ్ || 10 ||

ఇదం స్తోత్రం పఠేద్యస్తు సతతం శ్రద్ధయాన్వితః | తస్య శత్రుః క్షయం యాతి మహాప్రజ్ఞా ప్రజాయతే || 11 ||

పీడాయాం వాపి సంగ్రామే జప్యే దానే తథా భయే | య ఇదం పఠతి స్తోత్రం శుభం తస్య న సంశయః || 12 ||

ఇతి శ్రీ నీల సరస్వతీ స్తోత్రం సంపూర్ణం

🙏జీవజ్ఞానామృత బిందు శక్తి 🙏(దివ్య గ్రంథము నుండి )- Jyothirbaba

 🙏జీవజ్ఞానామృత బిందు శక్తి 🙏(దివ్య గ్రంథము నుండి )



 ఎల్లప్పుడూ నిత్యము ఉండేది సనాతనమైనది ఉనికి లేని స్థితిలో ఉండేటటువంటి ఏదైతే ఉన్నదో అది బిందువుగా చెప్పబడి ఉన్నది స్వయంకృతమున ఆ బిందువు కదలి శబ్దము ఏర్పడి రూపకల్పన జరిగి ఉనికిగా అంతర్గతముగా ఉండి వ్యక్తం చేయుటకు వే రే లేనిదై విభజించుటకు వీలు లేనిదై చలించుటకు వీలులేనిదై ఉన్నది. అదే స్వాత్మ స్వరూపముగా, "నేను" గా సనాతనుడనై సత్య స్థితిలో  తరువాత సూక్ష్మ జగత్తుగా ఏర్పడి అగోచరము అవ్యక్తము అగు ప్రకృతి (అపరా ప్రకృతి)  బిందు  రూపంలో ఓంకార నాదమై తేజస్వర తరంగాలుగా చైతన్యము, జ్ఞానము, శక్తి, అను మూడు శక్తులు వీటి యొక్క క్రమ సంయోగ వియోగ సంయోగాత్మకంగా లోపల సంయోగములతో ఏర్పడినదే జీవజ్ఞానామృత బిందు శక్తి. కంటికి కనిపించని ఈ శక్తి మహా మనస్సు ఇదే మహా తేజస్సు ఇదే మహా ప్రాణము. సమతుల్యతతో కూడిన క్రమ సంయోగ వియోగ సంయోగత్మకమైనటువంటి పరిణామములు చెందుతూ ప్రకృతిగా ఏర్పడినది.మనం అర్థమయ్యే రీతిలో చెప్పుకుందాం అంటే ఒక అణువు తో ఒక అణువు కలిసి అనేకణువులుగా అనేకణువులు కొత్త అణువులతో కలిసి కొత్త అణువులుగా కొత్త పదార్థాలుగా ఒక పదార్థంతో ఒక పదార్థం కలిసి కొత్త పదార్థం ఏర్పడినట్లు మనం రసాయన శాస్త్రంలో చెప్పినట్టుగా ఒకదానితో ఒకటి కలిసి రకరకాలుగా ఫార్మేషన్స్, రియాక్షన్స్, జీవ శాస్త్రంలో కొత్త జీవాలను కొనుగోనుట (బయో టెక్నాలజీ) ఇవన్నీ క్రమసంయోగ వియోగాత్మకమైన నిర్మాణమే. శాస్త్ర సాంకేతిక విజ్ఞానం అంతా కూడా ఈ క్రమ సంయోగ వియోగాత్మకమైనటువంటి పరిణామ రూపమే. మనలో కూడా ఈ క్రమ సంయోగ వియోగాత్మకమైనటువంటి పరిణామములు జరుగుతూనే ఉండును. మన ఇంద్రియములు వినడం ద్వారా చూడడం ద్వారా చెప్పడం ద్వారా అనుభవించడం ద్వారా స్ప్రుశించడం చడం ద్వారా ఈ మనసు వాటితో సంయోగం చెంది తలపులుగా అనుభూతులుగా అనుభవాలుగా నిత్యం ఆగకుండా మార్పు చెందుతూ కర్మలు చేస్తూనే ఉంటుంది. ఈ ప్రకృతి అంతా అణువు మొదలు బ్రహ్మాండము వరకు ఈ జీవ జ్ఞానామృత బిందు శక్తి అన్నింటా ప్రాణముగా, మనసుగా నిండి ఉన్నది. బ్రహ్మాండ జ్ఞానమంతా ఈ జీవ జ్ఞానామృత బిందు శక్తి లో అదృశ్యముగా దాగి ఉన్నది. ప్రతి జీవిలో ఇది అజ్ఞాతముగా అవిభాజ్యమై( విభజించుటకు వీలు లేనిది ) తేజస్వరతరంగమైన నాదముగా అదే శబ్దముగా ఉన్నది కనుక మనము మనలోనున్న నాదముచే సంవిధానము కావించుకొనిన ఎడల  ఆ జీవజ్ఞానామృత స్థితిని చేరి జ్యోతి స్వరూపము పొందెదము.ఆది అంతము లేని శుద్ధ నిశ్శబ్దముగా ఉండెదము. దీన్నే బాబాజీ సృష్టి స్థితి లయ కారకుడు నీవే అని నీవే సృష్టికర్తవని స్వాత్మ వై నీలో నీవు ఉండి స్వయంగా తెలుసుకోవాలని చెప్పారు.

 ఇక జీవజ్ఞానామృత బిందు శక్తి అంటే చాలా తక్కువగా అర్థమయ్యే విధంగా చెప్పుకుందాం

 కనిపించకుండా బీజరూపములో ఉండునది ఏదో దానినే బిందువు అంటారు ఈ బిందువులో జీవము సత్యమై నిత్యమై మృతము లేనిదై అనగా చావులేనిదై జ్ఞానము రూపంలో ఉంటుంది కనుక ఇది అమృతము. బాబాజీ విత్తనమును  వృక్షమును ఉదాహరణగా తీసుకొని చెబుతారు విత్తనములో అన్నీ ఉన్న ఏమీ కనబడదు కానీ మహా వృక్షముగా మారుటకు అవసరమైన జ్ఞానము దానిలో దాగి ఉంది అది గుప్తమగు జ్ఞానము మన భాషలో చెప్పాలి అంటే ఒక విధమైన బ్లూ ప్రింట్ గా చెప్పుకోవచ్చు. ఇది సర్వ జీవరాశులలో జన్మకు రాకముందు జీవశక్తిలో దాగి ఉన్న జ్ఞానము. ఈ సృష్టిలో అణువు మొదలు బ్రహ్మాండము వరకు విశ్వమంతా ఈ జీవశక్తి నిండి అమృతమయమై దాగి ఉన్నది ఈ జీవజ్ఞానామృత బిందువు నందు చైతన్యము జ్ఞానము శక్తి అదృశ్యమైన రూపములో( త్రిశక్తి రూపంలో) క్రమ సంయోగ వియోగ సంయోగాత్మక స్వరూపములో మొత్తం విశ్వసృష్టి నిర్మాణం ఐనది . బిందు రూపం ఉన్న ఈ జీవశక్తిలో జ్ఞానము తనకు తాను స్వయంకృతమున సృష్టి సూక్ష్మము నుండి బాహ్య జగత్తుగా లేదా దృశ్యమాన జగత్తుగా వచ్చిపోతూ ఉంటుంది సృష్టి స్థితిలయలు జరిగినా ఈ జ్ఞానము ఎప్పుడు మృతము కానిదై అనాది సనాతనమై  ఉంటుంది. ఇది ప్రతి ఒక్క జీవిలో జరుగుతూ ఉంటుంది కానీ మిగిలిన జీవరాశుల కన్నామానవులు   విచక్షణ ఉండటంతో మన లోపలికి మనం మౌనం ధ్యానం ద్వారా ప్రయాణం చేస్తూ చూస్తూ ఉంటే అదంతా తానే అని తెలుస్తుంది తానే సృష్టికర్తనని సనాతనమగు ఆ జీవజ్ఞానామృత బిందు శక్తి నేనని  కనుగొనుట జరుగును. 

 వృక్షం యొక్క స్వరూపమంతయు కనిపించకుండా విత్తనములో మరుగై మర్మమై ఉన్నట్లే మహావృక్షముగా మారినట్లే అమృతమైన అమృతమయమైన జీవత్వమునొందిన జ్ఞానము బిందు రూపంగా  విత్తనము వలే ఉండి ఈ విశ్వముగా దృశ్యమాన జగత్తుగా విస్తరించినది ఇలా నువ్వు మొదలు బ్రహ్మాండము వరకు జీవజ్ఞానామృత బిందువు ప్రతి ఒక్కరిలో నిండి పరిపూర్ణమై ఉన్నది విశ్వముగా పరిఢవిల్లి నది దీనినే బాబాజీ మహా మనస్సు మహా ప్రాణము మహా తేజస్సు అని చెబుతారు ఆ మహా తేజస్సు నుండి చైతన్యముగా మనసుగా సర్వ జీవరాసులు మహా ప్రాణమును ఆధారంగా చేసుకుని ప్రాణులుగా దిగివచ్చినవి. ఆ ప్రాణుల కర్మల ఆధారముగా అవే సంస్కారములుగా మారి జన్మకు వచ్చుట జరుగుచున్నది కనుక ఈ విశ్వం అంతటను అన్నింటిని ఆ జీవ జ్ఞానామృత బిందు శక్తి తేజస్వర తరంగ నాదములుగా  అన్నిటిని నిండి ఉన్నది. ఇదే పూర్ణత్వము ఈ జీవ జ్ఞానామృత బిందువునకు భిన్నముగా ఏమీ లేదు దీన్నే అన్ని నేనే అంతా నేనే అన్న సత్యమునకు మూలము అంటారు అదే జ్యోతిర్మయి మని అంటారు ఈ బిందు శక్తిలో శూన్యతత్వము దివ్య జగత్తు,సూక్ష్మజగత్తు, ప్రకృతి  విశ్వమంతయు దాగి ఉన్నది దీన్ని తెలుసుకొనుటకే మౌనము ధ్యానము తపస్సు సత్కర్మాచరణ శాంతము అహింస తపస్సు మొదలగుసత్వ గుణాలతో సాధన చేస్తూ తన శరీరంలో తన పయనం చేస్తూ తెలుసుకోవాలి గాని మరి దేని వలన తెలియదు అప్పుడే జీవ జ్ఞానామృత బిందుస్థితి మూలమునకు చేరుకొనుట జరుగును ఇదే శివోహం ఇదే అహం బ్రహ్మాస్మి,సహస్వాహం ఇదే అహం జ్యోతి.

( ఇది చాలా తక్కువగా సంగ్రహంగా చెప్పబడినది ఒకటికి పది సార్లు చదివి అవగతం చేసుకోవాలి.

 జై బాబా

 ఇందు ఏమైనా దోషములు ఉన్నా సవరించ ప్రార్థన. 

మీ జ్యోతి కిరణం విజయ (Vijaya Teacher, Vizianagaram, Andhra Pradesh

Sunday, March 23, 2025

శ్రీ రాజశ్యామల /రాజ మాతంగి మాత మంత్రం (Raja Matangi Mantram Telugu) : Lalith Amma

శ్రీ రాజ శ్యామలా/ రాజ మాతంగి మూలమంత్రం:



అస్య శ్రీ రాజశ్యామలాంబా మహామంత్రస్య దక్షిణామూర్తి ఋషయే గాయత్రీ ఛంధ సే శ్రీ రాజశ్యామలాంబా దేవతాయై-  ఐం బీజం సౌ: శక్తి: క్లీం కీలకం శ్రీ రాజశ్యామలాంబా ప్రసన్నతా ప్రాప్తి పూర్వక శ్రీ రాజశ్యామలాంబా ప్రసాద సిద్ధ్యర్ధం మమశ్రీ రాజశ్యామలాంబా ప్రసాదేన సర్వావచ్చాన్తి పూర్వక దీర్ఘాయుర్వివుల ధనపుత్రపౌత్రాద్యనవచ్చిన్న సంతతివృద్ధి స్థిరలక్ష్మి కీర్తిలాభ శతృ పరాజయాది సదాభీష్ట ఫల సిద్ద్యర్ధం శ్రీ రాజశ్యామలా మంత్ర జపం వినియోగ:

 

ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః

ఓం నమో భగవతీ శ్రీ మాతంగేశ్వరీ

సర్వజన మనోహరి సర్వముఖరంజని

క్లీం హ్రీం శ్రీం

సర్వరాజవశంకరి - సర్వ స్త్రీపురుష వశంకరి

సర్వదుష్ట మృగ వశంకరి -సర్వసత్వ వశంకరి-సర్వలోక వశంకరి

సర్వజనం మే వశమానయ స్వాహా

సౌః క్లీం ఐం శ్రీం హ్రీం ఐం |

గమనిక:  ఇది కేవలం నా నోట్స్ మాత్రమే, మంత్ర ఉపదేశం కోసం సంబంధిత సాధన, నియమాల కోసం నిష్ణాతులైన /మంత్రాధికారం గల గురువును సంప్రదించగలరు.

శ్రీ మాతంగి దేవి (దశమహావిద్యలలో తొమ్మిదవ విద్య) కి సంబంధించిన అత్యంత శక్తివంతమైన రాజ మాతంగి మంత్రం.

ఈ మంత్రం యొక్క ప్రాముఖ్యత మరియు అర్థం క్లుప్తంగా:

  • మాతంగి దేవి: ఈమెను "మంత్రిణి" అని కూడా పిలుస్తారు. లలితా త్రిపుర సుందరి యొక్క ప్రధాన మంత్రిగా ఈమెను ఆరాధిస్తారు. కళలు, సంగీతం, జ్ఞానం మరియు వాక్చాతుర్యానికి ఈమె అధిదేవత.
  • మంత్ర ప్రభావం: ఈ మంత్రాన్ని సర్వజన మనోహరత్వానికి, సమాజంలో గౌరవం పెరగడానికి, ఆకర్షణ శక్తికి మరియు అనుకున్న కార్యాలు సిద్ధింపజేసుకోవడానికి పఠిస్తారు.
  • బీజాక్షరాలు: ఇందులో ఐం (సరస్వతి), హ్రీం (భువనేశ్వరి), శ్రీం (లక్ష్మి), క్లీం (కామరాజ బీజం) వంటి శక్తివంతమైన బీజాక్షరాలు ఉన్నాయి.

గమనిక: ఇటువంటి శక్తివంతమైన మంత్రాలను జపించేటప్పుడు సరైన ఉచ్చారణ మరియు భక్తి అవసరం. వీలైతే ఒక గురువు పర్యవేక్షణలో లేదా మంత్ర శాస్త్ర నియమాలను అనుసరించి పఠించడం శుభప్రదం


****************************************************


బగళాముఖి మాత మంత్రం (bagalamukhi MantraTelugu)- Lalitha Amma





బగళాముఖి మాత మంత్రం

హ్ర్లీం త్రైలోక్య స్తంభినీ విద్యా సర్వశత్రు వశంకరీ-
ఆకర్షణకరీ ఉచ్చాటనకరీ విద్వేషణకరీ జారణకరీ-
మారణకరీ జృంభణకరీ స్తంభనకరీ బ్రహ్మాస్త్రేణ-
సర్వ వశ్యం కురు కురు ఓం హ్లాం బగళాముఖి హుం ఫట్ స్వాహా

 బగళాముఖి బీజ మంత్రం : హ్ర్లీం (Hrleem)

ద్రావిణి- భ్రామిణి : బగళాముఖి

ధ్యానం

బ్రహ్మాస్త్రాం ప్రవక్ష్యామి బగళాం నారద సేవితాం
దేవ గంధర్వ యక్షాది సేవిత పాదపంకజాం

మంత్రం

ఓం హ్లాం ద్రావిణి ద్రావిణి భ్రామిణి భ్రామిణి ఏహ్యేహి
సర్వభూతానుచ్చాటయోచ్చాటయ సర్వ దుష్టా న్నివారయ
నివారయ భూత ప్రేత పిశాచ డాకినీ శాకినీః ఛింది ఛింది ఖడ్గేన
భింది భింది ముద్గరేణ సంహారయ సంహారయ దుష్టాన్ భక్షయ
భక్షయ ససైన్యం భూపతిం కీలయ కీలయ ముఖ స్తంభనం కురు
కురు ఓం హ్లాం బగళాముఖి హుం ఫట్ స్వాహా..!

గమనిక:  ఇది కేవలం నా నోట్స్ మాత్రమే, మంత్ర ఉపదేశం కోసం సంబంధిత సాధన, నియమాల కోసం నిష్ణాతులైన /మంత్రాధికారం గల గురువును సంప్రదించగలరు.ఈ మంత్రాలు అత్యంత శక్తివంతమైనవి . వీటిని సరైన మార్గదర్శకత్వం, క్రమశిక్షణ మరియు శుద్ధి లేకుండా సాధారణంగా జపించకూడదు. పండితుల పర్యవేక్షణలో మాత్రమే వీటిని సాధన చేయడం ఉత్తమం. 

 

Saturday, March 22, 2025

యోగిని మాత నామాలు (లలిత మాత) Lalitha Amma -Yogini Maata Names

 యోగిని మాత నామాలు (లలిత మాత)




మాతంగీ/లఘుశ్యామల మాత మంత్రాలు (Matangi Navaratri mantras Telugu )

మాతంగీ/లఘుశ్యామల  మాత మంత్రాలు

గణపతి ప్రార్ధన (గణపతి ప్రార్ధన చేయాలి)

శ్రీం హ్రీం క్లీం గౌం గం గణపతయే వరవరద సర్వ జనం మే | వశమానయ స్వాహా”!

 

కాలభైరవ ప్రార్ధన (భైరవ మంత్రం పటించి అనుజ్ఞ పొందాలి)  : “

ఓం క్షేం క్షేతపాలాయ క్రీం క్రీం కాలభైరవాయ | ఆపదుద్ధారణాయ కురుకురు బటుకాయ హ్రీం ఓం"

 

  • మొదటి రోజు : లఘుశ్యామల మూలమంత్రం :
  • ఐం నమః ఉచ్చిష్టచాండాలిమాతంగీ సర్వవశంకరి స్వాహా

 

  • రెండవ రోజు వాగ్వాదినీ మూలమంత్రం :
  • ఓం ఐం వద వద వాగ్వాదినీ న్వాహా।

 

  • మూడవ రోజు : నకులీశ్యామల మూల మంత్రం :
  • ఐం ఓం ష్టాపిదాన నకులీ|క్లీం దంతైః పరివృతా పవిః । సౌ సర్వస్యై | వాచ ఈశాన చారుమామిహా వాదయేత్‌ | వద వద వాగ్వాదినీ స్వాహా

 

  • నాల్గవరోజు : హాసంతిశ్యామల మూల మంత్రం :
  • ఓం హ్రీం హాసంతి హసితాలాపే మాతంగీ పరిచారకే భయ విఘ్నాపదాం నాశం కురు కురు ఠః ఠః ఠః ఠః  హుం ఫట్‌ స్వాహా

 

  • ఐదవ రోజు : సర్వసిద్దిమాతంగీ దశాక్షరీ మూల మంత్రం :
  •  ఓంహ్రీం క్సీం హూం మాతంగ్యై ఫట్‌ స్వాహా

 

  • ఆరవ రోజు : వస్యమాతంగీ -ఉచ్చిష్టచాందాలి-సుముఖీదేవి మూల మంత్రం:
  • ఓం ఉచ్చిష్ట చాండాలిని సుముఖి దేవి రాజమాతంగిని హీం ఠః ఠః ఠః ఠః స్వాహా

 

  •  ఏడవ రోజు : శారికాశ్వామల మూల మంత్రం:

  • ఓం నమోభగవతే శారికే సకల కళాకోవిదే దేవి బోధయ బోధయ స్వాహా

గమనిక:  ఇది కేవలం నా నోట్స్ మాత్రమే, మంత్ర ఉపదేశం కోసం సంబంధిత సాధన, నియమాల కోసం నిష్ణాతులైన /మంత్రాధికారం గల గురువును సంప్రదించగలరు.

Thursday, March 20, 2025

శ్రీ హరి స్తోత్రం (జగజ్జాలపాలం) (Srihari Strtram (Jagajjala paalam) in telugu )



జగజ్జాలపాలం కనత్కంఠమాలం  - శరచ్చంద్రఫాలం మహాదైత్యకాలమ్ ।
నభోనీలకాయం దురావారమాయం - సుపద్మాసహాయం భజేఽహం భజేఽహమ్ ॥ 1

 సదాంభోధివాసం గలత్పుష్పహాసం -జగత్సన్నివాసం శతాదిత్యభాసమ్ ।
గదాచక్రశస్త్రం లసత్పీతవస్త్రం -హసచ్చారువక్త్రం భజేఽహం భజేఽహమ్ ॥ 2

 రమాకంఠహారం శ్రుతివ్రాతసారం - జలాంతర్విహారం ధరాభారహారమ్ ।
చిదానందరూపం మనోజ్ఞస్వరూపం -ధృతానేకరూపం భజేఽహం భజేఽహమ్ ॥ 3

 జరాజన్మహీనం పరానందపీనం - సమాధానలీనం సదైవానవీనమ్ ।
జగజ్జన్మహేతుం సురానీకకేతుం -త్రిలోకైకసేతుం భజేఽహం భజేఽహమ్ ॥ 4
 
కృతామ్నాయగానం ఖగాధీశయానం - విముక్తేర్నిదానం హరారాతిమానమ్ ।
స్వభక్తానుకూలం జగద్వృక్షమూలం -నిరస్తార్తశూలం భజేఽహం భజేఽహమ్ ॥ 5
 
సమస్తామరేశం ద్విరేఫాభకేశం - జగద్బింబలేశం హృదాకాశవేశమ్ ।
సదా దివ్యదేహం విముక్తాఖిలేహం -సువైకుంఠగేహం భజేఽహం భజేఽహమ్ ॥ 6
 
సురాలీబలిష్ఠం త్రిలోకీవరిష్ఠం - గురూణాం గరిష్ఠం స్వరూపైకనిష్ఠమ్ ।
సదా యుద్ధధీరం మహావీరవీరం -భవాంభోధితీరం భజేఽహం భజేఽహమ్ ॥ 7
 
రమావామభాగం తలాలగ్ననాగం - కృతాధీనయాగం గతారాగరాగమ్ ।
మునీంద్రైస్సుగీతం సురైస్సంపరీతం -గుణౌఘైరతీతం భజేఽహం భజేఽహమ్ ॥ 8
 
ఫలశ్రుతి ।
ఇదం యస్తు నిత్యం సమాధాయ చిత్తం - పఠేదష్టకం కంఠహారం మురారేః ।
స విష్ణోర్విశోకం ధ్రువం యాతి లోకం - జరాజన్మశోకం పునర్విందతే నో ॥ 9
 
ఇతి శ్రీ పరమహంసస్వామి బ్రహ్మానందవిరచితం శ్రీహరిస్తోత్రమ్ ॥