గాత్రము-వఝ్ఝల కృష్ణమూర్తిశర్మ
జయకాలకాల!జయమృత్యు మృత్యు!జయదేవదేవ!శంభో!
జయచంద్రమౌళి!నమదింద్రమౌళి మణిసాంద్రహేళి చరణా!
జయ యోగ మార్గ జితరాగదుర్గ ముని యాగ భాగ!భర్గా!
జయ స్వర్గ వాసి మతివర్గ భాసి ప్రతి సర్గ సర్గ కల్పా!
జయ బంధు జీవ సుమబంధు జీవ సమసాంధ్య రాగ జూటా!
జయ చండ చండతర తాండవోగ్ర భర కంపమాన భువనా!
జయ హార హీర ఘనసార సారతర శారదాభ్ర రూపా!
జయ శృంగి శృంగి శృతి భృంగి భృంగి భృతి నంది నంది వినుతీ!
జయ కాల కంఠ కలకంఠకంఠసుర సుందరీ స్తుత శ్రీ!
జయ భావ జాత సమ!భావ జాత సుకళాజిత ప్రియాహ్రీ!
జయ దగ్ధ భావ!భవ స్నిగ్ధ భావ!భవ ముగ్ధ భావ భవనా!
జయ రుండమాలి!జయ రూక్ష వీక్ష!రుచిరుంద్ర రూప!రుద్రా!
జయ నాసికాగ్ర నయనోగ్ర దృష్టి జనితాగ్ని భుగ్న విభవా!
జయ ఘోర ఘోరతర తాప జాప తప ఉగ్రరూప విజితా!
జయ కాంతి మాలి!జయ క్రాంతికేలి జయశాంతి శాలి!శూలీ!
జయ సూర్య చంద్ర శిఖి సూచనాగ్ర నయలోచనాగ్ర!ఉగ్రా!
జయ బ్రహ్మ విష్ణు పురుహూత ముఖ్య సురసన్నుతాంఘ్రి యుగ్మా!
జయఫాలనేత్ర!జయచంద్ర శీర్ష!జయనాగభూష శూలీ!
జయకాలకాల!జయ మృత్యుమృత్యు!జయదేవదేవ!శంభో!