Translate

Monday, December 20, 2021

చక్ర విజ్ఞానం- ఉప చక్రాలు - లలనా/Talu చక్రం ( Telugu Lalanaa Chakra )

 చక్రార్థ నిరూపణ

(చక్ర విజ్ఞానం)


ఉప చక్రాలు - లలనా చక్రం






      మన శరీరం లో ఉన్న 7 ప్రధాన చక్రాలు కాక ...ఇంకా ఇతర చక్రాలు /శక్తి కేంద్రాలు ఉన్నాయి. అందులో బిందు విసర్గం లేదా లలనా చక్రం ఒకటి. అర్థ చంద్రాకారాన్ని (crescent moon) ఈ ప్రదేశానికి చిహ్నంగా చూపిస్తారు. బిందువు అంటే చుక్క అని అర్థం. కర్మలు శిఖా స్థానంలోనే దాక్కొని ఉంటాయి. పూర్వకాలంలోనూ/ఈనాటి కాలంలోనూ కొందరు సాధకులు   ఈ శిఖను బాగా బిగించి, ముడి కట్టుకుని , వేదాధ్యయనం చేసేవారు. ఇప్పుడు కూడా అలాగే అనుకోండి. నిద్ర మత్తు స్తబ్ద స్థితులనుండి ఎల్లప్పుడూ జాగరూకతతో ఉండడానికి ఇలా చేస్తూ ఉండేవారు. ఈ బిందు స్థానాన్ని ఎప్పుడూ జాగృతితో ఉంచి ...ఇక్కడ ఉండే అమృతాన్ని ఎప్పుడూ క్రింద పడకుండా చూసుకోవాలి. ఈ లలనా చక్రాన్ని "తాలు చక్రం" అనికూడా అంటారు. ఈ లలనా చక్రం చైతన్యవంతం కాకపోతే, జీవితం బాధాకరంగా ఉంటుంది. ఈ చక్రం చైతన్యం కావడానికి "ఖేచరి" ముద్ర సహాయకారి. (ఈ ముద్రను గురువు సహాయంతో అభ్యసించాలి) ఈ చక్రస్థానాన్ని ఉత్తేజ పరచడానికి షణ్ముఖీ ముద్ర, నవముఖీ ముద్ర వేసుకోవాలి.ఈ లలనా చక్రమును కొన్ని సార్లు "తాలు చక్రము" అని కూడా అంటారు. ఇది మన నోటి కుహరంలో గల అంగిలి యొక్క మూలంలో ఉంటుంది. సాధన తీవ్ర దశలలో "అమృతం"  బిందువు నుండి స్రవిస్తున్నపుడు...ఈ స్రావం , లలనా చక్రంలోనే ఒకింత సేపు నిల్వ ఉంటుంది. ఈ స్రవము మరల విశుద్ధ చక్రముచే శుద్ధి చేయబడుతుంది. ఒక సాధకుడు ఖేచరీ ముద్రలో సిద్ధుడైతే, ఈ అమృత స్రావము లలనా చక్రము నుండి విశుద్ధ చక్రం వైపునకు పయనిస్తుంది. విశుద్ధ చక్రంలో ఈ అమృతం శుద్ధి చేయబడుతుంది. విశుద్ధ చక్రం సక్రియంగా లేకపోతే, ఆ అమృత స్రావం మణిపూరకం వైపు వెళుతుంది. మణిపూరకం లో ఈ స్రావం కలిసిపోతుంది. హఠ యోగ సిద్ధాంతాలు ఏమి చెబుతున్నాయంటే, ఈ అమృత పానం వలన జీవిత కాలం పొడిగించబడుతుంది.


     సౌభాగ్యోపనిషత్తు ప్రకారం ఈ తాలు చక్రం 12దళముల కాంతివంతమైన కమలంగా ఉంటుంది. కొన్ని తంత్ర గ్రంథాలు ఈ చక్రానికి 64 వెండి రంగులో ఉంటాయని, వీటికి "ఘంటిక" అనే పేరు గల కాంతివంతమైన ఎర్రని రంగు గల అంచులుంటాయని, ఈ చక్రం చైతన్యవంతం అవ్వడం వలన ....చంద్రుని శక్తి "అమృతం" రూపంలో స్రవిస్తుందని చెబుతున్నాయి. ఈ చక్రం సంపూర్తిగా చైతన్య వంతం అయిన యోగికి "శూన్య అవస్థ" అనుభవానికి వస్తుందని తాంత్రికులు చెబుతారు. ఈ "తాలు చక్రం" యొక్క 64 సూక్ష్మ దళాలు, 64గురు యోగినుల  గృహములుగా చెప్పబడినవి. అష్ట సిద్ధులు ఆశించేవారు, ఈ చక్రాన్ని చైతన్య పరచుకోవడం ముఖ్యం. సాధనలో కొన్ని సార్లు ఈ చక్రం చైతన్యవంతమైనది గానూ, ఇబ్బంది కరమైనదిగానూ అనిపిస్తుంది. సాధకులు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

   విశుద్ధ, బిందు విసర్గాలు(తాలు చక్రం/లలనా చక్రాలు) ప్రక్క ప్రక్కనే ఉంటాయి.ఇక్కడి నుండీ అమృతం క్రిందకి జాలువారుతూ ఉంటుంది.ఆ అమృతం మణిపూరకానికి చేరుకున్నప్పుడు అక్కడి అగ్ని తత్వం వల్ల ఆవిరై పోతుంది. శరీరంలో ఎక్కడైనా విష పదార్థాలు పేరుకొని ఉంటే వాటిని శుద్ధి చేయగలిగే శక్తి ఈ అమృతానికి ఉంది.........భట్టాచార్య...........బిందువిసర్గం/లలనా చక్రం అత్యున్నత సత్యలోకంతో అనుసంధానమై ఉంటుంది. ఇది ఆనందమయ కోశ స్థానం.ఇక్కడ మత్తు కలిగించే రసాలు ఉద్భవిస్తాయి. ఖేచరీ ముద్రవలన ఈ అమృతం క్రింద పడి వృథా కాకుండా నిలువ వుంటుంది. అందుకే విశుద్ధ చక్రం, బిందు విసర్గ స్థానాలను కలిపి జాగృతం చేస్తూ కర్మ నిర్వర్తిస్తుండాలి.





No comments:

Post a Comment