Translate

Thursday, December 2, 2021

కుండలిని శక్తి (kundalini telugu) Notes- Part- 3


కుండలిని శక్తి- Kundalini Shakthi -2 (Telugu)




 ◆ జాగ్రతమైన కుండలిని శక్తి సాధుకుడిని శుభపరుస్తుంది  సాధకుడి పురోగతికి అవరోధంగా ఉన్న పురాతన సంస్కారాలనూ , ములదోషాలనూ నాశనం చేస్తుంది . ఈ శక్తి  మూలాధార పద్మ గర్భంలో తామరతూడును పోలి ఉంటుంది . గుండ్రముగా చుట్టుకుని ఉంటుంది . బంగారపు  వన్నె కలిగి మెరుస్తూ ఉంటుంది .


◆ కుండలిని శక్తి మూలాధారంలో వర్తులాకారంలో చుట్టుకొని ఉంటుంది . మన శరీరం నిర్వహించే పనులన్నిటినీ క్రమబద్ధం చేస్తుంది . శరీరాన్నంతటినీ చుట్టూ ఉన్న పరిసరాలనూ ఎదుగుదలకు తగిన విధంగా వికాసంప చేస్తుంది . 


◆ నిద్రవచ్చేది విశుద్ధ చక్రమైన కంఠ స్థానంలోనే . శ్రమ అంతా కంఠస్థానంలో నివారణ అవుతుంది . 


◆ మానవుడి లోపల ఉన్న శక్తి వికసించినప్పుడు , మహశక్తి కుండలినీ యొక్క ప్రేమ ప్రవాహం సర్వాంగాలకు 2,72,000 నాడులకు వ్యాపిస్తుంది . ఇది ప్రతి రక్తకణంలోకి ప్రవేశించడంతో నీకు నీ శరీరం అంతటా ఆనందానుభూతి కలుగుతుంది . అప్పుడు , మానవ శరీర స్పర్శ కోసం నువ్వు పడిన తపన తీరుతుంది . 


◆ ధ్యాన సమాధి లోకి ప్రవేశించిన తర్వాత మొదట నిద్ర , సోమరితనం వస్తాయి . సాధన సక్రమంగా జరుగుతుంది అని తెలుసుకోడానికి మంచి నిద్ర పట్టడం ఒక సూచన .


◆ ధ్యానం చేసుకోడానికి ఒకే స్థానంలో కూర్చోవడం మంచిది . ధ్యానం చేసే ప్రదేశంలో కుండలని శక్తి యొక్క కిరణాలు వ్యాపించి ఉంటాయి . అందుచేత ముందు ముందు ధ్యానం బాగుంటుంది . 


◆ 2,72,000 నాడులు , 6 చక్రాలు , 9 ద్వారాలు , 7 ధాతువులతో మన శరీరం ఉంటుంది . 2,72,000 నాడుల్లో 100 ముఖ్యమైనవి . వీటిలో 10 శ్రేష్ఠమైనవి. ఈ 10 లో 3 అతి ముఖ్యమైనవి . ఈ 3 లో మధ్యలో ఉన్న సుషుమ్న  నాడి , అత్యంత మహిమాన్వితమైనది .


◆ మానవ జీవితానికి సంబంధించిన అన్ని పనులు , సుషుమ్న నాడి ద్వారా జరుగుతాయి . సుషుమ్న నాడి సహస్రారం నుంచి , కుండలనీ , స్థానమైన మూలాధారం వరకు అఖండ రూపంలో వ్యాపించి ఉంటుంది . 


◆ ప్రాణమే కుండలిని , ప్రకృతి మూలాధారమైన విశ్వచైతన్యమే ప్రాణ రూపంగా మార్పు చెందుతుంది.


◆ శరీరం సక్రమంగా ఉండేలా చేయడానికి ప్రాణం 5 రూపాలను ధరిస్తుంది . 


● 1) ప్రాణం(ఆన):-  ఆహారం లోపలికి వెళ్ళడానికి కారణమైన శక్తి . 

● 2) అపాన:-  మలమూత్ర విసర్జనను చేసే శక్తి.

● 3) సమాన (వ్యాపన):-  ఆహారం యొక్క రసాన్ని శరీరంలోని అన్ని భాగాలకు అందిస్తుంది . 

● 4) వ్యాన-  ఆహారపు శక్తిని నాడులలో , నరాలలో నింపుతుంది . 

● 5)ఉదాన:-  మరణాంతరం మనిషి కర్మలను బట్టి అతనికి అర్హత గల లోకాలకు తీసుకువెళ్తుంది . ఈ శక్తి సుషుమ్నలో ఉంటుంది . 


◆ ఈ పంచ ప్రాణాలు ఒకే ప్రాణం , ఒకే శక్తి. అన్ని పనులను సక్రమంగా జరిగేలా చూడడానికి గాను , పిండాండ బ్రహ్మండమంతటా ఈ 5 రూపాలలో వ్యాపించి ఉంటుంది. ప్రాణం హృదయంలో పనిచేస్తుంది .


◆ జాగృతమైన కుండలినీ మహాశక్తి , పంచప్రాణాల ఆధారంగా 2,72,000 నాడుల్లోకి ప్రవేశించి అన్ని అంగాలలోనూ వ్యాపిస్తుంది . ఈ శక్తి , సప్త దాతువుల్లో , రక్తకణాల్లో, ద్రవ పదార్థాలలో వ్యాపించి , శరీరాన్ని పరిశుభ్రంగా , సౌష్టవంగా , నిర్మలంగా , అందంగా రూపొందిస్తుంది .

No comments:

Post a Comment