కాలభైరవస్వామి ఆవిర్బావం
శ్రీ కాలభైరవస్వామి ఆవిర్భవించిన మార్గశిర శుద్ధ అష్టమిని కాలభైరవాష్టమి గా సంభావిస్తారు. ఈ కాలభైరవ స్వామి పుట్టుకకు సంబంధించిన ఆసక్తికరమైన కథ శివపురాణం చెబుతుంది.
ఒకసారి శివబ్రహ్మలు మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలు కాస్తా వాదోపవాదాలుగా మారాయి. బ్రహ్మదేవుడు 'నేను సృష్టికర్తను... పరబ్రహ్మ స్వరూపుడను... నేను చెప్పినట్లుగానే మీరంతా నడుచుకోవాలి' అన్నాడు. దానికి శివుడు సమ్మతించలేదు.
దాంతో వారి మధ్య వాదం పెరిగింది. బ్రహ్మదేవుడు శివుడిని తూలనాడడం ప్రారంభించాడు. శివుడు కోపం పట్టలేక హుంకరించాడు. ఆ హుంకారం నుంచి ఒక భయంకర రూపం ఆవిర్భవించింది. మహోన్నత కాయముతో , మూడు నేత్రాలతో , త్రిశూలము , గద , డమరుకం వంటి ఆయుధాలను చేతులతో ధరించి కనిపించిన ఆ మహోన్నత రూపమే శ్రీకాలభైరవుడు.
హుంకారంతో జన్మించిన కాలభైరవుడు తన జననానికి కారణం చెప్పమని శివుడిని కోరాడు. శివుడి ఆజ్ఞమేరకు కారభైరవుడు బ్రహ్మదేవుడి ఐదు శిరస్సులలో మధ్యన ఉన్న ఐదవ శిరస్సును ఖండించాడు. దీనితో బ్రహ్మదేవుని గర్వం అణిగిపోయింది. తిరిగి కాలభైరవుడు శివుని చెంత నిలిచాడు.
'నీవు బ్రహ్మదేవుని శిరస్సును ఖండించడం వల్ల నీకు బ్రహ్మహత్యాపాతకం సోకింది. కనుక నీవు బ్రహ్మ కపాలాన్ని చేతిలో ధరించి తీర్థయాత్రలు చేయి..' అని శివుడు సలహా ఇచ్చాడు. దీనితో కాలభైరవుడు బ్రహ్మహత్యాపాతకాన్ని తొలగించుకోవడం కోసం బ్రహ్మ కపాలాన్ని చేతిలో ధరించి క్షేత్ర పర్యటన ప్రారంభించాడు. ఎన్ని క్షేత్రాలు పర్యటించినా తనకు సోకిన పాతకం విడవనందున మహావిష్ణువు వద్దకు వెళ్లి ఆయన్ను ప్రార్థించుతాడు.
అందుకు ''కాలభైరవా ! నీవు శివుని పుత్రుడివి. కనుక శివునితో సమానం. బ్రహ్మదేవుని గర్వం అణచడానికి జన్మించిన వాడవు. నీవు ఎన్ని యాత్రలు చేసినా ఉపయోగం ఉండదు. నీవు కాశీ క్షేత్రానికి వెళ్లు . కాశీక్షేత్రంలో అడుగు పెట్టినంతనే నీ బ్రహ్మహత్యాపాతకం భస్మమై పోతుంది' అని మహావిష్ణువు సలహా ఇచ్చాడు.
దీనితో కాలభైరవుడు కాశీచేరుకున్నాడు. ఆయనబ్రహ్మహత్యాదోషం పోయింది. బ్రహ్మ కపాలాన్ని కాశిలో పూడ్చి పెట్డాడు. బ్రహ్మ కపాలం పూడ్చి పెట్టిన చోట ఏర్పడిన తీర్థమే నేటి కాశీలోని 'కపాల మోక్ష తీర్థం'
తర్వాత కాలభైరవుడిని చూసి శివుడు
'కాలభైరవా! నీవు ఇక్కడే కొలుదీరి క్షేత్రపాలకుడుగా బాధ్యతలు చేపట్టు. ముందుగా నీకే పూజలు జరుగుతాయి. నీ తరువాతనే నాకు పూజలు జరుగుతాయి.' అని శివుడు పలికాడు. శ్రీ కాలభైరవుడు కాశీక్షేత్రంలో కొలువు దీరి క్షేత్రపాలకునిగా పూజలందుకొంటున్నాడు. కాశీక్షేత్రాన్ని దర్శించినవారు శ్రీ కాలభైరవ స్వామిని దర్శించడంతో పాటుగా కాశీనుంచి వచ్చిన వారు కాశీ సమారాధన చేయడం ఆచారం అయింది.
కాశీ క్షేత్రానికి వెళ్లి వచ్చిన వారు కాశీ విశ్వేశ్వర స్వామి వారిని పూజించడంతోపాటు వడలను చేసి వాటితో మాలను తయారు చేసి పూజానంతరం శునకమునకు పసుపుకుంకుమలు పెట్టి ఆ మాలను దాని మెడలో వేసి నమస్కారం చేస్తారు. ఆ ఆచారాలు శ్రీ కాలభైరవ స్వామి వారి మాహాత్మ్యానికి నిదర్శనం.
ఈ కాలభైరవుని జన్మదినమైన కాలభైరవాష్టమి నాడు శ్రీ కాలభైరవ స్వామి విగ్రహం లేదా చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకొని గణపతిని పూజించిన తరువాత షోడశోపచారాలతోను , అష్టోత్తరాలతోను శ్రీకాలభైరవ స్వామిని పూజిస్తారు. మినపవడలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఒకపూట ఉపవాసం చేస్తారు.
ఈ మార్గశిర అష్టమి కాలభైరవజన్మదినాన్ని పురస్కరించుకొని శ్రీ ఆదిశంకరాచార్యుల వారు రచించిన కాలభైరవాష్టకం ను పారాయణ చేస్తారు. ఇలా కారభైరవాష్టమి నాడు శ్రీ కాలభైరవ స్వామిని స్మరించడం , పూజించడం వల్ల సకల పుణ్యఫలాలు కలుగుతాయి. శ్రీ కాలభైరవ స్వామిని పూజించడం వల్ల స్వప్నభయాలు దూరమవుతాయ. గ్రహదోషాలు తొలగిపోతాయి.
🔸 కాలభైరవాష్టకం️
దేవరాజసేవ్యమానపావనాంఘ్రిపంకజం
వ్యాలయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరమ్ |
నారదాదియోగిబృందవందితం దిగంబరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౧ ||
భానుకోటిభాస్వరం భవాబ్ధితారకం పరం
నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనమ్ |
కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౨ ||
శూలటంకపాశదండపాణిమాదికారణం
శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయమ్ |
భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవప్రియం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౩ ||
భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారువిగ్రహం
భక్తవత్సలం స్థిరం సమస్తలోకవిగ్రహమ్ |
నిక్వణన్మనోజ్ఞహేమకింకిణీలసత్కటిం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౪ ||
ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశకం
కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుమ్ |
స్వర్ణవర్ణకేశపాశశోభితాంగనిర్మలం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౫ ||
రత్నపాదుకాప్రభాభిరామపాదయుగ్మకం
నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనమ్ |
మృత్యుదర్పనాశనం కరాలదంష్ట్రభూషణం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౬ ||
అట్టహాసభిన్నపద్మజాండకోశసంతతిం
దృష్టిపాతనష్టపాపజాలముగ్రశాసనమ్ |
అష్టసిద్ధిదాయకం కపాలమాలికాధరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౭ ||
భూతసంఘనాయకం విశాలకీర్తిదాయకం
కాశివాసిలోకపుణ్యపాపశోధకం విభుమ్ |
నీతిమార్గకోవిదం పురాతనం జగత్పతిం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౮ ||
కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం
జ్ఞానముక్తిసాధకం విచిత్రపుణ్యవర్ధనమ్ |
శోకమోహలోభదైన్యకోపతాపనాశనం
తే ప్రయాంతి కాలభైరవాంఘ్రిసన్నిధిం ధ్రువమ్ ||
ఇప్పుడు తీక్ష్ణదంష్ట్రకాలభైరవాష్టకం పఠించండి.
తరువాత శ్రీ రుద్ర కవచం పఠించండి.
తీక్షణదంష్ట్రకాలభైరవాష్టకం️
అవమానాలు అపనిందలతో నీ గుండె బాధతో నలిగి పోతున్నప్పుడు, జీవనం సమస్యలుగా సాగుతున్నప్పుడు, అగమ్య మార్గాలలో అశాంతి వచ్చినప్పుడు, అనవసర భయాలు మిమ్మల్ని చుట్టిముట్టి నప్పుడు, కుజ దోషం, సర్ప దోషం , నాగదోషం, కాలసర్పదోషం వెంటాడుతున్నప్పుడు
ఈ తీక్షణదంష్ట్ర కాలభైరవాష్టకం నిత్యపఠనం సర్వరక్షాకరమై, సర్వ దోషాలనుండి మిమ్మల్ని కంటికిరెప్పలా కాపాడుతుంది. దీనికి కోట్లాది భక్తుల అనుభూతులే ప్రత్యక్ష తార్కాణాలు.. ఎందుకంటే సమస్త కాలనాగులన్నిటికీ (సర్పాలన్నీటికి) అధిపతి - ఈ కాలనీకి అధిపతి కాలభైరవుడు కనుక.
🔸 తీక్షణదంష్ట్ర కాలభైరవాష్టకం
ఓమ్ యంయంయం యక్షరూపం దశదిశి విదితం భూమి కంపాయమానమ్ !
సంసంసం సంహారమూర్తిo శిరముకుట జటా శేఖరం చంద్రబింబమ్ !
దందందం దీర్ఘకాయం వికృతనఖ ముఖం చోర్ధ్వ రోమం కరాళమ్ !
పంపంపం పాప నాశం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలమ్ !! ((1))
రంరంరం రక్తవర్ణం కటికటితతనుం తీక్షణదంష్ట్రాకరాళమ్ !
ఘంఘంఘం ఘోషఘోషం ఘఘఘఘ ఘటితం ఘర్జరం ఘోరనాదమ్ !
కంకంకం కాలపాశం ధ్రుకధ్రుకధ్రుకితం జ్వాలితం కామదే హమ్ !
తంతంతం దివ్యదేహం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలమ్ !! ((2))
లంలంలం వదంతం లలలల లలితం దీర్ఘజిహ్వాకరాలం ! ధుoధుoధుo ధూమ్రవర్ణం స్పూటవికటముఖం భాస్కరం భీమరూపమ్ !
రుంరుంరుంరుం రుండమాలం రవితను నియతం తామ్రనేత్రం కరాళమ్ !
నంనంనం నగ్నభూషం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలమ్ !! ((3))
వంవంవం వాయువేగం నతజనసదయం బ్రహ్మపారం పరం తమ్ !
ఖంఖంఖం ఖడ్గహస్తం త్రిభువనవిలయం భాస్కరం భీమరూపమ్ !
చంచంచం చలిత్వా చలచలచలితా చ్చాలితం భూమిచక్రమ్ !
మంమంమం మాయిరూపం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలమ్ !! ((4))
శంశంశం శంఖహస్తం శశికర ధవళం మోక్షసంపూర్ణతేజం !
మంమంమంమం మహంతం కులమకుళకులం మంత్ర గుప్తం సునిత్యమ్ !
యంయంయం భూతనాధం కిలికిలికిలితం బాలకేళిప్రధానమ్ !
అంఅంఅం అంతరిక్షం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలమ్!! ((5))
ఖంఖంఖం ఖడ్గభేదం విషమమ్రుతమయం కాలకాలం కరాళమ్ !
క్షంక్షంక్షం క్షీప్ర వేగం దహదహనం తప్తసందీప్యమానమ్ ! హౌoహౌoహౌoహౌoకారనాదం ప్రకటిత గహనం గర్జితైర్భుమికంపమ్ !
వంవంవం వాలలీలం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలమ్ !! ((6))
సంసంసం సిద్ధియోగం సకలగుణమఖం దేవ దేవం ప్రసన్నమ్ !
పంపంపం పద్మ నాధం హరిహర మయనం చంద్ర సూర్యాగ్నినేత్రం !
ఐoఐoఐo ఐశ్వర్యనాధం సతత భయహరం పూర్వదేవం స్వరూపమ్ !
రౌంరౌంరౌం రౌద్రరూపం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలమ్ !! ((7))
హంహంహం హంసయానం హపితకలహకం ముక్తయో గాట్టహాసమ్ !
ధంధంధంధం నేత్రరూపం శిరముకుటజాటాబంధ బంధాగ్రహస్తమ్ !
టంటంటంటంకార నాదం త్రిదశల టలటం కామగర్వాపహారమ్ !
భ్రూoభ్రూoభ్రూo భూతనాధం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలమ్ !! ((8))
ఇత్యేవం కామయుక్తం ప్రపఠతి నియతాం భైరవస్యాష్టకమ్ !
యో నిర్విఘ్నం దుఃఖనాశం సురభయహాణం డాకీనీ శాకీనీనామ్ !
నశ్యేద్ధి వ్యాఘ్ర సర్పోహుతవహసలిలే రాజ్యశంసస్య శూన్యమ్ !
సర్వానశ్వంతి దూరం విపద ఇతి భ్రుశం చింతనాత్సర్వ సిద్ధిమ్ !!(9)
భైరవస్యాష్టకమిదం శాన్మాసం యఃపఠ్ న్నర్ర: !
స యాతి పరమం స్థానం యంత్ర దేవో మహేశ్వరః !!
(10)
సిందూరారుణగాత్రం చ సర్వ జన్మ వినిర్మితమ్ !! (11)
ఇతితీక్షణదంష్ట్ర కాలభైరవాష్టకం సంపూర్ణం
🔸 శ్రీ రుద్ర కవచం
ఓం అస్య శ్రీ రుద్ర కవచ స్తోత్ర మహామంత్రస్య దూర్వాసఋషిః అనుష్ఠుప్ ఛందః త్ర్యంబక రుద్రో దేవతా హ్రాం బీజం శ్రీం శక్తిః హ్రీం కీలకం మమ మనసోఽభీష్టసిద్ధ్యర్థే జపే వినియోగః
హ్రామిత్యాది షడ్బీజైః షడంగన్యాసః ||
ధ్యానం |
శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం |
శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం |
నాగం పాశం చ ఘంటాం ప్రళయ హుతవహం సాంకుశం వామభాగే |
నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి ||
దూర్వాస ఉవాచ |
ప్రణమ్య శిరసా దేవం స్వయంభుం పరమేశ్వరం |
ఏకం సర్వగతం దేవం సర్వదేవమయం విభుం || ౧ ||
రుద్ర వర్మ ప్రవక్ష్యామి అంగ ప్రాణస్య రక్షయే |
అహోరాత్రమయం దేవం రక్షార్థం నిర్మితం పురా || ౨ ||
రుద్రో మే జాగ్రతః పాతు పాతు పార్శ్వౌ హరస్తథా |
శిరో మే ఈశ్వరః పాతు లలాటం నీలలోహితః || ౩ ||
నేత్రయోస్త్ర్యంబకః పాతు ముఖం పాతు మహేశ్వరః |
కర్ణయోః పాతు మే శంభుః నాసికాయాం సదాశివః || ౪ ||
వాగీశః పాతు మే జిహ్వాం ఓష్ఠౌ పాత్వంబికాపతిః |
శ్రీకంఠః పాతు మే గ్రీవాం బాహూన్-శ్చైవ పినాకధృత్ || ౫ ||
హృదయం మే మహాదేవః ఈశ్వరోవ్యాత్ స్తనాంతరం |
నాభిం కటిం చ వక్షశ్చ పాతు సర్వం ఉమాపతిః || ౬ ||
బాహుమధ్యాంతరం చైవ సూక్ష్మ రూపస్సదాశివః |
స్వరం రక్షతు సర్వేశో గాత్రాణి చ యథా క్రమమ్ || ౭ ||
వజ్రశక్తిధరం చైవ పాశాంకుశధరం తథా |
గండశూలధరం నిత్యం రక్షతు త్రిదశేశ్వరః || ౮ ||
ప్రస్తానేషు పదే చైవ వృక్షమూలే నదీతటే |
సంధ్యాయాం రాజభవనే విరూపాక్షస్తు పాతు మాం || ౯ ||
శీతోష్ణా దథకాలేషు తుహినద్రుమకంటకే |
నిర్మనుష్యే సమే మార్గే పాహి మాం వృషభధ్వజ || ౧౦ ||
ఇత్యేతద్ద్రుద్రకవచం పవిత్రం పాపనాశనం |
మహాదేవ ప్రసాదేన దూర్వాస మునికల్పితం || ౧౧ ||
మమాఖ్యాతం సమాసేన న భయం తేనవిద్యతే |
ప్రాప్నోతి పరమాఽరోగ్యం పుణ్యమాయుష్యవర్ధనమ్ || ౧౨ ||
విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనం |
కన్యార్థీ లభతే కన్యాం న భయం విందతే క్వచిత్ || ౧౩ ||
అపుత్రో లభతే పుత్రం మోక్షార్థీ మోక్షమాప్నుయాత్ |
త్రాహి త్రాహి మహాదేవ త్రాహి త్రాహి త్రయీమయ || ౧౪ ||
త్రాహిమాం పార్వతీనాథ త్రాహిమాం త్రిపురంతక |
పాశం ఖట్వాంగ దివ్యాస్త్రం త్రిశూలం రుద్రమేవ చ || ౧౫ ||
నమస్కరోమి దేవేశ త్రాహి మాం జగదీశ్వర |
శత్రుమధ్యే సభామధ్యే గ్రామమధ్యే గృహాంతరే || ౧౬ ||
గమనాగమనే చైవ త్రాహి మాం భక్తవత్సల |
త్వం చిత్వమాదితశ్చైవ త్వం బుద్ధిస్త్వం పరాయణం || ౧౭ ||
కర్మణామనసా చైవ త్వం బుద్ధిశ్చ యథా సదా |
సర్వ జ్వర భయం ఛింది సర్వ శత్రూన్నివక్త్యాయ || ౧౮ ||
సర్వ వ్యాధినివారణం రుద్రలోకం స గచ్ఛతి
రుద్రలోకం సగచ్ఛత్యోన్నమః ||
ఇతి స్కందపురాణే దూర్వాస ప్రోక్తం శ్రీ రుద్రకవచం సంపూర్ణం ||
🚩🔥🔥🙏 నమో కాలభైరవ 🙏🔥🔥🚩
No comments:
Post a Comment