బ్రహ్మ నాడి :
...మానవ శరీరమందలి శక్తి పయనించు
మార్గాలలో గల నాడులలో "బ్రహ్మ నాడి " ముఖ్యమైనది. ...సంస్కృతంలో "బ్రహ్మ" అనగా, దైవ సంబంధమైన,
పవిత్రమైన అని అర్థం. "నాడి" అనగా ప్రవాహమని అర్ధం.
...హిందూ సాంప్రదాయ యోఖ గ్రంథాలలో,
వెనుబాము గుండా మూడైన ముఖ్యమైన నాడులు ప్రవహించుచున్నవి. ఇడా నాడి,
పింగళ నాడి, సుషుమ్న నాడి. ఈ బ్రహ్మ నాడి ,
సుషుమ్నా నాడి యందలి సూక్ష్మ నాడి. యోగ సాంప్రదాయాలలోని కొన్ని
శాఖలు, యోగ చక్రాలనునవి ఈ బ్రహ్మ నాడి యందే స్థితమై
యున్నాయని చెబుతున్నాయి.
...ఈ సుషుమ్న నాడి యందు వజ్రా నాడి,
చిత్రా నాడి అనే మరో రెండు సూక్ష్మ నాడులు కూడా ఉన్నాయని యోగ
శాస్త్రం చెబుతోంది. యోగుల అనుభవాలు కూడా ఇదే విషయాన్ని నిరూపిస్తున్నాయి. (గతంలో
వజ్రా నాడి, చిత్రా నాడి లపై కూడా notes ఇచ్చాను. పాఠకులు గమనించగలరు...--భట్టాచార్య)
...చిత్రా నాడి, వజ్రా
నాడి లోనూ...బ్రహ్మ నాడి, చిత్రానాడి లోనూ లయం చెందుతాయి.
చిత్రా నాడి యొక్క క్రింద భాగంలో, బ్రహ్మ ద్వారము అనబడేది
ఉంటుంది. ఈ ద్వారము తెఱుచుకుంటేనే, కుండలినీ శక్తి అందులో
ప్రవేశించి ఊర్థ్వ గమిత్వం చెందుతుంది. ఈ కుండలినీ శక్తి, మూలాధారము
నుండి ప్రారంభమై...చక్రాల గుండా...ఊర్థ్వ పయనం గావిస్తుంది.
...కొన్ని సార్లు ఈ బ్రహ్మ నాడిని
"బ్రహ్మ రంధ్ర నాడి" అని కూడా అంటారు. కొన్ని సార్లు ఈ బ్రహ్మ నాడినే
సుషుమ్నా నాడి అని కూడా పిలుస్తారు..యోగ శాస్త్ర ప్రకారం,
మంత్రోచ్ఛాటన, ప్రాణాయామము, ధ్యానము...ఇవన్నీ కుండలినీ శక్తిని ఆయా నాడుల గుండా విహరింపజేస్తాయి.
వజ్ర నాడి
వజ్రా నాడి : ప్రాచీన యోగ శాస్త్రాల
ప్రకారం...."వజ్రా నాడి" అన్న నాడి, శరీరంలో ప్రవహించే
శక్తివంతమైన, శక్తి ప్రవాహ నాడీ వాహినులలో ముఖ్యమైనది.
"వజ్ర" అన్న పేరు సంస్కృత భాష నుండి గ్రహించబడింది. "వజ్ర" అనగా దృఢమైనది, ఉరుములాంటిది, దేనికీ లొంగనిది అని అర్థం. "నాడి"
అనగా, నాళము, ప్రవాహము అని అర్థము.
మూడు ముఖ్య నాడులు, వెనుబాము వెంబడి ప్రవహిస్తున్నాయి.
అవి 1. సుషుమ్నా నాడి 2. ఇడా నాడి 3. పింగళా నాడి. ఈ "వజ్రా నాడి" సూక్షమైన నాడులలో, మొదటి పొరగా ఉండి, సుషుమ్నా నాడిలో అంతర ప్రవాహ రూపంలో
ఉంటుంది.
వజ్రా నాడిని వజ్రిణి అని కూడా
అంటారు. ఈ వజ్రా నాడిలో మరల "చిత్రా నాడి" లేదా "చిత్రిణి"
ఉంటుంది. ఈ నాడులన్నీ సూక్ష్మాతి సూక్ష్మ నాడులు. ఈ వజ్రా నాడి, షట్చక్రాల శక్తులను చైతన్యవంతం చేస్తుంది. కుండలినీ శక్తిని కూడా చైతన్యం
చేస్తుంది.
ఈ వజ్రా నాడి మూలాధార చక్రంలో ప్రారంభమౌతుంది. వజ్రా నాడిలో గల చిత్రా
నాడిలో...ఒక మార్గం ఉంటుంది. ఈ మార్గాన్ని "బ్రహ్మ ద్వారం" అంటారు. ఈ
బ్రహ్మద్వారం ద్వారానే , చైతన్యం కాబడిన కుఃడలినీ శక్తి
ప్రవహిస్తుంది. ప్రాణాయామము,మంత్ర సాధన, సతత ధ్యానము...కుండలినీ శక్తి చైతన్యం చెందడానికి సహాయపడతాయి. చైతన్య వంతం
అయిన కుండలినీ శక్తి ఈ నాడీ మార్గాల ద్వారా ప్రవహిస్తుంది.
సుషుమ్ననాడి మధ్యలో మణిలాగా ప్రకాశించే వజ్రా అనే నాడి ఉన్నది. మరల దానిలో
చంద్ర సూర్య అగ్ని రూపమైన, బ్రహ్మవిష్ణు శివులతో కూడిన చిత్రా
(చిత్రిణి) అనే నాడి సాలెపురుగు దారములాగా ఉన్నది. నిర్మలమైన జ్ఞానోదయము
లేకపోవటంవలన ఈ నాడిని ఎవరూ తెలుసుకోలేరు. మరల ఆ చిత్రానాడిలోపల అతి సూక్ష్మమైన
విద్యున్మాలలాగా ఉజ్జ్వలంగా ప్రకాశిస్తూ బ్రహ్మనాడి అనే మరొక నాడి ఉన్నది.
ఈ బ్రహ్మనాడిలోని రంధ్రంద్వారా బ్రహ్మరంధ్రంలోని సహస్రార పద్మం నుండి సుధ
ప్రవహిస్తూ ఉంటుంది. యోగులు ఆ సుధను మూలాధార పద్మంవద్దనున్న కుండలినీ శక్తి ద్వారా
పానం చేసి, బ్రహ్మానందమును అనుభవిస్తారు.
"వజ్రా నాడి" లేదా "వజ్రిణి"...సుషుమ్నా నాడిలో ఉంటుంది. ఇది
స్వాధిష్ఠాన చక్రాన్ని ప్రభావితం చేస్తుంది. సూక్ష్మ శరీర కదలికలకు ఈ వజ్రానాడి
బాధ్యత వహిస్తుంది.
ఈ మానవ శరీరంలో గల కోట్ల నాడులలో 72,000 సూక్ష్మ నాడులు
ముఖ్యమైనవి. ఈ నాడులలో ఇడా, పింగళా, సుషుమ్నా నాడులు, గాంధారి, హస్తిజిహ్వ, కుహు, సరస్వతి, పూషా, శంఖిణి, పయస్విని, వారుణి, అలంబుస, విశ్వోదర, యశస్విని నాడులు ముఖ్యమైనవి. ఈ సుషుమ్నా
నాడిలో వజ్రా నాడి ఉంటుంది. సామాన్యంగా ఇడా నాడి జీవ నిర్మాణ క్రియలలో సంబంధం
కలిగి యుంటుంది. పింగళా నాడి ఉత్ప్రేరక క్రియలలో సంబంధం కలిగియుంటుంది. వజ్రా నాడి
అభివ్యక్తీకరణ (manifestation) ప్రక్రియలలో సంబంధం
కలిగియుంటుంది.
ఈ వజ్రా నాడి పరమ తేజస్సుతో ఉంటుంది. ఈ నాడి నిరంతరమూ ప్రకాశవంతంగా
ఉంటుంది. ఈ వజ్ర నాడి మూలాధారము నుండి ప్రారంభమై ఆజ్ఞా చక్ర పర్యంతమూ విస్తరించి
ఉంటుంది.
చిత్రా నాడి :
"చిత్ర" అన్నది ఒక సంస్కృత పదము. అనగా
అద్భుతమైనదని, అందమైనదని అర్థము. ఈ నాడి వజ్రా నాడిలో
ఉంటుంది. ఈ నాడి స్వచ్ఛమైనది, మూల రూపంలో ఉంటుంది.
దీనిలోపల "బ్రహ్మ నాడి" ఉంటుంది. ఈ బ్రహ్మ నాడి ద్వారానే కుండలినీ శక్తి
పయనిస్తుంది.
తీవ్రమైన యోగ సాధన వలన, చిత్రా నాడి లేదా
చిత్రిణి నాడి ప్రభావితమై...తన ద్వారా కుండలినీ శక్తిని ప్రవహింపజేస్తుంది. సాధనల
ద్వారా ఎప్పుడైతే కుండలినీ శక్తి చైతన్యవంతం అవుతుందో....చిత్రిణి నాడి మూలాధారం
నుండి ప్రారంభమౌతుంది. ఇది ఒక మేధోవంతమైన, వివిధ వర్ణాలతో ఉన్న
నాడి. ఈ చిత్రా నాడి చిన్న మెదడులో అంతమౌతుంది. అంటే మూలాధారం నుండి ప్రారంభమై
...ఆజ్ఞా చక్ర పర్యంతమూ విస్తరించి ఉంటూ...షట్చక్రాలకు అనుసంధానించబడి ఉంటుంది. ఈ
నాడి అమర జీవితాన్ని పాలిస్తుంది. అనగా immortal life ను ప్రభావితం చేస్తుంది. మోక్షాన్ని ఇస్తుంది.
ఈ చిత్రానాడి చైతన్య ప్రవాహ నాడిగా చెప్పబడింది. ఈ చిత్రానాడి మూలాధారం
నుండి ఆజ్ఞ వరకు, ఆజ్ఞ నుండి మూలాధారం వరకు సంచారం
చేస్తుంది. ఈ చిత్రానాడి రెండు చలనాలను కలిగియుంటుంది. 1. ఈ నాడి బహిరంగ ప్రపంచం వైపుగా చలిస్తుంది. 2. బహిర్ ప్రపంచం నుండి అంతర్జగత్తుకు కూడా సంచారం చేస్తుంది. ఎప్పుడైతే చిత్రిణి
నాడి...తన ప్రవాహ మార్గంలో ఆటంక పరచబడుతుందో...మనం మనస్సు యొక్క బహిర్ తత్వం, భావనలు,భావాలు, పంచేద్రియాల బహిరంగ
అనుభవాలఉచ్చులో పడతాం.
No comments:
Post a Comment