శ్రీ మాత్రేనమః
అద్బుతమైన "కైలాస కోన" ప్రకృతి ఒడిలో, నా శివుడు/అమ్మ సన్నిధి లొ , ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసి సిద్ది పొంది ఎంతోమంది సాధకులకోసం, రాళ్ళతో నిండిన ఆ కోనలో, రాబోయే సాధకుల సాధన అడుగులకోసం,తన చేతులతో రాళ్లు పేర్చి దారి చూపిన "కంచి విశ్వనాధ స్వామి" సమాధి దగ్గర, అందమయిన ఆడవి, అంతకన్నా అందమయిన మంచి మనస్సున్న సాధకులు "రామానంద స్వామి" మరియు "జీవనముక్తానంద స్వామి" సముఖంలో, నేను చూసిన పరి పూర్ణమైన ప్రేమ మూర్తి, మాకోసం వచ్చి, ఆ ప్రేమను పంచి, మమ్ములని ముందు నడిపించడానికి నా శివుడు నా కోసం పంపించిన, నాకు దీక్ష ఇచ్చిన గురువు "రవి స్వామి" కి నా హృదయపూర్వక ధన్యవాదములు.
అనిర్వచనీయమయిన ఆనందం తో నాంది పలికిన నా ఈ క్రొత్త ప్రయాణానికి ఎప్పుడూ ...నాలోని, నాతో వుండే నా శివుడి కి, ఆ యోగ మాత లలితా పరమేశ్వరి కి నా శత కోటి నమస్కారములు
🙏 -సురేష్ - 🙏
No comments:
Post a Comment