Translate

Wednesday, January 18, 2023

దశమహా విద్యలు( గాయత్రి మంత్ర సహితం) (Dasamahavidya Gayatri Mantras)

 


దశమహా విద్యలు( గాయత్రి మంత్ర సహితం)




శ మహావిద్యలలో మొదటిది కాళి రూపం. సమస్త విద్య లకు ఆదిరూపం మహాకాళి. ఆ దేవి విద్యామయ శక్తులనే మహావిద్యలని అంటారు. కృష్ణ వర్ణంలో ఉండటంవల్ల దేవికి కాళీ అనే నామ మేర్పడింది. అనేక సంవత్సరములకు కాని ఫలించని యోగ మార్గ సాధన కొద్ది మాసాలలోనో, రోజుల్లోనో సాధించాలనుకొంటే కాళీ ఉపాసన చేస్తారు. కాని కాళీశక్తిని తమ శరీరంలోనికి ఆకర్షిం చుకొనేటప్పుడు అగ్నితో సమాన మైన మంటలని, భయంకరమైన బాధని యోగి అనుభ విస్తారు.

రెండవది తారా రూపం. తరింప చేసే దేవి కాబట్టి తార అయ్యింది. ఈమెను నీలసరస్వతి అని కూడా అంటారు. వశిష్ఠ మహర్షి గొప్ప తారా ఉపాసకుడు.

 మూడ వది ఛిన్నమస్త. పార్వతి తన సఖురాండ్రైన డాకినీ, వర్ణినీ లతో మందాకినీ నదికి స్నానానికై వెళ్ళింది. స్నానం చేసిన తరువాత వారిద్దరు ఆకలిగా ఉందని తమ ఆకలిని తీర్చ మని అడగటంతో దేవి ఖడ్గంతో తన శిరస్సుని ఖండించు కున్నది. ఖండిత శిరస్సును ఆమె తమ వామ హస్తంలో పట్టుకొన్నది. దానినుండి వెలువడ్డ మూడు ధారలను ముగ్గురు త్రాగి తమ ఆకలిని తీర్చుకున్నారు. అప్పటి నుండి ఆమె ఛిన్నమస్తాదేవిగా ప్రసిద్ధి పొందింది.

నాల్గవది షోడశీమహేశ్వరి. పార్వతీదేవి యొక్క ముగ్ధ మోహన మైన 16 సంవత్సరాల ప్రాయపు రూపమే షోడశీ మహేశ్వరి. ఈ తల్లిని ప్రసన్నం చేసుకోడానికి సాధకులు షోడశాక్షరీ (16 అక్షరాలుకల) మంత్రాన్ని జపిస్తారు. ఈ దేవిని ఆశ్రయించిన వారికి అన్ని విద్యలు అరచేతిలోనే ఉంటాయి. ఈ దేవి ఉపాసన వల్ల భోగము, మోక్షము రెండూ సిద్ధిస్తాయి

అయిదవ రూపం భువనేశ్వరీదేవి. ఈ దేవిని ఏడుకోట్ల మహా మంత్రాలు ఆరాధి స్తుంటాయి. ఈ విశ్వాన్ని సృష్టించాలనే అభిలాషతో బ్రహ్మ క్రియా శక్తిని ఆహ్వానిస్తూ తీవ్రమైన తపస్సు చేసారు. ఆ తపస్సుకు మెచ్చిన పరమేశ్వరి భూదేవి రూపంలో ప్రత్యక్షమైంది. విశ్వానికే అధిదేవత కాబట్టే భువనేశ్వరీ అని పిలుస్తారు. అవ్యక్తంనుండి వ్యక్తమైన బ్రహ్మాండరూపం, చైతన్య స్వరూ పమే భువనేశ్వరీదేవి. 

ఆరవది త్రిపురభైరవి రూపం. కొన్ని ప్రత్యేకమైన క్లిష్ట పరిస్థితులు ఏర్పడినప్పుడు వాటిని రూపుమాపగల శక్తిని త్రిపురభైరవి అంటారు.ఈ శక్తిని నృసింహ భగవానుడి అభిన్నశక్తిగానూ, కాలభైరవుని అవ తారంగా కూడా పరిగణిస్తారు

ఏడవ రూపం ధూమావతి. ఈ దేవి ఉగ్రతారయే. ఈమె శరణాగతి వల్ల విపత్తులు నాశనమై సంప దలు లభిస్తాయి. జీవుని ఆకలి, దప్పికల బాధలకు, కలహ- దారిద్ర్యాలకు ఈమె కర్త. ఈ తల్లి అనుగ్రహం ఉంటే సమస్యలన్ని దూరం అవుతాయి. 

బగళాముఖి ఎనిమిదవ రూపం. కుటుంబ పరంగాను, ఆధ్యాత్మికంగాను, దేశంలోను, సమాజంలోను వికాసానికి అడ్డంకులుగా ఉన్న అరిష్టాలను రూపుమాపడానికి, శత్రువులను అణగత్రోక్కడానికి ఈ మాతను ఆరాధిస్తారు. బ్రహ్మ, విష్ణు, పరశురాములు ఈ దేవి ఉపాసకులే. చాలాకాలంవరకు తిరుపతి వేంకటేశ్వరుని బగళాముఖిగా పూజించారు.

తొమ్మి
దవ రూపమైన మాతంగి మతంగ మహాముని కుమార్తె. మాతంగికి గృహస్థ జీవితాన్ని సుఖవంతం చేసే శక్తి ఉంది. 

పదవరూపమైన కమలాలయ సమృద్ధికి ప్రతీక. ఈమె అనుగ్రహంవల్ల రాజభోగం, కీర్తి లభిస్తాయి.

######################################################################################



దశమహా విద్యలు – శ్రీకాళీదేవి ( తొలి మహా విద్య )
కాళీ గాయిత్రి: . ఓమ్ కాళికాయై చ విద్మహే స్మశాన వాసిన్యై ధీమహి తన్నో ఘోరా ప్రచోదయాత్!!
కృష్ణ వర్ణంతో ప్రకాశించే శ్రీకాళీదేవి దశమహావిద్యలలో మొదటి మహావిద్య. ఆశ్వయుజమాసం కృష్ణపక్ష అష్టమీ తిథి ఈ దేవికి ప్రీతిపాత్రమైనది. శ్రీకాళీదేవి ఉపాసన ఎంతో ఉత్కృష్టమైనదిగా శాక్రేయసంప్రదాయం చెబుతోంది. తంత్రోక్త మార్గంలో శ్రీకాళీ మహా విద్యని ఆరాధిస్తే సకల వ్యాధుల నుంచి, బాధల నుంచి విముక్తి కలుగుతుంది. అంతేకాదు శత్రు నాశనం, దీర్షాయువు, సకలలోక పూజత్వం సాధకుడికి కలుగుతుంది.

దశ మహావిద్యలు – శ్రీతారాదేవి ( 2 వ మహా విద్య )
తారా గాయిత్రి: ఓమ్ తారాయైచ విద్మహే మహాగ్రాయైచ ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్!!
దశ మహావిద్యలలో రెండవ మహా విద్య శ్రీతారాదేవి. నీలవర్ణంతో భాసించే ఈ దేవికి చైత్రమాసం శుక్లపక్ష నవమి తిథి ప్రీతిపాత్రమైంది. శ్రీతారాదేవి వాక్కుకి అధిదేవత. ఈ దేవిని నీలసరస్వతి అని కూడా పిలుస్తారు. తారాదేవి సాధనవల్ల శత్రునాశనం, దివ్యజ్ఞానం, వాక్సిద్ధి, ఐశ్వర్యం, కష్టనివారణ సాధకుడికి లభిస్తుంది.

దశ మహావిద్యలు – శ్రీషోడశీదేవి (3 వ మహా విద్య
షోడసి ( త్రిపురసుందరి ) గాయిత్రి: ఓమ్ ఐం త్రిపురాదేవ్యై విద్మహే క్లీం కామేశ్వయై ధీమహి సౌ స్త న్త్రః క్లిన్నో ప్రచోదయాత్!!
అరుణారుణ వర్ణంతో ప్రకాశించే శ్రీషోడశీదేవి దశమహావిద్యలలో 3వ మహావిద్యగా ప్రసిద్ధిపొందింది. పరమ శాంతి స్వరూపిణి అయిన ఈ దేవికి మార్గశిరమాస పూర్ణిమాతిథి ప్రీతిపాత్రమైనది. ఈ తల్లినే లలిత అని, రాజరాజేశ్వరి అని, మహాత్రిపురసుందరి అని అంటారు. ఎంతో మహిమాన్వితమైన ఈ మహావిద్యని ఉపాసిస్తే ఆసాధకుడికి అన్నిరకాల కష్టనష్టాలనుంచి విముక్తి మానసికశాంతి, భోగం, మోక్షం కలుగుతాయి.

దశ మహావిద్యలు - శ్రీ భువనేశ్వరీదేవి. ( 4 మహా విద్య )
భువనేశ్వరీ గాయిత్రి: ఓమ్ నారాయణైచ విద్మహే భువనేశ్వయై ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్!!
దశ మహావిద్యలలో 4వ మహావిద్య శ్రీ భువనేశ్వరీదేవి. ఉదయించే సూర్యుడిలాంటి కాంతితో ప్రకాశించే ఈ దేవికి భాద్రపద శుక్లపక్ష అష్టమీ తిథి ప్రీతిపాత్రమైనది. ఈ దేవి సంపూర్ణ సౌమ్యస్వరూపిణి. ఈ దేవిని ఉపాసించే సాధకుడికి మూడో కన్ను తెరుచుకుంటుంది. భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసుకునే శక్తి లభిస్తుంది. అంతేకాదు, రాజ్యధికారాన్ని సమస్త సిద్దుల్ని సకల సుఖభోగాల్ని ఈదేవి అనుగ్రహంతో సాధకులు పొందవచ్చు.

దశ మహావిద్యలు - శ్రీ త్రిపుర భైరవీ దేవి (5వ మహా విద్య)
భైరవీ గాయిత్రి: ఓమ్ త్రిపురాయైచ విద్మహే భైరవ్యైచ ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్!!
దశమహావిద్యలలో 5వ మహా విద్య వేల సూర్యుల కాంతితో ప్రకాశించే శ్రీ త్రిపుర భైరవీ దేవి. ఈ దివ్యశక్తి స్వరూపిణికి మాఘమాసం పూర్జిమాతిథి ప్రీతిపాత్రమైనది. ఆర్తత్రాణ పరాయణి అయిన ఈ మహావిద్యని ఆరాధిస్తే వివిధ సంకటాల నుంచి, బాధల నుంచి విముక్తి లభిస్తుంది. సకల సుఖభోగాలను పొందే శక్తి, సకల జనాకర్షణ, సర్వత్రా ఉత్కర్షప్రాప్తి సాధకుడికి కలుగుతుంది.

 

దశ మహావిద్యలు - శ్రీ ఛిన్నమస్తాదేవి. (6వ మహా విద్య)
చిత్రమస్త గాయిత్రి: ఓమ్ వైరోచన్యైచ విద్మహే చిత్రమస్తాయై ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్!!
దశ మహావిద్యలలో 6వ మహావిద్య శ్రీ ఛిన్నమస్తాదేవి. ఈ దేవినే వజ్ర వైరోచినీ, ప్రచండ చండీ అని కూడా పిలుస్తారు. వైశాఖ మాసం శుక్లపక్ష చతుర్థి తిథి ఈ దేవికి ప్రీతిపాత్రమైంది. శాక్తేయ సంప్రదాయంలో భిన్నమస్తాదేవికీ ఎంతో ప్రశస్తివుంది. ఈ దేవిని నిష్టతో ఉపాసిస్తే సరస్వతీసిద్ధి, శత్రువిజయం, రాజ్యప్రాప్తి, పూర్వజన్మ పాపాలనుంచి విముక్తి లభిస్తుంది. అంతేకాదు, ఎటువంటి కార్యాలనైనా ఆవలీలగా సాధించే శక్తి ఈ దేవి ప్రసాదిస్తుంది

దశ మహావిద్యలు - శ్రీ ధూమవతీ (7వ మహా విద్య)
ధూమవతీ గాయిత్రి: ఓమ్ ధూమవత్యైచ విద్మహే సంహారిణ్యైచ ధీమహి తన్నో ధూమ ప్రచోదయాత్!!

దశ మహావిద్యలలో 7వ మహావిద్య.. ధూమ వర్ణంతో దర్శనమిచ్చే శ్రీ ధూమవతీ దేవికి చెందింది. జ్యేష్ఠమాసం శుక్లపక్ష అష్టమీతిథి ఈ దేవికి ప్రీతిపాత్రమైంది. ఈ దేవతకి ఉచ్చాటనదేవత అని పేరు. తన ఉపాసకుల కష్టాల్ని, దరిద్రాల్ని ఉచ్చాటన చేసి అపారమైన ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. ఈ ధూమవతీదేవి ఆరాధనవల్ల సాధకుడికి వివిధ వ్యాధుల నుంచి, శోకాల నుంచి విముక్తి లభిస్తుంది.

దశ మహా విద్యలు - శ్రీ బగళా ముఖి దేవి (8వ మహా విద్య)
భగళాముఖి గాయిత్రి: ఓమ్ భగళాముఖ్యైచ విద్మహే స్తంభిన్యైచ ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్!!
దశమహావిద్యలలో 8వ మహావిద్య.. పసుపు వర్ణంతో ప్రకాశించే శ్రీబగళా ముఖీ దేవికి చెందింది. స్తంభన దేవతగా ప్రసిద్ధి పొందిన ఈ మహాదేవికి వైశాఖమాస శుక్లపక్ష అష్టమీతిథి ప్రీతిపాత్రమైనది. ఈ దేవతా ఉపాసన వల్ల సాధకుడికి శత్రువుల వాక్యని స్తంభింపచేసే శక్తి లభిస్తుంది. ముఖ్యంగా కోర్టు వ్యవహారాల్లో, వాదప్రతివాద విషయాల్లో ఎదుటిపక్షం వారి మాటల్ని స్థంభింపచేసి వ్యవహార విజయాన్ని సాధకులకు ప్రసాదిస్తుంది.

దశ మహావిద్యలు - శ్రీ మాతంగీదేవి. (9వ మహా విద్య)
మాతంగీ గాయిత్రి: ఓమ్ మాతంగ్యైచ విద్మహే ఉచ్ఛిష్ఠ ఛాండాళ్యైచ ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్!!
దశ మహావిద్యలలో తొమ్మిదవ మహావిద్య.. మరకతమ వర్ణంతో ప్రకాశించే శ్రీ మాతంగీదేవికి చెందింది. వశీకరణ దేవతగా ప్రశస్తి పొందిన మాతంగీదేవికి వైశాఖమాసం శుక్లపక్ష తృతీయాతిథి ప్రీతిపాత్రమైనది. రాజమాతంగీ, లఘుశ్యామలా, ఉచ్చిష్టచండాలి, అనే పేర్లతో కూడా ఈ దేవిని పిలుస్తుంటారు. ఈ దివ్య స్వరూపిణి ఉసాసనవల్ల వాక్సిద్ధి, సకల రాజ స్త్రీ పురుష వశీకరణాశక్తి, ఐశ్వర్యప్రాప్తి సాధకుడికి లభిస్తాయి.

దశ మహావిద్యలు - శ్రీ కమలాత్మికాదేవి (10వ మహా విద్య)

1. ఓమ్ మహాదేవ్యైచ విద్మహే విష్ణు పత్నైచ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్!!
( మూలమంత్రం: ఓమ్ క్లీం శ్రీం లక్ష్మీదేవ్యై నమః )

పద్మాసనాసీనయై స్వర్ణకాంతులతో ప్రకాశించే శ్రీ కమలాత్మికాదేవి దశ మహావిద్యలలో 10వ మహావిద్యగా ప్రశస్తిపొందింది. సకల ఐశ్వర్య ప్రదాయిని అయిన ఈదేవికి మార్గశిరే అమావాస్యతిథి ప్రీతిపాత్రమైనది. కమలాత్మిక లక్ష్మీస్వరూపిణి అని అర్థం. శాంత స్వరూపిణి అయిన ఈ మహావిద్యని ఉపాసిస్తే సకలవిధ సంపదల్ని పుత్రపౌత్రాభివృద్ధిని, సుఖసంతోషాల్ని సాధకుడికి శ్రీ కమలాత్మికాదేవి ప్రసాదిస్తుంది.
శ్రీ మాత్రే నమః

No comments:

Post a Comment