లెవెల్ -4 పూర్తి చేసుకున్న ధ్యాన మిత్రులందరికీ SKS తరుపున *_శుభాకాంక్షలు_* :bouquet::bouquet:
*చక్ర మెడిటేషన్* చేసే విధానము
1. షీల్ల్డ్( కవచము)
రెండుసార్లు( ధ్యానానికి ముందు తరువాత)
2. ప్రార్థన (2ని ll పాటు)
*ఓ గురుదేవా త్రికరణ శుద్ధితో నన్ను, మీకు సమర్పించుకొంటున్నాను*
*ఓ గురుదేవా దయచేసి నా కుండలిని మరియు చక్రాలన్నిటిని జాగృతం చేయండి**
*3* *. అంతర్ముఖం* (2ని ll పాటు)
మీ రెండు బ్రొటన వ్రేళ్ళు చెవుల్లో పెట్టుకొని చూపుడు వేలు,మధ్యవేలు కళ్ళ పై పెట్టుకుని మీ లోపల జరిగే శబ్దంతో ఏకమవ్వండి .
*4* . భూతశుద్ది (10 ని ll పాటు)
మీ శరీరము మొత్తము పంచభూత తత్వము తో ఉన్నదని భావిస్తూ
*భూతత్వము*
మీ శరీరం మొత్తం అనగా పాదాల నుంచి శిరస్సు వరకు భూమిగా భావించి *మూలాధారం* దగ్గర మీ దృష్టిని పెట్టి భుమిగా భావిస్తూ నా లోని భూ తత్వం సంపూర్ణంగా శుధ్ధి చేయబడినది.
*జలతత్వం*
మీ శరీరం మొత్తం అనగా పాదాల నుంచి శిరస్సు వరకు జలంగా భావించి *స్వాధిష్ఠాన* చక్రం దగ్గర మీ దృష్టిని పెట్టి నీరుగా భావిస్తూ నా లోని జలతత్వం సంపూర్ణంగా శుధ్ధి చేయబడినది.
*అగ్నితత్వం*
మీ శరీరం మొత్తం అనగా పాదాల నుంచి శిరస్సు వరకు అగ్నిగా భావించి *మణిపూరక* చక్రం దగ్గర మీ దృష్టిని పెట్టి అగ్నిగా భావిస్తూ నా లోని అగ్నితత్వం సంపూర్ణంగా శుధ్ధి చేయబడినది.
*వాయుతత్వం*
మీ శరీరం మొత్తం అనగా పాదాల నుంచి శిరస్సు వరకు వాయువుగా భావి విం చి *అనాహతచక్రం* దగ్గర మీ దృష్టిని పెట్టి వాయివుగా భావిస్తూ నా లోని వాయుతత్వం సంపూర్ణంగా శుధ్ధి చేయబడినది.
*ఆకాశతత్వము*
మీ శరీరం మొత్తం అనగా పాదాల నుంచి శిరస్సు వరకు ఆకాశంగా భావించి *విశుద్ధిచక్రం* దగ్గర మీ దృష్టిని పెట్టి ఆకాశంగా భావిస్తూ నా లోని ఆకాశతత్వం సంపూర్ణంగా శుధ్ధి చేయబడినది.
*5* చక్రాలలోని అవాంతరాలు తొలగించే ప్రక్రియ (10 ని ll పాటు)
మొదటగా మీ చేతి బ్రొటన వెలితో మూలాధారం నుండి సహస్రారం వరకు 12 సార్లు ఒక్కొక చక్రం దగ్గర నొక్కి తర్వాత చూపుడు వేలితో ముందర గానీ, వెనుక గానీ సవ్య దిశలో అనగా గడియారం తిరిగే క్రమంలో తిప్పుతూ ఇలా అనుకోవాలి;
నా మూలాధార చక్రం లోని అవాంతరాలన్నీ తొలగిపోవాలి.
తతర్వాత, నా మూలాధార చక్రం లోని అవాంతరాలన్నీ తొలగిపోయాయి.
ఇలాగే ప్రతి చక్రం దగ్గర చేస్తూ సహస్రారం వరకు చేయడం.
*6* శివుని యొక్క లింగాలను జాగ్రృతం చేయడం
మూలాధార చక్రం దగ్గర 12 సార్లు నొక్కి, అక్కడే మీ దృష్టిని పెట్టి గమనిస్తూ నా లోని స్వయంభూ లింగం జాగ్రృతమైనది అనుకోవాలి (2ని ll పాటు).
అనాహత చక్రం దగ్గర 12 సార్లు నొక్కి, అక్కడే మీ దృష్టిని పెట్టి గమనిస్తూ నా లోని బాణ లింగం జాగ్రృతమైనది అనుకోవాలి (2 ని ll పాటు)
ఆజ్నా చక్రం దగ్గర 12 సార్లు నొక్కి, అక్కడే మీ దృష్టిని పెట్టి గమనిస్తూ నా లోని ఐతర లింగం జాగ్రృతమైనది అనుకోవాలి (2 ని ll పాటు).
సహస్రార చక్రం దగ్గర 12 సార్లు నొక్కి, అక్కడే మీ దృష్టిని పెట్టి గమనిస్తూ నా లోని పర లింగం జాగ్రృతమైనది అనుకోవాలి (2 ని ll పాటు)
*7* బిందును ఆక్టివేట్ చేయడం
ఎడమ బొటన వేలిని స్వాధిష్ఠానం దగ్గర మరియు కుడి బొటన వేలిని బిందు దగ్గర పెట్టుకొని ఒకే సారి రెండింటినీ 24 సార్లు నొక్కాలి, నొక్కిన తర్వాత రెంటినీ ఒక గీత కనెక్ట్ చేసినట్లు భావిస్తూ అక్కడే మీ దృష్టిని పెట్టీ గమనిస్తూ ఉండాలి (3 ని ll పాటు)
*8* చక్ర మెడిటేషన్ (10 ని ll పాటు).
ఇప్పుడు సహస్రారం నుండి మూలాధారం వరకు కమలం యొక్క కాడ లాగ భావించి,
ఆ తర్వాత సహస్రారం దగ్గర ఇంకా విరియని మొగ్గ ఉన్నట్లు భావిస్తూ, అన్ని చక్రాల దగ్గర ఇలాగే భావించాలి.
ఇప్పుడు, "శివో" అని శ్వాస తీసుకుంటూ అలాగే తలపైనుంచి విశ్వశక్తి *సహస్రారం* వరకు వస్తున్నట్లు ఒకే సారి భావిస్తూ ఆ శక్తి తాకగానే "హం" అంటూ కాడ పువ్వులా వికసించి నట్లు భావించాలి.
ఆతర్వాత, "శివో" అని శ్వాస తీసుకుంటూ అలాగే విశ్వశక్తిని *ఆజ్నా చక్రం* వరకు వస్తున్నట్లు ఒకే సారి భావిస్తూ ఆ శక్తి తాకగానే "హం" అంటూ కాడ పువ్వులా వికసించి నట్లు భావించాలి.
అలా విశ్వశక్తిని అక్కడ నుంచి అలా ఒక్కొ క్క చక్రం దాటుతూ మూలధార చక్రం వరకు తీసుకువ చ్చి అక్కడి నుంచి మళ్లీ,
"శివో" అని శ్వాస తీసుకుంటూ అలాగే విశ్వశక్తిని * స్వాధిష్ఠాన చక్రం* వరకు వస్తున్నట్లు ఒకే సారి భావిస్తూ ఆ శక్తి తాకగానే "హం" అంటూ వికసించిన పువ్వు ఇంకా బలంగా అవుతున్నట్లు భావించాలి.
తర్వాత, "శివో" అని శ్వాస తీసుకుంటూ అలాగే విశ్వశక్తిని * మనిపూరక చక్రం* వరకు వస్తున్నట్లు ఒకే సారి భావిస్తూ ఆ శక్తి తాకగానే "హం" అంటూ శ్వాస విడుస్తూ వికసించిన పువ్వు ఇంకా బలంగా అవుతున్నట్లు భావించాలి.
అలా, ప్రతి చక్రం దగ్గర మీ దృష్టిని పెట్టి అక్కడ నుంచి అలా ఒక్కొ క్క చక్రం దాటుతూ అక్కడి నుంచి మళ్లీ, "శివో" అని శ్వాస తీసుకుంటూ అలాగే విశ్వశక్తిని *సహస్రార చక్రం * వరకు వస్తున్నట్లు ఒకే సారి భావిస్తూ ఆ శక్తి తాకగానే "హం" అంటూ శ్వాస విడుస్తూ వికసించిన పువ్వు ఇంకా బలంగా అవుతున్నట్లు భావించాలి.
*9* శక్తి చలనం
ఇప్పుడు, "శివో" అని శ్వాస తీసుకుంటూ అలాగే విశ్వశక్తిని సహస్రార చక్రం నుండి మూలాధార చక్రం వరకు వస్తున్నట్లు ఒకే సారి భావిస్తూ, "హం" అంటూ శ్వాస విడుస్తూ ఆ శక్తిని మూలాధారం నుంచి సహస్రారం వరకు వెల్తున్నట్లు ఒకే సారి భావించాలి.
అలా, "శివో" అంటూ పైనుంచి కిందికి, "హం" అంటూ కిందినుంచి పైకి,
పైనుంచి కిందికి, కిందినుంచి పైకి ;
పైనుంచి కిందికి, కిందినుంచి పైకి...
ఇలా వీలైనంత వేగంగా చేయాలి (5 ని ll పాటు).
*10 * మనస్సును మంత్రంతో అనుసంధానము చేయుటం
మీ దృష్టిని భూమధ్యలో (కనుబొమ్మల మద్యలో)నిలిపి *శివోహం* మంత్రాన్ని జపిస్తూ ఎటువంటి ఆలోచనలు లేకపోతే 1 అనే సంఖ్యను లెక్కించండి. మళ్లీ *శివోహం* మంత్రాన్ని జపిస్తూ ఎటువంటి ఆలోచనలు లేకపోతే 2 అనే సఖ్యను లేక్కించండి. ఈ విధంగా *1* నుంచి*12* అంకెల వరకు లేక్కించండి. ఒకవేళ మద్యలో ఆలోచనలు వచ్చినట్లయితే మళ్ళీ *1* నుంచి లెక్కించండి.(10 ని ll పాటు)
*ఈ విధముగా ఉదయం, సాయంత్రం 41 నిll నుంచి ఒక గంట తక్కువ కాకుండా సాధనను కొనసాగించాలి.*
or reload the browser
No comments:
Post a Comment