Translate

Print

Showing posts with label శ్రీభువనేశ్వరీ రక్షా కవచమ్‌ (sree Bhuvaneswari Raksha Kavacham in Telugu). Show all posts
Showing posts with label శ్రీభువనేశ్వరీ రక్షా కవచమ్‌ (sree Bhuvaneswari Raksha Kavacham in Telugu). Show all posts

Sunday, January 26, 2025

శ్రీభువనేశ్వరీ రక్షా కవచమ్‌ (Bhuvaneswari Raksha Kavacham in Telugu)

 శ్రీభువనేశ్వరీ రక్షా కవచమ్‌


ఇది శ్రీ దేవీ మహాభాగవతం-  తృతియ స్కంధం - 19, అధ్యాయం నుండి గ్రహించబడినది. నిత్య పఠించండి.

శ్రీ భువనేశ్వరీ మాతను ప్రార్థించండి. మీ పిల్లలకు దైవశక్తితో కూడిన అమోఘమైన రక్షణ కవచాన్ని కల్పించి కాపాడండి. శేషం భగవత్కృప)

 (ముందుగా శ్రీశివుణ్ణి గురువుగా భావించి ఈ క్రింది మంత్రాన్ని (11) పదకొండుసార్లు జపించాలి).

ఓం శ్రీ శివాయ గురవే నమః”  

(తదుపరి శ్రీవ్యాసమహర్షిని ప్రార్ధించాలి. ఈ దిగువ ప్రార్థన శ్లోకాన్ని పఠించాలి.)

వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై పబ్రహ్మనిధయే వాసిష్టాయ నమో నమః ॥

 

తర్వాత ఈ (క్రింది మంత్రాన్ని ముహూర్తాది కాలదోషాల నివృత్తికోసం "" వదకొండుసార్లు జపించాలి.)

ఓం శ్రీ నిత్యయౌవనాదేవ్యై నమః

 (పిమ్మట విశ్వపాలినియగు జగన్మాతయొక్క వాత్సల్యపూరిత మాతృప్రేమను అఖండంగా పొందుటకుగాను ఈ క్రింద ఈయబడిన మంత్రాన్ని (11) పదకొండుమార్లు జపించాలి. )

 ఓం శ్రీ విశ్వజనన్యై నమః

 

(ఇప్పుడు దిగువ ఈయబడిన రక్షాకవచం పారాయణ చేయాలి.)

అగ్రతస్తే అంబికా పాతు పార్వతీ పాతు పృష్టతః | పార్వతీ పార్శ్వయోః పాతు శివా సర్వత్ర సాంప్రతమ్ ॥ 1

వారాహీ విషమే మార్గే దుర్గా దుర్గేషు కర్హిచిత్‌ | కాళికా కలహే ఘోరే పాతు త్వాం పరమేశ్వరీ ॥ 2

 మండపే తత్ర మాతంగీ తథా సౌమ్యా స్వయంవరే- భవానీ భూపమధ్యే తు పాతు త్వాం భవమోచనీ ॥ 3

 గిరిజా గిరిదుర్గేషు చాముండా చత్వరేషు చ | కామగా కాననేష్వేవం రక్షతు త్వాం సనాతనీ ॥ 4

వివాదే వైష్ణవీ శక్తిరవతాత్త్వాం రఘూద్వహ | భైరవీ చ రణే సౌమ్య శత్రూణాం వై సమాగమే ॥ 5

సర్వదా సర్వదేశేషు పాతు త్వాం భువనేశ్వరీ | మహామాయా జగద్ధాత్రీ సచ్చిదానందరూపిణీ ॥ 6

ఇతి శ్రీ దేవీ భాగవతే మహాపురాణే తృతీయ స్కంధే ఏకోనవింశోధ్యాయాంతర్గతే శ్రీభువనేశ్వరీ రక్షా కవచమ్‌ సంపూర్ణమ్‌ ॥