Translate

Saturday, September 10, 2022

Aura Colors in Telugu-ఆరా వర్ణాలు

🔺 మరణం లేని  మనం 🌺
🌹 ఆరా 🌹

◆  శరీరాన్ని అదే ఆకారంలో ఆవరించి ' ఎథిరిక్ ' ఉంటుంది. శరీరాన్ని చుట్టూ ' ఎథిరిక్ ' ఆవరించి ఉన్నట్టే ' ఎథిరిక్ ' చుట్టూ ' ఆరా,మానవ దేహాన్ని కొంత దూరం వరకు ఆవరించి ఉంటుంది . ' ఆరా ' కూడా ' ఎథిరిక్ లాగానే ఎలక్ట్రిక్ , మాగ్నెటిక్ శక్తితోనే ఏర్పడి ఉందని గ్రహించవచ్చు . 

◆ దివ్యాత్మ ( Over self ) లోని రంగుల్ని ' ఆరా ' చూపిస్తుందని మనం చెప్పుకోవచ్చు . ఓ వ్యక్తి ఆరా రంగుల్ని గమనించి " అతడు ఆధ్యాత్మికంగా పయనిస్తున్నాడా ? లేకపోతే ఓ పశువులాగా ప్రవర్తిస్తున్నాడా ? " అని వెంటనే గుర్తించవచ్చు . అలాగే ఓ వ్యక్తి “ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాడా ? అనారోగ్యంతో ఉన్నాడా ? కాకపోతే మరే జబ్బుతోనైనా బాధపడుతూ ఉన్నాడా ? " అని సులభంగా గుర్తు పట్టవచ్చు . మన ప్రవృత్తి మొత్తం స్పష్టంగా మన ' ఆరా'లో ప్రతిబింబిస్తూ ఉంటుంది . మన దివ్యాత్మని ప్రస్పుటంగా ఈ ' ఆరా ' చూపుతూ వుంటుంది . ' దివ్యాత్మ ' అనే పదం కన్నా ' ఆత్మ ' అన్న పదం నచ్చితే దాన్ని ఉపయోగించుకోవచ్చు. అర్ధం ఏమీ మారిపోదు . “ ఆత్మ ” అన్నా , “ దివ్యాత్మ " అన్నా ఒకటే అర్ధం వస్తుందని మనం గ్రహించాలి.

◆ ఆరాలో ఆరోగ్యాన్నీ , జబ్బునీ గమనించవచ్చు . నిరాశా నిస్పృహల్నీ , జయాపజయలనూ , ప్రేమ , పగలనూ కూడా స్పష్టంగా గుర్తించవచ్చు . మనలోని ప్రతి ఊహా , ప్రతి సంకల్పమూ మన ఆరా లోని రంగుల్లో స్పష్టంగా రూపుదిద్దుకుని ఉంటుంది . ఓ మనిషి చావు బ్రతుకుల్లో ఉంటే అతని ఆరా తనలోని రంగుల్ని కొల్పోయి పూర్తిగా నిర్జీవమయి ఉంటుంది . ఆ మనిషి చనిపోక ముందే ఆరా తన ఉనికిని పూర్తిగా 
పోగొట్టుకుంటుంది. ఆ వ్యక్తి చనిపోయే సమయానికి ఆరా పూర్తిగా మాయమై కొద్దిగా ఎథిరిక్ మాత్రం మిగిలి ఉంటుంది . ఓ భయంకరమైన జబ్బుతో చాలా కాలం తీసుకుని మరణించాడని అనుకుందాం. అలాంటి వ్యక్తి ఆరా పూర్తిగా జీర్ణమైపోయి ఉంటుంది . అలా కాకుండా మురో సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న వ్యక్తి అనుకోని ప్రమాదంలో ప్రాణాల్ని కోల్పోతే ఆ వ్యక్తి మరణించిన తరువాత చాలా కాలం వరకు కూడా ఆ కలేబరాన్ని ఆవరించే ఉంటుంది .

◆ఏ మనిషి ఉన్నట్టుండి చచ్చిపోడు. దానికో పెద్ద తంతు ఉంది. ఏ పద్దతిలో మనిషి చచ్చినా - చటుక్కున తల తెగిపోయి మరణించినా సరే - శరీరంలోంచి ప్రాణం ఓపట్టాన బయటకు పోదు . శరీరం కొంత సేపటి వరకు కొట్టుకుంటూనే ఉంటుంది . మెదడులో ఎలక్ట్రిక్ కరెంట్ తయారవుతుంది , నిలువ ఉంటుంది.రక్తం మెదడులోకి లోహాల అణువుల్నీ , తగినంత తేమనీ , విద్యుత్ తయారయ్యేందుకు ఉపకరించే రసాయన పదార్థాలనూ చేరవేస్తూంటుంది . తయారైన విద్యుత్ మెదడు కణాలలో కొంత ఛార్జి చేయబడి నిలువ ఉంటుంది . ఓ మనిషి తలను నరికేసినా కూడా ఈ నిలువ ఉన్న విద్యుత్ ఆ తల లోని మెదడు 3 నుంచి 5 నిముషాల వరకు పనిచేస్తూ వుండేలా చేస్తుంది.

◆ మెదడుకు అందే రక్తప్రసారం ఓ 3 నిముషాలు పాటు ఆగిపోతే ఆ వ్యక్తికి మరణం సంభవిస్తుంది అని . అందువల్లనే ఓ వ్యక్తి గుండె కొట్టుకోవడం ఆగిపోతే దాన్ని మళ్ళీ పునరుజ్జీవింప చెయ్యడానికి డాక్టర్లు పడే హైరానా అంతా ఇంతా కాదు . ఎలాగైనా ఆ గుండెను 3 నిమిషాల్లో మళ్ళీ కొట్టుకునేలా చెయ్యకపోతే తలకి వెళ్ళే రక్త ప్రసరణ ఆగిపోయి మరణం సంభవిస్తుంది . 

◆ చావు ఓ క్షణంలో జరిగే పని కాదు ”.  అలాగే , “ ఆరా రంగులు తగ్గిపోయినంత మాత్రాన మనిషికి చావు రాదు ” . చావు చాలా నింపాదిగా సంభవిస్తుందని, డాక్టర్లకూ , తలారులకూ తెలుసు . శరీరంలో మొదట మెదడు మరణిస్తుంది . ఒక్కో అవయవం తరువాత వరుసగా  చచ్చిపోతూ ఉంటుంది . చిట్టచివరగా ప్రాణాల్ని వదిలేది వెంట్రుకలూ , గోళ్ళూ .

◆ శరీరానికి ప్రాణం వెంటనే పోదు . ఆరా , ఆ కళేబరం దగ్గరే నెమ్మదిగా తచ్చాడుతూ ఉంటుంది . ఆ శవం ప్రక్కనే ఉన్న ఆరాను చూడగలిగిన శక్తి ఉన్న యోగి ( Clairvoyant ) ఆ వ్యక్తి మరణానికి కారణం ఏమిటో వెంటనే తెలుసుకోగలడు. చనిపోయిన మనిషి ' ఆరా ' మాయమైపోయినా ఎథిరిక్ ' మాత్రం దయ్యం రూపంలో శరీరానికి దగ్గర్లోనే తిరుగుతూ ఉంటుంది . మరణించిన వ్యక్తి ఆరోగ్యం బావుండి అకస్మాత్తుగా దుర్మరణం పాలైతే ఇలాంటి దెయ్యాలు తప్పక వెలుస్తాయి . ఎంచేతనంటే ఆ వ్యక్తిలోని బ్యాటరీల్లో శక్తి పూర్తిగా ఛార్జ్ ' అయి ఉంటుంది కాబట్టి ' . శక్తివంతమైన ఈ ' ఎథిరిక్ ' లు అయస్కాంత శక్తి వలన తాము పూర్వపు తిరుగాడిన ప్రదేశాల్లోనే తిరుగుతూ ఉంటాయి . భూత వైద్యులకు గానీ , ఆరాలను చూడగలిగిన వ్యక్తులకు గానీ , భయంతోనో ఆత్రుతతోనో బాగా ఉద్రేకం చెంది వున్న ( తనలోని ప్రకంపనాలను తీవ్రతరం చేసుకుని ఉన్న ) వ్యక్తికీ ఈ ఎథిరిక్ ' శరీరాలు కన్పిస్తాయి . వాళ్ళు ఆ దెయ్యం, ఏ మనిషి తాలూకుదో ఇట్టే గ్రహించగలిగి ఉంటారు .

◆ “ ఎదిరిక్ కన్నా ఆరాలు సూక్ష్మమైనవి . స్థూల శరీరానికి ఎథిరిక్ ఎంత సూక్ష్మంగా ఉంటుందో అదేవిధంగా ' ఎథిరిక్ ' శరీరాన్ని ఆవరించి ఉన్న ' ఆరా ' అంతకన్నా సూక్ష్మంగా ఉంటుంది .ఎథిరిక్ ' శరీరాకృతిని యధాతధంగా ప్రతిబింబిస్తూ ఉంటుంది ; కానీ , ' ఆరా మాత్రం శరీరం చుట్టూ ఓ కోడిగుడ్డు ఆకారంలో విస్తరించి ఉంటుంది .

◆ ఈ ' ఆరా ' సుమారు 7 అడుగులు ఎత్తూ , 4 అడుగుల వైశాల్యం ( బాగా వెడల్పుగా ఉన్నచోట ) కలిగి శిరస్సు ఉన్న చోట లావుగానూ , కాళ్ళ వద్దకి వచ్చేసరికి కోడిగ్రుడ్డులో సన్నని భాగాన్ని పోలి సన్నగానూ ఉంటుంది . శరీరంలోని అనేక ప్రదేశాల్నుంచి మిరుమిట్లు గొలిపే రంగులో కాంతి మరి కొన్ని ప్రదేశాలకు ప్రవహిస్తూ ఉటుంది . 

◆ మానవుడు జీవించి ఉండటానికి అత్యంత కీలకమైన శక్తిని ఈ ఆరాలు కలిగి ఉన్నాయి. అలాగే రెండు మామూలు గాజు పలకల మధ్య పల్చటి రంగు ' డై ' పూతని ఏర్పాటు చేసి ఆ అద్దాల పలకలోంచి చూస్తే ఎదురుగా ఉన్న మనిషి ఆరా ' లు స్పష్టంగా చూడవచ్చునని తెలుసుకోండి . 

◆ ఈ ఆరాలు మనకు కనిపించకుండా ఉన్నందుకు ముఖ్య కారణం అలాంటి శక్తి మన కళ్ళకు ఉందని మనం విశ్వసించక పోవడమే ! 

◆ మన ' ఆరా ' లో అనేక రంగులు ఉంటాయని మనం తెలుసుకున్నాం. మనం ' రంగులు ' అని చెప్తున్నది వర్ణమాలలోని ఓ ప్రత్యేక తరంగ సామర్థ్యం ఉన్న ఓ అంశమేనని మనం గుర్తుపెట్టుకోవాలి . ఎరుపు ” అన్నామంటే వర్ణమాలలో సులభంగా గోచరమయ్యే ఓ ప్రత్యేక తరంగ మని అనుకోవచ్చు . ఎరుపు , వేరు వేరు తరంగ సామర్థ్యాలు ఏడు ఒక్కటిగా ఏర్పడి ' వర్ణమాల ' అంటే తెలుపు రంగు ఏర్పడుతుంది . తెల్లటి రంగే ఇంధ్రధనస్సు ఏర్పడినప్పుడు ఈ వర్ణమాల రూపంలో స్పష్టంగా విభజింపబడి ఏడు రంగులుగా విచ్చేధం చెంది మనకి దృగ్గోచరమౌతుంది. 

◆ ఆరా ' ను చూడగలిగే సామర్థ్యం ఉన్న వాళ్ళ ముందు మాట్లాడేప్పుడు కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది . ఎంచేతనంటే వాళ్ళు మీ మాటల్లోని అబద్దాలని సులభంగా గుర్తు పట్టేసి పైకి చెప్పేసి మిమ్మల్ని అవమానం పాలు చేయగలరు .

◆ సాధారణంగా మన తల చుట్టూ ఓ నీలిరంగు కాంతి వలయం గానీ , లేత పసుపు రంగుకాంతి వలయం గానీ ఉంటుంది . మనం ఒక అబద్దాన్ని ఉచ్చరించగానే ఓ పసుపు ఆకుపచ్చ కాంతి కిరణం ఈ హేలో లో విజృంభించి కనిపిస్తుంది ! ఈ రంగుని మాటల్లో వర్ణించడం కష్టమే కానీ ఒక్కసారి ఈ రంగుని చూడగలిగారంటే మరి జన్మలో ఆ రంగుని మర్చిపోరు . కాబట్టి మనం ఓ అబద్ధం ఆడగానే మన తల మీద హేలో లో ఆకుపచ్చ పసుపు రంగు మంట ఒకటి ఉవ్వెత్తున లేచి మన అబద్దాన్ని బయటపెట్టేస్తుంది .

◆ తలపై భాగాన నీలిరంగుతో కానీ లేత పసుపు పచ్చ రంగుతో కానీ ఈ హేలో లేక ' నింబస్ మెరుస్తూ వెలుగుతూ ఉంటుంది . 

◆ ఓ వ్యక్తి ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న కొద్దీ అతని హేలో రంగు కాషాయ వర్ణం పసుపు రంగులోకి కొద్ది కొద్దిగా విస్తరిస్తూ గాఢంగా రూపొందుతుంది . ఓ మనిషికి వికారమైన ఆలోచనలు చుట్టుముట్టి ఉంటే ఈ హేలో రంగు బురద మట్టి రంగులోకి దిగిపోయి దాని అంచుల్లో ఆకు పసరు పసుపు రంగుల్లో పిచ్చి ఆలోచనలు ఈ బురద రంగుని ఆవరించి కనబడుతాయి .

◆ ఓపురుషుడు లేకపోతే ఓ ఆడపిల్ల “ ఈ రంగు లేక ఆ రంగు బట్టలు నాకు బాగా నచ్చుతాయి ” అని చెప్పుకోవడం మనం వింటూనే ఉంటాం . లేకపోతే ఫలానా వాళ్ళకు ఫలానా రంగు , డ్రస్సులు బాగుండవని అనుకోవడం కూడా మనం వింటూనే ఉంటాం . ఇలా ఓ స్త్రీ గానీ పురుషుడు గానీ అనుకోవడానికి స్వతఃసిద్ధంగా తమకి కనిపించినా గుర్తించలేని ఆరా రంగులతో పైన ధరించే రంగు వస్త్రాలు సవ్యంగా అమరి ఉండగలవని తెలుసుకుని ఉండగలగడమే కారణం . కొంతమంది , వేసుకున్న బట్టల్ని చూడగానే “ అవి వాళ్ళకు సరిగ్గా ' మేచ్ ' కాలేదు ” అని యిట్టే గుర్తు పట్టేయగల నేర్పుని స్వతఃసిద్ధంగానే కలిగి ఉంటారు . ఈ విషయం మీకు నిత్యం అనుభవంలోకి వస్తూనే ఉంటుంది . ఆ బట్టలు వేసుకున్న వ్యక్తికి తెలిసి ఉండక అలాంటి వేషధారణ చేసి వున్నా చూస్తున్న మనకి ఆ దుస్తులు ఎబ్బెట్టుగా కనిపించక మానదు . కాబట్టి , మనలో చాలామంది ' ఆరా ' ని చూసే సామర్థ్యం కలిగి ఉంటారనీ , నేరుగా 'ఆరా' ని చూడలేకపోయినా మార్గాంతంలో దాన్ని కనీసం గుర్తుపట్టగలిగి ఉంటారనీ , లేదా మనిషి చుట్టూ ఆరా ఉండి ఉంటుందని కనీసం తెలుసుకుని ఉంటారనే విషయం కానీ స్పష్టంగా అర్ధమౌతుంది . కానీ చిన్నప్పటి నుంచి తాము వంటబట్టిచ్చుకున్న ఆచార వ్యవహారాల వల్లా , “ వింతలని వెర్రిగా చూడటం మంచిదికాదు . ” అనే చిన్ననాటి అభిప్రాయాలవల్లా , వాళ్ళ మనస్సుల్ని వాళ్ళే మభ్యపెట్టుకుని వాళ్ళని వాళ్ళే స్వంతంగా ' హిప్నాటైజ్ ' చేసేసుకుని తమకు " ఆరాలు కనబడడం లేదు ” . అని అనుకుంటూ ఉండిపోతారు . 

◆ కొన్ని డ్రస్సులు మీకు బాగా ' సూట్ ' అవుతాయి . వాటిని ధరిస్తే మీరు ఎంతో ఉత్సాహంతో ఉరకలు వేస్తుంటారు ; ప్రశాంతంగా లేక గంభీరంగా ఉంటారు . మరి వేరే రంగు బట్టల్లో ఉన్నప్పుడు మీకు చీకాకూ , ఆందోళనా , దిగులూ లేకపోతే ఆ డ్రెస్సుని తీసి పారేసేంత వరకూ అనారోగ్యం కూడా కలుగుతుందనే విషయం మీ అనుభవంలోకి వచ్చే ఉంటుంది .

◆ ఓ గదిలోకి మీరు వెళ్ళగానే ఆ రూము గోడలకి వేసి ఉన్న రంగులు గమనించినప్పుడు కొన్ని సార్లు మీ మనసుకి ప్రశాంతత చేకూరినట్లు అనిపిస్తూ వుంటుంది . మరికొన్ని గదులలోని రంగులు గమనించినపుడు మీరు ఉద్రేకానికి లేదా అశాంతికి గురి కావచ్చు . రకరకాల ప్రకంపనాలకి ఒక్కో “ రంగు ' పేరు మనం పెట్టుకుని ఉన్నామన్న సత్యాన్ని గుర్తించండి .

ఎరుపు రంగు ఒక నిర్ణీతవేగంతో పయనించే తరంగమనీ , ఆకుపచ్చ రంగు మరో ప్రకంపనం కలిగిన తరంగమనీ , నలుపురంగు ఇంకో తీవ్రతను పొందిన తరంగమనీ మనం గుర్తిస్తే ఆ రంగులని గమనించినప్పుడు మనలో కలిగే ప్రశాంతత , ఉద్విగ్నత , ఉదాసీనత , దిగుళ్ళ లాంటి భావాలకు అర్ధం గోచరిస్తుంది .

◆ మనకు విన్పించే శబ్దాల తీవ్రత అధికమైతే మనకు ఎలా తిక్కరేగుతుందో మనకు కనుపించని కాంతి తరంగాల తీవ్రత కూడా మనలోని ఆధ్యాత్మికత్వాన్ని అలాగే భగ్నంచేయవచ్చు.

◆🙏🙏🙏
ఆరా వర్ణాలు --   2🌹🙏💚💙💜🖤

◆ సంగీతంలో స్వరాలు ఉంటాయి . శ్రావ్యంగా వినిపించే ధ్వని తరంగాలని ' స్వరాలు ' అని మనం అనుకుంటూ ఉంటాం . కొన్ని శబ్దాలు కర్ణకఠోరంగా ఉంటాయి .    సంగీతంలో మనకు వినిపించే స్వరాలలాగే కనిపించే కాంతిలో కూడా వర్ణాలుంటాయి , వినిపించే ధ్వనీ , కనిపించే కాంతీ రెండూ తరంగ రూపాంతరాలేనని మనం తెలుసుకోవాలి . కొన్ని రంగులు మనల్ని ఉత్తేజితుల్ని చేసి సంతోషపెడ్తే మరికొన్ని వర్ణాలు మనకు తిక్క పుట్టిస్తాయి ; ఉద్వేగాన్ని కోపాన్ని ప్రేరేపిస్తాయి .

◆ మానవుని ఆరాలో అనేక రంగులు కలబోసుకుని ఉంటాయి. మనకంటికి కనిపించే వర్ణాలకు మాత్రమే పేర్లున్నాయి . మన కంటి చూపు పరిధిలోకి రాని లేక దాటిపోయే కాంతి మిశ్రమాలకు మనం పేర్లు పెట్టలేం . వాటికి పరారుణా ( Infra - Red ) కిరణాలు అనీ , అతి నీలలోహిత ( Ultra - Violet ) కిరణాలు అనీ గుంపుగా సమిష్టి నామాలతో ఉదహరించి అనుకుంటాం తప్ప ప్రత్యేక పేర్లు చాలా రంగుల మిశ్రమాలకి లేవు .

◆ కంటికి కనుపించే కాంతి తరంగాల విస్తీర్ణాన్నీ మనం పెంచుకోగలిగితే మనకి మానవ శరీరం చుట్టూ ఉన్న ఆరా ' స్పష్టంగా కనిపించి తీరుతుంది . ఇలాంటి దృక్కును సంపాదించడానికి మనం చేసే సాధన సవ్యంగా సాగకపోతే మనం నల్లరంగు , డీప్ పర్పుల్ రంగుల్ని కూడా చూడలేని స్థితికి మన కన్ను చేరుకుంటుంది . కాబట్టి , ఆరా'ను చూసేందుకు మనం చేసే ప్రయత్నాన్ని జాగ్రత్తగా , ఓర్పుతో చేయవలసి ఉంటుది . 

◆ ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా ఎదుగుతూంటే ఆ వ్యక్తి ' ఆరా ' లోని రంగులు క్రమేపీ ఓ పద్దతిలో మార్పు చెందటాన్ని మనం గుర్తించవచ్చు. దురదృష్టవశాత్తూ ఓ వ్యక్తి పరమపద సోపానాలు ఎక్కుతూ క్రిందకి జారిపోతే ఆ వ్యక్తి ఆరాలోని ప్రాధమిక రంగు పూర్తిగా మారిపోవచ్చు లేదా రంగు సాంద్రత తగ్గిపోయి వేవలంగా తయారవచ్చు .

◆ సప్త ప్రాధమిక వర్ణాల్లో ఓ వ్యక్తి ఆరాలోని ఓ రంగు ప్రాముఖ్యంగా గోచరిస్తుంది . మిగతా అనేకానేక వర్ణ మిశ్రమాలు ఆ వ్యక్తి ఆరాలో ఇంద్రధనస్సు రంగులు సుడిగుండాల్లో చిక్కుకున్నట్టు గిర్రున తిరుగుతూ ప్రవహిస్తూ కనిపిస్తాయి . శరీరం చుట్టూ ఈ రంగుల కాలువలు వర్తులాకారంలో వేగంగా పరుగులు తీస్తుంటాయి . అలాగే తల నుంచి పాదాలవరకు జలపాతంలా పడుతూ వుంటాయి . " మనకు ఇంద్రధనస్సులో కన్పించే ఏడు రంగులకన్నా చాలా ఎక్కువ రంగుల మిశ్రమాలు ఈ ఆరాలో మనకు దర్శనమిస్తాయి . నీటి బిందువుల కాంతి పరావర్తనం వల్ల ఏర్పడేదే ఈ ఇంద్రధనస్సు . ఈ ప్రకృతి దృశ్యం చాలా సులభంగా ఏర్పడుతుంది . అలాగే ' ఆరా ' అనేది ప్రాణానికి పూర్తిగా ప్రత్యామ్నాయం ' అని తెలుసుకోండి .

❤️ 1) ఎరుపు:- ❤️
   -----------------------
● ఎరుపు ఓ మంచి రంగు , బలమైన జీవితానికి ఇది ఓ సంకేతం . గొప్ప సైనికాధికారుల ఆరాలో ఎర్రరంగు విశేషంగా గోచరిస్తుంది . పసుపు రంగు అంచులు కలిగి ఉన్న మంచి ఎరుపు రంగును తన ఆరాలో పొందు పరచుకున్న వ్యక్తి ఇతరుల యోగక్షేమాల కోసం నిరంతరం పాటుపడి పోరాటం చేయాలనుకునే తత్వాన్ని కలిగి ఉంటాడు . అందరి ఆంతరంగిక విషయాల్లోకి అనవసరంగా కల్పించుకుని దూరే వ్యక్తితో  పై వ్యక్తిని పోల్చుకోకండి . ఇలాంటి నక్షత్రకుల ఆరాలలో ఉండేది ఎర్రరంగు కాదు బ్రౌను ( కాఫీపొడి కలర్ ) రంగు మాత్రమే . ఓ శరీరం లోంచి ఎర్రటి కాంతి పుంజాలు వెలువడుతూంటే ఆ శరీరాంగాల ఆరోగ్యం చాలా బాగా ఉన్నట్టు అర్ధం . ప్రపంచ నాయకుల ఆరాల్లో ఈ ఎర్రటి రంగుతో బాటు కాలుష్యపు రంగులు కూడా తోడు కావటం నిజంగా శోచనీయం . 

◆ బురదరంగు తోడయిన ఎరుపురంగు కానీ , బాగా ముదిరి ఉన్న పసుపురంగు కానీ ఓ వ్యక్తి యొక్క దుర్మార్గాన్ని కాఠిన్యాన్ని ఘోషించి వెల్లడిస్తుంది . అటువంటి రంగు ఆరా గల వ్యక్తిని మనం నమ్మడానికి వీలులేదు . అతను నిరంతరం ' జగడాలమారి'గా ఉంటాడు . భయంకరమైన స్వార్ధాన్ని తనలో నిపుకుని , మోసంతో జీవిస్తూ తన స్వంత పబ్బం గడుపుకునే వ్యక్తిగా అతనిని మనం గ్రహించవచ్చు . పాలిపోయిన ఎరుపురంగు ఉత్తేజం పొందిన నాడీమండలంలో అలజడిని సూచిస్తుంది . 'మాచెడ్డ ' ఎరుపు రంగు ఆవరించి ఉన్న మనిషి శారీరకంగా బాగా బలవంతుడయి వుంటాడు . హంతకులు ' ఆరా'లు అధోగతికి చెందిన ఎరుపు రంగుని కలిగి ఉంటాయి . ఎరుపు రంగు ఎంత తేలికగా ఉంటే ఆ వ్యక్తి అంతగా నెర్వస్ గా ఉంటాడు . అంతగా నిశ్చలతను కోల్పోయి ఉంటాడు . అలాంటి వ్యక్తి ఉద్రేకంతో ఉరకలు వేస్తూ ఉంటాడు ; ఎంతో ఆందోళన చెందుతూ ఉంటాడు ; కొద్ది క్షణాలు కూడా నిశ్చలంగా ఉండలేడు . అలాంటి వ్యక్తి తప్పక స్వార్థపరుడైవుంటాడు . 

◆ శరీరాంగాల వద్ద ఎర్రరంగు కనిపిస్తే ఆయా అవయవాల ఆరోగ్యాన్ని ఆ రంగు తెలుపుతూ వుంటుంది . నిర్జీవంగా కనిపించే ఎరుపుగానీ , మట్టిరంగు కలిసిన ఎరుపుగానీ , ఓ ప్రదేశంలో నెమ్మదిగా ఊగిసలాడుతూ కనిపిస్తే  అక్కడ కేన్సర్ వ్యాధి వృద్ధి పొందుతోందని గ్రహించవచ్చు . ఆ ప్రదేశంలో నిజంగా కేన్సర్ ఉన్నా లేక సమీప భవిష్యత్తులో అక్కడ వృద్ధి జరిగే అవకాశం ఉన్నా ముందే గుర్తుపట్టవచ్చు . ఆ భాగం నుంచి వెలువడే ఎర్ర కాంతిని బట్టి రాబోయే జబ్బులని గురించి ముందుగానే గ్రహించవచ్చు .

◆ దవడ దగ్గర ఎర్రరంగు మచ్చలాగా మెరుస్తూ కనిపిస్తే ఆ వ్యక్తి పంటిపోటుతో బాధపడు తున్నాడని గ్రహించవచ్చు . తలమీద మిణుకు మిణుకుమని ఆరి వెలిగే అస్పదమైన తేజంలేని ఎరుపురంగు కనిపిస్తే ఆ వ్యక్తి పంటి డాక్టరు దగ్గరకి వెళ్ళాల్సి వచ్చినందుకు భయపడుతున్నాడని అర్ధం చేసుకోవచ్చు . 

◆ ఆత్మ విశ్వాసం అతిగా కలవారి 
 ఆరాల్లో స్కార్లెట్ ఎరుపు(scarlet = సింధూరం)  కనిపిస్తుంది . వాళ్ళు తమని తాము ఇష్టపడుతూ ఉంటారు . ఈ రంగు వారి నిరతిశయానికి -లేని గొప్పతనానికి - సంకేతంగా నిలుస్తుంది . వ్యభిచారం వృత్తిగా గల స్త్రీల పిరుదుల వద్ద కూడా ఇలాంటి రంగు కనిపిస్తుంది . కాబట్టి వాళ్ళకు ఉన్న ' స్కార్లెట్ వుమెన్ ' అనే పేరు సార్ధక నామధేయంగా గ్రహించండి . అటువంటి స్త్రీలలో సెక్సులో ఏమాత్రం ఆనందం ఉండదు ధనార్జనే వారి ధ్యేయం . బ్రతుకు తెరువుకు అది ఓ పద్దతి - అంతే . దురహంకారి , పడుపుగత్తె మొదలైనవారు ఒకానొక ఎరుపు ( స్కార్లెట్ ) వర్ణాన్ని ధరించి ఉంటారు . ఇంగ్లీషు భాషలో ఎప్పుడూ వాడే కొన్ని మాటల్లో - ఉదాహరణకి ( స్కార్లెట్ ఉమెన్ ' , ' బ్లూ మూడ్ ' , ' రెడ్ రేజ్ ' , బ్లాక్ విత్ టెంపర్ ' , ' గ్రీన్ విత్ ఎన్వీ ' ఆరా రంగులు స్పష్టంగా వాళ్ళు నిజంగా గమనించో , చూసో చెప్పినట్టుగానే మనకి అనిపించడంలో ఏ మాత్రం ఆశ్చర్యం లేదు . 

◆ ప్రింక్ రంగు సరిగ్గా పింక్ రంగు కాకపోయినా పగడాల రంగుకు కొంత దగ్గరగా ఉండే రంగు లాంటిది పూర్తిగా ఎదగని శైశవాన్ని ప్రకటిస్తుంది. నవ యవ్వనవంతుల్లో ఈ రంగు ఎక్కువగా కనిపిస్తుంది . పెద్దవారిలో ఈ రంగు కనిపిస్తే అది వాళ్ళ పిల్లతరహా వ్యవహారాన్నీ , తమకి భద్రతలేదని అనుకునే వాళ్ళ మనస్తత్వాన్ని సూచిస్తుంది . 

◆రెడ్ - బ్రౌన్ ఆరా వ్యక్తి చాలా నీచంగా ప్రవర్తిస్తుంటాడు . అలాంటి రంగు ఆరా ఉన్న వ్యక్తి దగ్గరకి వెళ్ళడం మానుకోవడం ఉత్తమం . ఎందుకంటే వాళ్ళు మనకు తప్పక కష్టాలు తెప్పించగలరు . ఈ రంగు ముఖ్య శరీర అవయవం మీద కనిపిస్తే భయంకరమైన జబ్బుతో వాళ్ళు బాధపడుతున్నారనీ , త్వరలోనే వాళ్ళకి మరణం సంభవిస్తుందని తెలుసుకోండి .

◆ ప్రక్క టెముకల క్రింద ఎరుపు రంగు కనిపిస్తే వాళ్ళకి నరాల బలహీనత ఉందని అర్థం ! ప్రశాంతంగా జీవించే ప్రయత్నం చేయాలి . నాలుగు కాలాల పాటు సుఖ సంతోషాలతో జీవించాలని వారు కోరుకునేట్లయితే అది తప్పక సాధ్యం . 

🔶 2 ) ఆరెంజ్ :- 🔶
  -------------------------
●  ఆరెంజ్ రంగు నిజానికి ఎరుపులో ఓ భాగమే. తమ ఆరాల్లో తగిన ఆరెంజ్ కల వ్యక్తులు ఇతరుల ఎడల సానుభూతిని కలిగి ఉంటారు.వాళ్ళు మానవతావాదులు. దురదృష్టవంతులకి వాళ్ళు కొండంత అండగా ఉండేందుకు ప్రయత్నిస్తారు . పసుపు- ఆరెంజ్ మిశ్రమం తమ ఆరాలో ఉండాలని ఆశించడం ఉత్తమమైనది . ఎంచేతనంటే అట్లాంటి వర్ణాన్ని ఉండి ఉన్న వాళ్ళు ఆత్మ నిగ్రహాన్ని చాలా ఇతర మంచి గుణాలనీ కలిగి ఉంటారు . 

◆ బ్రౌను - ఆరెంజ్ మిశ్రమం అధమమైన సోమరిపోతును సూచిస్తుంది . దున్నపోతు మీద వర్షం ' అనే సామెత ఇలాంటి వ్యక్తులకే వర్తిస్తుంది .ఈ వర్గం మూత్రపిండాల జబ్బుని ఎత్తి చూపుతుంది. కిడ్నీలు ఉన్న ప్రాంతంలో  ఊదా రేఖల్తో దర్శనమిస్తే వాళ్ళ మూత్రపిండాల్లో రాళ్ళు ఉన్నట్లు నిర్థారణ చేసుకోవచ్చు .

◆ ఆకుపచ్ఛ ఛాయలో కలిసి ఆరెంజ్ మియాన్ని ఎవరు తమ ఆరాల్లో కలిగి ఉంటారో వాళ్ళు ఉత్తి పుణ్యానికి ఎదుటి మనిషితో తగవు పెట్టుకునే సరదా కలిగి ఉంటారు . రంగుల్లోని ప్రాథమిక ఛాయల్లోని మరో ఛాయల్ని చూడగలిగే స్థితికి చేరుకున్నప్పుడు ఇలాంటి మనుష్యుల జోలికి వెళ్ళడం మానుకోండి . ఎందువల్లనంటే వీళ్ళకి నలుపు తెలుపులు తప్ప మరొకటి అర్థం కాదు . వీళ్ళ బుర్రలు సరిగ్గా ఉహించే స్థితిని పొంది ఉండవు . ఎదుటి మనుష్యులకి ఆలోచనలు , అభిప్రాయాలు , కొంత జ్ఞానం ఉంటాయని కూడా వీళ్ళు గ్రహించకుండా అంతులేని వాదనా వ్యాసంగంతో మునిగి తేలుతూ ఉంటారు . వాదనలో పపు ఉన్నా లేకున్నా వీళ్ళు గ్రహించలేరు . వాళ్ళ ఏకైక జీవితాశయం నిరంతరం వాదిస్తూ ఉండడమే !

💛 3) పసుపు :- 💛
  ------------------------
● బంగారు రంగు పసుపు ఆరా ఉన్న వ్యక్తి ఆధ్యాత్మికంగా బాగా ఎదిగి ఉన్నవాడు . గొప్ప మహవీయులై పన్యాసులకి ఈ రంగు హేలో ( halo) లు తలల వెనుక కనిపిస్తూ ఉంటాయి . వారి ఆధ్యాత్మిక స్థితిని బట్టి ఈ హేలో ప్రకాశం ఎక్కువ అవుతూ వుంటుంది . అత్యుత్తమ స్థానంలో ఉన్న సన్యాసుల ఆరాల్లో మేలిమి బంగారు పసుపు వర్ణంతో బాటు ఇండిగో వర్ణం కూడా కలిసి ఉంటుంది .ఆరాలో పసుపు రంగు వున్న  వ్యక్తులు ఆధ్యాత్మికంగా , నైతికంగా బలంగా వుంటారు . అలాంటి వారు భయాన్ని త్యజించినవారై , సక్రమమైన మార్గంలోనే నిరంతరం నడుస్తూ ఉంటారు . ప్రకాశవంతమైన పసుపు రంగు ఆరా ఉన్న వ్యక్తిని మనం పూర్తిగా నమ్మవచ్చు.

◆ పాడవుతున్న వెన్నకు ఉండే పసుపు రంగు ఉన్న వ్యక్తిని పిరికివాడుగా గ్రహించవచ్చు . కళావిహీనం అయిన పసుపు రంగుని ధరించిన వ్యక్తి అన్నిటికీ భయపడే లక్షణాల్ని కలిగి ఉంటాడు . ఎరుపు పాలు ఎక్కువైన పసుపు ఆరా కల వ్యక్తి మానసిక , నైతిక , శారీరక పిరికితనపు బలహీనతలను కల్గి ఉంటాడు . వాళ్ళలో ఆధ్యాత్మికత పూర్తిగా మృగ్యం .

వారిలో ఆత్మ విశ్వాసం పూర్తిగా శూన్యంగా ఉంటుంది . ఎరుపు రంగులో కలసిన వారిలో పసుపు ఆరా కల వ్యక్తి మతాల్ని మార్చుకుంటూ స్థిరత్వంతో ఉండలేక “ ఐదు నిమిషాల్లోనే సాధించగలిగే ” విషయాల వెంట , వస్తువుల వెంట పరుగులు తీస్తూ ఉంటాడు . వాళ్ళు నిలకడగా ఉండలేరు . ఏ విషయాన్ని గురించి కానీ కొన్ని క్షణాల కన్నా మించి ధ్యాసతో ఉండలేరు . 

◆ఎరుపు - పసుపు ఇంకా బ్రౌన్ - ఎరుపు ఛాయలున్న ఆరా కల వ్యక్తులు విజాతి ' ( Opposite Sex ) వ్యక్తుల వెంట పడుతూ నిరంతరం భంగపడుతూ ఉంటారు .  ఓ వ్యక్తికి ఎరుపు లేక అల్లం రంగు జుట్టు ఉంటే అతని ఆరాలో ఎరుపు - పసుపు వుంటే అతను దురుసుగా ఉండే వ్యక్తిత్వం కలిగి ఉంటాడు . ఎవరు ఏ మాట మాట్లాడినా తనలోని లోపాల్ని ఎత్తి చూపించి దుయ్యబడుతున్నారని అపోహలు తెచ్చుకుని అందరితో పోట్లాడుతూ ఉంటాడు.

◆ కొన్ని రకాల ఎరుపు పసుపు రంగు మిశ్రమాలు ఆరాల్లో ఉన్న వ్యక్తి తనను తానే అందరిలోకీ అధమున్నని ఊహించుకుని దిగులుపడిపోయి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తో బాధపడుతూ ఉంటాడు . అలాంటి వాళ్ళ ఆరాల్లో ఎరుపు ఎంత ఎక్కువ సాంద్రతతో ఉంటే వాళ్ళ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సు , అంత తీవ్రతని పొంది ఉంటుంది . 

◆ బ్రౌనిష్ ఎరుపు రంగు ఆరాలు ఉన్న వ్యక్తుల ఆలోచనలు పవిత్రంగా ఉండవు . వారికి ఆధ్యాత్మికంగా ఎదుగుదల కూడా ఉండదు . ఇలాంటి అధోగతి పొందిన వాళ్ళందరూ ఒక చోట పోగయి ఉంటారు . ఇలాంటి తాగుబోతులూ , భ్రష్టులూ , నీచులంతా అధఃపాతాళానికి కూరుకుపోతూ ఉంటారు . వీళ్లు మరీ అధ్వాన్నంగా తయారై ఉంటే వీళ్ళు ఆరాల్లో పాచిరంగు కూడా కలసిపోయి అసహ్యంగా ఉంటుంది . స్వయంకృతాపరాధులు వీళ్ళు . వీళ్ళని పతనం నుంచి రక్షించడం దాదాపు దుస్సాధ్యం . 

◆ బ్రౌనిష్ - పసుపు రంగు అపరిశుద్ధ ఆలోచనలని సూచిస్తుంది. ఇలాంటి రంగు ఉన్న ఆరా గలవాళ్ళు ఇరుకైన , సక్రమమైన దారిలో నడవడం లేదని గ్రహించవచ్చు . 

◆ ఆకుపచ్చ - పసుపు రంగు కాలేయ జబ్బుల్ని ఎత్తి చూపిస్తుంది . ఆకుపచ్చ - పసుపు , బ్రౌన్ - ఎరుపు - పసుపు రంగుల్లోకి మారుతూ కనిస్తే అలాంటి వ్యక్తుల్లో సుఖ వ్యాధులున్నాయని అర్థం . సుఖవ్యాధులున్న వ్యక్తుల పిరుదులు చుట్టూ దట్టమైన బ్రౌన్తో కలసిన దట్టమైన పసుపు పట్టీ ఒకటి ఖచ్చితంగా కనిపిస్తుంది . ఈ పెట్టేవద్ద ఎర్రమట్టి విరజిమ్మ బడినట్లు కనిపించడం కూడా సహజమే . పసుపు రంగులో బ్రౌన్ రంగు ఎక్కువ ప్రస్పుటమవుతూ ఉండి వంకర్లు తిరుగుతూ ఉన్న పట్టీలను కలిగి ఉన్నట్టు కనిపిస్తే అది మానసిక అవలక్షణాలను సూచిస్తుంది . ఒక వ్యక్తి రెండు విభిన్న మనస్తత్వాలు కలిగి ఉంటే అతని ఆరాలో సగభాగం నీలి పసుపు రంగు మిగతా సగ భాగం బ్రౌన్ లేక ఆకుపచ్చ - ఎరుపు మిశ్రమంతో నిండి ఉంటుంది .

◆ మనం మొదట అనుకున్న శుద్ద బంగారు వర్ణపు పసుపు రంగు ఆరాను సంపాదించుకునేందుకు మనం నిరంతరం కృషి చేయాలి . ఆలోచనలను ఉద్దేశ్యాలను పవిత్రంగా ఉంచుకోవడం ద్వారా దీన్ని మనం సాధించవచ్చు . జీవబ్రహ్మైక్య పథంలో అభివృద్ధి సాధించాలంటే తప్పక ఈ పసుపు రంగు ఆరాను సంపాదించుకోకుండా మాత్రం ముందుకు వెళ్ళలేం . 

💚 4) ఆకుపచ్చ :- 💚
   --------------------------
 ● ఆకుపచ్చ రంగు రోగ ఉపశమనానికి  , విద్యా బోధనకూ ప్రతీక , భౌతికంగా ఎదుగుదలను కూడా ఆకుపచ్చ రంగు ప్రకటిస్తుంది . గొప్ప వైద్యులూ శాస్త్ర నిపుణులు తమ ఆరాల నిండా ఆకుపచ్చ రంగుని నింపుకుని కన్పిస్తారు . వాళ్ళ ఆరాల్లో ఎరుపు రంగు కూడా అమితంగా కన్పిస్తుంది . ఒక కుతూహలాన్ని రేకెత్తించే విషయం ఏమంటే ఆకుపచ్చ - ఎరుపు రంగులు ఆరాలో పరస్పరం స్నేహంగా కనిపిస్తూ ఒకదానితో మరొకటి సులువుగా కలిసిపోతూ ఉంటాయి . వాటి రెండింటిలో చక్కటి పొంతన కుదురుతుంది . మామూలుగా వస్తువుల్లో ఈ రెండు రంగులూ ఎబ్బెట్టుగా కనిపించవచ్చు . కానీ ఆరాల్లో మాత్రం ఈ రంగులు చూసే వాళ్ళకి సంతోషాన్ని కలిగిస్తాయి . తగినంత ఎరుపు ఆకుపచ్చ రంగుతో కలసి ఉన్న శస్త్ర నిపుణులు చాలా చురుకుగా ఉంటారు . తమ విధిని చక్కగా అనుష్టించగలిగి ఉంటారు .

◆ఎరుపు రంగు లేకుండా , ఉట్టి ఆకుపచ్చ రంగునే తమ ఆరాల్లో కలిగిన వైద్యులు తమ వృత్తిలో అత్యున్నత స్థానాన్ని పొంది ఉంటారు . లేక ఆ రంగు కల నర్సులు మానవ సేవాతత్పరత ను తమ జీవితాశయంగా కలిగి ఉండటమే కాకుండా అంతులేని ప్రేమా ఉద్దల్ని కలిగి ఉంటారు . ఒక ప్రత్యేక నీలి వర్ణంతో జత కలిసిన ఆకుపచ్చ రంగు చక్కటి విద్యా బోధనా పటిమను ప్రతిబింభిస్తుంది . కొందరు విద్యావేత్తల ఆరాల్లో ఆకుపచ్చ రంగు పట్టిలు నీలిరంగు సుళ్ళు కన్పిస్తూ ఉంటాయి.విద్యుత్ కాంతి నీలి రంగు నీలి ఆకుపచ్చ రేఖల మధ్యలో పసుపు రంగులో ప్రదర్శిస్తూ ఉన్న ఈ ఆరాలు ఉన్న ఉపాధ్యాయులు తమ శిష్యుల మీద అపారమైన వాత్సల్యాన్నీ కరుణను కలిగి ఉండటమే కాకుండా అత్యున్నతమైన ఆధ్యాత్మిక విషయాలను నిశితంగా స్పష్టంగా శిష్యులకు నేర్పగలిగిన నైపుణ్యాన్ని కలిగి ఉంటారు .

◆ మానవుల , ఇతర జీవుల ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించే వ్యక్తుల ఆరాల్లో ఆకుపచ్చ రంగు విశేషంగా ద్యోతకమవుతుంది . గొప్ప డాక్టర్లు , గొప్ప నర్సులు , గొప్ప సర్జన్లు కాకపోయినా , ఏ వ్యక్తులైనా మానవుల , జంతువుల ఆరోగ్యాన్ని గురించి వాళ్ళు ఏ పని అయినా చేస్తున్నట్లయితే వాళ్ళు ఆరాల్లో కొద్దీ గొప్పో ఆకుపచ్చ రంగు తప్పక చోటు చేసుకుని ఉంటుంది . ఆరోగ్య శాఖను ప్రకటించే బిళ్ళ ( badge ) ల్లోని ఆరాల్లో ఈ రంగు స్పష్టంగా గోచరిస్తూ ఉంటుంది . ఆకుపచ్చ రంగు సాధారణంగా మరో గాఢవర్ణాన్ని ఆశ్రయించి ఉంటుంది .

◆ ఆకుపచ్చ రంగు ఆరాల్లో ఉన్న వ్యక్తులు స్నేహశీలురుగానూ , సానుభూతిపరులుగానూ , హితులుగానూ ఉంటారు . కానీ పసుపు రంగులో కూడిన ఆకుపచ్చ రంగు ఉన్న ఆరాలు గల వ్యక్తులను నమ్మడానికి వీలులేదు . వికారాన్ని సూచించే పసుపురంగు కానీ , వికారంగా కనిపించే ఆకుపచ్చ కానీ ఎంతో అధికంగా ఆరాల్లో కనిపిస్తే అంత గాఢంగానూ వారు మోసగాళ్ళని గ్రహించగలం. తీయ్యటి మాటల్తో నమ్మించి మోసాలు చేసి డబ్బులను సంపాదించే వాళ్ళకి నిమ్మ ఆకుపచ్చ రంగు - పసుపు రంగు మిశ్రమం ఉన్న ఆరా ఉండి తీరుతుంది . ఆకుపచ్చ రంగు క్రమేపీ ఆకాశం నీలం రంగు గానీ విద్యుత్ నీలంరంగు గాని కలిగి ఉంటే అలాంటి వ్యక్తుల్ని సంపూర్ణంగా నమ్మవచ్చు .

💙 5) నీలి :- 💙
   -------------------
 ● ఆధ్యాత్మిక ప్రపంచానికి నీలి రంగును సూచికగా వర్ణిస్తారు . ఆధ్యాత్మికంగా వున్న బుద్ధి సూక్ష్మతను కూడా ఒక విధమైన నీలిరంగు ఛాయ ఎత్తి చూపుతుంది . మంచి ఛాయ ఉన్న నీలిరంగు సానుకూల్యాన్ని గుర్తింపు చేయగలిగి ఉంటుంది . ఎథిరిక్ నీలిరంగు ఛాయనే కలిగి ఉంటుంది . నేరుగా సిగరెట్టు నుంచి వెలువడే లేత నీలిపొగ ఆరా ఉంటుంది . ఎండు కట్టెలు మండతున్నప్పుడు కూడా ఆ మంటల  ప్రారంభంలో ఇలాంటి నీలిరంగు భాగాలను గమనించవచ్చు. ప్రగాఢమవుతున్న నీలి వర్ణం సంపూర్ణ ఆరోగ్యానికి సంకేతం.

◆ పాలిపోతున్న ఈ నీలివర్ణపు ఆరా గల వ్యక్తి చంచల మనస్కుడై స్థిరాభిప్రాయం లేనివాడై , ఎంతో బలవంతం చేస్తే తప్ప ఏ నిర్ణయమూ తీసుకోలేనివాడై ఉంటాడు . బలమైన లేదా గాఢమైన నీలిరంగు ఆరా కలిగి వుంటే ఉన్నత దిశలో క్రమేపి ఎక్కుతూ వున్న వ్యక్తినీ , లేక అభివృద్ధి కోసం నిజంగా పాటుపడే వ్యక్తినీ కృషి చేసే వ్యక్తినీ చూడొచ్చు.

◆ చేస్తున్న పనిలో తృప్తిని పొందుతున్న వ్యక్తి ఆరాల్లో గాఢమైన నీలి వర్ణం దర్శనమిస్తూ ఉంటుంది . ఆత్మ ప్రబోధాన్ని నిజంగా విని ధర్మ ప్రచారం చేస్తూన్న మతాధికారుల ఆరాలు ఈ వర్ణంతో ఎంతో శోభిస్తూ ఉంటాయి . ప్రపంచం చుట్టూ ధర్మ ప్రచారానికి బయలు దేరి తద్వారా చక్కటి ఆదాయాన్ని సంపాదించుకో జూస్తున్న మత ప్రచారకుల ఆరాల్లో మాత్రం ఈ వర్ణం అసలు గోచరించదు ! ఏ వ్యక్తి సచ్చీలాన్నయినా అతని ఆరాలో కనిపిస్తున్న పసుపు రంగును బట్టి నీలి రంగును బట్టి మాత్రమే స్పష్టంగా గ్రహించగలం.

💜 6) ఇండిగో :- 💜
   -----------------------
 ● ఆరాలో అధికభాగం ఇండిగో వర్ణంలో కనిపిస్తే అలాంటి వ్యక్తులు మతాన్ని గాఢంగా విశ్వసించేవాళ్ళు అయి వుంటారు . 

◆ కొంతమంది తమకి మతం మీద విశ్వాసం బోలెడంత వుందని చెబుతూ వుంటారు . మరి కొంత మంది తమకి మతం మీద ప్రగాఢ విశ్వాసం వుందని అనుకుంటూ వుంటారు . వీళ్ళ ఇద్దరిలో ఎవరు నిజంగా మత విశ్వాసం కలిగి వున్నవాళ్ళో వాళ్ళు ఆరాలను పరీక్ష చేయకుండా నిర్ధారణ చేయ్యలేం . ఆరాలోని ఇండిగో వర్ణం మత విశ్వాసాన్ని స్పష్టంగా నిరూపిస్తుంది . ఈ ఇండిగో వర్ణంతో పాటు పింక్ వర్ణం కూడా ఆరాల్లో కనిపిస్తే అలాంటి వ్యక్తులు ప్రతి విషయానికి విసుక్కునే వాళ్ళుగా గ్రహించండి . మనిషిలోని అధోగతిని ఈ పింక్ - ఇండిగో మిశ్రమం సూచిస్తుంది . నిర్మలత్వం లోపించిన వ్యక్తుల ఆరాల్లో ఈ వర్ణం ప్రత్యక్షమవుతూ వుంటుంది. హృద్రోగంతో బాధపడుతున్న  రోగులలో , జీర్ణకోశ జబ్బుల్తో బాధపడుతున్న రోగులలో ఇలాంటి మిశ్రమం వున్న రంగు ఆరాల్లో తప్పక నెత్తిమీద గూడు కట్టుకుని వుంటాయి .

🖤 7)గ్రే(బూడిద):- 🖤
  ---------------------------
● ఈ రంగు ప్రత్యేకించి ఏ గుణాన్నీ సూచించదు . బొత్తిగా అధోగతి పాలయిన వ్యక్తిని ఈ వర్ణం విశ్లేషిస్తుంది . ఆరాల్లో ఈ రంగు పొరలు ద్యోతకమయితే ఆ వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతున్నాడనీ , వెంటనే అతనికి వైద్య సహాయం అవసరమని గ్రహించాలి . తలనొప్పితో ఎవరైనా బాధపడుతూ ఉంటే అతని ఆరాలో ఆ రంగు కొట్టుకుంటూ కనిపిస్తుంది . బొత్తిగా ఎదుగుదల లేని వ్యక్తి ఆరాలో ఈ రంగు చెల్లా చెదురుగా విరజిమ్మబడినట్లు కనిపిస్తుంది . అయితే అలాంటి వ్యక్తుల నగ్న శరీరాన్ని చూసే అవకాశం సాధారణంగా మీకు రాకపోవచ్చు .🙏🙏🙏

LAKSHMAN MURTHY:
🔺 మరణం లేని  మనం 🌺
🌹 ఆరా 🌹

◆  శరీరాన్ని అదే ఆకారంలో ఆవరించి ' ఎథిరిక్ ' ఉంటుంది. శరీరాన్ని చుట్టూ ' ఎథిరిక్ ' ఆవరించి ఉన్నట్టే ' ఎథిరిక్ ' చుట్టూ ' ఆరా,మానవ దేహాన్ని కొంత దూరం వరకు ఆవరించి ఉంటుంది . ' ఆరా ' కూడా ' ఎథిరిక్ లాగానే ఎలక్ట్రిక్ , మాగ్నెటిక్ శక్తితోనే ఏర్పడి ఉందని గ్రహించవచ్చు . 

◆ దివ్యాత్మ ( Over self ) లోని రంగుల్ని ' ఆరా ' చూపిస్తుందని మనం చెప్పుకోవచ్చు . ఓ వ్యక్తి ఆరా రంగుల్ని గమనించి " అతడు ఆధ్యాత్మికంగా పయనిస్తున్నాడా ? లేకపోతే ఓ పశువులాగా ప్రవర్తిస్తున్నాడా ? " అని వెంటనే గుర్తించవచ్చు . అలాగే ఓ వ్యక్తి “ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాడా ? అనారోగ్యంతో ఉన్నాడా ? కాకపోతే మరే జబ్బుతోనైనా బాధపడుతూ ఉన్నాడా ? " అని సులభంగా గుర్తు పట్టవచ్చు . మన ప్రవృత్తి మొత్తం స్పష్టంగా మన ' ఆరా'లో ప్రతిబింబిస్తూ ఉంటుంది . మన దివ్యాత్మని ప్రస్పుటంగా ఈ ' ఆరా ' చూపుతూ వుంటుంది . ' దివ్యాత్మ ' అనే పదం కన్నా ' ఆత్మ ' అన్న పదం నచ్చితే దాన్ని ఉపయోగించుకోవచ్చు. అర్ధం ఏమీ మారిపోదు . “ ఆత్మ ” అన్నా , “ దివ్యాత్మ " అన్నా ఒకటే అర్ధం వస్తుందని మనం గ్రహించాలి.

◆ ఆరాలో ఆరోగ్యాన్నీ , జబ్బునీ గమనించవచ్చు . నిరాశా నిస్పృహల్నీ , జయాపజయలనూ , ప్రేమ , పగలనూ కూడా స్పష్టంగా గుర్తించవచ్చు . మనలోని ప్రతి ఊహా , ప్రతి సంకల్పమూ మన ఆరా లోని రంగుల్లో స్పష్టంగా రూపుదిద్దుకుని ఉంటుంది . ఓ మనిషి చావు బ్రతుకుల్లో ఉంటే అతని ఆరా తనలోని రంగుల్ని కొల్పోయి పూర్తిగా నిర్జీవమయి ఉంటుంది . ఆ మనిషి చనిపోక ముందే ఆరా తన ఉనికిని పూర్తిగా 
పోగొట్టుకుంటుంది. ఆ వ్యక్తి చనిపోయే సమయానికి ఆరా పూర్తిగా మాయమై కొద్దిగా ఎథిరిక్ మాత్రం మిగిలి ఉంటుంది . ఓ భయంకరమైన జబ్బుతో చాలా కాలం తీసుకుని మరణించాడని అనుకుందాం. అలాంటి వ్యక్తి ఆరా పూర్తిగా జీర్ణమైపోయి ఉంటుంది . అలా కాకుండా మురో సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న వ్యక్తి అనుకోని ప్రమాదంలో ప్రాణాల్ని కోల్పోతే ఆ వ్యక్తి మరణించిన తరువాత చాలా కాలం వరకు కూడా ఆ కలేబరాన్ని ఆవరించే ఉంటుంది .

◆ఏ మనిషి ఉన్నట్టుండి చచ్చిపోడు. దానికో పెద్ద తంతు ఉంది. ఏ పద్దతిలో మనిషి చచ్చినా - చటుక్కున తల తెగిపోయి మరణించినా సరే - శరీరంలోంచి ప్రాణం ఓపట్టాన బయటకు పోదు . శరీరం కొంత సేపటి వరకు కొట్టుకుంటూనే ఉంటుంది . మెదడులో ఎలక్ట్రిక్ కరెంట్ తయారవుతుంది , నిలువ ఉంటుంది.రక్తం మెదడులోకి లోహాల అణువుల్నీ , తగినంత తేమనీ , విద్యుత్ తయారయ్యేందుకు ఉపకరించే రసాయన పదార్థాలనూ చేరవేస్తూంటుంది . తయారైన విద్యుత్ మెదడు కణాలలో కొంత ఛార్జి చేయబడి నిలువ ఉంటుంది . ఓ మనిషి తలను నరికేసినా కూడా ఈ నిలువ ఉన్న విద్యుత్ ఆ తల లోని మెదడు 3 నుంచి 5 నిముషాల వరకు పనిచేస్తూ వుండేలా చేస్తుంది.

◆ మెదడుకు అందే రక్తప్రసారం ఓ 3 నిముషాలు పాటు ఆగిపోతే ఆ వ్యక్తికి మరణం సంభవిస్తుంది అని . అందువల్లనే ఓ వ్యక్తి గుండె కొట్టుకోవడం ఆగిపోతే దాన్ని మళ్ళీ పునరుజ్జీవింప చెయ్యడానికి డాక్టర్లు పడే హైరానా అంతా ఇంతా కాదు . ఎలాగైనా ఆ గుండెను 3 నిమిషాల్లో మళ్ళీ కొట్టుకునేలా చెయ్యకపోతే తలకి వెళ్ళే రక్త ప్రసరణ ఆగిపోయి మరణం సంభవిస్తుంది . 

◆ చావు ఓ క్షణంలో జరిగే పని కాదు ”.  అలాగే , “ ఆరా రంగులు తగ్గిపోయినంత మాత్రాన మనిషికి చావు రాదు ” . చావు చాలా నింపాదిగా సంభవిస్తుందని, డాక్టర్లకూ , తలారులకూ తెలుసు . శరీరంలో మొదట మెదడు మరణిస్తుంది . ఒక్కో అవయవం తరువాత వరుసగా  చచ్చిపోతూ ఉంటుంది . చిట్టచివరగా ప్రాణాల్ని వదిలేది వెంట్రుకలూ , గోళ్ళూ .

◆ శరీరానికి ప్రాణం వెంటనే పోదు . ఆరా , ఆ కళేబరం దగ్గరే నెమ్మదిగా తచ్చాడుతూ ఉంటుంది . ఆ శవం ప్రక్కనే ఉన్న ఆరాను చూడగలిగిన శక్తి ఉన్న యోగి ( Clairvoyant ) ఆ వ్యక్తి మరణానికి కారణం ఏమిటో వెంటనే తెలుసుకోగలడు. చనిపోయిన మనిషి ' ఆరా ' మాయమైపోయినా ఎథిరిక్ ' మాత్రం దయ్యం రూపంలో శరీరానికి దగ్గర్లోనే తిరుగుతూ ఉంటుంది . మరణించిన వ్యక్తి ఆరోగ్యం బావుండి అకస్మాత్తుగా దుర్మరణం పాలైతే ఇలాంటి దెయ్యాలు తప్పక వెలుస్తాయి . ఎంచేతనంటే ఆ వ్యక్తిలోని బ్యాటరీల్లో శక్తి పూర్తిగా ఛార్జ్ ' అయి ఉంటుంది కాబట్టి ' . శక్తివంతమైన ఈ ' ఎథిరిక్ ' లు అయస్కాంత శక్తి వలన తాము పూర్వపు తిరుగాడిన ప్రదేశాల్లోనే తిరుగుతూ ఉంటాయి . భూత వైద్యులకు గానీ , ఆరాలను చూడగలిగిన వ్యక్తులకు గానీ , భయంతోనో ఆత్రుతతోనో బాగా ఉద్రేకం చెంది వున్న ( తనలోని ప్రకంపనాలను తీవ్రతరం చేసుకుని ఉన్న ) వ్యక్తికీ ఈ ఎథిరిక్ ' శరీరాలు కన్పిస్తాయి . వాళ్ళు ఆ దెయ్యం, ఏ మనిషి తాలూకుదో ఇట్టే గ్రహించగలిగి ఉంటారు .

◆ “ ఎదిరిక్ కన్నా ఆరాలు సూక్ష్మమైనవి . స్థూల శరీరానికి ఎథిరిక్ ఎంత సూక్ష్మంగా ఉంటుందో అదేవిధంగా ' ఎథిరిక్ ' శరీరాన్ని ఆవరించి ఉన్న ' ఆరా ' అంతకన్నా సూక్ష్మంగా ఉంటుంది .ఎథిరిక్ ' శరీరాకృతిని యధాతధంగా ప్రతిబింబిస్తూ ఉంటుంది ; కానీ , ' ఆరా మాత్రం శరీరం చుట్టూ ఓ కోడిగుడ్డు ఆకారంలో విస్తరించి ఉంటుంది .

◆ ఈ ' ఆరా ' సుమారు 7 అడుగులు ఎత్తూ , 4 అడుగుల వైశాల్యం ( బాగా వెడల్పుగా ఉన్నచోట ) కలిగి శిరస్సు ఉన్న చోట లావుగానూ , కాళ్ళ వద్దకి వచ్చేసరికి కోడిగ్రుడ్డులో సన్నని భాగాన్ని పోలి సన్నగానూ ఉంటుంది . శరీరంలోని అనేక ప్రదేశాల్నుంచి మిరుమిట్లు గొలిపే రంగులో కాంతి మరి కొన్ని ప్రదేశాలకు ప్రవహిస్తూ ఉటుంది . 

◆ మానవుడు జీవించి ఉండటానికి అత్యంత కీలకమైన శక్తిని ఈ ఆరాలు కలిగి ఉన్నాయి. అలాగే రెండు మామూలు గాజు పలకల మధ్య పల్చటి రంగు ' డై ' పూతని ఏర్పాటు చేసి ఆ అద్దాల పలకలోంచి చూస్తే ఎదురుగా ఉన్న మనిషి ఆరా ' లు స్పష్టంగా చూడవచ్చునని తెలుసుకోండి . 

◆ ఈ ఆరాలు మనకు కనిపించకుండా ఉన్నందుకు ముఖ్య కారణం అలాంటి శక్తి మన కళ్ళకు ఉందని మనం విశ్వసించక పోవడమే ! 

◆ మన ' ఆరా ' లో అనేక రంగులు ఉంటాయని మనం తెలుసుకున్నాం. మనం ' రంగులు ' అని చెప్తున్నది వర్ణమాలలోని ఓ ప్రత్యేక తరంగ సామర్థ్యం ఉన్న ఓ అంశమేనని మనం గుర్తుపెట్టుకోవాలి . ఎరుపు ” అన్నామంటే వర్ణమాలలో సులభంగా గోచరమయ్యే ఓ ప్రత్యేక తరంగ మని అనుకోవచ్చు . ఎరుపు , వేరు వేరు తరంగ సామర్థ్యాలు ఏడు ఒక్కటిగా ఏర్పడి ' వర్ణమాల ' అంటే తెలుపు రంగు ఏర్పడుతుంది . తెల్లటి రంగే ఇంధ్రధనస్సు ఏర్పడినప్పుడు ఈ వర్ణమాల రూపంలో స్పష్టంగా విభజింపబడి ఏడు రంగులుగా విచ్చేధం చెంది మనకి దృగ్గోచరమౌతుంది. 

◆ ఆరా ' ను చూడగలిగే సామర్థ్యం ఉన్న వాళ్ళ ముందు మాట్లాడేప్పుడు కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది . ఎంచేతనంటే వాళ్ళు మీ మాటల్లోని అబద్దాలని సులభంగా గుర్తు పట్టేసి పైకి చెప్పేసి మిమ్మల్ని అవమానం పాలు చేయగలరు .

◆ సాధారణంగా మన తల చుట్టూ ఓ నీలిరంగు కాంతి వలయం గానీ , లేత పసుపు రంగుకాంతి వలయం గానీ ఉంటుంది . మనం ఒక అబద్దాన్ని ఉచ్చరించగానే ఓ పసుపు ఆకుపచ్చ కాంతి కిరణం ఈ హేలో లో విజృంభించి కనిపిస్తుంది ! ఈ రంగుని మాటల్లో వర్ణించడం కష్టమే కానీ ఒక్కసారి ఈ రంగుని చూడగలిగారంటే మరి జన్మలో ఆ రంగుని మర్చిపోరు . కాబట్టి మనం ఓ అబద్ధం ఆడగానే మన తల మీద హేలో లో ఆకుపచ్చ పసుపు రంగు మంట ఒకటి ఉవ్వెత్తున లేచి మన అబద్దాన్ని బయటపెట్టేస్తుంది .

◆ తలపై భాగాన నీలిరంగుతో కానీ లేత పసుపు పచ్చ రంగుతో కానీ ఈ హేలో లేక ' నింబస్ మెరుస్తూ వెలుగుతూ ఉంటుంది . 

◆ ఓ వ్యక్తి ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న కొద్దీ అతని హేలో రంగు కాషాయ వర్ణం పసుపు రంగులోకి కొద్ది కొద్దిగా విస్తరిస్తూ గాఢంగా రూపొందుతుంది . ఓ మనిషికి వికారమైన ఆలోచనలు చుట్టుముట్టి ఉంటే ఈ హేలో రంగు బురద మట్టి రంగులోకి దిగిపోయి దాని అంచుల్లో ఆకు పసరు పసుపు రంగుల్లో పిచ్చి ఆలోచనలు ఈ బురద రంగుని ఆవరించి కనబడుతాయి .

◆ ఓపురుషుడు లేకపోతే ఓ ఆడపిల్ల “ ఈ రంగు లేక ఆ రంగు బట్టలు నాకు బాగా నచ్చుతాయి ” అని చెప్పుకోవడం మనం వింటూనే ఉంటాం . లేకపోతే ఫలానా వాళ్ళకు ఫలానా రంగు , డ్రస్సులు బాగుండవని అనుకోవడం కూడా మనం వింటూనే ఉంటాం . ఇలా ఓ స్త్రీ గానీ పురుషుడు గానీ అనుకోవడానికి స్వతఃసిద్ధంగా తమకి కనిపించినా గుర్తించలేని ఆరా రంగులతో పైన ధరించే రంగు వస్త్రాలు సవ్యంగా అమరి ఉండగలవని తెలుసుకుని ఉండగలగడమే కారణం . కొంతమంది , వేసుకున్న బట్టల్ని చూడగానే “ అవి వాళ్ళకు సరిగ్గా ' మేచ్ ' కాలేదు ” అని యిట్టే గుర్తు పట్టేయగల నేర్పుని స్వతఃసిద్ధంగానే కలిగి ఉంటారు . ఈ విషయం మీకు నిత్యం అనుభవంలోకి వస్తూనే ఉంటుంది . ఆ బట్టలు వేసుకున్న వ్యక్తికి తెలిసి ఉండక అలాంటి వేషధారణ చేసి వున్నా చూస్తున్న మనకి ఆ దుస్తులు ఎబ్బెట్టుగా కనిపించక మానదు . కాబట్టి , మనలో చాలామంది ' ఆరా ' ని చూసే సామర్థ్యం కలిగి ఉంటారనీ , నేరుగా 'ఆరా' ని చూడలేకపోయినా మార్గాంతంలో దాన్ని కనీసం గుర్తుపట్టగలిగి ఉంటారనీ , లేదా మనిషి చుట్టూ ఆరా ఉండి ఉంటుందని కనీసం తెలుసుకుని ఉంటారనే విషయం కానీ స్పష్టంగా అర్ధమౌతుంది . కానీ చిన్నప్పటి నుంచి తాము వంటబట్టిచ్చుకున్న ఆచార వ్యవహారాల వల్లా , “ వింతలని వెర్రిగా చూడటం మంచిదికాదు . ” అనే చిన్ననాటి అభిప్రాయాలవల్లా , వాళ్ళ మనస్సుల్ని వాళ్ళే మభ్యపెట్టుకుని వాళ్ళని వాళ్ళే స్వంతంగా ' హిప్నాటైజ్ ' చేసేసుకుని తమకు " ఆరాలు కనబడడం లేదు ” . అని అనుకుంటూ ఉండిపోతారు . 

◆ కొన్ని డ్రస్సులు మీకు బాగా ' సూట్ ' అవుతాయి . వాటిని ధరిస్తే మీరు ఎంతో ఉత్సాహంతో ఉరకలు వేస్తుంటారు ; ప్రశాంతంగా లేక గంభీరంగా ఉంటారు . మరి వేరే రంగు బట్టల్లో ఉన్నప్పుడు మీకు చీకాకూ , ఆందోళనా , దిగులూ లేకపోతే ఆ డ్రెస్సుని తీసి పారేసేంత వరకూ అనారోగ్యం కూడా కలుగుతుందనే విషయం మీ అనుభవంలోకి వచ్చే ఉంటుంది .

◆ ఓ గదిలోకి మీరు వెళ్ళగానే ఆ రూము గోడలకి వేసి ఉన్న రంగులు గమనించినప్పుడు కొన్ని సార్లు మీ మనసుకి ప్రశాంతత చేకూరినట్లు అనిపిస్తూ వుంటుంది . మరికొన్ని గదులలోని రంగులు గమనించినపుడు మీరు ఉద్రేకానికి లేదా అశాంతికి గురి కావచ్చు . రకరకాల ప్రకంపనాలకి ఒక్కో “ రంగు ' పేరు మనం పెట్టుకుని ఉన్నామన్న సత్యాన్ని గుర్తించండి .

ఎరుపు రంగు ఒక నిర్ణీతవేగంతో పయనించే తరంగమనీ , ఆకుపచ్చ రంగు మరో ప్రకంపనం కలిగిన తరంగమనీ , నలుపురంగు ఇంకో తీవ్రతను పొందిన తరంగమనీ మనం గుర్తిస్తే ఆ రంగులని గమనించినప్పుడు మనలో కలిగే ప్రశాంతత , ఉద్విగ్నత , ఉదాసీనత , దిగుళ్ళ లాంటి భావాలకు అర్ధం గోచరిస్తుంది .

◆ మనకు విన్పించే శబ్దాల తీవ్రత అధికమైతే మనకు ఎలా తిక్కరేగుతుందో మనకు కనుపించని కాంతి తరంగాల తీవ్రత కూడా మనలోని ఆధ్యాత్మికత్వాన్ని అలాగే భగ్నంచేయవచ్చు.

◆🙏🙏🙏
🌺
🌹 ఆరా వర్ణాలు --3 PART 3🙏🌹

◆ ఈ విశ్వమంతా ఒక ప్రకంపనల సముదాయం.

◆ శబ్దమూ , కాంతీ దగ్గరి బంధువులు లాంటివి . ఒక రంగుపేరు చెప్పగానే దానికి తగ్గట్టు ఓ శబ్ద వర్ణం వినిపిస్తుంది . వింటానికి ఈ విషయం చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ ! సరిగ్గా ఇలాంటి పనిచేయగల ఎలక్ట్రానిక్ ఆర్గాన్స్ ఉన్నాయి . వాటిలో ఉన్న స్కానర్ ( కన్నులాంటి పరికరం ) ముందు , ఓ రంగు ఉన్న వస్తువుని ఉంచితే ఆ రంగుకు తగిన రాగాన్ని ఈ యంత్రం వినిపిస్తుంది . 

◆ మన చుట్టూ ఎన్నో రేడియో శబ్ద తరంగాలు , టెలివిజన్ బొమ్మల ప్రోగ్రాముల తరంగాలు తిరుగుతూనే ఉన్నాయి . మైక్రోవేవ్ తరంగ రూపాల్లో ఎందరో మనుష్యులు టెలిఫోన్లలో మాట్లాడుతున్న మాటలన్నీ మన చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి . ఇంట్లోకి వెళ్ళినా , వీధిలోకి వెళ్ళినా ఈ తరంగాలని మనం తప్పించుకోలేం . కానీ ఇవి మనకు కనబడవు , వినబడవు . ఓ ట్రాన్సిస్టరు రేడియోనో , ఓ టెలివిజన్‌ సెట్టో , ఓ మొబైల్ కార్డ్ లెస్ ఫోనో ఏదో ఒక ప్రత్యేక పరికరం లేకపోతే ఈ తరంగాలని మనం గ్రహించలేం , అర్థం చేసుకోలేం , ఆనందిం చలేం . ఈ పరికరాలన్నీ ఈ రేడియో , మైక్రోవేవ్ , టెలివిజన్ ప్రసారాల తరంగాల వేగాన్ని తమలో ఉన్న ఎలక్ట్రానిక్ సర్క్యూట్లు ద్వారా గణనీయంగా అంటే ఆ తరంగాలు మనం  గ్రహించగలిగే వేగంలోకి నియంత్రించి పునర్నిర్మాణం చేసే మాటలుగా , పాటలుగా , టెలివిజన్ ప్రోగ్రాంలుగా మనకి అందించ గలుగుతున్నాయి . ఈ పరికరాలు పైన ఉన్న ఫ్రీక్వెన్సీలను ( ప్రకంపనాల వేగాన్ని ) మనకు వినిపించే ఫ్రీక్వెన్సీలోకి మార్చుతాయని మీరు మరో మాటలో చెప్పుకోవచ్చు . 

◆ ఇప్పుడు అదే పద్దతిలో మీరు ఆలోచిస్తే ఒక్కో కాంతి వర్ణాన్నీ ఒక్కో స్వర వర్ణంగా మనం మార్చుకుని వినవచ్చునని అర్థం చేసుకోవచ్చు . లేకపోతే ఒక్కో స్వర వర్ణాన్ని ఒక్కో స్వర వర్ణంగా రూపొందించుకుని వాటిని దర్శించి ఆనందించవచ్చు . తూర్పు దేశాల వారికి ఈ విషయం ఎప్పటినుంచో బాగా తెలుసు . చిత్రలేఖనాన్ని సంగీత పరంగా అర్థం చేసుకుంటే అందులో మజాయే వేరుగా ఉంటుంది . ఉదాహరణకి  ఓ తైలవర్ణ చిత్రంలోని రంగులు ఓ సంగీత విద్వాంసుడికి భాసురమైస్ఫూర్తియై పరమానంద భరితుణ్ణి చేసి స్వరకల్పన చేయిస్తాయి . 

◆ అంగారక గ్రహాన్ని " ఎర్రగ్రహం " అంటామని అందరికీ తెలుసు . ఎరుపు రంగు అంగారకుడికి చిహ్నం . అసలు ఎరుపు రంగు ఛాయ సమీకరణం చెందుతూ సంగీతంలోని " దో ” అనే స్వరం ప్రకటించబడుతూ ఉంటుంది . 

◆ నారింజ, ఎరుపుకు మరో ఛాయ ; ఈ వర్ణానికి ' రె ' అనే సంగీత వర్ణం సరిగ్గా తులతూగుతుంది . కొన్ని మతాల వాళ్ళు ఈ వర్ణంలో సూర్యుణ్ణి వర్ణిస్తారు . మరి కొందరు నీలి రంగుతో సూర్యుడిని సమీకరించే ప్రయత్నం చేస్తున్నారు . మేము మాత్రం నారింజ రంగునే సూర్యుడికి ప్రతీకగా గుర్తిస్తూ ఆరాధిస్తాం . 

◆ పసుపు పచ్చ రంగు సంగీతంలోని ' మి'కి సమానం . సూర్యుడి గ్రహాల్లో మొదటిదైన బుధుడికి ఈ రంగు ప్రతీక . ఇలాంటి విషయాన్ని మనం వివిధ మతస్థుల పురాణాలలో చదువుతాం . గ్రీకుల దేవుళ్ళు మంటలు చిమ్మేరధాలు వేసుకుని గగన విహారాలు చేస్తుంటారని మనం చదివాం . అలాగే ప్రాచ్యులు వారి పురాణాలల్లో ఒక్కో గ్రహాన్ని ఒక్కో రంగుకు అధిపతిగా అభివర్ణించారు . 

◆ ఆకుపచ్చ రంగుకు సంగీతంలోని 'ఫా ' స్వరానికీ పొత్తు కుదురుతుంది . ఈ రంగు పెరుగుదలకు సంకేతం . చక్కటి శ్రావ్యమైన సంగీతం వినిపిస్తే చెట్లు  బాగా ఎదుగుతాయని మనకి అనేక ఋజువులు కూడా కన్పిస్తాయి . ఈ విషయం గురించి మనకు ప్రత్యేకమైన జ్ఞానం లేకపోయినప్పటికీ ఈ విషయం నిజమేనని మాకు ఆ విషయాలను చెబుతున్న వ్యక్తుల మీది అచంచల విశ్వాసం వల్ల అనిపిస్తుంది .

◆ శనిగ్రహం ఆకుపచ్చ రంగుకు అధిపతి . మన పూర్వీకులు ధ్యానంలో ఈ గ్రహాల వర్ణాలను గ్రహించగలిగారనే విషయం మనకి అత్యంత ఉత్సాహాన్ని ధ్యానంపై కల్పిస్తుంది . ఋషులు భూమి మీద అత్యంత ఎత్తయిన ప్రదేశాల మీద ఈ ధ్యానం చేశారు . ఉదాహరణకి హిమాలయ పర్వతాలలో , సముద్రమట్టం నుంచి సుమారు పదిహేను వేల అడుగుల ఎత్తునుంచి చూస్తే గ్రహాలన్నీ స్పష్టంగా దర్శనమిస్తాయనే విషయం ఇప్పుడు బాగా తెలుసు .వాతావరణం సాంద్రత బాగా తగ్గిపోయి గాలి తక్కువగా ఉండటమే దీనికి కారణం . గ్రహాలు స్పష్టంగా కనిపించడం వల్ల వాటి గురించిన జ్ఞానం కూడా మరింత స్పష్టంగానే ఉండడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు . కాబట్టి మన ప్రాచీన యోగులు ఈ మార్గంలోనే గ్రహాలను కాంతి వర్ణాలతో సమీకరించగలిగారు . 

◆ నీలి రంగుకు సరిపోయే సంగీతస్వరం "సో " నీలిరంగు సూర్యుడికి చిహ్నమని కొన్ని మతాల వాళ్ళు అనుకుంటారని మనం ఇందాక అనుకున్నాం కదూ ! కానీ మనం ప్రస్తుతం చేస్తున్న సాధన అంతా ప్రాచీన హిందూ సాంప్రదాయాన్ని అనుసరించి కాబట్టి నీలి రంగును బృహస్పతి , అనుసంధానం చేస్తాం తప్ప సూర్యుడికి కాదు . 

◆ ఇండిగో వర్ణం సంగీతంలోని “ లా” స్వరానికి సమానంగా ఉంటుంది . ప్రాచ్యులు ఈ వర్ణాన్ని శుక్రుడికి ఆపాదిస్తారు . శుక్రుడు ప్రసన్నుడైతే మనుష్యులకి చిత్రలేఖనా సామర్థ్యాన్నీ , పవిత్రమైన ఆలోచనా పటిమనూ అనుగ్రహిస్తాడు . మంచి వ్యక్తిత్వాన్ని శుక్రుడు ప్రసాదిస్తాడు .

ఇతర హీన ప్రకంపనాలతో కూడిన మనుష్యుల మీద మాత్రమే శుక్రుడు కొన్ని విపరీతాలను కలిగిస్తుంటాడు.

◆  వైలెట్ వర్ణం సంగీతంలోని " టి " స్వరాన్ని సూచిస్తుంది . ఈ వర్గానికి చంద్రుడు అధిపతి . చంద్రుడి అంశ , అనుగ్రహం సరిగ్గా ఉన్నవాళ్ళు కూడా చక్కటి మనఃశుద్ధిని కలిగి చక్కటి ఆలోచనలను కలిగి ఉంటారు . చంద్రుడి అంశ కాస్త వికటిస్తే మాత్రం ఓ వ్యక్తి మానసిక పరిస్థితి గందరగోళంగా తయారై చివరికి పిచ్చివాళ్ళుగా మారే పరిస్థితి ఎదురవుతుంది . 

◆ ఆరాకు వెలుపల ఓ పొర వుంటుంది . ఆరా అనేది మానవ శరీరాన్ని పూర్తిగా ఆవరించి ఉంటే , శరీరం చుట్టూ ఉన్న ఎథిరిక్ ని , అతడి ఆరాని కూడా మొత్తంగా ఒక ప్లాస్టిక్ సంచిలో పెట్టి బిగించినట్లు ఈ అమరిక ఉంటుంది . ఈ విషయాన్ని మరొక రకంగా మనస్సులో ఊహించుకోండి. మీ దగ్గర ఓ కోడి గ్రుడ్డు ఉందనుకోండి . ఆ గ్రుడ్డు లోపల ఉన్న పిండం , దాన్ని బేలెన్సు చేస్తున్న బ్యాలెన్సర్లూ మీ శరీరం అనుకోండి . స్థూల శరీరం ఇది . పిండం , చుట్టూ తెల్లసొన వ్యాపించి ఉంటుంది . గ్రుడ్డు నిండా ఈ తెల్ల సొనను ఎథిరిక్ , ఆరాలుగా దర్శించండి . ఈ తెల్లసొన చుట్టూ ఓ పలుచటి మెత్తటి పొర ఒకటి గ్రుడ్డులో పై పెంకు క్రింద ఉంటుంది . కోడి గ్రుడ్డును ఉడకబెట్టి పై పెంకును తీసేస్తే ఈ పొరని తోలు వలచినట్లు వలిచి తీసేయవచ్చు . ఈ పొర చాలా బలంగా ఉంటుంది .

◆ మానవ శరీరం చుట్టూ ఉన్న అమరిక కూడా అచ్చం ఈ కోడి గ్రుడ్డు లాగానే ఉంటుంది.మానవ శరీరం చుట్టూ, ఉన్న ఎథిరిక్ , ఆరాలను రక్షిస్తూ పారదర్శకమైన ఒక సంచి ( bag ) లాంటి పొర శరీరాన్ని స్థిరంగా ఆవరించి ఉంటుంది . ఆరాలోని తీవ్ర ప్రకంపనాలకు ఈ పై పొర కొంత చలించినా తన ఆకారాన్ని మార్చుకున్నా మళ్ళీ తన కోడి గుడ్డు లాంటి ఆకారాన్ని వెంటనే తిరిగి తెప్పించుకోగలుగుతుంది - నిండా గాలి నింపబడి ఉన్న ఓ టెలూన్ తన ఆకారాన్ని ఎలా నిలబెట్టుకొంటుందో అలాగే!!

 ◆ ఓ వ్యక్తి ఆలోచిస్తూ ఉంటే అతని మనస్సు నుంచి ఆలోచనలు వెలువడి ఎథిరిక్ లోని , ఆరా లోంచి దూసుకు వెళ్ళి ఈ పారదర్శకమైన పొర లోపలి భాగానికి తగుల్తూ ఉంటాయి . అప్పుడు ఆ పొరపై భాగంలో ఆ ఆలోచనలకు సరిపోయే చిత్రాలు ఏర్పడుతాయి .

 ◆ మనస్సులోంచి వెలువడే ఆలోచనా పరంపరలు మీ చుట్టూ ఉన్న " ఆరిక్ తొడుగు " మీద అనేక చిత్రాలను నిరంతరం చిత్రిస్తూ ఉంటాయి. యోగులైన (క్లేయిర్ వొ యాంట్స్) కొంతమందికి ఈ చిత్రాలు సుస్పష్టంగా కనిపిస్తాయి . దార్శనికులైన యోగులు వర్తమానంలో కనిపిస్తున్న బొమ్మల్నే కాదు భూతకాలంలోని బొమ్మల్ని కూడా చూడగలిగిన శక్తిని సంపాదించుకొని ఉంటారు.మనం కూడా సంపాదించుకోవచ్చు.

◆ ఇటువంటి శక్తి ఉన్న జ్ఞానులు ఓ వ్యక్తిని చూస్తూనే,అతడి రెండో ,మూడోగత జన్మల గురించి కూడా వెంటనే తెలుసుకోగలరు. వినడానికి అత్యంత విచిత్రంగా ఈ మాట తోచినా ఇది పరమ సత్యం.

◆ పదార్థాన్ని నాశనం చేయలేం . సృష్టిలోని అన్ని పదార్థాలు ఎల్లప్పుడూ ఉంటాయి . మీరు ఒక శబ్దం చేస్తే ఆ శబ్దం తాలూకు ప్రకంపనాలూ , ఆ ప్రకంపనాలకు ఆధారభూతమైన శక్తి ఎల్లప్పుటికి ఈ విశ్వంలో వ్యాపిస్తూనే ఉంటాయి. మాటవరసకి ఒకవేళ మీరు ఉన్న పాటున ఎంతో గొప్ప దూరంలో ఉన్న ఓ కొత్త గ్రహానికి వెళ్ళారనుకోండి . అప్పుడు మీకు కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగిపోయిన సంఘటనలు కన్పిస్తాయి . ( ఆలా చూడటానికి మీ దగ్గరయంత్ర పరికరాలు ఉన్నట్లయితే ).

◆ కాంతి వేగం చాలా గొప్పదని మీకు తెలుసు.  అలాగే , కాంతి ఎంత దూరం పయనించినా వెలిసి పోదు -- తగ్గిపోదు " అని మీకు తెలుసు . కాబట్టి చటుక్కున మీరు కొన్ని కోట్ల కాంతి సంవత్సరాల దూరాన ఉన్న ప్రదేశానికి చేరుకోగలిగితే మన సూర్య మండలంలో మన భూమి పుడుతూ ఉన్న దృశ్యాన్ని అక్కడ నుంచి ప్రత్యక్షంగా వీక్షించవచ్చు . 

◆ అచేతన స్థితిలో ఉన్న మనస్సు చైతన్యంలో ఉన్న మనస్సు భాగాల అజమాయిషీ లేకుండా ఉన్నప్పుడు ఇప్పుడు మనకు ఉన్న మానసిక చైతన్యంతో అందుకోలేని అనేక వింత విషయాలను ప్రకటించ గలిగి ఉంటుంది " అని . భూత వర్తమాన భవిష్యదర్శనం చేయగల మహాపురుషులు ( Clairvoyants ) ఎదురుగా కనిపిస్తున్న వ్యక్తి తాలూకు విషయాలన్నీ సులభంగా తెలుసుకోగలిగి ఉంటారు . ఈ సాధన బాగా అభివృద్ధి చెందిన సైకోమెట్రీ విధ్య అనుకోవచ్చు . ఆ విద్యలో ఇది " దృగ్గోచరమైన సూనసిక పరిశీలన ( Visual psyclometry )" అనే విభాగంలోకి వస్తుంది . 

◆మీరు కొందరు వ్యక్తులని చూడగానే ఎంతో ఆకర్షితులు కావడం , లేకపోతే వెంటనే కొందరిని అసహ్యించుకోవడం , లేక కొందర్ని చూస్తేనే " దూరంగా పారిపోతే బాగుండు " నని అనుకోవడం గమనించే ఉంటారు . అజ్ఞాతంగానే ఉన్న ఆరాను గుర్తించగలిగి ఉండటమే మీ ఈ ఆకర్షణ వికర్షణలకు అర్థాన్ని వివరిస్తుంది . మొదట్లో ప్రాచీనకాలంలో అందరికీ అందరి ఆరాలను స్పష్టంగా చూడగలిగే శక్తి ఉండేది . కానీ ఆ శక్తిని అనేక విధాలుగా దుర్వినియోగం చెయ్యడం వల్ల మానవులు ఆ శక్తులను కోల్పోయారు . రాబోయే కొన్ని శతాబ్దాలలో అందరికీ ఈ శక్తులు మళ్ళీ వస్తాయి . అప్పుడు అందరు టెలీపతి - క్లెయిర్ వొయాన్స్ లాంటి విద్యల్ని ప్రదర్శించగలిగి ఉంటారు .

◆ ఇద్దరి మధ్య ఆకర్షణ ఏర్పడాలంటే ఇద్దరి ఆరాల్లోని రంగులు కలియాలి . ఇంచుమించు ఒకే వర్ణ సముదాయాలు ఇద్దరిలోనూ ద్యోతకమవ్వాలి . భార్యాభర్తలు కొన్ని విషయాల్లో ఎంతో ఒద్దికగా ఉంటారు . కొన్ని విషయాల్లో ఒకర్తో ఒకరు ఏకీభవించకుండా పోట్లాటలు పెట్టుకుంటూ వుంటారు . ఒకరి ఆరాలోని ఒక నిర్ణీత ఆకారపు తరంగంలోని కొన్ని భాగాలు మాత్రం ఎదుటి ఆరాలో ఉన్న అలాంటి తరంగాలతో అక్కడక్కడా సరిపోతూ ఉండటమే ఇందుకు కారణం . రెండు తరంగాలలోని కొన్ని బిందువులు జతపడితే ఆ ఇద్దరి వ్యక్తుల మధ్యా సామరస్యమూ , పొత్తూ చక్కగా కుదురుతుంది . కొన్ని జంటలను “ భిన్న ధ్రువాలు లాగా ఉన్నారు ” అని అనుకుంటూ ఉండటం మనం వింటూ వుంటాం . అనుకూల దాంపత్యం ఉండనివారికి ఈ మాట నిజంగా సరిపోతుంది . భార్యాభర్తలు ఒద్దికగా ఉంటే వాళ్ళ ఆరాల్లోని రంగులు కూడా హృద్యంగా అమరి ఉంటాయనీ , పరస్పరం పోట్లాడుకునే జంట ఆరాల్లో రంగులు భయంకరంగా ఒకదానితో ఒకటి పొంతనలేకుండా ఉంటుందని కూడా మీరు అనుకోవ చ్చు . 

◆  ఇంచుమించు ఒకే విధమైన తరంగ ప్రకంపనాల వేగం ( ఫ్రీక్వెన్సీ ) ఉన్న మనుష్యులు అందరూ ఒక గుంపుగా కలసి తిరుగుతూ వుంటారు . ఓ అమ్మాయిల గుంపు మనం తిరగడం చూసే ఉంటాం . అలాగే వీధి చివర్లో అబ్బాయిలు కొందరు అల్లరి గ్యాంగులాగా ఏర్పడి నుంచోని ఉండటాన్ని కూడా చూసే ఉంటాం . ఈ గుంపులో అందరికీ ఇంచుమించు ఒకే పద్ధతిలోనే ఉన్న  ఆరాలు వుంటాయి . అందరి ప్రకంపనాలూ సుమారుగా  ఒకే తీరులో ఉంటాయి . అందరు మరొకరిని అనుసరించి మెలగుతూ ఉంటారు . అందరూ ఒక విధమైన అయస్కాంత శక్తితో ఆకర్షింపబడి కలసి ఉంటారు . గుంపులో అందరికన్నా బలంగా ఉన్న వ్యక్తి మిగతా అందరినీ శాసించగలిగి ఉంటాడు . మంచికైనా , చెడుకైనా ఈ గుంపు కలిసే ఉంటుంది . యువకులు క్రమశిక్షణను అలవరచుకుంటే ప్రాథమిక ఆవేశాలను అణచుకుని అందరూ ఒకే సమయంలో అభివృద్ధి పుష్కలంగా ఉంటుంది .

◆ ప్రతి మనిషీ కోడి గ్రుడ్డు లాంటి ఆకారంలో  ఉన్న "ఆరిక్ తొడుగు"  మధ్యలో - నడి మధ్యలో ఉంటాడు . ఇదే ప్రతి మనిషి యొక్క సాధారణ స్థితి. సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న వ్యక్తి ఇలాంటి స్థితిలోనే - అంటే తన ఆరాకి సరిగ్గా మధ్యలో ఉంటాడు .

◆ ఓ వ్యక్తి మానసిక రుగ్మతతో ఉంటే ఈ వ్యక్తి శరీరం ఆరిక్ తొడుగుకు సరిగ్గా మధ్య భాగంలో ఉండదు . అలాంటి వారిని గురించే ' మనిషి మనిషిలో లేడు ' అని చెప్పుకుంటూ ఉంటారు . వీళ్లు ఆరాలో వాలిపోయి వుండి తమ ఆలోచనలను వక్రమార్గంలో వ్యక్తీకరిస్తూ - ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు . 

◆ కొంతమంది వ్యక్తుల్లో రెండు విభిన్న వ్యక్తిత్వాలు గోచరిస్తూ ఉంటాయి . ఇలాంటి వారి ఆరాలు మామూలు మనుష్యుల ఆరాల లాగా కోడి గ్రుడ్డు ఆకారంలో ఉండదు . వాళ్ళ ఆరాల్లో సగభాగం ఒక రంగుతోనూ మిగతా సగభాగం మరొక రంగుతోనూ గోచరిస్తూ ఉంటుంది . ఇలాంటి వ్యక్తుల ఆరా ఒక కోడి గ్రుడ్డులా కాక రెండు కోడి గ్రుడ్లను ఒంకర టింకరగా అంటించినట్లు కూడి ఉంటుంది .

◆ మానసిక రోగులకు జరిగే వైద్య విధానం సున్నితంగా ఉంటుందని అనుకోకూడదు . వాళ్ళకు ఇచ్చే షాక్ ట్రీట్మెంట్ చాలా భయంకరంగా అనిపిస్తుంది . ఎంచేతనంటే వాళ్ళకు ఇచ్చే విద్యుత్ఘాతం శక్తి చాలా బలంగా ఉండి వాళ్ళ ' ఆస్టల్ బాడీ ' లను ( సూక్ష్మ శరీరాలను ) బలంగా బయటకు విసిరి వేస్తాయి. ఎలక్ట్రిక్ షాక్ ట్రీట్మెంటు ముఖ్య ఉద్దేశ్యం ( తెలిసి చేస్తున్నా తెలియక చేస్తున్నా )  ఆ రెండు సూక్ష్మ శరీరాలను బలంగా ఝాడించి ఒక్కటిగా చేయటమే . ఈ ట్రీట్మెంటు ఆ మానసిక రోగుల మెదళ్ళలో గల నరాలను ఓ పద్దతిలో కాల్చి వేస్తుంది . 

◆  మహా వేదాంతి అయిన సోక్రటీసు తాను ఓ హంతకుడి మనస్తత్వాన్ని శక్తులను కలిగి ఉన్నానని తెలుసుకోగలిగాడు . కానీ విధి ఆడించినట్లు ఆడటానికి ఆయన అంగీకరించలేదు . ప్రకృతికి ఎదురొడ్డి తన స్వభావంపై యుద్ధం ప్రకటించి తన ప్రవర్తనని ఆయన దిద్దుకున్నాడు . మహాజ్ఞాని అయ్యాడు . ఈయన లాగే మనం కూడా మన ఆరాలను ప్రయత్నంతో బాగు చేసుకోవచ్చు . కావలసిన విధంగా మన జీవితాలని మలచుకోవచ్చు . బురద ఎరుపు రంగు ఆరాతో ఉన్న ఓ కామపిపాసి తన ఎరుపు రంగు ప్రకంపనాల పెంచుకుంటే కామాన్ని జయించగలుగుతాడు . నిర్మాణాత్మకంగా తన జీవితాన్ని దిద్దుకోగలుగుతాడు . 

◆  ఓ మనిషి చనిపోగానే ఆరా మాయమైపోతుంది . కానీ అతని ఎథిరిక్ తొడుగు మరి కొంత కాలం వరకు కొనసాగుతుంది . చనిపోయిన వ్యక్తి ఆరోగ్యం మీద ఈ ' కొనసాగడం ' అనే అంశం ఆధారపడి ఉంటుంది . ఈ మనస్సు లేని ఎథిరిక్ శరీరం పిచ్చి పిచ్చిగా తన పూనకాలను ప్రదర్శిస్తూ ఉంటుంది . కొత్తగా చనిపోయిన వారి సమాధుల్లోంచి - రాత్రి పూట ముఖ్యంగా - ఈ పిశాచాలు బయటకు వస్తూండడం చాలా మంది గమనించి వుంటారు . లేత నీలి రంగులో ఈ ఎథిరిక్ శరీరాలు కనిపిస్తాయి . కుళ్ళి పోతున్న శరీరాల నుంచి ఈ ఎథిరిక్ నెమ్మదిగా బయట పడుతూ ఉంటుంది .

◆ తక్కువ వేగపు ప్రకంపనాలు ఆరాలో వికారం కలిగించే మొరటు రంగుల్ని సృ జిస్తాయి . ఇది అసహ్యాన్ని పుట్టిస్తాయే తప్ప ఆహ్లాదాన్ని కలిగించలేదు . ప్రకంపనాల వేగం పెరిగే కొద్దీ ఆరాలోని రంగులు ఎక్కువ తేజస్సును సంతరించుకునీ మెరుస్తూ ఆ ఆరాసు గమనిస్తున్న వాళ్ళకు మంచి ఉత్సాహాన్ని , సంతోషాన్ని కలిగిస్తాయి . నిర్మలమైన రంగులు ఆహ్లాదాన్ని పాలిపోయి కనిపించే రంగులు వికారాన్నీ పుట్టిస్తాయని మనం అనుకోవచ్చు .

◆ మంచి పని చేసిన వ్యక్తి ఆరా చక్కగా మెరుస్తూ సంతోషాన్ని కలిగిస్తూ ఉంటుంది .అలాగే ఓ చెడు పని చేసిన వ్యక్తి ఆరా కళావిహీనమై , ' నీలి రంగునో నలుపు రంగునో ప్రతిబింబిస్తూ దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటుంది . మనం చేసే సత్కార్యాలు మనల్ని ఆహ్లాదకరమైన ' రోజా ' రంగు కళ్ళద్దాల లోంచి ప్రపంచాన్ని చూస్తున్న ఆనందాన్ని కలుగచేస్తాయి . 

◆ ఒక వ్యక్తి ఆరాలోని రంగులు ఆ వ్యక్తి పరిధినీ , వ్యక్తిత్వాన్ని చక్కగా ప్రతిబింబిస్తుందనే విషయాన్ని మనం ఎప్పటికీ మరువకూడదు . ఆరాలో కొన్ని రంగులు అతని మానసిక పరిస్థితి మారితే మారవచ్చు కానీ కొన్ని ప్రాథమిక వర్గాలు మాత్రం ఎప్పటికీ ఒక్కలాగే ఉంటాయి . మూడ్ మారితే రంగు మారవచ్చు , ప్రాథమిక రంగులు మాత్రం మారవు -  ప్రయత్న పూర్వకంగా ఆ వ్యక్తి తన స్వభావాన్ని మార్చుకోగలిగితే తప్ప , వ్యక్తిత్వం మారనంతవరకూ ప్రాథమిక వర్ణాలూ మారవనీ ఇతర రంగులు అతని మూడ్ బట్టి మారుతూ ఉంటాయనీ మీరు నిశ్చయంగా తెలుసుకోండి .

◆ ఓ వ్యక్తికి సంబంధించిన ఆరాలను మీరు చూస్తున్నప్పుడు ఈ క్రింది ప్రశ్నలు వేసుకోండి .

1) కనిపిస్తున్న రంగు ఏమిటి ? 

2) రంగు తేటగా ఉందా ? బురద కలయబెట్టినట్లు ఉందా ? ఎంత స్పష్టంగా ఆ రంగులోంచి నేను చూడగలుగు తున్నాను ? 

3) కొన్ని చోట్లలో ఈ రంగులు సుళ్ళు తిరుగుతున్నాయా ? లేకపోతే ఒకే ప్రదేశంలో నిశ్చలంగా కనిపిస్తోందా ? 

4) ఈ రంగు ఒక స్థిరమైన పట్టీలాగా శరీరాన్ని ఆవరించి ఉందా ? లేకపోతే కొన్ని చోట్ల పైకిలేస్తూ మరికొన్ని చోట్లలో లోయల్లాగా లోపలికి కూరుకుపోతూ కనిపిస్తోందా ? 

5) ఓ వ్యక్తిలో కనిపిస్తున్న రంగుల్ని సరిగ్గా అంచనా వేయకుండా ఆ వ్యక్తి గురించి అపోహ పడడం చాలా సులభం . మనమే ఓ బురద రంగుని ఊహించుకుని అలాంటి బురద రంగును అవతలి వారి ఆరాలలో చూడడం చాలా స్వాభావికం . అలాంటి పొరబాటును మనం చేస్తూ ఉండవచ్చు . కాబట్టి జాగ్రత్త వహించండి . మనసరికాని ఆలోచనలే ఎదుట కనిపిస్తున్న ఆరాని తప్పుగా అంచనా వేయడానికి అనుకోకుండా దోహదం చేస్తాయి . గుర్తుంచుకోండి - ఎదుటి వ్యక్తి ఆరా రంగుల్ని మనం ముందుగా మన ఆరా రంగుల్లోంచే చూస్తూ ఉంటాం ! 

◆ మానసిక , సంగీత తరంగాల పద్ధతిలో ఓ విధమైన క్రమం ఉంది . మానవుని అన్ని భాగాల్లోంచి పుట్టే ప్రకంపనాలు తమలోంచి విద్యుత్ సంకేతాలను విరజిమ్ముతూ వుంటాయి . ఓ వ్యక్తి తన మానసిక ప్రకంపనాల వేగానికి తగ్గట్టు ఓ సంగీత వర్ణాన్ని బయటకు వెలువరిస్తూ ఉంటాడు . ఓ తేనెతుట్టి వద్దకు వెళ్ళి నుంచుంటే తేనె టీగలు చేసే శబ్ద నాదాన్ని మనం ఎలా వినవచ్చో అలాగే మన శరీరాల నుంచి వెలువడే సంగీతాన్ని మరో జీవి బహుశా వింటూనే ఉండవచ్చు . టెలీఫోను వైర్లు తమ చుట్టూ ఓ విధమైన శబ్ద తరంగాలని పుట్టిస్తూ ఉంటాయి . అలాంటి శబ్ద విశేషాలనే మన శరీరం కూడా సృష్టిస్తూ ఉంటుంది నిరంతరం . జనం మెచ్చే సంగీతం ఎలా తయారవుతుందంటే ఆ సంగీతం మానవుని ప్రకంపనాలకు అనుగుణంగా ఉండేలా సృష్టించబడి వుండటం వల్లనే అని గ్రహించండి . శరీర ప్రకంపనాలకు కూడా ఈ సంగీతం అనుగుణ్యంగానే ఉంటుంది . బాగా ప్రాచుర్యం పొందిన కొన్ని రాగాలను అందరూ ఈలతోనో , నోటితోనో అనుకరిస్తూ ఆనందం పొందుతారు . 

◆ తమ మనసుల్లో ఓ సంగీత ధోరణి నిరంతరం రేగుతూ ఉంటుందని కొందరు భావిస్తూ ఉంటారు . కొన్ని గొప్ప ట్యూన్లు తమ శక్తి నశించి పోయేంతవరకూ మనస్సు నుంచి వెలువడే ప్రకంపనాలను అనుసరించి మెలగుతూ మనస్సును ఉత్తేజపరచ గలిగి వుంటాయి . శాస్త్రీయ సంగీతం ఇలాంటి శక్తిని చాలా ఎక్కువగా కలిగి ఉంటుంది . మన శ్రవణేంద్రియాలు శాస్త్రీయ సంగీతానికి అనుగుణంగా తాదాత్మ్యం చెంది " ప్రకంపనలను వెలువరిస్తూ ఉంటాయి . 

◆ తమ ఆలోచనా సరళిని అనుసరించి ఉండే సంగీతాన్ని మానవుడు ఆస్వాదిస్తూం టాడు . ఓ విషయాన్ని గురించి లోతుగా ఆలోచించగల వ్యక్తి మెదడు వెలువరించే తరంగాలు ఎత్తయిన ఎత్తులనీ లోతయిన లోతులనీ కలిగి ఉంటాయి . ఇలాంటి తరంగాల పద్ధతినే కలిగి ఉన్న సంగీతం ఇటువంటి జ్ఞానులకి నచ్చుతాయి . ఆలోచనలలో ఏ మాత్రం పసలేని అధముడికి నచ్చే సంగీత లక్షణాలు కూడా అర్ధం పర్ధం లేకుండా ఉంటుంది. వింత వింత చప్పుళ్ళూ , గోల తప్ప మరేదీ ఇటువంటి వారికి ఆనందాన్ని కలిగించలేవు.

◆ గొప్ప వాగ్గేయకారులు , సంగీత కళానిధులూ తమకు తెలిసో - తెలియకుండానే తమసూక్ష్మ శరీరాలతో విహారాలను ( astral travelling ) చెయ్యగలిగి ఉంటారు . మృత్యువుకు అతీతమైన చోట్లను వీరు దర్శించి తిరిగి రాగలిగిన శక్తిని పొంది ఉంటారు . అటువంటి వారికి విశ్వసంగీతం ' వినిపిస్తూంటుంది . తమ కళలో నిష్ణాతులు కాబట్టి ఈ సంగీతం వాళ్ళకి బాగా నచ్చుతుంది .

వాళ్ళ మనస్సుల మీద గాఢమైన ముద్రను ఈ సంగీతం వేసి తీరుతుంది . భూమికి తిరిగి వచ్చిన వెంటనే ఈ సంగీత శాస్త్రజ్ఞులు కొత్త రాగాల్ని సృష్టించే మూడ్ లోకి వస్తూ ఉంటారు . ఓ సంగీత వాయిద్యాన్ని వెంటనే అందుకోవడమో ఓ కాగితం మీదకి ఆ సంగీతాన్ని రికార్డు చేసే ప్రయత్నమో చేసేందుకు ఉద్యుక్తులవుతారు . సూక్ష్మ శరీరాలల్తో తాము విన్న విశ్వ సంగీతం సంగతిని అంతగా గుర్తుంచుకోలేని కొందరు - తామే ఆ సంగీతాన్ని సృష్టించామని అనుకుంటూ ఉంటారు . 

◆ టెలివిజన్ స్క్రీన్ మీద ఓ మహోన్నతమైన ప్రకటనను మన చైతన్యంతో  గమనించలేనంత వేగంతో చూపించే ఓ పాపిష్టి పద్దతి మన అచేతనత్వ మానసంపై పని చేస్తుంది . అత్యంత వేగంతో వస్తున్న ఈ చిత్రమాలికలు మన చేతనత్వపు మనస్సు మీద ఏ ప్రభావాన్ని చూపించలేకపోయినా మన అచేతన మానసాన్ని ఒక్క ఉదుటున లాగి వీటిని గురించి ఆలోచించేలా చేస్తాయి . చివరకు మన అచేతన మనస్సు మన చేతనత్వపు మనస్సు కన్నా 9 రెట్లు బలమైనది అన్న విషయం మరచిపోకండి - మన చేతనత్త్వపు మనస్సులోకి ఓ ఆజ్ఞను పంపుతుంది . అప్పుడు మనం లేచి వెళ్ళి ఓ స్టోర్లో ఓ వస్తువులు -మనం ఏనాడూ కోరుకోని వస్తువు అయినా సరే - కొనుక్కుని ఇంటికి తెచ్చుకుంటాం.🙏🙏🙏🙏

No comments:

Post a Comment