Translate

Saturday, November 19, 2022

శ్రీ కామఖ్య కాళి దేవి స్తుతి (Kamakhya Kaali Stuti In Telugu)

 

శ్రీకామఖ్య కాళి స్తుతి

                                                                


నమస్తే నీలశైలస్థే ! యోని పీఠనివాసిని ! భద్రకాళి !
మహాకాళి ! కామాఖ్యే! కామసుందరి !
ఇహావతరకళ్యాణి ! కామరూపిణి ! కామిని !
కామేశ్వరి ! మహామాయే! ప్రాగ్జ్యోతిషపురేశ్వరి !
భగలింగే ! భగాకారే ! భగమాలే ! భగేశ్వరి ! భగదాయిని ! భవ్యాంగి ! భద్రకాళి !
నమో స్తుతే. ఆనందభైరవస్వామి ప్రాణేశ్వరి !
రతిప్రియే ! రసికే ! రసికారాధ్యే ! వీరే! వీరపథాశ్రితే ! కామే ! కామకళారూపే! కదంబవనవాసిని !
కామాక్షి! కామసౌందర్యే! కరుణావరుణాలయే నీలోత్పలదళశ్యామే !
నీలాచలనివాసిని ! ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తి ప్రదాయిని ! మహేశ్వరి!
యోనికుండ మహాజ్వాలే ! యోనియంత్ర విలాసిని ! హోమప్రియే !
మహాదేవి ! తారామంత్ర ప్రకాశిని ! దర్శనం దేహికామేశి !
స్పర్శనం దేహి కామిని ! అభీష్టం దేహి కామాఖ్యే ! తారాకాళి ! నమో నమః


No comments:

Post a Comment