మహాదేవ శంభో గిరీశ త్రిశూలం - సత్వయీదం సమస్తం విభాతీత యస్మాత్
శివదాన్యథా దైవతం నాభిజానే -శివోహం, శివోహం, శివోహం, శివోహం ॥
యతోజయతేదం ప్రపఞ్చమ విచిత్రం- స్థితిం యాతి యస్మిన్యదేకాన్తా మన్తే
సకర్మాదిహీనః స్వయం జ్యోతిరాత్మా -శివోహం, శివోహం, శివోహం, శివోహం
భావం:
- ఓ మహాదేవా! శంభూ! త్రిశూలాన్ని ధరించిన ఓ గిరీశా (కైలాసవాసా)! సమస్త విశ్వం నీ వల్లనే ప్రకాశిస్తోంది, నీలోనే ఇమిడి ఉంది.శివుని కన్నా గొప్ప దైవమును నేను వేరే ఎరుగను. నేనే ఆ పరమ శివుడను (శివోహమ్ - నాలో ఉన్నది ఆ పరమాత్మ తత్వమే).
- ఏ పరమ శక్తి నుండి ఈ విచిత్రమైన విశ్వం ఉద్భవించిందో, ఎవరిలో స్థితిని పొందుతుందో మరియు అంతమందు ఎవరిలో లీనమవుతుందో, ఏ కర్మలకూ అతీతమైనదో, స్వయంచో ప్రకాశించే ఆత్మ స్వరూపం నేనే - ఆ శివుడను నేనే.
No comments:
Post a Comment