My Spiritual Research Sounds-Vibrations-Reactions-Connectivity- నేను చదివిన,తెలుసుకొన్న కొన్ని విషయల గమనికలు.. కేవలం నా పునఃపరిశీలన కోసం వ్రాసుకున్నది- దయచేసి తప్పులు ఎమైన వున్నా, అభ్యంతరాలు ఎమైన వున్న తెలుపగలరు - సురేష్ కలిమహంతి
Translate
Monday, February 19, 2018
భో శంభో శివ శంభో స్వయంభో (BhO ShambhO ..Shiva ShamBo..SwayamBO Telugu Lyrics)
Friday, January 5, 2018
Anjaneya Dandakam in telugu
ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం
భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజేహం పవిత్రం
భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం
భజే బ్రహ్మతేజం బటంచున్ ప్రభాతంబు
సాయంత్రమున్ నీనామసంకీర్తనల్ జేసి
నీ రూపు వర్ణించి నీమీద నే దండకం బొక్కటిన్ జేయ
నీ మూర్తిగావించి నీసుందరం బెంచి నీ దాసదాసుండవై
రామభక్తుండనై నిన్ను నేగొల్చెదన్
నీ కటాక్షంబునన్ జూచితే వేడుకల్ చేసితే
నా మొరాలించితే నన్ను రక్షించితే
అంజనాదేవి గర్భాన్వయా దేవ
నిన్నెంచ నేనెంతవాడన్
దయాశాలివై జూచియున్ దాతవై బ్రోచియున్
దగ్గరన్ నిల్చియున్ దొల్లి సుగ్రీవుకున్-మంత్రివై
స్వామి కార్యార్థమై యేగి
శ్రీరామ సౌమిత్రులం జూచి వారిన్విచారించి
సర్వేశు బూజించి యబ్భానుజుం బంటు గావించి
వాలినిన్ జంపించి కాకుత్థ్స తిలకున్ కృపాదృష్టి వీక్షించి
కిష్కింధకేతెంచి శ్రీరామ కార్యార్థమై లంక కేతెంచియున్
లంకిణిన్ జంపియున్ లంకనున్ గాల్చియున్
యభ్భూమిజం జూచి యానందముప్పొంగి యాయుంగరంబిచ్చి
యారత్నమున్ దెచ్చి శ్రీరామునకున్నిచ్చి సంతోషమున్‌జేసి
సుగ్రీవునిన్ యంగదున్ జాంబవంతు న్నలున్నీలులన్ గూడి
యాసేతువున్ దాటి వానరుల్‍మూకలై పెన్మూకలై
యాదైత్యులన్ ద్రుంచగా రావణుండంత కాలాగ్ని రుద్రుండుగా వచ్చి
బ్రహ్మాండమైనట్టి యా శక్తినిన్‍వైచి యాలక్షణున్ మూర్ఛనొందింపగానప్పుడే నీవు
సంజీవినిన్‍దెచ్చి సౌమిత్రికిన్నిచ్చి ప్రాణంబు రక్షింపగా
కుంభకర్ణాదుల న్వీరులం బోర శ్రీరామ బాణాగ్ని
వారందరిన్ రావణున్ జంపగా నంత లోకంబు లానందమై యుండ
నవ్వేళను న్విభీషుణున్ వేడుకన్ దోడుకన్ వచ్చి పట్టాభిషేకంబు చేయించి,
సీతామహాదేవినిన్ దెచ్చి శ్రీరాముకున్నిచ్చి,
యంతన్నయోధ్యాపురిన్‍జొచ్చి పట్టాభిషేకంబు సంరంభమైయున్న
నీకన్న నాకెవ్వరున్ గూర్మి లేరంచు మన్నించి శ్రీరామభక్త ప్రశస్తంబుగా
నిన్ను సేవించి నీ కీర్తనల్ చేసినన్ పాపముల్‍ల్బాయునే భయములున్
దీరునే భాగ్యముల్ గల్గునే సామ్రాజ్యముల్ గల్గు సంపత్తులున్ కల్గునో
వానరాకార యోభక్త మందార యోపుణ్య సంచార యోధీర యోవీర
నీవే సమస్తంబుగా నొప్పి యాతారక బ్రహ్మ మంత్రంబు పఠియించుచున్ స్థిరమ్ముగన్
వజ్రదేహంబునున్ దాల్చి శ్రీరామ శ్రీరామయంచున్ మనఃపూతమైన ఎప్పుడున్ తప్పకన్
తలతునా జిహ్వయందుండి నీ దీర్ఘదేహమ్ము త్రైలోక్య సంచారివై రామ
నామాంకితధ్యానివై బ్రహ్మతేజంబునన్ రౌద్రనీజ్వాల
కల్లోల హావీర హనుమంత ఓంకార శబ్దంబులన్ భూత ప్రేతంబులన్ బెన్
పిశాచంబులన్ శాకినీ ఢాకినీత్యాదులన్ గాలిదయ్యంబులన్
నీదు వాలంబునన్ జుట్టి నేలంబడం గొట్టి నీముష్టి ఘాతంబులన్
బాహుదండంబులన్ రోమఖండంబులన్ ద్రుంచి కాలాగ్ని
రుద్రుండవై నీవు బ్రహ్మప్రభాభాసితంబైన నీదివ్య తేజంబునున్ జూచి
రారోరి నాముద్దు నరసింహ యన్‍చున్ దయాదృష్టి
వీక్షించి నన్నేలు నాస్వామియో యాంజనేయా
నమస్తే సదా బ్రహ్మచారీ
నమస్తే నమోవాయుపుత్రా నమస్తే నమః
Saturday, December 30, 2017
శివ శివ శంకర హర హర శంకర (Damarukam) Telugu Lyric
భం భం భో ... భం భం భో ...
భం భం భో ... భం భం భో ...
భం భం భో ... భం భం భో ...
సర్ప ప్రావిత దర్ప ప్రాభవ విప్ర ప్రేరిత పరా
దిక్పూర ప్రద కర్పూర ప్రభ
అర్పింతు శంకరా!!
సర్ప ప్రావిత దర్ప ప్రాభవ విప్ర ప్రేరిత పరా
దిక్పూర ప్రద కర్పూర ప్రభ
అర్పింతు శంకరా!!
శివ శివ శంకర హర హర శంకర
జయ జయ శంకర దిగిరారా!
ప్రియ తాండవ శంకర
ప్రకట శుభంకర
ప్రళయ భయంకర దిగిరారా!!
శివ శివ శంకర హర హర శంకర
జయ జయ శంకర దిగిరారా!
ప్రియ తాండవ శంకర
ప్రకట శుభంకర
ప్రళయ భయంకర దిగిరారా!!
ఓం పరమేశ్వరా! పరా!!
ఓం నిఖిలేశ్వరా! హరా!!
ఓం జీవేశ్వరేశ్వరా! కనరారా!!
ఓం మంత్రేశ్వరా! స్వరా!!
ఓం యుక్తేశ్వరా! స్థిరా!!
ఓం నందేశ్వరామరా! రావేరా!!
శివ శివ శంకర హర హర శంకర
జయ జయ శంకర దిగిరారా!
ప్రియ తాండవ శంకర
ప్రకట శుభంకర
ప్రళయ భయంకర దిగిరారా!!
సర్ప ప్రావిత దర్ప ప్రాభవ విప్ర ప్రేరిత పరా
దిక్పూర ప్రద కర్పూర ప్రభ
అర్పింతు శంకరా!!
సర్ప ప్రావిత దర్ప ప్రాభవ విప్ర ప్రేరిత పరా
దిక్పూర ప్రద కర్పూర ప్రభ
అర్పింతు శంకరా!!
ఆకశాలింగమై ఆవహించరా,
డమ డమమని డమరుఖ ధ్వని సలిపి జడతని వదిలించరా!
శ్రీ వాయులింగమై సంచరించరా
అణువణువున తన తనువున నిలచి చలనమే కలిగించరా!!
భస్మం చేసేయ్! అసురులను అగ్నిలింగమై లయకారా
వరదై ముంచేయ్ జలలింగమై ఘోరా!!
వరమై వశమై ప్రబలమౌ భూలింగమై బలమిడరా
జగమే నడిపే పంచభూత లింగేశ్వరా కరుణించరా!!!! శివ!!
శివ శివ శంకర హర హర శంకర
జయ జయ శంకర దిగిరారా!
ప్రియ తాండవ శంకర
ప్రకట శుభంకర
ప్రళయ భయంకర దిగిరారా!!
సర్ప ప్రావిత దర్ప ప్రాభవ విప్ర ప్రేరిత పరా
దిక్పూర ప్రద కర్పూర ప్రభ
అర్పింతు శంకరా!!
విశ్వేశ లింగమై కనికరించరా
విదిలిఖితమునిక బర బర చెరిపి అమృతం కురిపించరా
రామేశ లింగమై మహిమ చూపరా,
పలు శుభములు గని అభయములిడి హితము సతతము అందించరా!!
గ్రహణం నిధనం బాపరా
కాళహస్తి లింగేశ్వరా!
ప్రాణం నీవై ఆలింగనమీరా
ఎదలో కొలువై హర హర ఆత్మా లింగమై నిలబడరా! *
ద్యుతివై గతివై
సర్వ జీవలోకేశ్వరా రక్షించరా!!
శివ శివ శంకర హర హర శంకర
జయ జయ శంకర దిగిరారా!
ప్రియ తాండవ శంకర
ప్రకట శుభంకర
ప్రళయ భయంకర దిగిరారా!!
శివ శివ శంకర హర హర శంకర
జయ జయ శంకర దిగిరారా!
ప్రియ తాండవ శంకర
ప్రకట శుభంకర
ప్రళయ భయంకర దిగిరారా!!
సర్ప ప్రావిత దర్ప ప్రాభవ విప్ర ప్రేరిత పరా
దిక్పూర ప్రద కర్పూర ప్రభ
అర్పింతు శంకరా!!
సర్ప ప్రావిత దర్ప ప్రాభవ విప్ర ప్రేరిత పరా
దిక్పూర ప్రద కర్పూర ప్రభ
అర్పింతు శంకరా!!
Saturday, June 17, 2017
Maha Kala Bhiravashtakam (యమ్ యమ్ యమ్ యక్ష రూపం- మాహా కాలభైరవాష్టకం) Telugu
మాహా కాలభైరవాష్టకం
యమ్ యమ్ యమ్ యక్ష రూపం దశ దిశి విదితం భూమి కంపాయమానం సం సం సం సంహార మూర్తిం శిర ముకుట జటా శేఖరం చంద్ర బింబం డం డం డం దీర్ఘ కాయం వికృత నఖ ముఖం జోర్ధ్వరోమం కరాలం . పం పం పం పాప నాశం ప్రనమత సతతం భైరవం క్షెత్రపాలమ్ రమ్ రమ్ రమ్ రక్త వర్ణం, కటికటి తతనం తీక్ష్ణ ధన్ స్ట్రా కరాలం! ఘం ఘం ఘం ఘోష ఘోషం ఘ ఘ ఘ ఘ ఘటితం ఘర్జరం ఘోర నాదం ! కమ్ కమ్ కమ్ కాల పాశం దృక దృక ద్రుకితం జ్వాలితం కామదాహం ! తం తం తం దివ్య దేహం, ప్రనమత సతతం భైరవం క్షెత్రపాలమ్. లం లం లం లం వదంతం ల ల ల ల లలితం దీర్ఘ జిహ్వాః కరాలం ! ధుం ధుం ధుం ధూమ్ర వర్ణం స్పుట వికట ముఖం భాస్కరం భీమరూపం, రుం రుం రుం రున్డమాలం, రవితమ నియతం తామ్ర నేత్రం కరాలమ్ ! నం నం నం నగ్నభూషం, ప్రనమత సతతం భైరవం క్షెత్రపాలమ్ !!! వమ్ వమ్ వమ్ వాయువేగం నటజన సదయం బ్రహ్మ సారం పరంతం ఖం ఖం ఖం ఖడ్గ హస్తం త్రిభువన విలయం భాస్కరం భీమ రూపం ఛమ్ ఛమ్ ఛమ్ చలిత్వా చల చల చలితా చాలితం భూమి చక్రం మం మం మం మాయి రూపం ప్రనమత సతతం భైరవం క్షేత్ర పాలం! శం శం శం శంఖ హస్తం , శసికర ధవళం , మోక్ష సంపూర్ణ తేజం ! మం మం మం మం మహంతం, కుల మకుల కులం మంత్ర గుప్తం సునిత్యం ! యమ్ యమ్ యమ్ భూతనాధం, కిలి కిలి కిలితం బాలకేలి ప్రధానం, అమ్ అమ్ అమ్ అంతరిక్షం, ప్రనమత సతతం భైరవం క్షేత్ర పాలం!!! ఖం ఖం ఖం ఖడ్గ భేదం, విష మమృత మయం కాల కాలం కరాలం! క్షం క్షం క్షం క్షిప్ర వేగం, దహ దహ దహనం, తప్త సందీప్య మానం, హౌం హౌం హౌంకార నాదం, ప్రకటిత గహనం గర్జితై భూమి కంపం, వమ్ వమ్ వమ్ వాల లీలం , ప్రనమత సతతం భైరవం క్షేత్ర పాలం!!! సం సం సం సిద్ధి యోగం, సకల గుణ మఖం, దేవ దేవం ప్రసన్నం, పం పం పం పద్మనాభం, హరిహర మయనం, చంద్ర సుర్యాగ్ని నేత్రం, ఐమ్ ఐమ్ ఐమ్ ఐశ్వర్య నాదం, శత త భయ హారం, పూర్వదేవ స్వరూపం, రౌమ్ రౌమ్ రౌమ్ రౌద్ర రూపం, ప్రనమత సతతం భైరవం క్షేత్ర పాలం!!! హమ్ హమ్ హమ్ హంసయానం, హపితకల హకం, ముక్త యోగాట్ట హాసం, ధం ధం ధం నేత్ర రూపం, శిర మకుట జటా భన్ధ భంధాగ్ర హస్తం! టమ్ టమ్ టమ్ టంకార నాదం, త్రిద సలట లటం, కామ గర్వాప హారం, భ్రుం భ్రుం భ్రుం భూతనాధం, ప్రనమత సతతం భైరవం క్షేత్ర పాలం!!!
or reload the browser
Friday, June 16, 2017
Shatangayur Sukta-(షటంగయుర్ సూక్త ) in telugu with Meaning
షటంగయుర్
సూక్త
ఋషి: మార్కండేయ
దేవత: మహా
భైరవ్/మహాకాల
శక్తి: మహామాయ, మహాలక్ష్మి, మహాకాళి
మూలం: ఇది
సవరించిన మహా-మృత్యుంజయ స్తోత్రం యొక్క చివరి భాగం.
ఓం హ్రీం
శ్రీం హ్రీం హ్రూం హ్రైం హ్రః,
హన-హన
దహ-దహ పచ-పచ గృహాన గృహాన,
మారయ-మారాయ
మర్దయ-మర్దయ మహా-మహా భైరవ-భైరవ రూపేణ,
ధూనయ ధూనయ
కంపయ కంపయ విఘ్నయ-విఘ్నయ విశ్వేశర
క్షోభయ - క్షోభయ
కట కట మోహయ హూం ఫట్ స్వాహా ।
శక్తివంతమైన మహామృత్యుంజయ
మంత్రం యొక్క రూపాంతరం, దీనిని ప్రధానంగా శత్రువులను, ప్రతికూల శక్తులను, అడ్డంకులను నాశనం చేయడానికి,
రక్షణ కోసం జపిస్తారు, ఇందులో శివ-భైరవ, ఆదిశక్తి, లక్ష్మి బీజాక్షరాలు కలిసి ఉంటాయి, ముఖ్యంగా 'హ్రీం' (ఆదిశక్తి) మరియు 'శ్రీం' (లక్ష్మి) శక్తితో పాటు, భైరవ స్వరూపంలోని విశ్వేశ్వరను
ఉద్దేశించి, శత్రువులను కాల్చివేయమని, బంధించమని
కోరడం ఈ మంత్రం సారాంశం, ఇది శారీరక, మానసిక శత్రువుల నుండి విముక్తిని కోరుతుంది
మంత్రం యొక్క భావం :
- ఓం హ్రీం శ్రీం హ్రీం హ్రూం హ్రైం హ్రః: ఇవి బీజ మంత్రాలు, ఇవి శక్తిని
సూచిస్తాయి.
- హన-హన (Hana-Hana): నాశనం చేయి, చంపు.
- దహ-దహ (Daha-Daha): కాల్చివేయి, భస్మం చేయి.
- పచ-పచ (Pacha-Pacha): బాగా ఉడకబెట్టు, సంపూర్ణంగా నాశనం చేయి.
- గృహాన గృహాన (గ్రహించు-గ్రహించు): శత్రువులను బంధించమని/గ్రహించమని అర్థం.
- మారయ-మారాయ (చంపు-చంపు), మర్దయ-మర్దయ (నలిపివేయు-నలిపివేయు): శత్రువులను చంపి, నలిపివేయమని అర్థం.
- మహా-మహా భైరవ-భైరవ రూపేణ: ఓ మహా భైరవా, భయంకరమైన రూపంతో
ప్రత్యక్షం కా.
- ధూనయ ధూనయ (కంపించు-కంపించు), కంపయ కంపయ (వణికించు-వణికించు): శత్రువులను వణికించి, కంపింపజేయమని
అర్థం.
- విఘ్నయ-విఘ్నయ (అడ్డంకులను సృష్టించు-సృష్టించు): శత్రువులకు అడ్డంకులు కల్పించు.
- విశ్వేశ్వర: విశ్వానికి
ప్రభువా (భైరవా).
- క్షోభయ-క్షోభయ (Kshobhaya
Kshobhaya): కలవరపెట్టు, కదిలించు, అల్లరి చేయించు.
- కట కట (ఘోరంగా) : తీవ్రంగా, కఠినంగా (కొన్నిచోట్ల 'కటు కటు' అని కూడా ఉంటుంది).
- మోహయ (మోహింపజేయు): మోహింపజేయి, గందరగోళ పరచు, భ్రమతో మోహింపజేయమని అర్థం.
- హూం ఫట్ స్వాహా: మంత్రం
ముగింపు,
శక్తులను స్థాపించడం.
ప్రయోజనాలు:
ఈ మంత్రం అజ్ఞానం, దుఃఖం, దురాశ, అంతర్గత శత్రువులను (కోపం, అహంకారం వంటివి) నాశనం చేసి, స్వీయ-జ్ఞానాన్ని మరియు
మోక్షాన్ని పొందడానికి సహాయపడుతుంది
Thursday, May 18, 2017
దక్షిణామూర్తి స్తోత్రం (Dakshinamurthy Stotram Telugu )- My Notes
పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యధానిద్రయా
యస్సాక్షాత్కురుతే ప్రభోధసమయే స్వాత్మానమే వాద్వయం
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే 1
మాయాకల్పిత దేశకాలకలనా వైచిత్రచిత్రీకృతం
మాయావీవ విజృంభ త్యపి మయా యోగేవయః స్వేచ్ఛయా
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే 2
సాక్షాత్తత్వమసీతి వేదవచసాయో బోధయత్యాశ్రితాన్
యస్సాక్షాత్కరణాద్భవేన్నపురనావృత్తిర్భవాంభోనిధౌ
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే 3
జ్ఞానం యస్యతు చక్షురాదికరణ ద్వారా బహిస్పందతే
జానామీతి తమేవ భాంతమనుభాత్యేతత్సమస్తంజగత్
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే 4
స్త్రీ బాలాంధ జడోపమాస్త్వహ మితి భ్రాంతాభృశం వాదినః
మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహ సంహారిణే
తస్మైశ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే 5
సన్మాత్రః కరణోప సంహరణతో యో భూత్సుషుప్తః పుమాన్
ప్రాగస్వాప్సమితి ప్రభోద సమయే యః ప్రత్యభిజ్ఞాయతే
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే 6
వ్యావృత్తా స్వను వర్తమాన మహమి త్యంతస్స్ఫురంతం సదా
స్వాత్మానం ప్రకటికరోతిభజతాం యోముద్రయా భద్రయా
తస్మైశ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే 7
శిష్యచార్యతయా తథైవ పిత్ర పుత్రాద్యాత్మనా భేదతాః
స్వస్నే జాగ్రతి వాయు ఏష పురుషో మయా పరిభ్రామితః
తస్మైశ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే 8
నిత్యాభతి చరాచరాత్మక మిదం యస్మైచ మూర్త్యష్టకం
నాన్యత్కించ నవిద్యతే విమృశతాంయస్మాతత్పర స్వాదిభో
తస్మై గిరిమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే 9
తేనాస్వశ్రవణాత్త దర్థ మననా ద్ధ్యానా చ్ఛ సంకీర్తనాత్
సర్వాత్మత్వ మహావిభూతి సహితం స్వాదీశ్వత్వం స్వతః
సిద్ధేత్తత్పురష్టధా పరిణతం చైశ్వర్య మవ్యాహతమ్ 10